స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
36వ అధ్యాయము
తా ॥ శ్రీ సూతులిట్టనిరి - ధనుష్కోటి మాహాత్మ్యాన్ని తిరిగి నేను చెబుతాను. దురాచారుడని పేరు గలవాడు స్నానం చేసి ముక్తుడైనాడుడు ఒద్విజులార ! (1) మునులిట్లనిరి - ఈ దురాచారుడెవరు. యథార్థమెరిగిన ఓ సూత । దురాచారుడైన అతడు ఏం పాపం చేశాడు. ఓ మని! (2) ధనుష్కోటి స్నానం వల్ల పాతకం నుండి ఎట్లా ముక్తుడైనాడుడు. శుక్రూష చేసే మాకు ఓ ముని! దీనిని విస్తారంగా చెప్పండి అని అనగా (3) శ్రీ సూతులిట్లనిరి ఓ మునులార! ఆ దురాచారుని పాతకాన్ని వినండి. ధనుష్కోటియందు పాపం వల్ల పాతకం నుండి ముముక్తుడైనది వినండి (4) దురాచారుడను పేరు గల విప్రుడు గౌతమీ తీరమందున్నాడు. అతడొక బ్రాహ్మణుడు పాపి ఎప్పుడు క్రూరకర్మ ఆచరించేవాడు (5) బ్రహ్మఘ్నులతో, సురాపానం చేసే వారితో, దొంగలతో, గురుతల్పగులతో ఎవ్వరూ వారి సహసోపంతో అతడు దుష్టుడైనాడు. వారితో పాటు నివసించాడు. ఓ బ్రాహ్మణులార ! (6) మహాపాతుల వేంసర్గ దోషం వల్ల ఈ బ్రాహ్మణుని బ్రాహ్మణ్యము ఏమిలేకుండ పూర్తిగా దగ్ధమైంది (7) మహా పాతకులతోపాటు ప్రేమతో ఒకరోజు ఉన్న బ్రాహ్మణుని (8) బ్రాహ్మణత్వంలోని నాల్గవ భాగము ఆ క్షణంలోనే నశిస్తుంది అనుమానంలేదు. రెండు రోజులు సేవించటం వల్ల మహాపాతకుల స్పర్శన దర్శనముల వల్ల, పడుకోవటంవల్ల (9) సహపంక్తి భోజనం వల్ల బ్రాహ్మణుని బ్రాహ్మణత్వ ద్వితీయ భాగము పోతుంది అమమానంలేదు (10) మూడు రోజుల సహవాసం వల్ల మూడవభాగమునశిస్తుంది. అనుమానములేదు. నాల్గురోజుల సహవాసంవల్ల నాల్గవ భాగం నశిస్తుంది తప్పకుండా (11) అంతకంటే ఎక్కువగా వారితో పాటు శయన ఆసన భోజనములు ఆచరిస్తే అతనితో సమానమైన పాతకిఔతాడు మహాపాతక పంభవుడైన వానితో వేమానమౌతాడు (12) అందువల్ల బ్రాహ్మణ్య హీనుడైన వీడు దురాచారుడమ పేరుగలవాడు బలవంతుడైన, భయంకరుడైన వేతాలునితో మింగబడ్డాడు. (13) పరవశుడైన ఏడు ఆ భేతాళునితో మిక్కిలి పీడింపబడుతూ దేశం నుండి మరోదేశమునకువనంనుండి మరో వనమునకు తిరిగుతూ (14) పూర్వపుణ్య విపాకం వల్ల దైవయోగంలో ఆ బ్రాహ్మణుడు మహాపాతకనాశియైన రామచంద్ర ధనుష్కోటికి (15) భేతాలునితో ఆవేశింపబడి పిశాచంతో వెంటనంటబడి అక్కడికి వెళ్ళాడు. ధనుష్కోటి ఒలంలో ఈతనిని వేతాలుడు ముంచాడు (16) ధనుష్కోటి జలమందు ఈతడు వేతాలునితో ప్రవేశపెట్టబడి, వేతాలునితోతో విడువబడి క్షణంలోనే అందుండి పైకి లేచాడు (17).
తా ॥ ఓ బ్రాహ్మణులార ! అప్పుడు ధనుష్కోటి జలమునుండి బ్రాహ్మణుడు లేచి, వ్వనుడై సముద్ర తీరమందు ఇది ఏదేశము అని ఆలోచించ సాగాడు (18) గౌతమీ తీరంలో ఉండే వేమ ఇక్కడి శిలా వచ్చాయి. అవి చింతిస్తూ ఈతడు ధనుష్కోటి యందు వివరించే (19) మహాత్ముడు, యెగి ప్రవరుడు, ఉత్తముడైవ దళారేయుని చేరి, నమస్కరించి ఈ దురాచారుడు ఇట్లా అన్నాడు. (20) & భగవాన్ ఇది ఏ దేశమే తెలియటంలేదు. వారు తెలియజెప్పండి. వేమ గౌతమీ తీరంలో ఉండేవాణి దురాచారుడని వాపేరు. (21) ఓ బ్రాహ్మణ వేదిక్కడికి ఎట్లా వచ్చానో వాకు దయ చేసి చెప్పండి, ఆ మువివి దురాచారుడు అడుగగా అతడు సువ్రతుడై (22) కొద్ది సేపు ధ్యానించి దయగలవాడై దురాచారువిలో ఇట్లా అన్నాడు. దురాచర1 పూర్వం వీపు మహాపాతకీ వహవాసం చేశావు (23) అందువల్ల బ్రాహ్మణము నశించింది. విమ్న బేతాళుడు వటుకున్నాడు. అతనిలో ఆవేశింపబడి, మూఢమైన బుద్ధిగలవాడవై, వివశుడనై వీ ఎక్కడికి వచ్చావు (24) పేలుడు విన్ను ఇక్కడి ధనుష్కోటి జలమందు ముంచాడు. అక్కడ పావం చేయగానే ఏవుపాతకముల మండి మురుడనేవారు. (25) పుణ్యమైన ధమష్కాటియందు స్నానం చేసిన వారి పంచే పాతక వంచయములు వశిస్తాయి. 