స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

44వ అధ్యాయము

తా ఋషులిట్లనిరి - నర్వవేదార్థ తత్వము నెరిగిన వాడ! పురాణ సముద్రము నీది దరిజేరినవాడ ! వ్యాసుని అంబుజముల వంటి పాద ద్వంద్వములను నమస్కరించుటచే తొలగిన అశుభములు కలవాడ! (1) పురాణార్థమును ఉపదేశించుటద్వారా సర్వ ప్రాణులకు ఉపకార మాచరించేవాడ! నీవు వురాణములను చెప్పటం వలన మేము నీతో అనుగ్రహింపబడినాము (2) ఓ ముని! ఇప్పుడే సేతు మాహాత్మ్యమును చెప్పటం వలన మిక్కిలిగా మేము కృతార్థులమైనాము ఓ వ్యాన శిష్య ! మహామతి ! (3) దశరథాత్మజుడైన రాముడు లింగమును స్థాపించిన వృత్తాంతాన్ని మేము వినుటకు ఇష్టపడుతున్నాము. నీవుడు మాకు చెప్పు (4) అని అనగా శ్రీ నూతులిట్లనిరి - గంధమాదన పర్వతమందు లింగమును రామచంద్రుడేందుకు స్థాపించాడో ఓ విప్రులార ! నేను మీకు ఇప్పుడు చెవున్నాను. (5) వనంలో బలవంతుడైన రావణుడు రాముని భార్య నెత్తుకుపోగా ధీరుడైన రాముడు వానర సైన్యంతో సౌమిత్రితో తడి మహాబలుడైన రాముడు (6) మహేంద్రగిరికి చేరి సముద్రాన్ని చూచాడు. ఆ అపారమైన సముద్ర మందు రాముడు సేతువును నిర్మించి (7) దాని ద్వారా రావణుడు రక్షించే లంకానగరమునకు వెళ్ళి, సూర్యుడస్తమించాక పౌర్ణమినాటి సాయం సమయమందు (8) రాముడు సైన్యంతో పాటు సువేల గిరిని అధిరోహించాడు. పిదప బలవంతుడైన సుగ్రీవుడు రాత్రి యందు సౌధమందున్న లంకేశ్వరుని చూచి (9) ఆతని ముకుటమును భూమిపై పడవేశాడు. ఆ రాక్షసుడు ముకుటం భగ్నంకాగ గృహమధ్య భాగంలోకి వెళ్ళాడు (10) లంకేశుడు గృహంలో ప్రవేశించాక రాముడు సుగ్రీవునితో కూడి, తమ్మునితో కూడి సేనతో పాటు గిరితటము నుండి క్రిందకిదిగి (11) వీరుడు రాముడు లంక సమీపంలో సేనను నిలిపాడు. పిదవ లంకను ప్రవేశిస్తున్న ఆ వానరులను రావణానుచరులు (12) మహాకాయులు సైనికులతో కూడి, ఆయుధాలు ధరించి అనుసరించారు. వర్వణుడు, వూతనుడు, జృంభుడు, ఇరుడు, క్రోధవశుడు హరి (13) పారుజ చిరుజులు, ప్రహస్తుడు అటుగే ఇతరులు వచ్చారు కనిపించకుండా పడుతున్న ఆ దురాతుల (14) అంతర్థాన వధను విభీషణుడు చేయనారంభించాడు. దూరంగా వడుతున్న బలవంతులైన వానరులు ఆ రాక్షసులను చూడగా (15) వారు ఆ రాక్షసులను చంపి ప్రాణం తీసి పారవేస్తున్నారు. దీనిని సహించలేని రావణుడు బలంతో కూడి బయలు దేరాడు (16).

తా ॥ ఆ వానరులందరిని చుట్టుముట్టి బాణములతో వారించాడు రావణుడు. పిదవ రాముడు పైన్యాన్ని వ్యూహంగా ఏర్పరచి రావణునితో (17) యుద్ధం చేశాడు. అప్పుడు వారిద్దరికి వేగంగా ద్వంద్వ యుద్దమైంది. లక్ష్మణునితో రావణుని కుమారుడు ఇంద్రజిత్తుయుద్ధంచేశాడు (18) విరూపాక్షునితోసుగ్రీవుడుఅంగదునితో ఖర్వటుడు, పౌండ్రునితో నలుడు, మనసునితో వుటేశుడు (19) ఇతర వానర వీరులు రాక్షసులతో ద్వంద్వంగా ఏర్పడి భయంకరమైన యుద్ధము చేశారు. అది భీరువులకు భయాన్ని కళించేది (20) భీమవిక్రములైన వానరులతో భేదింప బడ్డ రాక్షనులు యుద్దం నుండి రావణుడు పాలించే లంకకు త్వరగా పరుగెత్తారు(21) నర్వ సైన్యము భగ్నము కాగా రావణ ప్రేరితుడైన, కొడుకైన ఇంద్రజిత్తు యుద్ధంలో అతి దారుణమైన నాగాస్త్రములతో (22) దాశరథులైన ఆ ఇద్దరు రామలక్ష్మణులను కొట్టగా, వారు మహాత్ముడైన వైనతేయుడైన గరుడునితో విడిపింపబడ్డారు (23) అక్కడ ప్రహస్తుడు త్వరగా వచ్చి విభీషణుని గదతో కొట్టాడు. రణ కర్కశంగా గర్జించాడు (24) భయంకర వేగము గల గదతో కొట్టబడిన ఆ బుద్ధిమంతుడు, మహాబాహుడు చలించలేదు. ఏమంతుని వలె స్థిరంగా ఉన్నాడు (25) ఆ పిదప విపులమైన అష్టమంటను విభీషణుడు ధరించి, మహాశక్తిని అభిమంత్రించి ఈతని తల పై విసిరాడు (26) ఏడుగులాగ పడుతున్న ఆ శక్తి వేగం వల్ల రాక్షసుడు వాతరోగం వచ్చిన చెటువలె తలలేని వాడై కనిపించాడు (27) యుద్దంలో చంపబడ్డ ప్రహస్తుడను ఆ రాక్షసుని చూచి, ధూమ్రాక్షుడు గొప్ప వేగంతో వానరులను వెంబడించాడు (28) పరుగెత్తుతున్న వానర సైన్యాన్ని చూచి ఆంజనేయుడు బాణంతో రణరంగంలో త్వరగా ధూమ్రాక్షుని కొట్టాడు (29) ధూమ్రాక్షుడు చావటం చూశాక చావగా మిగిలిన రాక్షసులు జరిగినదంతా రాజైన రావణునకు నివేదించారు. (30) ఆపిదప రావణుడు నిద్రిస్తున్న కుంభకర్ణుని లేపాడు. ఆ రావణుడు లేచిన అతనిని యుద్ధమునకు పంపాడు (31) వచ్చిన కుంభకర్ణుని లక్ష్మణుడు బ్రహ్మాస్త్రంతో, కోపంతో సమరంలో కొట్టాడు. అతడు ప్రాణములు పోయి భూమి పై పడ్డాడు (32).

