స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

39వ అధ్యాయము

శ్రీ నూతులిట్లనిరి - ఇక ఇక్కడ నుండి కపితీర్థ వైభవమును చెప్తాను. ఆ తీర్థం పూర్వము గంధమాదన పర్వత మందు (1) కవులందరిచే అందరికి ఉవకారము కొరకు నిర్మితమైనది. ఓ బ్రాహ్మణులార ! రావణాది రాక్షసులు చంపబడ్డాక ఆ పిదప (2) తీర్థమును నిర్మించి ఆ కపులందరు ఆనందంతో అక్కడే స్నానం చేశారు. కామరూపులైన కవులు ఆ తీర్థమునకు వరం కూడా ఇచ్చారు (3) భక్తి ప్రవణ చేతనులై ఈ తీర్థమందు మునిగిన వారందరు మహా పాతకముల నుండి మోచితులై ముక్తి భాజనులౌతారు (4) ఈ తీర్థమందు మునిగిన వారికి నరకము నుండి కలిగే భయము ఉండదు. ఇక్కడ స్నానం చేసిన నరులందరు దారిద్ర్యమును పొందరు (5) ఈ తీర్థముందు మునిగిన వారికి యము వీడకూడా కలుగదు. కవి తీర్థమునకు వెళుతాను అని మాటి మాటికి పలుకుతూ (6) నూరడుగులు వేసిన అతడు పరమ పదమునకు వెళుతాడు. ఈ తీర్థముతో నమానమైన తీర్థము గతంలో లేదు భవిష్యత్తులో రాదు (7) ఈ రకమైన వరమును కపీశ్వరులు ఈ తీర్థమునకు ఇచ్చి, అందరు దశరథరామునకు నమస్కరించి ఇట్లా యాచించారు. (8) ఓ స్వామీ! మీరు కూడా ఈ తీర్థమునకు అద్భుతమైన వరమును ఇవ్వండి, అని కవులు ప్రార్థించగా రామచంద్రుడు చాలా సంతోషించి (9) కవులకు ప్రీతికలిగేట్లుగా ఆతీర్థ మునకు వరమిచ్చాడు. ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి గంగా స్నాన ఫలం లభించాలి (10) ప్రయాగ స్నానం వల్ల కలిగే పుణ్యము, సర్వతీర్థముల వలము, ముఖ్యమైన అగ్నిష్టోమాది యాగముల వలము కలగాలి (11) గాయత్ర్యాది మహామంత్ర జవ పుణ్యము కలగాలి. గోసహస్రము దానము చేసిన నరుల అవికల వలమును పొందాలి (12) చతుర్వేదముల పారాయణ ఫలము పొందాలి. బ్రహ్మవిష్ణుమ కోశాది దేవపూజా ఫలము పొందాలి (13) ఈ విధముగా ఓ ద్విజులార! రాముడు కపితీర్థమునకు ఈ వరములనిచ్చాడు. రాముడు ఈ విధముగా వరమీయగా కుతూహలంతో (14) ముక్కంటి, బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, వరుణుడు, అగ్ని, వాయువు, కుబేరుడు, చంద్రుడు (15) నూర్యుడు, నిర్ఋతి, సాధ్యులు, మనువులు, ఇతరదేవతలు, అట్లాగే విశ్వేదేవాదులు (16) అత్రి, భృగు, కుత్స, గౌతమ, వరాశరులు, అగస్త్యులు, సుతీక్ష్మడు, ఇతరులు విశ్వామిత్రులు (17) సనకాదియోగులు, నారదాది దేవర్పులు రాముడు వరమిచ్చిన ఆ తీర్థమును అనేక విధముల పొగిడారు (18) సర్వాభీష్టములనిచ్చే ఆ తీర్థమందు వారు స్నానం కూడా చేశారు. ఈ ముఖ్యమైన తీర్థము కపులతో నిర్మించబడింది కనుక (19) ఇది అందుకే కఎతీర్థమనే ఖ్యాతిని లోకంలో పొందగలదు అని కూడా ఆ దేవతలు మునులు అంతా పలికారు (20).