16 విజము (26) 4 రామచంద్ర ధమష్కాటి యందు పొసం చేసినంత మాత్రం చేత మహాపాశ! వంవర్గం వల్ల కళిన దోషము వీది వశించింది (27) అది వశించింది కాబట్టే పేలుడు విమ్న వదలి వశించిపోయాడు, విమ్న వటుతున్న వేతాలుడు పూర్వం బాహుడుగా ఉండేవాడు. (28) అతడు భాద్రపద మావ స వమందు మహాలయ మందు పార్వణ విధిలో ఎతృకర్మను సంతోషంగా చేయలేదు. (29) అందువల్ల తన ఎతరులతో శపింవబడి ఈతడు వేతాలుడైనాడు. ఆతడు కూడ ఈ ధనుష్కోటిని చూపినంతలోనే (30) వేతాలత్వమును వదలి విష్ణులోకమును పొందాడు. అందువల్ల భాద్రపదమామ కృష్ణవక్షమందలి మహాలయమును (31) తమ పితరులనుద్దేశించి అతిలోభంవల్ల చేయనివారు, మహాలోభులైనవారు, వేతాలులౌతారు అనుమానంలేదు. (32)
తా ॥ అందువల్ల భాధ్రపద మానకృనవక్ష మందు మహాలయమును వితరులమద్దేశించి చేప శక్తి కొలది వేద పారగులైన బ్రాహ్మణులకు (33) అన్నంతో భోజనం పెట్టినవారు దుర్గతిని పొందరు. భాద్రపద కృగపక్షమందు మహాలయ మందు (34) తన శక్తికి తగినట్టు ఒక్కనికో, ఇద్దరికో, ముగ్గురితో బ్రాహ్మణులకు దారిద్ర్యం లేకుండ భోజనం పెట్టిన యెడల ఆతనికి దుర్గతి ఎప్పుడు ఉండదు (35) ఈతడు భాద్రపదమాసంలో పితరులను ఉపాసించనందువలన ఈ బ్రాహ్మణుడు వేలుడైనాడు. పాపియైన నిమ్న పటుతున్నాడు (38) భాద్రపదమాసం కాలం మొదలుకొని వృంతం వరకు తత్వదర్శులైన మునులు మహాలయమని చెప్పారు (37) అక్కడకూడా భాద్రపద మాసకాలము విశిష్టమైంది. ఓ దురాచారక ! అక్కడకూడా కృష్ణపక్షము విశిష్టమైంది (38) శుభమైన భాద్రపద కృష్ణవక్షమందు ప్రథమ తిథి యందు భక్తి పూర్వకముగ మహాలయ శ్రాద్ధము చేసిన వాని కర్మతో (39) వర్వపావనుడైన అగ్ని పంతుష్టుడౌతాడు. ఆతడు, చేసిన వాడు వహ్నిలోకమును చేరి వహ్నితో పహతుడి ఆనందిస్తాడు (40) ఆతనికి అగ్నిదేవుడు సర్వైశ్వర్యములను ఇస్తాడు కూడ. ప్రథమ తిథి యందు మహాలయము చేయని నరుని (41) గృహమును, సంపదను, క్షేత్రాదికమును అగ్నిదహిస్తాడు కూడా. మహాలయ ప్రథమతిథియందు వేదజ్ఞడైన బ్రాహ్మణుడు భుజిస్తే (42) పితరులు దశకల్ప వృప్రముల కాలము తృప్తిని పొందుతారు. ద్వితీయ యందు మహాలయ శ్రాద్ధము చేసిన వాని భక్తికి (43) భగవాన్, భవానీపతియైన ఈశ్వరుడు : సంతుష్టుడౌతాడు. అతడు కైలాసానికి చేరి శివునితో కూడి ఆనందిపాడు (44) సంతుష్టుడైన మహేశ్వరుడు అతనికి అధికమైన సంపదనిస్తాడు. ద్వితీయ తిథి యందు మహాలయము చేయని నరుని (45) కోపించి శంఖువు ఆతని బ్రహ్మవర్చస్పు వావం చేస్తాడు. కాలసూత్రమను గౌరవనరతాన్ని ఆతనికిస్తాడు (46) మహాలయ ద్వితీయతిథి యందు వేదజ్ఞుడైన బ్రాహ్మణుడు భుజిస్తే ఏతరులు ఇరువది కల్ప సహస్రముల కాలము తృప్తి నందుతారు (47) పితరుల అనుగ్రహం వల్ల ఈతని సంతతి వృద్ధి చెందుతుంది. తృతీయ యందు మహాలయ శ్రాద్ధమును నరుడు భక్తితో చేయాలి (48) దీనితో భగవాన్ ! లోకపాలుడైన ధనాధిపతి నంతుష్టు డౌతాడు. మహావద్మాది నిధులు ఆతని వశంలో ఉంటాయి. (49) బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవతలు అతన్ని అనుసరించి ఉంటారు. తృతియ తిథి యందు మహాలయముచేయని నరుని (50) నంవదను భగవాన్ ! ధనదుడు (కుబేరుడు) క్షణంలో హరిస్తాడు బహదుఃఖ సమాకులమైన దారిద్ర్యాన్ని కూడా ఈతనికిస్తాడు (51) తృతీయతిథి యందు మహాలయముచేసిన నరుని కర్మతో, ఆతని పితరులు ముప్పది కల్పసహస్రముల కాలము తృప్తి నందుతారు (52)
