స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
49వ అధ్యాయము
తా ॥ శ్రీ సూతులిట్లనిరి - ఇక ఇప్పుడు శూలియైన రామనాథుని స్తోత్రాధ్యాయమున చెబుతాను. ఇది పుణ్యప్రదమైనది. ఓ ద్విజులార ! శ్రద్ధగా వినండి (1) రాముడు లింగమును ప్రతిష్ఠించి వరమేశ్వరుని స్తుతించాడు, లక్ష్మణుడు, జానకి సీత, సుగ్రీవాదికవీశ్వరులు (2) బ్రహ్మ ప్రభృతి దేవతలు, అగస్త్యుడు మొదలగు మహర్షులు ప్రత్యేకముగా. భక్తితో కూడి రామవేశ్వరుని స్తుతించారు (3) దానివి వరుసగా చెప్తాను. ఆదరంగా వినండి. ఓ ద్విజులార! దీనిని విన్నంత మాత్రమున మానవులు ముక్తులౌతారు (4) శ్రీరాములిట్లా అన్నారు - మహాత్ముడవైన నీకు నమస్కారము. మహామాయ స్వరూపుడవైన, శూలివైన నీకు నమస్పులు నీవదాంబుజము లందుండే భక్తుల ఆర్తి హరించువాడ, సర్పములను హారముగా గలవాడ (5) దేవాది దేవ, రామనాథ, సాక్షి నీకు నమస్కారము. వేదాంతవేద్య యోగులకు తత్వమిచ్చువాడ నీకు నమస్కారము (6) ఎల్లప్పుడూ ఆనందంతో నిండినవాడ! విశ్వనాథ, శంభు, భర్తల భయమును ఛేదించుటకు కారణమైన పాదాబ్జరేణువులు కలవాడ నమస్కారము (7) అఖిలనాథ నీకు నమస్కారము. సాక్షాత్పరమాత్మ నీకు నమస్కారము. అద్భుత వీర్యవంతుడ, మహాపాతకనాశక నీకు నమస్కారము. (8) కాలమునకు కాలస్వరూపుడ! కాలుడ! కాలమునకతీతుడ నీకు నమస్కారము అవిద్యావాత పాపహార నీకు నమస్కారము (9) సంసారతులైన వారి తాపనాశమునకు ఒకే కారణమైన వార్త నీకు నమస్కారము నా బ్రహ్మహత్యను నశింపచేపినవాడ, విషమే ఆహారముగా గలవాడ నీకు నమస్కారము (10) పార్వతివాథ శైలాననిలయ, అవ్యయ నీకు నమస్కారము గంగాధర, విరూపాక్ష, అన్ని ఆపదల నుండి నన్ను రక్షించు (11) వినాకహస్త, మదనహరీ నీకు నమస్కారము. అన్ని అవస్థలలో,ఎల్లప్పుడూ నీకు మరీ మరీ నమస్కారము (12)
తా ॥ లక్ష్మణుని వచనము - రామనాథ త్రిపుర సంహార, శంభు నీకు నమస్కారము పార్వతి జీవితేశ, గణేశ స్కందులను పుత్రులుగా గలవాడ (13) కపర్ది సూర్యచంద్ర అగ్నులను వేతములుగా గలవాడ నీకు నమస్కారము. శివ, సోమ, మార్కండేయుని భయమును ఛేదించినవాడ, నమస్కారము (14) నర్వవంచమునకు సృష్టిస్థితి అంతములకు కారణమైనవాడ నమస్కారము. ఉగ్ర,భీమ, మహాదేవ, సాక్షి నమస్కారము (15) సర్వజ, వరేణ్య, వరద, వర, శ్రీకంఠ, పంచపాతకభేది, నీకు నమస్కారము (16) వరమైన ఆనంద సత్య విజ్ఞానముల వ్వరూప నీకు నమస్కారము.భవరోగవాశక, నీకు నమస్కారము. స్నాయువులకు (నరము) వతి నీకు నమస్కారము: (17) తస్కరపతి వనములవతి వీడు దమస్కారము. గణములకు పతి, విశ్వరూప, సాక్షి నీకు నమస్కారము. (18) కర్మచే ప్రేరితుడవై జనించిన ప్రతిచోట నీపాద ద్వంద్వ మందు వాడు భక్తి కలుగనీ (19) ఏదయ వలన వారు అననార్ధమందు అపిక (లగవధు. వైదికా, చారమార్గమందు ఆసక్తి కలుగని, వీడు నమస్కారము (20) సీతవచనము - వరేమకారణమైన వాడ, శంకర, ధూర్జటి, గిరిసుతమైన కుంకుమతోలించేవాడ, వాడు ఎల్లవ్వడు మతవి వా భర్తయందే కళించు, విషమమైన వరవురుషగోచరమతిని కళించొద్దు. (21) గంగాధర, విరూపాక్ష, నీలలోహిత, శంకర, రామనాథ నీకు నమస్కారము. ఓ కరుణాకర నన్ను రక్షించు (22) దేవ దేవేశ నీకు నమస్కారము. (23) ఓ సాథ ! నీ చరణాంబుజముల ధ్యానముతో యముని నుండి భయమును త్వరగా పోగొట్టుకుని ఓ శంభు! మార్కండేయుడు నిత్యత్వమును త్వరగా పొందాడు. ఓ వరేశ ! నిన్ను ఆశ్రయించుట వలన ఏమి సిద్ధించదు ! (24) వరేశ ! పరమ ఆనంద శరణాగతుల పాలించేవాడ నాకు ఎల్లప్పుడూ పాతివ్రత్యాన్ని ఇవ్వునీకు నమస్కారము (25)
తా ॥ హనుమద్వచనము - దేవదేవ జగన్నాథ, రామవాత, కృపానిధి, నీపాదాంభోరుహగతమైనాడు భక్తి నిశ్చలంగా ఉండనీ (26) ఎవరు లేకుండా జగత్తును వేత్త లేదో దాని ప్రకాశము కూడా కలుగదో అటవల్ భానరూపమైన శంభునకు రామనాథునకు నమస్కారము (27) అంగద వచనము - ఎవని - కాంతులు జగత్తును వెలుగో ఎవని వెలుగులేకుండా జగత్తు ప్రకాశించదో అట్టి శంభువు రామనాథునకు నమస్కారము (28) జాంబవవచనము - ఎవని ఆనందము నర్వుల ఆనందమే పరమార్థంగా ఏది ప్రకాశిస్తున్నదో అట్టి పరమానందరూపియైన ఈ రామేశ్వరునకు నమస్కారము (29) నీలుని వచనము - ఏదిదేశకాల దిక్కుల భేదముతో అభిన్నమైనదో, ఎల్లప్పుడు అద్వయమో, అట్టి అభిన్న స్వరూపుడైన ఈ రామేశ్వరునకు నమస్కారము (30) నల. వచనము - బ్రహ్మవిష్ణుమహేశానులు అవిద్యతో విజృంభితులైనారు. అవిద్యా విహీనుడైన ఆ రామేశ్వరుడవైన నీకు నమస్కారము (31) కుముదుని వచనము - దేవీ స్వరూప పరిజ్ఞానము లేనందు వలన ప్రధానము కారణముగా కల్పించబడిందో అట్టి కారణమైన ఈ రామనాథ శంభునకు నమస్కారము (32) మనసుని వచనము - జాగ్రత్ స్వప్న సుషుప్త్యాదులు ఏ అవిద్య విజృంభణ ఫలమో అట్టి జాగ్రదాదులు లేని జ్ఞాన రూపియైన ఈతనికి నమస్కారము (33) గజుని వచనము - దేవి న్వరూప పరిజ్ఞానం లేనందువలన కార్యములకు వరమాణువులు కారణముగా తార్కికులు వృథాగా కల్పించారో (34) అట్టి పరమానంద స్వరూపుడు రామనాథ మహేశ్వరుడు నర్వసాక్షి ఆతనిని ఆత్మరూపముగా నిత్యము ఉపాసిస్తాను (35) గవాక్షుని వచనము - అజ్ఞాన పాశబదులైన పశువుల పాశమును విడిపించేవాడు ఐన రామేశ్వరుని శివుని శాంతుని ఎల్లప్పుడు శరణు పొందుతాను (36). గవయుని. వచనము - ఆధ్వర్ణ (సాధు: అన) జగత్తునకు ఆధారమైన ఆతని చంద్ర చూడుని ఉమాపతిని, రామనాథుని, శివుని,సంసార రోగమునకు ఔషధమును ఐన వానిని నమస్కరిస్తున్నాను. (37) శంభుని వచనము అంతః కరణము ఆత్మ అని అజ్ఞానం వల్ల మోహితులైన వారన్నారో అట్టి ఆత్మయైన రామనాథుని నేను నమస్కరిస్తున్నాను (38) గంధమాదనుని వచనము - రామనాథుని ఉమానాథుని గణనాథుని త్ర్యంబకుని జగదీశ్వరుని సర్వపాతకముల శుద్ధి కొరకు ఉపాసిస్తాను (39).
