స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
41వ అధ్యాయము
శ్రీ సూతులిట్లనిరి - ఇప్పుడు గాయత్రి సరస్వతులను తీర్థములను ఆధారం చేసుకొని పవిత్రమైన కథను ఒకదానిని చెప్తాను ఓద్విజులార ! (1) కశ్యపుడను పేరుగల ఒక ద్విజుడు పూర్వము శుభమైన ఈ తీర్థముల రెంటిలో స్నానం చేసి చాలా గొప్ప పావం నుండి నరమిచ్చే దాని నుండి ముక్తుడైనాడు (2) ఋషులిట్లన్నారు - ఓ ముని! కశ్యపుడను పేరుగల ఈతడు ఏం పాపం చేశాడు. ఈ తీర్థములు రెంటిలోస్నానం చేసి క్షణంలో ముత్తుడైనాడు గదా (3) ఓనూత ! దయచేసి శ్రద్ధగలిగిన మాకు దీనిని చెప్పండి. మీ మాటల అమృతంతో తృవులమైన మాకు దప్పిక కూడా కలగదు అని (4) శ్రీ సూతులిట్లన్నారు - గాయత్రి సరస్వతి తీర్థముల మాహాత్మ్యమును ప్రతిపాదించే ఇతి హాన మును వున్నాను ఇది వినే వారి పాప ములను నశింప చేస్తుంది (5) అభిమన్యుసుతుడు పరీక్షితుడను పేరుగల రాజు హస్తినా వురంలో ధర్మంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు (6) ఆరాజు ఒకసారి వేట యందాసక్తి కలవాడై అడవిలో తిరిగాడు. అరువది సంవత్సరాలుగల ఆరాజు ఆకలి దప్పులతో పీడింపబడి (7) ఆతడు అడవిలో ఆసక్తితో తప్పిపోయిన ఒకమృగాన్ని వెతుకుతూ ధ్యాన రూఢుడైన ఒకమునిని చూచి చీరవస్త్రముగల ఆమునితో ఇట్లా అన్నాడు. (8) ఓ ముని! ఇప్పుడు నేను అడవిలో బాణంతో ఒక మృగాన్ని కొట్టాను. ఓ విద్వాంసుడ ! భయథాతరమై పరుగెత్తిన దానిని నువ్వు చూశావా (9) నమాధినిషుడై మౌనంగా ఉండటం వల్ల ఆతడేమి మాట్లాడలేదు. పిదప ఈతడు ధనుస్స అల్లితాడుతో ఆ మహాముని భుజమందు (10) చనిపోయిన పామును వేసి కోపంతో తన నగరానికి వెళ్ళాడు. ఆ మునికి శృంగి అను పేరుగల ఒక కొడుకు ఉండేవాడు (11) ఓ బ్రాహ్మణులార ! ఆ శృంగికి కృశుడను మిత్రుడు ఉన్నాడు. ఆ కృతుడను మిత్రుడు మిత్రుడైన శృంగితో ఇట్లా అన్నాడు. (12) నీ తండ్రి ఇప్పుడు చచ్చిన పామును భుజం పై మోస్తున్నాడు అని. ఓ మిత్రమ! నీకు దర వ్యర్థంగా మదించిపోవద్దు అని (13) శృంగి కోపంతో రాజును శపించదలచి ఇట్లా అన్నాడు. మూడచేతనుడై నా తండ్రి పై శవసర్పాన్ని ఉంచినవాడు (14) తక్షకుడను పాము కరవబడి ఏడురాత్రులలో చనిపోని అని సుతుడు సుభద్రకుమారుడైన పరీక్షిత్తును ఇట్లా శపించాడు (15).
