స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

14వ అధ్యాయము

తా శ్రీ సూతులిట్లనిరి - అమృతవాది యందు స్నానం చేసి, ఏకాంతరావువుని సేవించి జితేంద్రియుడైన నరుడు స్నానం చేయటానికి తర్వాత బ్రహ్మకుండానికి వెళ్ళాలి సేతుమధ్య మందు గంధమాదన పర్వతంలో మహాతీర్థము బ్రహ్మకుండమని ప్రసిద్ధమైంది. అది అన్ని దరిద్రములకు ఔషధము వంటిది బ్రహ్మహత్యల వదికోట్ల పాపములను నశింప చేసేది. బ్రహ్మకుండ దర్శనము నమస్త పాపరాశిని నశింపచేసేది. అనేక తీర్థ స్నానము, తపశ్చర్య, యజ్ఞములు, మహాదానములు వీటితో పనిలేదు. వీటన్నిటికన్న బ్రహ్మకుండదర్శనము గొప్పది. బ్రహ్మకుండంలో ఒక్కసారి స్నానం చేయటం వైకుంఠప్రాప్తికి కారణమౌతుంది. బ్రహ్మకుండంలో పుట్టిన భస్మాన్ని ధరించిన వానిని  ముగ్గురు దేవతలు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు అనునరిస్తారు. బ్రహ్మకుండంలోని భస్మంతో త్రిపుండ్రధారణ చేసిన వానికి కైవల్యము అరచేతి యందున్నట్టే అనుమానం లేదు. ఆ భస్మం యొక్క వరమ అణుభాగానైనా నొసటధరించిన వారికి వెంటనే ముక్తి లభిస్తుంది. దీన్ని విచారించవలసిన పనిలేదు. బ్రహ్మకుండ భస్మమును పైన చల్లుకొన్న నరుని పుణ్య ఫలము శంకరునికి గూడా తెలియునో తెలియదో బ్రహ్మకుండ మందు పుట్టిన భస్మమును ధరించని నరుడు చంద్రుడు నక్షత్రములున్నంత కాలము గౌరవనరకమందు వడ్డాడు. బ్రహ్మకుండ భస్మాన్ని చల్లుకోవటమో త్రిపుండ్ర ధారణమో చేయని నరుడు సుఖం పొందలేడు. బ్రహ్మకుండ భస్మాన్ని నిందిచిన నరుని ఉత్పత్తిలో సాంకర్యాన్ని పండితులు అనుమానించాలి. బ్రహ్మకుండమందలి భనము లోకములను పవిత్రం చేసేది.ఇతర భస్మములతో ఇది నమానమైనదనో తక్కువైనదనో చెప్పే నరుని ఉత్పత్తి (పుట్టుక విషయంలో వండితుడు సాంకర్యమును అనుమానించాలి బ్రహ్మకుండమందు కలిగిన ఈ భస్మము ఉండగా, వేరే భస్మంతో త్రిపుండ్ర ముధరించే మనుజుని ఉత్పత్తి విషయంలో పండితుడు సాంకర్యమును అనుమానించాలి. ఒక్కసారైనా ఈ భన్మంధరించని నరుని ఉత్పత్తి విషయంలో పండితుడు సాంకర్యాన్ని అనుమానించాలి. బ్రహ్మకుండ భస్మాన్ని బ్రాహ్మణునకు దానముచేసిన నరుడు, నాలు సముద్రముల వరకున్న భూమిని దానం చేసినంత పుణ్యము. ఈ విషయంలో అనుమానించరాదు. మూడుమార్లు నేను శపధం చేస్తున్నాను  సత్యము, నత్యము, సత్యము. చేయెత్తి పలుకుతున్నాను. బ్రహ్మకుండ ముందు పుట్టిన భస్మమును ధరించండి. ఓ ద్విజులారా! ఇది పవిత్రమైన భస్మము. బ్రహ్మయజ్ఞం వల్ల కల్గింది. పూర్వం భగవంతుడైన బ్రహ్మ సర్వలోక పితామహుడు  దేవతలందరి సన్నిధిలో గంధమాదన పర్వతమందు, శివుని శాపనివృత్తి కొరకు అన్ని క్రతువులను ఆచరించాడు  అనేక దక్షిణలు గల అన్ని అధ్వరములను శాస్త్ర ప్రకారము చేసి శివుని శాపము నుండి తొందరగా బ్రహ్మ ముక్తుడైనాడు.అట్టి ఈ తీర్థమునకు వచ్చి స్నానం చేసిన నరులు మహా దేవసాయుజ్యమును పొందుతారు. అనుమానంలేదు .

