స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

17వ అధ్యాయము

శ్రీ సూతులిట్లనిరి - కక్షివుడు తన తండ్రితో తిరిగి ఇట్లా అన్నాడు ఇక్కడికి నేను ఉదంకుడను గురువుచే పంపవబడ్డాను. (1) ఈ అగస్త్యతీర్థమునకు వచ్చాను. గురువుతో ప్రేరేపింపబడి స్వనయుని కూతురు వివాహం జరిగే కొరకు వచ్చాను (2) ఆతడు చెప్పిన ఉపాయాన్ని ఇక్కడి చేస్తూ ఉన్నాను. మూడు సంవత్సరాల తర్వాత నాకు వివాహం జరిగే ఉపాయం కలవాణ్ణి (3) స్వనయుడు అనుకోకుండా ఇక్కడే ఉన్న నన్ను చేరాడు. నా దగ్గరకు వచ్చి నాకూతురు ను నీకిస్తానవేమాట పలికాడు (4) నా మాటననుసరించి ఈ రాజు నిన్ను పిలిపించాడు అని తండ్రితో, పలికి కక్షీవుడు విరమించాడు. (5) రాజుగారి పురోహితుడు సుదర్శనుడను బ్రాహ్మణుడు రాజైన స్వనయుని దరికి నివేదించుటకు వెళ్ళాడు (6) ఆ సుదర్శనుడు న్వనయరాజును సమీపించి దీర్ఘతమముని వచ్చాడని చెప్పాడు (7) ఆ న్వనయరాజు ముని వచ్చాడని పురోహితుని వల్లవిని, చూచుటకై వటమంటపం నుండి త్వరగా బయటికి వచ్చాడు (8) అగస్త్య తీర్థ తీరంలో కొడుకుతో కూడిన ఋషివి, ఇంద్రుడు బ్రహ్మను చూచినట్లు న్వనయురోజు చూచాడు (9) లోకమంగలకరములైన దీర్ఘతమునిచరణములకు రాజునమస్కరించాడు. రాజును లేపి దీర్ఘతమముని (10) స్వనయనృవుని ఆశీర్వదించాడు. ఇంతలో వచ్చిన ఉదంకఋషి కూడా (11) ధనుష్కోటి యందు రామ సేతువు యందు శిష్యగణముతో స్నానము చేయుటకు చుట్టబడి ఉన్నాడు. లక్ష సంఖ్యగలమునిగణములో మునీశ్వరుడు (12) ఉదంతుడు ఈ అగస్త్య తీర్థంలో స్నానం చేయటానికి వచ్చాడు. వచ్చిన ఉదంతుని చూచి కక్షివుడు ఆతనికి నమస్కరించాడు (1) శిష్యునకు గురువు ఆశీర్వాదము చేశాడు. అప్పుడు దీర్ఘతముడను బ్రాహ్మణుడు ఆ ఉదంకమహామునిని (14) కుశలమడిగాడు. ఆతడు ఇతని క్షేమమడిగాడు. ఆ మునీశులిద్దరు అన్నిలోకములందు ప్రసిద్ధమైనవారు (15) పాపనాశకమైన కథలను చెప్పసాగారు. ఆ రాజు కూడా ఉదంకమునిని నమస్కరించాడు. (16) ఆ స్వనయునకు ఉదంకుడు కూడా ఆశీర్వాదమిచ్చాడు. సంతుషుడైన రాజు ఇట్లా అన్నాడు. (17) ఆ దీర్ఘతమనునితో వివాహము చేయండి అని. ఆ దీర్ఘతమముని సరె అట్లాగే - కానీ అని అన్నాడు (18) మంచి ముహూర్తమందు రేపే చేయండి ఓ బుద్ధి మాన్ ! ఈ గంధమాదన పర్వతమందే పాణి గ్రహణం చేయండి.

