స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

48వ అధ్యాయము

తా శ్రీ సూతులిట్లనిరి - రామనాథుని గూర్చి పాప వినాశిని యైన కథను చెప్తున్నాను. ఓ మునిశ్రేష్ఠులార ! చాలా శ్రద్ధగా వినండి (1) పూర్వము పాండ్య దేశమునకు అధిపతి రాజు శంకరుడను పేరు గలవాడు ఉండేవాడు. ఆతడు బ్రాహ్మణుడు (బ్రాహ్మణుల మేలు కోరేవాడు) నత్యనందుడు, ధార్మికుడు అనేక మార్లు యజ్ఞం చేయాలనే స్వభావం కలవాడు (2) వేదవేదాంగముల తత్వరిగినవాడు, శత్రు సైన్యమును చీల్చగలవాడు నాలు ఆశ్రమములను, చతుర్వర్ణ ములను ధర్మంగా పాలిస్తున్నాడు (3) వైదికాచారములందు ఆసక్తి కలవాడు పురాణములు, స్మృతులు వీనిసార మెరిగినవాడు నిత్యము శివవిష్ణుదైవముల అర్చకుడు అట్లాగే ఇతర దేవతా పూజకుడు కూడా (4) మహాత్ములైన బ్రాహ్మణులకు నిత్యము గొప్పదానం చేసేవాడు ఆ బుద్ధిమంతుడొక సారి వేటకొరకు తపోవనమునకు వెళ్ళాడు (5) సింహములు పులులు ఏనుగులు దున్నపోతులు క్రూర జంతువులతో భయంకరమైన దది. కీచురాళ్ళు భయంకర ధ్వని గలది. పాకుడుజంతువులతో నిండినది (6) భయంకరమైన హింసించే జంతువులతో నిండినది దావానలముతో భయంకరమైనది. రాజశేఖరుడైన శంకరుడు మహారణ్యమును ప్రవేశించి (7) అనేక సైనికులతో కూడి, వేటగాళ్ళ సమూహముతో నిండి పాదములను చెప్పులతో ఆచ్ఛాదించుకొని, ఎర్రని తల పాగా గలగి, పచ్చని దుప్పటి గలిగి (8) చేతులకు వేళ్ళ రక్షణకై తొడుగులు ధరించి, కోదండము (ధనను) బాణములు ధరించి నడుమునకు ఖడ్గమును కట్టుకొని శ్రేష్ఠమైన తెల్లని గుర్రము నెక్కి (9) మంచి వేషమును ధరించి నన్నద్దుడై కాలిబంట్ల నమూహముతో చుట్టబడి, అందమైన అడవులయందు పర్వతములందు గుహలందు (10) గొప్ప ప్రవాహములను దాటుతూ సింహ పరాక్రముడు యువకుడు రాజు బలములతో పాటు దరులయందు (గుహ) మృగములను వెతుకుతూ తిరిగాడు (11) అదిగో ఈ మృగం వేగంగా అడవిలోకి పోతోంది. దీన్ని బంధించండి, దీన్ని చంపండి, అని ఈ విధంగా సైన్యం అంటుండగా శంకరుడు స్వయంగా దూకి (12) అడవిలోకి ప్రవేశించి మహారాజు మృగమును చంపుతున్నాడు. సింహములను పందులను దున్నలను, ఏనుగులను శరభములను (13) చంపుతూ ఆతడు శంకర భవతి ఇతరములైన అడవి జంతువులను చంపుతూ అడవిలో ఒకచోట గుహలో మధ్యఉండే (14) శాంతుడైన నిశ్చల మనస్సు గల వ్యాఘ్రచర్మము ధరించిన మునిని వ్యాఘ్రుమను బుద్ధితో వంచిన ధనస్సు (వర్వము = కణుపు) గల బాణముతో త్వరగా చంపాడు (15) ధనస్సు గలిగి వేగంగా ఆతని భార్యను కూడా, పతియే ప్రాణముగా గల, భర్త సమీప మందు కూర్చున్న ఆమెను చంపాడు (16).

