స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
45వ అధ్యాయము
తా ॥ శ్రీ నూతులిట్లనిరి - సులభంగా పనులనాచరించే రాముడు ఈ విధముగా లింగమును ప్రతిష్ఠించగా శ్రేష్ఠమైన లింగమును తీసుకొని మారుతి త్వరగా వచ్చాడు (1) వీరుడైన దశరథ రామునకు నమస్కరించి ఆ మారుతి పిదవ సీత లక్ష్మణులకు పిదవ సుగ్రీవునకు నమస్కారం చేశాడు (2) సీత నిర్మించిన సైకత లింగమును పూజిస్తున్న రాముని చూచి హనుమంతుడు మునులతో సహా అందరిని కోపగించాడు (3) వ్యర్థంగా పరిశ్రమించినట్లు భావించి ఖేదంతో మిక్కిలి భిన్నుడై ధర్మజుడైన రామునితో అంజనాత్మజుడైన హనుమంతుడు ఇట్లా వలికాడు (4) హనుమద్వచనము - నా పుట్టుక చాలా చెడ్డది. నేను వ్యర్ధుణ్ణి. ఓ రామ ! నేను ఈ లోకంలోకష్టం కొరకే జన్మించాను. ఓదేవ ! క్రూరకర్ములైన రాక్షసులతో చాలాఖిన్నుడనై ఉన్నాను. (5) ఏ స్త్రీ కూడా నాలాంటి కొడుకును కనగూడదు. ఎందువల్లనంటే భవసాగరమందు అనంతమైన దు:ఖం అనుభవిస్తున్నాను (6) పూర్వము సేవతోఖిన్నుడనైనాను. అంతకన్న ఎక్కువగా యుద్ధంతో ఖిన్నుడనైనాను. ఇప్పుడు అనంతమైన దు:ఖము, నన్ను అవమానించావు కాబట్టి (7) సుగ్రీవుడు భార్యకొరకు, రాక్షసుడు రాజ్యం కొరకు సేవించారు. రావణుని తమ్ముడు నిన్ను రాజ్యం కై సేవించాడు (8) ఓ మహామతి ! రామ ! నేను ఏ కారణం లేకుండా నిన్ను సేవించాను. అనేక మంది వానరులలో ఈ వేళ నీవు నన్ను ఆజ్ఞాపించావు (9) పర్వతోత్తమమైన కైలాసం నుండి శివలింగాన్ని తేవటానికి చేప్పాను. కైలాన మునకు వేగంగా వెళ్ళాను పినాకిని చూడలేదు (10) వృషభవాహనుడైన ఆసాంబుని తపస్సుతో సంతుష్ట పరచి లింగమును పొంది ఓ రఘుపతీ ! త్వరగా వచ్చాను (11) ఇసుకతో చేసిన మరో లింగాన్ని స్థాపించి నీవిప్పుడు మునులతో దేవ గంధర్వులతో కలిసి పూజిస్తున్నాను. ఓ విభు ! (12) నేను కైలాస పర్వతం నుండి తెచ్చిన ఈ లింగము వ్యర్థము. మంద భాగ్యుడనైన నాకు ఈ శరీరము బరువుగా అన్పిస్తోంది (13) ఓ జానకీరమణ ! ప్రభు ! మహారాజ ! ఇది భూమికి భారము. ఓ రఘు కుమార ఈ దు:ఖాన్ని సహించటానికి నాకు శక్తిలేదు (14) ఏం చేయను. ఎక్కడికి వెళ్ళను. నాకు గతి లేదు. నీతో అవమానింపబఢనేను ప్రాణాన్ని విడుస్తాను (15) శ్రీ సూతులిట్లనిరి - ఇట్లా అనేక విధముల ఆ హనుమంతుడు ఏడ్చి క్రోధశోకముతో వ్యాకులుడైనాడు. దండమువలె నమస్కరిస్తూ భూమిపై పడినాడు. (16).
