స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

40వ అధ్యాయము

శ్రీ నూతుల వచనము - పిదప ఇక్కడి నుండి ఓ మునులార ! లోక పావనమైన, నరులకు ముక్తినిచ్చే గాయత్రి నరస్వతుల మాహాత్మ్యాన్ని చెబుతాను (1) ఇది వినేవారి చదివేవారి మహా పాతకముల నశింపచే సేది. పురుషులకు మహాపుణ్యము నిచ్చేది. నరకక్లేశమును నశింపచే సేది (2) ఆనందంతో గాయత్రి నరన్వతుల యందు స్నానం చేసిన వారికి గర్భవాన ముండదు. ముక్తి తప్పకుండా కలుతుంది. (3) గంధమాదన పర్వతమందు గాయత్రి సరస్వతి బ్రహ్మపత్నులు దగ్గరలో ఉండటం వలన ఇవి ఆ పేరులతో పిలువబడ్డాయి (4) ఋషులిట్లవారు - గంధమాదన పర్వతమందు గాయత్రి నరన్వతుల సన్నిధానము ఎందుకు జరిగిందో ఓ సూత! దానిని మాకు చెప్పండి (5) అని అనగా సూతులిట్లన్నారు- ఓ విప్రులార ! పూర్వం తన కూతురును ఆనందంతో వాక్ అను పేరుగల దాన్ని మోహనుడై కాముకుడై కోరాడు (6) ప్రజాపతిపుత్రి తనను ఆతడు కామిస్తున్నాడని గమనించి చూచి సిగువడి ఆమె జింక రూపమును ధరించింది (7) బ్రహ్మరూ కూడా హరిణ రూపం ధరించి అప్పుడు ఆమెతో రమింపదలచి, హరిజరూపమును ధరించి వెళ్ళుచున్న ఆమెను అనుసరించసాగాడు (8) వుత్రిని పొందాలని వెళ్తున్న ఆతనిని చూచి దేవతలందరు ఈ బ్రహ్మపుత్రిని పొందటమనే చెడ్డవనిని చేస్తున్నాడు (9) అని స్రష్ట జగత్పతి ఐన అతనిని నిందించసాగారు. నిషిధమైన పనియందు ఆసక్తి గల ఆ బ్రహ్మను చూచి (10) ప్రభువు హరుడు పినాకమును చేత ధరించి వ్యాధరూప మును ధరించి, చెవిదాకా లాగిన ఎనాకధనస్సు యందు బాణమును (11) నంధించి ఆ నిశితమైన బాణంతో బ్రహ్మను కొట్టాడు. త్రిపురాంతకుని బాణంతో కొట్టబడి బ్రహ్మభూమి పై పడిపోయాడు (12) ఆతని దేహంనుండి గొప్పకాంతి గల గొప్ప జ్యోతి లేచి ఆకాశంలో మృగశీర్ష అను పేరు గల నక్షత్రంగా మారింది (13) ఆర్థనక్షత్రరూపాన్ని ధరించి శివుడు ఆతనిని వెంటాడాడు. బ్రహ్మరూప మైన మృగశీర్ష అను పేరుగల నక్షత్రాన్ని ఏడిస్తూ ఉన్నాడు. (14) ఇప్పటికి మృగములను వేటాడే వ్యాధుని రూపంలో శివుడు మృగశిర నక్షత్రం నమీపంలో ఆకాశంలో స్పష్టంగా కన్పిస్తాడు, ఓ బ్రాహ్మణులార! (15).