తా ॥ వారి కుమారుడు అడవి యందు చనిపోయిన తన తల్లిదండ్రులను చూచి ఏర్చాడు. మిక్కిలి దు:ఖంతో బాధపడినవాడై భయస్తుడై ఏడ్చివాడు (17) ఓనాతండ్రి, నాతల్లి నన్ను వదలి మీరిద్దరు ఇప్పుడెక్కడికి వెళ్ళారు. వేవెక్కడికి వెళ్ళాలి నాకు శరణమెవ్వరు (18) వారు వేదములెవ్వరు చెప్తారు. ఓ వావ్న ! నన్ను శాస్త్రములెవ్వరు చదివిస్తారు. ఓ అమ్మ! నాకు భోజనమెవ్వరు పడ్డారు. ఉపదేశంచే మా (19) ఓ నాన్న! ఇప్పుడు వీవు చనిపోతే నాడు ఆచారములను బోధించేదెవరు అమ్మ కోపించిన నన్ను ఓదారేదెవరు (20) తప్పలేని మీరు ఈవేళ ఏ పాపబాణములతో చంపబడ్డారు. తపోనిషులు, వా ప్రాణము నా గురువులు ఐన మీరు వనంలో ఎవనితో చంపబడ్డారు (21) ఓ బ్రాహ్మణులార ! ఈ విధముగా వారి పుత్రుడు గొంతెత్తి ఏడ్చాడు. ఆ ఏడ్పును అడవిలో తిరిగే శంకరుడు విని (22) ఆ శబ్దమునకు అభిముఖుడై వెంటనే ఆ గుహముందరికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి మునులు కూడా త్వరగా ఆ ఆశ్రమమునకు వచ్చారు (23) ఆ వారందరు మునులు బాణములతో చంపబడ్డమునిని చూచి, చనిపోయిన ఆతని భార్యను చూచి, ధనస్సును ధరించిన రాజును చూచి (24) ఏడుస్తున్న ఆరుమారుని కూడా చూచి మిక్కిలి చలితులై, అధీరుడైన కుమారుని ఏడ్వవద్దు అని ఓదార్చసాగారు (25) మునుల మాటలు- ధనవంతుడైనా ! దరిద్రుడైనా! మూరుడైనా ! వండితుడైనా ! బలిసినవాడైనా! బక్కచిక్కినవాడైనా యముడు అందరి విషయంలోను సమంగా వర్తిస్తాడు (26) వనంలోధాని నగరంలో కాని గ్రామంలోని పర్వతమందు కాని మరోచోటైనా ఎక్కడున్నా ప్రాణులందరు మృత్యువశులుగా వెళ్ళవలసినదే (27) ఓ కుమార! గర్భమందున్న లేదా పుట్టిన ప్రాణులు, యువకులైనా ముసలివారైనా అందరు నిత్యము (తప్పక} యమ వట్టణానికి వెళ్ళాల్సిందే (28) బ్రహ్మచారులు, గృహస్థ వానప్రస్థులు, భక్తులు అందరూ యమనగరానికి వెళ్ళాల్సిందే. ఓ బ్రాహ్మణ కుమార! పోయే కాలం వస్తే ఈ శరీరాన్ని వదలాల్సిందే (29) బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, సంకరులు ఎవరైనా ప్రేతవిలయమునకు వెళ్ళాల్సిందే, ఓ మహామతి, బ్రాహ్మణపుత్ర (30) దేవతలు మునులు యక్ష గంధర్వ ఉరగ రాక్షసులు ఇతర ప్రాణులు అందరు బ్రహ్మవిష్ణు హరాదులు (31) అందరు విలయం పొందుతారు కనుక నీవు దుఃఖించరాదు.