తా ఋషులిట్లనిరి - వ్యాసుని శిష్య! గొప్ప ప్రజ్ఞకలవాడ! పురాణార్థములు బాగా తెలిసినవాడ, పదునాలులోకము లకు సృష్టికర్త మైన చతురాననుని భారతీవతిని శంభుడు ఏ అవరోధంవల్ల శపించాడు. శివుడు ఆతనికి ఎటువంటి నమిచ్చాడు. ఇదంతా ఓముని! యథార్థంగా ఆదరంగా మాకు చెప్పండి శ్రీ మాతులిట్లనిరి - బ్రహ్మ విష్ణువులకు పరస్పరము పూర్వం కలహమైంది ఒక చిన్నకారణాన్ని పురస్కరించుకొని స్పర్ధతో పొగుడుకుంటున్న వారికి కలహమైంది నేనే కర్తను, నాకంటే వేరైన కర్త భూతలమందు లేడు ఈ రకంగా బ్రహ్మవిష్ణువునన్నాడు. బ్రహ్మను విష్ణువన్నాడు. పూర్వం వారిద్దరికి ఈ విధంగా వివాదము చాలా పెద్దగా జరిగింది ఈ రకంగా పరస్పరం కలహించుకుంటున్నంతలో, వారి గర్వమునశింపచేసే కొరకు వారికి ప్రబోధం కల్గించే కొరకు వారిద్దరి మధ్య స్వయంజ్యోతి, అనామయము ఐన లింగము ఉద్భవించింది. ఆ లింగాన్ని చూచి బ్రహ్మవిష్ణువులిద్దరు పరస్పరము ఆశ్చర్య పడ్డారు దేవతల ఎదురుగా వారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మనకు ఎదురుగా ఆద్యంతములు లేక, కన్పిస్తున్న మహాలింగము అనంతమైన ఆదిత్యులతో సమానమైన కాంతిగలది. అనంత అగ్నులతో సమానమైన వెలుగుగలది. మనిద్దరిలో ఈ లింగము యొక్క అంతమును ఆదిని చూచినవారు లోకంలో గొప్పవారు ఆతడే లోకకర్తా. ప్రభువు. నేను లింగము యొక్క అంతం వెతుకుతూ పైకి పోతాను.ఓ విషువు నీవు మూలాన్ని వెతుకుతూ క్రిందకుపో అని బ్రహ్మ అన్నాడు. అతని మాటలు విని విష్ణువు నం అని అన్నాడు ఈ విధంగా వారు ఒప్పందం కుదుర్చుకొని ఆద్యంతములు వెతుకుటకు బయలు దేరారు. విష్ణువు వరాహరూపధారియై వెతుకుటకు క్రిందకి వెళ్ళాడు. బ్రహ్మ హంస రూపాన్ని వరాహరూపాన్ని ధరించి పైకి వెళ్ళాడు. విష్ణువు అనేక సంవత్సరాలు క్రింది లోకములు వెతికి తన స్థానమునకు తిరిగి వచ్చి దేవతల సన్నిధిలో ఇట్లా అన్నాడు విష్ణువు వచనము - వేను ఈ లింగముయొక్క ఆదిని చూడలేదు అని నిజం చెప్పాడు పైలోకాలు వెతికి బ్రహ్మకూడా ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఇట్లా అన్నాడు, మోసంతో బ్రహ్మ  బ్రహ్మమాట - నేను ఈ లింగముయొక్క అంతాన్ని చూచాను అని అబద్ధం చెప్పాడు. మహేశ్వరుడు ఆ బ్రహ్మ విష్ణువుల మాటలు విని అబద్ధం చెప్పిన బ్రహ్మతో నవ్వుతూ ఇట్లా అన్నాడు ఈశ్వరుని మాట - ఓ బ్రహ్మ నాఎదురుగా అబద్ధం చెప్పావుగదా అందువల్ల లోకంలో నీకు పూజ అంతట, ఎల్లప్పుడు ఉండదు. పరమేశ్వరుడు విష్ణువుతో ఇట్లా అన్నోడు ఓ కమాలావతి ! హరి నీవు నిజం చెప్పావుగద కనుక వీరు వాతో వమానమైన పూజలభిస్తుంది అనుమానం లేదు అని 

