స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

31వ అధ్యాయము

తా ఋషులిట్లనిరి - ఓ సూత! అశ్వత్థామ నిద్రించిన వారిని చంపటం ఎట్లా చేశాడు. ధనుష్కోటిలో స్నానం చేసి ఆ పావం మండి ఎట్లా ముక్తుడైనాడు (1) ఓ పౌరాణికోత్తను శ్రద్ధకలిగిన మాకు ఈ విషయాన్ని చెప్పండి. మీ వాగమృతాన్ని తాగే మాకు తృప్తి కలగటం లేదు (2) అనినైమి శారణ్యవాసులు అడుగగా సూతుడు సంతోషంతో గురువైన వ్యానునకు నమస్కరించి ఇట్లా చెప్పట మారంభించాడు (3) శ్రీ మాతులిట్లనీరి - ఓ బ్రాహ్మణులార ! పూర్వం రాజ్యము కొరకు పాండవులకు కలహము జరుగగా, మహల్ అక్షౌహిణితో కూడిన యుద్దమందు ధర్తాండ్రులతో (4) పదిరోజులు శాంతనవుడైన భీష్ముడు యుద్ధంచేసి హతుడుకాగ, ద్రోణుడు ఐదురోజులు, కర్ణుడు రెండురోజులుచేసిపోగా (5) ఒకరోజు యుద్ధంచేవశల్యుడు మరణించగా పదునెనిమిదవరోజు యుద్ధమందు దుర్యోధనుడు (6) రాజనత్తముడు భీమునిగదతో తొడలువిరిగిపడిపోగా రాజులందరుతమతమనెలవులకు వెళ్ళటానికి త్వరపడగా (7) ఉవించిఉన్నరాజులందరు సంతున మనసులైవెళ్ళారు. ధృష్టద్యుమ్నుడు శిఖండి మొదలగువారు సృంజయులందరు (8) ఇతర రాజులందరు తమతమ శిబిరములకు వెళ్ళారు. మహావీరులైనవృధాకుమారులు కృషసాత్యతులతోకూడి (9) నిర్జనమైన దుర్యోధనునిశిబిరాన్ని ప్రవేశించారు. వృదలైన అమాత్యులు, అక్కడున్న షండులు, ప్రేరక్షకులు, (10) చేతులుజోడించి, నమ్రులై,కాషాయమలి నాంబరములుగలిగి నమస్కరించగా అపార్థులుతురురాజునివాసమున (11) అక్కడున్నవస్తుసముదాయమును తీసికొని మహాబలులైనవారు దుర్యోధనుని శిబిరంలో సుఖంగా ఉన్నారు. (12) అప్పడువారితో పార్శలతో శ్రీకృష్ణుడు సంతోష పెడు తున్నట్లుగా ఇట్లాఅన్నాడు. మంగళముకొరకు మనముశిబిరానికి బయట ఉందాము. (13) అనీకృషుడనగా అట్లాగేనీమని పాండవులు, కృష్ణ సాత్యకులతోకూడి శిబిరానికిబయటవెళ్ళారు. (14) కృష్ణునితోకూడి మంగళార్థమైపాండవులు,నరోత్తములు ఓఘవతినదీతీరంచేరి (15) చచ్చినశత్రువులుగల వారు ఆరాత్రి అక్కడ సుఖంగావనించారు. కృతవర్మ, కృపుడు, అశ్వత్థామ వీరుదుర్యోధునునిన మీవమునకు (16) సూర్యాస్తమయముకన్నముందే అవరాహమునకేవచ్చారు. -16 1/2

