స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
24వ అధ్యాయము
శ్రీ సూతులిట్లనిరి - చక్రతీర్థంలో స్నానం చేసి పిదప శివ తీర్థమునకు వెళ్ళాలి. అక్కడ స్నానం చేసినంత మాత్రమున మహా పాతక కోటులు (1) వాటి - సంవర్గములు ఆ క్షణంలోనే నశిస్తాయి, ఓ తాపసులార ! ఇక్కడ స్నానం చేసి, కాల భైరవుడు బ్రహ్మ హత్య నుండి ముఠుడైనాడు (2) ఋషులిట్లనిరి - కాల భైరవరుద్రునకు బ్రహ్మహత్య ఎందుకు సంభవించింది. ఓ సూత ! మాకు మీరు చెప్పవలసింది (3) శ్రీ సూతుల వచనము - ఓ మునులార ఇది వరలో జరిగింది, ముక్తినిచ్చేది, దీనిని చెప్తాను. దీనిని విన్న మాత్రమున పాప ములనుండి ముక్తులౌతారు (4) పూర్వం ప్రజాపతికి విష్ణువునకు తగాదా ఏర్పడింది, అందరి ఎదుట చిన్న కారణంగా (5) నేనే జగత్కర్తను మరొకడు ఇతరుడు కర్తలేడు. నేను ప్రపంచాలన్నిటికి విగ్రహానుగ్రహముల ఇచ్చేవాణ్ణి (6) నా కన్న అధితుడు మరొకడు లేడు నాతో సమానమైన వాడు కూడా దేవతలలో లేడు. ఇట్లా బ్రహ్మ దేవతల ఎదుల పూర్వం తలిచాడు (7) అప్పుడు నారాయణుడు నవ్వుతూ ఇట్ల న్నాడు, ఓ బ్రాహ్మణులార ! అహంకారంతో, ఇప్పుడు ఇట్లా నీవు ఎందుకంటున్నావు (8) ఓ విధి! ఇటువంటి మాటను మళ్ళీ అనటానికి అనర్హుడవు. నేనే. జగత్కర్తను. యజ్ఞము. నారాయణుడు . విభువునేనే (9) నేను లేకుండా ఈ ప్రపంచమునకు జీవనం దుర్లభమౌతుంది. నా అనుగ్రహంవల్ల నీవు స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తును సృష్టించావు (10) ఈ విధముగా జయం కోరుతూ దేవతలముందు తగాదా పడుతున్న బ్రహ్మ విష్ణువుల ముందరకు నాలుగు వేదములు వచ్చాయి. వరమార్ధ ప్రకాశకమైన తథ్యమైన వాక్యమునిట్లా చెప్పాయి (11) వేదముల మాట - ఓ విష్ణు ! నీవు జగత్కర్తవు కావు. ఓ ప్రజాపతి ! బ్రహ్మ ! నీవు కాదు (12) ఈశ్వరుడు జగత్కర్త, వరునికన్న వరతరుడు, విభువు. ఈ స్థావర జంగమమంత ఆతని మాయాశక్తితో ఏర్పరుచబడింది (13) నర్వదేవతలచే నమస్కరించ తగినవాడు సాంబుడు నత్యాది లక్షణములు కలవాడు, స్రష్ట, పాలకుడు, హర్త జగత్తున కంత ఆతడే ప్రభువు (14) శుభాక్షర వాక్యములు ఈ రకంగా వేదములు చెప్పగా విని బ్రహ్మ విష్ణువులు అప్పుడు అక్కడ ఇట్లా అన్నారు. ఓ బ్రాహ్మణులార! (15)
బ్రహ్మ విష్ణుపులు ఇట్లా అన్నారు - పార్వతిని ఆ లింగనం చేసుకునే శంభువు ప్రథమాధివుడు. సర్వసంగవివర్జితమైన వరం బ్రహ్మ ఎట్లాడాడు (16) వారిద్దరు ఇట్లా అనగా వారితో ప్రణవం అప్పడు ఇట్లా అంది. పెద్ద శబ్దంతో రూపంలేని ప్రణవం రూపంధరించి అంది (17) ప్రణవం మాట - ఈ శంభుడు, మహాదేవుడు తన కన్న వేరైన పార్వతితో ఎప్పుడో ఒకప్పుడు క్రీడిస్తాడు గదా. కాని స్వాతస్వరూపంతో (18) ఈ శంభువు ప్వ ప్రణాళుడు, నిరంజనుడు, తనకన్న ఈశుడు లేనివాడు, విశ్వాధితుడు, మహాదేవుడు, విశ్వాధి తుడని ప్రసిద్ధమైనాడు (19) సర్వాత్ముడు, సర్వకర్త, స్వతంత్రుడు, అన్ని భావించే వాడు (కలవాడు). బ్రహ్మ ! సృష్టికాలంలో ఈతడు రజోగుణం నిన్ను నియమించాడు. (20) ఓకేశవ! శంభువు సత్వగుణంతో రక్షించటానికి నిన్ను పంపిస్తాడు. తమో గుణంతో లయకాలమందు కాల రుద్రుడను వానిని ప్రేరేపిస్తాడు (21) అందువల్ల ఓ విష్ణు ! మీరు ఇద్దరికి స్వతంత్రత లేదు. ప్రజాపతికి కూడా లేదు. కాని శంభువునకు స్వతంత్రత కలదు (22) ఓ బ్రహ్మ ! విష్ణు ! మీరిద్దరు మహేశ్వరుని ఎందుకు తెలుసుకోలేక పోతున్నారు. సర్వలోకములకు కర్త, విశ్వాధికుడు అని (23) ఆ శక్తి, ఉమాదేవి శంకరుని నుండి ఎప్పుడు విడిగా ఉండదు. శంభునకు ఆనందకారణము ఆ దేవి. ఆ గంతుకి కాదు (24) అందువల్ల రుద్రుడు విశ్వాధికుడు, స్వతంత్రుడు, నిర్వికల్ప డుడు దేవతలందరితో నమస్కరింప తగినవాడు. మీతో కూడా శంకరుడు నమస్కరింప తగినవాడే (25) ఈతనికి కర్త ఎవ్వరు లేరు. ఈతని కన్న అధికుడు లేడు. అట్లాగే నూరువిధాల రుద్రునితో సమమైనవాడు కూడ లోకంలో లేడు (26) అందువల్ల బ్రహ్మ విష్ణులార ! మీరు వృథాగా మోహం పొందకండి. అని ప్రణవం ఇట్లా చెప్పాక దీనిని విని బ్రహ్మ కేశవులు (27) శంభు నూయా మోహితులై అజ్ఞానమును వదలలేదు. ఇంతలో బ్రహ్మగొప్ప అద్భుతాన్ని చూచాడు (28) ఆకాశాన్నంతా వ్యాపిస్తూ, అనంత ఆదిత్యులతో సమానకాంతిగల తేజోమండలాన్ని, ఆరోశం మధ్యలో ఉన్న దాన్ని, విశ్వతో ముఖమైన దాన్ని చూచాడు (29) దాన్ని నిరూపించుటకు (చూచుటకు) బ్రహ్మ ఊర్ధ్వమైన ముఖమును సృష్టించెను. తపోబలంతో సృష్టింపబడ్డ ఐదవ ముఖంతో అతడు (30) మాటిమాటికి ఆ తేజోమండలాన్ని బ్రహ్మ నిరూపించ (చూడ) సాగాడు ఆ తేజస్సును చూడటం వల్ల కోపంతో ఆ ముఖం మండిపోయింది. (31) అనంతాదిత్య వంశమై మండుతున్న ఆ ఐదవ శిరస్సు ప్రలయంలో లోకాలను కాల్చుటకు ఏర్పడే బడబాగ్నివలే కన్పించింది. (32) ఆ తేజస్సు నీలలోహితుడు, వురుషుడుగా కన్పించింది. చూచి సృష్టికర్తయైన బ్రహ్మ పరమేశ్వరునితో ఇట్లా అన్నాడు (33) ఓ మహాదేవ ! నేను నిన్ను గుర్తించాను. పూర్వం నీవు నా నోటి నుండి బయటికొచ్చావు. ఓ శంభు రుద్రుడను పేరుగల నా కుమారుడవు (34) అని గర్వంతో కూడిన మాటలనగావిని మహేశ్వరుడు, కాల భైరవుడను పేరు గల పురుషుని పంపాడు (35) బ్రహతో చాలా కాలము కాల భైరవుడు యుద్ధం చేశాడు, మహా దేవాంశ సంభూతుడై శూలటంక (కత్తి) గదలను ధరించి (36) కాల భైరవుడు బ్రహ్మతో చాలా కాలం యుద్ధంచేసి బ్రహ్మయొక్క శుభ్రమైన ఐదవ ముఖాన్ని చూచాడు (37) ఊర్ధ్వగతమైన బ్రహ్మ ఐదవముఖాన్ని చూచి, అతి గర్వంకలదిగా చూసి, అతి కోపముతో కాల్చాడు (38).