తా ॥ సుగ్రీవుని వచనము - సంసార ఏముద్రం మధ్యలో జన్మము మృత్యువు అనే భయంకరమైన జలమందు, పుత్రులు భార్య ధనము క్షేత్రము అనే అలల నమూహంతో వ్యాకులమైన (40) నన్ను మునుగుతున్న బ్రహ్మఖండమందు వడిన తీరం పొందని నన్ను, ఆక్రోశిస్తున్న, వశం తప్పిన దీనుడవైన విషయములనే నర్సములతో భయపడుతున్న నన్ను (41) రోగములనే మొనళ్ళతో ఉద్విగ్నుడవైన, తాపత్రయములనే చేపలతో బాధింపబడుతున్న నన్ను గిరిజానాథ రక్షించు. రామనాథ నీకు నమస్కారము (42) విభీషణుని వచనము - నంసారమనే అడవి మధ్యలో తనతోవను మరచిన నన్ను వ్యాధి అనే దొంగలు క్రోధమనే సింహాలు జన్మమనే పులులు, లయమనే పాపములు గల నన్ను (43) బాల్యయావన వార్థక్యములనే మహాభయంకరమైన చీకటి బావి గల నన్ను, క్రోధ ఈర్యలోభములనే అగ్ని, విషయమనేకఠిన పర్వతము కలనన్ను (44) త్రాన మనే ముళ్ళతో నిండి నశిస్తున్న, అంధుడనైన నన్ను ఇప్పుడు శంభు ! మంచి పదవికి చేర్చు, ఓ రామేశ్వర ! (45) వానరుంలందరి వచనము - వింద్య అనింద్యములైన అన్ని యోనుల యందు జన్మించి, ఓ ప్రభు! తుంబీ పాఠాది నరకమందు వడి మరల అట్లాగే (46) కర్మశేషం వల్ల కుత్సితమైన యోని యందు జన్మించి నంసార మందు పడిన మమ్ములను రామనాథ ! దయానిధి (47) అనాథలు వివశులు, దీనులు, దు:ఖిస్తున్నవారు ఐన మమ్ములను ఓ శంకర! రక్షించు ఓ దయాసింధు ! రామవాథ ! మహేశ్వర ! నీకు నమస్కారము (48) బ్రహవచనము - లోకనాథ ! రామనాథ! శంభు ! నీకు నమస్కారము. ఓ నర్వేశ ! నన్నను గ్రహించు. నా అవిద్యను నశింపచేయి (49) ఇంద్రుని వచనము - ఎవని శక్తి త్రయీమయి, జగన్మాత, ఉమా ఐన దేవియో అట్టి శంకరుని రానువాథుని ఉమావతిని నేను నమస్కరిస్తున్నాను (50) యముని వచనము - ఎవనికి గణేశ్వర స్కందులు కుమారులో ఎవనికి వృషభము వాహనమో అట్టి రామేశ్వరుని సర్వ అజ్ఞానని వృత్తి కొరకు సేవిస్తాను (51) వరుణుని వచనము - ఎవని పూజా ప్రభావం వల్ల మార్కండేయుడు మృత్యువును జయించాడో, ఆమృత్యుంజయుని, రామనాథుని హృదయంతో నేను ఉపాసిస్తుప్నోను. (52) కుబేరుని వచనము - ఈశ్వరుడు వెలుగుతున్న కర్ణకుండల ఆభరణము కలవాడు, లత్తుకవలె ఎర్రని శరీరము కలవాడు. రామేశ్వరుడు ఐన నీకు నమస్కారము (53) ఆదిత్యుని వచనము - ఓ మహాదేవ! రామవాథ! త్రియంబక! నీకు నమస్కారము. దక్షుని అధ్వరమును నశింపచేసిన నీకు నమస్కారము. ఓ శివ నన్ను రక్షించు (54) సోముని వచనము - భస్మమును పూసుకొనిన, చూలముగల, సర్పములు మాలగా గల నీకు నమస్కారము. రామనాథ దయానముద్ర, శ్మశానవాన, నీరు నమస్కారము. (55) అగివచనము - ఇంద్రుడు మొదలగు అఖిలదిర్పొలురతో సేవించబడే పాదాంబుజములు కలవాడ! రామనాథ, శుద్ధస్వరూప, దిక్కులేవవనముగా గలవాడ నీరు ఎల్లప్పుడు నమస్కారము (56) వాయు వచనము - హరిరూప ! వ్యాఘ్రచర్మము వస్త్రముగా గలవాడ! రామనాథ! నీకు నమస్కారము. వారు అభీష్టమును ప్రసాదించు (57).