తా ॥ ద్వయముగా నిది (ఒక్కటే) నచ్చిదానంద రూపము ఐన ఉపనిషత్తులలో చెప్పబడ్డ బ్రహ్మమునకు (32) వాశము, జన్మ పెరుగుదల అనునవి లేవు ఓ వనశ్రేష్. ఈ శరీరముమల భాండము, నవద్వారములు కలది, చీము రక్తముతో ఎర్రమైన ప్రదేశము (33) బుద్బుదారము కలది, పురుగుల వమూహంతో విండినదీ శరీరము. ఇది తామక్రోధ భయద్రోహమోహమాత్పర్యములను కల్గించేది (34) ఇతరుని భార్యయందు, పరక్షేత్రము లందు, వరద్రవ్య మందు మాత్రమే ఆసక్తమైనది (ఇచ్ఛ) హింస, అశుచి, అసూయలతో నిండినది. మలమూత్రములకు మాత్రమే స్థానమైనది (35) ఇట్టి శరీరము పై మంచి బుద్ధిని కలిగినవాడు మూడుడు. వాడు దుర్మతి. బహచ్ఛిద్రములు గల కుండ ఆకారంగా ఉన్న ఈ అశుచియైన దేహములో ఎల్లప్పుడు (36) ప్రాణమను పేరుగల వాయువు చిరకాలము ఉంటుందా ఏమి ఓ బ్రాహ్మణ! అందువల్ల నీ తల్లిని గూర్చి తండ్రిని గూర్చి నీవు దు:ఖించవదు (37) వారు తమకర్మ వశం వల్ల ఈ ఇంటిని విడిచి వెళ్ళారు. నీకర్మవశం వల్ల నీవు ఈ భూమి యందున్నావు (38) కర్మక్షయమైతే నీవు కూడా మరణిస్తావు. చావబోయే ప్రేతమే చనిపోయిన ప్రేతాన్ని గూర్చి ఏడుస్తుంది (39) నీ తలిదండ్రులు పుట్టిన కాలంలో నీవు పుట్టలేదు. అందువల్ల మీ మార్గాలు వేరు (40) ఒకవేళ నీగతి వాళ్ళతో పాటిదే ఐతే చనిపోయే వారెక్కడికి వెళ్ళారో అక్కడికే నీవు కూడా వెళ్ళాలి (41) చనిపోయిన వారి బంధువులు భూమి పై ఏడిచేకన్నీళ్ళను మరణించి ప్రేతరూపంలో వరంలో ఉన్నవారు ఆ కన్నీళ్ళను తాగుతారు (42) అందువల్ల దుఃఖాన్ని వదలి ధైర్యం వహించి, చక్కగా ఉండి, వీరి, వైదికమైన ప్రేతకార్యములను నీవాచరించు (43) నీతలిదండ్రులు వీరు శరాఘాతంతో చనిపోయారు కనుక ఆ దోషశాంతి కొరకు వారి అనులను తీసుకొని (44) రామనాధ శివక్షేత్ర మందు ముక్తి నిచ్చే రామ సేతువు యందు ఉంచు. అట్లాగే నపిండీకరణాది శ్రాద్ధమును. (45) వారి శుద్ధి కొరకు అక్కడే ఆచరించు, ఓ బ్రాహ్మణ వ్యుత. దానివలన దుర్మృత్యుదోషశాంతి జరుగుతుంది. మరోరకంగా కాదు (46) శ్రీ సూతుల వచనము - ఈ విధముగా మునులు చెప్పగా ఓ బ్రాహ్మణులార! ఆశాకల్య సుతుడు జాంగలుడను పేరుగలవాడు, వారికి పితృమేధము సంపూర్తిగా ఆచరించాడు (47).