ఈ విధముగా శివుడు బ్రహ్మను చంపగా, పిదప గాయత్రి సరస్వతులు దుఖితులుగా, (16) భర్తృహీనలు కాగా భర్త జీవనాన్ని కోరుతూ మనం ఏం చేద్దామని పరప్పరం చర్చించుకొని (17) తమ వతి ప్రాణ సిద్ధి కొరకు గాయత్రి నరన్వతులు నర్వఉత్కృష్టమైన మంగళ స్థానమైన గంధమాదన పర్వతమునందు (18) పురుషులకు అన్నికోరికల నిచ్చే చోట తవన్సు చేయటానికి సిద్ధమైనారు. నియమం కలవారై శివుని గూర్చి తనన్పు చేయటానికి వెళ్ళారు (19) గాయత్రి సరస్వతులు తమ స్నానం కొరకు పాపనాశకమైన రెండు తీర్థములను తమ పేరుతో ఏర్పరచారు (20) అక్కడ ప్రతిరోజు సంతోషంతో త్రిషవణ స్నానాన్ని త్రినవనములు చేశారు. చాలా కాలము ఆహారం లేకుండా కామక్రోధాదులను వదలి (21) అతి ఉగ్రనియమములు కలవారై శివుని ధ్యానమందు ఆసక్తి కలవారై, పంచాక్షర మహామంత్ర జప మొక్కటే విధిగా కలవారై, శుభులైన (22) గాయత్రీ నరస్వతులు తమవతి జీవనము కొరకు మహాదేవునుద్దేశించి ఈ విధంగా తపస్సు చేశారు (23) వారి తవన్పుడు సంతుషుడైన మహాదేవుడు మహేశ్వరుడు, మహామూర్తి తపః ఫలితాన్ని ఇవ్వటం కొరకు వచ్చాడు (24) దరికివచ్చిన శంభుని పార్వతీరమణుని, శివుని, గణేశకార్తికేయులతో రెండు వైపుల సేవించబడుతున్న వానిని (25) చూచి ఆ గాయత్రి నరన్వతులు పంతుష్ట చితులై, దయానిధియైన మహాదేవుని స్తుతించతగిన వానీని స్తోత్రములతో స్తుతించారు. (26) గాయత్రి నరన్వతులు ఇట్లా వలికారు. వారింపశక్యముకాని నంసారపు చీకటిని ధ్వంనము చేయుటకు ఒకే కారణమైన వానికి మండుతున్న జ్వాలల సమూహముతో భయంకరమైన కాలకూట విషాన్ని భుజించిన వానికి (27) జగత్తును మోహింపచేసే వంచానుని దేహమును నశింపచేయుటకు ఒకే కారణమైన జగదంతకుడైన క్రూరయముని నశింపచేసే నీకు నమస్కారము (28) గంగాతరంగములతో తడిసిన జటామండలాన్ని ధరించిన, బాల చంద్రుని ధరించిన, విరూపాక్షుడవైన నీకు నమస్కారము (29) ఏవక ధనస్సు యొక్క భయంకరమైన ధ్వనితో భయపడిన త్రివురౌకనులు కలవానికి, వివిధ ఆకారములతో జగత్తును సృష్టించే బ్రహ్మశిరస్సును ఛేదించిన నీకు నమస్కారము (30) శాంత అమలమైన కృపాదృష్టితో మృకండుజుని సంరక్షించిన వాడ, గిరిజానాధ నీకు నమస్కారము. మేము ఇద్దరము నిన్ను శరణు వేడినాము మమ్ములను రక్షించు (31) మహాదేవ ! జగన్నాథ ! త్రిపురాంతక! శంకర! వామదేవ! మహాదేవ! శరణాగతులమైన మమ్ముల రక్షించు (32) అని వారితో స్తుతింవబడ్డ శంభువు దేవ. దేవుడు మహేశ్వరుడు ప్రీతితో కూడినవాడై గాయత్రి సరస్వతులతో ఇట్లా అన్నాడు(33).

మహాదేవుడిట్లన్నాడు -ఓ సరస్వతి, గాయత్రి, మీ పై నేను సంతుష్టుడనైనాను. నన్ను వరం కోరండి. మీ మనస్సులో ఏముందో కోరండి (34) హరుడు గాయత్రి నరస్వతులతో ఇట్లనగా వారు, పార్వతి కాంతుడు,దయానిధి, మహాదేవుడు ఐన శివునితో ఇట్లన్నారు (35) గాయత్రీ సరస్వతుల మాట - ఓ భగవాన్ ! ఓ దేవ ! మా భర్తయైన బ్రహ్మమ ప్రాణవంతునిగా చేయి ఓ నర్వేశ! కరుణాకర కృపతో చేయి (36) నీవు మాతండ్రి.. ఓ దేవ అట్లాగేనీకు మేమిద్దరము బిడ్డలము. అందువల్ల ఓ త్రిపురాంతక! నీవు మా వతిని దానం చేయటం ద్వారా మమ్ముల రక్షించు (37) అని వారిద్దరు శివుని ప్రార్థించగా ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులార ! అట్లాగే కానిమ్మని వారితో వలీకి (38) ఆ బ్రహ్మ శరీరమునే శిరస్పుతో కలువనుత్సహించి, అక్కడే బ్రహ్మ శరీరమును శిరస్సులతో సహ (39) భూతములతో నంది భృంగి మొదలగు వారితో తెప్పించాడు. ఆ అనేక శిరస్సులను శరీరంతో నహశంకరుడు (40) వాణీ గాయత్రుల ఎదురుగా క్షణంలో కలిపాడు. శివుడు కలువగానే జగత్పతి బ్రహ్మ (41) క్షణంలోనే నిద్రించిన వాడు మేల్కొన్నట్లుగా లేచాడు. అప్పుడు ప్రజాపతి శశిభూషణుడైన శంకరుని చూచి, భార్యలతో తుడి శ్రేష్టమైన మాటలతోస్తుతించాడు (42) ఓ ప్రభు! కరుణా సింధు! నిషిద్ధమైన ఆచరణ ము నుండి నన్ను రక్షించు. ఓ శంభు! నీ దయతో నాకు నిషిద్దాచరణమందు ఎక్కడైన (44) తిరిగి ప్రవృత్తి కలగొదు. అట్లాగే కానిమ్మని బ్రహ్మతో గిరిజాపతి పలికాడు (45) ఓ బ్రహ్మ! తిరిగి ఇకముందు నీవు ప్రమాదవడవు. నేను తప్పుదారిని పోయే వారిని శాసించేవాణ్ణి నేను ఎల్లప్పుడూ (46) ఓ బ్రాహ్మణులార మహాదేవుడు బ్రహ్మలో. ఇట్లా వలికి, నరస్వతి గాయత్రులను మాటలతో సంతోషపరుస్తూ ఇట్లా అన్నాడు (47)

