స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

20వ అధ్యాయము

శ్రీ నూతులిట్లనిరి - బ్రహ్మహత్యానాశకమైన లక్ష్మణ మహాతీర్థమందు స్నానం చేసి తమ చిత్తశుద్ధి కొరకు పిదప జటా తీర్థానికి వెళ్ళాలి (1) జన్మమృత్యుజరలతో ఆ క్రొంతులై సంసారాతుర, చేతనులైనవారికి అజ్ఞానాన్ని నశింపచేసేది జటా తీర్థంకన్న మరొకటి లేదు (2) లోకంలో ముముక్షువులు కొందరు చిత్తశుద్ధిని కోరేవారు వేదాంతములను ఊరికే నోటి ద్వారా చదువుతారు తప్ప వాటిని అనుభవించరు. (3) పూర్వపక్షమనే గొప్పమొనళ్ళు, సిద్దాంతములనే చేపలతో సంకులమైన వేదాంతమనే సముద్రంలో పడిన బ్రాహ్మణులు అజ్ఞాన మోహంతో నిండిపోతారు (4) మొదట చిత్తశుద్ధి కొరకు వేదాంతం చదివేవారు, చదివి వాగ్వాదం సాగిస్తారు తగాదా పడతారు (5) బహు వ్యామోహకారణమైన వేదాంతమువలన చిత్తశుద్ధి కలగదు. అందువల్ల మేము వేదాంతములను గొప్పవానిగా భావించము (6) ఓషనులార! చిన్న ఉపాయముతో చిత్తశుద్ధినీ కోరేవారి కందరకు గట్టిగా చెవుతున్నాను. జటాతీర్థం సేవించండి. అని (7) పూర్వము అందరికి ఉపకారము కొరకు అజ్ఞాననాశకమైన తీర్థమును దీనిని గంధమాదనంలో శంభువు నిర్మించాడు (8) ఓ బ్రాహ్మణులారా ! రావణుని చంపాక ధార్మికుడైన రాముడు జటలను కడిగిన తీర్థమును జటాతీర్థమని అంటారు. (9) అరవై వేల ఏళ్ళు గంగానదిలో మునగటం, బృహస్పతి సింహరాశిలో ఉండగా గోదావరి యందు ఒకసారి స్నానం చేయటం, (10) దేవ గురువు సింహరాశిని పొందగా అటువంటి వేలకొలది స్నానములు, సంవత్సరములలో గోమతీస్నానం వల్ల లభించే శుద్ధి అంతా జటా తీర్థ దర్శనం వల్ల లభిస్తుంది (11) ఓ బ్రాహ్మణులారా! జటాతీర్థంలో స్నానం చేసిన నరులకు అంతః కరణ శుద్ధి లభిస్తుంది. పిదవ అజ్ఞానం నశిస్తుంది కూడా (12) అజ్ఞానం నశిస్తే జ్ఞానం లభిస్తుంది. పిదప ముక్తి లభిస్తుంది. పిదప అఖండ నచ్చిదానంద నంవూరుడౌతాడు (13) ఇక్కడ ప్రాచీనమైన ఈ ఇతిపోన మును ఉదాహరిస్తారు. వ్యాసుడు శుకుడు (తండ్రి కొడుకుల) వీరల సంభాషణము (14) భావితాత్ముడైన అచ్యుతుడైన మునివరుడైన, పారంపర్య విశేషజుడైన నర్వశాస్త్రార్థకోవిదుడైన కృష్ణుని అనగా వ్యాసుని శిరస్సుతో నమస్కరించి శుకుడు ఇట్లా అడిగాడు. (15) శ్రీ శుకులమాట - భగవాన్! ఓ తండ్రి ! నర్వజ్ఞుడ ! ఉత్తమమైన రహస్యమును చెప్పండి. (16) అంతః కరణశుద్ధి, అట్లాగే అజ్ఞాన నాశనము, జ్ఞానోదయము చివరశాశ్వతమైనముక్తిదేనివల్లలభిస్తుంది (17) ఓ మహాముని స్నేహంతోనాకీవేళఆ ఉపాయాన్ని చెప్పండి. వేదాంతములు ఇతిహాసములు, సంపూర్ణ పురాణములు (18) మీద్వారానేనుచదువుకున్నాను. అవినామన స్పునుశుద్ధిపరచలేదు. అందువల్ల నాకుచిత్తశుద్ధిఎట్లాకలుగుతుందో దాన్ని చెప్పండి. (19) అనిశుకుడు వ్యాసుని అడుగగా అప్పుడు వ్యాసుడు అవిద్యానాశకమైన రహశ్యమునుచెప్పసాగాడు. (20)