శమీకుడను పేరుగల ఆతని తండ్రి కొడుకు రాజును శపించాడని విని ముని పుంగవుడు తన తనయుడైన శృంగితో ఇట్లా అన్నాడు(16) సర్వలోకములకు రక్షకుడైన రాజును ఎందుకు శపించాడు. రాజులేని లోకంలో మనము మంచిగా ఎట్లా జీవిస్తాము (17) కోపంవల్ల పాతకమేర్పడిందినాకు సుఖం లభించదు. తనకు కల్గిన కోపాన్ని ఓర్పుతో తొలగించుకోగలిగిన వాడు (18) ఈ లోకంలో, పరలోకంలోను ఈతడు మిక్కిలి సుఖంపోందుతాడు. క్షమ కలిగిన పురుషులు మాత్రమే ఉత్తమమైన శ్రేయస్సును పొందుతారు (19) పిదప శమీకుడు తన శిష్యుడైన గౌరముఖుడను వానితో ఇట్లా అన్నాడు. ఓ గౌరముఖ నీవు వెళ్ళి పరీక్షిత్తురాజుతో చెప్పు (20) నా కొడుకు ఇచ్చిన తక్షకుడనే పాముతో కరువబడుతావు అనే శాపాన్ని చెప్పు. ఓ మహామతి ! నీవు నా సమీపానికి త్వరగా తిరిగిరా అని (21) శమీకుడు చెప్పగానే గౌరముఖుడు రాజు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి సౌభద్రుడైన వరీతురాజుతో ఇట్ల చెప్పాడు (22) నీవు వేసిన మృత సర్పాన్ని తన తండ్రి భుజముల పై చూచి కోపంతో శమీతుని కొడుకైన శృంగి నిన్ను శపించాడు. (23) నేటి నుండి ఏడవ రోజున తక్షకుడను గొప్ప సర్పము కరువగా ఆ విషాగ్నిలో త్వరగా అభిమన్యుని కుమారుడు దగుడుకాని (24) అని ఆ ముని కుమారుడైన శృంగి ఓ రాజ! నిన్ను శపించాడు. దీనిని చెప్పటానికి ఆతని తండ్రి నన్ను నీ దగ్గరకు పంపాడు (25) అని ఆ రాజుతో పలికి త్వరగా గౌరముఖుడు తిరిగి వెళ్ళాడు. గౌరముఖుడు వెళ్ళాక, ఆ పిదప రాజు శోకవరాయణుడై (26) ఆకాశాన్ని తాకే ఎతైన ఒకే స్తంభము గల చాలా విశాలమైన, మధ్యలో నాట్యమంటపమును రాజు కట్టించాడు (27) మహాగరుడమంత్ర మెరిగిన, ఔషధముల నెరిగిన వైద్యులతో తక్షకుని విషాన్ని తీసివేయుటకు ప్రయత్నినూ సిద్ధమై ఉన్నాడు (28) అనే కులైన దేవ బ్రహ్మర్షి రాజర్షి శ్రేషులతో పరివేష్టింపబడి రాజు విష్ణు భక్తి గలవాడు ఆ ఎత్తైన మండపంలో ఉన్నాడు. (29) ఆ నమయమందు మాంత్రికోత్తముడైన కాశ్యపుడను బ్రాహ్మణుడు తక్షకుని మహా విషము నుండి రాజును రక్షించటానికి బయలుదేరాడు. (30) విప్రశ్రేషుడు దరిద్రుడు ధనకాముకుడై ఏడవరోజు బయలుదేరాడు. ఇంతలో తక్షకుడు కూడా బ్రాహ్మణ రూవంతో వచ్చాడు (31) మార్గమధ్యంలో కశ్యపుని చూచి అతడు ఇట్లా అన్నాడు.
ఓ మహాముని ! బ్రాహ్మణ ! నీవు ఈ రోజు ఎక్కడికి వెళ్ళుచున్నావు నాకు చెప్పు (32) అని అడుగగా కాశ్యపుడు తక్షకునితో ఇట్లా చెప్పాడు. పరీక్షిన్మహారాజును ఈ రోజు తక్షకుడు తన విషాగ్నితో (33) కరువబోతున్నాడు. దానిని తగ్గించటానికి అతని సమీపానికి నేను వెళ్తున్నాను. అని చెప్పిన ఆ బ్రాహ్మణునితో తక్షకుడు తిరిగి ఇట్లా అన్నాడు. (34) ఓ ద్విజశ్రేష్ఠ నేనే ఆ తక్షకుణ్ణి. నేను కరిస్తే చికిత్స