స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

22వ అధ్యాయము

శ్రీ సూతులిట్లనిరి - శుభమైన నర్వైశ్వర్య కారణమైన లక్ష్మీతీర్థమందు స్నానం చేసి నరులు పిదప అగ్ని తీర్థమునకు వెళ్ళాలి (1) మహాపుణ్యము, మహాపాతకనాశకము, తీర్థములలో ఉత్తమతీర్థము, అన్ని కోరికలకు ఒకే సాధనమైనదీ అగ్ని తీర్థము భక్తితో స్వపాప పరిశుద్ధి కొరకు నరుడు అక్కడ స్నానం చేయాలి (2) ఋషుల మాట. ఓ మునీశ్వర దానికి అన్ని తీర్థమనే పేరు ఎట్లా వచ్చింది (3) ఈ అగ్ని తీర్థం ఎక్కడుంది. దాని వైభవం ఎలాంటిది. శ్రద్ధ గలిగిన మాకు దీనిని విస్తారంగా చెప్పండి (4) శ్రీ సూతుల వచనము మీరు బాగా అడిగారు. మునులారా వినండి. పూర్వం రాముడు పరిజనములతో నహరావణుని చంపి (5) లంకయందు విభీషణుని రాజుగానిలిపి, సీత సౌమిత్రులతో కూడి దశరధ రాముడు (6) నదచారణ గంధర్వదేవ అప్సరస గణములతో పొగడబడుతూ,మునిగణములతో ఆశీర్వదింవబడి తీర్థము చూడదలచి (7) అసహ్యపరాక్రముడైన రాముడు విలాసముగా చావమును ధరించి తనను శుద్ధి చేసుకునే కొరకు, జానకిని శుద్ధి పరచేకొరకు (8) ఇంద్రాది దేవతలతో మునులతో పితరులతో కూడా కలిసి విభీషణునితో కలిసి వానరులందరితో కలిసి (9) సేతుమార్గంగా గంధమాదన పర్వతానికొచ్చాడు. లక్ష్మీతీర్థతటముందు నిలిచి జానకి శుద్ధి కొరకు ఆతడు (10) అగ్నిని ఆవాహనచేశాడు, దేవర్షి పితరుల నన్నిధిలో లక్ష్మీతీర్థానికి కొద్దిదూరంలో, (11) లోకములన్ని చూస్తుండగా నముద్రమునుండి నీళ్ళను నాకుతూ అగ్ని లేచాడు. ఎఱ్ఱని కళ్ళు, పీతవర్ణము, పీత వస్త్రము, ధనుర్ధారి (12) ఏడు నాల్కలతో వదిదిక్కులను నాకుతూ, పోలా మానుషరూపుడైన శూరుడైన రఘువతిని చూచి (13) జానకి శుద్ధి కారణముగా రమ్యమైన మాటను చెప్పాడు. ఓ మహాబాహం! రాక్షసులకు భయము కల్గించే ఓ రామ (14) సీతపాతివ్రత్యంవల్ల నీవు రావణుని చంపావు. ఇదిమాటిమాటికి సత్యమే సత్యమే. ఇక్కడ విచారించ (చర్చించ) వలసినది లేదు (15) ఈమె కమల, జగన్మాత, లీలగా మానుషరూపాన్ని ధరించింది. దేవతదశలో ఈమె దేవదేవముకలది మనుష్య దశలోమానుష రూపంకలది (16) విష్ణువు యొక్క దేహమునకు అను రూపముగా ఈమె తన శరీరాన్ని మార్చుకుంటుంది. ఓ జగత్వామి జనార్థన! దేవదేవ (17) నీవు అవతారమెత్తినప్పుడు ఈమె నీకు సహాయం చేసేది. నీవు భార్గవరాముడవైనపుడు ఈమె ధరణి ఐంది (18) ఇప్పుడు జానకి ఐంది. భవిష్యత్తులో రుక్మిణీ ఔతుంది. ఇతరావతారములలో ఈమె విష్ణువునకు సహాయం చేసేది (19) అందువలన నామాట ప్రకారం ఈమెను ఓరామ స్వీకరించు (191/2)

అగ్నియొక్క ఆ మాటలను దేవతలు ఋషులువిని (20) విద్యాధర గంధర్వ మానవ వన్నగులు, ఇతర ప్రాణి కోటి దశరధరాముని (21) మిధిలకు చెందిన జనకుని కూతురును మాటిమాటికి ప్రశంసించారు. రాముడు అగ్నిమాట ప్రకారము నిర్మలమైన సీతను పరిగ్రహించాడు (22) ఈ విధముగా సీత విశుద్ధి కొరకు సులభంగా పనులను సాధించే రాముడు వహ్నిని ఆ వాహన చేయగా, లక్ష్మీపార్థమునకు కొద్ది దూరంలో, (23) సముద్రం నుండి అగ్ని పుట్టిన ప్రదేశాన్ని, ఉత్తమమైన అగ్ని తీర్థమని తెలుసుకోండి ఓ ద్విజులార! (24) అక్కడినుండి అగ్ని నిర్గమించింది కనుక అగ్ని తీర్థమని పిలువబడుతోంది. ముక్తినిచ్చే ఈ వహ్నితీర్థమందు భక్తితో స్నానం చేసి నరులు (25) వేదవిద్వాంసులు తాము ఉపవాస ముండి బ్రాహ్మణులను భుజింపచేయాలి. వారికి వస్త్రము, ధనము, భూమి, అలంకృతమైన కన్యను దానం చేయాలి (26) అన్ని పాపములనుండి ముత్తుడై విష సాయుజ్యమును పొందుతాడు. అగ్మితీర్థము ఒడున అన్నదానము శ్రేష్టమైనది (27) అగ్ని తీర్థముతో సమానమైనది ముందులేదు భవిష్యత్తులో కలగదు. మహాపాపి, దుష్పణ్యుడు (చెడ్డవ్యాపారి) ఇక్కడ స్నానం చేసి ఘోరమైన పిశాచ రూపాన్ని (28) వదలి దివ్యరూపాన్ని పొందాడు. పాటలీపుత్రంలో పూర్వం పశుమంతుడనే వైశ్యుడు ఉండేవాడు. (29) ఆతడు ధర్మవరుడు రోజు బ్రాహ్మణారాధన యందాసక్తి కలవాడు. ఎప్పుడూ కృషిని గోరక్షను చూస్తూ (30) అంగడిలో బంగారం మొదలగు వానిని ధర్మంగా అమ్ముతూ ఉండేవాడు. పశుమంతుడను పేరుగల ఆవణిక్ శ్రేషునకు (31) ముగ్గురు భార్యలుండే వారు భర్త శుభ్రషయందు ఆసక్తి గలవారు. పెద్ద భార్య ముగ్గురు కుమారులను వైశ్య వంశమును వృద్ది చేసే వారిని కన్నది (32) సుపుణ్యుడు పుణ్యవంతుడు చారువణ్యుడు అని వారి పేర్లు. మధ్యభార్యఇద్దరు వుత్రులను సుకోశ, బహకోళులను వారిని కన్నది. (33) మూడవ భార్యయందు ఆ వైశ్యునకు ముగ్గురువుత్రులు కలిగారు. మహాపుణ్య మహా కోళులు దుష్పణ్యులని (చెడ్డ వ్యాపారులని) ప్రసిద్ధి కెక్కారు. (34) ఈ విధముగా ఆ పశుమతునకు ఎనిమిది మంది కుమారులు ఆ ముగ్గురు స్త్రీలలో కలిగారు (35).

