స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
47వ అధ్యాయము
తా ॥ ఋషులిట్లనిరి - ఓ మహాముని రాక్షసుడైన రావణుని వధమున మహాత్ముడైన రామువునకు బ్రహ్మహత్య ఎట్లా కలిగింది (1) బ్రాహ్మణుని చంపితే బ్రహ్మహత్యా దోషం కలుగుతుంది. దశగ్రీవుడు బ్రాహ్మణుడు కాడుగద. అదెట్లా ఓ ముని! మాకది చెప్పండి (2) ధీమంతుడైన రామచంద్రునకు క్రూరమైన బ్రహ్మహత్య ఎట్లా కలుగుతుంది. దీనిని శ్రద్ధకలిగిన మాకు దయతో ఇప్పడు చెప్పండి (3) అని నైమిషారణ్య వాసులైన మునులడుగగా పిదప నూతుడు వారి ప్రశ్నకు ఉత్తమమైన ఉత్తరమును చెప్పుట కారంభించాడు (4) శ్రీ సూతుని వచనము - బ్రహ్మపుత్రుడు మహాతేజ సంపన్నుడు పులస్త్యుడు అని కలడు. అతనికి విశ్రవుడని ప్రసిద్ధిచెందిన వుత్రుడు కలిగాడు (5) ఓ ముని వుంగవులార పులస్త్యుని కొడుకు విశ్రవుడు దేవతలు కూడా ఆచరించలేని తపస్సును చాలా కాలం చేశాడు (6) ఆతడు తపస్సు చేస్తుండగా నుమాలి అను పేరుగల రాక్షసుడు పాతాళ లోకమునుండి భూలోకమంతా తిరిగాడు (7) బంగారు పతకములు గల భుజకీర్తులు ధరించి, కాలమేనుమువంటి నల్లని శరీరకాంతి గలవాడై, వద్మము నుండి హీనమైన శ్రీవలె ఉన్న కన్యయైన తన సుతను తీసుకొని (8) ఆతడు భూమి పై తిరుగుతూ ఒకసారి పుష్టకమందున్న విశ్రవసుని పుత్రుడైన ధనేశ్వరుడైన కుబేరుని చూచి (9) సుమాలి అను ఆ రాక్షసుడు చింతించసాగాడు. కుబేరుని వంటి కొడుకు మాకు కలిగితే (10) మేము రాక్షసుల మంతా ఏ భయం లేకుండా వృద్ధి చెందుతాము. ఈ విధముగా ఆలోచించి రాక్షసేశ్వరుడు తన కూతురుతో ఇట్లా అనినాడు. (11) ఓ శోభన! కైకన ఇది నీకు ప్రదానము చేసే కాలము. ఇప్పటికి నీకు యవ్వనం వచ్చినది. నిన్ను వరునకు ఇవ్వాలి (12) కూతురును ఇవ్వనందువలన తల్లిదండ్రులు దఃఖాన్ని పొందుతారు. ఇంకా నీవు నర్వగుణములతో ఉత్కృష్ఠురాలివి. ఓ సుత నీవు లక్ష్మివలె శుభమైన దానివి (13) నిరాకరిస్తావనే భయంతో పురుషులు నిన్ను ప్రార్థించటంలేదు. అభిమానం కోరుకునే అందరికి కన్యాపితృత్వము దు:ఖకారకము (14) ఓ కన్యక! నిన్నెవరు వరిస్తారో నోకు తెలియదు. నీవు పులస్త్యతనయుడు ముని ఐన విశ్రవసుని ద్విజుని (15) బ్రహ్మకులములో జన్మించిన వానిని స్వయంగా వెళ్ళి వరించు. నీరు కుబేరునితో నమానమైన పుత్రులు కల్గుతారు. అనుమానములేదు అని (16).
