స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
29వఅధ్యాయము
శ్రీ సూతులిట్లనిరి - రాజు శాపాన్ని తొలగించిన సాధ్యామృత తీర్థమందు స్నానం చేసి నరుడు నియమాన్వితుడై పెదవ సర్వతీర్థమునకు వెళ్ళాలి (1) సర్వతీర్థము మహాపుణ్యము మహాపాతక నాశకము. మహాపాతకయుక్తుడైనా సర్వపాతకములు కలవాడైనా (2) సర్వతీర్థంలో స్నానం చేయటంవల్ల ఆ క్షణంలోనే శుదుడౌతాడు. దేహంలో సర్వపాపములు ఎంతవరకుంటాయంటే. (3) పాప వురుషుడు సర్వతీర్థంలో, మునగనంతవరకు, సర్వతీర్థమును చూచి స్నానము కొరకు వెళ్తున్న నరుని (4) సర్వపాపములు వణుకుతాయి మాకు వాశం రాబోతున్నది అని బ్రాహ్మణుపుంగవులార ! సర్వతీర్థంలో స్నానం చేయనంత వరకు నరుని గర్భ వాసాది దుఃఖములు పోవు (5) యాగానుషానం వల్ల తీర్థ సేవనం వల్ల (6) నియమంగా గాయత్ర్యాది మహామంత్ర జపంవల్ల నూరుమార్లు నాలుగు వేదముల ఆ వృత్తివల్ల (7) భక్తితో శివవిష్యాది దేవతల పూజవల్ల ఏకాదశి మొదలగు తిథులలో భోజనం చేయక పోవటంవల్ల లభించే ఫలము నరుడు ఇక్కడ స్నానం చేయటం వల్ల పొందుతాడు (8) ఋషులిట్లనిరి - ఓ సూత ! దీనికి సర్వతీర్థమనే పేరు ఎట్లా వచ్చింది. వీవాలనుకునే మాకు ఓముని! విస్తరంగా వుణ్యమైన దీనిని మాకు చెప్పండి (9) శ్రీ సూతులిట్లనిరి - పూర్వం నుచరితుడనే ముని నియమవంతుడై ఉన్నాడు (10) భృగువంశంలో జన్మించినవాడు, పుట్టుకతో గుడ్డివాడు, మువలితనంతో బాధపడుతున్నాడు. కళ్ళులేనందువల్ల ఆతడు తీర్థయాత్ర చేయటానికి అశక్తుడు (11) అన్ని తీర్థములలో స్నానం చేయాలని కోరికగల మహాముని. దక్షిణ సముద్రంలో వుణ్యమైన గంధమాదన పర్వతమునకు (12) వెళ్ళి శంకరునుద్దేశించి పుదుష్కరమైన తపమాచరించాడు. ఉపవాసం ఉంటూ జితేంద్రియుడై త్రికాలములందు శివుని ఆరాధిస్తూ (13) త్రిషవణ స్నానం చేస్తూ, అతిథుల పూజిస్తూ, చలికాలంలో నీటిమధ్యఉంటూ ఎండాకాలంలో పంచాగ్నిమధ్య మందుంటూ (14) వరములలో వరధారను సహిస్తూ నీటిని భక్షిస్తూ వాయు భోజనం చేస్తూ, ఎప్పుడూ భస్మంతో ఉదూలన ముత్రిపుండము ధరిస్తూ (15) జాబాలోపనిషత్తులో చెప్పినట్లు చేస్తూ రుద్రాక్షలు ధరిస్తూ, ఈ విధంగా పది సంవత్సరములు ఉగ్రమైన తపస్సు చేశాడు (16).