తా ॥మరుసటిరోజుఎముకలనుతీసుకొనిఆతడుహాలాస్యమునకుబయలుదేరాడు. అక్కడి నుండి ఈజాంగలద్విజుడు వెంటనే రామేశ్వరమునకువెళ్ళి (48) రామేశ్వరస్థలమందుమునిచెప్పినప్రకారముతలిదండ్రులఅస్తులను ఉంచి, అట్లానే శ్రాద్ధాదులను చేశాడు. (49)

ప్రథమార్ధికమువరకుచేయవలవనపనులనుఅక్కడతడుచేశాడు. జాంగలుడను పేరుగల ఆమునియొక్క ఒకే కుమారుడు ఒకసంవత్సర కాలముండి (50) ఆబ్దికొంతదినమందుఆబ్రాహ్మణుడురాత్రిన్వప్నంలో శంఖచక్ర గదాధరులైనతనతల్లిదండ్రులను చూచాడు (51) వారుగరుడుని పై కూర్చున్నారు. పద్మమాలతో అలంకరించబడ్డారు. తులసి మాలతో శోభిస్తున్నారు. వారిచెవులను మకరకుండలములువెలుగుతున్నాయి. (52) వారివక్షమందుకౌస్తుభమలంకరింప బడింది. పీతాంబరము ధరించారు. ఇట్టివారినిగా తనతలిదండ్రులనుజంగలుడను ఆముని కుమారేడుచూచిన న్నవే నబుద్ధి కలవాడై (53) తనఆశ్రమము న కుతిరిగి వచ్చినుఖంగా ఉన్నాడు. ఆజాంగలుడుతానుతలిదండ్రులనుకలలోచూచిన వృత్తాంతాన్ని (54) చాలానంతోషంతోఆబ్రాహ్మణులం దంతంలోనివేదించాడు. మునులుఆవృత్తాంతమును విని సంతోషించినమనస్సుకలవారైనారు (55)ఆరాజునుచూచిఆమహరులందరు శంకరనృవుని శపిస్తూ కోపంతో ఇట్లా అన్నారు (58) పాండ్యభూవ! మహామూర్ఖ! క్రౌర్యంతో బ్రాహ్మణునిచంపిన వాడ! నీవీవుడు క్రీహత్యను బ్రహ్మహత్యలు చేశావు. (57) అందువల్ల నీవు అగ్నితోశరీరత్యాగంచేయి లేకున్ననీవునూరుప్రాయశ్చిత్తములు చేసుకున్నాడుశుద్ధికలగదు. (58) నీతో మాట్లాడినందు వలనవ దివేలబ్రహ్మహత్యలుచేసినట్లైతుంది. పాండ్యవంశమునుచెరిచేవాడ! మాదగ్గరినుండినీవువెళ్ళు (59) అని మునులు చెప్పగా, పాండ్యరాజై నశంకరుడు, అట్లాగేకానిఅగ్నిలో దేహాన్నివదులుతాను (60) బ్రహ్మహత్యవిశుద్ధి కొరకు మీసన్నిధిలోవేను అగ్నిలోదూకుతాను. ఓమునిశ్రేషులార! మీరు నన్ను అను గ్రహించండి (61) అట్లా శరీరాన్ని వదలటంవల్ల నాపాతకము నష్టమౌతుంది. ఇట్లా మునులందరికీ చెప్పపాండ్యభరావతీశంకరుడు (62) తనమంత్రులను పిలిచి ఇట్లా అన్నాడు.