చేయటం సాధ్యం కాదు. నూరు సంవత్సరాలకైన వదివేల మంత్రాలతోనైనా (35) నేను కరిచిన దానిని చికిత్స చేయటానికి నీకు ఇప్పుడు శక్తి ఉంటే, అనేక యోజనముల ఎత్తైన ఈ వటవృక్షాన్ని నేను (36) కరుస్తున్నాను. దీనిని నీవు బ్రతికించు. ఆవిద పే నీవు నమరుడవౌతావు, అని పలికి తక్షకుడు అప్పుడు ఆ వృక్షాన్ని కరిచాడు. (37) మిక్కిలి ఎత్తైన ఆ వృక్షము భస్మం అయిపోయింది కూడా. అంతకుముందే ఒక మనిషి ఆ వృక్షాన్ని ఎక్కి ఉన్నాడు (38) తక్షకుని విషజ్వాలలో అప్పుడు ఆతడు కూడా దగ్గమైనాడు. ఆ కాశ్యవతక్షకులు ఆ మనిషిని గమనించలేదు (39) తక్షకుడు వింటుండగా కాశ్యవుడు ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు నా ఆ మంత్ర శక్తిని అందరు బ్రాహ్మణులు చూడండి (40) అని వలికి విషాగ్నితో భస్మమైన ఆ వృక్షాన్ని కాశ్యపుడు మాంత్రికోత్తముడు తన మంత్ర శక్తితో బ్రతికించాడు. (41) ఆ మనిషి కూడా ఆ వృక్షంతో పాటు తిరిగి బతికాడు. అప్పుడు మంత్ర కోవిదుడైన కాశ్యవునితో ఆ తక్షకుడు ఇట్లా అన్నాడు. (42) ఓ బ్రాహ్మణ! మునివాక్కు అబద్ధంకాకుండా చూడు. రాజు నీకిచ్చే ధనం కన్నా రెట్టింపు ధనాన్ని (43) నేను నీకిస్తాను. ఓ బ్రాహ్మణ! త్వరగా మరిలిపో, అని పలికి అమూల్యమైన రత్నములను ఆ తక్షకుడు ఆతనికిచ్చి (44) మంత్రకోవిదుడైన కాశ్యపుడను ఆ బ్రాహ్మణుని మరలించేశాడు. జ్ఞానదృష్టితో ఆ కాశ్యవుడు రాజు అల్పాయుష్మంతుడని గ్రహించి (45) తక్షకుని నుండి రత్నాలు తీసుకొని తన ఆశ్రమానికి మౌనంగా వెళ్ళి పోయాడు. ఆ క్షణంలో తక్షకుడు అన్ని పాములను పిలిచి ఇట్లా అన్నాడు. (46) మునుల వేషములు ధరించి మీరు ఆ రాజు దగ్గరకు చేరి ఆ పరీక్షిత్తు కు ఉపహార ఫలములను త్వరగా ఇవ్వండి (47) అని అనగా అట్లాగే అని పాములన్నీ రాజునకు ఫలములనిచ్చాయి. అప్పుడు తక్షకుడు అక్కడ ఒకరేగుపండులో (48) పురుగు రూపమును ధరించి రాజును కరవటానికి సిద్ధంగా ఉన్నాడు.
రాజు బ్రాహ్మణ రూపములను ధరించిన సర్పములతో ఇవ్వబడిన వానిని (49) పండ్లనన్నిటిని పరీక్షిత్తు మంత్ర వృద్ధులకు ఇచ్చి, కుతూహలంతో లావైన ఒక పండును చేతిలోకి తీసుకున్నాడు. (50) ఇంతలో సూర్యుడు అస్త్రాచలంలో మునిగాడు. అక్కడున్న మనుషులు ఋషివాక్కు అబద్ధం కారాదనీ (51) బ్రాహ్మణులు, రాజులు అందరు పరస్పరమను కున్నారు. అందరు ఇట్లా అంటుండగా ఆ పండులో (పురుగు) కన్పించింది (52) ఎర్రని పురుగును అందరు రాజు కూడా పండులో చూచారు. ఈ పరుగునన్నీవేళ కరుస్తుందా ఏమి అని రాజు అన్నాడు (53) ఓ బ్రాహ్మణులార! పురుగుతో నహి ఆ పండును చెవిలో పెట్టుకున్నాడు. పూర్వం పురుగు రూపంలో వండులో ఉన్న తక్షకుడు ఆవుడు (54) ఆ వండు నుండి త్వరగా బయటికి వచ్చి రాజు దేహాన్ని చుట్టుకున్నాడు. రాజును