స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
33వ అధ్యాయము
తా ॥ శ్రీ మాతుల వచనము - ధనుష్కోటి వైభవాన్ని మళ్ళీ ఇంతా చెప్తాను. వర్వలోములకు ఒకే పావనమైనది. అత్యద్భుతతరము రహస్యమైనది (1) పూర్వం వరావసుడనే బ్రాహ్మణుడు వేదవిత్తముడు. అజ్ఞావం వల్ల తండ్రిని చంపి బ్రహ్మహత్య పాపాన్ని పొందాడు. అతడుతూడా ధనుష్కోటి యందు స్నానం చేసి ఆ దోషం నుండి క్షణంలో ముఢుడైవాడు (2) ఋషులిట్లన్నారు – ఓ మాత ! వరావమవు పూర్వము తండ్రివి ఎట్లా చంపాడు. (3) ధనుష్కోటి యందు అతనికి కూడా ముక్తి ఎట్లా వచ్చింది ఓముని! ఈ విషయాన్ని శ్రద్ధగలిగిన మాకు విస్తరంగా చెప్పండి అని అనగా (4) శ్రీ సూతులిట్లన్నారు - చక్రవర్తి మహాబలుడు, బృహద్యుమ్నుడను రాజ ఉండేవాడు. సాగరాంతమైన భూమిని ధర్మంతో పాలించసాగాడు (5) ఇంద్రుడు మొదలగు దేవతలను సత్రయాగంతో పూజించాడు. విద్వాంసుడు,, వరమ ధార్మికుడు రైభ్యుడు అతనికి యజ్ఞం చేయించేవాడు (6) ఆతనికి అర్వావసు వరావను అని ఇద్దరు కొడుకులు ఉండిరి. షడంగములతో కూడిన వేదమెరిగినవారు, శ్రీతసార్త కర్మలలో కోవిదులు (7) కోణాదము, జైమినీయము, సాంఖ్యము వైయాసికము గౌతమీయము, యోగశాస్త్రము, పాణినీయము వీటన్నిటియందు కోవిదులు (8) మన్వాది వృతులలో నిషాతులు, సర్వశాస్త్రములందు విశారదులు. పత్రయాగంలో సహాయం కొరకు బృహద్యుమ్నుడు వీరిని కోరాడురమ్మని (9) తండ్రియైన రైభ్యుని అనుమతి పొంది ఈ అన్నతమ్ములు వెళ్ళారు, బృహద్యుమ్నుని సత్రయాగానికి. వారు రూపంలో అశ్వినీ దేవతల వలెనున్నారు (10) ఆశ్రమంలో రైళ్ల్యుడు తన పెద్ద కోడలితో ఉన్నాడు. వారిద్దరు అన్నదమ్ములు ఉత్తమమైన, రాజుగారి సత్రయాగానికి వెళ్ళి (11) సత్రయాగంలో బృహద్యుమ్న రాజును యంపి చేయసాగారు. సత్రమందు అన్ని కర్మలలోను అన్నదమ్ములకు స్థలనము కాలేదు (తొట్రుపడలేదు) (12) బృహద్యుమ్నరాజు యొక్క వత్రయాగం జరుగుతుండగా, రాజుగారు ఏలువగా యజ్ఞాన్ని చూడటానికి మునులందరూ వచ్చారు (13) వసిష్టుడు, గౌతముడు, అత్రి, జాబాలి, కశ్యపుడు, క్రతువు, దక్షుడు, పులస్త్యుడు, వారదుడు (14) మార్కండేయుడు, శతానందుడు, విశ్వామిత్రుడు, పరాశరుడు, భృగువు, కుత్పుడు, వాల్మీకి, వ్యాసుడు, ధౌమ్యుడు మొదలగువారు ఇతరులు కూడా (15) ష్యులు, ప్రశిష్యులు లెక్కింపరానంతగా అనేక మందితో పచ్చారు. వచ్చిన వారిని చూచి బృహద్యుమ్న మహీపతి (16) అర్యాదులలో మునులందరివి పాదరంగా పూజించసాగాడు.
