స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
1వ అధ్యాయము
తెల్లని వస్త్రము ధరించినవాడు, తెలుపు వర్ణమువాడు, నాలుగు చేతులవాడు, నిర్మలమైన ముఖము కలవాడు ఐన విష్ణువును సర్వ విఘ్నముల ప్రశాంతి కొరకు ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను).
నైమిశారణ్యంలో నివసించేవారు, శనతాది ఋషులు. వారు అష్టాంగయోగముందు ఆసక్తి కలవారు, బ్రహ్మజ్ఞాన మందే. మనస్సు కలవారు, (1) మోక్షమును కోరుచున్నవారు, గొప్ప ఆత్మకలవారు, మమకారంలేని వారు, బ్రహ్మను గూర్చి చర్చించువారు, ధర్మ మెరిగిన వారు, అసూయలేనివారు, సత్యం చెప్పటం అనే వ్రవిష్టులు (2) ఇంద్రియముల జయించినవారు, క్రోధమును జయించినవారు, అన్ని ప్రాణులందు దయజూచు వారు, వీరు మిక్కిలి భక్తితో, సనాతనుడైన విష్ణువును పూజను పుణ్యాత్మకమైన, ముక్తిని ప్రసాదించే నైమిశారణ్య నుందు తపమాచరించారు. ఒకసారి ఆ శౌనకాది మహాత్ములు ఉత్తమమైన సమూహంగా ఏర్పడ్డారు. (అందరు కలిశారు) (4) పాపములను నశింపచేసే మహాపుణ్యప్రదమైన కథలను చెప్పుకుంటూ, పరస్పరము. భుక్తికి ముక్తికి చెందిన మార్గములను తెలుసుకుంటూ సమావేశమయ్యారు. (5) పరమాత్మను భావించుటచే పవిత్రులైన ఇరువది ఆరువేల ఋషులు వారి శిష్యప్రశిష్యులు, వీరిని లెక్కించుట సాధ్యముగాకున్నది. (6).
ఇంతలో గొప్ప విద్వాంసుడు, వ్యాసునిశిష్యుడు, గొప్ప ముని, పౌరాణికులలో శ్రే ష్ఠుడు ఐన సూతుడు నైమిశారణ్యం వచ్చాడు (7) అగ్నిలాగా వెలిగిపోతూ వచ్చిన ఆ మునిని చూచి, శౌనకాది ఋషులు అర్ఘ్యము (చేతులు కడుగుకోవటానికి నీళ్ళివ్వటం) మొదలగువానితో పూజించారు (8) పరమశుభమైన ఆననంలో సుఖంగా కూర్చున్న ఆ సూతుణ్ణి లోకములను అనుగ్రహించాలనే బుద్ధితో మిక్కిలి రహస్యమైన విషయాన్ని అడిగారు. (9) ధర్మతత్వ మెరిగిన మహార్షి శ్రేష్ఠుడ ! ఓ సూత ! నీకు స్వాగతము. సత్యవతీసుతుడైన వ్యాసుని నుండి నీవు పురాణాలు విన్నావు (10) అందువల్ల ఓ మహాముని ! అన్ని పురాణముల అర్థమెరిగిన వాడవు నీవు. ఏ క్షేత్రము, ఏ తీర్థములు ఈ భూమిమీద పుణ్యప్రదమైనవి. జీవులకు నంసార సాగరమునుండి ముక్తి ఎట్లా లభిస్తుంది. విష్ణువు యందుకాని శివునియందుకాని మనుష్యులకు భక్తి ఎట్లా వుంది. మూడు విధములైన కర్మల (మనోవాక్ కాయముల) ఫలం దేనివల్ల సిద్ధిస్తుంది. ఇది, ఇతర విషయాలు అదంతా దయతో చెప్పండి, ఓ నూతజుడ! (13) ప్రీతి పాత్రుడైన శిష్యునకు రహస్యమైన విషయాన్నైనా గురువులు చెప్పదురు. అని ఈ రకంగా నైమిశారణ్యముందున్న సూతుణ్ణి అడిగారు. (14) అప్పుడు (వారితో అడగబడి) నూతుడు తన గురువైన వ్యాసునకు నమస్కరించి ఆదినుండి ఇట్లా చెప్పనారంభించాడు.