తా ॥ ఓ మంత్రులార ! నేను విచారించకుండా బ్రహ్మహత్య చేశాను (63) అట్లాగే క్రూరమైన నరకాన్నిచ్చే స్త్రీహత్య కూడా చేశాను. ఈ పాతకశుద్ధి కొరకు మునులతో నేను (64) అగ్ని మహాజ్వాలలతో మండుతుండగా నాశరీరాన్ని వదులుతాను. త్వరగా కట్టెలు తీసుకురండి. వాటితో అగ్నిని రగుల్బండి (65) త్వరలో నాకొడుకు సురుచిని రాజ్యంలో స్థాపించండి. మంత్రులార ! దు:ఖించకండి. దైవము అతిక్రమించరానిది (66) అని రాజు అనగా మంత్రులు దు:ఖించారు. పాండ్యనాథ ! మహారాజ! శత్రువుల పైన కూడా దయ చూపేవాడ ! (67) మమ్ములను మీరు నిత్యము వుత్రులవలె పరిపాలించారు. దేవవురితో సమానమైన నగరిని నీవు లేకుండా ప్రవేశించలేము (68) మహా కాషములతో మండుతున్న అగ్నిని మేమూ ప్రవేశిస్తాము. వారి మాటలను విని పాండ్యరాజైన శంకర భూవతి మంత్రులందరితో సాంత్వన పూర్వకమైన మాటలను ఇట్లా పలికాడు (69) శంకరుని వచనము - ఓ మంత్రులార! మహాపాతకనైన నేను ఏం చేయను (70) సింహాసనాన్ని అధిరోహించి నాలుసముద్రముల వరకు విస్తరించిన రాజ్యపాలనమును సరిగా నిర్వర్తించలేను (71) అందువలన నా కొడుకైన నురుచుని త్వరగా సింహానన మందుంచండి. అగ్నిలో త్వరగా ప్రవేశించటానికి కట్టెలు తీసుకురండి. (72) నామంత్రి వరులార! మీరివుడు ఆలసించటం మానండి. అని అనగా ఆ మంత్రులు క్షణంలో కట్టెలు తెచ్చారు (73) అగ్నిలో మండుతున్న కట్టెలను చూచి శంకర భూవతి స్నానం చేసి ఆచమించి నిర్మలమైన ఆత్మకలవాడై అప్పుడు మునుల ఎదుట (74) అగ్నికి ప్రదక్షిణ మాచరించి, త్వరగా ఆమునులకు ప్రదక్షిణం చేసి, అగ్నికి మునులకు నమస్కరించి, దేవుడైన ఉమాపతిని ధ్యానించి (75) ధైర్యమవలంబించి రాజు అగ్నిలో పడటానికి సిద్ధమైవాడు. ఓ విప్రులార ! ఆ సందర్భమున మునులందరూ వింటుండగ (76) గట్టిగా శబ్దిస్తూ అశరీరవాణి పలికింది. ఓ శంకర మహారాజ! ఇవ్వడు అగ్నిలో ప్రవేశించొదు (77) ఓ మహామతి ! బ్రహ్మహత్యా నిమిత్తకమైన భయము నీకొదు. వేద సమ్మితమైన రహస్యమును నీకు ఉపదేశిస్తాను. (78) ఓ రాజ! నేను చెప్పే దానిని శ్రద్ధగా విను నీవు దాని నాచరించు.

