స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

15వ అధ్యాయము

తా శ్రీ సూతులిట్లనిరి - మహా పుణ్యప్రదమైన బ్రహ్మకుండమందు శ్రద్ధతో స్నానంచేసి, పిదపనరులు హనుమత్ కుండానికి వెళ్ళాలి రాక్షసులు చచ్చాక, యుద్ధం ముగిశాక, రామాదులు తిరిగి పోయాక గంధమాదన పర్వతమందు  సర్వలోకములకు ఉపకారంకొరకు మారుతాత్మజుడైన హనుమంతుడు, తన పేరుతో సర్వతీర్థములలో ఉత్తమమైన, ఉత్తమతీర్థమును ఏర్పరచాడు దాని వైభవాన్ని విని రుద్రుడు స్వయంగా సేవిస్తున్నాడు. ఆ తీర్థంతో సమానమైంది భూతంలో లేదు భవిష్యత్తులో రాదు అక్కడ స్నానం చేసిన నరులు సనాతనమైన శివలోకానికి వెళ్లారు అది మహాపుణ్య ప్రదము, మహా పాతక నాశకము సర్వలోకములు ఉపకారంకొరకు హనుమంతుడు నిర్మించిన దానివలన, నరకములన్ని చాలా కాలము శూన్యముగానే ఉండిపోయినాయి ఆ తీర్థవైభవము శంకరునకు తెలుసునో తెలియదో, కేకయవంశమునకు చెందిన ధర్మ సఖుడనే రాజు ఇది వరలో భక్తితో స్నానం చేసి నూర్గురు పుత్రులను పొందాడు. ఋషులిట్లనిరి - ఓ మాత ! ఈ రోజు ధర్మసఖుని చరితమును చెప్పవలసింది. హనుమత్కుండ తీర్థంలో స్నానం చేసి నూర్గురు పుత్రులను పొందాడు గదా శ్రీ నూతులిట్లనిరి - ఓ ఋషులారా ! ఆ మహారాజుచరిత్రను వినండి .

తా ॥ ఈ రోజుధర్మ సఖుని వృత్తాంతాన్ని సంక్షిప్తంగా చెబుతాను. శత్రువుల జయించినవాడు, ధర్మబుద్ధిగలవాడు ధర్మనఖుడనేవాడు రాజు నీతిమంతుడు ప్రజాపాలన తత్పరుడు వతియే దైవముగా గల భార్యలు నూరుగురు ఆతని తుండేవారు  శైలవనకాననములతో కూడిన భూమిని రాజు పాలిస్తూ, ఆ భార్యలలో వంశవర్ధనుడైన కుమారుణ్ణి పొందలేకపోయాడు వుత్రునికొరకు ఆ రాజు అనేక ప్రయత్నములను చేశాడు. ఆ రాజు సంతానము కొరకు గొప్ప దానములు చేశాడు అశ్వమేధాది యజ్ఞములతో దేవతల గూర్చి యాగం చేశాడు. తులాపురుష ముఖ్యమైన దానములెన్నో ఆ రాజు చేశాడు  అందరికీ, అడ్డంకి లేకుండా, మధ్యరాత్రి వరకు అన్నదానం చేశాడు. ధాన్యములతో కూడా అనేకరకాలైన పప్పులను ఇచ్చాడారాజు శాస్త్ర ప్రకారము పితరులనుద్దేశించి రాజు శ్రాద్ధము - చేశాడు. నియతేంద్రియుడై సంతానాన్నిచ్చే మంత్రములను జపించాడు. ఈ విధములైన ధర్మములను రాజ పుత్రోత్పత్తి కొరకు ఆచరించాడు. పుత్రుని కొరకు ఎప్పుడూ ఉత్తమ ధర్మములను ఆచరిస్తూ చాలా కాలమునకు రాజ వృదుడైనాడు. ఆవృద్ధుడైన రాజునకు ప్రయత్నిస్తున్న వానికి  జ్యేషవల్ని యందు అందమైన సుచంద్రుడను పేరుగల, వుత్రుడుదయించాడు. పుట్టిన కుమారుని తల్లులందరు వైషమ్యాన్ని వదలి  పాలు మొదలగు వానితో ఉత్తమంగా నమానంగా పెంచసాగారు. రాజు, అందరుమంత్రులు, పౌరులు, మంత్రులు  వీరందరి మనస్సులకు