తా ॥ చతుర్థియందు నరుడు భక్తితో మహాలయ శ్రాద్ధం చేయాలి. దాని వలన భగవాన్ పార్వతీసుతుడు ఐన హేరంబుడు సంతోషిస్తాడు (53) గజవక్రుని అనుగ్రహంవల్ల ఆతని వివ్నూలు నశిస్తాయి. చతుర్థితిథి యందు మహాలయము చేయని నరునకు (54) భగవాన్ విఘ్నతుడు ఎప్పుడు విన్నం చేస్తూనే ఉంటాడు. చండకోలాహలమవే నరకంలో పడిపోతాడు కూడా. (55) చతుర్థితిథి యందు మహాలయ ము చేసిన నరుని పితరులు నలుబది సహస్ర ములు ఆనందంతో ఉండి (56) శ్రాద్ధకర్తకు. నిరంతరం బహుపుత్రులనిస్తారు. పంచమితిథి యందు మహాలయము భక్తితో చేయని నరుని (57) మందిరమును భగవతిలక్ష్మి వదిలి పెడుతుంది. ఆతని ఇంటిలో కలహమున తాధారమైన ఆల పుడుతుంది (58) పంచమి తిథి యందు మహాలయమాచరించిన నరుని పితరులు ఐదు (యాభై బహుశాక్రమంలో) కల్ప సహస్రకములు తృప్తినందుతారు (59) తృవులై ఈతనికి అవిచ్చిన్నమైన సంతానాన్ని కూడా ఇస్తారు. మహదైశ్వర్యమునిచ్చే పార్వతి కూడా ప్రసన్నురాలౌతుంది. (60) షష్ఠతిథి యందు నరుడు భక్తితో మహాలయ శ్రాధమును చేయాలి. ఆ కర్మవలన పార్వతీనుతుడైన షణ్ముఖుడు భగవానుడు నంతుష్పడౌతాడు (61) ఆతని అనుగ్రహంవల్ల ఆనరునకు పుత్రులు పౌత్రులు కలుగుతారు. గ్రహములతో బాల గ్రహములతో కూడా ఎప్పుడూ బాధింపబడరు (62) షష్టితిథి యందు భక్తితో మహాలయ శ్రాద్ధము చేయని నరునకు స్కందుడు మహా సేనుడు, విముబడౌతాడు (63) గర్బం నుండి బయటికి వస్తూనే ఆతని సంతానం నశిస్తుంది. ఎప్పుడూ పూతవాది గ్రహముల సమూహములతో బాధింపబడతాడు (64) వహ్నిజ్వాలా ప్రవేశమనే నరకంలో కిందపడిపోతాడు. షష్ఠతిథి యందు శ్రద్ధ కలిగి మహాలయ శ్రాద్ధము చేసిన నరుని (65) పితరులు అరువైవేల కల్పనహస్రములు తృప్తినందుతారు. పుత్రులను, విపులమైన సంవదను. కూడా ఇస్తారు (68) సప్తమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధ మును చేయాలి. బంగారు చేతులు గల భగవాన్ ఆదిత్యుడు దీని వలన సంతుష్టుడౌతాడు. (67) భాస్కరుని అనుగ్రహం వలన రోగం లేకుండా దృఢశరీరం గల వాడుగా ఔతాడు. భగవాన్ హిరణ్యపాణియైన వాడు స్వయంగా తన చేతితో హిరణ్యమును సంతుషమన మడై (68) మహాలయ అధకర్త కు ఇస్తాడు. సప్తమి తిథి యందు భక్తితో మహాలయము చేయని నరుడు (69) క్షయరోగాది వ్యాధులతో రాత్రింబగళ్ళు అతడు బాధింపబడుతాడు. క్రింద తీక్షధార అస్త్రశయ్య అను నరక మందు పడతాడు (70) సప్తమి యందు భక్తితో మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు డెబ్బది కల్పసహస్రములు సంతుషులౌతారు (71) పితృగణము ఎల్లప్పుడు అవిచ్ఛిన్న వంతతిని ఇస్తారు కూడా. (71 1/2).
తా ॥ అష్టమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధము చేయాలి. (72) మృత్యుంజయుడు, కృత్తి వానుడు, శంకరుడు దాని వలన సంతుష్టుడౌతాడు. శంకరుని అనుగ్రహం వలన ఆతనికి కైవల్యము చేతియందున్నట్లే (73) మహాలయ శ్రాద్ధంతో సాక్షాత్తు త్రియంబకుడు సంతోషపడితే, వదువాలులోకములలో ఆతనికి దుర్లభమైనదేముంటుంది. (74) మూఢచేతనుడై అష్టమియందు మహాలయము చేయనివాడు వరమైన సంసారసాగరమందు దుఃఖితుడై మునుగుతాడు ఎవ్వడూను (75) భూమి యందు ఆతనికోరిక ఎప్పుడు కూడా సిద్ధించదు. చంద్రుడు తారకలున్నంత వరకు వైతరిణి అను నరకమందు పడిపోతాడు (76) అష్టమియందు శ్రద్దతో మహాలయ శ్రాద్ధము చేసిన నరుని ఏతరులు ఎనుబది కల్పసహస్రము తృప్తి నందుతారు (77) ఈతనిని ఆశీస్సులతో వృద్ధిపరుస్తారు. ఈతని విశ్నుముకూడా తొలగిపోతుంది. పితృగణములు ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని ఇస్తారు (78) నవమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధమును చేయాలి. దానితో దుర్గాదేవి, భగవతి, శాంభవి సంతుష్టి పొందుతుంది (79) సంతుష్టి చెందిన దుర్గమహిష నందిని ఆతని క్షయ, అపస్మార కుషాదులను క్షుద్రప్రేత పిశాచములను నశింపచేస్తుంది (80) నవమితిథి యందు మహాలయము చేయని నరుడు బ్రహ్మరక్షస్పుతో, అవసారముతో పీడింపబడుతాడు (81) నిరంతరము అభిచార అర్ధకృత్యములతో బాధింపబడుతాడు. నవమి తిథి యందు మహాలయ శ్రాద్ధముచేసిన నరుని (82) పితరులు తొంబది కల్ప సహస్రములు తృప్తి నందుతారు. పితృగణములు ఎల్లప్పుడు