స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

5వ అధ్యాయము

శ్రీ సూతులిట్లనిరి - పావనాశకము, వుణ్య ప్రదము ఐన చక్రతీర్థమునుస్తుతించి ఓమునీశ్వరులారా! ఇంకను కొంచము అద్భుతమైన విషయాన్ని మీకు చెబుతాను (1) విధూమ అనే పేరు గల వసువు అలంబుస అనే దేవర్రీ వీరిద్దరు మహా వూరమైన బ్రహ్మశాపమువల్ల పూర్వము మనుష్య రూపమును పొందారు (2) చక్రతీర్థమందు స్నానము చేసి శాపవిముక్తులైనారు అని. ఋషులిట్లన్నారు. - ఓ సూత! మహా ప్రాజ! వురాణార్థమెరిగినవాడ! (3) ప్రాజడ వైనందువల్ల వ్యానశిష్యుడవైనందువల్ల నీకు తెలియనిది ఏమీ లేదు. ఏమి తప్పిదము కారణముగా బ్రహ్మ వను అలంబుసలను (4) శపించాడు. బ్రహ్మశాపంకారణంగా వారు ఎవరికి వుత్రులైనారు (5) శపింపబడ్డవారికి శాపాంతము (శాపమోచనము) ఎట్లా జరిగింది. శ్రద్ద గలిగిన మాకు వివరించి చెప్పండి. అని (6) శ్రీ సూతులిట్లవికి పూర్వము స్వయంభువు, చతురాననుడు ఐన బ్రహ్మ సావిత్రి సరస్వతులు పార్వమందుండగా (7) వాతనుడైన బుద్ధిమంతుడైన సనతుడు, సనత్కుమారుడు, నారదుడు (8) ననందాదులు ఇతర మునులు సేవించుచుండగా, దేవతలతో వరివేష్టింపబడిన ఇంద్రునితోస్తుతింపబడుచు (9) ఆదిత్యాది గ్రహములతో సేవింపబడుతున్న పాదద్వయము కలవాడై, ఎదులు, సాధ్యులు, మరుత్తులు, కిన్నరులు వరివేష్టింప (10) కింపురుషగణము, అష్టవసువులు వీరితో చుట్టబడి, మనోరమమైన ఊర్వశి మొదలగు దేవ వేశ్యల (11) నృత్యమును వాద్యములతో నహకూడిన దానిని (వీణ, మద్దెల, వేణువు, తాళములు వగైరా) మాటిమాటికి చూస్తూ నత్యలోకంలో బ్రహ్మనే భామధ్యమందు గోపిని ఏర్పరచుకున్నారు (12) వేముగర్దనవలె గంభీరమై మాటిమాటికి జనులను ఆనందవరుమా వీణ,వేణు మృదంగముల ధ్వవి అక్కడ వ్యాపించింది (13) గంగాతరంగముల తుం వురులవలె చల్లనైన గాలి సుఖకరమై తగులుతూ మెల్లమెల్లగా వీస్తోంది (14) దేవనాట్యకత్తెలు అందరు ఒకరి తర్వాత ఒకరు నాట్యం చేశారు. ఇతరవేశ్యలు నృత్యశ్రమతో అలసిపోయాక మర్యాదగా - (15)

అలంబున దేవతాస్త్రీ రూపము యావనము కలది. జనులందరిని మత్తెక్కించే సేది సభామధ్యంలో నాట్యం చేసింది. (16) ఓ బ్రాహ్మణులారా! సభలో అప్పుడు నాట్యం చేస్తున్న ఆమె యొక్క లోపలి వస్త్రము, వాయువులీల వల్ల పైకి లేచింది (17) అట్లా లేవటంవల్ల (తొలగటం) ఆమె ఊరుమూలము (తొడలభాగం) స్పష్టంగా కన్పించింది. ఆట్ల ఐన ఆమెను చూచి బ్రహ్మాదులందరు సిగ్గువల్ల (18) సభామధ్యంలో తూర్చున్నవారు కళ్ళు మూసుకున్నారు. విధూమనాముడనే పసువు మాత్రం మన్మథ బాణంతో బాధితుడై (19) బ్రహ్మభవనంలో గాలితో తొలగించబడ్డ వస్త్రముగల ఆమెనే చూస్తూ ఆనందంతో విప్పారినకళ్ళు గలిగి రోమాంచముకలవాడైనాడు (20) ఆ ఆలంబున యందు కామము కల్గిన ఆతనిని చూచి, బ్రహ్మవిధూమనాముడైన ఆ వస్తువును శపించాడు (21) విథూమ! నీవు ఇటువంటి వనిచేశావు కాబట్టి మనుష్యలోకంలో మనుష్యుడవై జన్మిస్తావు (22) ఈ దేవతార్రీ నీరు అక్కడ భార్యఔతుంది. ఈరకంగా బ్రహ్మతో శృంవబడి విధముడు అన్నమాననుడైనాడు (23) బ్రహ్మకు నమస్కరించి ఆతనిని ప్రసన్నుని చేసుకున్నాడు వసువు. వీధూముడు ఇట్లా అన్నాడు - భక్తులయందు దయగల ఓ భగవంతుడ! ఈ వరశాపమునకు (24) నేను అరుణికాను. ఓదయా సముద్ర సన్నురక్షించు. ఈ రకంగా విధమునిచే ప్రార్థింపబడ్డ అవ్యయుడైన భారతపతి (25) చాలా దయగలవాడై విధముని ఓదారుస్తూ ఇట్లా అన్నాడు. బ్రహ్మవచనము - నీకీ శాపం ఇచ్చాను ఇది అబద్ధంకాదు (26) నీ ఈ శాపానికి ఒక అవధిని ఏర్పరుస్తాను. మనుష్యుడుగా జన్మించాక ఈ అలంటునతో కూడి (27) అక్కడ మహారాజువై భూమిని చాలా ఏండ్లు పాలించి, ఈమె యందు సాటిలేని రాజకుమారునికని (28) రాజ్యరక్షావిచక్షణుడైన ఆతనిని రాజ్యమందు అభిషేకంచేసి ఈశాపం యొక్క ముగింపుకొరకు దక్షిణ నముద్రం యొక్క ఒడ్డులో, పుల్లగ్రామ సమీపంలో ఉన్న గొప్ప తీర్థమైన చక్రతీర్థమందు (29) ఈ భార్యతో కూడి స్నానం చేసిన వెంటనే, పాముకుబుసంవిడిచినట్లు నీవు నీ మానుష రూపమును (30) వదలి భార్యతో పాటునీలోకానికి తిరిగి వస్తావు. ఇటువంటి శాపము చక్రతీర్థంలో స్నానం చేయకుండా నశించదు (31) అవే బ్రహ్మ మాటలను విని విధముడు ఎక్కువ ఆనందపడలేదు. బ్రహ్మను సాగనంపి తన గృహం ప్రవేశించాడు.

తన గృహంలో వమును ఇట్లా ఆలోచించసాగాడు. మనుష్యజన్మనెత్తే వాడు తండ్రెవరు, తలైవరౌతారు (33) ఇట్లా చాలాసేపు ఆలోచించి విధముడు ఇట్లా నిదయించుకున్నాడు. కౌశాంబినగరంలో శతానీకుడని రాజున్నాడు (34) ఆతడు వీరుడు, ఉత్తముడు అతని భార్య కూడా పతివ్రత. విష్ణువునకు శ్రీదేవి వలె ఆతనికి విష్ణుమతి అను ఆమె భార్య (35) అతనిని తండ్రిగా ఆమెను తల్లిగా చేసుకొని నా కర్మ పరిపాకం వల్ల భూలోకంలో వుడాను (36) ఎదవ అవసువు మాల్యవంతుడు, పుష్పదంతుడు బలోత్కటుడు అను తన ముగ్గురు భృత్యులను పిలిచి ఈ విషయము చెప్పాడు (37) భృత్యులారా ! వినండి మీకు క్షేమం కలగని మహాభయానకమైన బ్రహ్మశాపం వల్ల నేను శతానీకునివల్ల విషమతియందు వుత్రునిగా వుద్దాను (38) ఈ మాటవిని ఆతని - భృత్యులు, ఆతని బహిః ప్రాణములు, కన్నీళ్ళు గల ముఖాలతో అందరు విధూమునితో ఇట్లా అన్నారు (39) భృత్యుల మాట - మేము ముగ్గురము నీవియోగాన్ని సహించలేము. అందువల్ల మనుష్యరూపాన్ని మాతో పాటు పొందుతావు. (40) శతానీకుని మంత్రియైన యుగంధరుడు, యుద్ధరంగంలో ముందుండే సేనావతి వివ్రతీ కుడు (41) నర్మకర్మలలో స్నేహితుడు వీవ్రుడు, మహాత్ముడైన వల్లభుడు, ఈ ముగ్గురికి మేము ముగ్గురము వుత్రులుగా జన్మిస్తాము అనుమానంలేదు (42) రాజర్షియైన శతానీకునకు పుత్రునిగా జన్మించిన నీకు ఆయా పనుల్లో మేము శుశ్రూష చేస్తాము (43) ఈరకంగా మాట్లాడుతున్న వారితో విధూముడు ఇట్లా అన్నాడు (43%) విధూముని మాట - నేను మీ స్నేహాన్ని ఎరుగుదును. ఉత్తమమైనది అటువంటిదేనని (44) ఐవా చెవున్నాను. నాహితకరమైన మాట వినండి. వా దుష్కర్మవల్ల వరమైన బ్రహ్మశావంవల్ల (45) రుత్పితమైన మనుష్య జన్మను వేనొక్కణే పొందుతాను మీరు ఈ శాపంలేదు. మీరు దీన్ని అనుసరించటం తగదు. (46) అందువల్ల జుగుప్పితమైన మనుష్యజన్మయందు మనసును నిల్పకండి. అందువల్ల వారు శానమోక్షంకలిగే వరకు మీరు ఈ వియోగాన్ని భరించండి. (47) అని మాట్లాడుతున్న విధమునితో మాల్యవల్ ప్రముఖులైన ఆ ముగ్గురు శిరస్సు వంచి నమస్కరిస్తూ మరల మరల ఇట్లా ప్రార్థించారు (48) మమ్ములను రక్షించి మీరు ఈ పాపం చేయవదు. తవ్వలేనటువంటి, నీ భక్తులమైన మమ్ములను వదలి పెడున్నావు. (49) మహా ఘోరమైన నీ వియోగముకన్నను కుత్పితమైన మానుష జనవైనను గొప్పగా భావిస్తాము. అందువల్ల మమ్ములను రక్షించు (50) ఈరకంగా యాచిస్తున్న ఆ ముగ్గురు భృత్యులను అనుమతించాడు. ఆ ముగ్గురితో కూడి ఈ విధముడు కౌశాంబికి పోదలిచాడు (51)

ఈ కాలంలోనే చంద్రవంశ వర్గ తుడై జనమే జయునకు కల్గినవాడు అర్జునుడు అను పేరు గల వంశమందు పుట్టినవాడు (52) ఐన శతానీకుడనే రాజు భూపరిపాలన సాగిస్తున్నాడు. ఆతడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, మాటలలో చతురుడు (యుక్తభాషి), ప్రజాపాలన యందు ఆసక్తికలవాడు (53) చతురంగ బలము కలవాడు, నరాక్రమమే ధనముగా గలవాడు, యువకుడు ఆ మహారాజు కౌశాంబీ నగరమును ఆధ్వనించాడు (54) ఆతనికి రాజనీతి రహస్యమెరిగిన మంత్రి యుగంధరుడని ఉన్నాడు. యుధముందు ముందునిలిచే విప్రతీతుడనే సేనాని ఆతనికున్నాడు (55) వినోదమునకు (హాస్యమునకు) ద్విజుడు, స్నేహితుడు వల్లభుడు అని ఉన్నాడు. ఆతని6, విషువునకు లక్షివలె వినుమతి అని భార్య ఉంది (56) అన్ని గుణములు కల ఆశతానీకుడు బుద్ధిమంతుడు. తనకు తగిన వుత్రుని ఆ భార్యయందు రాజు పొందలేదు (57) తనకు సంతానము లేనందుకు ఆతడు చాలా బాధపడ్డాడు. మంత్ర విదుడైన యుగంధరుడనే మంత్రిని పిలిచి (58) నాకు నంతానం ఎలా కలుగుతుంది అని ఆలోచించాడు. మంత్రి సంతానంలేదని బాధపడుతున్న రాజును (59) తన మాటలతో సంతోష పెడూ ఇట్లా మాట్లాడాడు యుగంధరుని వాక్కు- నత్యవాక్కు గల, శుచియైన శాండిల్యుడనే ఋషి ఉన్నాడు. (60) ఆతడు శత్రువులను మిత్రులను సమంగా చూస్తాడు. తపస్సుచే శ్రమించినవాడు, తవః స్వాధ్యాయములందు ఆసక్తి కలవాడు. అగ్నిలాగా వెలిగిపోతున్న ఆమునిని చేరి (61) నీతో సమానమైన పుత్రుని వినయవంతుడవై యాచించు, దయగల ఆ ఋషి నీరు తప్పకుండా వుత్రుని ఇస్తాడు (62) అని అన్న మాటను విని సంతోషంతో కళ్ళు విప్పారగా ఆ మంత్రితో కూడి ఆ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు (63) ఆశ్రమమందు కూర్చున్న ఆ ఋషికి రోజు నమస్కరించాడు. తేజస్సంపన్నుడైన శాండిల్యుడు ఆశ్రమానికి వచ్చిన రాజును (64) చూచి పాద్యము మొదలుగా పూజించి స్వాగతం పలికాడు. శాండిల్యుని మాట - ఓ శతానీకుడ! నీవు ఎందుకొరకు నా ఆశ్రమానికి వచ్చాను (65) నీకేం చేయాలో చెనూనేను చేస్తాను. అని ఈ రకంగా వల్కుతున్న మునిని చూచి యుగంధరుడు ఇట్లా అన్నాడు (66).

