స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

7వ అధ్యాయము

శ్రీ సూత ఉవాచ –

శ్రీ సూతులిట్లనిరి - దానవేశ్వరుడైన మహిషుడు దేవితో చంపబడ్డ తన సైన్యాన్ని చూచి కోపంతో, చండకోపునితో ఇట్లనెను (1) మహిషువి వాక్కు - చండకోవ! మహాపరాక్రమశాలి! ఈదురాత్మురాలితో యుద్ధంచేయి, అని అట్లాగే అని ప్రతావవంతుడైన చండకోపుడు పలికి దేవిని యుద్ధరంగంలో బాణ వర్షంతో ముంచెత్తాడు. ఆ చండకోపుని బాణ జాలములను లీలగా తొందరగా దేవి ఛేదించి ఆ అంబిక చండకోవుణ్ణి శస్త్రంతో కొట్టింది ఆతని గుణములు ఛేదించబడ్డాయి సారధిని, ధ్వజమును, ధనస్సును చేధించింది రథమును కూడా చేధించి బాణములతో దేవి ఆతని హృదయంలో కొట్టింది. ధనస్సు విరిగి, రథంలేక, గుఱ్ఱములు సారధీ చచ్చి న వాడై చండకోపుడు ఖడ్గచర్మములను ధరించి దేవిని సమీపించాడు. దేవీ వాహనమైన సింహమును ఆ అసురుడు తన ఖడ్గంతో కొట్టాడు దేవిని కూడా తన ఖడ్గంతో ఆమె ఎడమ భుజంమీద ఈ రాక్షసుడు కొట్టాడు. ఈ దేవి ఖడ్గము వేయి ముక్కలైంది దేవి గొప్ప హలంతో చండకోవుణ్ణి హృదయంలో కొట్టింది. వాడు క్రిందపడి మరణించాడు మహావీరుడు, బలవంతుడు ఐన చండకోపుడు మరణించగా, చిత్రభానువు అనువాడు ఏనుగనధిరోహించి ఆదేవిని అనుసరించాడు గొప్ప మంట ధ్వని కలిగిన దివ్యశక్తిని వదిలాడు. దేవి తన హుంకారముతో శక్తిని వారించి సందడి లేకుండా చేసింది. పిదప దేవి శూలంతో చిత్ర భానును సంహరించింది. యుద్ధంలో అతడు మరణించాక కరాలుడు అను వాడు వచ్చాడు చేతి పిడికిలితో వాడిని దేవి వడగొట్టింది. మదోన్మత్తుడైన ఆతనిని గదతో దేవి వడగొట్టింది. మదోన్మత్తుడైన ఆతనిని గదతో దేవి ప్రాణహీనుని చేసింది వటశంతో బాష్కలుడనే. పొణి. వాని దగ్గరివాణి (అంతిథుని) చక్రంతో యమలోకానికి పంపింది. ఓ బ్రాహ్మణులారా ! దుర్గాదేవి ఇట్లా మహిషుని మంత్రులైన ఇతర మహాకాయులను శూలంతో పొడిచి యమమందిరానికి పంపింది దుర్గవల్ల తన సైన్యం ఇట్లా చంపబడ్డాక మహిషాసురుడు, మహిషరూపంతో దేవి యొక్క గణములను తిన్నాడు కొందరిని తుండంతో చంపాడు ఇతరులను గిట్టలతాకిడితో చంపాడు. ఇతరులను నిశ్వాస వాయువులతో కోపగించి పడవేశాడు దేవి యొక్క భూతగణములను ఇట్లా చంపి మహిషాసురుడు దేవి యొక్క సింహాన్ని చంపటానికి కోపోద్రిక్తుడైనాడు నాదం చేశాడు.