తా ॥ యుధధూళియందుతప్పబడిన దుర్యోధనునిచూచి (17) భీమసేనునిభయంకరమైనగదతోవిరిగిన తోడలుగల, రక్తంతో తడిపిన సర్వావయవములు కలిగి భూమియందు వడియున్న (18) వానినిచూచి ద్రోణపుత్రుడు మొదలగు ముగ్గురు అక్కడ ఆవ్వడు ఏడ్చారు. ఆధుర్యోధనుడు కూడా యుద్ధంలోవారినిచూచిఏర్చాడు. (19) కన్నీళ్ళతోనిండినకళ్ళుగల రాజుని చూచి అప్పుడు అశ్వత్థామ కోపంతో,మండుతున్నఅగ్నిలా (20) చేతితో చేతిని పిసుకుతూ కోపంతో విప్పారిన కళ్ళు గళి, కన్నీళ్ళతో దీనమైన మాటలు గలిగి ఇట్ల దుర్యోధనునితో అన్నాడు (21) ఈ క్షుద్రులు యుద్ధరంగమందు మోపంతోనే పోతండ్రిని పడవేశారు. నిన్ను పడవేయగా నేనెంత బాధపడుతున్నానో దానిలో వేనంత బాధపడటం లేదు (22) నిజం చెబుతున్న నా మాటను ఈ వేళ నీవు విను ఓరాజ ! సుయోధన ! మహామతి ! సుకృతంలో నేను శపిస్తున్నాను కూడా (23) ఈ రాత్రి పాండవులను వృంజయులతో కూడ చంపేస్తాను. వామదేవుడు చూస్తుండగా చేస్తాను. నీవు అనుజ్ఞ ఇవ్వు (24) ఆతని ఆ మాటలను విని అశ్వత్థామతో రాజు అప్పుడు ఇట్లా అన్నాడు. అట్లాగే తాని అని తిరిగి కృషునితో రాజు ఇట్లా అన్నాడు. (25) ఓ ఆచార్య ఈ ద్రోణపుత్రుని కలశంతో తెచ్చిన నీటితో పేవావతిగా అభిషేకం చేయిఅని. ఆతడు కూడా అట్లాగే చేశాడు (28) అభిషిక్తుడైన ఆ ద్రౌణి అప్పుడు రాజును కౌగిలించుకొని కృతవర్మ కృపులతో కలిసి త్వరగా వెళ్ళిపోయాడు (27) దక్షిణోమ్మఖులై ఆ ముగ్గురు వీరులు బయలుదేరారు. సూర్యాస్తమయం కన్నముందు శిబిరం సమీపానికి వచ్చారు. (28) జయమును కోరే వీరు పారుల ధీషణమైన శబ్దమును విని పాండవులననుసరిస్తున్నవారు భయపడి, ఆ అశ్వత్థామ మొదలగు ముగ్గురు (29) మాతురులై భయంతో కొంత దూరము తూర్పు దిక్కుగా పరుగెత్తారు. ముహూర్త కాలము వారట్లా వెళ్ళి పిదప క్రోధ అమరములకు గురియైనవారై (30) దుర్యోధనుని వధ వలన బాధపడినవారై వారు క్షణకాలము అక్కడే నిలిచారు. పిదప అనేకరకాల తరు ల తలతో నిండిన అరణ్యమును చూచారు (31) అనేక మృగములతో విండినది ,తురమైన పక్షుల నమూహములుగలది, వమృద్ధమైన జలములతో నిండిన తటాకములతో శోభిస్తున్న (32) వద్మములు, ఇందీవర, కళారములతో నిండిన నూర్ల కొలది సరప్పులతో పంతులమైనది ఆ అరణ్యము. వారక్కడ నీరుత్రాగి, గుణములుకు నీరు త్రాగించి (33) అవేళ శాఖలతో కూడిన మ? చెట్టును చూచారు.