అవిచ్చిన్న సంతతిని గూడా ఇస్తారు (83) దశమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధము చేయాలి దానితో షోడశాత్మ అమృత కళుడు, చంద్రుడు ప్రసన్నుడౌతాడు (84) ఓషధులకు అధీశుడైన ఈతడు ఈ శ్రాద్ధంతో సంతోషిస్తే ఓషధులు ఎల్లప్పుడూ ప్రహ్యాది ధాన్యములను ఇస్తాయి (85) దశమి యందు ఉత్తమ (ముఖ్య)మైన మహాలయమాచరించని నరుని ఓషధులు నిష్పలమౌతాయి. ఆతని కృషి కూడా నిష్పలమే (86) దశమి తిథి యందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుని, పితరులు శతకల్పనహస్రములు తృప్తినందుతారు (87)పితృగణములు ఎల్లప్పుడూ ఈతనికి అవిచ్చిన్న సంతతి నిస్తారు. ఏకాదశియందు, భక్తితో మహాలయ శ్రాద్ధాన్ని చేయాలి నరుడు. (88) దానితో సర్వలోకముల సంహర్త ఐన రుద్రుడు అనుగ్రహిస్తాడు. సర్వసంహర్తయైన జగత్పతియైన రుద్రుని అనుగ్రహముతో (89) ఈ శ్రాద్ధ కర్త నిరంతరము శత్రువులను ఓడిస్తాడు. అతని బ్రహ్మహత్యలు వదివేలైన ఆక్షణంలోనే నశిస్తాయి. (80) అగ్నిశమాది యజ్ఞముల ఫలమును పుష్కలంగా పొందుతాడు. ఏకాదశియందు భక్తితో మహాలయము చేయని నరుని పై (91) రుద్రుడు విముఖుడౌతాడు. ఆతనిని ఎప్పుడు కూడా అనుగ్రహించడు. అన్ని విధముల అభివృద్ధి చెందుతున్న శత్రువులు ఈతనిని బాధిస్తారు. (92) బహుదక్షిణలతో చేసిన అగ్నిష్టోమాది యజ్ఞములు ఆతనివి నిష్పలములే, బూడిదలో పోసిన హవ్యములవలె ఔతాయి (93) లార్డము చేయుని దోషము వలన బ్రహ్మవూతక తుల్యుడౌతాడు. ఏకాదశితిథి యందు మహాలయ లౌధము చేసిన నరుని పితరులు (94) రెండు వందల కల్పసూత్రములు తృవులౌతారు. పితృగణములు ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని ఇస్తారు (95).
తా ॥ ద్వాదశి తిథి యందు మర్త్యుడు మహాలయ శ్రాద్ధము చేయాలి. ఆతనిని లక్ష్మీవతియైన జవార్దనుడు సాక్షాత్తుగా అనుగ్రహిస్తాడు. (96) దేవేశుడు, దేవదేవుడు ఐన జనార్దనుడు ప్రసన్నుడైతే చరాచర జగత్తంతా సంతోషించినట్టే అనుమానంలేదు, (97) హరిప్రియ ఐన భూమి ఈతని పంటను వృద్ధిపరుస్తుంది కూడా. హరివల్లభ ఐన లక్ష్మీకూడా ఆతని ఇంటిలో వృద్ధి పొందుతుంది (98) వారాయణుని చేతియందున్న గద కౌమోదకి అనునది ఎవ్వడూ అవసారాది. భూతములను నశింపచేస్తుంది (89) తికమైన అంచులు గల చక్రము ఈతని శత్రువులను దహించి వేస్తుంది. ఈతని శంఖము యాతుధాన పిశాచాదులను తొలగిస్తుంది (100) ఈ విధముగా కేశవుడు అన్ని విధముల ఈతని వీడను తొలగిస్తాడు. హాహాలయమును ద్వాదశియందు చేయని మను జాథమునియొక్క (101) క్షేత్రములు సంపదలు నశిస్తాయి. అనుమానంలేదు. అపస్మారాది భూతములు, మహాబలవంతులైన శత్రువులు (102) యాతుధానులు (రాక్షసులు, పుణ్యజనులు) కూడా విషువరాజ్ ముబడైన ఈతనిని బాధిస్తారు. అష్ఠిభేదనమను పేరుగల వర! మందు వవేయబడుతాడు (103) ద్వాదశి యందు భక్తియుతుడై మహాలయ శ్రాథము వాచరించిన వాని, వితరులు ఆరువందల కల్ప సహస్రములు సంతోషపడుతారు (104) ఈతని పితరులు ఈతనికి అవిచ్చిన్న సంతతిని కూడా ఇస్తారు. త్రయోదశి యందు నరుడు భక్తితో మహాలయ శ్రాథమును చేయాలి (105) ఆతనికి రతినాయకుడైన భగవాన్ కందర్పుడు ప్రసన్నుడౌతాడు. ప్రళ్ళందవాది భోగములు మనోరమలైన స్త్రీలు. (106) మదేవుని ప్రసాదం వల్ల ఆతనికి ఎల్లప్పుడూ సిద్ధిస్తారు. పుట్టుకనుండి చావు వరకు ఆతడు సుఖమువే పొందుతాడు. (107) త్రయోదశి , యందు మహాలయ శ్రాద్ధము చేయని వానికి కామదేవుడు విముఖుడౌతాడు. స్త్రీలను భోగములను నశింపచేస్తాడు. (108) ఆతనిని అంగార శయ్యా భ్రమణమవే నరకమందు వడవేస్తాడు. పితరుల నుద్దేశించి త్రయోదశి యందు మహాలయ మాచరించిన వావి (109) పితరులు సహస్ర కల్పనహస్రములు సంతుష్టి నందుతారు. పితృగణములు అవిచ్ఛిన్న సంతతిని కూడా ఇస్తారు (110).
తా ॥ చతుర్ధశి యందు వరుడు భక్తితో మహాలయ అర్ధము చేయాలి. అతని అభీష్టమును వెరవేర్చుటకై భగవాన్ శివుడు మేల్కొంటాడు (111), శివపమున ఉపదేశించి సాయుజ్యము కూడా ఇస్తాడు. పదివేల మరాపానముల, పదివేల వ్వగప్రియము బంగారం దొంగతనము / (112) పావము చతుర్దశి మహాలయ శ్రాద్ధం వల్ల తత్క్షణమందే నశిస్తుంది. చందాల వృషలస్త్రీల సమాగమ దోషం కూడా నశిస్తుంది (113) అశ్వమేధ సహస్రముల వదివేల వుండరీక యాగముల పుష్కలవలసిద్ధి చతుర్దశి మహాలయం వల్ల లభిస్తుంది (114) చతుర్ధశి యందు మహాలయ శ్రాద్ధం చేయని నరుడు కల్పకోట నహస్రము, అట్లాగే కల్పకోటి శతము కాలము (115) నంసారమనే పెద్ద చీకటి బావిలో పడిపోతాడు. నిష్కృతి లభించదు. బంగారం దొంగిలించకుండానే సురను తాగకుండానే (116) మురాపానాది దోషములతో తాకబడుతాడు. ఆ మూగ బుద్ధి కలవాడు. విధానం ప్రకారం చేసినా ఆతని యుజములు నిష్పలములౌతాయి (117) చతుర్ధశి యందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు లక్షకోటి సహస్రముల లక్షకోటి శతములు (118) కల్పములు తృప్తి నందుతారు. అనుమానంలేదు. నరకమందున్న పితరులు కూడా ఆనందంతో స్వర్గానికి వెళుతారు (119) పితృగణములు అవిచ్ఛిన్నమైన నంతతిని కూడా ఇస్తారు. అమాయందు నరుడు మహాలయ లౌఢ మాచరించాలి (120) అతని పితరులకు అనంతమైన తృప్తి లభిస్తుంది. అనుమానంలేదు. దేవలోకంలో దేవతలకు అమృతాస్వాదన వల్ల లభించేతృప్తి (121) అనంతమైన ఆట తృప్తి అమావాస్య మహాలయనల్ల లభిస్తుంది. పితృదేవతలను నమస్కరించే అమావాస్య మహాపుణ్యప్రదమైంది (122) ఇది వరమ శాంతమైంది. శివునకు మహా ఇష్టమైనట్టిది. ఆమహాలయ శ్రార్ధమందు వేద విత్తములను భుజింపచేయాలి. (123) అందువల్ల పితరులకు అనంతమైన తృప్తి లభిస్తుంది. శివుడు ఆనందిస్తాడు బ్రహ్మహత్యాది వంచ పాతకములు నశిస్తాయి. (124) అన్ని యజ్ఞములు దక్షిణలలో కూడా విధానముగా చేసినట్లైతాయి. సనాతన నర్వధర్మములు విధి ప్రకారము అనుష్టింవబడినట్లైతాయి (125) అమావాన్యదినమందు మహాలయ శ్రార్ధము చేసిన నరుడు ప్రత్యక్ బ్రహ్మఏకతను తెలుసుకొని సాయుజ్యమును పొందుతాడు (128) అచేతనుడై మహాలయ అమావాస్య నాచరించని వాని పితరులు బ్రహ్మలోక గతులైన నరకమునకే వెళుతారు (127) ఈ మూడుని సంతతి ఆక్షణంలోనే విచ్ఛిత్తి నందుతుంది. అతిథి యందు నరులు (128) మహాలయము కొరతు విధి ప్రకారము బ్రాహ్మణులకు భోజనం పెట్టనటైతే అదే మహా అనర్థమౌతుంది (సంతతి విచ్చిత్తి) (128 1/2)
తా ॥ భాద్రపద మాసం వస్తే ఎతృదేవతలు నాట్యం చేస్తారు (129) మమ్మల్ని ఉద్దేశించి మా పుత్రులు బ్రాహ్మణోత్తములకు భోజనం పెడతారు. దాని వలన మాకు దారుణమైన నరకక్లేశము కలుగదు. (130) చంద్ర తారలున్నంత కాలము న్వర్గలోకవాసము కలుతుంది. భాద్రపదమానం వస్తే అది పితరులకు తృప్తినిచ్చేది (131) కనుక ప్రతిరోజు భక్తి పూర్వకముగా ఒక్కొక్క బ్రాహ్మణునకు భోజనం పెట్టాలి. పితృమాతృకులమందు జన్మించిన పితరులు తృప్తి నందుతారు (132) విశేషించి కృష్ణపక్షమందు బుద్ధిమంతుడు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. నేయివవు మొదలగు నన్యములతో తైలాభ్యంగవురన్పరముగా పెట్టాలి (133) దీనితో ఆ కల్పము ఆనందిస్తూ పితరులు అమృతము సేవిస్తారు. కృష్ణవక్ష సప్తమి మొదలుకొని ప్రతిరోజు నరులు (134) అమావాస్య వరకు ముగ్గురు బ్రాహ్మణులను పూజించి భుజించేయాలి. ద్వాదశి నారంభించి (ఆవాటినుండి) ముగ్గురు బ్రాహ్మణులకు తప్పకుండ భోజనం పెట్టాలి (135) లేనిచో ఐశ్వర్య హాని కలుతుంది. మహా దారిద్ర్య వంతుడౌతాడు. విత్తలోభమును వదలి బ్రాహ్మణులకు నూపమృతాదులతో (136) వయస్సులో పాయసాన్నముతో పెరుగు అపూపాదులతో పేయములు, లేహ్యములు, చోష్యములు (జుర్రేది) వివిధములైన భక్ష్యములు (137) మొదలగు వానితో వేదవిదులైన ముఖ్యులను వారికి తృప్తి కలిగేటటుగా భుజింప చేయాలి. అందువల్ల బ్రహ్మవిష శంభులు తృవులౌతారు ఇందులో అనుమానం లేదు. (138) అగ్నిషత్తది తరులు అట్లాగే ఇంద్రాది దేవతలు తృవులౌతారు. ఎక్కువగా చెప్పటం ఎందుకు దానితో జగత్రయము తుషమౌతుంది (139) మహాలయ శ్రాద్ధమును పార్వణ విధానంతో చేయాలి. నరుడు మహాలయ శ్రాద్దమందు పితృవంశమందలి పితరులను వలె (140) మాతృ వంశమందలి పితరులను కూడా సంతోషంతో శ్రేయస్సు కొరకు భుజింప చేయాలి. తన విత్తమున కనుగుణంగా శక్తి కొలది దక్షిణను కూడా ఇవ్వాలి (141) ఆ మహాలయ శ్రాద్ధంలో విత్త శాఠ్యము చేయరాదు. యజ్ఞములకు దక్షిణ ఆవులుగా చెప్పబడింది. (పురోగవునితో) (142) మార్గంలో పురోగవులతో (ముందు ఆవులుంటే) శ్వాస పీనం చేయబడ్డట్లు (దుమ్మువల్ల) ఆ పితృయజ్ఞం కూడా దక్షిణ లేకపోతే హీనమౌతుంది (143) అందువల్ల యజ్ఞములందు తెలుసుకొని దక్షిణ అల్పంగానైనా ఇవ్వాలి. విధవలైన స్త్రీలు కూడా అపుత్రులైనవారుకూడా మహాలయమును (144) తమ భర్తల గురించి అధిక భోజన కర్మతో చేయాలి. లేని పక్షంలో ధర్మహాని కలుతుంది. గొప్ప నరకం సంభవిస్తుంది. (145)
తా ॥ భాద్రపద మాసం వచ్చాక మహాలయము చేయని నరుని కులము వాశనమౌతుంది. బ్రహ్మహత్యను పొందుతాడు (146) శ్రద్ధగలవారు పితరుల గూర్చి మహాలయమాచరిస్తారు. వారికి సంతతిచ్ఛేదముకాదు. ఎడతెగని నంవద లభిస్తుంది. (147) ఆలయము అనగా స్థానము మహా అనగా కల్యాణము కల్యాణమునకు స్థానమైనది కనుక మహాలయమని చెప్పబడింది (148) కనుక కల్యాణం కలిగే కొరకు నరుడు మహాలయమాచరించాలి. మహాలయమాచరించని వస్త్రంలో అతనికి అమంగల ఆచరించాలి. మహాలయమాచరించని వస్త్రంలో అతనికి అమంగలం కలుతుంది (149) తలిదండ్రులు చనిపోయిన రోజున శ్రాద్ధం చేయకపోయినా, బుద్ధిమంతుడు వరించకుండానే మహాలయ శ్రాధమాచరించాలి (150) మహాలయ శ్రాద్ధము చేయటానికి శక్తిలేని పక్షంలో, ఏతరుల ఆమహాలయాన్ని యాచించి చైనా ఆచరించాలి (151) ధనధాన్యమును విశిష్యలైన బ్రాహ్మణుల నుండి యాచించాలి. ధనధాన్యమును ఎప్పుడు కూడా వతితుల నుండి తీసుకోరాదు (152) ధనధాన్యాదికము బ్రాహ్మణుల నుండి లభించని పక్షంలో, మహాలయం చేసే కొరకు క్షత్రియ శ్రేషులను యాచించాలి (153) రాజులు ఇచ్చేవారు లేని పక్షంలో వైశ్యుల నుండైనా యాచించాలి. లోకంలో వైశ్యులు కూడా ఇచ్చేవాళ్ళు లేని పక్షంలో (154) పితరుల తృప్తి కొరకు గోవుల గ్రానమును (గడ్డిని) భాద్రపదమాసంలో ఇవ్వాలి. లేని పక్షంలో, బయటికిపోయి అడవిలో ఏడవాలి (155) చేతులతో తన కడుపును కొట్టుకుంటూ కన్నీరు కారుస్తూ, ఆ అరణ్య ప్రదేశములందు గట్టిగా నరుడు ఇట్లా చెప్పాలి (156) మాకులంనకు చెందిన పితరులందరు నా మాట వినండి. నేను దరిద్రుణ్ణి. కృవణుణ్ణి. సిగ్గులేని వాళ్ల, క్రూరకర్మ ఆచరించిన వాణ్ణి (157) పితరులకు ప్రీతిని పెంచే భాద్రపదమానం వచ్చింది. మహాలయ శ్రాద్ధము చేయటానికి వారు శక్తి లేదు. (158) భూమి అంతా తిరిగినా వారేమి లభించటంలేదు. అందువల్ల మహాలయశ్రాదాన్ని మీకొరకు నేను చేయటంలే దు. (159) మిరుదయగల వారైనాఈవ నిని మీరు క్షమించండి. దరిద్రుడుఇట్లాగేఅరణ్యప్రదేశములందు ఏడవాలి (160) ఆతని ఏడువును విని ఆతని కులంలో పుట్టిన పితరులు సంతుష్టులై, దేవతలు అమృతాన్ని త్రాగి తృవులైనట్లు తృవులౌతారు (161) బ్రాహ్మణుల సమూహం మహాలయంకొరకు భుజిస్తే తృప్తి చెందినట్లు గోగ్రాన, అరణ్యరోదనములతో కూడ పితృదేవతల తృప్తి అట్లా కలుగుతుంది. (162)
తా ॥ భాద్రపద మాసమందు మతతాదుల వల్ల విశ్నం వస్తే మాతకవు రోజులు పోయాక వృశ్చిక పర్యంతము మహాలయం చేయాలి (163) బుధుడు మహాలయం కొరకు తొమ్మిది మంది బ్రాహ్మణులను వరణం చేయాలి. ఏతరుని కొరకు ఒక బ్రాహ్మణుని పితామహుని కొరకొకనిని (164) తామహుని కొరకబ్రాహ్మణుని వరణం చేయాలి. మాతా మహుని కొరకొకనిని బ్రాహ్మణుని వరణం చేయాలి. (165) మాతృపితామహుని కొరకబ్రాహ్మణుని వరదం చేయాలి. తల్లి ప్రపితామహుని గురించి ఒకవిని వరణం చేయలి (166) అట్లాగే విశ్వదేవుల కొరకు ఇద్దరు బ్రాహ్మణులను వరణం చేయాలి. విష్ణువు కొరకు వేదవిత్తముడైన ఒక బ్రాహ్మణుని ఎన్నుకోవాలి (167) ఈ విధముగా మహాలయ శ్రాధమందు తొమ్మిది మంది బ్రాహ్మణులను ఎన్నుకోవాలి. లేదా ఎతృవర్గము కొరకు ఒక బ్రాహ్మణుని ఎన్నుకోవాలి (168) మాతామహుడు మొదలగు వారికొరకు ఒక బ్రాహ్మణునినిర్ణయించుకోవాలి. విశ్వేదేవుల