ఈ  వీర్యము బలము గల ఆ సింహము కోపగించింది. తన తాలి. గిటలతాకిడితో పగిలిన భూమి, పర్వతములు కలదై వస్తున్న మహిషాసురుణ్ణి తన గోళ్ళతో చీల్చింది. చండిక కూడా కోపగించి ఆతసనిని చంపాలనుకుంది.చండిక కోపంతో మహిషుణ్ణి తాళ్ళతో బంధించింది. ఆతాళ్ళను విడిపించుకొని మహిషుని వేషాన్ని వదిలి  బలపరాక్రమములు గల వీడు రాక్షసుడు సింహవేషం ధరించాడు దేవి వాని తలను ఖండించుదామని అనుకున్నంతలో  వాడు వురుష వేషము ధరించి చేత కత్తి ధరించి కవ్వించాడు. ఖడ్గహస్తుడైన ఆ వురుషుణ్ణి దేవి అనేక శరములతో  వరులమర్మస్థానములను చీల్చగల్గిన, తీష్టమైన అంచులు గల శరములతో కొట్టింది. ఆ ఎదవ ఆ వురుషుడు తొండము దంతములు గల ఏనుగుగా మారాడు. తన తొండంతో దేవి వాహనమైన సింహంనులాగింది. అప్పుడు సింహం తన గోళ్ళతో దాని తొండమును ఖండించింది  మళ్ళా ఆ రాక్షసుడు మహిష రూపం ధరించాడు. అప్పుడు కోపగించిన భద్రకాళి గొప్పగా పానం చేసింది ఎదవ పానం చేసినందువల్ల మతురాలైన కళ్ళు ఎర్రబడగా నవ్వింది. మహిషుడు కూడా గర్వంతో కూడి, తనకోమ్ములతో పర్వతములను  చండికమీదికి విసిరాడు. ఆమె తన బాణములతో వాటిని ఛేదించింది. అప్పుడు జగన్మాతయైన దేవి మహిషాసురునితో ఇట్లా అంది దేవి వాక్కు - నేను మధువును సేవించే రకు మూడుడ ! క్షణకాలం గర్వపడు. మధుపానం నుండి విరమించాక నేను నిన్ను యముని దగ్గరకు తీసుకు వెళ్తాను దేవతలకు కంటకుడవైన, అణచటానికి వీలులేని నిన్ను నేను చంపాక సిద్ధులు, సాధ్యులు, మరుద్గణములు తమ తమ స్థానాలు పొందని  అని అంటూ మహిషాసురుణ్ణి పిడికిలితో కొట్టసాగింది. అతడు దేవితో కొట్టబడి చాలా భయపడినవాడై తొందరగా దక్షిణ సముద్ర తీరంవైపు పరుగెత్తసాగాడు. ఆమె సింహవాహవాన్న ధిరోహించి దనుజుని అనుసరించింది దేవితో అనుసరించబడ్డ రాక్షసేశ్వరుడు మహిషుడు, వదియోజనముల విశాలమైన ధర్మపుష్కరిణీతోయ మందు  ప్రవేశించి, దుర్గాతాడనముతో కలతచెంతి అంతర్షితుడై ఉన్నాడు. అప్పుడు దుర్గ పుష్కరిణి తటమునకు వచ్చి అక్కడ రాక్షసుడైన మహిషుళ చండిక చూడలేదు. అశరీరవాణి దుర్గాదేవితో ఇట్లా అంది.