తా ॥ ఆ ముగ్గురు న్యగ్రోధమహావృక్షమును చేరి (34) రథములనుండి దిగి, గుణములను విడిచి జలమును స్పృశించి సాయంసంధ్యను ఉపాసించారు (35) శాంతి హీనుడై సూర్యుడు అస్తమయ గిరికి చేరాడు. చీకటితో నిండినదై వరమైన రాత్రి ఐంది (36) రాత్రిపూట తిరిగే ప్రాణులు ఇటూ అటూ తిరుగుతున్నాయి. వగలుతిరిగే ప్రాణులు నిద్రాధీనమైనాయి (37) కృతవర్మ కృపుడు అ అశ్వత్థామ ప్రదోష సమయమందే వారు న్యగ్రోధవృక్ష సమీపమందు శోకకర్షితులై కూర్చున్నారు (38) అతి పరాక్రమ వంతులైన కృభోజులు అప్పుడు నిద్రపోయారు. సుఖంగా ఉండాల్పినవారు, దు:ఖావికి అనర్హమైనవారు, భూమియందు కూర్చున్నారు. (39) ద్రోణపుత్రుడు కోపంతో కలుషమైన మనస్సు కలవాడై పామువలె బుసకొడూ నిద్రపోలేదు (40) ఆ భయానకమైన అరణ్యమును చూడసాగాడు. అనేకమైన కారులతో కూడిన ఆన్యగ్రోధ వృక్షమును చూచాడు (41) అక్కడ కాకుల గుంపులు రాత్రి యందు నివసించసాగాయి. భిన్నమైన భిన్నమైన కొమ్మల పై విడివిడిగా అవినుఖంగా నిద్ర పోయాయి (42) ఆకులు నిద్రపోయాక అంతటా విశ్వానం తుదిరాక, ఆ పిదప వస్తున్న భయంకరమైన భావమును అశ్వత్థాము చూచాడు (43) క్రూరమైన శబ్దము త్రురమైన శరీరము పసుపు గోరోజన వర్షముగల శరీరము గల ఆ గుడ్లగూబ శబ్దంచేసి కొమ్మలలో కలిసిపోయింది (44) ఈ వక్ష ఆన్యగ్రోధ శాఖయందు ఎగిరి ఈ వాయసాంతకము అనేకమైన నిద్రపోతున్న కారులను చంపింది (45) ఆ వక్ష కొన్ని కోతుల రెక్కలను విరిచింది. చరణములే ఆయుధముగాగల ఆపక్షిఇతరకాతుల చరణములను తలలను విరించింది. (46) ఈ బలమైన గుడ్లగూబ క్షణంలో విరిచింది. తాడుల యొక్క అవేతమైన భిన్నదేహ అవయవములతో (47) ఆన్య క్రోధమండలము నర్వము చుట్టూ ఆవరించబడింది. ఆకులను చంపి ఈ గుడ్లగూబ అప్పుడు ఆనందపడింది (48) గుడ్లగూబ రాత్రిపూట ఇట్లా చేయటం చూసి అశ్వత్థామ, నేను ఇట్లాగే చేస్తాను. శత్రునాశనాన్ని రాత్రిపూట చేస్తాను (49) ఈ ఉపదేశాన్ని స్మరిస్తూ ఒంటరిగా ఆతడు అదే ఆలోచించాడు. చక్కని మార్గంలో యుద్ధం చేసి పారులను నేను జయించలేను (50) యుద్ధంలో జయించిన వీరిని నేను ఈరోజు ఈవటంగా చంపాలి. దుర్యోధనుని సమీపంలో వేను వారిని వధిస్తానని ప్రతిజ్ఞచేశాను (51).

తా ॥ ఋజుమార్గంలో యుద్ధం చేస్తే నా ప్రాణాలు పోతాయి. వైవంతో యుద్ధం చేసినవానికి జయము కల్గుతుంది. అతని శత్రువులు నశిస్తారు (52) లోకంలో అందరు నిందించే కార్యమును క్షత ధర్మాన్ని అనువరించేవాడు ఆ పనిని తప్పకుండా చేయాలి (53) పారులుకూడా సుయోధనుని విషయంలో ఎవంగావే కార్యం నిర్వర్తించారు. ఈ విషయంలో పూర్వవిదులు చెప్పిన శ్లోకాలున్నాయి (54) శత్రుబలం అలిపినప్పుడు, చీల్చబడినప్పుడు, భుజిస్తున్నప్పడు ప్రయాణిస్తున్నప్పుడు, చొచ్చుకోనున్నప్పుడు సంహరించాలి, అనుమానం వదు (55) అర్ధరాత్రియందు నిద్రతో బాధపడుతున్నపుడు, యుధమందు ఆయుధం వదలినవానిని భిన్నమైన యోధులు కల