కళ్ళకు సంతోషం కళించేవాడుగా ఈ పిల్లవాడైనాడు. రాజు పుత్రు లాలినూ అంతకంతక్కువగా ఆనందాన్ని పొందాడు ఒకసారి ఊయలలో నిద్రించిన ఆ పిల్లవానిని అగ్నిలాంటి విషం గల తోకతో తేలు పాదంలో కుట్టిందీ  తేలు కుట్టటం వల్ల ఈ పిల్లవాడు మాటిమాటికి ఏడ్చాడు. అప్పుడు ఆతని తల్లులందరు శోకంతో చంచలులై దు:ఖించారు. కొడుకును చుట్టుముట్టి ఏడ్వగా ఆధ్వని చాలా ఎక్కువై పోయింది . ధర్మనఖరాజు ఆ ఆర్తధ్వనిని అవ్వడు విన్నాడు .

తా ! మహా అమాత్య పురోహితులతో సభామధ్యంలో కూర్చున్న రాజు ఆ విషయాన్ని తెలుసుకోవటానికి అంతఃపురపు కావలివానిని వంపాడు ఆ విదల్లుడు అంతఃపుర బహిర్ ద్వారము వరకు వచ్చి ఉండ వృదులను పిలిచి ఇట్లా అన్నాడు  ఓ షండులారా! అంతః పుర స్త్రీలు ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు. అక్కడికి వెళ్ళి రోదన కారణమేమిటో అది తెలుసుకోండి  దీని కోసమే రాజు . నభనుండి నన్ను పంపాడు. అని చెప్పగా వారు రోదనమునకు కారణాన్ని తెలుసుకొని  అంతః పురం నుండి బయటికి వచ్చి " ఆతనికి జరిగినది జరిగినట్లు చెప్పారు. ఆతడు షండుని మాటలు విని సౌవిదల్లుడు సభకు వెళ్ళాడు వుత్రునకు తేలుకరచి' బాధ పడుతున్నాడని రాజుకు చెప్పాడు. అప్పుడు ధర్మనఖరాజు ఇలాంటి వృత్తాంతాన్ని విని . తొందరపడుతూ లేచి మంత్రి పురోహితులతో కూడి అంతః పురం ప్రవేశించి, విషమును హరించే మాంత్రికులతో కూడి  కొడుకుకు చికిత్స చేయించాడు. అనేకమైన మందులతో కూడా చికిత్స చేయించాడు. పుత్రుడు ఆరోగ్యవంతుడు కాగా ఆతనిని ఆరాజు లాలించి రత్నకాంచనముత్యములతో మంత్రజ్ఞులను గౌరవించి అంతఃపురము నుండి రాజు నిష్క్రమించి చాలా విచారంతో కూడినవాడై  ఋత్విక్ వురోహిత అమాత్యులతో కూడి ఆ నభయందు కూర్చున్నాడు. అక్కడ ధర్మనఖుడనే రాజు మంచి ఆసనమందు కూర్చొని పురోహితులతో కూడిన ఋత్విజులతో, యుక్తమైన ఈ మాటను పలికాడు. ధర్మనఖునిమాట - ఒక్క కొడుకు ఉండటం దుఃఖము కొరకే ఓ బ్రాహ్మణులారా! ఒక్కకొడుకు ఉండేకన్న నరులకు పుత్రులు లేకుండ ఉండటమే వరము. రోజు అపాయంతో కూడుకొని ఉంది. కాబట్టి అవుత్రతే మేలు. ఆలోచించగా, నేను నూరురు భార్యలను వివాహమాడాను. వయస్సు గడిచి పోయింది భార్యలతో ఉన్నాకూడా. నా ప్రాణములువా భార్యల ప్రాణములు ఈ పుత్రుని యందే ఉన్నాయి ఆతడు మరణిస్తే వా భార్యలందరు మరణించటం నిశ్చయము. ఒక్క పుత్రుడు మరణిస్తే నా ప్రాణాలు పోతాయి అందువల్ల నాకు బహు వుత్రత్వము ఏ విధంగా కలుతుంది. ఆ ఉపాయాన్నీ నాకు చెప్పండి ఓ బ్రాహ్మణు లారా, వేదవిదులారా!  