తా ॥ ఆతనిని చూచీరవు నాధుడు కూడా నవ్వుతూఇటావలికోడు. దేవతలు మునులు కవులు, రాక్షసులు అందరు చూస్తుండగా మారుతిని ఓదారునూ. ఆతనిదు:ఖాన్నికడిగివేనూ (17) శ్రీరామునివచనము - నావానియొక్క, ఇతరుల యొక్క వే నులనన్నింటినినేనెరుగుదును. (18) పుట్టిన, పుట్టబోయే, చచ్చినవారందరికర్మఎల్లప్పుడూనేనెరుగుదును. ప్రాణ తనకర్మతో నే ఒంటరిగానే జన్మిస్తాడు, మరణిస్తాడు. (19) నరకానికి కూడావెళ్ళుతాడు. పరమాత్మనిరుణుడు. ఈ విధముగాయథార్గాన్ని నిశ్చయించుకొనిఓకవ! దు:ఖించవదు. (20) మూడులింగములులేని, నిరంజనమైన ఒక జ్యోతిని, నిరాశ్రయుము, నిర్వికారము ఐననిన్నునిత్యునిగ్రహించు (21) తత్వజ్ఞానమునకు బాధ కవె నశోకమును ఎందు కున పానన్నావు. ఓవానరోత్తమ ! ఎప్పుడువరమాత్మజ్ఞానమందునిశనుంచు (22) ఓ కవి! ఎల్లవ్వడు న్వయంప్రకాశకమైన ఆత్మను ధ్యానించుతత్వజ్ఞానము నకు విరోధక మైన దేహాదులయందు మనుతను వదలు (23) ఎవ్వడూధర్మమును భజించు.ప్రాణి హింస నువదలు. సాధు వురుషులను సేవించు. నర్వఇంద్రియములను (ఆనక్తిని) నదులు (24) ఇతరులదోషములనుపొగడటంఎల్లప్పుడూ వదిలి పెట్టు. ఓకS! శివ విష్ణ్వాదిదేవులఅర్చనను ఎవ్వడూచేయి (25) ఓకది! ఎవ్వడూనత్యముపలు కు. శోకమునువదలు. ప్రత్యగబ్రహ్మతో ఏకత్వమనేజ్ఞానముమేహవస్తువులవల్లకల్గినట్టిది (26) శోభనము అశోభనము అనే భ్రాంతి కల్పితము ఇది యధార్థమనే భ్రాంతిని కళిస్తోంది. వదార్థముందు మేవవైభవంవల్లశోభనమనే అధ్యాపకలుతోంది. (27) ఓకవిసత్తమ! భ్రాంతులైననరులకు రోగంకలుతుంది. రాగద్వేషములను శక్తులతోబదులైధర్మాధర్మముల కువశులై (28) దేవతిర్యక్ మనుష్యాదులు మానవులు నరకానికి వెళుతారు. అతిశోభనమైనచందనఅగరుకర్పూరవ్రముఖములు (29) శరీరస్పర్శవల్ల మలినమౌతున్నాయి. అయై నశరీరముసుఖకరమెట్లోతుంది. భక్ష్యభోజ్యాదినర్వవ దార్థములుఅతిశోభనములు. (30) ఇవి శరీరనహజానంవల్లమలమౌతున్నాయి. అట్టి శరీరము ఎట్లానుఖ కరమౌతుంది. వాననగలచల్లనినీరుశరీరనంగమంవల్ల మూత్రమౌతోంది. (31) అందువల్ల ఓకS! ఇవ్వడు చెప్పి, ఈశరీరం ఎట్లా శోభనమౌతుంది. చాలాతెల్లనైనశుద్ధమైన వస్త్రములు శరీరసాంగత్యంవల్ల (32) చమటతోమలినమౌతున్నాయి. అందువల్ల ఇది శోభన మెట్లా ఔతుంది. అందువల్ల వాయునందన! హనుమాన్ పరమార్థమైననామాటను వీను (33) ఈనంసారమనే గుంతలో కొంచెం కూడాసౌఖ్యం లేదు. మొదటప్రాణి జన్మిస్తాడు. పిదపబాల్యావస్థ నొందుతాడు. (34) పిదపరవ్వనాన్ని పొందుతాడు. పిదప ముసలివాడౌతాడు. చివర మృత్యువునొందుతాడు. తిరిగి జన్మిస్తాడు (35) మానవుడుఅజ్ఞానవైభవంవల్లనేదు:ఖంపొందుతున్నాడు. ఆ అజ్ఞాననివృత్తి ఐతే ఉత్తమనుఖాన్ని పొందుతాడు (38).