కనుక మోక్షమును కోరువారు తప్పకుండా కపితీర్థమునకు వెళ్ళాలి. పూర్వం రంభ కౌశికుని శాపంతో శిలగా మారింది (21) అక్కడ స్నానం చేసి తన పూర్వ రూపాన్ని పొందింది. స్వర్గానికి వెళ్ళింది కూడా. ఈ తీర్థమాహాత్మ్యమును నేను చెప్పలేను (22) మునులు ఇట్లా అన్నారు - ఓనూతనందన ! కౌశికుడు రంభనెందుకు శపించాడు. శిలగా మారిన ఆమె దేవతాస్త్రి కవితీర్థానికి ఎట్లా వెళ్ళింది. ఓ ముని నత్తమ ! విస్తరంగా ఇదంతా మాకు చెప్పండి. (23) అని అనగా శ్రీసూతులిట్లనిరి. వూర్వం కుశికాన్వయ మందు విశ్వామిత్రుడను రాజు ఉండేవాడు (24) బలవంతుడైన ఆ రాజు ఒకసారి సేనతో వరివృతుడై రాజ్యాన్ని చూడాలనే కోరికతో భూమి పై తిరిగాడు (25) ఆతడు అనేక దేశాలు తిరిగి వసిషా శ్రమమునకు వెళ్ళాడు. మహాత్ముడైన వసిషుడు ఈతనిని అతిథిగా వరించాడు (26) ఈతడు అట్లాగే కానిమ్మని పలికాడు. రాజు దండమువలె ప్రణామం చేశాడు. కామధేను ప్రభావంతో రాజైన విశ్వామిత్రునకు (27) బ్రహ్మనందుడైన వసిషుడు ఆతిథ్యమిచ్చాడు. ఓ బ్రాహ్మణులార ! కుశికనందనుడు కామధేను ప్రభావమును తెలుసుకొని (28) అభీష్టములనిచ్చే కామధేనువును ఇమ్మని వసిషుని ప్రార్థించాడు. వసిషుడు వ్యతిరేకించగా దానిని బలంగా లాగాడు (29) కామధేనువు వదలిన మేచ్చులు ఆతనివోడించారు. ఆ రాజు మహాదేవునారాధించి ఆతని నుండి అస్త్రములను పొంది (30) వసిషుని ఆశ్రమమునకు వెళ్ళి శరసమూహములను వదిలాడు. అన్ని అస్త్ర ములను, బ్రహ్మాస్త్రమును కూడా ఆ రాజు వదిలాడు (31) ఆ అస్త్రములనన్నింటిని బ్రహ్మనందనుడైన వసిషుడు తన తపోబలంతో ఒక్క బ్రహ్మదండంతోనే సంహరించాడు (32) అక్కడ ఓడినవాడై విశ్వామిత్రుడు చాలా సిగ్గుపడి తనకు బ్రాహ్మణ్యం రావటం కొరకు తపస్సు చేయటానికి అడవికి వెళ్ళాడు (33) పూర్వ దిక్కున దక్షిణ పశ్చిమములందు మూడు దిక్కులలో తపమాచరించాడు. ఆది క్కులలో గొప్ప విష్నుమేర్పడి కౌశికుడు (34) ఉత్తర దీఠ్కును చేరి నిర్మలమైన హిమవత్పర్వతమందు కౌశికి సరన్పు తీరమందు పాప నాశకమైన పుణ్యప్రదమైన దానీ తీరమందు (35) దేవతల వేయి సంవత్సరముల కాలము నీరాహారుడై ఇంద్రియముల జయించి, వెలుగుచూడకుండ శ్వాసను జయించి, క్రోధమును జయించి నశ్చిలుడై (36) గ్రీష్మ మందు వంచాగ్ని మధ్య మందున్నవాడై శిశిరమందు నీటి యందున్నవాడై వర్షాకాలమందు ఆకాశాన్ని చూనూ ఎవ్వడూ చేతులు పైకెత్తి, నిరాశ్రయుడై (37) బ్రాహ్మణ్య సిద్ధి కొరకు ఉగ్రమైన గొప్ప తపము ఆచరించాడు. ఉద్విగ్నమనస్కుడైన ఆతనిని గూర్చి త్రిదివాలయ మందలి దేవతలు, ఇంద్రుడు కూడా కలిసి రంభతో ఇట్లా అన్నారు (38).