నూరురు భార్యలలో ఒకరికంటే ఒకరికి రెట్టింపు అయ్యేట్టుగా వుత్రులు కళానీ మీరు వాడు ఆకర్మచెప్పండి ధర్మంగా శాస్త్రాన్ని చూసి చెప్పండి చిన్నదిగాని, పెద్దదిగాని దుష్కరమైన కర్మగాని ఎటువంటిదైనా నేను ఆవలం విధించేట్టుగా చేస్తాను, అనుమానంలేదు  మీరు చెప్పిన పనిని చేస్తాను అనుమానం లేదు. నా ముకృతముల మీద ఒట్టేసి చెప్తున్నా. నేను ఆ పనిని చేసినట్లుగానే భావించండి ఇటువంటి పని ఉందా, నూరురుకొడుకులు కలిగేది. ఆ పనినేనెక్కడ చేయాలో ఇప్పుడే చెప్పండి అని రాజు అడుగగా వురోహితునితో కూడిన ఋత్విజులు. అందరు ఏకమై నిశ్చయించి రాజుతో ఇట్లా అన్నాడు.

తా ఋత్విజులిట్లనిరి - నీకు నూర్గురు పుత్రులు కలిగే కర్మ ఉంది. దాన్ని చెబుతాము ఓ రాజా! గొప్ప ధర్మంలో నూరురు భార్యల యందు సంతానం కలుతుంది  మహా పుణ్యప్రదమైన గంధమాదన పర్వతం ఉంది. దక్షిణ సముద్రం మధ్యలో పేతు రూపంలో ఉంది.సిద్ధచారణ గంధర్వులు దేవరులతో నిండి ఉంటుంది. దర్శనం వల్ల స్పర్శనం వల్ల అన్ని పాపాలను నశింపచే సేది  అక్కడి లోకంలో ప్రసిద్ధమైనది హనుమత్కుండమనీ ఉంది. అది గొప్ప దు:ఖాలను శమించే పేది. స్వర్గమోక్షఫలములనిచ్చేది  నరకక్లేశమును తగ్గించేది, అట్లాగే దారిద్ర్యాన్ని తొలగించేది. సంతాన హీనులకు సంతానాన్నిచ్చేది. స్త్రీలు కాని వారికి ప్రీ పదమునిచ్చేది  అక్కడ నీవు ప్రయత్న పూర్వకముగా స్నానం చేసి అన్ని కోరికలను తీర్చే వుత్రీయమైన ఇష్టిని దాని తీరంలో శ్రద్ధతో చేయుము.  దాని వలన నీకు నీ మారురు భార్యలలో ఒక్కొక్కరికి పుత్రుడు ఒక్కొక్కడు త్వరగా జన్మిస్తాడు. ఇందులో అనుమానం లేదు  అట్లాగే అని రాజు విప్రులు ఋత్విక్కులు వురోహితులు మొదలగువారికి చెప్పి, వెంటనే ఋత్విక్కులతో భార్యలతో వురోహితునితో  అమాత్యులతో భృత్యులతో కూడుకొని, యజ్ఞసంభారముకలవాడై దక్షిణ సముద్రంలోని గంధమాదన పర్వతానికి వెళ్ళాడు హనుమత్కుండముచేరి సైన్యంతో పాటు స్నానం చేశాడు. స్నానం ఆచరిస్తూ దాని తీరంలో నెల రోజులు ఉన్నాడు  పిదప వసంతం వచ్చాక, చైత్రమాసంలో రాజు, పురోహితునితో కూడుకొని, వుత్రకామేష్టిని ఆరంభించాడు  వురోహితునితో కూడిన ఋత్విక్కులు భార్యలతో కూడిన ధర్మనఖుడనురాజర్షి యొక్క వనులన్ని చక్కగా చేశారు హనుమత్కుండతీరంలో ఇష్టి సమాప్తి అయ్యాక వురోహితుడు హోమం చేయగా మిగిలిన దానిని రాజు భార్యలకు తినిపించాడు. పిదపరాజు హనుమత్కుండము నీటిలో నూరురు భార్యలతో కూడి అవభృథస్నానం చేశాడు  ఋత్విక్కులకు అసంఖ్యాతముగా, చాలా ఎక్కువగా దక్షిణలు ఇచ్చాడు. బ్రాహ్మణులకు గ్రామములను దానం చేశాడు అమాత్యులు వరివారము, భార్యలు వీరితో కూడిన ధార్మికుడైన ఆ రాజు ఆనందంతో తననగరానికి మరలివచ్చాడు .