 ఓ పూజ్యుడ! ఈ రాజు సంతానం లేనందువల్ల కృశించినవాడై ఇవ్వడు పుత్రుని కొరతునిన్ను శరణు పొందినాడు (67) ఈతనికి సంతానం లేనందువల్ల కళిన దుఃఖాన్ని తొలగించుటకు నీవు అరుడవు. అవే అతని మాటలను విని మునిశ్రేషుడైన శాండిల్యుడు (68) ఆ రాజునకు పుత్రుడు కలిగేందుకు వరమును ప్రదానం) ప్రతిజ్ఞ చేశాడు. వరమును ఆ రాజునకు ఇచ్చిన ఆ ఋషి సాదరముగా కౌశాంబకి వచ్చి (69) పుత్రునికి ఆ రాజుయొక్క పుత్రకామేష్టియందు (ఆముని) యాజకుడైనాడు. దశరధుని పోలిన ఆ రాజు ఆముని అనుగ్రహం వల్ల (70) యాగము చేవ రామునివలె సహస్రానీకుడనే కొడుకును పొందాడు. ఈవిధముగా శతానీకుడనే రాజువల్ల విధూముడు జన్మించాడు (71) ఇంతలో మంత్రి శ్రేషుడు, రాజుగారి సేనావతి, నర్మ వయస్యుడైన బ్రాహ్మణుడు వీరు తమ తమ కులములకు తగిన వుత్రులను పొందిరి (72).

మాల్యంవంతుడనే పేరుగల భ్యత్యుడుయు గంధరునకు పుత్రుడయ్యాడు. యాగంధరాయణు డని పేరు. రాజనీతి శాస్త్ర కోవిదుడు (73) పుష్పదంతుడు విప్రతీతుని పుత్రునిగా జన్మించాడు. శత్రు సైన్యమును మర్దించుటలో నమరుడు, రుమణ్వంతుడని ప్రసిద్ధి పొందాడు (74) బలోత్కటుడు వల్లభునకు తనయుడైనాడు. వసంతకుడని అతని పేరు. నర్మకర్మలలో సమర్థుడు. (75) రాజపుత్రుడు మొదలుగా వారందరు వృద్ధి చెందసాగారు. వారికి ఐదేళ్ళ వయసు వచ్చాక (76) దేవవేశ్యయైన అలంబున కూడా కృతపర అవే రాజునకు అయోధ్యాపురి యందు మృగావతి అనే పేరుతో కన్యగా జన్మించింది (77) ఈ విధముగా విధముడు మొదలగువారంతా ఈ భూమి యందు జన్మించారు. ఇంతలో గొప్పశక్తి సంపన్నుడు, దుష్ట అనుచరగణం కలవాడు, బలవంతుడు (78) అహిదంద్రుడు అని ప్రసిద్ధి చెందిన రాక్షసుడు బలవంతుడు దుర్మార్గుడైన స్థూలశిరుడను పేరుకళిన సహచరునితో కూడి (79) దేవనగరమును అడ్డగించాడు. దేవతలను బాధించాడు. దేవతలకు రాక్షసులకు గొప్ప యుద్ధం స్వర్గంలో జరుగుతుండగా (80) ఇంద్రుడు శతానీ తుణి పహాయం కొరకు తీసుకువచ్చాడు. ఆరాజు శాస్త్ర ప్రకారము తనకొడుకును యువరాజునుచేసి (81) దేవతలతో పహారథమెక్కి యుద్ధానికి బయలుదేరాడు. ఆ ధనుర్ధారి మాతలితో తీసుకొని పోబడి స్వర్గానికి వచ్చి (82) దేవతలను ప్రేక్షకులనుగా చేసి దైత్యులను సంహరించాడు. ఆ దైత్యాధిపుడు, అతడు కూడా యుద్దమందు న్వర్లోకంలో చంపబడ్డాడు. (83)