తా ॥ అవేళ దిక్కులనుండి చతురంగ బలములతో కూడిన (17) తానుకలతో సహా రాజులు సత్రాన్ని చూడటానికి ఆదరంతో వచ్చారు. వైశ్యులు, చూద్రులు అట్లాగే నాలుగు వర్ణముల వారు వచ్చారు. (18) బ్రహ్మచారులు, గృహస్థులు, భిక్షువులు, ఆ బృహద్యుమ్నుని నత్రయాగం చూడటానికి వచ్చారు (19) రాజశ్రేషడు వారందరిని వారి వారికి తగినట్లు పూజించాడు. అన్నములను వృత నూపాదులను అందరికి పెట్టాడు. (20) వస్త్రములు బంగారము అనేక రత్న హారములు ఇచ్చాడు. ఈ విధంగా రాజు సత్రంకు వచ్చిన వారిని సత్కరించాడు. (21) ఓ బ్రాహ్మణులార ! రైళ్య పుత్రులైన అర్వావను పరావనులు ఏ తొట్రుపాటు లేకుండ అధ్వరాది కర్మలను చేశారు (22) దాన్ని చూచి మునులందరు రైళ్యపుత్రుల వేర్పరితన్నాన్ని తలలూపుతూ పొగుడుతున్నారు. వృషప్రముఖులు కూడా అట్లే పొగిడారు. (23) పరావసు కొన్ని పనులను చేయించి, తృతీయ నవనం చివర ఇంటి పనులను చూచుటకు (24) అర్వావనులేకుండానే తన ఆశ్రమానికి సాయంకాలం వెళ్ళాడు. ఆ సందర్బంలో కృష్ణా జనంతో చుట్టబడి ఉన్న రైబ్యుని (25) అడవిలో తిరుగుతున్న తన తండ్రిని చూచి మృగమని శంకించి, నిద్రతో కలతచెంది రాత్రి యందు అంధకారమయమైన తమస్సుతో వ్యాకులమై (26) ఈ మృగము నన్ను చంపటానికి వస్తున్నదని చింతించీ, మహారణ్యంలో వరావసువు తన తండ్రిని చంపాడు (27) తన శరీరాన్ని రక్షించుకునే ఉద్దేశ్యంతో వరావము ఏకామన లేకుండానే మహా పాతక కారియై రాత్రియందు తండ్రిని చంపాడు (28) దగ్గరకు వచ్చి హతుడైన వానిని చూచాడు తన తండ్రిగా గుర్తించి కలత చెందిన అవయవములు కలవాడై రాతి ఏడ్చాడు. (29) పరావసు తండ్రికి ప్రేతకార్యమంతా నిర్వర్తించి తిరిగి వరావసురాజు గారి సత్రానికి వచ్చాడు (30) తాను చేసిన వనినంతా అనుజునకు చెప్పాడు. తండ్రి చనిపోయినాడనివిని ఆతడు శోకాతులుడైనాడు (31) జ్యేషుడు అనుజునితో ఇట్లా అన్నాడు. బృహద్యుమ్మురాజు యొక్క గొప్ప సత్రయాగము ఆరంభమైంది. (32) బాలకుడవైన నీకు ఈ పనిలో నిర్వహణ శక్తి చాలదు. నేను రాత్రి మృగమవే అనుమానంతో తండ్రిగారిని చంపాను (33) బ్రహ్మ హత్య విశుద్ధి కొరకు ప్రాయశ్చిత్త మాచరించాలి. నా కొరకు ప్రతిచర్యకు ఒతమ్ముడనీవు తిరుగు (34) ఒంటరిగా నత్రకర్మ భారాన్ని మోయటానికి నేను సమర్ధుణ్ణి, ఓ అర్వావసు ! అని పెద్దవాడు అనగానే అతడు దానిని వహించాడు (35) అట్లాగే కొని ఓ అన్న ! నేను ఉత్తమమైన వ్రతాన్ని ఆచరిస్తాను. బ్రహ్మహత్య విశుద్ధి కొరకు నీవు వత్రము భారాన్ని మోయి (38) పెద్దవానితో పలికి ఆ తమ్ముడు ఆ సత్రం నుండి వెడలిపోయాడు..