తా ॥ కొంతకాలం గడిచాక వదవమానంలో నూరురు భార్యలు నూరురు గుణవంతులైన పుత్రులను ప్రసవించారు  వీరుడు ధర్మసఖరాజు సంతోషపడి, స్నానం చేసి శుదుడై సంకల్పంచేసి వారికి జాతకర్మ ఆచరించాడు బ్రాహ్మణులకు గోభూతిల హిరణ్యాదులను చాలా దానం చేశాడు. పెద్ద భార్యకు ఇద్దరు కుమారులు ముందు పుట్టిన వాడు తర్వాతివారు  అందరూనూ టొక్కకుమారులు వృద్ధి చెందారు. వారు ప్రాథులయ్యాక ఈ రోజు వారి రాజ్యం విభజించి ఇచ్చి గంధమాదన వర్వతమునకు సేతువునకు భార్యతో కూడా వెళ్ళాడు. హనుమత్కుండం చేరి దాని తీరంలో తపమాచరించాడు తపస్సు చేస్తున్న రాజునకు చాలాకాలం గడిచిపోయింది. శివుని ధ్యానించే ఈ ధర్మనఖరాజునకు చాలా కాలం గడిచింది. గడిచాక రాజు, ధార్మికుడు శాంత మనసుడు అక్కడ మరణించాడు  అతని భార్యలు, భర్తను అనుసరించారు. జ్యేషవుత్రుడు సుచంద్రుడు తండ్రికి సంస్కారంచేసి శ్రద్ధతో శ్రాద్ధవర్యంతమైన కర్మలన్నీ ఆచరించాడు. ఇక్కడ మరణించటంవల్ల రాజు భార్యలతో సహ వైకుంఠం చేరాడు ప్రకాశవంతులైన సుచంద్రముఖ్యులైన రాజపుత్రులందరు అన్నతమ్ములు మాత్సర్యం వదలి తమతమ రాజ్యాన్ని అనుభవించారు.  ఈ విధముగా మీరు హనుమత్కుండ వైభావాన్ని చెప్పాను ఓ బ్రాహ్మణులారా ! రాజైన ధర్మనఖుని చరిత్రాన్ని అద్భుతమైన దాన్ని చెప్పాను  హనుమత్కుండంలో కామసిద్ధి కొరకు స్నానం చేయాలి  ఈ అధ్యాయాన్ని వరించేవారు, శ్రద్ధతో వినేవారు ఇక్కడ అనంతసుఖాన్ని పొందుతారు పరలోకంలో దేవలోకంలో దేవతలతో నవ క్రీడిస్తారు. అని శ్రీ స్కాంద మహా పురాణమందు ఎనుబది ఒక్క వేల సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు హనుమత్కుండ ప్రశంసయందు ధర్మసఖునకు సూర్గురు పుత్రులు కలుటను వర్ణించుట అనునది పదునైదవ అధ్యాయము !!