తా ॥ దూషణుని అనుజులు వజ్రవేగ ప్రమాథులు రావణ ప్రతిములు రణమందు హనుమున్నీలులచే చంపబడ్డారు. (33) విశ్వకర్మ సుతుడు నలుడు వజ్రదంష్ట్రుని చంపాడు. కుముదుడను వానరశ్రేషుడు అకంపనుని చంపాడు (34) యుద్ధమందు వరాజితుడైన రాజు తరువాత తన నగరిలో ప్రవేశించాడు. అతికాయుడు త్రిశిరుడు ఇద్దరు లక్ష్మణుని చేత హతులైనారు (35) దేవాంతకనరాంతకులు సుగ్రీవునితో చంపబడ్డారు యుద్ధంలో. కుంభకర్ణుని కుమారులిద్దరు హనుమంతునితో యుద్ధంలో చంపబడ్డారు (36) ఖరుని కొడుకు మకరాక్షుడు విభీషణునితో చంపబడ్డాడు. పిదవ రావణుడు ఇంద్రజితుడను కుమారుని పంపాడు (37) ఇంద్రజిత్తు వరమైన బాణములతో అన్నదమ్ములైన రామలక్ష్మణులను మోహింపజేయగా, అంగదుడు గుఱ్ఱములను చంపగా ఆకసమందున్నాడు (38) కుముద అంగద సుగ్రీవ నలజాంబవదాదులు వీరితో కూడిన ఇతర వానరులందరు ఆతనితో కొట్టబడి పడిపోయారు (39) ఈ విధముగా సైన్యంతో కూడిన రామలక్ష్మణులను యుద్ధంలో హింసించి మహాబలుడైన మేమునాదుడు ఆకాశంలో అంతర్థానమై నాడు(40) పిదప ఇక్ష్వాకుకుల భూషణుడైన రామునితో విభీషణుడు చేతులు జోడించి మాటి మాటికి నమస్కరిస్తూ ఇట్లా అన్నాడు (41) రాజ రాజు యొక్క(కుబేరుని) శాననంతో ఈ గుహ్యకుడు నీటిని తీసుకొని అరిందముడవైన రామ! నీ దగ్గరకు వచ్చాడు (42) ఓ మహారాజ! ఈ నీటిని కుబేరుడు నీకు వంపిస్తున్నాడు. ఓ వరంతవ ! దాగిన (కనిపించని) ప్రాణులను చూచుటకు ఇది ఉపయోగిస్తుంది (43) ఈ నీటిని కళ్ళకు రాసుకుంటే దాగిన ప్రాణులను కూడా నీవు చూడగలుగుతారు. దీనిని నీవు ఎవరికైనా ఇచ్చినచో(44) ఆతడు కూడా ఆకాశంలో కనిపించకుండా ఉన్న ప్రాణులను చూడగలడు. అని రాముడు అట్లాగే అని వలికి గౌరవంగా ఆ నీటిని తీసుకొని (45) నేత్రములను శుచిగా చేసుకున్నాడు. మహాబలుడు లక్ష్మణుడు కూడా అట్లాగే చేశాడు. సుగ్రీవ జాంబవంతులు హనుమాన్ అంగదులు (46) మైందద్వీందనీలులు ఇతరులైన వానరులు, అందరు రాముడిచ్చిన నీటితో కనులను శుభ్రపరచుకొని (47) ఆకాశంలో అంతర్షితుడుగా ఉన్న వీరుడైన రావణుని కుమారుని చూచారు. పిదప దృష్టిగోచరుడైన ఆతనిని లక్ష్మనుడు వెంటనంటాడు (48) మంచి లక్షణము గల (లక్ష్యము) లక్ష్మణుడు, కుబేరుడు వంపిన జలముతో కళ్ళను పరిశుద్ధిచేసుకొని, కోపంతో కొట్టినాడు (49) అప్పుడు లక్ష్మణ ఇంద్రజిత్తులకు గొప్ప యుద్ధం జరిగింది. శక్రప్రహ్లాదులకు వలె మిక్కిలి చిత్రమైన ఆశ్చర్యకరమైన యుద్ధమది (50) ఓ బ్రాహ్మణులార ! పిదవ మూడవరోజున గొప్ప ప్రయత్నంతో బలవంతుడైన లక్ష్మణుడు యుద్ధంలో ఇంద్రజిత్తును చంపాడు (51)