వ్యాసోక్తి - అవిద్యా గ్రంధివి భేదించే రహస్యమైన దావివి శుక ! నీకు చెప్తాను. పురుషులకు బుద్ధిని బట్టి చేసేది. జవాది భయమును నశింపచేసేది. (21) రామసేతువు యందు మహా పుణ్యప్రదమైన గంధమాదన పర్వత మందు పాపములను సంహరించేది జటాతీర్థమనునది ప్రసిద్ధమైనది ఉంది. (22) హరియైన రాముడు ఇచ్చట స్వయముగా తన జటలను శుద్ధి చేసుకున్నాడు. దశరథరాముడు తీర్థమువడు వరము కూడా ఇచ్చాడు (23) ఆ పావనమైవ ఇటాతీర్థమునకు వచ్చి ప్నానము చేసిన వారికి అంతఃకరం శుద్ధి కలగనీ అని (24) యజ్ఞము, జ్ఞానము, జపము, ఉపవానము లేకుండానే జటాతీర్థంలో స్నానంచేసినంత మాత్రమున నరులకు బుద్ధి శుద్ధి జరుగుతుంది. (25) ఇక్కడ స్నానం చేయటంవల్ల నర్వదానన మమైన పుణ్యం లభిస్తుంది. దీనితో దుర్గమమైన వాటిని తరిస్తాడు. పుణ్యలోకములను పొందుతాడు (26) శుభ ఉదకముగల జటాతీర్థంలో స్నానం చేసి మహత్వాన్ని పొందుతాడు. అంతః కరణ శుద్ధికి జటాతీర్థము వినా మరొకటి లేదు (27) నియమముఠాని జవ ముఠాని మరో దేవత కాని లేదు. ధన్యమైనది, యశన్కరమైనది, ఆయుస్పునిచ్చేది సర్వలోకములలో ప్రసిద్ధమైంది (28) పవిత్రములలో పవిత్రమైనది జటాతీర్థము. ఓ శుక ! అన్ని పాపములను నశింపచే సేది మంగలములకన్న మంగలప్రదమైనది (29) ఓ శుక! భృగువంశమునకు చెందిన వారుణి, తన తండ్రియైన వరుణుని చేరి పావన శుభకరమైన బుద్ధి శుద్ధి ప్రదఉపాయమును అడిగాడు. వరుణుడు ఆతనికి బుద్ధి శుద్ధిని చేసే శుభమైన దానిని చెప్పాడు (30) వరుణోక్తి - ఓ భృగు! రామ సేతువుయందు పుణ్యప్రదమైన గంధమాదన పర్వతమందు (31) స్నాన మాత్రమును జటా తీర్థంలో చేస్తే బుద్ధి శుద్ధి తప్పకుండా జరుగుతుంది. ఆతడు తండ్రి ఆజ్ఞ ప్రకారం వెంటనే వరుణాత్మజుడైన భృగువు (32) జటాతీర్థమునకు వెళ్ళి స్నానం చేసి బుద్ధి శుద్ధిని పొందాడు. అజ్ఞాన సంతానము నశించి ఆ శుద్ధితో భృగువు (33) అద్వైత విజ్ఞానమును పొందినవాడై తన తండ్రియైన వరుణుని నుండి ఈతడు అఖండ సచ్చిదానంద పూర్ణాకారుడైనాడు ఓ శుక! (34) శంకర అంశుడైన దుర్వాసుడు జటాతీర్థంలో స్నానం చేసి త్వరగా మనః శుద్ధిని పొంది బ్రహ్మానంద