తా ॥ అజ్ఞాననివృత్తి జ్ఞానంవల్లనే ఔతుంది. కర్మవల్ల కాదు. జ్ఞానమనగావరబ్రహ్మ జ్ఞానంవేదాంతవాక్యాలవల్ల కలిగేది (37) ఆజానమువీరత్తునికికలుతుంది. ఇతరులకుకలుగదు. ముఖ్యాధికారులు ఆచార్యునిఅనుగ్రహంవల్లసత్యంను తెలుసుకుంటారు. హృదయంలో ఉన్నకామములన్నితొలగినమర్యుడుఅమృతుడౌతాడు. ఇక్కడేవరబ్రహ్మను పొందుతాడు. (39) మేల్కొన్నవానిని, నిద్రిస్తున్నవానినీతింటున్నవానిని, తూర్చొన్నవానిని ఈ జనాన్ని ఎల్లప్పుడూ క్రూరుడైన యముడులాగుతుంటాడు (40) నంవదలన్నిక్షయంతోనూవ్రమౌతాయి. ఔన్నత్యమంతాపతనాంతము. సంయోగములు వియోగాంతములు జీవితముమరణాంతము (41) వండి నవండ్ల కు మరోచోటవడతాయనే భయములేదు. పుట్టిన నరుల కుమరోచోటవడతామనే భయంలేదు. (42) ధృఢమైనస్తంభములుకలగృహముజీర్ణమైకాలమానన్నమైనశిస్తుంది. అట్లాగే నరులుముసలితనము మరణ మువీటికి వశులైన శిస్తారు (43) రాత్రింబగళ్ళుగడునన్నాకొద్దీనరుల ఆయుస్సునశిస్తుంటుంది. పరమాత్మనుగూర్చి (నీగురించి) దు:ఖించునీవు ఇతరుల గూర్చి ఎందు కుదు:ఖిస్తావు. (44) ఓకవశ్వర! ఆయుస్సునరుడు నిల్చున్నావరుగెత్తుతున్నానశినూనే ఉంటుంది. మృత్యువు కూడా మనతోపాటేవెల్తోంది. మనతో పాటే కూర్చుంటోందీ (45) మనతో దూరదేశాలు తిరిగి మృత్యువు తిరిగి వస్తుంది. శరీరంలో ముడతలు వడ్డాయి. వెంట్రుకలు తెల్లబడ్డాయి (46) శరీరం ముసలి తనంతో జీర్ణించి పోతోంది. దేహము శ్వాసము దగ్గు మొదలగు వానితో జీర్ణమైంది. సముద్రమందు ఒక కట్టె మరొక కణేకలిశాయి (47) కలిసి విడిపోయాయి. కాలయోగంతో ఓ వానర ! అట్లాగే భార్యపుత్రుడు బంధుక్షేత్ర ధనములు (48) ఒక చోట కలిసి మరల వేరే చోటికి పోతారు. ఓ వానర ! దారిలో పోతున్న బాటసారీలో దారీలో ఉన్న మరోబాటసారి (49) మీతో పాటు నేనూ వస్తాను అని పలికి కొంతకాలం ఇద్దరు కలిసి ప్రయాణం చేసి తిరిగి వేరే దిక్కులకు పోయినట్లు (50) అదే విధంగా భార్యాసుతాదులసంగమమునశ్వరము. ఓకవ! శరీరజన్మతోపాటు మృత్యువు కూడాపుడుంది నిశ్చయము (51)