ధీమంతుడైన రాముడు మూలబలాన్నంతా చంపాడు. ఎయవుత్రుడు చనిపోయాక కోపగించిన రావణుడు (52) అనేకమంది సైన్యంతో కూడి రథమధిరోహించి నగరం నుండి బయటికి వచ్చాడు. రావణుడు సీతను చంపుటకు సిద్ధముగా వింధ్యనివారించింది. (53) పిదప సూర్యునిలా వెలిగిపోతున్న ఇంద్రాశ్వములతో కూడిన రథంతో ఇంద్రసారధి మాతలి యుద్ధంలో రాముని ఎదుట నిలిచాడు (54) ధర్మభృతులలో శ్రేషుడైన రాముడు ఇంద్రరథాన్ని అధిరోహించి బ్రహ్మాస్త్రంతో యుద్ధంలో రావణుని శిరస్పులను సంహరించాడు. (55) పిదప దశగ్రీవునిచంపినదశరథ కుమారుడైనరాముని దేవతలు ఋషులుమొదలగువారుజయధ్వానములతో కూడిన ఆశీన్పులతోనుతించారు. (56) అట్లాగే ఢవిద్యాధరులు నంతోషించినుతించారు కవులవత్ర ములవంటి కన్నులు గలరాముని పై పూలవాననువెదజల్లారు. (57) రాముడుదేవతలతో కూడి సైనికులతో చుట్టబడి, సీతా సౌమిత్రులతో కూడివుష్పక విమానమునెక్కి (58) లంకలోవిభీషణునిరాజుగా అభిషేకించి, వానర సైన్యంతో కూడిరాముడు గంధమాదనమునకువెళ్ళాడు (59) గంధమాదనవర్యతమందునీతను పరిశుద్ధిచేసి ఉన్న కమలపత్రములవంటికన్నులు గల రామునివానరులతో చుట్టబడినవానిని (60) లంకేశ్వరునిచంపినవీరునితమ్మునితో, విభీషణునితోకూడిఉన్నవానిని భార్యతో, దేవబృందములతోమునిపుంగవులతో సేవించ బడుతున్న (61) రాముని చూచుటకు దండకారణ్యమందుండే మునులు వచ్చారు. అగస్త్యుని పురస్కరించుకొనిరామునివారుస్తుతించారు (62)

తా మునులు ఇట్లా అన్నారు:  లోకములను అనుగ్రహించే రామచంద్ర నమస్కారము. లోకంలో రావణుడు లేకుండా చేయటం కోసం భూమియందవతరించిన (63) తాటకి దేహమును సంహరించి గాధీజుని యజ్ఞమును రక్షించిన సుబాహప్రాణమును హరించి, మారీచుని జయించిన రామనీకు నమస్కారము (64) అహల్యకు ముక్తినివ్వ గలిగిన, వంకజముల వంటి పాదములందలి రేణువులు గలవాడ! శివధనుస్బును అవలీలగా విరువగలవాడ! నీకు నమస్కారము (65) సీతను పాణిగ్రహణము చేసుకోగల శక్తిగలవాడ, నమస్సులు, రేణుకాపుత్రుని ఓడించినవాడ, నమస్పులు (66) కైకేయి యొక్క రెండు వరముల వలన లక్ష్మణ సీతలతో కూడి, తండ్రి మాటను నిజం చేసే కొరకు అరణ్యము చేరిన వాడ, నమస్పులు (67) భరతుని ప్రార్థనననునరించి