తా ॥ కైకసి ఆ మాటలను విని ఆ కన్య తండ్రి మిది గౌరవం కొలది స్వచ్ఛంగా నవ్వుతూ అట్లాగే కానిమ్మని ఆతని వాక్యాన్ని అంగీకరించింది. (17) ఓ మునిశ్రేషులార ! విశ్రవన ముని యొక్క వర్ణశాలకు వెళ్ళి, సిగ్గుపడుతూ, తలను వంచుకొని ఆతని నమీపంలో నిల్చుంది (18) ఆ సందర్భంలో బుద్ధిమంతుడైన ఆ పులస్త్య తనయుడు, మండుతున్న అగ్నిలా ఉన్న ఆతడు అగ్ని హోత్రాన్ని ఉపాసిస్తున్నాడు (19) కైకసి అతిక్రూరమైన సంధ్యాకాలాన్ని గమనించకుండా, ఆ సుభ్రు తండ్రి మాటలమీద గౌరవంతో
ఆమునిని చేరి (20) బొటన వేలికొసతో భూమిని రాస్తూ, తల వంచుకొని ఉండింది. తమ మధ్యమైన కైకసిని విశ్రవసుడు చూచి పూర్ణచంద్రుని వంటి ముఖకాంతి గల ఆమెతో నవ్వుతూ ఇట్లన్నాడు. (21) విశ్రవుని మాటలు - ఓ శోభన! నీవెవరి కూతురవు. ఎక్కడి నుండి నీవిక్కడికి వచ్చావు (22) ఓ శుచిస్మిత! ఏ పని కోసమని నీవిక్కడున్నావు. ఓ అనిందిత! ఉన్నదున్నట్లుగా వారంతాచెవ్వు (23) అని అనగా ఆతన్య కైకసి చేతులు జోడించి, వినయంతో ఉండి నమ్రంగా ఆమునితో ఇట్లా అంది (24) ఓముని! తవః ప్రభావంతో నా అభిప్రాయాన్ని మీరు బాగా తెలుసుకోవచ్చు. ఓ పులస్త్యకులదీవన! (25) ఓముని ! నేను నుమాలి కూతురును కైకసి అని నా పేరు. నా తండ్రి ఆజ్ఞతో మీదగ్గర కొచ్చాను. ఓ బ్రహ్మ (26) మిగిలిన విషయాన్ని ఈ వేళ మీరు జన దృష్టితో తెలుసు కోగలరు, అనుమానంలేదు. ఆ చిత్రవనముని క్షణం సేపు ధ్యానించి కైకసితో ఇట్లా అన్నాడు. (27) ఓ ను! నీమనోగతమైన కోరికను నేను తెలుసుకున్నాను. ఓ శుభమైనదాన ! ఇప్పుడు నీవు వుత్రుని అధీలషిస్తూ నాదగ్గరి కొచ్చావు. (28) నా దగ్గరకు నీవు ఇప్పుడు క్రూరమైన సాయంకాలమందు వచ్చావు. వుత్రుల నభిలషిస్తూ వచ్చావు కనుక నీతో చెబుతున్నాను (29) ఓ రామ! (ఫ్రీ) కైకసి ! అనిందిత ! నీవు శధగావిను. దారు ఐులు, దారుణాకారులు, దారుణమైన వంశమందు (పొగడ్తలందు) ఇష్టమైన వారు (30) క్రూరకర్ములు ఐన రాక్షసులను వుత్రులను నీవు కంటావు. ఆ మాటలు విని ఆ కైకసి ఆతనికి నమస్కరించి (31) చేతులు జోడించి పులస్త్య తనయునితో ఇట్లా అంది. భగవాన్ ! ఇటువంటి పుత్రులను మీనుండి పొందటం తగదు (32) అని అనగా ఆముని నుమధ్య గల కైకసితో ఇట్లా అన్నాడు. చివర వా వంశమున కనుగుణమైన పుత్రుడు వీడు కలుతాడు. (33) ధార్మికుడు, శాస్త్ర మెరిగినవాడు, శాంతుడు, రాక్షన చేష్టలు లేనివాడు కలుతాడు అని కైకసితో అనగా కొంతకాలం గడిచాక ఆమె (34) క్రూరుడు రక్షోరూపుడు, భయంకరుడు ఐన పుత్రుని వనవించింది.
తా ॥ పదితలలు, కుమతి, ఇరువది చేతులు, భయానకుడు (35) ఎర్రని పెదవులు, నల్లని ముఖము ఎర్రని మీసములు తలవెంట్రుకలు గల, పెద్ద. కోరలు, పెద్దశరీరము, ఎప్పుడూ లోకములకు భయం కల్గించే (36) దశగ్రీవుడను పేరుగల సుతుడు కళినాడు. అట్లాగే రావణుడని పేరు కల్గింది. రావణుని తరువాత కుంభకరుడను పేరుగల సుతుడు కలిగారు (37) ఆ పిదప శూర్పణఖ అను పేరుగల క్రూరురాలైన రాక్షసి కలిగింది. ఆ పిదప కైకసికి విభీషణుడని ప్రసిద్ధమైన వుత్రుడు కలిగాడు (38) చివరి కుమారుడు బుద్ధిమంతుడు, ధార్మికుడు, వేదశాస్త్రముల నెరిగినవాడు, వీరు దశగ్రీవాదులు విశ్రవసుని పుత్రులు (39) అందువలన దశగ్రీవుని వధవలన కుంభకర్ణుని వధవలన ఏ పనినైనా సులభంగా చేయగల రామునకు బ్రహ్మహత్య దోషం కలిగింది (40) అందువలన దాని శాంతి కొరకు