ఆతని తపమ్పతో సంతుష్టుడైన శంకరుడు చంద్రశేఖరుడు ఆసుచరితముని ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు (17) మహా వృషభమునెక్కి, భూతసమూహము సేవిస్తుండగా సగం శరీరంలో పార్వతిని కలిగి, శూలము ధరించి, కోటి సూర్యులతో సమానమైన కాంతితో (18) తన కాంతితో దిక్కులనన్ని వెలిగిస్తూ, చీకట్లు లేకుండా చేస్తు, శరీరం నిండ భస్మంధరించి తెల్లగా, జటామండలంతో అలంకరింపబడి (19) అనంతాది మహానాగులనే భూషణములను అలంకరించుకొని శంభువు ప్రాదుర్భవించి ఆతనికి నేత్రముల నిచ్చాడు (20) శంకరుడు గిరిజాపతి తన్ను చూడటం కొరకు కళ్ళిచ్చాడు. పిదప సుచరితుడు బ్రాహ్మణుడు శివుడు రెండు కళ్ళివ్వగా పరమేశుని చూచి ప్రసన్నమైన బుద్ధితో పుతించాడు (21) నుచరితుని వచనము - దేవ, మహెశాన, శంకర, ధూర్జటి (22) బ్రహ్మాదీ పూజిత, త్రిపుర సంహార, మాంతక, ఉమేశ్, మహాదేవ, కామాంతక, అమల నీకు జయము జయము (23) సంసార వైద్య భూతపాల, శివ, అవ్యయ, త్రియంబక, భక్త రక్షణలో దీక్షితుడ నీకు నమస్కారము (24) వ్యోమకేశ నీకు నమస్కారము. కారుణ్య విగ్రహ నీకు జయము. నీలకంఠ, సంసారమోచక నీకు నమస్కారము. నీకు జయము (25) మ హేశ్వర పరమానంద విగ్రహ నీకు నమస్కారము గంగాధర విశ్వేశ్వర, మృఢ, అవ్యయ నీకు నమస్కారము (26) భగవంతుడైన వాసుదేవుడైన శంభునకు. నీకు నమస్కారము, శర్వ, ఉగ్రగర్భ, కైలాసవతి నీకు నమస్కారము (27) కృపాదృష్టితో చూచి ఓ కరుణాసింధు నన్ను రక్షించు. నా వృత్తాంతమును ఆలోచించకుండ ఓ హర! దయతో నన్ను రక్షించు (28) శ్రీ మాతులిట్లనిరి - అని మహాదేవుని స్తుతించగా ఈతనితో మహాదేవుడు ఇట్లా అన్నాడు దయగలిగిన ఉమాపతి మునియైన నుచరితునితో ఇట్లా అన్నాడు. (29) మహాదేవుని వచనము - ఓ ముని సుచరిత! ఈ రోజు నీవు నీకిష్టమైన వరమును కోరుకో. ఈ శుభమైన పుణ్యాశ్రమంలో నీకు వరమివ్వటానికి వచ్చాను. అని అనగా దయానిధియైన మహాదేవునితో ముని ఇట్లా అన్నాడు. (30) సుచరిత వచనం - ఓ చంద్రశేఖర! భగవాన్ ! నీవు నాకు ప్రసన్నుడవైతే (31) వాకిష్టమైన కోరికను నిన్ను కోరుకుంటాను. నా శరీరం ముసలితనంతో వండిపోయింది. ఎక్కడికి వెళ్ళలేను శక్తిలేని వాణి (32) అన్ని తీర్థములలో స్నానం చేయటరు ఆ కాంక్ష వారుంది. నర్వతీర్థములలో స్నానం చేయటంవల్ల మనుజుడు పొందే ఫలితాన్ని వారు చెప్ప. ఆ ఫలాన్ని పొందటానికి సాధనాన్ని కూడా చెప్పు (33) అని.