నీ రెండు పాదుకలను ఆతనికిచ్చిన వాడ, శరభంగుని స్వర్గప్రాప్తికి కారణమైన వార నమస్కారము (68) విరాధుని సంహరించినవాడ, గృధ్రరాజునకు సఖుడవైన వాడ నమస్కారము. మాయా మృగరూపంలో నున్న మహా క్రూరుడైన మారీచుని శరీరమును ఛేదించినవాడ (69) సీతను ఆవహరించే లోకేశుడైన రావణునితో యుద్ధంలో శరీరమును వదలిన జటాయువును దహించి, అతనికి కైవల్యమునిచ్చిన వాడ (70) కబంధుని సంహరించినవాడ, శబరితో పూజింవబడిన పాదములు గలవాడ నమస్కారము సుగ్రీవునితో సఖ్యమును పొందినవాడ, వాలిని వధించినవాడ నీకు నమస్కారము (71) వరుణాలయమైన నముద్రమందు సేతువును నిర్మించినవాడ, రాక్షసులందరిని సంహరించినవాడ, రావణుని ప్రాణమును హరించినవాడ (72) సంసార సముద్రమును దాటుటకు నావయైన పాదాంబుజములు గలవాడే నీరు నమస్కారము. భక్తుల ఆర్తిని తొలగించే నచ్చిదానంద రూపుడవైన నీకు నమస్కారము. (73) రామభద్రునకు నీకు నమస్కారము. జగత్తు యొక్క అభివృద్ధికి కారణమైన రామ నమస్సులు. రామాది పుణ్యనామములు జపించేవారి పాపముల హరించేవాడ (74) నర్వలోకముల సృష్టి స్థితి అంతములను చేసేవాడ నీకు నమస్కారము. కరుణామూర్తి, భక్తుల రక్షణలో దీక్షవహించినవాడ నమస్సులు (75) విభీషణునకు సుఖమిచ్చిన వాడ, సీతతో కూడిన నీకు నమస్కారము. రావణుని చూపి ఓ రామ! నీవు ఈ జగత్తును రక్షించావు. (76) జగన్నాథ రక్షించు రక్షించు. ఓ జానకీ పతి మమ్ములను రక్షించు. ఓ బ్రాహ్మణులార ! అందరు మునులు ఈ విధముగా స్తుతించి మౌనం వహించారు (77) శ్రీ నూతులిట్లన్నారు. మునులు పలికిన ఈ రామచంద్రుని స్తోత్రాన్ని మూడు సంధ్యల యందు భక్తితో పఠించిన వారు భుక్తిముక్తులను పొందుతారు (78) ప్రయాణకాలమందు చదివిన వారుభీతిని పొందరు. ఈ స్తోత్రాన్ని పఠించటం వలన భూతభేతాల కొదులు (79) నశిస్తారు. రోగాలు నశిస్తాయి. పాపనంచయము నశిస్తుంది. పుత్రకాముడు పుత్రుని పొందుతాడు. కన్యనత్పతిని పొందుతుంది. (80) మోక్షకాముడు మోక్షమును పొందుతాడు. ధనకాముడు ధనాన్ని పొందుతాడు. ఈస్తోత్రమును భక్తితో చదివిన వారు అన్ని కోరికలను పొందుతారు (81).