తక్షకుడు చుటుకోగా పక్కనున్న వారు భయంతో పరుగెత్తారు (55) ఆ పిదప రాజు, విప్రులు తక్షకుని బలమైన విషాగ్నితో ఆ భవనము త్వరగా కాలి భస్మంగా మారిపోయింది (58) ఆ రాజవరు ఊర్వదైహికక్రియలను చేసి, పురోహితులతో కూడిన మంత్రులు జనమే జయుడను పేరు గల ఆతని పుత్రుని రాజ్యంలో (57) రాజ్యరక్షణ కాంక్షతో రాజుగా అభిషేకించారు. తక్షకుని నుండి రాజును రక్షించటానికి వచ్చిన కాశ్యపుడను పేరుగల (58) బ్రాహ్మణుడు జనులందరితో నిందింపబడి ఓ బ్రాహ్మణులార! శిషులందరిచే దూషింపబడుతూ దేశాలన్ని తిరిగాడు (59) గ్రామమందుగావి ఆశ్రమముందుగా ఈతడు స్థానాన్ని పొందలేక పోయాడు. ఏ ఏ దేశాలకు ఈతడు వెళ్ళాడో అక్కడక్కడ మహానులతో (60) ఆయా దేశములనుండి విరముడై శాకల్యుని శరణు వేడాడు. కాశ్యపుడు జనులతో నిందింపబడి కల్యమునికి నమస్కరించి శాకల్య మహాత్మునకు ఇట్లా విజావన చేశాడు (61) కాశ్యపుని వచనము - భగవాన్ ! అన్ని ధర్మముల ఎరిగినవాడ ! శాకల్య! హరివల్లభ! (62) మునులు బ్రాహ్మణులు నుహృజనులు ఇతరులు నన్ను నిందిస్తున్నారు. వన్న నరులెందుకు చిందిస్తున్నారో దానికి కారణం నాకు తెలియటం లేదు (83) బ్రహ్మహత్య, సురాపానము, గురుప్తిగమనము, దొంగతనము, సంసర్గదోషము వీటిని వేట నేనాచరించలేదు (84) ఇతరమైన పాపములను కూడా ఓ ముని! నేనాచరించలేదు. ఐనాజనులు, బాంధవులు మొదలగువారు అనవసరంగా నన్ను నిందిస్తున్నారు (65) ఓ శాకల్య ! నీకు తెలిసుంటే నేను చేసిన దోషాన్ని చెప్పండి. కశ్యపుడిట్ల పలుకగా శాకల్య మహాముని క్షణం ధ్యానించి ఆకాశ్యవునితో ఇట్లా అన్నాడు (66).
శాకల్యుని వచనము - పరీక్షిత్తు మహారాజును తక్షకుని నుండి రక్షించటానికి నీవు . (67) వెళ్ళాడు. సగం దారిలోనే నీవు తక్షకునితో వారింపబడినావు. విషరోగాది పీడితుని (రాజును) చికిత్స చేయుటకు సమర్ధుడై యుండి (68) లోభంలో రక్షించని వానిని బ్రహ్మవూతకుడంటారు. క్రోథం వల్ల కామంవల్ల భయంవల్ల లోభంవల్ల మాత్సర్యంవల్ల వేహం వల్ల గాని (69) విషరోగాతురుడైన నరుని రక్షించని వాడు బ్రహ్మహంతకుడు, సురాపి, దొంగ, గురుతల్పగుడు (70) సంవర్గదోషదుష్టుడు కూడా ఆతనికి నిష్కృతి లేదు. కన్యను అమ్మేవాడు, గుజ్రాన్ని అమ్మేవాడు (71) కృతఘ్నుడు వీరికి శాస్త్రములలో ప్రాయశ్చిత్తముంది. విషరోగాతురుడైన వానికి న మరుడై ఉండి రక్షించనివానికి (72) నిష్కృతి పదివేల ప్రాయశ్చిత్తములతో కూడా చెప్పబడలేదు. నుకృతి ఐన నరుడు ఆతనితో నహపంక్తిలోభోజనము చేయరాదు. (73) అతనితో కూడా మా బ్లాడరాదు. అట్టి నరుని ఎక్కడా చూడరాదు. ఆతనితో మాట్లాడినంత మాత్రము చేత మహాపాతక భాజనుడౌతాడు (74) పరీక్షిత్తు మహారాజు పుణ్యశ్లోకుడు ధార్మికుడు విష్ణు భక్తుడు మహాయోగి చతుర్వర్ణములను