బలమునంతను, శత్రువులు వంహరించాలి (58) నిద్రిస్తున్న వారిని చంపే వనిని, నియమంగా చేసుకొని ఆతడు ఆ సాహసి రాత్రియందు నిద్రిస్తున్న భోజకవులను మేల్కొలిపాడు. అశ్వత్థామ క్షణమాలోచించి ఆ ఇద్దరితో ఇట్లా అన్నాడు. (57) అశ్వత్థామ మాట - మహా బలవరాక్రమవంతుడైన సుయోధనుడు మరణించాడు. (58) పార్శలు చాలా క్షుద్రకర్మలు చేసి శుధకర్ముని చంపారు. అతి నృశంసుడైన భీముడు రాజుగారిని తలను తన్నాడు (59) అందువల్ల ఈ రాత్రి పార్థుల పటమంటపానికి (డేరా) వెళ్ళి, సుఖంగా నిద్రిస్తున్న వారిని వావావిధములైన శస్త్రములలో మనము చంపుదాము. అని అన్నమాటలను విని ఇతనితో కృవుడు ఇట్లా అన్నాడు (60) శృవుని మాట - నిద్రిస్తున్న వారిని చంపటం లోకంలో ధర్మకార్యంగా భావించబడదు. పూజార్హముకాదు (61) అట్లాగే శస్త్రములు త్యజించిన, రథమును గుణములను వదలిన వారిని చంపటం కూడా. ఓ వత్స ! నా మాట విను. నీవు సాహసాన్ని వదులు (62) మనము ధృతరాష్ట్రుని, పతివ్రతయైన గాంధారిని, విదురుని అడుగుదాము, వాళ్ళు చెప్పింది చేద్దాము. అని అనగా అప్పుడు అశ్వత్థామ కృవునితో ఇట్లా అన్నాడు. (63) అశ్వత్థామ వచనం - పాండవులు పూర్వం నెపంతో యుద్ధంలో నా తండ్రిని చంపారు (64) ఓ మాతుల! అందువల్ల వా మర్మములన్ని తెగిపోతున్నాయి. ద్రోణున్ని చంపినవాణ్ణి నేను అని పలికిన ధృష్టద్యుమ్నుని మాటను (65) జనుల వేమక్షంలో నేను ఎట్లా వినగలను. ఆ పాండవులే తొలుత ధర్మ సేతువును నిరాకరించారు (68) మీ ఎదురుగా, రాజలందరి ఎదురుగా, ఆయుధం వదలిన వా తండ్రిని ధృష్టద్యుమ్నుడు పడవేశాడు (67) శాంతనవుడైన భీష్ముడు ధనస్సును వదలి ఆయుధాలు లేకుండా ఉండగా శిఖండిని ముందుంచుకొని సవ్యసాచి చంపాడు (68) ఈ విధముగా ఇతర రాజులను కూడా వారు ఏవంతో చంపారు. అట్లాగే నేను చేస్తాను. రాత్రి నిద్రిస్తున్న వారిని చంపుతాను (69) ఇట్లా పలికి అప్పుడు అశ్వత్థామ గుళములు పూన్చిన రథమును ఎక్కి కోపంతో మండిపోతూ శత్రువులకు అభిముఖంగా వెళ్ళాడు (70)

తా ॥ కృతవర్మ కృపులు ఇద్దరు వెళ్తున్న ఆతనిని అనుసరించారు. బాగా నిద్రించిన జనులు గల వారి శిబిరానికి వెళ్ళారు. (71) శిబిర ద్వారం చేరాక అశ్వత్థామ నిలిచాడు. ఆ రాత్రి అక్కడ దయగలిగిన శివుని ఆరాధించి (72) వరమిచ్చే శివుని నుండి నిర్మలమైన కత్తిని పొందాడు. పిదప అశ్వత్థామ కృతవర్మ కృపులను ఇద్దరిని ద్వారమందు ఉంచి (73) మహావీరుడు శిబిరంలో పలికి ప్రవేశించాడు. అశ్వత్థామ శిబిరంలోకి ప్రవేశించాక కృతవర్మ కృపుడు ఇద్దరు (74) గొప్ప ధనుర్ధారులైన వారిద్దరు ద్వారదేశంలో ఉన్నారు. పిదప అశ్వత్థామ బాగా కోపంతో తేజస్సుతో మండిపోతున్నవాడిలా (75) విమలమైన ఖడ్గమును తీసుకొఇ రాత్రియందు శిబిరంలో తిరిగాడు. పిదప ధృష్టద్యుమ్నుని శిబరంను మెల్లగా వమీపించాడు (76) ధృష్టద్యుమ్నాదులు అక్కడ మహాయుద్ధంతో కృశించిపోయి తమ తమ సైన్యములతో కూడి విశ్వాసంతో రాత్రియందు నిద్రించారు (77) అస్త్రము కలిగిన అశ్వత్థామ దృష్టద్యుమ్నుని శిబిరం ప్రవేశించి శుభ్రమైన పడక యందు నిద్రించిన ఆ మహా బలవంతుని దూరంనుండి చూచాడు. (78) నిద్రీమన్న అతనిని అశ్వత్థామ కోపంతో కాలితో తన్నాడు. కాలిదెబ్బతో మేల్కొని అతడు పడకనుండి లేచి (79) ఆ వీరుడు ముందున్న అశ్వత్థామను చూచాడు. వక నుండి పైకి వస్తున్న అతనిని బలవంతుడైన అశ్వత్థామ (80) చేతులతో వెంట్రుకలను లాగి ఆతనిని భూమియందు పడవేశాడు. అప్పుడు అతనితో పడవేయబడ్డ ఆ ధృష్టద్యుమ్నుడు భయాతురుడై (81) నిద్రాంధుడు, పాదవూతంతో బాధపడుతున్నవాడు ఏమి చేయటానికి సమర్థుడు కాలేదు. అశ్వత్థామ ఆతని వక్షఃస్థలాన్ని ఆక్రమించి, ధనస్సు గుణములతో (వారి) ఆతనికంతాన్ని బంధించి (82) అరుస్తున్న, కదులుతున్న అతని వశువును చంపినట్లు చంపాడు. అట్లాగే అతడు ఆతని సైన్యమునంతా చంపాడు. (63) మహావీరుడైన యుధామన్యుని, ఉత్తమౌజసుని, ద్రౌపదీ పుత్రులను, మిగిలిన సోమరులను (84) శిఖండి ప్రముఖులైన ఇతరులను అవేరులను ఖడ్గంతో చంపాడు. ఆ భయంతో ద్వారం నుండి బయటికి వచ్చిన సైనికులందరిని (85) కృతవర్మ కృపుడు వీరిద్దరు మృత్యువు దరికి చేర్చారు. ఆ మహాబలులతో చనిపోయిన సైన్యము గల అశిబిరము (86) త్రిజగత్ర్పలయమందు ఐనట్లుగా ఆ క్షణంలో శూన్యమైంది. అశ్వత్థామ మొదలుగా ముగ్గురు అందరిని చంపి (87) పారునకు భయపడిన భయాతురులై ఆ శిబిరం నుండి వెడలిపోయారు. త్వరగా వెళుతూ వారు వేరువేరు ప్రదేశములకు పరుగెత్తారు (88).

తా ॥ పిదప అశ్వత్థామ మనోరమమైన రేవాతీరమునకు వెళ్ళాడు. అనేక వేల మంది వేదములను చదివే ఋషులు ఇక్కడ (89) పుణ్యమైన కథలు చెప్పుకుంటూ ఉత్తమమైన తపస్సు చేస్తున్నారు. అక్కడ ఈ ద్రౌటి ఋషుల ఆశ్రమములకు వెళ్ళాడు (90) ఆతడు ప్రవేశించగానే బ్రహ్మవాదులైన మునులు యోగబలంతో అశ్వత్థామ దుశ్చరితాన్నీ తెలుసుకొని అతనితో ఇట్లా అన్నారు (91) ఓ ద్రౌణి! నిద్రించిన వారిని చంపే పాపివి. నీవు బ్రాహ్మణాథముడవు. నీ దర్శనం వల్ల మారు పాతిత్యం. తప్పకుండా వస్తుంది. (92) నీతో నంభాషించినంత మాత్రం చేత పదివేల బ్రహ్మహత్యలు చేసినటౌతుంది. అందువల్ల ! ఓ పురుషాధమ ! మా ఆశ్రమములనుండి నీవు వెళ్ళిపో. (93) అని ట్రేణితో అక్కడున్న మునులన్నారు. బ్రహ్మవాదులైన మునులు ద్రౌణితో ఇట్లన్నాక, ఆతడు (94) గువడి మునులు సేవించే ఆ ఆశ్రమంనుండి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఆతడు పుణ్యప్రదములైన ఠాశ్యాది తీర్థములకు వెళ్ళాడు (95) అక్కడక్కడ మహాత్ములైన బ్రాహ్మణులందరితో నిందింపబడి ఈతడు ప్రాయశ్చిత్తం చేసుకునే కొరకు వ్యామని శరణు వేడాడు (96) బదరి కారణ్యంలో ఆసీనుడైన ఉన్న మహామునిని, ద్వైపాయనుని సమీపించి భక్తి పూర్వకముగా నమస్కరించాడు (97) అప్పుడు ఈ ద్రోణాచార్య సుతునితో వ్యాసమునీ ఇట్లా అన్నాడు. ఓ ద్రౌణి ! నీవు ఈ ఆశ్రమం నుండి త్వరగా బయటికి వెళ్ళు అని (98) నిద్రించిన వారిని చంపుటతో నీవు మహా పాతకుడవైనావు. అందువల్ల నేను నీతో మాట్లాడటం వల్ల నాకు చాలా పాపం వస్తుంది. అని అనగా అప్పుడు ద్రోణి మునితో ఇట్లా అన్నాడు (99) అశ్వత్థామోక్తి - అందరితో నిందింపబడి నిన్ను శరణు వేడాను ఓ భగవాన్ ! (100) మీరు కూడా ఇట్లాగే అంటే నాకు వేరెవరు శరణగా ఉన్నారు. ఓ బ్రహవ్ వా యందు దయ చూపండి. సాధువులు దీనుల యందు దయగల వారు కదా ! (101) నిద్రించిన వారిని చంపిన పాపశాంతి కొరకు ఓ భగవాన్ ! వారు మీరు ప్రాయశ్చిత్తం విధించండి. మీరు సర్వజులు కదా. అని ద్రౌణి అనగా వ్యాసుడు చాలా సేపు ధ్యానించి ఆతనితో ఇట్లా అన్నాడు (102)

తా ॥ వ్యాసులు ఇట్లా అన్నారు. ఈ పావ శాంతికి ప్రాయశ్చిత్తము నుతిలో లేదు (103) ఐవా ఈ వీ దోష శాంతి కొరక ఉపాయం చెబుతాను. దక్షిణ వముద్రమందు పుణ్యమైన రామ సేతువు యందు ముక్తినిచ్చేది (104) మహత్తరమైనది, ధనుష్కోటి అవి ప్రసిద్ధి చెందిన తీర్థముంది. పుణ్యతమమైనది మహాపాతకముల నశింపచేసేది. ఓ ద్రౌణి ఒక తీర్థముంది (105) పురుషలందరికి ముక్తి నిచ్చేది. బ్రహ్మ హత్య మొదలగు వాని నుండి శుద్ధిని కల్గించేది, మంగళములన్నింటి కంటే మంగళ ప్రదమైందీ అన్ని కోరికలనిచ్చేది (106) పవిత్రమైన వానీకంటే పవిత్రమైందీ తీర్థములలో ఉత్తమమైంది. దుః స్వప్నముల నశింపచేసేది, పుణ్యమైనది, నరకక్లేశాన్ని నశింపచేసేది (107) అకాల మృత్యువును శమింప చేసేది. విజయమును వృద్ధిపొందించేది. దారిద్ర్యాన్ని నశింపచేసేది. ఆయుర్వర్ధన కారణమైనది (108) నరులకు చిత్తశుద్ధిని కల్గించేది. శాంతిదాంత్యాదులకు కారణమైనది. ముక్తినిచ్చే, ధనుష్కోటిలోని రామ సేతువునకు వెళ్ళి (109) ఓ ద్రౌణి ! నెలరోజులు మాత్రము అంతరాయం కలగకుండా నీవు స్నానం చేయి. సుప్త మరణ దోషం నుండి నీవు వెంటనే పవిత్రుడవవుతావు (110) ఓ ద్రోణుని కుమార ! నీవు తొందరగా వా మాటను పాటించు. వ్యాను ఋషి అనగానే అప్పడు అశ్వత్థామ (111) పవిత్రతను ఇచ్చే ధనుష్కోటి యందలి రామ సేతువునకు చేరి, సంకల్ప పూర్వకముగా నెలరోజులు అంతరాయం లేకుండా స్నానం చేశాడు (112) ప్రతిరోజు మూడు వంధ్యలందు రామనాధుని సేవించాడు. పిదప ముప్పదక రోజు ఆ నీటి స్నానం తరువాత అశ్వల్టిమ (113) ధనుష్కోటి యందు వంచాక్షర మంత్రాన్ని జపించాడు. ఆ రోజు ద్రోణ పుత్రుడు ఉపవాసం కూడా చేసాడు (114) రామనాథుని సన్నిధియందు రాత్రి జాగరం కూడా చేశాడు. తరువాతి రోజు ధనుష్కోటి యందు సంకల్ప పూర్వకముగా స్నానం చేసి (115) భక్తి పూర్వకముగా రామనాధుని స్తుతించి సేవించాడు. ఆనందాశ్రువులతో పొంగిపోయి శివుని ఎదుట నాట్యం చేశాడు. (116; అప్పుడు భగవానుడు ప్రసన్నుడై అతని ఎదుట ప్రత్యక్షమైవాడు అక్కడ మహాదేవుని చూచి, పరమేశ్వరుని స్తుతించాడు (117).