తా ॥ బృహస్పతి ఇట్లా స్తుతించాడు - అహంకారమునకు సాక్షి ఎల్లప్పుడు వ్యతిరేకమైనది లేకపోవటం, ఏకత్వము కలిగి ఉండటం) రెండోది లేకపోవటం వస్తువుగా గలవాడ రామనాథ నా అజ్ఞానాన్ని త్వరగా నశింపచేయి. నీకు నమస్కారము (58) శుక్రుని వచనము - వంచకులకు లభించనివాడ, మహామంత్రార్థ స్వరూపుడ ! రెండోది లేనివాడ, రామనాధ,శంభు, నీకు నమస్కారము (59) అశ్వినులిట్లా అన్నారు - యోగుల హృదయమందు ఎల్లప్పుడు ఆత్మరూపంగా వెలిగే వాడ, అనన్య జ్ఞానముతో తెలుసుకో తగినవాడ, రావువేశ్వర, నీకు నమస్కారము (60) అగస్త్యుని వచనము - ఆదిదేవ, మహాదేవ, విశ్వేశ్వర, శివ,అవ్యయ, రామనాథ, అంబికానాథ, వృషభమును ధ్వజంలో కలవాడ, అనుగ్రహించు (61) ఓ చంద్రశేఖర, నా వేలకొలది పాపములను క్షమించు. కొడుకులు మొదలగు వారియందు వీడునా వాడు అని భావించినట్లు నన్ను భావించి వా అహంకారాన్ని నశింపచేయి (62) సుతీక్షని వచనము - క్షేతములు, రత్నములు, ధనము, భార్య, మిత్రులు, వస్త్రములు, గోవులు, అశ్వములు, పుత్రులు ఇవన్నీ ఉపకారం కొరకు కాదు. అందువల్ల ఓ రామనాథ నీవు నాకు వైరాగ్యాన్ని ఇవ్వు (63) విశ్వామిత్రుని వచనము - శాస్త్రములను విన్నా వ్యర్థమే. వేదములను అభ్యసించినా వ్యర్థమే. ఓ శివ! ఈశ్వరుడవైన రామనాథుడవైన నీ పై మనుష్యునకు భక్తి కలగకపోతే పై వీవ్యర్థం (64) గాలవుని వచనము - దానములు, యజ్ఞములు, నియమములు, తపస్సు, గంగాది తీర్థములలో స్నానము, ఇవన్ని రామేశ్వరుడవైన నిన్ను నమస్కరించని వారికి వ్యర్థము అని నిశ్చయము. (65) వసిషుని వచనము - నమస్త పాపములు చేసి కూడా లోకము రామేశ్వర ! నీ దగ్గరకు వచ్చి భక్తి యుక్తుడై నమస్కరిస్తే అవన్నీ నశిస్తాయి. ఎట్లాగంటే సూర్యుని తేజస్సు వల్ల అంధకారము నశించినట్లు (66) అతివచనము - రామేశ్వరుని ఒకసారైన చూచి, తాకి, ఈశుడవైన నిన్ను నమున్కరించిన ఆతడు తిరిగి గర్భ ప్రవేశము చేయడు. అంతేకాక అద్వయమైన నీ స్వరూపాన్ని పొందుతాడు. (67) అంగిరుడు ఇట్లా అన్నాడు - రామనాథుడవైన నిన్ను చేరి నరుడు నమస్కరిస్తూ తన బంధువులను స్మరించినా వారిని కూడా అన్ని పాపముల నుండి తరింపచేస్తాడు అని అంటే నమస్కరించేవాని కృతార్థత విషయంలో అద్భుతమేముంది (68) గౌతముని వచనము - శ్రీరామనాథ ! ఈశ్వర, ఇది చాలా గూడమైనది మిక్కిలి రహస్యమైనది శోకనాశకము, నీ పాదమూలమును సేవించే నరుల సేవను చేసే వారు కూడా ధన్యులే (69) శతానందుని వచనము - వేదాంత విజ్ఞాన రహస్య మెరిగిన వారు తెలుసుకో తగినది, ముముక్షువులు చేయాల్సినది, ఏవుంటే