తా ॥ పిదప రాముడు చేతులు జోడించి నమస్కరించి మునులతో ఇట్లా అన్నాడు. నేను, సకల మానవులకు విశుద్ధి కొరకు పొందదగిన వాణి (82) నా దృష్టి గోచరమైన ప్రాణి నిత్యమైన మోక్షమునకు స్థానము. ఐనా మునులు నిత్యము భక్తితో కూడిన మనసుతో (నమస్కరింప తగినవారు) (83) వరమాత్మ లాభముతో (ఆత్మజ్ఞానంతో) నంతుషులైన సాధువులైన ప్రాణికోటికి సుహృత్తములైన, అహంకార రహితులైన, శాంతులైన, మునులను నమస్కరిస్తున్నాను. (84) నాడు బ్రహ్మణ్యులే దేవతలు అందువలన ఎల్లప్పుడు విప్రులను సేవిస్తాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కొంచెం ఆలోచించి చెప్పండి (85) రావణుని వధ వలన నాకు కల్గిన పాపమునకు నాకు నిష్కృతిని చెప్పండి. ఓ మునిపుంగవులార! నేను ఏం చేస్తే పౌలస్త్య వధ వల్ల కల్గిన పాపము నుండి నేను ముత్తుడనౌతాను. (86) అని అనగా మునులిట్లనిరి - సత్యవ్రత! జగన్నాథ ! జగద్రక్షణలో ధురంధర! (87) ఓ రామ! సర్వలోకముల ఉవకారం కొరకు శివార్చన చేయి. మహా పుణ్య ప్రదమైన, ముక్తినిచ్చే ఈ గంధమాదన శిఖర మందు (88) దశగ్రీవవధ వల్ల కల్గిన దోషం పోయే కొరకు ఓ రామ ! లోక క్షేమ కామనతో నీవు శివలింగ ప్రతిష్టను ఆచరించు (89) లింగస్థావన వల్ల కలిగే పుణ్యమును గూర్చి బ్రహ్మ దేవుడు కూడా చెప్పలేడు. అందువల్ల ఓ మనుజేశ్వర ! చెప్పడానికింకేముంది (90) గంధమాదన పర్వతమందు నీవు స్థాపించే లింగమును చూచిన పురుషులు కాశిలో లింగాన్ని చూడటం వల్ల (91) పొందే వుణ్యం కన్న కోటిరెట్లు ఎక్కువ ఫలవంతమైంది అనుమాసంలేడు, నీ పేరుతో ఈ లింగము లోకంలో ఖ్యాతిని పొందని (92) పుణ్యపాపములను కట్టెలకు అగ్నివంటిది నాశకమైనది. ఇది రామేశ్వర లింగమని లోకంలో ప్రసిద్ధమౌతుంది (93) అందువల్ల లింగస్థావన కర్మలో ఆలన్యం చేయవదు. రామచంద్ర! మహాభాగ ! కరుణా పూర్ణశరీర ! (94) అని అనగా శ్రీ నూతుని వచనం ఇట్లా - రాముడు ఆ మునుల మాటలను విని, మునులతో పుణ్యకాలమును గూర్చి విచారించి రెండు ముహూర్తముల కాలంలో ఉందని తెలుసుకొని జగత్పతి (95) రాముడు హనుమంతుని కైలాస మందలి శివాలయమునకు పంపాడు. శివలింగమును తెచ్చుటకు స్థాపించుట కొరకు రాముడు పంపాడు (96) రాముని వచనము - అంజనీపుత్ర ! వాయుపుత్ర! మహాబల ! హనుమాన్ కైలాసమునకు త్వరగా వెళ్ళి ఆలసించకుండా లింగం తీసుకురా (97) అని రాముడాజ్ఞాపించగా వీర్యవంతుడాతడు భుజములు చరచి వుణ్యకాలము రెండు మూహూర్తములలో ఉందని తెలుసుకొని ఆ హనుమంతుడు (98) దేవతలు, ఋషులు, మహాత్ములు అందరూ చూస్తుండగా గంధమాదనాన్ని కదిలించి వేస్తూ వేగంతో ఎగిరాడు. (99) ఆకాశ మార్గంలో ఎగురుతూ అతడు కైలాస పర్వతానికి వెళ్ళాడు.