ఆసిదవ ఇంద్రుని ఆజ్ఞ ప్రకారము చనిపోయిన రాజును రథ ముందుంచుకొని మాతలివేగంగా కౌశాంబికి వచ్చాడు (84) మాతలి భూమిపైకి రాజశవాన్ని తెచ్చి రాకుమారునికి అప్పగించాడు. పిదవ సహస్రానీకుడు కూడా చాలా దు:ఖంతో ఏడ్చాడు (85) మంత్రులలో ఆలోచించి ప్రేతకార్యమును నిర్వర్తించాడు. రాజు గారి మరణవార్త వినిరాణి అతనితో పాటు మరణించింది (86) రాణితో పాటు రాజుగారు కూడా కీర్తిశేషులయ్యాక శతానీత తనయుడు మంత్రుల మాటలతో తన రాజ్యానికి వచ్చాడు (పరిపాలన ఆరంభించాడు) (87) యుగంధరుడు, విప్రతీకుడు, వల్లభుడు మృతి చెందాక యౌగంధరాయణాదులైన వారి పుత్రులు అందరు (88) శతానీకుని పుత్రుడైన ఈతనికి ఆయా పనులు చేయసాగారు. బలవంతుడైన ఆ రాకుమారుడు ఈ విధంగా రాజ్యపాలన చేస్తుండగా (89) కొంతకాలం గడిచాక ఇంద్రునిచే నందన మహోత్సవమునకై ఆహ్వానింపబడి ఈ రాకుమారుడు, ఇంద్రుడు చెప్పిన భవిష్యత్ కథను విన్నాడు (90) దేవతాస్రీ ఆలంబున బ్రహ్మశాపంవల్ల అయోధ్య యందు కృతవర్మ అనే రాజునకు మృగావతి అనే కన్యగా జన్మించింది (91) నీవు విధూమ అనే పేరు గల వసువువు. పూర్వం దేవతాస్రీయైన ఆమెను బ్రహ్మ భవనంలో గాలివల్ల తొలగిన వస్త్రం కలదానిని చూచి (92) మన్మధునితో అక్రమింపబడి అప్పుడే శాపమును పొంది మనుష్యునిగా జన్మించావు. త్వరలో ఆమెయే నీ భార్యగా కాబోయేది ఓ రాజా (93) ఎప్పడైతే నీ కొడుకును రాజ్యమందుంచి మృగావతితో పాటు దక్షిణ ముద్ర తీరంలోని (94) మహా పుణ్యప్రదమైన చక్రతీర్థంలో వుల్లగ్రామ సమీపంలో స్నానం చేస్తావో అప్పుడే శాప విముక్తుడవౌతావు (95) అవి సత్యలోకంలో బ్రహ్మపూజ్యడు పలికాడు. అనే ఇంద్రుని మాటలను విని సహస్రానీకుడనే ఈ రాజు (98) వివాహ సంబంధమైన ఉత్సాహంతో ఇంద్రువికి పోయివస్తానని చెప్పి పంతొషంతో తిలోత్తమతో కూడి కౌశాంబికి బయలుదేరారు. మార్గంలో (97) ఆ స్త్రీని గూర్చి ఏకాగ్రంగా ఏదో ఆలోచిస్తూ ఇంద్రుని మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ తనతో మాట్లాడుతున్న ఆమెను (తిలోత్తమను) రాకుమారుడు చూడలేదు (98) అవాదరంతో తిరస్కరింపబడ్డ ఆమె రాజును శపించింది. ఓ వహప్రానీక మహారాజ! వేను పిలుస్తున్నా '(99) మృగావతిని మనసులో ధ్యానిస్తూ నన్నెందుకు ఉపేక్షచేశావు. స్త్రీలు సౌభాగ్యంలో గర్వించేవారు. అవమానాన్ని సహించలేరు. (100) నన్నవమానించి ఇవ్వడు ఎవరిని నీవు మనస్సులో ధ్యానిస్తున్నావో, అమెను పదునాల్గు సంవత్సరాలు నీవు విడిచి ఉంటావు (101) అని శపించిన తిలోత్తమతో రా ఇట్లా అన్నాడు - కృతవర్మకుతురైన ఆమెనే తిరిగి పొందేట్లతే (102) ఆమె వియోగం వల్ల కలిగే దుఃఖాన్ని పదునాల్గు  సంవత్సరాలు వహిస్తామ, అని చెప్పి ఆమె యందే (మృగావతి) మనము నిలిపి రాజు తన పట్టణానికి వెశ్లాడు (103).