దేవతలిట్లా అన్నారు. ఓ రంభ! నీవు హిమవత్పర్వత మందు కౌశికీ తీరమందున్న మునిని (39) తవన్సు చేస్తున్న విశ్వామిత్రుని నీ చేష్టలతో లోభ పెటు. ఆతని తపస్సుకు విశ్నుమయ్యేట్లు చేయి, (40) ఇట్లా అనగా, రంభ దేవతలు ఇంద్రుడు మొదలగు వారితో చేతులు జోడించి నమస్కరిస్తూ అప్పుడు ఇట్లా అంది (41) రంభ వచనము - అతిక్రూరుడు, మహాకోపం కలవాడు మహామునియైన ఆ విశ్వామిత్రుడు ఆతడు కోపంతో నన్ను శపిస్తాడు. ఓ దేవతలార! అందువల్ల అతడంటే భయము. (42) అందువల్ల మీ పరిచారికమైన నన్ను మీరు దయతో రక్షించండి. అని రంభ అనగా అప్పుడు ఇంద్రుడు ఆమెతో ఇట్లా అన్నాడు (43) ఇంద్రుని మాట - ఓ రంభ! నీవు భయపడొద్దు. తపోధనుడైన ఆ మహర్షిని చూసి నేను కూడా నీకు సహాయం చేసే కొరకు మన్మథునితో కూడి వస్తాను (44) కోకిలల ధ్వనితో మధురమైన వనంతుడు కూడా వస్తాడుమనతో. అతి సుందరరూపం కల. నీవు మహామునిని లోభ పెటు (45) అని ఇంద్రుడనగా రంభ విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళింది. అతని దృష్టి గోచరమయ్యేట్టుగా నిలబడి లలితమైన రూపంతో ఉంది (46) మనోహరమైన చేష్టలతో ఆమె ఆ మునిని లోభ పెట్టసాగింది. ఆ సమయంలో కోకిల కూడా మనస్సును ఆనందవరునూ కూయసాగింది. (47) మునిపుంగవుడు ఏక స్వరమును విని రంభను చూచి హృదయం సంశయంలో నిండిపోగా ఇది ఇంద్రుని వని అని గ్రహించి కోపంతో తపోధనుడైన విశ్వామిత్రుడు రంభను శపించాడు (48) విశ్వామిత్ర వచనము ఓ రంభ! కోవమును జయించాలని అనుకుంటున్న నన్ను నీవు కోవంకలిగేట్టుగా చేస్తున్నావు. (49) కనుక ఓ రంభ! నీవు పదివేల నూర్ల సంవత్సరాలు (లక్ష) ఇక్కడ శిలగా పడి ఉండు. ఈ మధ్యలో బ్రాహ్మణునితోరక్షింపబడి మోక్షాన్ని పొందుతావు (50) అని విశ్వామిత్రుని శాపంతో ఆమె శిలగా మారింది. ఓ ద్విజులార! ఆతని ఆశ్రమంలో చాలా కాలము శిలగానే ఉండింది (51) ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు తిరిగి గొప్ప తపస్సు చేసి వసిషుని వాక్యంతో రాజులకు దుర్లభమైన బ్రాహ్మణ్యమును పొందాడు (52) రంభ కూడా ఆతని ఆశ్రమంలో చాలా కాలము శిలగానే ఉండింది.