కొరకొరవిని, విష్ణువు కొరకొకనిని ఎన్నుకోవాలి (169) ఈ విధముగా మహాలయమందు నలుగురు బ్రాహ్మణులను ఎన్నుకోవాలి. బుద్ధిమంతుడు వేదసంపన్నులు, మశీలులు, ఐన బ్రాహ్మణులను నిశ్చయించుకోవాలి. (170) దుఃశీలులను ఎన్నుకున్న వాడు శ్రాద్ధ కూతుడు. భాద్రపద మానం వస్తే విశేషించి కృష్ణపక్షంలో (171) శ్రద్ధతో కూడి మహాలయyధము చేసిన నరుడు సర్వతీర్షములందు స్నానమాడినట్లే ఓదురాచార ! మహామతి ! (172) ఈతడు అగ్నితో మాది నూరు యజ్ఞములు ఈతడు చేసినట్లే. తులా వురుష ముఖ్యములైన దానములు కూడా ఈతడు చేసినట్లే (173) చాంద్రాయణాది కృచ్ఛములు ఈతడాచరించినట్టే. అనుమానంలేదు. సాంగములైన నాలుగు వేదములు చదివిన వలం లభిస్తుంది (174) అట్లాగే గాయత్ర్యాది మహామంత్ర జవ పుణ్యము వస్తుంది. ఇతి హాన వురాణముల పారాయణ ఫలము లభిస్తుంది (175) భూమి పై మహాలయముతో సమానమైన పుణ్యవృత్తము మరొకటి లేదు. మహాలయం వల్ల బ్రహ్మవిష్ణు మహేశాన లోకముల ప్రాప్తి కలుతుంది. (176) మహాలయాదిక లోధము నిత్యము కామ్యముగూడా. అందువల్ల అదిచేయకపోతే గొప్ప ప్రత్యవాయం కలుతుంది. (177) చేయటం వల్ల ఇష్టసిద్ధి కూడా కలుతుంది. అనుమానం లేదు. మహాలయం చేయటం వల్ల భూతవేతాల ఠాదులు (178) అవస్కార గ్రహములు శాకిని డాకిని గణములు, యాతుధానులు ఏశాచములు, భయానకమైన వేతాలములు (179) అట్లాగే ఇతరమైన భూతములు కూడా ఆక్షణంలోనే నశిస్తాయి. మహాలయము చేయటం వల్ల అధికమైన శ్రీని పొందుతాడు (180)
తా ॥ పూర్వం దశరథుడను రాజు వసిష్టుని ఉపదేశం వల్ల భాద్రపదమాసం రాగా మహాలయ శ్రాద్ధము చేసి (181) లోకనమ్మతులైన రావూదులైన నలుగురు పుత్రులను పొందాడు. విశ్వాతిశాయియైన లక్ష్మిని ఉత్తమమైన కీర్తిని పొందాడు (182) రాజ నత్తముడైన యయాతి మహాలయం చేయటం వలన వంశ వర్ధనులైన యదు ముఖ్యులైన మహా పుత్రులను పొందాడు. (183) శ్రాద్ధ పుణ్యం వలన అనన్యదుర్గభమైన స్వర్గములను పొందాడు మహాలయవిధానమువలనదుష్యంతుడు భరతునిపొందాడు (184) దమయంతీ వతియైన నలుడు మహాలయ విధానము వలన మహత్తరమైన కష్టములను దాటి ఈ భూమిని తిరిగి పొందాడు. (185) వరమైన కలిని పుష్కరుడను శత్రువును పట్టుకొన్నాడు. జయించాడు. అతి ధార్మికుడైన ఇంద్రసేనుడను పేరుగల పుత్రుని పొందాడు (186) పారిశ్చంద్ర మహారాజు మహాలయ విధానం వల్ల విశ్వామిత్రుడు చేసిన దు:ఖము నుండి ముఠుడై నత్యవంతులలో శ్రేషుడైనాడు (187) చంద్రవతి అను భార్యను లోహితాశ్వుడను పుత్రుని పొందాడు. కృతవీర్యసుతుడైన బలవంతుడు మహాలయ విధానంవల్ల (188) అష్టాదశ ద్వీపములకు ఆధిపత్యమును పొందాడు. రాముడు కూడా దండకారణ్యంలో మహాలయ విధానం వల్ల (189) యుద్ధమందు రావణుని చంపి తిరిగి సీతను పొందాడు. మహాలయమును చేయటం వలన ధర్మపుత్రుడైన యుధిష్ఠిరుడు (190) దు:ఖ సాగరమును దాటి ధార్త రాష్ట్రులను చంపాడు కూడా. మహాలయాన్ని చేయటం వలన ముని నత్తముడైన వసిషుడు (191) అత్రి, భృగువు, కుత్సుడు, గౌతముడు, ఆంగిరుడు, కశ్యపుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, కుంభజుడు (192) పరాశరుడు, మృకండుడు ఇతరముని నత్తములు, ముఖ్యమైన మహాలయ శ్రాథమును విధి ప్రకారము చేసి (193) అణిమాద్యష్ట పదులకు వ్రతములకు, తవన్పులకు నివాస భూతులైనారు.ఆ ట్లాగే లోకాతిశాయులైనారు (194) ఆముని నత్తములందరు జీవన్ముక్తులైనారు కూడా. అందువల్ల మహాలయ శ్రార్ధమును అభివృద్ధి కోరుకునే వాడు ఆచరించాలి (195) అందువల్ల ఇప్పటికి గూడా మహాలయ మాచరించని వానికి భూతవేతాల పొదులతో గొప్ప భయముంటుంది. ఓ దురాచార! (196) మహాలయమాచరించనందువల్ల వేతాలత్వాన్ని పొందుతారు. నిన్నావహించిన ఈ భూతము పూర్వజన్మలో బ్రాహ్మడై ఉండి (197) వేద నిధి అని పేరు గలిగిన పుణ్యుడు. తనవాడైన భరద్వాజుని యొక్క కుశస్థలి అను పేరు గల గ్రామంలో ఉంటూ మహా మనస్సు గల (198) ఈతడు ఈ మహాలయ శ్రాద్ధాన్ని విధానం ప్రకారము చేయలేదు. అందువల్ల ఈతడు పితరుల శాపం వల్ల వేతాలత్వమును పొందాడు.(199) అందువల్ల ఓ దురాచార ! భాద్రపద మావమందు పితరులను గూర్చి భక్తి పూర్వకముగా షడ్రసాన్నముతో బ్రాహ్మణులను భుజింపచేయి (200).
