స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
28వ అధ్యాయము
శ్రీ సూతులిట్లనిరి - మహాపుణ్యప్రదమైన తోటి తీర్థమును మాత్రము సేవించి, నరుడు పిదప జితేంద్రియ తీర్థము పిదప సాధ్యామృత తీర్థ మందు స్నానం చేయటానికి వెళ్ళాలి (1) సాధ్యామృతము గొప్ప తీర్థము. మహా పుణ్య ఫలము నిచ్చేది. మహా దుఃఖమును తొలగించేది. గంధమాదన పర్వతమందు (2) ఉంది. అది పాపహరము సర్వాభీష్టముల నిచ్చేది. అక్కడ నరుడు భక్తితో స్నానం చేసిన అన్ని కోరికలను పొందుతాడు (3) తవస్పుతో బ్రహ్మచర్యంతో యజ్ఞం దానములతో పొందని గతిని సాధ్యామృత తీర్థమజ్జనం వల్ల పొందుతాడు (4) శుభమైన సాధ్యామృత జలం శరీరాన్ని తాకినట్లైతే, వారి దేహగత పాపము ఆక్షణంలోనే నశిస్తుంది (5) సాధ్యామృతజల మందు అవమర్షణ స్నానం చేసిన నరుడు ఇక్కడ పాపాలు పోగొట్టుకుని విష్ణులోకంలో వెలుగుతాడు (6) పూర్వవయస్సులో పాపకర్మలు చేసిన నరుడు, పిదప పశ్పితావంతో సాధ్యమృతాన్ని సేవిస్తే (7) ఆ నరుడు అంత వయస్సులో ముక్తుడౌతాడు. అనుమానం లేదు. నరుడు సాధ్యామృతంలో స్నానం చేసి దేహ బంధ మునుండి ముక్తుడౌతాడు (8) సాధ్యామృతజలమందుస్నానంచేసిన పాపకర్ములు అనేక క్లేశములతో వరమైన నరకములకు వెళ్ళరు (9) సాధ్యామృత జలంలో స్నానం వల్ల నరులకు కలిగే గతి యజ్ఞములతో వేదములతో పుణ్యకర్మలతో కలగదు (10) సాధ్యామృత జలమందున్నవారు, మనుష్యులకు ఎముకలెన్ని ఉన్నాయో అంతకాలము పూజితులై శివలోకమందుంటారు (11) తీవ్రమైన చీకటి తొలగించి ఉదయ మందు రవి3లిగినట్లు, సాధ్యామృత మందు స్నానం చేసినవారు పావముల చేదించి వెలుగుతారు (12) ఇక్కడ స్నానము చేసి పూర్వం పురూరవుడను రాజు తుంబురు శాపంవల్ల వచ్చిన ఊర్వ వియోగమును తొలగించుకున్నాడు (13) ఋషులిట్లనిరి - ఓ మహాభాగ ! మాత ! అమరస్రమైన ఊర్వశితో (14) మర్త్యుడైన పురూరవరాజు మొదట ఎట్లా యోగాన్ని పొందాడు. తుంబురు శాపం వల్ల కల్గిన ఊర్వశి వియోగాన్ని ఎట్లు వదిలాడు (15) తుంబురుముని ఏ కారణంగా రాజును శపించాడు. ఓ మునిపుంగవ ! ఇదంతా విస్తరంగా చెప్పండి, అని (16)
సూతుడిట్లనెను - ఇంద్రునితో సమానమైన పరాక్రమం కలవాడు పురూరవుడను రాజు, రాజరాజుతో సమానమైనవాడు దేవతలతో పూజింపబడినవాడు పూర్వం ఉండేవాడు (17) ఆ రాజు భూమిని ధర్మంగా పాలించసాగాడు. అనేక యజ్ఞములు చేశాడు ఎప్పుడూ దానాలు చేసేవాడు (18) ఆ బుద్ధి గలరాజు భూమిని పాలిస్తూ ఉండగా మిత్రావరుణుని శాపంవల్ల ఊర్వశి భూమి పైకి వచ్చింది (19) ఆ రాజుగారి వురం సమీపంలో ఆమె ఊర్వశి తిరుగసాగింది. కోకిల ధ్వనివలె మధురమైన వీణలో ఉవవనమునకు వెళ్ళింది (20) ఆ రాజు ఉపవనంలో విహరించుటకు ఒకసారి కుతూహలం కలవాడై గుళమునెక్కి నూరుగురు స్త్రీలతో కూడి వెళ్ళాడు (21) అటువంటి ఊర్వశిని, ఎడిటనణుగు నడుము కలదానిని చూచి రోజు నీవు నా భార్యవుకమ్ము అని ఆమెతో అన్నాడు (22) ఆమె కామాతురమై రాజుతో ఇట్లా అంది. నా షరతులను నీవు పాటించేటైతే అట్లాగే కాని ఓ రాజ ! అని అంది (23) శాతుకం కలదాన్నే నీ అధీనంలో ఉంటాను అని అనగా రాజు ఓ సల్లు ! నీ ఒప్పందమును నేను ఆచరిస్తాను అన్నాడు (24) అవ్వడు ఉర్వశి పురూరవుని యందు ఔత్పుర్యం కలదై ఇట్లా అంది. పుత్రులతో సమానమైన వాఈ రెండు పొట్టేళ్ళను రక్షించే వక్షంలో, (25) అట్లాగే ఎవ్వడూ నగ్నంగా రాజా ! నీవు నాకు కన్పించని పక్షంలో, వాడు ఎంగిలి ఇవ్వనిపక్షంలో వేను నీ దగ్గర ఉంటాను (26) ఓ రాజా నేను వేయిని మాత్రమే భుజిస్తాను. అని అనగా అట్లాగే కానిమ్మని రాజు ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు (27) ఆరాజు అలకానగర మందు అట్లాగే చైత్రరథవనమందు వద్మ ఖండములతో మనోహరమైన సరస్వతీ తీరమందు ఆనందంగా గడిపాడు (28) అరువది ఒక్క సంవత్సరాలు ఆమెతో క్రీడిస్తూ గడిపాడు. దానితో ఊర్వశి ప్రతిరోజు పెరుగుతున్న అనురాగం కలదై (29) ఆతనుమధ్యమదేవలోకంను గూడా జ్ఞప్తి చేయలేదు. ఆమె లేకుండ దేవలోకము అందంగా లేదు (30) అందువల్ల ఆమెను దేవలోకానికి తీసుకువస్తానని ఆలోచించి విశ్వావసువు క్షణంలో భూలోకానికి వచ్చాడు (31) రాజుతో కూడా ఉర్వశికి గల షరతులను విశ్వావసువు తెలుసుకొని, మధ్యరాత్రి గంధర్వులతో కూడి (32) ఉర్వశి యొక్క పడకగది నుండి వేగంగా పొట్టేలును ఎత్తుకెళ్ళాడు. ఆకాశంలో తీసుకుపోబడుతున్న దాని ధ్వనిని విని ఉర్వశి, వతి (33) తో ఇట్లా అంది. వా కొడుకును ఎవరు తీసుకెళ్తున్నారు. దానివి వదలండి. చైతన్యం కోల్పోయి. అవాథపై ఎవరిని శరణు వేడాలి (34) అర్థరాత్రి పురూరవుడు ఆమె మాటలను వివి, నగ్నంగా ఉన్న నన్ను దేవి చూడకూడదవి అప్పుడు ఆ ఉరణము యొక్క శబ్దాన్ని కూడా ఉర్వశి విన్నది (36).