కొంతకాలం గడిచాక కృతవర్మ మహారాజు కూతురు భార్యగా ఈతనిని పొందింది. ఆమె పూలుబాణాలుగా గల మన్మథుని నర్వస్వంగా ఉండి (104) విలాసమనే వృక్షము యొక్క తీగలా (చిగురులా) విభ్రమమవే సముద్రం యొక్క అలలలా ఉన్న మృగావతిని పొంది మదనుని కాంతి ఆనందపడింది (105) శివుని నుండి పార్వతివలె ఆమె ఆరాజు వలన గర్భాన్ని ధరించింది. తొలువులో చంద్రలేఖవలె అమృతంతో కడిగినట్టైంది (108) దౌహృదం వ్యక్తమైనందున ఆ మందరివురందర దిక్కువలె (తూర్పు) చంద్రుణి గర్భంలో కలదానివలె ఆ పట్టపురాణి ప్రకాశిస్తోంది (107) దౌహృదం వల్ల ఆరాణి ఏ ఏకోరికలను కోరిందో వాటన్నిటిని దుర్లభమైన వాటన్నిటిని సమకూర్చాడు (108) భర్త, అడిగిన కోర్కెలన్నీ తీరుస్తూ ఉండగా ఒకసారి ఆ మృగావతి రక్తవాసి (బావి)  యందు స్నానం చేయాలని కోరింది. (109) మృగావతి యొక్క ఆ కోరికను రాజు తెలుసుకొని క్షణాలలో బావిని కుసుమపూల వంటి ఎర్రని నీళ్ళతో నింపాడు (110) ఆ ఎర్రటి నీళ్ళలో మహారాణి ప్రేమతో స్నానం చేసింది. ఎర్రటి నీళ్ళతో తడిసి ఉన్న ఆమెను వికసించిన మోడుగ పూలలా ఉన్న ఆమెను (111) ఆ రాజప్రిని మాంసము అవే బుద్ధితో రవరుని కులంలో పుట్టిన (గరుడని) వికటమైన పక్షి దురదృష్టవశాత్తు ఆ ముగ్ధను అవహరించింది. (112) పర్వతంలా ఉన్న ఆ పక్షి ఆమెను ఆకాశమార్గంలో దూరంగా తీసుకుపోయి మోహవివశను, ఉదయపర్వతగుహలో వదిలింది (113).

తెలివిని పొంది మెల్లగా వణుకుతో కదులుతున్న తీగవంటి శరీరముగల ఆమె కలువలవంటి కన్నుల నుండి మాటిమాటికి కన్నీరు కార్చసాగింది (114) ఓనాథ! నేను మందభాగ్యురాలిని. నీవియోగంతో పాడించబడుతున్నాను. నాకు దిక్కేది. ఎక్కడికి పోను నీముఖాన్ని ఎప్పుడు చూస్తాను. (115) అని అంటూ తనను తాను చంపుకోదలచి గజ సింహముల ముందుకు వెళ్ళింది. ఆమె సింహములతో గజములతో విడువబడింది. చావును పొందలేదు. (118) ఆపత్కాలమందు మనుష్యులకు నిజంగానే మరణము లభించదు. మిక్కిలి దీనమైన ఆమె ఆక్రందనలను తలలు పైకెత్తి విని (117) మృగములు కదలిక లేకుండా గడ్డి పోచలను కూడా తినలేదు. అప్పుడు ఆమెను, దయగలిగిన మునిపుత్రుడు, అట్లా ఉన్నదాన్ని (118) ఏడుస్తున్న దాన్ని రాణిని తన ఆశ్రమమునకు తెచ్చి, ఆరాణిని తన గురువైన జమదగ్ని ముందుంచాడు (119) ధర్మాత్ముడైన జమదగ్ని ఆమెను సమీపమందుంచుకొని ఓదార్చాడు (119 1/2) జమదగ్ని ఇట్లనెను - నీకు కృతవర్మ ఎట్లాగో నన్నుకూడా అట్లాగే అనుకో (120) ఈ రకంగా జమదగ్నితో ప్రేమతో ఓదార్చబడ్డ ఆమె అక్కడే నివసించసాగింది. మునులు గల ఆశ్రమంలో (121) తరువాత కొద్ది కాలానికి పార్వతి కుమారస్వామినివలె, ఆమె శౌర్యధైర్య గుణములు కల పుత్రుని కవేను. మృగావతి యొక్క తల్లివలెవారు చేశారు (123) మంచి జన్మగల ఆరాకుమారుని గూర్చి (నకు) అ శరీరవాణి ఉదయాచలంలో జన్మించాడు కనుక ఉదయనుడు అని పేరు పెట్టింది (124) ఆశ్రమంలో మునీంద్రునితో పుట్టు వెంట్రుకలు మొదలగు కర్మలు చేయబడినవాడై ఆ బాలుడు జమదగ్ని మహర్షి నుండి నకల విద్యలను స్వీకరించెను. (125).