శాస్త్రములన్నీ వదలి, ఓ రవువీరనాథ, దేవ, నీ సేవనము చేయాలి అని (70) భృగువచనము - రామనాథ, నీ పాదపద్మ ద్వంద్వ చింతనతో పాపములన్ని పోగొట్టుకొని ప్రకాశవంతమైన అద్వయమును నత్ సుఖమును అమోఘమైన చిత్ అనే ధనమును పొందుతాడు (71) కుత్పుని వచనము - ఓ రామనాథ ! నీ పాద సేవ నరులకు, ఎల్లప్పుడు భోగమైన మోక్ష వరము నిచ్చేది. రౌరవాది నరకములను నశింపచేసేది. రసగ్రాహివురుషుడు ఎవడు సేవించడు (72) కశ్యవ వచనము - రామనాథ నీ పాదములు సేవించే వారికి వ్రతములతో పనేమి, తపస్సులతో అధ్వరములతో పనేమి. వేదశాస్త్రజప చింతలతో పనేమి. స్వర్గమందలి గంగా నీరుతో కూడా ఫలమేమి (73) శ్రీరామనాథ ! నా ప్రాణం పోయే సమయంలో నీవు భవానీతో నహి త్వరగా వచ్చి నీ పాదారవిందములకు నన్ను చేర్చు. శోకము, మోహము లేకుండా చేసి చిత్ స్వరూపమైన సుఖాన్ని నాకు కంచు (74).
తా ॥ గంధర్వులిట్లనిరి - రామనాథ, అపారమై దుఃఖముతో కల్లోలమైన భవసాగరమందున్న మాకు నిన్ను సేవించే వారికి నీకు మరొక మార్గములేదు. (నీవేగతి) (75) కిన్నరులిట్లనిరి - వ్యాధులవే వ్యాఘ్రుములతో భయానకమైన భవారణ్య మందున్న మూడు మార్గ దర్శకుడ! నీవు తప్ప మరొకరు లేరు, ఓ రామనాథ ! (76) యక్షులిట్లనిరి - ఓ రామనాథ! ఇంద్రియములనే శత్రువుల బాధ మాకు ఎల్లప్పుడు భరింపరానిదిగా ఉంది. వాటిని జయించుటకు మాకు నీవు నహాయంగా ఉండు, ఓ ధూర్జటి (77) నాగులిట్లనిరి. - ఓ రామనాథ! అంచిత్యమైన మహిమ గల నిన్ను అల్పబుదలమైన మేము స్తుతించుటకు ఎట్లా శక్తుల మౌతాము, ఓ అంబికావతి (78) కింపురుషులిట్లనిరి - అనేక యోనులయందు జన్మించుట, అనేక మార్లు మరణించుట, అజ్ఞానము వీటిని నశింపచేయి, రామనాథ! నీకు నమస్కారము (79). విద్యాధరులిట్లనిరి - అంబికావతి ! సంగతిలేనివాడ (అసంగుడ) మహాత్మ నీకు నమస్కారము. రామనాథ వృషభధ్వజ ! నన్ను అనుగ్రహించు (80) వసువులిట్లనిరి - రామనాథగణేశ ! గణవృందములతో పూజింవబడే పాదములు గలవాడ, గంగాధర, గుహ్య (ఒంటరి) నీకు నమస్కారము ఎల్లప్పుడు మమ్ముల రక్షించు (81) విశ్వేదేవులిట్లనిరి - జ్ఞానమందు మాత్రమే నిష్ఠగల వారికి యోగులకు మాత్రమే ముక్తినిచ్చే రామనాథ సాంబ! శంకర నీకు నమస్కారము. మమ్ములను రక్షించు (82) మరుత్తులిట్లనిరి - తత్వములన్నింటికి వరతత్వము, తత్వభూతము యథార్థానికి, ఐన రామనాథ స్వయంప్రకాశ శంభు నీకు నమస్కారము (83) సాధ్యులిట్లనిరి - తనకన్న అతిరిక్తము లేనివాడ ! జగత్తునకు నత్తనిచ్చేవాడ రామేశ్వర, దేవ, అవిద్యావిభేది నీకు నమస్కారము (84).
