స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

37వ అధ్యాయము

తా శ్రీ నూతులిట్లనిరి - వైమిషారణ్యమందుండే అందరు తపోధనులార ! రాము ధనుష్కోటి చక్రతీర్థము మొదలుగా (1) ఇరువది నాలుగు తీర్థముల గూర్చి నేను ఇప్పుడు చెప్పాను. ఇంతకంటే అద్భుతమైన దేనిని గూర్చి మీరు వినదలిచారు (2) అని అనగా మునులిట్లనిరి - ఓ ముని! క్షీర దుంగ మాహాత్మ్యమును విన దలిచాము. దీని దగ్గరే చక్రతీర్ణముందని మీరు ముందు చెప్పారు గదా (3} క్షీర కుండమనేది ఎక్కడ ఉంది. దాని వైభవ మెలాంటిది. దానికి క్షీరతుండమనే పేరు ఎట్లా వచ్చింది (4) శ్రద్ద గలిగిన మాడు ఈ విషయాన్ని వివరంగా చెప్పండి. అని అనగా శ్రీ నూతులిట్లనిరి - చెవున్నాను, అందరు మునులార ! చాలాశ్రద్ధగా వినండి (5) మహాపుణ్యప్రదమైన దేవీ పురం నుండి పశ్చిమదిక్కులో కొద్ది దూరంలోనే వుల్లగ్రామము అను పేరుగల ప్రసిద్ధమైన మహత్తర స్థానము ఉంది (6) అక్కడి నుండే ఆరంభించి రాముడు సముద్రమందు సేతుబంధం చేశాడు. వులగ్రామమను పేరుగల ఆవురము పుణ్యతమమైన క్షేత్రము (7) క్షీర కుండము అక్కడే ఉంది. అది మహాపాతకముల నశింపచే సేది. దర్శనం వల్ల, స్పర్శవల్ల, ధ్యానం వల్ల, కీర్తన వల్లను ముక్తినిచ్చేదీ (8) ఆ పుణ్యతీర్థ మునకు క్షీర తుండమనే పేరును గూర్చి మికు ఆదర పూర్వకంగా చెబుతాను. శ్రద్ధతో వినండి (g) పూర్వం ముద్గలుడనే ముని ఉండేవాడు. అతడు వేదోక్తమార్గాన్ని ఆచరించేవాడు. దక్షిణ సముద్రతీరమందలి అతి పావనమైన వుల్లగ్రామమందు (10) నారాయణ ప్రీతికరమైన ఉత్తమ యజ్ఞాన్ని చేశాడు. ఆ యాగంతో సంతుష్టుడై ప్రసన్నాత్మ గలిగిన విష్ణువు (11) ఆయజ్ఞనాటమందు ఆతని ఎదురుగా ప్రత్యక్షమైనాడు. ఓ బ్రాహ్మణులార ! లక్ష్మీశోభిత విగ్రహుడైన ఆ విష్ణువును ముద్గలుడు చూచి (12) కాలమేవుం వంటి శరీరం కలిగిన, పీతాంబరముతో వెలిగిపోతూ, గరుత్మంతునది రోహించిన, వక్షఃస్థలమున కౌస్తుభమును ధరించిన (13) శంఖచక్ర గద వద్మములతో విరాజిల్లుతున్న నాలు చేతులు కలవానిని (చూచి) భక్తితో పరవశుడై పులకాంకురములు కలిగినవారై లోత్రములకు సుఖమును కల్గించే మాటలతో ముద్గలుడు విష్ణువును స్తుతించాడు (14).