ఆ సువణ్యుడు మొదలుగా అందరు పుత్రులు క్రమంగా పెరిగారు. దుమ్ములో ఆడుకుంటూ తండ్రిని సంతోష పరిచారు (36) క్రమంగా ఆ వైశ్య కుమారులు ఐదు నంవత్సరాల వయస్సువారైనారు. వైశ్యశ్రేషుడైన వశుమంతుడు, డూడా ఆకొడుకులందరికి (37) చిన్ననాటి నుండి ఎల్లప్పుడు తమ వృత్తిలో శిక్షణనిచ్చాడు. కృష్ణా, గోరక్షణ, వాణిజ్యకర్మలందు క్రమంగా శిక్షింపబడ్డారు (38) నువణ్యుడు మొదలగు ఏడుగురు కుమారులు తండ్రి మాటను విన్నారు. వశుమానుడు చెప్పిన వనిని వెంటనే నిర్వర్తించేవారు (39) సువర్ణక్రియయందు కూడా వారు నైపుణ్యాన్ని సంపాదించారు. దుష్పణ్యుడు ఎనిమిదవ కుమారుడు బాల్యం నుండి ఎప్పుడూ (40) దుర్మార్గ నిరతుడై తండ్రి మాట వినలేదు. దుమ్ములో ఆడుకునేవాటి నుండి దుర్గార్గనిరతుడైనాడు (41) అతడు పిల్లవాడి దశలోనే ఇతర పిల్లలను బాధించేవాడు. దుష్కర్మనిరతుడైన వానిని చూచి తండ్రి వశుమంతుడు (42) ఉపేక్షించాడు. ఈతడు పిల్లవాడు అని తలిచేవాడు. కొంతకాలానికి ఆ వైశ్యుని ఎనిమిది మంది కుమారులు యౌవ్వనాన్ని పొందారు (43) ఈ ఎనిమిదవ కుమారుడు దుష్పణ్యుడు బలవంతులలో శ్రేషుడు, ఉతులలో, వట్నంలో ఉండే పిల్లవాళ్ళను తీసుకొని (44) బావులలో నదులలో నరస్సులలో పారవేశాడు. ఆతని ఈ దుశ్చరిత్రను ఎవ్వడు తెలుసుకోలేదు (45) పిల్లలు చచ్చే వరకు నీటిలో ఉంచేవాడు. చచ్చిన పిల్లల తల్లిదండ్రులు (46) ఆ పిల్లలను నగరమంతటా వెతికేవారు చనిపోయిన తమ వుత్రులను చూచి ప్రజలు ఏడ్చారు (47) నీటిలో శవాలను చూచి అందుకు తగిన శవసంస్కారం చేశారు. ఈ విధంగా ప్రతిరోజు దుష్పణ్యుడు పిల్లలను నగరంలో చంఏ (48) జనులచే గుర్తించ బడకుండా చాలా రోజులిట్లాగే ఉన్నాడు. వైశ్యవుత్రుని వనితో పిల్లలు మరణించగా (49) ప్రజలు (సంతానం) వృద్ధి చెందనందువల్ల పురము శూన్యప్రాయమైంది. పిదప ప్రజలు గుమిగూడివచ్చి ఆ వృత్తాంతమును రాజుతో చెప్పారు. (50) రాజు ఆ వృత్తాంతమును విని గ్రామ పాలకులను పిలిచి పిల్లల చావుకు కారణమేమిటో విచారించండి అని ఆదేశించాడు (51) గ్రామపాలులు అట్లాగే అని పలికి అక్కడక్కడ ఉండి బాల మరణంలో కోరణాన్ని బాగా వెతకసాగారు (52) వారట్లా వెతికినా బాలమారతుని తెలుసుకోలేకపోయారు. వారు తిరిగి రాజు దగ్గరకు వచ్చి భయంతో ఇట్లా అన్నారు (53) ఎంతవెదికినా మేము, నగరంలో ఉంటూ ఎల్లప్పుడూ పిల్లలను చంపే వానిని తెలుసుకోలేక పోతున్నాము ఓరాజ! అని (54) నగరవాసులందరు మరల రాజుగారి దగ్గరకు వచ్చి దుఃఖిస్తూ తమ సంతాన మరణాన్ని గూర్చి కన్నీళ్ళతో చెప్పారు (55) రాజు ఆ కారణాన్ని తెలుసుకోలేక పోయినందువల్ల ఆలోచించి మౌనంగా ఉన్నాడు.