తా॥లోక కల్యాణం కొరకు మీరు దీన్ని బాగా అడిగారు బ్రాహ్మణులారా (15) ఈ రహస్యాన్ని మీరు చెబుతున్నాను. ఆదరంతో వినండి. ఓ మునిశ్రేష్ఠులారా! ఈ విషయాన్ని ఇంతకు ముందు ఎవ్వరికీ చెప్పలేదు (16) భక్తితో, మనస్సును, నిగ్రహించుకొని వినండి. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా ! రామ సేతువు యందు పవిత్రమైనది, రామేశ్వరం అనే పేరు గలది ఉంది. (17) అది నర్వక్షేత్రములకన్న నర్వ తీర్థములకన్న ఉత్తమమైనట్టిది. రామ సేతువును చూచినంత మాత్రమున సంసారసాగరము నుండి ముక్తి లభిస్తుంది. (18) హరి హరుల యందు (మనకు) భక్తి పుడుంది. పుణ్యము సమృద్ధిగా పెరుగుతుంది. త్రివిధ కర్మలకు సిద్ధి లభిస్తుంది. ఈ విషయంలో అనుమానం లేదు (19) జన్మ మధ్యలో ఏవ్యక్తి భక్తితో సేతువును చూస్తాడో అతనికి లభించే పుణ్యఫలాన్ని గూర్చి చెబుతున్నాను. ఓ మునిశ్రేష్ఠు లారా ! వినండి (20).
తా॥ తల్లికి చెందిన అట్లాగే తండ్రికి చెందిన రెండు కోట్లకులము వారితో కూడినవాడై శివునితో కలకాలము సుఖముగా ఉండి ఆపిదప మోక్షమును పొందుతాడు (21) భూమి యందలి రేణువుల లెక్కించవచ్చు, ఆకాశంలో తారకల లెక్కించవచ్చు, కానీ సేతు దర్శనం వల్ల కలిగే పుణ్యాన్ని శేషుడు డూడా లెక్కింపలేడు (22) సేతుబంధము సమస్త దేవతల రూపము అని చెప్పబడింది. కనుక దాని దర్శనం పొందిన పురుషుని పుణ్యాన్ని లెక్కింప ఎవడు పరమర్ధుడు (23) సేతువును చూచిన బ్రాహ్మణుడు, నర్వయరాగములను నిర్వర్తించిన వాడుగా చెప్పబడ్డాడు అన్ని తీర్థ ములలో స్నానము చేసినవాడు, నమస్తే తవములను ఆచరించినవాడౌతాడు. (24) బ్రాహ్మణులు ఏమనిషితోనైనా పేతువునకు వెళ్ళు అని అన్నయైనచో ఆతడు కూడా ఆ ఫలితాన్ని పొందుతాడు. ఎక్కువగా మాట్లాడి ఏం ప్రయోజనం (25) సేతుస్నానం చేసే మనిషి, ఏడుకోట్ల కులము వారితో కూడినవాడై విష భవనాన్ని పొంది అక్కడే ముక్తి నందుతాడు (26) సేతువును, రామేశ్వరంలోని లింగాన్ని, గంధమాదన పర్వతాన్ని చింతించే మనిషి అన్ని పాపములనుండి ముక్తుడౌతాడు ఇది నత్యము (27) తల్లికి మరియు తండ్రికి చెందిన లక్షకోటి కులము వారితో కూడినవాడై విష భవనాన్ని పొంది తల్లికి మరియు తండ్రికి చెందిన లక్షకోటి కులము వారితో కూడినవాడై విష భవనాన్ని పొంది అక్కడే ముక్తి నందుతాడు. మూడు కల్పముల కాలము శంభు పదమందుండి అక్కడే ముక్తి నందుతాడు. (28) మూష అవస్థను (ఎలుకస్థితి), వనే కువమును, వైతరిణినదిని, కుక్కను తినుటను, మూత్రపానమును సేతుస్నానము చేసినవాడు చూడడు (29) కాల్చిన శూలమును, కాల్చిన శిలను, పురీషవు ప్రాదమును (లోతుగల గుంట), రక్తపు బావిని సేతువు యందు స్నానము చేసినవాడు చూడడు. (అనగా ఈ బాధలు నరకంలో రావు). శాల్మలి (వృక్షం)ని ఎక్కటం, రక్తపు భోజనము పురుగులను భుజించుట, తనమాంసం తానే తినుట, అగ్ని జ్వాలలో ప్రవేశించుట (31) రాళ్ళవాన, అగ్నీవాన, నరకము, యమపాశము, కౌరవునీరు, వేడినీరు వీటిని సేతువును చూసినవాడు పొందడు. (32) పంచ పాతకములు కలిగినవాడైనా, సేతువు యందు స్నానము చేసిన వివ్రుడు, తల్లికి చెందిన, తండ్రికి చెందిన నూరుకోట్ల కులము వారితో కూడినవాడై (33) మూడు కల్పములు విష్ణు స్థానమందుండి అక్కడే ముక్తి నందుతాడు. తలక్రిందులు వేలాడుట, శోషిల్లుట, నరకము, కారమును సేవించుట (34) రాతియంత్రమువడ సుడిగాలిలోపడి పోవటం, పురీషమును పూనుకోవటము, రంపముతో చీల్చబడటము (35) మలబోజనము, రేతస్సును తాగటము, సంధులలో మంటలు, నిప్పుల పడక యందు తిప్పబడటం, రోకళ్ళతో కొట్టబడటం (36) ఇవన్నీ నరకాలు (అందలి కష్టాలు). సేతువు యందు స్నానం చేసేవాడు వీటన్నిటిని చూడడు (పొందడు). సేతు స్నానమును చేస్తాను, నేను, అని బుద్ధితో ఆలోచిస్తూ.
(సేతు స్నానమును గూర్చి ఆలోచిస్తూ) నూరు అడుగులు వేసినవాడు గొప్ప పాతకుడైన (పాపముక్తుడౌతాడు). అనేకమైనకట్టె యంత్రములను లాగటము; శస్త్రములతో భేదింపబడుట (38) పడటము, పైకెగరటం, గదాదండముతో ఏడ, ఏనుగుదంతములతో చంపబడుట, పాములచే కరిపించబడుట, (39) పొగత్రాగుట, తాళ్ళచే కట్టబడుట, రకరకాల శూలములతో ఏడింవబడుట, ముఖముందు ముక్కు యందు కరవునీళ్ళు చల్లబడుట (40) కారునీళ్ళు తాగుట, నరకము, కాల్చిన ఉక్కుసూదిని తినుట, ఇవన్ని నరకములు ఈ పావములన్నీ పోతాయి. ఈ నరకములకు చేరడు (సేతుస్నానం చేసినవాడు) (41) తారవునీళ్ళతో నిండిన రంధ్రములలో ప్రవేశించటం, మలబోజనము, స్నాయు (నరము) సులభేదము, స్నాయువుల దాహము, బొక్కల భేదనము (42) శ్లేష్మ భక్షణము, ఏత్తమును తాగుట, చేదును భుజించటం, బాగా వేడిగల నూనెను తాగటం, రవునీరును తాగటం, (43) వగరునీరు తాగటము, కాల్చిన రాయిని మింగటం, మిక్కిలి వేడిగల ఇసుకతో స్నానము, దంతముల మర్దనము (44) కాల్చిన ఉక్కు పై పడుకోవటం, బాగా కాగిన నీటిని సేవించటం, కళ్ళు, ముఖవంధులలో నూదితో పొడవబడటం, (45) ఉక్కుముద్ద బరువును వృషణములు శిశ్నమునకు కలిపికటబడటం, దుర్గంధంతో నిండిన దావిలో చెట్టు మీదినుండి వడటం (46) తికమైన అంచులు గల అస్త్ర ముల. శయ్యపై పడుకోవటం, రేతస్సును తాగటం, ఇవి మొదలుగా ఘోరమైన నరకములను సేతువు యందు స్నానమాచరించిన వాడు పొందడు (47) సేతువు దోవి ఇనుక దీని మధ్యలో ఆ ఇసుక రేణువులు ఒంటి నిండా కలిగి నిద్రపోయినవాని శరీరంలో ఎన్ని ఇనుకరేణువులు ఉన్నాయో (48) అన్ని బ్రహ్మహత్యల నాశము జరుగుతుంది, అనుమానంలేదు. సేతు మధ్యంలోని, గాలిలో శరీరమంతా నశింపబడ్డ (49) వాని అయుత (పదివేలు) సురాపానముల పావము, ఆక్షణంలోనే నశిస్తుంది. తలకోరిగించుకోటం వల్ల సేతు మధ్యంలో పడ్డ వెంట్రుకలు కలవాని (50) అయుతగురుతల్పగిత పావము ఆక్షణంలోనే నశిస్తుంది. వుత్రపౌత్రులతో పేతుమధ్యలో స్థాపించబడ్డ అస్థికలుకల వాని అయుత స్వర్ణస్తేన పాపము, ఆక్షణంలోనే నశిస్తుంది.