మయుడైనాడు (35) విష్వంశయైన దత్తాత్రేయుడు కూడా ఈ తీర్థంలో అభి షేకంవలన శుద్ధాంతః కరణుడై బ్రహ్మకారుడైనాడు (36) అజ్ఞాననాశనం కోరేవారు జటాతీర్థమందు శుధతమమైన పుణ్యమైన నర్వపాపనాశకమైన దీనిలో స్నానం చేయాలి (37) అందు వల్ల ఓ శుక! మహామతి ! నీవు కూడా జటతీర్థమునకు వెళ్ళు. మనఃశుద్ధినిచ్చే పుణ్యప్రదమైన దానిలో స్నానం కూడా చేయి (38) తండ్రి వ్యానుడు ఇలా కొడుకైన శుకునితో అనగా ఆతడప్పుడు రామ సేతువును మహావణ్యమైన గంధమాదన పర్వతమందు (39) విశుద్ధినిచ్చే జటాతీర్థమందు స్నానం చేయటానికి వెళ్ళాడు. జటాతీర్థంలో శుకముని సంకల్పవూర్వకముగా స్నానము చేసి (40) మనః శుద్ధిని పొంది దానితో అజ్ఞానం నశించి పరమానందరూపమైన స్వస్వరూపమును పొందాడు (41) .

  ఓ బ్రాహ్మణులారా ! మనః శుద్ధి కాములైన ఇతరులందరు భక్తి పూర్వకముగా జటా తీర్థమందు స్నానం చేయండి (42) కామధేనువుతో సమానమైన జటా తీర్థము ఉండగా ఇతరమైన తుచ్చమైన వాటి పై మోహముతోరమిస్తారు (43) ముక్తి కాముడు ముక్తిని భుక్తి కాముడు భుక్తిని పొందుతాడు. జటాతీర్థంలో స్నానం చేయటం వల్లనే ఇవి లభిస్తాయి. నేను నిజం చెప్పాను, ఓ ద్విజులార ! (44) వేదవతనంవల్ల పుణ్యమైన యజ్ఞం వల్ల దాన తపస్సులవల్ల ఉవవాన జవయోగాదులవల్ల నరులకు మనఃశుద్ధి కల్గుతుంది (45) ఇదేవీ లేకుండా అతి పావనమైన జటాతీర్థంలో స్నానమాత్రంవల్లనే బ్రాహ్మణులకు మనఃశుద్ధి-తప్పకుండా కల్గుతుంది (46) జటాతీర్థమాహాత్మ్యాన్ని నేను వర్ణించలేను. శంకరుడు, విష్ణువు, బ్రహ్మ ఆ తీర్థం గురించి ఎరిగి ఉన్నారు. (47) జటాతీర్థంతో సమానమైంది. గతంలో లేదు. భవిష్యత్తులో కలుగదు. జటాతీర్థ తీరమందు క్షేత్రపిండ మాచరించిన వారు (48) గయాశ్రార్ధనమమైన పుణ్యమును పొందుతారు. అనుమానంలేదు. జటాతీర్థంలో స్నానం చేసిన నరుడు పాపలివుడు కాడు దారిద్ర్యాన్ని పొందడు నరకార్ణవమును చేరడు (49) శ్రీ సూత వచనము - ఈ విధముగా ఓ విప్రులార మీకు జటా తీర్థవైభవాన్ని చెప్పాను (50) పాపవిమోచనమైన దీని యందు యోగియైన వ్యాసనుతుడు స్నానం చేసి అద్వైతజ్ఞాన సాధనమైన మనఃశుద్ధిని పొందాడు (51) ఈ అధ్యాయమును చదివినవారు శ్రద్ధతో విన్నవారు పావముల పోగొట్టుకొని వైష్ణవవదాన్ని చేరుకుంటారు. (52) అని శ్రీ స్కాంద మహా వురాణమందు ఏకాశీతి నహస్ర నంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్యమందు జటా తీర్థ ప్రశంస యందు శుకుని చిత్తశుద్ధి వర్ణన అనునది ఇరువదవ అధ్యాయము.