యువకుడైన ఆ రాకుమారుడు ఒకసారి వేట యందోసక్తి కలవాడై వెళ్ళి, బోయవాడిచే గట్టిగా బంధింపబడ్డ ఒక సర్పాన్ని చూచాడు (128) దయగలవాడై ఇట్లా అన్నాడు, ఓ వ్యాధుడ! ఈ సర్పాన్ని వదులు. దీనితో నీవేం చేస్తావు. దీనిని హింసించాదు, అవి (127) అవ్వడు వ్యాధుడీతనితో అన్నాడు, ఓ వుషురుడ! నేను ఈ సర్పంతో గ్రామములందు నగరములందు ధనధాన్యాదులను పొందుతాను (సంపాదిస్తాను) (128) అందువల్ల నాకు జీవికయైన దీన్ని ఎట్లాగైనా వదలను, అని అంటూ, ఆ పామును ఆబోయవాడు పెళ్లిలో బంధించాడు (129)పాము బంధింపబడటం చూచి ధనమునాశించే ఆ బోయవానికి, తనతల్లి ఇచ్చిన కంకణాన్ని ఇచ్చి ఆ పామును విడిపించాడు (130) అతనితో విడిపింవబడ ఆపాము మనిషిగా మారి చేతులు జోడించి, త్వరగా స్నేహంచేసి పాతాళమునకు తీసుకుపోయాడు (131) దృతరాష్ట్రుని కొడుకైన కిన్నరుడనే నాగునిచేత పాతాళమునకు పోయి అతనితో పూజింపబడి సుఖంగా ఉన్నాడు. (132) నరుని చెల్లెలు దృతరాష్ట్రుని కూతురును గుణవంతురాలిని లలిత అను పేరుగల దానిని ప్రియురాలిగా రాకుమారుడు పొందాడు. (133)లమె ఈతనివల్ల గొప్ప తేజస్పుగల పుత్రుని పొందింది. పిదప లలిత ఉదయనునితో ఇట్లా అంది (134) లలిత మాటలు- వేను ఇతః పూర్వము సుకరీ అను పేరుగల విద్యాధరివి. శాపంవల్ల సర్పరూపంపొందాను. శాపాంతమే నాకీగర్భము (135)

అందువల్ల ఈ పిల్లవాణ్ణి తీసుకో ఈ తేజస్సు కలవాడితోపాటు వాడని తమలపాకుల మాలను, ఘోషవతి అనే వీణను కూడా తీసుకో, అని అనగా (138) అవన్నీ రాకుమారుడు అట్లాగే అని స్వీకరించాడు. అన్ని పాములు చూస్తుండగా ఆమె ఆకాశంలోకి ఎగిరిపోయింది. (137) పిదవ ఆతడు వీణను, మాలను ఎల్ల వాణి తీసుకొని, దుఃఖిస్తున్న తన తల్లిని చూడదలచి తొందరకలవాడై (138) మామ మొదలగువారి ఆజ్ఞపొంది తొందరగా తన ఆశ్రమానికి వచ్చాడు. శోక తప్తురాలైన తల్లిని, జమదగ్నిచే ఓదార్చబడిన దానిని (139) చేరి సంతోషపరిచాడు. తన కథను ఆమెకు చెప్పాడు. అవ్వడు అమృగావతి కూడా సంతోషం కలదైంది. (140)

ఇంతలో ఆశబరుడు కౌశాంబిలో ఒక వ్యాపారిని చేరాడు. సహస్రానీక అను పేరుగల మణికంకణాన్ని అమ్మ తల పెట్టాడు (141) కంకణమందు రాజముద్రను ఆవణిజుడు చూచి శబరునితోపాటు రాజుదగ్గరకు వెళ్ళి అంతా చెప్పాడు (142) ఆ ఎదవ సహస్రానీకుడు ఆ మణి కంకణాన్ని తీసుకొని, మృగావతివి యోగమనే విషాగ్నులతో పీడింపబడుతున్నవాడు (143) ఆమె బాహువుల నమాగమమనే అమృతబిందువుల వర్షంవలె చల్లనైన ఆ కంకణాన్ని హృదయమందుంచుకొని, దుఃఖంతో ఏడ్చాడు. (144) అడిగాడు ఓశబరుడ! నీకు ఈ కంకణం ఎట్లా లభించింది అని అట్లా - అరగబడివాడు