మహా దేవుడిట్లన్నాడు - ఓ గాయత్రి! సరస్వతి! మీకు నా అనుగ్రహంవల్ల ప్రాణంతో కూడిన బ్రహ్మ ఈ భర్త తిరిగి వచ్చాడు (48) ఈతనితో పాటు బ్రహ్మలోకానికి వెళ్ళండి. ఆలస్యం చేయకండి. ఇక్కడ ఈ రెండు కుండములలో ఎల్లప్పుడు మీరు ఉండడంవల్ల (49) ఇక్కడ స్నానం చేస్తే సాయుజ్యరూపమైన ముక్తి నరులకు లభిస్తుంది. గాయత్రి సరస్వతి అను మీ పేర్లతో ఈ రెండు (50) తీర్థములు నర్వలోకములలో శాశ్వతమైన కీర్తిని పొందుతాయి. అన్ని తీర్థములలో ఈ రెండు తీర్థములు ఎల్లప్పుడు (51) శుద్ధిప్రదము, అట్లాగే మహాపాతకనాశకములు ఔతాయి. మహాశాంతిని ఇచ్చేవి, నరులకు అన్ని కోరికలను తీర్చేవి (52) నా అనుగ్రహాన్ని కళించేవి, విషువునకు సంతోషదాయకమైనవి. ఈరెండు తీర్థములతో సమానమైనవి గతంలో లేవు భవిష్యత్తులో రావు (53) ఇక్కడ స్నానం చేయటంవల్ల అందరికి అన్ని అభీష్టములు నెరవేరుతాయి. ఈ రెండు కుండములను మీరు ఈ లోకంలో ఏర్పరచి గొప్పవని చేశారు (54) మీ పేరుతో ప్రసిద్ధమై ముక్తిని కల్గిస్తాయి. గాయత్రి ఉపాసన లేనివారు, వేదాభ్యాసమును వదలినవారు (55) ఓ పానన రహితులు, పంచ యజ్ఞములు వదలినవారు, మీ కుండములలో రెంటిలో స్నానం చేయటంవల్ల ఆయా ఫలములను పొందుతారు (56) నిత్యానుషాన వర్ణితులైన ఇతర పాతరులు ఈ కుండ ద్వయ మందు స్నానం చేసి శుదుతారు. ఓ బ్రాహ్మణులార ! (57) నరస్వతి గాయత్రులతో ఇట్లు పలికి మ హేశ్వరుడు అందరు చూస్తుండగానే క్షణంలో అక్కడ అంతర్థానమైనాడు (58) భర్తను పొంది గాయత్రి వరస్వతులు సంతోషం కలవారై ఆ బ్రహ్మతో పాటు బ్రహ్మలోకమునకు వెళ్ళారు. ఓ బ్రాహ్మణులార ! (59) శ్రీ సూతులిట్లన్నారు. ఈ విధంగా మీకు గంధమాదన పర్వతమందు గాయత్రి సరస్వతులు ఉండటాన్ని సకారణంగా వివరించాను (60) ఈ అధ్యాయాన్ని విన్నవారు భక్తితో చదివినవారు, ఈరెండు తీర్థములలో స్నానం చేసిన ఫలాన్ని పొందుతారు. అనుమానంలేదు (61) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి నహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మ ఖండమందు సేతు మాహాత్మ్యమందు గాయత్రి నరన్వతి తీర్థ ప్రశంన యందు గంధమాదనంలో గాయత్రి సరస్వతులనన్నిధానమును చెప్పుట అనునది నలుబదవ అధ్యాయము.