            తా ॥ ఓ భద్రకాళి ! మహాదేవి! దానవుడైన మహిషుడు నీచే కొటబడ్డాడు. నీ పిడికిలితో కొటబడి ధర్మపుష్కరిణీ జలమందు దీనిలో భయారుడై అంతర్షితుడైనిద్రిస్తున్నాడు. వాణ్ణి చంపు. ఏదో ఒక ఉపాయంతో వీని ప్రాణములు తీసివేయి ఈ విధముగా అశరీరవాణితో చెప్పబడ్డ చండిక, అసురేంద్రుణ్ణి చంపదలచి తన వాహనమైన సింహంతో ఇట్లా అంది  ఓ మృగరాజ! మహా బలపరాక్రమశాలి ! నీవు ధర్మపుష్కరిణి నీటిని ఏమి మిగల్చకుండా తాగు దేవితో ఇట్లా చెప్పబడ్డ సింహము, ధర్మపుష్కరిణీజలాన్ని నిఃశేషంగా తాగింది (బురద) దుమ్ముఉండేట్టే చేసింది దీనుడైన మహిషుడు ఆజలాశయం నుండి బయటికి వచ్చాడు. అట్లా వస్తున్న ఆ రాక్షసుని తల పై దేవి తన పాదాన్నుంచి,  కంఠంలో తీకమైన శూలాన్నుంచి కోపంతో ఏడించసాగింది. పిదప దేవి కత్తిని తీసుకొని ఈతని శిరస్సును ఖండించింది ఈ విధముగా మహిషుడు భృత్యబలవాహవములతో తుడి దుర్గతో చంపబడి భూమియందు వడ్డాడు. చంపబడ్డాడు  పిదప దేవతలు, గంధర్వులు, ఏదులు, వరవరులు అందరు స్తోత్రములతో దేవిని స్తుతించి, ఆనందపడివారు, పంతృవులైనారు దేవితో అనుజ్ఞను పొంది వచ్చిన ప్రకారమే దేవతలు వెళ్ళిపోయారు. ఎదవ జగన్మాత తన పేరుతో ఉత్తమమైన నగరాన్ని దక్షిణ నముద్రతీరంలో ఉత్తరభాగంలో ఏర్పరచింది. ఎదవ దేవి ఆజ్ఞననుసరించి ఇంద్రుడు మొదలగా గల దేవతలు  అమృతముతో ధర్మపుష్కరిణిని నింపారు. అందువల్ల ఆ ఉత్తమ తీర్థము అమృత తీర్థమనే పేరును పొందింది అప్పుడు దేవి నంతోషంతో తన నగరానికి వరమిచ్చింది. వశునంద ఉండేటు, రోగములు పొగొటునట్లు ఈ పట్టణం ఉండనీ అని తీర్థమునకు గూడా ఇట్లా వరమిచ్చింది. ఇక్కడ స్నానము చేసిననరులు కోరిన ప్రకారము సిద్ధిని పొందని అని పలికి దేవి స్వర్గమునకు వెళ్ళింది .

 తా శ్రీ నూతులిట్లనిరి - దేవీ తన పేరుతో ఈ వటణాన్ని నిర్మించింది అందువల్ల ఈ దేవీపురము దేవీ వత్తనమని పిలువబడింది దేవీపత్తనం మొదలుకొని మంచి ముహూర్తము గలదినమందు మొదట విఘ్నేశ్వరుని నమస్కరించి అట్లాగే నలిలస్వామికి నమస్కరించి మహాదేవుని ఆజ్ఞపొంది ధార్మికుడైన రామచంద్రుడు తన వస్త్రంతో తొమ్మిది పాషాణములను ఉంచి సేతువును లంకా నగరం వరకు ఆరంభించాడు, జాగృతుడై (కునికిపాటులేక), నలుడు ఏర్పాటుచేసిన సింహాసనమును ఆరోహించి రాముడు  సముద్ర మందు నలుడు మొదలగు వానరులతో సేతువును నిర్మింప చేశాడు. పర్వతములను శాఖలను (కొమ్మలు) వృక్షములను, రాళ్ళను, కట్టెలను  అడవిమధ్యనుండి గడ్డి మొదలగు వానిని వానరులు తెచ్చారు  వాటన్నిటిని నలుడు నమకూర్చి సముద్రమందు సేతువును చేశాడు. ఐదు రోజులలో సేతువు లంకా న మీపం వరకు  పది యోజనముల విస్తీర్ణము, నూరుయోజనముల పొడవుగలదై నముద్రమందు పుణ్యప్రదము, పాపనాశకమైన సేతువు నలునితో నిర్మించబడింది (తొమ్మిది) నవపాషాణరూపకమైన దేవీపురం సమీపంలో సేతుమూలంలో తన పాపముల పరిశుద్ధి కొరకు నరుడు స్నానం చేయాలి  చక్రతీర్థంలో అట్లాగే స్నానం చేయాలి ! సేతువునకు అధిపుడైన వారిని సేవించాలి. దేవీపత్తనం ఆరంభించి చేసిన సేతుబంధనము  సేతువునకు మూలము దానికయ్యే కల్పించబడింది. సేతువునకు పశ్చిమ చివర దర్పశయ్య అనబడుతుంది  దేవీపురము తూర్పుచివరి భాగము. ఈ రెండు సేతువునకు మూలములు. ఈరెండు పుణ్య ప్రదములు పవిత్రములు. పాపనాశకములు ఏ ఏ మనుషులు ఏ ఏ దారిలో ఏ పేతు మూలమునకు వెళ్తారో ఆ యామార్గల్లోపోయి, వారు వారు వాని వాని యందు విముక్తులౌతారు  సేతు మూలంలో తొలుత స్నానం చేసి అట్లాగే చక్రతీర్థంలోను పిదప సంకల్ప పూర్వకముగా సేతు బంధనమునకు వెళ్లాలి. దేవీపురమందు, దర్భశయ్యయందు శివప్రదమైన చక్రతీర్థమందు స్నానంచేసిన పుణ్యప్రదము. పాపనాశకము  రెండు చోట్లను చక్రతీర్థాన్ని స్మరించటంవల్ల లక్ష జన్మలలో చేసిన పాపములైనా భస్మమౌతాయి. జన్మనశిస్తుంది ముక్తి కరగతమౌతుంది. చక్రతీర్థముతో సమానమైన తీర్థం ఇది వరలో లేదు. కలగ బోదుకూడా .