అనాథలైన నా కుమారుని దొంగలు తీసుకుపోతున్నారు, అని దేవి పరుషంగా ఏడ్చింది. ఏ నరుని శరణు వేడాలి అని అంది (37) రాజు ఆ మాటలను విని కోపమునకు లోనై అంతా చీకటిమయంగా ఉంది అని తలచి ఆతడు ఖడ్గం ధరించి (38) దుష్ట ! దుష్ట ! ఎక్కడి కెళ్తున్నావు అని అంటూ వెంబడించాడు. అంతలో గంధర్వులు కల్గించిన సౌదామినీ బాగా వెలిగిందీ (39) ఆ కాంతులతో దేవి వస్త్రము లేని రాజును చూసి షరతు తప్పాడు కనుక ఆక్షణంలోనే వెళ్ళిపోయింది (40) అక్కడ పొట్టేళ్ళను వదలి గంధర్వులు కూడా వెళ్ళి పోయారు. రాజు ఆ మేషములను తీనుకొని ఆనందంతో తన నడక నమీవము విశాలమైన నేత్రములు కల ఊర్వశి కనబడలేదు. ఆమె కన్పించక, వివస్రుడై యుండి పిచ్చివానివలె భూమిమీద తిరిగాడు (42) రాజు కురుక్షేత్రమునకు వెళ్ళి పద్మములతో నిండిన తటాక ముందు నలుగురు అప్పర స్త్రీలతో క్రీడిస్తున్న ఆమెను చూచాడు (43) మనస్సులో మౌరాఫరా అని మాటి మాటికి అనుకుంటూ హేజాయ (భార్య) ఉండు అని అన్నాడు. ఈ విధముగా చాలా రకాలుగా మంచి మాటలను ఆ రాజు పలికాడు (44) అవరన గణములతో క్రీడిస్తూ ఉర్వశి అతనితో ఇట్లా అంది. ఓ పుణ్యాత్మ ! మహారాజ ! ఈ చేష్టలిక చాలు (45) నీ మూలంగానే, గర్భన తినయ్యాను. అబ్దము చివర నీవు ఇక్కడికిరా. అతిధార్మికుడైన కుమారుడు నీకు కలుతాడు (46) అప్పుడు ఒకరాత్రిని నీతో గడువుతాను ఓ రాజ ! అని అనగా రాజు సంతుష్టుడై తన పట్టణానికి చేరాడు (47) ఆ అప్సరసలకు ఆమె ఆ రాజును గూర్చి ఇట్లా చెప్పింది. ఈ పురుష శ్రేషునితో వేను కామరూపంతో (48) ఇంత పెద్ద కాలము అనురాగ వశురాలనై ఈ రాజుతో కూడా చాలా కాలము స్నేహంగా నివసించాను. అని (49) ఆమె చెప్పగా వారు చెలులు (బాగు) మంచిది మంచిది (బాగు) అని అన్నారు. పర్వతాలము మనము ఓ సఖి! ఇతనితో పాటుందాము (50) అని సఖిమైన ఉర్వశితో అప్పరసలు అన్నారు. సంవత్సరం నిండాక రాజు కూడా తటాక సమీపానికి వచ్చాడు (51) వచ్బిన పురూరవరాజును చూచి ఉర్వశి ఆయుష్మంతుడైన కుమారుని సంతోషమైన మనస్సుతో ఆతనికిచ్చింది (52).
అనురాగంతో అతనితో పాటు ఒక రాత్రిని గడిపింది. ఆ ఉర్వశి అతని నుండి ఐదుగురు పుత్రులను ఇవ్వగలిగిన గర్బమును పొందింది (53) వరమ అంగనమైన ఉర్వశి రాజుతో ఇట్లా అంది - నా సంతోషం కొరకు ఈ గంధర్వులు నీకు వరాన్ని ఇస్తారు (54) నీవు ప్రార్థించగా వారు నీకు వరమిస్తారు ఓరాజర్షి అని ఆమె చేవ్పగా రాజు గంధర్వులతో ఇట్లా అన్నాడు (55) నాధనాగారం నిండుగా ఉంది. శత్రుమండలాన్ని జయంచాను. ఉర్వశిలోకం చేరటం తప్ప నేను పొందగలిగింది మరొకటి లేదు (56) అందువల్ల ఆ ఊర్వశితో కూడా కాలం గడపటాన్ని నేను కోరుకుంటున్నాను.