రాముడు రామేశ్వరమును పేరు గల లింగమును వైదిక విధి ప్రకారము స్థాపించాడు (41) ఈ విధంగా రావణుని వధతో బ్రహ్మహత్య పుట్టుక, లోక కాంతుడైన ధీమంతుడైన రామచంద్రునకు కలిగింది (42) ఆ బ్రహ్మ వతము వలన కళిన దానిని గూర్చి మీకు సకారణంగో వివరించాను. ఆ పాపశాంతి కొరకే రాముడు లింగమును స్వయంగా రాముడు ప్రతిష్టించాడు. (43) అతి ధార్మికుడైన రామచంద్రుడు ఇట్లా లింగమును స్థాపించి సీతాలక్ష్మణులతో కలిసి రాముడు తనను కృతార్శనిగా భావించాడు (44) రామచంద్ర భవతి బ్రహ్మహత్య పోయిన చోటు బ్రహ్మహత్యా విమోచన మనే చిన్న తీర్థమైంది (45) అక్కడ స్నానం చేయటం మహాపుణ్య ప్రదము బ్రహ్మహత్యను నశింప చేసేది. రావణుడు నేటికి కూడా అక్కడ ఛాయరూపంలో అక్కడ కన్పిస్తాడు (46) దాని ముందు నాగలోకమునకు మహత్తరమైన బిలముంది. దశగ్రీవ వధ వల్ల కలిగిన బలీయమైన బ్రహ్మహత్యను (47) జానకీ రమణుడు ఆ బిలంలోకి చేర్చాడు. పిదప ఆ బిలము పైన ఉత్తమమైన మండపాన్ని చేసి (48) రక్ష కొరకు రామువుడు భైరవుని స్థాపించాడు. భైరవుని ఆజ్ఞకు భయపడి భయంకరమైన బ్రహ్మహత్య (49) ఆబిలం నుండి
పైకి రావటానికి శక్తురాలు కాలేదు. ఏ ప్రయత్నం లేకుండా బ్రహ్మహత్య ఆ బిలంలోనే ఉండిపోయింది. (50)
తా ॥ రామనాథ మహాలింగమునకు దక్షిణ భాగంలో సంతోషంగా గిరిజ, పరమానంద స్వరూపుడైన శివుని అర్థశరీరమైన గిరిజ ఉంది (51) శివునకు ఇరు ప్రక్కల ఆదిత్య సోములున్నారు. దేవునకు ముందు భాగమున అగ్ని ఉన్నాడు. (52) రామనాధునకు తూర్పుదిక్కున ఇంద్రుడున్నాడు. అగ్నేయ మందు అగ్ని దక్షిణ మందు యముడు రామనాథ సేవకుడున్నాడు. (53) నైఋతి యందు నిర్ ఋతి ఉన్నాడు. శంకరునకు వరుణదిక్కు యందు వరుణుడు రాఘవేశ్వరుని భక్తితో సేవిస్తున్నాడు (54) శివునకు వాయవ్య భాగమందు వాయువున్నాడు. ఉత్తరమందు రామనాధునకు కుబేరుడున్నాడు (55) ఈతనికి ఈశాన్యదిగ్భాగమందు మహేశ్వరుడున్నాడు. వినాయక కుమారులు మహాదేవుని కుమారులిద్దరు (56) రామనాధాలయమందు తగిన స్థానాల్లో ఉన్నారు. మహేశ్వర గణనాయకులు వీరభద్రాదులందరు (57) రామనాధాలయమందు యథాప్రదేశమందు ఉన్నారు. మునులు, పన్నగులు, సీదులు, గంధర్వ అప్సరస గణములు (58) సంతోషించిన హృదయం కలవారై శివసన్నిధి యందు యథేష్టంగా రామనాథుని సేవకొరకు భక్తిపూర్వకముగా ఉన్నారు (59) రామనాథుని పూజకొరకు శ్రోత్రియులైన అనేకమంది బ్రాహ్మణులను రామేశ్వరమందు రఘువతి పూజకులను గా నియమించాడు (60) రామప్రతిష్ణాతులైన వారిని విప్రులను హవ్యకవ్యాదులతో అర్చించాలి. వారు సంతోషిస్తే పితరులు, దేవతలు అందరు సంతోషిస్తారు (61) వారికి జానకీవతి బహుధనమును గ్రామములను ఇచ్చాడు. రామనాథ మహదేవ నైవేద్యం కొరకు గూడో (62) బహు గ్రామములను బహుధనమును లక్ష్మణా గ్రజుడిచ్చాడు. హారకేయూర కటక నిష్కము మొదలగు ఆభరణములను (63) అనేక నార వస్త్రములను రకరకములైన పట్టువస్త్రములను దశరథాత్మజుడైన రాముడు రామనాధునకు ఇచ్చాడు. (64) గంగ యమున పుణ్యప్రదమైన సరయు సరస్వతి తమ పాపశాంతి కొరకు సేతువు యందు రామేశ్వర దేవుని సేవిస్తున్నాయి (65) ఈ అధ్యాయము పఠనం వల్ల శ్రవణం వల్ల మానవుడు సర్వపాపముల నుండి విముక్తుడై వారిసాయుజ్యమును పొందుతాడు (66) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్య మందు రాముని బ్రహ్మహత్యోత్పత్తి తుని రూపణమనునది నలుబది ఏడవ అధ్యాయము.