తా ॥ దేవతలందరిట్ల నిరి - నచ్చిదానంద సంపూర్ణుడు, ద్వైత వస్తువులేని వాడు, బ్రహ్మాత్మ, న్వయంజ్యోతి, ఆదిమధ్యాంతరహితుడు (85) వికారములేనివాడు, అనంగుడు, పరిశుద్ధుడు, సనాతనుడు, ఆకాశాది ప్రపంచములకు సాక్షిభూతుడు వరమైన అమృతుడు (86) ప్రమకు అతీతుడు, ప్రమాణములకు కూడ బోధను కల్గించేవాడు, ఆవిర్భావ, తిరోభావ, సంకోచములు లేనివాడు, ఎల్లప్పుడు (87) తనయందు అభ్యసించిన రూపముగల ప్రపంచమునకు సాక్షి, నిర్లేవుడు, పరమానందుడు, క్రియలన్ని తొలగినవాడు (88) సృష్టియందు ఆనందపడేవాడు, మహాత్ముడు, చిద్రూవుడు, భోగవర్జితుడు, అట్టా రామనాథునీ మన మందరము మన పాతకముల నుండి శుద్ధి కొరకు (89) ఎల్లప్పుడు చిత్త మందు స్వాత్మానంద మనుభవించుటకు ఇచ్ఛకలవారమై చింతిద్దాము (ధ్యానిద్దాము). ఓ కరుణా సింధు మమ్ముల రక్షించు. రామనాధ! నీకు నమస్కారము. (90) రామనాధ ! రుద్ర సంసారహారి నీకు నమస్కారము. నీ మాయతో బ్రహ్మవిష్ణ్వాది రూపములతో భిన్నమైన వాడ నమస్సులు (91) విభీషణుని నచిపులిట్లనిరి - వరద, వరేణ్య,త్రినేత్ర, త్రిశూలి, యోగులకు ధ్యేయమైనవాడ, నిత్యుడ, రామనాథ నీకు నమస్కారము (92) సూతుడిట్లనెను - అని రాముడు మొదలగు వారందరితో ప్రార్థింవబడ రామేశ్వరుడు, శివుడు, రాముడు మొదలగు వారందరిని పిలిచి ఇట్లన్నాడు, ఓ ద్విజనత్త ములార! (93) రామరామ, మహాభాగ, జానకీరమణ ప్రభు, సౌమిత్రి, జానకి, శుభులైన ఓ సుగ్రీవ ప్రముఖులార (94) ఇతరులైన బ్రహ్మ మొదలుగా గల మీరలు చక్కగా ఉండి వినండి. ఆదరంతో మీరు చేసిన పుణ్యమైన ఈ స్తోత్రాధ్యాయమును (95) చదివినవారు, విన్నవారు, వినిపించిన నరులు, నన్ను అర్చించిన ఫలమును పొందుతారు. అనుమానము లేదు (96) రామచంద్ర ధనుష్కోటి స్నాన పుణ్యము కల్గుతుంది. ఒక సంవత్సర కాలము రామ సేతువు నందు నివసించిన పుణ్యము కలుగుతుంది. (97) గంధమాదన మధ్యమందున్న సర్వతీర్థములందు స్నానం చేయటం వల్ల కలిగే పుణ్యము దాని వల్ల కలుతుంది. ఇక్కడ అనుమాన కారణములేదు (98) ఈ విధముగా పలికి రామనాథుడు కూడా స్వాత్మలింగమందు అంతర్థానము నందాడు. ఈ స్తోత్రాథ్యాయమును పుణ్యమైన దానిని రోజు గానం చేసిన నరుడు (99) జరమరణములు లేనివాడై జన్మ దుఃఖము తొలగిన వాడై రామనాథ సాయుజ్య ముక్తిని పొందుతాడు. అనుమానము లేదు. (100) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ మందు రామాదులతో రామనాథ స్తోత్రమును చెవుట అనునది నలుబది తొమ్మిదవ అధ్యాయము.