రాజు ఇట్ల పలుకగా గంధర్వులు సంతోషించిన మనస్సు కలవారై ఈతనికి అగ్నిలినిచ్చి ఈ రాజుతో ఇట్లా అన్నారు (57) గంధర్వులమాట - నీవు వేదముల అనుసరించేవాడివి. ఓ రాజ! అగ్నిని మూడు భాగములుచేసి (58) యజ్ఞము చేసి ఉర్వశి లోకమునకు చేరు ఓ రాజ ! అని వారనగా వారి నుండి అగ్ని స్థాలిని తీసుకొని రాజు వెళ్ళాడు (59) అడవిమధ్యలో రాజు నేను చాలా మూర్శణి అయ్యో ! ఉర్వశి లంభిచలేదు. వహ్ని స్థానంతో వనియేమి (60) అని అనుకొని స్థాలిని అడవియందే ఉంచి రాజు తన నగరానికి వెళ్ళాడు. అర్థరాత్రి గడిచాక ఈ రాజు నిద్రరాక స్వయంగా ఇట్లా ఆలోచించాడు (61) ఉర్వశీలోక సిద్ధి కొరకు నాకు గంధర్వశ్రేషులు అగ్నిస్థాలినిచ్చారు. నేను దాన్ని అడవిలో వదిలాను (62) తిరిగి స్థాలిని తీసుకువస్తాను. అని లేచి అడవికి వెళ్ళాడు. ఈ పురూరవునకు అక్కడ అడవిలో అగ్ని స్థాలి కనిపించలేదు (63) అగ్ని స్థానములైన శమీ గర్భమును, అశ్వత్తమును రాజు చూచి ఇట్లా ఆలోచించాడు. ఇంతకు ముందు ఈ అడవిలో నేను స్థాలిని పెట్టాను కదా (64) అది ఇప్పుడిక్కడ అశ్వతము శమీ గర్బము ఐంది. అందువల్ల నేను వహ్నిరూపమైన దీనిని తీసుకొని నగరానికి (65) వెళ్ళి మంచి గఅరణిని చేసి, అందుండి పుట్టిన అగ్నిని ఆదరంతో ఉపాసిస్తాను. అని నిశ్చయించుకొని రాజు తన నగరానికి వెళ్ళాడు (66).
రాజు తన అంగుళులతో కొలిచి అందమైన అరణిని చేశాడు. ఓ బ్రాహ్మణులార ! నిర్మాణ సమయమందు రాజు గాయత్రిని జపించాడు (67) గాయత్రిని చదువుతున్నపుడు దానికి ఎన్ని అక్షరాలున్నాయో అన్ని అంగుళుల ప్రమాణముగల అరణిని రాజు చేశారు (68) అక్కడ చిలికి రాజు మూడర్నుల పుట్టించి ఉర్వలోక సంప్రాప్తి ఫలాన్ని ఉద్దేశించి ఆ కోరికతో (69) వేదానుసారియైన రాజు మూగగ్నులలో ఆనందంగా హోమంచేశాడు. అదే అగ్ని వీధితో అనేక యజ్ఞములను చేశాడు (70) దానితో రాజు గంధర్వలోకములను పొంది, దేవలోకంలో ఉర్వశీతో కూడి చాలా కాలము రమించాడు (71) అందరు దేవతలతో కూడి ఒకసారి ఇంద్రుడు సభలో సురాంగనల నృత్యాన్ని చూచాడు (72) అప్పుడు దేవేంద్రుని సదస్సుకు వురూరవరాజు కూడా వచ్చాడు, మనోహరమైన స్వర్గంలో ఉండే దేవతాస్త్రీల నృత్యం చూడటానికి. (73) ఆ స్త్రీలు ఒక్క రొక్కరుగా ఇంద్రుని ఎదుట నాట్యం చేశారు అప్పుడు ఊర్వశి వచ్చి ఇంద్రుని ఎదుట నాట్యం చేసింది (74) నృత్త అభినయ సామర్థ్యమనే గర్వంతో కూడిన ఉర్వశి, ఆ వురూరవసుని చూచి అతి మనోహరమైన ఆమె నవ్వింది. (75) ఆ ఉర్వశిని చూచి అప్పుడు రాజు కూడా నవ్వాడు. పిదప నాట్యాచార్యుడైన తుంబురుడు హానంతో కోపగించినవాడై ఉర్వశిని రాజును వారిద్దరిని కోపంతో శపించాడు (76) తుంబురుడిట్లన్నాడు. అనేక దేవతలతో నిండిన సభయందు మీరేం చేశారు (77) నిష్కారణంగా వృథాగా నాట్యం మధ్యలో మీరిద్దరు నవ్వారు. అందువల్ల మీరు ఇద్దరికి త్వరగా క్షణంలో వియోగము (78) కలగని, అని అందరు దేవతల సన్నిధిలో ఈతనిని శపించాడు. నాట్యాచార్యునితో శపించబడ్డరాజు దుఃఖితుడై (79) రక్షించు, రక్షించు అని ఇంద్రుని శరణు వేడాడు. దీనమైన మాటలతో వురూరవుడు ఇంద్రునితో ఇట్లా అన్నాడు(80)