తా ॥ అతడువెళ్ళాక పెద్దవాడుయజ్ఞకర్మలనుచేయించాడు (37) ఓద్విజులార! కనిషుడు కూడా పన్నెండు సంవత్సరములు బ్రహ్మహత్యావ్రతమునుచరించి సంతోషంతోతిరిగి ఈనత్రయాగానికి వచ్చాడు. (38) ఆతమ్ముణి చూపిజ్యేషుడు బృహద్యుమ్నువితో ఇట్లా అన్నాడు. ఈతడుబ్రహ్మహత్యచేసినవాడు. నీవత్రమునకు అర్వావసువచ్చాడు. (39 ఓరాజ! ఈ సత్రంనుండి ఈతనిని త్వరగావుతొలగించు. లేనిపక్షంలో నత్రయూగంటెక్కవలహావికలు తుంది (40) అనిఅనగా ఆరోజు తనదూతలతో యాగంనుండిఆతనినితొలగించాడు. తొలగింపబడుతూఅర్వావసురాజుతో ఇట్లా అన్నాడు. (41) బృహద్యుమ్న! పుణ్యాత్ముడ ! వేనీ బ్రహ్మహత్యనుచేయులేదు. ఓవిభు!ఠానిమా పెద్ద అన్నయ్యేబ్రహ్మహత్యచేశాడు (42) అందుకొరకు నేను ఇవ్వడు బ్రహ్మహత్యావ్రతాన్నిచరించాను. అవిచెవ్పగాజరాజవరావసుమాటతో (43) తనసత్రంనుండిఅర్వావసును తొందరగా తొలగించాడు. బ్రాహ్మణులు కూడాధిక్కరించగాఆతడు మౌనంగాఅవ్వడుఅడవికి వెళ్ళాడు (44) మునివృంద ములతోనిండిన తపోవనమునకు చేరిఆతడు అర్వావను దేవతలు కూడాఆచరించలేనితవ మాచరించాడు (45) వ వధి యందుండి తవనుచే నూ అట్లాగే ఆదిత్యుని ఉపాసించాడు. ఆతనిగొప్పతనస్సుతో, అదుష్టమైనబుద్ధిగలవాడు మూర్తి మంతుడైస్వయంగా (46) తనశాంతితో జగతీతలాన్నీ వెలిగింప జేపూ ప్రత్యక్షమైనాడుకర్మసాక్షి, జగత్తున తుచ కువు, భాస్కరుడు దేవతలకు అగ్రజా ప్రత్యక్షమైనాడు. (47) ఇంద్రునివురస్కరించుకొని దేవతలు ప్రత్యక్షమైనారు. పిదపఇంద్రాది దేవతలు అర్వావసుతోఇట్లా అన్నారు. (48) అర్వావను ! తవమువల్ల బ్రహ్మచర్యంవల్లనీవు శ్రేషుడవు. ఆచారంతో,త్రతంతో, వేదశాస్త్రాది దీక్షతో కూడా ప్రవరుడవు (49) నీవు వరావసుతో అనేక అవమానంతో విరాకరించబడ్డావు. నీవు కోపగించలేదు కాబట్టి క్షమతో కూడియున్నట్టే (50) జ్యేషుడు తండ్రిని చంపాడు. ఓ మహామతి! నీవు హింసించలేదు. ఆతని కొరకు నీవు బ్రహ్మహత్యావ్రతాన్ని చరించావు (51). అందువల్ల నిన్ను స్వీకరిస్తున్నాము. వరానును తిరస్కరిస్తున్నాము. అని వలికి ఇంద్రుడు ముఖ్యులుగా గల దేవతలందరు (52) ఆతనిని శ్రేషునిగా గణించారు. పరావసును నిరాకరించారు. తిరిగి ఇంద్రాది దేవతలు సూర్యుని పురస్కరించుకొని (53) ఆర్వావసుతో ఇట్లా అన్నారు. నీవు వరాన్ని వేడుకో, అని
తా ॥ తన తండ్రి తిరిగి బ్రతకాలని అతడు ప్రార్థించాడు (54) తనే తండ్రియొక్క వధమ వరించక పోవటంమ వరంగా దేవతలను కోరాడు. అట్లాగే తావిమ్మని దేవతలన్నారు. తిరిగి ఇట్లా అన్నారు. (55) ఇంకొక వరాన్నిస్తాము. ఓ మహామతి ! వీవు కోరుకో అని దేవతలనగా, ఆ అర్వావసు ఇట్లా అన్నాడు (56) ఓ త్రిదశాలయులార ! నాఅన్న అదుష్టుడు కావాలి. అర్వావసుమాటలను విని త్రిదశులు తిరిగి ఇట్లన్నారు (57) బ్రాహ్మణుడైన పితరుని చంపడం వల్ల వరావసునకు పెద్ద దోషం వస్తుంది. ఇతరుడు పాపం చేయగా, మరొకడు (58) ప్రాయశ్చిత్తం అనుష్ఠిస్తే శాంతిలేదు. మహాపాతక పంచకంలో తండ్రిని, అందున బ్రాహ్మణున్ని చంపిన వానికి ఏమాత్రం నిష్కృతి లేదు. (59) తాను వ్రతాన్ని అనుసించినా నిష్కృతి లేదు. నీ అన్నయైన వరావసునకు కూడా నిష్కృతి లేదు (60) అందువల్ల మేము అతనికి అదుష్టత్వమును