తా ॥ దానితో నీరు దారిద్ర్యముండదు. నీవు నుఖిపోతావు. ఇక ముందు నీవు మహా పాతకి సంసర్గము చేయకు (201) వేతాలుడు పట్టుకోవటం వల్ల కల్గిన దు:ఖాన్ని అనుభవించావు కదా. నీవు వెళ్ళు. వెళ్ళుటకు అనుమతిస్తున్నాను. ఆలస్యం చేయకుండా నీ దేశానికి పో (202) అని మునియైన దత్తాత్రేయ యోగి చెప్పగా ఆతడు ఆతనికి నమస్కరించి కృతార్థమైన అంతరాత్మతో తన దేశానికి వెళ్ళాడు. (203) ఓ బ్రాహణులార ! విప్రుడైన దురాచారుడు తన ఇంటికి వెళ్ళి వేతాల భయంవదలిన వాడై పాతకముల కవచము పోయినవాడై (204) సంతుష్టమనస్కుడై ఈతడు దత్తాత్రేయుడు చెప్పిన మార్గంలో పాతకి నంనర్గం వదలి స్వాశ్రమ ఆచారతత్పరుడై (205) రామచంద్ర ధనుష్కోటి తీర్థంలో మునిగిన గౌరవం వల్ల దురాచారుడు అప్పుడు దేహాంతమందు వరమ ముక్తిని పొందాడు (206) శ్రీ సూతులిట్లనిరి - ఈ విధముగా మీకు పుణ్యమైన దురాచార విమోక్షణమును చెప్పాను. ఈ ధనుష్కోటి వుణ్యప్రదమైనది మహాపాతకములను నశింపచేసేది (207) అక్కడ స్నానం చేసినంత మాత్రం చేత దురాచారుడు విముక్తుడైనాడు. ధనుష్కోటి మహత్తు ఇంతేనా (208) నిష్కృతి విహీనములైన పాపములను కూడా ఇది నశింపచేస్తుంది. ప్రాయశ్చిత్తములేని పావములను కూడా (209) ధనుష్కోటి స్నానము నశింపచేస్తుంది. శూద్రుడు పూజించిన లింగమును కాని విష్ణువును కాని బ్రాహ్మణుడు నమస్కరించిన (210) దానికి ప్రాయశ్చిత్తము లేదు నృతులు వరమరులు చెప్పలేదు. ఆతని ఆ పావము కూడా ధనుష్కోటి స్నానం వల్ల పోతుంది (211) విప్రనింద చేసిన నరులకు ప్రాయశ్చిత్తము లేదు. విశ్వాన శతరులకు కృతన్నులకు నిష్కృతి లేదు (212) భ్రాతృభార్యను పొందిన వానికి ప్రాయశ్చిత్తము లేదు. శూద్రాన్నము నిత్యమైన వానికి శ్రుతినిందారతులకు (213) కన్యావిక్రయులకు హాయ వికయులకు, దేవవికయులకు వేద విక్రయం యందే నిరతులైన వారికి (214) ధరవిక్రయు లకు, వ్రతవికయుల తీర్థవిత్రయులకు వీరందరికి ప్రాయశ్చిత్త ము లేదు (215) ధనుష్కోటి స్నానం వల్ల వారి పాపాలు పోతాయి. మాతృద్రోహి పితృద్రోహయతి ద్రోహములందు ఆసక్తి గలవారికి (216) గురునిందా వరులకు శివ నిందారతులకు విషు నిందా వరులకు యతి నిందారతులకు (217) సత్కధలను దూషించేవారికి ప్రాయశ్చిత్తము లేదు. వారికి ఇక్కడ ధనుష్కోటి యందు స్నానం వల్ల శుద్ధి కలుతుంది. (218) ఈ విధముగా మీరు ధనుష్కోటి వైభవాన్ని చెప్పాను. భూ నీ యందు మానవుడు దీనిని విని అన్ని పాపముల నుండి ముత్తుడౌతాడు (219) అని శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర నంతయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ మందు ధనుష్కోటి ప్రశంస యందు దురాచారుని నంసర్గ దోషశాంతి వర్ణన మనునది ముప్పది ఆరవ అధ్యాయము