సేతు మధ్యంలో భగవంతుని స్మరించి స్నానంచేసిన బ్రాహ్మణులు మహాపాతకి నంనర్గం వల్ల కలిగే దోషం నుండి ముడులోతారు. (52) మార్గమును తప్పినవాడు, తన కోపం వండుకునే వాడు, యతులను బ్రా అత్యాశకలవాడు, వేదములను అమ్మేవారు ఈ ఎదుగురు బ్రహూతరులు (53) బ్రాహ్మణులను పిలిచి ధనమిస్తానని చెప్పి, తర్వాత లేదనేవాడు బ్రహహా అని పిలువబడుతాడు (54) ఒకనినుండి ధర్మమును తెలుసుకొని అతనికే ద్వేషమాచరించువాడు, బ్రాహ్మణులను అవమానించువాడు ఆతడు కూడా బ్రహహా అని పిలువబడతాడు (55) జలాశయంలోకి నీరుతాగటానికి వచ్చిన ఆవుల మందను నివారించే వాడుకూడా బ్రహ్మ అని పిలువబడుతాడు (58) వాళ్ళందరూ సేతువును చేరాక దోషముల నుండి ముర్తులేరారు. బ్రహ్మసూతురులతో సమానమైన వారుతం ఇతర బ్రాహ్మణులు (57) పేతువును చేరి ముక్తులౌతారు. ఇందులో అనుమానంలేదు. పావవను వదిలినవాడు, దేవతాన్నమును భుజించినవాడు (58) మద్యం సేవించటం, స్త్రీ సహవాసం కలవారు, వేశ్యావ్నమును భుజించేవారు, ప్రమథుల అన్నమున తినువారు, పతితుల అన్నమందు ఆవక్తి కలవాడు (59) వీరందరు నురావులు అవి పిలువబడతారు. అన్ని కర్మలందు బహిష్కరింపబడ్డవారు, సేతుస్నానంవల్ల పాపాలన్ని పోయి (వీరందరు) ముక్తులౌతారు. (60) సురాపతుల్యు లైన ఇతరులు కూడా సేతుస్నానం వల్ల ముక్తులౌతారు (601/2 ).
కందమూల ఫలములను, కస్తూరి వటువస్త్రములను (61) పాలు, చందనము, కర్పూరము పోకలు, తేనె, నేయిరాగి, కంచు, రుద్రాక్షలు (62) వీటిని హరించు వారిని చోరులు అని తెలుసు కోవాలి. వీరు సువర్ణస్తేయి (దొంగ) లతో సమాసము. వీరు సేతు క్షేత్రమునకు వచ్చి ముక్తులౌతారు. అనుమానంలేదు (63) ఇతర విధములైన దొంగలు కూడా సేతు స్నానం వల్ల అన్ని పాపముల నుండి ముక్తులౌతారు. ఇందులో ఆలోచించాల్సింది లేదు (64) చెల్లెలు, పుత్రుని భార్య, రజస్వలను, సోదరుని భార్యను, మిత్రుని భార్యను తాగిన దానిని, పరస్త్రీని, హీనప్రిని, విధవనురక్తుడై పొందేవాడుగురు తల్పగుడు అని గ్రహించాలి. అతడు అన్ని కర్మలలో బహిష్కృతుడు. (66) వీరు, వీరిలాగురుతల్పగ, తుల్యులైన ఇతరులు అందరు సేతుస్నానంతో ముక్తులౌతారు. (67) వీరితో సహవానంగల పావులైన ఇతర వివ్రులందరు గొప్పదైన సేతుస్నానంతో (వారు కూడా)మోక్షం పొందుతారు (68) యజ్ఞం చేయకుండా దేవలోకంలో మలాచీ మేనకాదులతో సంభోగాన్నికోరే వీవ్రులు పావనాశకమైన సేతువు యందు స్నానం చేయటానికి వస్తారు (69) సూర్యుని, అగ్నిని సేవించే కుండ, వరులైన దేవతలను ఉపాసించకుండ ఉన్నవారు శుభములైతే భక్తితో కూడి సేతువుయందుస్నానం చేయాలి (70) నువ్వులు, భూమి, సువర్ణము, ధాన్యము, బియ్యము వీటిని దానం చేయకుండానే స్వర్గంకోరేవారు సేతువు యందు స్నానం చేయటానికి వస్తారు (71) తమ శరీరాన్ని ఉవవానములతో వ్రతములతో పూర్తిగా తపింపచేయకుండానే స్వర్గాన్ని కోరే పురుషులు ముక్తినిచ్చే సేతువు యందు స్నానం చేయటానికి వస్తారు. (72) సేతుస్నానము ముక్తినిచ్చేది, అట్లాగే మనః శుద్ధిని కల్గించేది. జపము, హోమము దానము, యాగము, తపము వీటన్నిటికన్నా (73) సేతుస్నానము విశిష్టము అని పురాణంలో చెప్పబడింది. (731/2).