తా ॥ మరణం అనేదితప్పనప్పుడు దానికి ప్రతిక్రియలేదు. ఈశరీరంవతనమైనతరువాతప్రాణికర్మగతినిపొంది (52) మరొకపిండము (శరీరంను) పొంది పూర్వపిండాన్ని ఈతడువదిలి పెత్తాడు! ప్రాణులకు ఎల్లవ్వడు ఒకేచోటనివానము కుదరదు (53) తమతమకర్మలకు అధీనులైఅందరువిడివిడిగా వినియోగింపబడుతారు. ప్రాణశరీరములునశిస్తాయి. ఏర్పడుతాయి, (54) కాని ఆత్మకుజన్మమరణములు లేవు, ఓకవినత్తమ! అందువల్ల ఓ అంజనానుత ! నీవుశోకరహితమైన ఏకమైనజ్ఞానమును {55) నత్తురూపముగాగల, అమలమైన బ్రహ్మనురాత్రింబగళ్ళుచింతించు. నీవు చేసిన పనినేను, చేసినట్లే నేను చేసిన పని నీవు చేసినట్లే (56) నేనునా లింగాన్ని స్థాపించటము నీలింగాన్ని స్థాపించినట్లే, ఓకవ! ముహూర్తము దాటిపోతోంది కాబట్టి సీతచేసిన ఇనుకలింగాన్ని (57) నేను ఇక్కడస్థాపించాను. కనుకకోపంగాని దు:ఖంగానివదు. ఈశుభదిన మందు కైలాసము నుండి వచ్చినలింగాన్నిస్థాపించు. (58) నీ పేరుతో ఈలింగములోక త్రయమందుకీర్తిని పొందని హనుమంతుని . - ఈశ్వరుని, చూశాకనే రావు వుని - ఈశ్వరుని చూడాలి. (59) ఓకS ! నీవు బ్రహ్మరాక్షనసమూహములనుచంపావు. అందువల్ల నీ పేరుతో లింగాన్నిస్థాపించటంవల్లనీవు ముక్తుడవౌతావు (60) స్వయంగా శివుడిచ్చిన హనున్నామకమైన శివునిచూశాకనే రామనాథుని చూచిననరుడుకృతకృత్యుడౌతాడు. (61) నహస్రయోజనములు, దూరమందున్నా హనుమంతుని లింగాన్నిస్మరించి, రామనాథేశ్వరుని కూడాన్మరించి నరుడు. సాయుజ్యమును పొందుతాడు (62) ఆహనుమద్రానువేశ్వరులు స్థాపించిన మహాదేవుని చూచిన వారు అన్నియజ్ఞములు ఆచరించినట్టే. అన్నితపస్సులూ ఆచరించినట్టే. (63) హనుమంతుడు చేసిన లింగమునేను చేసిన లింగము సీతచేసినలింగము, లక్ష్మణుడుచేసినలింగము (64) సుగ్రీవుడుచేసిన, సేతుకర్తయైన నలుడు చేసిన, అంగదుడు నీలుడు, జాంబవంతుడుచేసిన (65) విభీషణుడుస్థాపించినరత్నలింగము, ఇంద్రాదులు చేసినలింగము శేషుడుమొదలగు వారు ప్రతిష్ఠించినలింగము (66) అనివదకొండు విధములఈశివుడు సాక్షాత్తుగా ప్రకాశిస్తున్నాడు. ఎల్లప్పుడూ ఈలింగములందు మహేశ్వరుడుసన్నిధిలో ఉంటాడు. (67) అందువల్ల నీపావనమూహముల శుద్ధి కొరకు మహేశ్వరుని స్థాపించు.