 ఒక సారి ఈ వైశ్య పుత్రుడు ఐదుగురు పిల్లలతో కలిసి (58) తామరపూలు తెద్దామనే నెపంతో చెరువు నమీపానికి వచ్చాడు. ఏడుస్తున్నా బలవంతంగా తీసుకొని ఆ పిల్లలను దుషణ్యుడు (51) కంఠంలోతు నీళ్ళలో క్రూరుడు ముంచాడు. వారు చనిపోయారనుకొని శీఘ్రముగా దుష్పణ్యుడు తన ఇంటికి వెళ్ళాడు. (58) ఆ ఐదుగురు పిల్లల తండ్రులు తమ కొడుకులను నగరంలో వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఆ ఐదుగురు ఆసామాన్య బాలరులు (59) నీళ్ళల్లో ముంచినా అదృష్టవశాత్తు చావలేదు. వారు మెల్లగా ఒడుకు వచ్చి వాడిన తలలు గలవారై ఆ ఐదుగురు (60) నగరంలోకి వెళ్ళుటకు అశక్తులై బాల్యంవల్ల అక్కడే తిరుగసాగారు. తమ పేర్లు బంధువులు దూరంగా ఉండి ఉచ్చరిస్తుంటే (81) విని ఆ ఐదుగురు పిల్లలు తిరిగి అరిచారు. దానిని వారి ఏతరులు వివి ఆ సరస్పుతీరమునకు వచ్చి (62) బ్రతికిన తమ పిల్లలను చూసి చాలా ఆనందపడ్డారు. ఇదేమిటని తండ్రులడగగా ఆపిల్లలవ్వడు (63) తమ బంధువులకు ఇది దుష్పణ్యునీ పని అని చెప్పారు. పిదప విషయం తెలుసుకొని ప్రజలు రాజు దగ్గరకు వచ్చి (64) ఐదుగురు చెప్పిన వృత్తాంతాన్ని దుష్పణ్యుడు చేసిన దాన్ని చెప్పారు. అప్పుడు రాజు పశుమంతుని వైశ్యశేషుని పిలిచి ప్రజలు వింటుండగా ఇట్లా అన్నాడు. (65) రాజుమాట - ఓ వశుమంత! దుష్పణ్యుడనే పేరుగలవాడు బహు ప్రజగల ఈ నగరాన్ని (66) శూన్యప్రాయంగా చేశాడు, దురాత్ముడైన నీ పుత్రుడు చూడు ఈ రోజు ఈ పిల్లలను నీటిలో ముంచాడు (67) అదృష్టవశాత్తు ప్రాణంతో తిరిగి నగరానికి వచ్చారు. ఈతడిట్లా చేస్తుండగా ఇప్పుడేం చేయాలో చెప్పు (68) నీవు ధర్మ తత్పరుడవు కనుక నిన్నే అడుగుతున్నాను. అని అనగా పశుమంతుడు ధర్మజుడు తగిన విధంగా ఇట్లన్నాడు (69) పశుమంతుమాట - పురమును మిగలకుండాచేసిన ఈతనికి చావే తగుమ. ఈ విషయంలో అడుగతగింది ఏమీలేదు ఓరాజ! (70) వీడునా కొడుకు కాడు వీడు శత్రువే. అతి పాపమాచరించినవాడు. వీడికి నిష్కృతి లేదు నగరమంతా ఏమి మిగలకుండా చేశాడు గదా (71) ఈ దుష్టాత్ముని చంపండి నేను నిజమే చెబుతున్నాను.

వశుమతుని వాక్యాన్ని విని నగరప్రజలందరు (72) వణిగ్వరుని పొగడుతూ రాజుతో ఇట్లా అన్నారు. ఈ దుర్మార్గుణ్ణి చంపొదు. ఊరికే నగరం నుండి బహిష్కరించండి. (73) అప్పుడు రాజు దుష్పణ్యుని పిలిచి ఇట్లా అన్నాడు. ఓ దుష్టాత్మ ఈ దేశం నుండి నీవు ఇప్పుడు త్వరగా వెళ్ళు (74} ఒకవేళ ఇక్కడే ఉంటే చావుతో నిన్ను శిక్షిస్తాను. అని రాజు భయ పెట్టి వట్టణం నుండి దూతద్వారా బహిష్కరించేశాడు (75) దుష్పణ్యుడు ఆ దేశాన్ని వదలి భయంతో ముని మండలంతో నిండిన అడవికి వెళ్ళాడు (76) అక్కడ కూడా ఒక ముని కుమారుని ఆతడు నీటిలో ముంచాడు. ఆట కొరకు వచ్చిన ముని పుత్రులు