పాపనాశకమైన సేతువు యందు కోరికలేకుండాచేసే స్నానము (74) జన్మరాహిత్యాన్ని ఇచ్చేది ఇది నత్య విషయము ఓ బ్రాహ్మణులారా! సంపదనుద్దేశించి స్నానం చేసిన నరుడు (75) అధికమైన సంపదను పొందుతాడు. సేతువుయందు శుద్ధి కోసం స్నానం చేసేవాడు బుద్ధిని పొందుతాడు. (76) స్వర్గంలో అప్సరసలతో, రతికావాలనికోరేవాడు స్నానంచేస్తే అట్లాగే స్వర్గంలో దేవతా స్త్రీలతో రతిని పొందుతాడు (77) ముక్తినిచ్చే సేతువు యందు ముక్తి కొరకు స్నానం చేసినట్లైతే పునర్జన్మ లేని ముక్తిని పొందుతాడు (78) సేతుస్నానం వల్ల ధర్మము, సేతుస్నానం వల్ల పావనాశనము. అన్ని కోరికల ఫలములనిచ్చేది (79) నర్వవ్రతములకన్న అధిక పుణ్యప్రదము, నర్వతీర్ధములకన్న అధికము, సర్వయజ్ఞములకన్న ఉత్తమము, సర్వయోగములకన్న అధికము (80) ఇంద్రాది లోకములందలి సుఖముల పై కోరికగలవారు రామకృతమైన సేతువు యందు ఒకసారి స్నానంచేయాలి (81) బ్రహ్మలోకంలో, వైకుంఠంలో కైలాసంలో, శివాలయంలోను సుఖించుటకు ఇచ్చకలవారు సేతువు యందు ఆదరంగా స్నానం చేయండి (82) ఆయువు, ఆరోగ్యము, సంపద, అత్యంత సౌందర్యము, మంచి గుణములు, సాంగములైన నాలుగు వేదముల పారగామిత్వము (83) సర్వ శాస్త్రములను పొందటం, నర్వ మంత్రములందు వేరు వీటన్నిటిని ఉద్దేశించి, సర్వార్థములనిచ్చే సేతువు యందు స్నానమొనర్చిన వారు (84) ఆయా నదులను పొందుతారు. ఇందులో అనుమానం లేదు. ఇది సత్యము. దారిద్ర్యం నుండి నరకం నుండి భయపడే లోకంలోని మనుష్యులు (వారందరు) (85) ముక్తి నిచ్చే రామసేతువు యందు స్నానం చేయాలి. శ్రద్ధ కలిగిన వాడుకాని, శ్రద్ధలేని వాడుకాని (86) ఇక్కడ, పరలోకంలో దు:ఖమును పొందడు, సేతువులో స్నానం చేసిన యెడల, అందరి పాపసంచయము నశిస్తుంది.