తా ద్రౌణి ఇట్లన్నారు. దేవదేవళ! కరుణాకర ! శంకర ! నీకు నమస్కారము. ఆవద అనే సముద్రంలో మునిగిన వారికి వావగా మారే అంబుజములవంటి పాదములు గలవాడ (118) మహాదేవ ! దయామూర్తి ! ధూర్తటి ! నీలలోహిత! ఉమాభర్త ! విరూపాక్ష ! చంద్రశేఖర ! నీకు నమస్కారము (119) మృత్యుంజయ త్రినేత్ర ! నీ దయగల చూపుతో నన్ను రక్షించు. పార్వతీపతి ! త్రిపురన్ను ! శంభు ! నీకు నమస్కారము (120) పినాకపాణి ! త్ర్యంబక ! నీకు నమస్కారము. అనంతాది మహానాగులనే హార భూషణములతో అలంకరింపబడినవాడ ! (121) శూలపాణి । గంగాధర ! మృడ । అవ్యయ ! నీకు నమస్కారము. ఓ దేవ ! పావనమూహమనే వంజరం నుండి నన్ను దయతో రక్షించు. అని ద్రౌణి మహాదేవుని స్తుతించగా సంతోషంతో మహాదేవుడన్నాడు (122) మహాదేవుని వచనము. నీ సుప్తమారణ దోషము ధనుష్కోటిలో స్నానం చేసిందువల్ల (123) అశ్వత్థామ ! నశించి పోయింది. ఓ నువ్రత ! వరం కోరుకో. నేను ప్రసన్నుడ పైతే లోకంలో నరులకు లభించనిదేముంటుంది. (124) అందువల్ల ద్రోణుని కుమార ! నన్ను నీవు నీ కిష్టమైన వరము కోరు. అని శంభుడనగా ద్రౌణి పరమేశ్వరునితో ఇట్లన్నాడు (125) ఓ మ హెశ్వర ! ఈ వేళ నీదర్శనంతో నేను కృతార్థుడనైనాను. కోటి జన్మలకైనా నీ దర్శనము పుణ్యము చేయని వారికి లభించదు. (126) అందువల్ల నీ పాదాంబుజమందు నాకు నిశ్చలమైన భక్తి కలగని ఈ వరాన్నే ఇవ్వు నాకు ఓ శంభు ! నీకు నమస్కారము (127) అని అనగా అట్లాగే కానిమ్మని దేవదేవుడు మహేశ్వరుడు వలికి, ద్రోణపుత్రుడు చూస్తుండగా అక్కడే అంతర్థానమైనాడు (128) అశ్వత్థామ కూడా పాపములు తొలగి రామచంద్ర ధనుష్కోటి యందు స్నానమాత్రం ఆక్షణమందే నిర్మలుడైనాడు (129) మహరులందరు, పాపములు తొలగిన ఈ ద్రౌణిని, నిర్మలుని శుదుని నాటినుండి స్వీకరించారు (130) ఈ విధంగా మీకు ద్రౌణి పాపవిమోక్షణమును గూర్చి చెప్పాను. రామ చంద్ర ధనుష్కోటి స్నాన వైభవ మాత్రం చేతనే ముక్తి కల్గింది (131) ఈ అధ్యాయాన్ని చదివిన వారు, శ్రద్ధగా విన్నవారు ఇక్కడ పాపములను తొలగించుకొని శివలోకమందు వెలుగుతారు. (132) అని శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్య మందు ధనుష్కోటి ప్రశంస యందు అశ్వత్థామ నుప్తమరణ దోష శాంతి వర్ణనమనునది ముప్పది ఒకటవ అధ్యాయము సమాప్తము.