తా ॥ దక్షిణ సముద్ర తీరమందు గంధమాదన పర్వతమందు (79) మహాపాతక నాశకమైన, మహాపుణ్యకరమైన రాము పేతువు యందు రాముడు ప్రతించిన లింగము రామనాథ మహేశ్వరుని (80) మూడు కాలములందు భక్తి పూర్వకముగా ఒక సంవత్సరకాలము నీవు సేవించు, ప్రదక్షిణం ఆచరించటం, నమస్కారముచేయి (81) నీవు రామనాథునకు మహాభిషేకమాచరించు. ఓ రాజ ప్రతిరోజు వివిధములైన నైవేద్యములు ఏర్పరుచు (82) రామలింగమును చందన అగరుకర్పూరములతో పూజించు. రెండు భారముల ఆవు నేయితో అభిషేకించు. (83) ప్రతిరోజు రెండు భారముల (40 మణుగులు) పరిమితమైన ఆవు పాలతో, నేయి దొప్పతో ప్రభువు యొక్క ఆ లింగమును ప్రతిరోజు స్నానం చేయించు (84) ఓరాజ! రోజు పాయసాన్నముతోనే నైవేద్యమర్పించు. ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపారాధన కావించు (85) ఓ రాజేంద్ర! కూలియైన రామనాథునికి ఈ సేవ చేయటంతో నీరున్న స్త్రీ హత్య, బ్రహ్మహత్య దోషములు ఆక్షణంలోనే నశిస్తాయి (86) రామనాథుని దర్శనము వలన బూణహత్యలు నూరు చేసిన పాపము వదివేల బ్రహ్మహత్యల పాపము, పదివేల సురాపానముల పాపము (87) వదివేల స్వర స్తేయముల దోషము, పదివేల గురుమ్ర గమన దోషము, వీని నంనర్గం వల్ల కలిగే దోషములు క్షణంలో నశిస్తాయి ఓ ప్రభు ! (88) మహా పాతకములతో సమానమైన పాపములు అన్ని రామనాథుని సేవతో నశిస్తాయి (89) గొప్పదైన రామనాథుని సేవ నరులకు లభిస్తే గంగతో కాని గయతో కాని ప్రయాగలోకాని, అధ్వరముతోకాని పనిలేదు (90) అందువల్ల నీవు రామ సేతువునకు వెళ్ళు. నిరంతరము రామనాథుని భజించు. ఓ విభు! ఆలస్యం చేయకు. వెళ్ళటం గూర్చితొందరవడు (91) అని పలికి ఆ అశరీర వాణి కూడా విరమించింది. దానిని విని మునులందరు రాజును తొందర పెట్టసాగారు (92) ఓ మహారాజ! విముక్తినిచ్చే రామ సేతువునకు త్వరగా వెళ్ళు. రామనాథుని మాహాత్మ్యము తెలియక మేము (93) మండుతున్న అగ్నిలో ప్రాణాన్ని వదలు అని చెప్పాము. అని మునులతో అనుజ్ఞను పొంది రాజైన ఆ శంకరుడు (94) వేగంగా చతురంగ బలాన్ని నగరికి పంపి, మునులందరికి నమన్కరించి ఆనందించిన అంతరాత్మతో (95) కొద్ది సైన్యాన్ని తీసుకొని, చాలా ధనం తీసుకొని రామనాథుని సేవకొరకు గంధమాధనమునకు వెళ్ళాడు (96).

శంకర ఉవాచ -