ఉర్వశితో సహ సాలోక్య సిద్ధికొరకు నేను యజ్ఞం చేశాను. అందువల్ల ఆమె వియోగము వారు భరింపరానిది ఓ ఇంద్ర ! (81) అని పలుకుతున్న అతనితో వహస్రాక్షుడు శచీపతి ఇట్లా అన్నాడు. ఓ రాజ! నీవు భయపడవదు. నీకు శాపమోక్షాన్ని చెబుతాను (82) దక్షిణ సముద్ర ముందు పుణ్యమైన గంధమాదన పర్వతమందు మహత్తరమైనది సాధ్యమృతమని ప్రసిద్ధి చెందిన తీర్థముంది (83) సర్వదేవతలతో సిద్దచారణకివురులతో సేవింపబడేది. వనకాది మహాయోగిముని బృందములతో సేవింపబడేది (84) పురుషులకు భుక్తిముక్తులనిచ్చేది. సర్వశాపములనుండి ముక్తినిచ్చేది, తీర్థముంది ఓరాజ ! త్వరగా నీవు అక్కడికి వెళ్ళు (85) అందరికి ఇక్కడ స్నానం వల్ల అమృతము సాధ్యమౌతుంది. కనుక సాధ్యామృతమని వైవిధమైంది. సర్వలోక ములలో ప్రసిద్ధమైంది (86) అక్కడస్నానంచేస్తే నీకు ఊర్వశికి తిరిగి యోగం కలుగుతుంది. వాలోకంలో నివాసంథూడా సంభవిస్తుంది. అనుమానంలేదు. (87) అని ఇంద్రుడు ఎమాధానము చెప్పగా రాజు ప్రీతినందినమనస్సుగలవాడై క్షణంలో, సాధ్యామృత మహాత్తీర్ణమును గూర్చి వెళ్ళాడు. (88) మహాపాతకనాశకమైన సాధ్యమృతమునందుస్నానంచేశాడు. ఓవిప్రులారా! అక్కడ స్నానం చేయటంవల్ల రాజువేంటనే శావంనుండి విముక్తుడైనాడు (89) స్నానానంతరమే ఈరోజు ఉర్వశితో చూడరడివాడు. ఆమెతో విమానముందు కూర్చుని అమరావతికి వెళ్ళాడు (90) దేవమందిరమందు దేవుని వలితిరిగి ఆమెలో తడిరమించాడు. ఇట్టి ప్రభావముగలది అత్యుత్తమమైన సాధ్యమృతతీర్థము (91) ఇక్కడ స్నానంచేయటంవల్ల పురూరవుడు ఉర్వశితో కలిశాడు. అందువల్ల ఈతీర్థంలో మహాపాతకనాశినిలో స్నానం చేసినవారు (92) ఇష్టమైన కోరికలను పొందుతారు. ఉత్తమమైన స్వర్గానికి చేరుతారు. నిష్కాముడై స్నానంచే స్తే మోక్షాన్ని పొందుతాడు (93) పవిత్రమైన పాపావానమైన ఈ అధ్యాయాన్ని చదివినవారు, విన్నవారు వైకుంఠంలో స్థానాన్ని పొందుతారు. (94) ఈ విధముగా పావవాశనవైభవాన్ని మీకు నేను చెప్పాను. విప్రులారా ! విస్తారంగా శ్రద్ధగావేనుడు సాధ్యామృతతీర్థ వైభవాన్ని చెప్పాను (95) దీనిని బ్రహ్మపూర్వంన నకాదులకు చెప్పాడు. (96) అవి శ్రీస్కాందమహాపురాణమునందుఏ కాశీతినహస్రసంహితయందు తృతీయమైన బ్రహ్మఖండయందు సేతుమహాత్మ్యమందు సాధ్యమృతతీర్థప్రశంసయందు వురూరవశాపవిమోక్షణవర్ణనమనునది. ఇరువది ఎనిమిదవ అధ్యాయము