తా ముద్గలుని వచనము - మొదట జగత్ క్రాష్టకు పిదప జగత్పాలనకు (15) ఆ పిదప జగత్ సంహర్తకు నారాయణుడవైన నీకు నమస్కారము. మత్స్య రూపునకు నమస్కారము. చిదాత్ముడైన కూర్మరూపునకు (16) వరాహశరీరధారికి నమన్సులు. సింహరూపునకు నమస్సులు. వామనుడవైన నీకు నమస్కారము. జమదగ్ని నుతుడవైన నీకు నమస్సులు (17) రామవుడవైన నీకు నమస్సులు. బలభద్రుడవైన నీకు నమస్సులు. కృష్ణుడు కలి ఐన నీకు నమస్కారము. విజ్ఞాన రూపీకి నమస్సులు (18) ఓ నారాయణ ! జగత్పతి ! కరుణాసింధు! నన్ను రక్షించు నేను సిగ్గులేని వాడను లోభిని, క్రూరుణ్ణి, కొండేళ్ల, దొంభి కుణ్ణి, బలహీనుణ్ణి (19) వరుల దార, ద్రవ్య, క్షేత్రముల యందే ఆనక్తి కలవాణ్ణి, అసూయతో నిండిన మనను గలవాణ్ణి అట్టి సన్ను ఓ హరి! దయతో రక్షించు (20) అని ముద్గలుడు స్తుతించగా హరి సాక్షాత్తు గా మేము గంభీరమైన వాక్కులతో ఆ. ముద్గలునితో ఇట్లా అన్నాడు. (21) శ్రీహరి వచనము - ఓ ముద్గల నీ ఈ స్తోత్రముతో ఈ సీక్రతువుతో సంతుష్టుడనైనాను. ప్రత్యక్షముగా హవిస్సును భుజించుటకు నేను నీ క్రతువునకు వచ్చినాను (22) అని హరి అనగా ముద్గలుడు సంతుష్ట మనస్కుడై పరమభక్తితో కూడినవాడై అధోక్షజునితో ఇట్లా అన్నాడు. (23) ముద్గల వచనము. ఓ హృషీకేశ ! నేను కృతార్థుడనైనాను. నా భార్య ధన్యత్వమందింది. నేటికి నా జన్మ సఫలమైంది. నేటికి నాతవన్సు నవలమైంది (24) నేటికి నా వంశము సఫలమైంది. నేటికి నానుతులు నవలమైనారు. నా ఆశ్రమం సఫలమైంది. నేటి నాది అంతా నవలమైంది (25) నీవు హవిస్సును భుజించుటకు నా ఈ యజ్ఞవాటమునకు వచ్చావు. యోగ నిరతులైన యోగులు హృదయంలో వెదికే (26) నిన్ను సాక్షాత్తుగా నేను చూస్తున్నాను. నా క్రతువు ఇది నవలమైంది. అని ఆ విషువుతో పలికి, ఆసనాదులతో ఆ విష్ణువును పూజించి (27) చందనముతో వూలతో ఇతరమైన వాటితో విష్ణువునకు ఆతడర్యమిచ్చి ప్రేమతో విషువునకు వురోడాశాదికమైన హవిస్సును ఇచ్చాడు (28) లోక భావనుడైన విష్ణువు స్వయంగా తన చేతితో తీసుకొని ముద్గలుడు నమర్పించిన హవిస్సును భుజించాడు (29) ప్రభవిషువైన విష్ణువు ఆహవిస్సు భుజించగా అగ్నులతో కూడిన దేవతలందరు తృవులైనారు (30) ఋత్విజులు యజమానుడు అక్కడున్న బ్రాహ్మణులు, ఈ ప్రాణిలోకమందున్న చరము అచరము అంతా. (31) హవిస్సు విష్ణువు భుజించగా జగత్తంతా తృప్తమైంది. అప్పుడు హరి ప్రసన్నాత్ముడై ముద్గలునితో ఇట్లా అన్నాడు. (32) ఓ నువ్రత ! నేను ప్రీతుడినైనాను. నేను వరమివ్వదలిచాను. వరాన్ని వేడుకో. అని కేశవుడనగా అప్పుడు మహర్షి ఆతనితో ఇట్లా అన్నాడు. (33)

తా ముద్గలుడిట్లన్నాడు - యాగంలో ప్రత్యక్ష రూపంగా నాహవిస్సును నీవు తిన్నావు. దీనితోనే నేను కృతార్థుడినయ్యాను. ఇంతకన్న అధికమైన వరం ఏం రావాలి (34) ఐనా ఓ భగవాన్ ! విను! నీ యందు నాకు నిశ్చల భక్తి నిష్కపటమైనది ఎల్లప్పుడు ఉండనీ ఇది నా తొలివరము (35) ఓ మాధవ ! నేను ప్రతిరోజు సాయంప్రాతః కాలములందు ఇక్కడ నీ రూపుడైన అగ్నిలో నీ ప్రీతికొరకు సురభి యొక్క పాలతో ఓ హరి! (36) హోమము చేయదలిచాను. ఓ వరదుడ! అందువల్ల నాకు ఇదొక వరమును ఇవ్వు. శ్రుతి ప్రకారము రెండు కాలములందు పాలతో నిత్య హోమము చేయాలి (37) నాకు సురభులు లేవు. నేను తావనుణ్ణి, అధనుణ్ణి. అని ముద్గలుడనగా దేవుడు నారాయణుడు ఐన వారి (38) అమృతోశియైన త్వష్టను విశ్వకర్మను పిలిచి ఆ శిల్పీలో శోభనమైన ఒక సరస్సును చేయించి (39) ఆ విశ్వకర్మతో స్పటికాదిశిలా భేదములతో దానిని ప్రాకారాదులతో అలంకరింపబడేట్లు చేయించాడు. ఆ పిదవ భగవంతుడు సురభిని పిలిచి దానితో ఇట్లా అన్నాడు (40) శ్రీహరి వచనము - ఓ సురభి! ఈ ముద్గలుడు నా భక్తుడు. ప్రతిరోజు సంతోషంగా (41) నా ప్రీతి కొరకు పాలతో హోమమును ఇప్పుడు చేయదలిచాడు. ఓదేవి ! ఇప్పటినండి నా ప్రీతికొరకు నీవు నాతో ప్రేరేపింపబడి (ఆజ్ఞ) (42) ఓ శుభమైన నురభి, ప్రతిరోజు సాయంకాలము ప్రాదుటి వూట ఇక్కడకు వచ్చి నీనుండి వచ్చే పాలతో ఈ సరస్సును పూరించు. (43) ఆ పాలతో ఈతడు ప్రతిరోజు సాయం ప్రాతః కాలములందు హోమం చేస్తాడు. అని నారాయణుడు చెప్పగా సురభి నరే అని అనగా (44) అప్పుడు నారాయణుడు ముద్గలునితో ఇట్లా అన్నాడు. ఈ సరస్సులో ఉండే నురభి పాలతో నిత్యము (45) సాయంప్రాతః కాలములందు నా ప్రీతికొరకు ఇక్కడ నీవు హోమం చేయి. ఓ మహాభాగ! దానితో నేను నీ యందు ప్రీతుడనౌతాను. (46) ఓ ముద్గల ! నా ప్రీతితో నీరు అన్ని నదులు కలుతాయి. (సిద్ధిస్తాయి) ఇది క్షీరనరమనే తీర్థంగా ఖ్యాతి వహిస్తుంది. (47) ఈ క్షీరనరస్పులో స్నానం చేసిన వారికి వంచే పాతకములు ఇతర పావములు కూడా ఆ క్షణంలోనే నశిస్తాయి (48) ఓ ముద్గల ! దేహాంతమందు బంధవిముక్తుడవై నీవు నన్ను చేరుతావు అని పలికి భగవాన్ ! విష్ణువు! ఆ ముద్గలుని కౌగిలించుకొని (49) అతనితో నమస్కరింపబడి అక్కడే అంతర్థానమైనాడు (49)