తా ॥ శుద్ధినిచే తూర్చే రామ సేతువు యందు ఒక సంవత్సరము ఉన్నాడు. ఒక పూట భోజనముతో, క్రోథమును జయించి, ఇంద్రియ నమూహములను జయించి (97) మూడు సంధ్యలందు భక్తితో రామనాథుని సేవిస్తూ ఉన్నాడు. రామనాథునకు సంతోషంగా దశభారమైన ధనమునిచ్చాడు (98) రామనాథునకు ప్రతిరోజు మహాపూజను చేయించాడు. ధనుష్కోటి యందు ప్రతిరోజు భక్తితో (మహాపూజ) చేశాడు కూడ (99) సంతోషంగా ప్రతిరోజు స్నానం చేసి బ్రాహ్మణులకు అన్నదానం చేశాడు. అశరీరవాణి చెప్పిన పూజనంతో చేయించాడు. చేశారు (100) ఇట్లాచేస్తున్న అతనికి ఒక సంవత్సర కాలం గడిచింది. ఓ బ్రాహ్మణులార ! సంవత్సరం చివర ఆశంకరుడు (రాజు) శుచియై సంతుష మనస్కుడై, వరమేశుని,రామనాథుని, దయగలవానిని స్తుతించాడు (101) శంకరుని వచనము - రుద్రునకు, ఈశునడు రామనాథునకు ఉమాపతికి నమస్కారము (102) ఓదేవ! నన్ను దయతో రక్షించు నా బ్రహ్మహత్యను త్వరగా కాల్చు త్రిపుర సంహార ! మహాదేవ ! కాలకూట విషభక్షక ! (103) దయాసింధు ! నీవు నన్ను రక్షించు. నా స్త్రీహత్యను తొలగించు గంగాధర! త్రినేత్ర ! రామనాథ! విరూపాక్ష (104) కృపాదృష్టితో నన్ను పాలించు ఓ విభు ! నా పాతకమును నశింపచేయి. కామునకు శత్రువ! భక్తుల కోర్కెల తీర్చేవాడ! రావువుని ఈశ్వరుడ! (105) నా పై నీ చూపును ప్రవర్తించేయి. ఓ ధూర్జటి! నన్ను శుదునిగా చేయి. మార్కండేయుని భయము నుండి రక్షించినవార! మృత్యుంజయ ! శివ! అవ్యయ! (106) గిరిజను సగం శరీరంలో కలవాడ! నీకు నమస్కారము. నన్ను ఎల్లవ్వడు పాప రహితునిగా చేయి. రుద్రాక్షమాలను ఆభరణముగా గలవాడా చంద్రశేఖర ! శంకర! (107) నీకు నమస్కారము వేదోక్తమైన మంచి ఆచారములను ఆచరించుటకు యోగ్యమైన వానినిగా నన్ను చేయి. సూర్యునిదంతమును ఛేదించినవాడ! భారతి నాసికను ఛేదించినవాడ! నీకు నమస్కారము (108) రామేశ్వరదేవ! నీకు నమస్కారము. వాడు శుద్ధిని కళించు. ఆనందుని నచ్చిదానందుని, రామనాథుని, వృషధ్వజుని (109) మరల మరల నమస్కరిస్తున్నాను. నా పాతకముల నశింపచేయని రామనాధుడైన మహేశ్వరుని భక్తితో ఈ విధముగా స్తుతిస్తున్న ఆ రాజుయొక్క (110) ముఖమునుండి మిక్కిలి భయంకరమైన బ్రహ్మహత్య బయటికి వచ్చింది. వస్త్రమును ధరించి, క్రూరముగా ఎర్రని తలవెంట్రుకలతో (111) (ఉంది) భీభత్సంగా, రాజునోటి నుండి బయటికి వచ్చిన ఆ బ్రహ్మహత్యను, రుద్రుని ఆజ్ఞతో భైరవుడు త్రిశూలంతో చంపాడు. (112) శివుని ఆజ్ఞతో భైరవుడు బ్రహ్మహత్యను చంపాక, రాజుస్తోత్రముతో ప్రవన్నమైన బుద్ధిగల రామనాథుడు రాజుతో ఇట్లా అన్నాడు (113).