మృతశిశువును చూచి (77) అతి దు:ఖంతో వచ్చి అతని తండ్రికి చెప్పారు అప్పుడు ఉగ్రశ్రవుడు వారి ద్వారా కొడుకు నీటిలో చనిపోయివాడని విని (78) తపోమహిమవల్ల ఇది దుష్పణ్యుని పని అని గ్రహించాడు. వైశ్యుని కుమారుడైన దుష్పణ్యుని ఉగ్రశ్రవుడు శపించాడు (79) ఉగ్రశ్రవుని మాట - నాకొడుకును నీటిలో ఉంచిచంపావుగదా నీకుమరణం కూడా నీటిలో మునగటం వల్లే కలుతుంది (80) చనిపోయాక చాలా కాలము నీవు పిశాచి పోతావు అని శాపం వినగానే వెంటనే దుష్పణ్యుడు భిన్నమానసుడై (81) ఆ వనం వదలి ఘోరమైన మరో అడవికి వెళ్ళాడు. సింహాది క్రూర సత్వములతో కూడిన మరో అడవికి వచ్చాక (82) దుమ్ము వర్షము బాగా వడి చెట్లను మాటి మాటికి కదిలిస్తూ (కోస్తూ) ఉండగా, వజ్రావతముతో సమానమైన స్పర్శగల ఝంఝానిలము పెద్దగా వీచింది (83) వేగంతో శరీరాన్ని భేదిస్తూ భరించరాని వర్షం కూడా పడింది. దాన్ని చూసి ఆ దుష్పణ్యుడు చాలా దుఃఖించి ఆలోచిస్తూ (84) చనిపోయిన ఎండిన భారీ శరీరముగల ఒక ఏనుగను చూచాడు. గాలి, వరము వీటిని సహించలేనివాడై (85) ఏనుగు ముఖము ద్వారా దాని కడుపులోకి ప్రవేశించాడు. అందులో ప్రవేశించగానే ఇంకా ఎక్కువ వర్షం పడింది (86) ఆ వర్షపు నీటితో పెద్ద ప్రవాహమేర్పడింది. ఆ ప్రవాహంతో అడవిలో ఒక నది ఏర్పడింది. (87) ఆ వర్షపునీటితో ఏనుగ కడుపునిండి తేలుతూ ప్రవాహంలో రంధ్రం లేకుండా ఐపోయింది (88) రంధ్రంలేని, నీటితో నిండిన ఏనుగు కడుపు నుండి ఈ దుష్పణ్యుడు బయటికి రాలేక పోయాడు. (89) మహా వేగముగల వర్షపు నీటి ప్రవాహము, కడుపులో దుష్పణ్యుని గల ఏనుగును నముద్రానికి చేర్చింది (90) దుష్పణ్యుడు నీటిలో మునిగి క్షణంలో ప్రాణాలు వదిలాడు. చావగానే ఆ దుష్పణ్యుడు పిశాచ రూపాన్ని పొందాడు.

ఆకలి దప్పులతో పీడింపబడి దుర్గమమైన వనమును చేరాడు. వరమైన వేనవి కాలములో భయంకరముగా అరుస్తూ (92) అనేక దుఃఖములను భవిస్తూ గహనమైన అరణ్యంలో ఉన్నాడు. కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు (93) ఆ ఏశాచము దు:ఖిస్తూ వూరకాననంలో ఉన్నాడు. వసమునుండి మరోవనానికి ఒక దేశము నుండి మరో దేశానికి వెళ్తూ (94) అంతటా దు:ఖాన్ని అనుభవిస్తూ క్రమంగా దండకారణ్యమునకు వచ్చాడు. అగస్త్యాశ్రమమునకు కొద్ది దూరంలో ఆతడు సంచరిస్తూ (95) భయంకరంగా అరుస్తూ ఇట్లా అన్నాడు. ఓ తపోధనులారా! అందరు నామాట వినండి (96) మీరు దయగలవారు. అన్ని ప్రాణుల పాతం కోరేవారు. దుఃఖములతో బాగా పీడింపబడ్డ నన్ను కృపాదృష్టితో అనుగ్రహించండి (97) పూర్వం నేను పాటలీ పుత్రంలో దుష్పణ్యుడను పేరుగల వైశ్యుణి. వళుతుని కుమారుణి. అనేక మంది పిల్లలను చంపాను (98) రాజు బహిష్కృతుడు చేయగా ఆ దేశం నుండి వనమునకు చేరాను. అక్కడ ఉగ్రశ్రవుని కుమారుని నీటిలో