 పుణ్యమైన ఆ ఆశ్రమంలోనే అగస్త్యుని శిష్యుడు (53) శ్వేతుడను ముని మోక్షార్థిఐ వరమమైన తపస్సు చేశాడు. ఆ మహాముని అక్కడ చాలా కాలము తపస్సు చేస్తుండగా (54) అంగారక అను పేరుగల ప్రసిద్ధి చెందిన రాక్షసి ఒకతె వచ్చింది. అతి క్రూరురాలు, మేషుగర్జన వంటి పెద్ద గొంతుగల (55) భీషణమైన ఆ రాక్షసి మూత్ర రక్త పురీషాదులతో ఆ ఆశ్రమాన్ని మలిన వరిచింది. ఆ మునిని ఉపద్రవములతో ఇతర విధముల బాధించసాగింది (56) అవ్వడు కోపగించిన శ్వేత నామక ఆముని వాయవ్యాస్త్రమును బంధించి, కౌశికునితో శపింవబడ్డ. ఆశిలను ఆ రాక్షన్ పై విసిరాడు. (57) వాయవ్యాస్త్రముతో గురి పెట్టబడిన ఆ రాక్షసి పరుగెత్త సాగింది. వాయవ్యాస్త్రంతో ప్రయోగింపబడ్డ శిలతో అనునరింపబడుతూ ఆది పరుగెత్తింది (58) భయపడుతూ అది దక్షిణ సముద్రతీరాన్ని గూర్చి పరుగెత్తింది. అస్త్రముతో ప్రయోగింపబడ్డ ఆశిల పరుగెత్తుతున్న రాక్షసిని అనునరినూ (59) కవితీర్థంలో మునుగుతున్న రాక్షసి పైన పడింది. తన తల పై రాయివడడంతో ఆ రాక్షసి అక్కడ చచ్చిపోయింది. (60) విశ్వామిత్రునితో శపించబడ్డ ఆమె (శిల) కపి తీర్థంలో మునగటంవల్ల శిలా రూపాన్ని వదలి రంభారూపాన్ని పొందింది. (61) మనోరమమైన ఆమెను దేవతలు పూలధారలతో వర్షించారు (తడిపారు). దీవ్య విమానమువారోహించి, దివ్యఅంబరములతో వెలిగిపోతూ (62) హారకేయూర కటకనాసా భరణములతో అలంకరించబడి, ఊర్వశిమొదలగు అవ్వరనలతో నఖులతో పరివేష్టింవబడి (63) కవితీర్థమాహాత్మ్యాన్ని మాటి మాటికి ప్రశంసిస్తూ, రామనాథుడు, శశిభూషణుడైన శంకరుని సేవించి (64) ఇంద్రుని వట్టణమైన అందమైన అమరావతికి వెళ్ళిపోయింది. మహా తేజస్సంపన్నుడైన అగస్త్యుని శావంతో (ఆ రాక్షసి గూదా) (65) వృతాచి అనుదేవవేశ్యరాక్షసి రూపాన్ని పొందింది. ఆమె కూడా ఇక్కడ కఎతీర్థం నీటిలో స్నానం వల్ల తన రూపాన్ని పొందింది. (66) ఈ విధంగా రంభ ముృతాచులిద్దరు కవితీర్థ స్నానంవల్ల అగస్త్య శిష్యుడైన శ్వేతుని అనుగ్రహం వల్ల ఓ బ్రాహ్మణులార ! (67) రాక్షసి రూపాన్ని, శిలరూపాన్ని వదలి తమ రూపాన్ని పొందారు. అందువలన అన్ని విధముల ప్రయత్నించి కపి తీర్థ మందు స్నానం చేయాలి (68) ఈ అధ్యాయమును వినిన లేదా చదివినా నరుడు ఉత్తమమైన కవితీర్థంలో స్నానం వల్ల వచ్చే ఫలాన్ని పొందుతాడు (69) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్యంలో కపితీర్థ ప్రశంసయందు రంభా ఘృతాచి శావమోక్షణ వర్ణనమనునది ముప్పది తొమ్మిదవ అధ్యాయము.