అందువలన అంతః పురకన్యను తొందరగా ఇక్కడికే తీసుకురండి, అని న్వనయరాజు పలికి, తన వటమంటపమునకు వెళ్ళి (20) నూరు మంది వృదులను అట్లాగే షండులను పిలిచి కన్యను, అంతః పురమును రప్పించుటకు పంపించాడు (21) స్వనయునితో వంపబడిన షండముఖ్యులు మనోవేగం కలగుణములనెక్కి మధురానగరికి వెళ్ళారు (22) అంతః పురమునకు వేగంగా వెళ్ళి విషయమంతా చెప్పి కన్యను అంతఃపురంతో పహా తీసుకు వచ్చారు (23) ఆ తరువాతి రోజు మంచి సమయమున దీర్ఘతమ ఋషి కొడుకుతో గోదానము మొదలగువాటిని శాస్త్రప్రకారము నిర్వర్తింపచేశాడు (24) గోదానాది కర్మలు కక్షివుడు నిర్వర్తించాక, రాకుమార్తెను వివాహమాడుటకు తండ్రితో గురువుతో కూడా కలిసి (25) వాలుగు దంతములు, పెద్ద శరీరముగల తెల్లని ఏనుగునెక్కి ఆనందంతో రెండవ ఇంద్రునిలో వెలిగిపోతూ (26) మనోరమ అనుకన్య యొక్క కోరికను నెరవేర్చబోతూ, స్వస్తి వాచనం పలుకుతున్న అవేకవేల మంది బ్రాహ్మణులతో కలిసి (27) తోరణములతో అలంకరించబడ్డ ద్వారముగల రాజర్షి యొక్క వటమంటవమునకు, మంగళ కృత్యములు నిర్వర్తించుకున్న ఈ కక్షివుడు ఆనందంతో వెళ్ళాడు. (28) మంగళకర భూషణములతో అలంకరించబడ్డ ఆ వ్వనయకన్య వాలుదంతములు, పెద్ద శరీరము తెల్లనైనది ఐన ఏనుగు పైనున్న (29) వస్తున్న తన పెళ్ళి విషయంలో ఉత్సాహంగల కశ్రీవునిచూచి, నేను చేసిన ప్రతిజ్ఞ ఇవృటికి వేరవేరింది అని

ఆనందపడింది(30).

కక్షివుడు దీర్ఘతమునితో, అట్లాగే ఉదంకునితో కూడా కలిసి వట ఆకారం గల బహిర్ద్వారం నుండి క్రమంగా రాజు దగ్గరకు వెళ్ళాడు (31) స్వనయుడు తన దగ్గరకు వచ్చిన కక్షివుని చూచి తనపురోహితునితో కూడా లేచి ఎదురొచ్చాడు. (32) కన్యకాపరిచారికలు వరుడైన కక్షీవునకు వెండి బంగారు పాత్రలతో నీరాజన విధిని ఆచరించారు {33) స్వనయునితో పిలువబడి బ్రాహ్మణులతో చుట్టబడి లక్ష్మీవంతుడైన కక్షీవుడు రాజమందిరము ప్రవేశించాడు (34) పరునితో కూడిన దీర్ఘతమసుని, ఉదంతుని తన ఇంటికి వినయంగా తీసుకువెళ్ళాడు రాజు. (35) రాజు ఉదంక దీర్ఘతమసులకు ఆర్ఘ్యమిచ్చాడు. వస్త్ర చామర తోరణములతో అలంకృతమైన ప్రపొమధ్యయందు (36) పెండ్లికొడుకు, దీర్ఘతముడు, ఇతరులు ఉదంకుడు మొదలగు మునులు కూర్చున్నారు. మంత్రులతో, పురోహితునితో కూడి స్వనయుడు ఉన్నాడు. (37) పిదవ సుకేశియైన కన్యయైన తన కూతురు మనోరమను కంఠమందు భూషణములతో అలంకరించబడ్డదాన్ని, దివ్యమైన వస్త్రములను ధరించిన దానిని (38) బింబోష్ఠిని, సుందరమైన సర్వావయవములు: కలదానిని, వనమైన ఉన్నతస్తనములు కలదానిని, మహాజనులతో నిండిన ప్రహమధ్యకు తీసుకొని వెళ్ళారు {39) పిదవ కన్యక చంపకముల మాలను వరుని కంఠమందు, జనులమధ్యలోశుభలక్షణములు కల మనోరమ వేసింది (40) పిదవ ఉదంకుడు వచ్చి అగ్నిని ప్రతిష్టాపించి, అగ్ని ముఖ పర్యంతము, లాజాహోమము మొదలగునవి చేసి (41) వరునితో ఆకన్య పాణిని గ్రహింపచేశాడు. ఉదంకుడు అక్కడ సర్వకర్మలు చేయించాడు (42) అప్పుడు బ్రాహ్మణులు వరుడు వధువు వీరిద్దరికి ఆశీర్వాదములిచ్చారు. పిదవ రాజు స్వసయుడు వరుని, దీర్ఘతముని (43) ఉదంకుని వరపక్షము వారిని, తన వక్షమువారిని మూడు లక్షల బ్రాహ్మణులను షడ్రసములతో భుజింపజేశాడు (44) ఫిదవ తాంబూలము మొదలగు వానితో అనేక విధముల గౌరవించాడు. మునిశ్రేషునితో పోయి వస్తానని చెప్పి ఉదంకుడు తన ఆశ్రమమునకు వెళ్ళాడు (45) ఇతర బ్రాహ్మణులందరు తమతమదేశములకు వెళ్ళారు. ఈ రకముగా వివాహము కక్షివుడు రాజుకన్యకకు జరిగాక.