చంపాను (99) ఆముని నాకు శాపమిచ్చాడు. నాకు కూడా చావు నీటిలోనే అని. దు:ఖ భూయని ఐన వరమైన పిశాచత్వమును కూడా ఇచ్చాడు (100) కల్పకోటి సహస్రములు కల్పకోటి శతములు, శూన్యమైన అడవులలో ఈ పిశాచత్వాన్ని అనుభవించాను. (101) నేనింకా దప్పికను ఆకలిని సహించే స్థితిలో లేను. దీనితో బాగా దుఃఖించిన నన్ను దయతో మీరు రక్షించండి (102) ఈ పిశాచ దశనుండి ముత్తణయ్యేట్టుగా చేయండి ఓ తాపసులార! అనే పిశాచి మాటలను తపోధనులు విని లోపాముద్ర సహచరుడైన కుంభసంభవునితో ఇట్లా అన్నారు. (103) తావనుల మాట- ఓ భగవాన్ ! ఈ పిశాచమునకు ఉత్తమమైన నిష్కృతిని చెప్పండి (104) ఇటువంటి పాపములనుండి రక్షించటంలో నీవు. సమరుడవు. వారి మాటలను చాలా దయతో అగస్త్యుడు విన్నాడు. నుతీక్ష్మడనే ప్రియశిష్యుని పిలిచి ఇట్లా అన్నాడు. (105) ఆగస్త్యోక్తి - సుతీక్ష! గంధమాదన పర్వతానికి త్వరగా పో (106) అక్కడ పాపనాశకమైన అగ్నితీర్థముంది. ఏశాచమోక్షణము కొరకు, ఓ మహామతీ! అక్కడ స్నానం చేయి (107) అక్కడ సంకల్ప పూర్వకముగా పిశాచము కొరకు నీవు స్నానం చేస్తే, పిశాచ భావమును వదలి నీవు దివ్యత్వాన్ని  పొందుతావు. (108) ఆ తీర్థ సేవనము కాకుండా నీకు నిష్కృతి మరో విధంగా లేదు. అందువల్ల ఓ సుతీక్ష! దయతో ఈ పిశాచాన్ని రక్షించు (109) అగస్త్యుడు ఇట్లా చెప్పగానే నుతీక్షుడు గంధమాదసమునకు వచ్చి, దయగలవాడై పిశాచము కొరకు సంకల్పించి, అగ్నితీర్థంలో (110) అక్కడ పిశాచము కొరకు నియమంగా మూడు రోజులు స్నానం చేశాడు.

రామనాథాది తీర్థముల సేవించి, ఆ తీర్థముతీసుకొని (111) సుతీక్ష్మడు తన ఆశ్రమమునకు వచ్చాడు. ఆ తీర్థ ప్రోక్షణముతో వెంటనే అతడు పిశాచత్వమును వదలి (112) ఆ తీర్థ వైభవం వల్ల వెంటనే దివ్యత్వాన్ని పొందాడు. విమానపరము నధిరోహించి, దివ్యస్త్రీలతో పరివేష్ఠింపబడి (113) సుతీక్షునకు, అగస్త్యునకు అట్లాగే ఇతర తపోధనులకు మరల మరల నమస్కరించి ఆనందంతో వారితో పోయి వస్తానని చెప్పి (114) త్వరగా స్వర్గము అధిరోహించాడు. దేవతలతో కూడా పూజింపబడ్డాడు. అగ్నితీర్థమాహాత్మ్యంవల్ల వైశ్యకుమారుడు దుష్పణ్యుడు (115) శాపం వల్ల వచ్చిన పిశాచత్వమును వదలి ఈ విధంగా దివ్యత్వాన్ని పొందాడు. అగ్ని తీర్థవైభవాన్ని ఇట్టి దాన్ని మీకు చెప్పాను (116) ఈ అధ్యాయము చదివినవారు, భక్తితో విన్నవారు ఏశావెూక్షణమును కథను విన్న సర్వపాపములనుండి ముక్తులౌతారు. (117) ఈ లోకంలో భోగములననుభవించి పరమందు సుఖాన్ని పొందుతారు (118) అని శ్రీ స్కాంద మహా పురాణమందు ఏడాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్యమందు ఆగ్నితీర్థ ప్రశంసలో దుష్పణ్యుని పిశాచమోక్షణ మనునది ఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.