రక్షించేవాడు (75) వ్యానవుత్రుని నుండి హరికథలను భక్తి పూర్వకముగా విన్నాడు. ఆ రాజును రక్షించకుండా నీవు తక్షకుని మాటలతో మరలినావు గదా (76) ఆకారణంగా విప్ర శ్రేషులతో, బాంధవులతో కూడా దూషింపబడుతున్నావు. ఆ పరీక్షిత్తు మహారాజు క్షణ జీవీతుడైనా (77) మరణించే వరకు బుధులు. ఆతనికి చికిత్స చేయాలి. మరణించే మానవునకు కంఠంలో ప్రాణమున్నంతవరకు (78). చికిత్స చేయాలి. కాల గమనము । వైద్య సముద్రముల దాటగలిగిన వారు ప్రాచీన శ్లోకాన్ని చెబుతారు (79} అందువల్ల చికిత్స యందు శక్తుడవై ఉండీ, చికిత్స చేయకుండానే అధర్మ మార్గంలో మరలినావు. కనుక నీవు ఆతనిని చంపిన వాడవైనావు. శాకల్యుడు ఇట్లా చెప్పగానే కాశ్యపుడిట అన్నాడు (80) కాశ్యప వచనము - ఓ సుఁవతుడ ! వా ఈ దోష శాంతికొరకు ఉపాయం చెప్పండి (81) దాని వలన నన్ను సుహృజ్జనులతో కూడిన బంధువులు స్వీకరించాలి. (82) శాకల్య! హరి వల్లభ నీవు నాపై దయచూపు. కాశ్యపుడి పలుకగానే శాకల్య మునీశ్వరుడు క్షణం ధ్యానించి కృపతో క్యావునితో అప్పుడు ఇట్లా అన్నాడు (83).
శాకల్యుని వచనము - ఈ పావ శాంతి కొరకు నీరు ఉపాయం చెప్తాను. (84) దానిని నీవు త్వరగా చేయాలి ఓ బ్రాహ్మణ! ఆలస్యం చేయవద్దు. దక్షిణ సముద్రమందు సేతువు యందు గంధమాదన పర్వత మందు (85) గాయత్రి సరస్వతి అను రెండు తీర్థములున్నాయి. అక్కడ నీవు స్నానం చేసినంత మాత్రం చేత ఆ క్షణంలోనే శుదుడవోతావు (86) గాయత్రి సరస్వతులనీటిని గాలిని స్పృశించిన నరుడు నర్వపాపములను పోగొట్టుకొని నిర్మలులై స్వర్గానికి వెళ్తారు. (87) అందువల్ల ఓ బ్రాహ్మణ! నీవు త్వరగా గాయత్రి సరస్వతుల దగ్గరకు వెళ్ళు. అని కాశ్యపునితో శాకల్యుడనగానే (88) శాకల్యమునికి నమస్కరించి, ఆ మునీశ్వరునితో పోయివస్తానని చెప్పి, ఆతని అనుజ్ఞను పొంది గంధమాదనమునకు వెళ్ళాడు (89) అక్కడికి వెళ్ళిన కశ్యపుడు గాయత్రీ సరస్వతులకు రెండు తీర్థములకు నమస్కరించి భక్తితో, దండపాణియైన భైరవుని నమస్కరించి (90) నియమం కలవాడై సంకల్ప పూర్వకముగా ఆ తీర్థమందు స్నానం చేశాడు. ఆతీర్థద్వయ మందు స్నాన మాత్రం చేత కాశ్యపుడు ముక్తపావుడైనాడు (91) ఆ తీర్థముల రెంటి యొక్క తీర మందు ఈతడు కొద్ది కాలమున్నాడు. ఓ మునులార ! ఆకాలమందు గాయత్రీ సరస్వతులు (92) సర్వ ఆభరణములతో అలంకృతులై తమ ఆకారంతో కన్పించారు. వారికి ఈ కాశ్యపుడు భక్తి పూర్వకముగా నమస్కరించి (93) సర్వాలంకారములతో కూడిన, రూపసంపన్నులైన మీరెవరు, అని సంతోషంతో కూడిన మనస్సు గల కాశ్యపుడు వారిని చూచి అడిగాడు. అతడడుగగా గాయత్రీ సరస్వతులు ఆతనితో ఇట్లా అన్నారు (94) గాయత్రీ సరస్వతులిట్ల న్నారు. కశ్యప ! మేము గాయత్రి సరస్వతులము బ్రహ్మకు ఇష్టమైన వారము (95) ఈ తీర్థ స్వరూపంతో ఎప్పుడూ ఉంటున్నాము. ఈ తీర్థ ద్వయ మందు నీవు స్నానం చేయటంవలన మేము ఇప్పుడు సంతుషలమైనాము (96) ఓ కాశ్యప! బ్రాహ్మణ! నీకు ఏ వరమిష్టమో దాన్ని కోరుకో. ఈ తీర్థ ద్వయమందు స్నానం చేసిన వారికి అతని కోరికను ఇస్తాము (97) అని పలికిన గాయత్రీ సరస్వతుల మాటలను విని ఆకాశ్యపుడు బ్రహ్మకు ప్రియమైన ఆ దేవిలను ఇద్దరిని ముఖ్యమైన వచనములతో స్తుతించాడు. (98) కాశ్యవుని వచనము - ఓ చతురానన ఇల్లాండ్రార! జగద్రక్షకులార నేను మిమ్మల్ని నమస్కరిస్తున్నాను. విద్యా స్వరూపులైన ఓ గాయత్రీ ! సరస్వతి మీరిద్దరు శుభకరమైన వారు (99)
జగత్తునకు సృష్టిస్థితి అంతక కారకులు, వేదమునకు మాతలు, హవ్యకవ్య స్వరూపలు, చంద్ర సూర్యులను నేత్రములుగా కలవారు (100) నర్వదేవతలకు అధిపులైన గాయత్రి వాణులను ఎల్లప్పుడు సేవిస్తాను. లోకక్షేమాన్ని కోరే గిరిజ కమలలు కూడా మీరే (101) మీ చూపుతో జగత్తు సృష్టి మొదలగు కల్పనము, మీ రెప్పపాటుతో ఎల్లప్పుడు జగత్తులకు ప్రళయము కలుతుందీ (102) ఓ గాయత్రి నరన్వతులు, మీ లోచనముల విఙానంతో సృష్టి జరిగింది. మీ దర్శనం వల్ల ఈ వేళ త్వరగా కృతార్థుడనైనాను (103) ఇక్కడ రెండు తీర్థములలో స్నానం వల్లనేను ఈ వేళ పాతకముల నుండి ముక్తుడనైనాను. మునిశ్రేష్ఠులు, బ్రాహ్మణులు, బాంధవులు నన్ను స్వీకరించనీ (104) ఇక ముందు నా బుద్ధి పాప కృత్యమందు ప్రవర్తించకుండా ఉండని. ఎప్పుడు ధర్మ మందునా బుద్ది ప్రవర్తించని ఇదే నాకు వరము (105) ఓ మహా దేవతలు ! ఇవే ఇవ్వండి. నేను మరో వరాన్ని కోరను, అని కాశ్యపుడు వారిని ప్రార్థించగా (106) బ్రహ్మకు ప్రియమైన ఆ సరస్వతి గాయత్రి దేవతలు, లోకుల కెల్లప్పుడు తల్లులైన వారు సంతుష్ఠులై కాశ్యపునితో ఇట్లా అన్నారు (107) నీవు ఇప్పుడు కోరిన ఈ వరమంతా ఓ కాశ్యప ! మా అనుగ్రహం వల్ల నీకు త్వరలో కలుతుంది (108) అని ఆతనితో వలికి గాయత్రీ సరస్వతులు క్షణంలో ఆ రెండు తీర్థములలో అదృశ్యమయ్యాక అవ్పడు ఓ బ్రాహ్మణులార! (109) కాశ్యపుడు కూడా కృతార్ధుడై తన దేశానికి తిరిగి వెళ్ళాడు. బాంధవులు బ్రాహ్మణులు అందరు కాశ్యపుని, పాపరహితుని (110) గాయత్రి సరస్వతులందు స్నాన మాడినందు వలన స్వీకరించారు. ఈ విధముగా మీరు కాశ్యపుని విమోక్షణమును గూర్చి చెప్పాను (111) గాయత్రీ సరస్వతులలో స్నానమాడి పాతకముల నుండి ముక్తుడైనాడు. ఈ అధ్యాయాన్ని చదివినవారు (112) గాయత్రి నరస్వతులందు స్నానమాడిన ఫలితాన్ని పొందుతారు (113) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి నహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్యమందు గాయత్రి నరన్వతి తీర్థ ప్రశంస యందు కాశ్యప పావ శాంతి వర్ణన మనునది నలుబది ఒకటవ అధ్యాయము.