తా ॥ విష్ణువు వెళ్ళాక ముద్గలుడు కూడా అనేక శతవత్సరములు (50) సురభి పాలతో హరితుష్టి కొరకు అగ్నిలో హోమం చేస్తూ ముక్తినిచ్చే వుల్లగ్రామమందు వరిశుదుడై ఎవ్వడూ ఉన్నాడు. దేహాంతమందు విష్ణు సాయుజ్యరూపమైన ముక్తిని పొందాడు. (51) శ్రీ నూతులిట్లనిరి - ఓ ద్విజశ్రేషులార ! ఈ విధముగా. దీనిని మీకు నేను చెప్పాను (52) దీనికి క్షీరనరస్సు అనే పేరు పూర్వం ఎట్లా వచ్చిందో చెప్పాను. ఈ క్షీర సరస్సు పుణ్యప్రదమైంది. సర్వలోకములందు ప్రసిద్ధమైంది. (53) ఓ బ్రాహ్మణులార ! కాశ్యప ముని కద్రువ తన భర్త వాక్యంతో ప్రేరేపింపబడి నియమంతో, ఇక్కడ స్నానం చేసి (54) చలంగా సాధించిన సవతీ జయ దోషంనుండి వెంటనే ముకురాలైంది. అందువల్ల శుద్ద మనస్కులై ఈ తీర్థమందు స్నానం చేసిన మానవులకు (55) బంధ విముక్తులకు ముక్తులకు పుణ్యకర్ములకు యాగములతో వేదములతో, తీర్థని షే. వణములతో ఏమి పని (58) క్షీరకుండమును చూసిన వారికి జవములతో నియమములతో పనిలేదు. క్షీర కుండపు గాలితో స్పృశింవబడిన శరీరం గల నరుడు (57) బ్రహ్మలోకమును చేరి అక్కడే ముక్తుడౌతాడు. యముని అవమానించి కూడా క్షీర కుండమందు స్నానం చేస్తే (58) ఆతని శిరస్సు యందు అగ్నితో సమానమై (న) వెలుగులు ఉంటాయి. క్షీర కుండమందు మునిగిన వారికి వైతరిణి నది చల్లగా ఉంటుంది (59) నరకములన్ని వ్యర్థమౌతాయి. కామధేనువుతో నమానమైన ఆ క్షీర కుండ ముండగా కూడా (60) వేరేచోట స్నానం చేయటానికి తిరిగే నరుడు ఆవుపాలుండగా కూడా జిల్లేడు పాలకోసం పోయినట్లు (61) క్షీర కుండంలో స్నానం చేసిన వారికి అలభ్యమైనది ఏదీ లేదు. ముక్తిహస్తగతమైనట్టే, ఎక్కువగా చెప్పి ఏం లాభం (62) చేతులెత్తి చెప్తున్నాను నిజం, నిజం చెప్తున్నాను మీరు ఈ అధ్యాయమును చదివిన వారు, చక్కగా ఉండి విన్నవారు క్షీరకుండ స్నానం వల్ల వచ్చే ఉత్తమ ఫలాన్ని పొందుతారు. (63) అని శ్రీస్కాంద మహా పురాణ మందు ఏశీతి సహస్ర నంతయందు తృతీయ బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్యమందు క్షీర కుండ ప్రశంన యందు క్షీర కుండ స్వరూపము చెప్పుట అనునది ముప్పది ఏడవ అధ్యాయము