శుక్లపక్షంలో చంద్రుడు పెరిగినట్లు ధర్మము పెరుగుతుంది. నముద్రంలో వివిధ రత్నములు పెరిగినట్లు (88) సేతు స్నానం వల్ల పుణ్యములు పెరుగుతాయి. లోకంలో కామధేనువు అన్నీ కోరికల నిచ్చినట్లు (89) మనుష్యులకోరికలను చింతామణి తీర్చునట్లు, మనుష్యుల కోరికలను కల్పవృక్షం ఇచ్చునట్లు (90) సేతుస్నానం కూడా మనుష్యుల అన్ని కోరికలను తీరుస్తుంది. దరిద్రంవల్ల సేతుయాత్రలో అశక్తుడైన మనిషి (91) శిష్యుల నుండి ఆధనాన్ని యాచించి సేతుస్నానమాచరించాలి. ధనమును ఇచ్చినవాడు సేతుస్నానంతో సమానమైన పుణ్యమును పొందుతాడు (92) అట్లాగే స్వీకరించినవాడు కూడా అధికఫలితాన్ని పొందుతాడు. సేతుయాత్రకొరడు బ్రాహ్మణుని నుండి ధనం స్వీకరించాలి. (93) బ్రాహ్మణులు ఇవ్వని పక్షంలో క్షత్రియుని నుండి గ్రహించాలి ఒకవేళ రాజులు ఇవ్వని పక్షంలో వైశ్యుని నుండైనా గ్రహించాలి (94) ఎటిస్థితిలోనైనా శూద్రుని నుండి ధనం స్వీకరించరాదు. సేతువునకై వెళ్ళే వానికి ధనముని ధాన్యముకాని (95) వస్త్రాదికములుకాని ఇచ్చి ప్రేరేపించే మనిషి అశ్వమేధాది యజ్ఞముల ఫలమును పొందుతాడు. (96) నాలువేదములను పారాయణం చేస్తే వచ్చే ఫలాన్ని దీనివల్ల పొందుతాడు. తులా పురుష మొదలగు ముఖ్యదానముల ఫలాన్ని పొందుతాడు (97) బ్రహ్మహత్యాదిపావముల నాశం కలుతుంది. ఎక్కువేం చెప్పాలి, అన్ని కోరికలను పొందుతాడు (98) ఆరకంగానే స్వీకరించినవాడు కూడా దానితో సమానమైన ఫలితాన్ని పొందుతాడు. సేతుయాత్ర కొరకు యాచించిన వానికి, దానం స్వీకరించటం వల్ల వచ్చే చెడు ఫలం కలుగదు (99) సేతువుకు వెళ్ళు, నీకునేను ధనమిస్తాను అని ఆశ పెట్టి, తర్వాత లేదని చెప్పేవాణి బ్రహ్మఘాతకుడని అంటారు (100) డబ్బున్నవాడు కూడా దరిద్రునివలె సేతుయాత్ర కొరకు లోభిగా యాచిస్తే అతనిని దొంగ అని అంటారు (101) సేతువుకు వెళ్తాను ధనం ఇవ్వండి అని తీసుకొని లోభంతో సేతువుకు వెళ్ళని వాణి బ్రహ్మసూతుడు అని అంటారు (102) ఏదోరకంగాసంతోషంతో మనుష్యుడు సేతువుకు వెళ్ళాలి. తను వెళ్ళటానికి చేతకానప్పుడు బ్రాహ్మణునకు దక్షిణనిచ్చి పంపించాలి (103) యాచించి యజ్ఞం చేయటంలో దోషంలేనట్లే, యాచించి సేతువునకు పోతే దోషం లేదు (104) ఇతరుల నుండి ద్రవ్యం యాచించైనా సేతుస్నానమాచరింపచేయాలి. ఆతడు కూడా సేతుస్నానం చేసిన వానివలె ఆ ఫలితము పొందుతాడు (105) కృతయుగంలో జ్ఞానంవల్ల మోక్షము వస్తుంది. త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల వల్ల ముక్తి లభిస్తుంది. అట్లాగే ఇతర యుగములలో దానము శ్రేషమన్నారు. అన్ని యుగములలోను సేతుయాత్ర మనుష్యులకు శ్రేష్ఠమైనది. అని స్కాంద మహాపురాణములో ఎనుబది ఒక్కవేల సంహితయందు మూడవదైన బ్రహఖండమందు సేతు మాహాత్మ్యంలో సేతువునకు వెళ్ళటంవల్ల వచ్చే ఫలాదులు వర్ణించటమనేది ప్రధమ అధ్యాయము.