తా ॥ వానరుడు లింగరూపధారియైన శివుని చూడలేదు (100) పుణ్యప్రదమైన శంకరుడు పాలించే ఆ కైలాస పర్వతమందు లింగ ప్రాప్తి కొరకు ఆదరంతో ఆంజనేయుడు తపస్సు చేశాడు (101) ఓ ముని పుంగవులార ! తూర్పువైపు కొసలు గల దర్భల పై కూర్చున్నవాడై, చేతులు పైకెత్తి, ఆధారం లేకుండా, ఉచ్చ్వాస ములేకుండా, ఇంద్రియముల జయించి (102) తపస్సు చేసి మహాదేవుని సంతృప్తి పరచి ఆ మారుతి లింగమును పొందాడు. ఇంతలో తత్వదర్శులైన మునులు (103) హనుమంతుడు రాకపోవటం గమనించి ముహూర్తకాలము కొద్దిగానే మిగిలిందని తెలుసుకొని మహామతియైన రామునితో ఇట్లా చెప్పారు (104) ఓ రామ ! మహాబాహు ! ఇప్పుడు మూహూర్త కాలము గడిచి పోతోంది. ఓ విభు! విలాసంగా జానకి చేసిన ఇసుక లింగాన్ని (105) ఇప్పుడు స్థాపించు. అది చాలా శ్రేష్ఠమైన మహా లింగము. ఈ మాటలను రాముడు విని జానకితో కూడి త్వరగా (106) మునులతో కూడి ప్రీతితో మంగళకరమైన కంకణమును (దారంతో ధరించి, జ్యేష మాసం, శుక్ల పక్షం, దశమి, బుధవారం, హస్త నక్షత్రం బుధుడు హస్తయందుండగా (107) గరిజికరణ మందు (ఆ) నందయందు వ్యతీపాత యోగమందు, చంద్రుడు కన్య యందు సూర్యుడు వృషభరాశి యందుండగా ఈ వది కలిసినప్పుడు మహాపుణ్యనమయమందు గంధమాదన పర్వతమందు (108) సేతు మధ్యమందు లింగరూప ధారియైన మహాదేవుని హరుని, ఈశానుని, కృత్తి వానుని, గంగనుచంద్రకళను ధరించిన వానిని (109) శ్రేష్ఠమైన శివలింగమును రాముడు స్థాపించాడు. లింగమందున్న సాంబుని, ఈశ్వరుని రామువుడు పూజించసాగాడు (110) లింగమందున్న ఆ మహాదేవుడు పార్వతితో కూడిన శంకరుడు ప్రత్యక్షమై ఉత్తమమైన వరమును ఆ భగవానుడు ఇచ్చాడు (111) నర్వలోకశరణ్యుడైన మహాత్ముడైన రామునకు వరమిచ్చాడు. ఓ రఘుశ్రేష్ఠ ! నీవు ఇచ్చట స్థాపించిన లింగాన్ని చూచినవారు (112) మహాపాతకములు కలవారైనా వారి పాపం నశిస్తుంది. అన్ని పావములు ధనుష్కోటి యందు స్నానం చేయటం వలన (113) రామలింగమును దర్శించటం వలన మహాపాతకములైనా నశిస్తాయి. ఓ రాజేంద్ర! రామచంద్ర! అనుమానంలేదు (114) ఈ విధముగా రామునకు అంబికాపతియైన దైవము వరమిచ్చాడు. రాముడు ఆ లింగము ముందు నందికేశుని స్థాపించాడు. (115) రాఘవుడు ఈశ్వరుని అభిషేకము కొరకు ధనస్సు యొక్క అంచుతో భూమిని ఛేదించి ఒక బావిని కల్పించాడు, ఓ ద్విజులార ! (116) దాని నుండి జలం తీసుకొని వచ్చి శంకరునకు స్నానం చేయించాడు. కోటి తీర్థమని చెప్పబడే ఆ తీర్థము ఉత్తమమైనది పుణ్యమైనది (117) ఇంతకు మునుపు దాని వైభవాన్ని మేము చెప్పాము. ఓ ముని పుంగవులార ! దేవతలు, మునులు, నాగులు, గంధర్వ అప్సరసల నమూహములు, అందరు వానరులు ఆదరంతో ఒక్కొక్క లింగాన్ని చేశారు (118) శ్రీ నూతులిట్లనిరి - ధీమంతుడైన రాముడు స్థాపించిన, భక్తి ముక్తి ప్రదాయకమైన శివలింగమును గూర్చి ఓ విప్రులార ఈ విధము మీకు చెప్పాను. (119) ఈ లింగ ప్రతిష్టను గూర్చి వినిన, చదివిన (120) వారు రామేశ్వర లింగమును సేవించటం వల్ల కలిగే ఫలాన్ని పొందుతారు. రామనాథుని వైభవం వల్లసాయుజ్యమును కూడా పొందుతారు.(121) అని శ్రీ స్కాంద మహావురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్య మందు రామనాథ లింగ ప్రతిష్ఠ విధి వర్ణన మనునది నలుబది నాల్గవ అధ్యాయము.