ఆ ఉత్తమగజము అగస్త్యతీర్థమును ప్రవేశించి కన్పించకుండా పోయింది. పిదవ దీర్ఘతముడు కొడుకు కోడలుతో కూడి (47) ఇష్టములను తీర్చే అగస్త్య మహాతీర్థంలో స్నానంచేసి, సర్వలోకములలో ప్రసిద్ధమైన ఆ తీర్థమును ప్రశంసిస్తూ (48) తన వుణ్యప్రదమైన వేదారణ్యమునందలి ఆశ్రమునకు వెళ్ళుటకు మనస్సులో అనుకున్నాడు. ఆరాజుతో, పోయివస్తానని ఆముని చెప్పాడు. (49) స్వనయుడు ఆరాజు సంతోషంతో తన కూతురునకు స్త్రీధనముగా లక్షబంగారు నాణెములను ఇచ్చాడు (50) వేయిఆవులను,

వేయిమంది దాసీజనమును, ఐదునూర్ల గ్రామములను కూతురు మీది ప్రేమతో ఇచ్చాడు (51) పదివేల దివ్యవస్త్రములను, నూరు సొమ్ముల పెట్టెలను, వేయి హారములను కూతురిపై ప్రేమతో ఇచ్చాడు (52) ఇదంతా తీసుకొని కొడుకుతో కోడలితో కూడి ముని, రాజు అనుమతి పొంది వేదకాననమునకు బయలుదేరాడు (53) దీర్ఘతమముని వేదారణ్యమును చేరి కొడుకు కోడలుతో సహా సుఖంగా ఉన్నాడు (54) వేదాటవీనాథుని సేవిస్తూ, భుక్తిముక్తులనిచ్చేస్వామిని సేవిస్తూ కక్షివుడు భార్యతో కూడా చాలా కాలమున్నాడు (55) స్వనయరాజర్షి కూడా అగస్త్యుడు నిర్మించిన పుణ్యప్రదమైన ఆ తీర్థముందు నర్వసైనికులతో కూడి స్నానం చేసి (56) అంతఃపురజనాన్ని తీసుకొని ఆనందంగా తననగరం కువెళ్ళాడు. అగస్త్యతీర్థమాహాత్మ్యంవల్ల ఈ విధముగా కక్షవతుడనుమునికి ఇతురులకు సులభసాధ్యంకాని విధముగా వివాహం జరిగింది. (57) శ్రీనూతులిట్లనిరి - ఈ ఇతిహాసము పుణ్యప్రదమైంది వేదనిధమైనది ఓ మునులారా! (58) ఈ కథ వినటం ధన్యత నిచ్చేది. కీర్తిని ఆయుష్యమును సౌభాగ్యమును పెంచేది. మానవులందరు వినతగినది చదువతగినది ఇది (59) పురాతనమైన ఈ ఇతిహానమును చదివిన వినినవారికి ఇక్కడ, పరలోకంలో కూడా క్లేశము దారిద్ర్యము ఉండవు (60) అని శ్రీ స్కాంద మహాపురాణముందు ఏకాశీతి సహస్త్ర సంఖ్యగల తృతీయమైన బ్రహ్మఖండమందు సేతమాహాత్మ్యమందు కక్షివుని వివాహము జరిగిన విధమును వర్ణించుట యనునది పదునేడవ అధ్యాయము నమాప్తము.