పిదప ఆ ఐదవ ముఖాన్ని భైరవుడు కోపంతో ఛేదించాడు. కాలభైరవునితో హింసింపబడ్డ బ్రహ్మ అప్పుడు మరణించాడు. (39) ఈశ్వరుని అనుగ్రహంతో తిరిగి జీవితాన్ని పొందాడు. పిదప శశిభూషణుడైన శంకరుని చూచాడు (40) వాసుకి మొదలగు అష్ట భోగీంద్రులనే సొమ్ములతో అలంకరించబడ్డ పార్వతితో కూడిన శంకరుని మహాదేవుని బ్రహ్మ చూచి (41) మహా దేవానుగ్రహం వలన మాహేశ్వర జావాన్ని పొందాడు. వరేణ్యుడు వరదుడు గిరిశుడు అయిన శివుని మతించాడు. (42) బ్రహ్మమాట - చంద్రుని తల భూషణముగా గల ఓ గిరిశ నన్ననుగ్రహించు. నేను చేసిన అవతారాన్ని ఓదయానిధీ ! శంభు క్షమించు (43) నా గర్వాన్ని నీవు క్షమించు శంకర అని మాటిమాటికి స్తుతించాడు. సగము చంద్రుని తలలో ధరించిన ఆ సోమునికి నమస్కరించాడు. (44) అప్పుడు ఆ దేవుడు స్వాంశజుడైన ఈ బ్రహ్మకు ప్రసన్నుడై భయపడకు అని శంభుడన్నాడు భైరవునితో ఇట్లా అన్నాడు (45) ఈశ్వరోక్తి – ఈ జగత్తునకంతకు పూజ్యుడు బ్రహ్మ సనాతనుడు. చంపబడిన ఈ బ్రహ్మ శిరమును నీవు ఇప్పుడు ధరించు. (46) బ్రహ్మహత్యనుండి శుద్ధి కొరకు లోక క్షేమము కొరకు, ఓ భైరవ! నీవు నా ఆజ్ఞతో ఈ కపాలంతో భిక్షాటన చేయి (47) ఓ ఏవ్రులార ! ఇట్లా పలికి శంకరుడు నీలకంఠుడు, మహాదేవుడు, గిరిజార్థ తనువు అక్కడే అంతర్థానమైనాడు (48) బ్రహ్మ ముఖము భైరవుని పట్టుకొంది పావశుద్ధి కొరకు లోక క్షేమం కొరకు తిరుగు (49)చేతక పాలం ధరించి భైరవుడు భిక్షమెత్తని అని పలికి గిరిశుడు భయంకరమైన కన్యను (50) బ్రహ్మ హత్య అను పేరుగలదానిని క్రూరమైనదానిని బడబానలంతో సమానమైన దానిని ప్రేరేపించి గిరిశుడు భైరవునితో తిరిగి ఇట్లన్నాడు (51) ఈశ్వరోక్తి - భైరవ ! ఈ వ్రతాన్ని ఒక సంవత్సరకాలము బ్రహ్మ హత్యనుండి శుద్ధి కొరకు అన్ని తీర్థములు తిరిగు నీ శుద్ధి కొరకు అన్ని తీర్థములలో స్నానం చేయి (52) బ్రహ్మహత్యా నాశనం కొరకు వారణాసికి వేళ్ళు. వారణాసీ ప్రవేశంతో నీ అధమమైన బ్రహ్మహత్య (53) ముప్పాతిక భాగం నశిస్తుంది ఒక భాగం నశించదు. దాని నాశనాన్ని కూడా నీకు చెపుతాను. భైరవ దాన్ని విను. (54) దక్షిణ సముద్ర తీరమందు గంధమాదన పర్వతమందు సర్వప్రాణులకు ఉపకారం చేసే కొరకు నేను శుభమైన తీర్థాన్ని ఏర్పరచాను. (55) శివ అను పేరుగలది, పుణ్యప్రదమైనది, నీవు ప్రేమతో అక్కడికి వెళ్ళు. అక్కడికి ప్రవేశించినంత మాత్రమున నీ అశుభమైన బ్రహ్మహత్య (56) శివతీర్థ మాహాత్మ్యం వల్లనిఃశేషంగా నశిస్తుంది. నిశ్చయము. అని భైరవునితో రుద్రుడు పలికి క్షణంలో కైలాసమునకు వెళ్ళాడు.