మహాదేవుడు ఇట్లన్నాడు - అన్ని తీర్థములను ఇక్కడే వేను ఆవాహన చేస్తాను (34) రామ సేతువుతో పవిత్రమైన ఈ గంధమాదన పర్వతమందు ఆవాహన చేస్తానని ఆమహాదేవుడు గంధమాదన పర్వతమందు (35) ఉత్తముడు ముని ప్రీతికొరకు తీర్థములను ఆవాహన చేశాడు. పిదప దయగల శంకరుడు మచరునితో ఇట్లా అన్నాడు. (36) ఓ సుచరిత! ఇదీ మహాపాతకనాశకము. అన్ని తీర్థములు పన్నిధిలో ఉన్నందువల్ల నర్వతీర్థమని పేరు కలిగింది. దీనిలో (37) వేను మనస్సుతో నర్వతీర్థములను ఆకర్షించినందువల్ల ఇది మానవతీర్థమనే పేరును పొందుతుంది. ఇది భుక్తి ముక్తులనిచ్చేది. (38) అందువల్ల సుచరిత వెంటనే ముక్తి కొరకు నీవు ఇక్కడ స్నానం చేయి. మహా పాతక సంఘములకు ఇది దావానలసమము. (39) కామ మోహభయక్రోధలోభ ములనే రోగములను నశింపచేసేది. వేదాంత విజ్ఞానము లేకుండానే వెంటనే ముక్తి కారణమైనటది (40) జన్మముత్యువు (మొదలగునవి) అవే మొనళ్ళు గల సంసార సముద్రమును దాటుటకనువైనది, కుంభీపారాది సమస్త నరకాగ్నిని నశింపచే సేది. ఈ సర్వతీర్థము (41) అని ముదవారియైవ శంభువు చెప్పగా సుచరితుడు మహాదేవుని ఎదుట సర్వతీర్థమందు స్నానము చేశాడు (42) స్నానం చేసి లేచిన సుచరితుని అఖిల మానవులు చూచారు. ముసలితనంతో వండిన శరీరంనుండి ముక్తుడైనవాడు యవ్వన వంతుడైన సుందరుడాతడు (43) తన దేహ సౌందర్యం చూసుకొని సుచరితముని అనేక విధముల ఆ తీర్థమును పొగిడాడు. ఇతర పనులు పొగిడారు (44). అందవ మహాదేవుడు సుచరితునితో ఇట్లా అన్నాడు. ఓ నుచరిత ! బ్రాహ్మణ ! ఈ ఉగ్రతీరమందు నీవు ఉంటూ (45) ముక్తి దాయకమైన నన్ను వరిస్తూ ఎల్లప్పుడూ స్నానం చేయి. బ్రాహ్మణోత్తమ దేశాంతరములందున్న తీర్థములకు వెళ్ళోద్దు (46) ఈ తీర్థమాహాత్మ్యమువల్ల చివర, వన్ను నీవు పొందగలవు విలయము. ఓ బ్రాహ్మణ! ఇక్కడ పాపం చేసిన ఇతరులు కూడా నన్ను పొందుతారు (47) అని వెలికి ఈశుడు అక్కడే అంతర్థానమైనాడు. రుద్రుడు అంతర్షితుడైనాడ, మచరితముని (48) వర్వతీర్థమందు అనేక కాలము నివసించి మానవ తీర్థంలో నియమంగా స్నానమాచరించి (49) సర్వబంధములనుండి విముక్తుడై దేహాంతరమందు శంకరుని పొందాడు. పర్వతీర్థ ప్రభావం వల్ల సాయుజ్యమును కూడా పొందాడు (50) ఈ విధముగా నర్వతీర్థ వైభవాన్ని మీకు చేప్పాను. ఓ విప్రులార ! దీవిని చదివిన వారు విన్నవారు నర్వపాతకములనుండి ముక్తులౌతారు (51)
అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహవ్ర వంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతు మహాత్మ్యమందు సర్వతీర్థ ప్రశంసయందు సర్వతీర్థ స్వరూపకథన మనునది ఇరువది తొమ్మిదవ అధ్యాయము.