తా ॥ ఓమహాభాగనీవు (68) నేనుఇక్కడస్థాపించినసీతఇసుకతోచేసినలింగాన్ని పెరికివేసినచోనీవు చేసిన ఈలింగాన్ని ఆపిదపస్థాపిస్తాను (69) పాతాలమును సుతలవీతలరసాతలతలాతలములను ఈలింగముభోదించిఉంటుంది (70) నేను ప్రతిష్టించిన ఈ లింగాన్ని భేదించటానికి ఎవరికి సాధ్యమౌతుంది. ఓకపి! నేను స్థాపించిన ఈ లింగాన్ని తొలగించితెమ్ము (71) నీవు తీసుకవచ్చిన లింగాన్ని త్వరగాస్థాపించు, దుఃఖించకు. అనిఅనగా అతనికి నమస్కరించి, ఆవానరుడు, శక్తిని ఎరుగని వాడై (72) ఇసుకతోచేసినఉత్తమలింగాన్నివేగంగాతొలగిస్తాను.కైలాసమునుండితెచ్చినలింగమునుఆదరంతోస్థాపిస్తాను.(73)సైకతలింగాన్నితొలగించటంలోనాకేంభారమౌతుంది.అనిమనస్సులోఆనుకొనిఈమారుతాత్మజుడైనహనుమంతుడు (74) దేవతలందరుచూస్తుండగా, మునులు, కవులు, రాక్షసులు చూస్తుండగా రామచంద్రడు, లక్ష్మణుడు కూడా చూస్తుండగా (75) సీతచూస్తుండగా ఆ సైకతలింగాన్ని, బలంగావేగంగాబలవంతుడైన వానరుడు చేతితోఅన్ని ప్రయత్నములతో పట్టుకున్నాడు. (76) గొప్పప్రయత్నంలోఈమారుతికదలిపూగూడా, తనశక్తితో ఆ సైకతలింగాన్ని కదిలించటానికనమరుడు కాలేదు. (77) పిదపకిలకిలశబ్దాన్నిచేనూ ఆవానరపుంగవుడుతో కనెత్తితసతేజస్పుతో చేతులతో బాగా ప్రయత్నించాడు. (78) ఇట్లాఅనేకవిధముల కదిలించదలచి కూడావానరుడు పవనాత్మజుడు కదిలించుటకు సమర్శడు కాలేకపోయాడు (79) తోకతో లింగాన్ని చుట్టి చేతితోభూమీని అదిమిపట్ట వాయుసుతుడైన కవి వేగంగా ఆకాశంలో ఎగిరాడు (80) ఏడుదీవులతో, పర్వతములతో భూమినంతను వణికిపూ లింగమునకు కోసుదూరంలో రక్తంక తూతు మూర్ఛపోయాడు (81) ఓవిప్రులారా ! శరీరంవణుకు తుండగాహనుమంతుడుభూమి పైవడ్డాడు. పడినవాయుపుత్రుని ముఖంనుండిరెండుకళ్ళనుండి (82) ముక్కురంధ్రముల నుండి, చెవిరంధ్రముల నుండి, అపానమార్గము నుండి రక్తపు సమూహము స్రవించింది. అది రక్తకుండమైంది (83) దేవతలు అసురులు, మనుష్యులు అందరూ హాహాకారాలు చేశారు. కోతులతో పాటు పరుగెత్తుతున్న ఆ రాములకుణులు (84) సీతతో కూడినవారై దుఃఖాతులులైనారు. ఆ వీరులు సీతతో కూడిన వారై ఆ మహా బలులు వానరులతో కూడా తుడిన వారై (85) గంధమాదన పర్వతమందు వెలిగారు, రాత్రియందు చంద్రుడు, సూర్యుడు వెలిగినట్లు వెలిగారు (86) శరీరమంతా చూర్ణమైన హనుమంతుని చూశారు. మూర్చపోయిన, భూమి పై పడిన ముఖం నుండి రక్తం కక్కుతున్న (87) వానిని చూచి కోతులందరు హాహా కారాలు చేసి భూమి పై పడ్డారు. దయగలిగిన సీత మరుత్పుతుడైన హనుమంతుని (88) భూమిపై పడిన వానిని నాయన! నాయన! (కుమార, కుమార!) అని చేతులతో నశించింది. రాముడు కూడా పడిన కవీశ్వరుని, హనుమంతుని చూచి (89) కలేవరాన్ని తొడ పై నుంచుకొని తన చేతులతో పరామర్శించాడు. కళ్ళనుండి వస్తున్న కన్నీళ్ళను వదులుతూ ఆ వాయుజునితో ఇట్లా అన్నాడు (90) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏశీతి నహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్య మందు రామచంద్ర తత్వజ్ఞానోపదేశ వర్ణన మనునది నలుబది ఐదవ అధ్యాయము.