పిదప కలపాణియైన భైరవుడు శివప్రేరితుడై దేవదానవ యజ్ఞాదిలోకములలో తిరిగాడు (58) అట్లా వెళ్తున్న ఆతనిని అతి భీషణమైన బ్రహ్మహత్య అనువరించసాగింది. భైరవుడు అన్ని తీర్థములను పుణ్య ప్రదేశమును (59) తిరిగి అదృష్టవశాత్తు వారణాసికి వెళ్ళాడు. వారణాసిని ప్రవేశించగానే శంకరాంశజుడైన భైరవుని (60) అతిథుత్పితమైన బ్రహ్మహత్య పాతకములో మూడు భాగములు నశించింది. శంకారంశజుడైన భైరవుని నాల్గవ భాగంతో పరుగెత్తించింది (61) ఆ భైరవుడు శూలపాణి, కపాలధారి, శివుని ఆజ్ఞతో పిదప గంధమాదన పర్వతమునకు వెళ్ళాడు. (62) అటనుండి శివ తీర్థమునకు వెళ్ళి భైరవుడు స్నానం చేశాడు. అక్కడ మహత్తరమైన శివ తీర్థంలో ఈతడు స్నానం చేసినంత మాత్రం చేత (63) అతి భీషణమైన బ్రహ్మహత్య ఏమిలే కుండ నశించి పోయింది. ఈ సందర్భంలో ఆతని ఎదుట శంభువు ప్రత్యక్షమైనాడు. ప్రాదుర్భవించిన మహాదేవుడు భైరవునితో ఇట్లా అన్నాడు. (64) ఈశ్వరునిమాట శివతీర్థంలో స్నానం చేసి నందువలన బ్రహ్మహత్య శేషముగా (65) పోయింది. ఓ భైరవ! నువ్రత! ఈ విషయంలో సందేహము లేదు. ఈ కపాలాన్ని కాశిలో ఏదో స్థలంలో నీవు స్థాపించు (66) అని పలికి శంభువు అక్కడే అంతర్థానమైనాడు. భైరవుడు కూడా అప్పుడు బ్రహ్మహత్యచే విముక్తుడై (67) శివతీర్థమాహాత్మ్యమువల్ల, వారణాసి వురికి వెళ్ళాడు. కపాలమును ఏదో ఒక ప్రదేశంలో స్థాపించాడు. ఆ స్థలము కపాలతీర్థమనే పేరును పొందింది (68) శ్రీ నూతుల వచనము - ఇ ప్రభావము కలది, పుణ్యప్రదము, ముక్తినిచ్చేది శివతీర్థము (69) మహా దు:ఖముల నశింపచేసేది, మహాపాతకముల నశించే సేది నరక క్లేశమును తగ్గించేది. వ్యర్థము నిచ్చేది, మోక్షమునిచ్చేది కూడా (70) ముక్తినిచ్చే శివతీర్థమాహాత్మ్యమును నేను చెప్పాను. దీనిని చదివిన నరుడు దుఃఖముల నుండి ముక్తుడౌతాడు. (71) అని స్కాంద మహా పురాణముందు ఏకాళీతి నహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్యమందు శివతీర్థ ప్రశంస యందు భైరవుని బ్రహ్మహత్య విమోక్షణ వర్ణన మనునది ఇరువది నాల్గవ అధ్యాయము.