ఇవ్వలేము అని అనగా అర్వావసు తిరిగి ఇట్లన్నాడు. ఇంద్రుడు మొదలుగా గల దేవతలతో (61) ఐవా మీమాహాత్మ్యం వల్ల అట్లాగే మీ అనుగ్రహం వల్ల, తండ్రి, బ్రాహ్మణుడుఐన వానిని చంపిన మా అన్నకు ఓ దేవతలార ! (62) నిష్కృతి ఎట్లా కలుగుతుందో, అట్లాగే దయతో చెప్పండి. అని అర్వావసు అన్న మాటలను విని ఆ దేవతలు (63) చాలా కాలం ధ్యానించి నిశ్చయించి ఇట్లా అన్నారు. ఆ పాతక నివరణ కొరకు ఉపాయాన్ని చెప్తాము. (64) దక్షిణ నముద్రమందు వుణ్యమైన ముక్తినిచ్చే రామ సేతువు యందు ధనుష్కోటియని ప్రసిద్ధి చెందిన ముక్తినిచ్చే తీర్థముంది (65) బ్రహ్మహత్య సురాపానము, - న్వర్ణస్తేయము వీటన్నిటిని నశింపచే సేది, గురుతల్పగ సంసర్గ దోషములను నశింపచే పేది (66) ఏ కోరిక లేకుండా స్నానం చేసినా ముక్తావలాన్నిచ్చేది, దుస్వప్నములనశింపచే సేది ధన్యమైనది, నరక క్లేశ నాశకము (67) కైలాసాది వదప్రాప్తికి కారణమైనది, పరమార్థమునిచ్చేది, ఇది పురుషులకు అన్ని తామములనిచ్చేది (కోరికలు ఇదే) ఋణ దారిద్ర్య నాశకము (68) ధనుష్కోటి, ధనుష్కోటి, ధనుష్కోటి అని పలికితే పురుషులకు స్వర్గఅవవర్గములనిచ్చేది మహా పుణ్యఫలప్రదము (69) అక్కడికి వెళ్ళి నీ అన్న వరావసు స్నానం చేసినట్లైతే ఆ క్షణంలోనే నీ జ్యేషుడు బ్రహ్మహత్యతో ముత్తుడౌతాడు (70) ఈ చాలా గొప్ప రహస్యమైన ప్రాయశ్చిత్తాన్ని చెప్పాము.
తా ॥ అని అర్వావసనకు చెప్పి దేవతలు తను నగరమునకు వెళ్ళారు (71) పిదప అర్వాసను జ్యేషుడైన వరావసును తీసుకొని ముక్తిదాయివియైన రామచంద్ర ధనుష్కోటికి వెళ్ళాడు. (72) వరావనువు వియమంగా సేతువుయందు సంకల్పం చెప్పి పాతకశుద్ధి కొరకు ధనుష్కోటి యందు తమ్మునితో కలిసి స్నానం చేశాడు (73) ధనుష్కోటి యందు స్నానం చేసి లేచిన అతనిలో అశరీరవాణి ఇట్లా అంది. తండ్రిని బ్రాహ్మణుని చంపినందువల్ల వచ్చిన పాపము నశమైంది (74) బ్రహ్మహత్య మహావూరమైంది. వరళడ్డిశమును కళించేది. అవి వలికి ఆ అశరీరవాణి కూడ విరమించింది. (75) ఓ విప్రులార! అప్పుడు పరావసువు తమ్మునితో కూడి భక్తితో రామచంద్ర ధనుష్కోటికి నమస్కరించి (76) రామనాధుడైన మహాదేవుని భక్తి పూర్వకముగా నమస్కరించి పాతకముల మండి ముత్తుడై తండ్రి ఆశ్రమమునకు వెళ్ళాడు (77) చనిపోయిలేచిన రైభ్యుడు కొడుకులు రావటం చూపి వంతుష్ట హృదయుడై పుత్రులతోపాటు తన ఆశ్రమంలో ఉన్నాడు (78) రామచంద్ర ధమష్కాటిలో స్నానంవల్ల పాపములు పోయిన ఈ వరావమును మునులంతా స్వీకరించారు. (79) ఈ విధముగా పరాపను బ్రహ్మహత్య విముక్తిని చెప్పాను. ఓ మునిశ్రేషలార ! ధనుష్కోటిలో స్నానం వల్లనే ఈ ముక్తి (80) ఇక్కడ స్నానం వల్ల సురాపానాదులు నశిస్తాయి. నత్యము సత్యము పత్యము చేతులెత్తి చెపున్నాను (81) ఇక్కడ స్నానం వల్ల మహా పాతక సంవలు నశిస్తాయి. బ్రహ్మహత్యా విమోక్షణమైన ఈ అధ్యాయాన్ని చదివినవారి (82) బ్రహ్మహత్య వెంటనే నశిస్తుంది. అనుమానంలేదు. అతని సురాపానాదులు కూడా త్వరగా శాంతిస్తాయి (83) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్య మందు ధనుష్కోటి ప్రశంస యందు వరావను బ్రహ్మహత్యా విమోక్షణ మనునది ముప్పది మూడవ అధ్యాయము