తా శ్రీ రామనాథుడు ఇట్లా అన్నాడు - ఓ మహారాజ! పాండ్యభూప! పుణ్యప్రదమైన ఈ నీ స్తోత్రంతో నేను ప్రసన్నుడనైనాను. నీకు వరమిస్తాను. నీకిష్టమైన వరం కోరుకో (114) స్త్రీహత్యబ్రహ్మహత్యల వల్లకల్గిన నీ దోషము పోయింది. శుద్ధుడవు, పావములను పోగొట్టుకున్న వాడవైనావు. పూర్వం లాగ రాజ్యాన్ని పాలించు (115) నన్నిక్కడ భక్తితో కూడిన మనస్సుతో సేవించిన వారి పదివేల బ్రహ్మహత్యలను కూడా నాశనం చేస్తాను. (116) ఓ రాజ! పదివేల సురాపానములు, పదివేల గురుగ్రీ గమనములు, పదివేల స్వర క్షేయ పాపములు, వాని పదివేల సంవర్గములు (117) ఇతర పాపములు దీనినన్నింటిని నశింపచేస్తాను అనుమానములేదు. ఓ రాజ! నన్ను సేవించేనరులు తిరిగి సంసారంలోకి రారు (118) పైగా సాయుజ్యరూపమైనవా ముక్తిని పొందుతారు. అనుమానము లేదు. ఈ స్తోత్రంతో భక్తి పూర్వకముగా నన్ను స్తోత్రం చేసినవారి (119) మహాపాతక నంచయమును నేను నశింప చేస్తాను. ఓ మనుజేశ్వర! నీ స్తోత్రముతో భక్తితో సంతుష్టడనైనాను (120) ఓ రాజ! వరమిచ్చే నన్ను నీవు ఇష్టమైన వరముకోరుకో. అని శివుడిట్లనగా నృపవుంగవుడైన శంకరుడు, కరుణానిధియైన ఆ రామనాథ శంకరునితో ఇట్లా అన్నాడు (121) రాజు వచనము - ఓ మహేశ్వర ! నీ సందర్శనంతో నేను కృతార్థుడనైనాను (122) ఇంతకన్నా ప్రార్థించ తగినది నాకు ఇప్పుడు అధికమైనది లేదు. నీ పాదద్వయము మార్కండేయుని సంతానమును హరించినట్టిది. (123) నీ పాదద్వయమును నేను చూశాను ఓ మహాదేవ! ఇంతకన్న ప్రార్థించతగినది ఓ విభు! లేదు. నీ పాద పద్మయుగళ మందు నాకు నిశ్చలమైన భక్తి ఉండని (124) అశుచియైన తల్లి గర్భంలో వునర్జన్మ కలగవదు. ఓ ప్రభు! నేను చేసిన ఈ స్తోత్రమును కీర్తించిన నరులు పావనిర్ముక్తులైన నీ సేవా ఫలమును పొందుతారు (125) శ్రీ సూతులవచనము - ఓ ద్విజోత్తములార ! అట్లాగే కానిమ్మని రామనాథుడు ఈతనిని అనుగ్రహించి (126) నీలకంఠుడు, విరూపాక్షుడు లింగరూపమందు అంతర్థానమైనాడు. ఆ పిదవ రామనాథునితో అనుగ్రహింపబడ్డ రాజు కూడ (127) రామనాథుని నమస్కరించి చరితార్థమైన అంతరాత్మకలవాడై, సేనతో కూడినవాడై సంతుష్టుడై తన నగరానికి వెళ్ళాడు (128) వనంలో నివసించే మునులకు ఈ వృత్తాంతాన్ని రాజు చెప్పాడు. మునులు నంతుష్ట మనస్కులై వారు రాజును రాజ్యమందు అభిషేకించారు (129) పుత్రులు భార్యవీరితో తుడి రాజు రాజ్యమును ఎదురు లేకుండా పొంది, మంత్రులతో కూడి రాజ్యమును చాలాకాలము రక్షించాడు, విప్రులార! (130) అంత్యకాలము సమీపించగా రామేశ్వరుని శివుని ధ్యానిస్తూ దేహాంతమందు శుభమైన రామనాథుని సాయుజ్యాన్ని చేరాడు (131) ఈ విధముగా మీకు ఓ విప్రులార ! రామనాథుని వైభవాన్ని మీకు చెప్పాను. శంకరుడను పేరు గల రాజు యొక్క పుణ్యమైన కథా చరిత్రను (132) ఈ అధ్యాయమును ఆదరంతో విన్న చదివిన మనుజులు నర్వపాపములనుండి నిర్ముక్తులై రామనాథుని పొందుతారు. (133) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండ మందు. సేతు మహాత్మ మందు రామనాథ ప్రశంన యందు శాకల్య దుర్మరణ దోషశాంతి పూర్వకమైన శంకరుని స్త్రీ హత్య. బ్రహ్మహత్య దోషశాంతి వర్ణన మనునది నలుబది ఎనిమిదవ అధ్యాయము.