॥ తా ॥ అప్పుడు బ్రహ్మ విషణుడై శంకరునితో ఇట్లా అన్నాడు. ఓ కరుణానిధి ! నా అపరాధాన్ని నీవు క్షమించు  జగదీశ్వరులైన - మీరు ఈ ఒక్క అపరాధాన్ని మన్నించాలి అని అనగా బ్రహ్మను ఓదారుస్తూ శివుడిట్లన్నాడు  ఈశ్వరుని మాట - బ్రహ్మ చెబుతున్నాను విను, నా మాట అబద్ధం కాదు. ఓ వత్స! నీవు తొందరగా గంధమాన పర్వతానికి వెళ్ళు. మిధ్యాదోషం పోవటానికి అక్కడ నీవు క్రతువుల నాచరించు సిదవ నీ పాపములన్నీ పోతాయి అనుమానం లేదు. పిదప త్రైతసార్ధకర్మలలో నీకెవ్వడూ పూజలభిస్తుంది. విగ్రహరూపంలో పూజలేదు  అని పలికి ఈశుడు అక్కడే అంతర్థానమైనాడు. పిదప బ్రహ్మ గంధమాదన పర్వతానికి వెళ్ళాడు  క్రతువులకర్తయైన పార్వతీపతిని క్రతువులతో యజించాడు. ఇట్లా ఎనుబది వేల సంవత్సరాలు చేశాడు  పౌండరీకము మొదలగు అన్నిరకములైన అధ్వరములతో, అనేక దక్షిణలతో, ఇంద్రాదిదేవతలందరి సన్నిధిలో శివుని యజించాడు. వానితో శంభుడు సంతుషుడైనాడు. ఈతనికి వరమిచ్చాడు  ఈశ్వరుని వచనము - ఇక్కడ చేసిన ఈ యజ్ఞములతో, నీవు అబద్ధమాడిన దోషం పోయింది  ఓ చతురానన! బ్రౌత సార్ధ కర్మలలో నీరు పూజలభిస్తుంది. నీరు విగ్రహరూపంలో పూజ జరగదు  నీ ఈ యాగస్థలము బ్రహ్మకుండమని ప్రసిద్ధిని పొందుతుంది. ముల్లోకములలో ఇది పావనాశకము పుణ్యప్రదము బ్రహ్మకుండమనే ఈ తీర్థంలో ఒకసారి స్నానమాచరించినవారి ముక్తిద్వారపు గొళ్ళము ఆక్షణంలోనే తొలగి పోతుంది బ్రహ్మకుండంలో పుట్టిన భస్మమును లలాటమున ధరించిన వారు మాయాకవాటమును ఛేదించుకొని ముక్తిద్వారం చేరుకుంటారు బ్రహ్మకుండమందలి భస్మమును లలాటమున ధరించని వారు తమతల్లి తండ్రి బీజంవల్ల కల్గిన పుత్రుడు కాడు బ్రహ్మకుండమందలి భస్మధారణవలన వదివేల బ్రహ్మహత్యల దోషము, పదివేల సురాపానముల దోషము వశిష్టుంది  గురుతల్పముల పదివేల కొలది దోషము, పదివేల బంగారు దొంగతనముల దోషము నశిస్తుంది. దాని నంనర్గం వల్ల వచ్చిన వదివేల దోషము నశిస్తుంది. ఓ విధి! నేను సత్యం చేప్పాను బ్రహ్మకుండంలోని భస్మధారణ వైభవంవలన క్షణమాత్రంలో భూతప్రేతపిశాచాదులు నశిస్తాయి అని పలికి ఈశుడు అక్కడే అంతర్థానమైనాడు

తా ॥ యజ్ఞములు నమాప్తమై నాక జితేంద్రియులై నమునులు  ఇంద్రాది దేవతలు, సిద్ధ చారణ కిన్నరులు ఇతరదేవతాసమూహములు గంధమాదన పర్వతమందు  స్వయంగా రుద్రుడు సేవించిన ఆ యజ్ఞభూమినాశ్రయించి, దాని వైభవాన్ని తెలుసుకొని నిరంతరము అక్కడే ఉన్నారు. బహుదక్షిణాకములైన యజ్ఞములను శాస్త్ర ప్రకారము సమాప్తిచేసి, శివుని నుండి కోరికలను పొందిన బ్రహ్మ నత్యలోకమునకు వెళ్ళాడు.  నాటినుండి దేవతలు, మునులు, బ్రాహ్మణులు, బ్రహ్మకుండంచేరి శాస్త్ర ప్రకారము యాగములు చేశారు  అందువలన యజ్ఞం చేయదలచిన నరులారా యజ్ఞములను ఇక్కడే చేయాలి మనుజదేవమున్వీరులతో నమస్కరింపబడినట్టిది, సమస్త సంసార పావములను నశింపచే సేది సకల పాప ములనశింపచేసేది, సకలార్థములనిచ్చేది శుభకరమైనది ఈ బ్రహ్మకుండము అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఎనబది ఒక్కవేల సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్యమందు బ్రహ్మకుండ ప్రశంనయందు బ్రహ్మశాప విమోక్షణ వర్ణన మనునది పదునాల్గవ అధ్యాయము సమాప్తము