తా ॥ భూలోకంలో గంగాది తీర్థములెన్ని ఉన్నాయో అవి చక్రతీర్థము యొక్క పదునారవ కళకు కూడా సరితూగవు తొలుత నవపాషాణముల మధ్య యందు నముద్రంలో స్నానం చేయాలి. పిదప క్షేత్ర పిండ ప్రదానముచేయాలి. అట్లాగే చక్ర తీర్ణంలోను చేయాలి తన పావ పరిశుద్ధి కొరకు సేతునాథుడైన హరిని సేవించాలి. ఆ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఈ విధంగా దర్బశయ్య యందు కూడా చేయాలి  నలుడు చేసిన రామచంద్రుడెక్కిన సింహాసనానికి నమస్కరించిన నరునకు భయములేదు రాము హృదయంలో ధ్యానిస్తూ మొదట సేతువునకు నమస్కారం చేయాలి. ఆ పేతువు రాముని పాదన్యానముతో పవిత్రంగా చేయబడ్డ ధూళి గలది. దశకంఠుని శిరచ్ఛేదమునకు హేతువైన పేతువునకు నమస్కారము రామచంద్రునకు కొంతి దాయకము మోక్షమార్గమునకు హేతువు ఇదొక్కటే సీతయొక్క మనసనే తామరపుష్పమునకు సూర్యుని వంటిది ఐన సేతువునకు నమస్కారము. ఈ మంత్రంతో తొలుత సాష్టాంగ నమస్కారముచేసి  ఎదవ మహాశక్తి గల వేలాల వరద తీర్థమునకు వెళ్ళవలెను. అక్కడ స్నానం చేయటం వలన పరలోక సిద్ధిని నరుడు పొందుతాడు ఈ అధ్యాయమును భక్తిగలవాడై చదివిన నరుడు లేదా విన్న వాడైనా ఆతనికి స్వర్గాదులు దుర్లభములు కావు. కైవల్యం కూడా అతనికి కరతలగతమే అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఎనుబది ఒకటివేల నంతయందు తృతీయమైన బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు చక్రతీర్థ ప్రశంసయందు దేవీపుర అభిధానము చెప్పే సందర్భమున మహిషాసుర సంహార వర్ణన అనునది ఏడవ అధ్యాయము