అది తనకెట్ల లభించినదో అతనికి చెప్పాడు (145) ఆ సహస్రానీకుడనే రాజు ఆ శబరుని మాటలు విని ప్రియురాలిని చూడాలనే కుతూహలంకలవాడై మంత్రులతో పాటు బయలుదేరాడు (146) చంద్రుడు, సూర్యుడు త్వరగా (మొదట) కన్పించే ఆ పర్వతాన్ని ఉద్దేశించి ఆ రాజు తొందరగా బయలుదేరాడు (147) కొంతదూరం వచ్చాక సైనికుల విశ్రాంతి కొరకు ఉండిపోయాడు. ప్రియురాలి సంగమధ్యానమందే ఆసక్తి కలవాడై నిద్రిస్తుండగా (148) వసంతకుడు విచిత్రమైన కథలను చెప్పసాగాడు. ఆకథలను వింటూనే ఆరాత్రిని అతడు గడిపాడు. (149) ఆతర్వాత జంభారి పాలించే దిక్కును (తూర్పు) చేరి, శత్రుత్వంలేకుండా నివసించే సింహాలు ఏనుగులు గల జమదగ్ని ఆశ్రమానికి చేరి(150) తపస్సు చేస్తున్న మునినిచూచి ఆతనికి శిరస్పుతో ప్రణామం చేశాడు. ఆశీర్వాదపూర్వకముగా ఆముని ఆరాజును స్వీకరించాడు (151) పాద్య అర్ఘ్య ఆచమనీయాలతో శాస్త్రప్రకారము పూజించి, ధర్మార్థములతో కూడిన వాక్కును ఆరాజుతో ఇట్లా అన్నాడు (1 52).

ఓ మహారాజ ! మృగావతి యందు ఈ రాకుమారుడు నీకు కలిగాడు. కీర్తినిధి, తేజస్సంపన్నుడు, మరో రామచంద్రుడు (153) దిక్కులను జయిస్తాడు. సింహాన్ని చంపేశక్తిగల యువకుడు. ఈతడు పాత్రుడు. ఉదయనుని కుమారుడు (154) ఈమె మృగావతినీ భార్య పాతి ప్రత్యము కలది. ఈ ముగ్గురుని త్వరగా స్వీకరించు ఓ మహారాజ ! (155) అని చెప్పిముని ఇచ్చిన వారిని స్వీకరించి, మహారాజు ప్రియురాలు తోడుగా గలవాడై మంత్రులతో కూడి తన నగరానికి బయలుదేరాడు (158) ఆరాజు కౌశాంబినగరం ప్రవేశించి ఇంద్రుని వచనాన్ని స్మరిస్తూ మనుష్య జన్మను అనహ్యించుకొని (157) బుద్ధిమంతుడైన తన పుత్రునకు రాజ్యమప్పగించాడు. రాజ్యపాలన నమర్దుడైన తన పుత్రుడైన ఉదయనుని యందు (158) రాజ్యభారాన్ని ఉంచి ఆతడు శాప నివృత్తి కొరకు వసంతక ఋమణ్వంతులతో మృగావతి యనుభార్యతో (159) మంత్రి పుత్రుడైన యాంగధరాయణునితో కూడా కలిసి దక్షిణ సముద్ర తటంలోని పుణ్యప్రదమైన చక్రతీర్థంలో (160) నర్వతీర్థములలో ఉత్తమోత్తమైన దానిలో స్నానం చేయుటకు త్వరగా బయలుదేరాడు. వాయువేగం గలిగిన వాహనముల పై త్వరలో ఉప్పు నముద్రాన్ని చేరాడు. (161) చక్రతీర్థముచేరి శాస్త్ర ప్రకారము స్నానము చేశాడు. వారు రాజు మొదలగువారు చక్రతీర్థంలో స్నానం చేసినంత మాత్రముననే (162) వెంటనే అతి కుత్పితమైన మనుష్య రూపము నశించింది. ఆ పిదవ నమస్త పాపములు పోయి వారు తమతమ రూపములు పొందారు (163) అందరు దేవ వస్త్రములు ధరించి, దివ్యమైన మాలలు, అను లేవనములు కలిగి, అలంకరింపబడి, యోగ్యమైన విమానములనెక్కి (164) తమ వం పోవటానికి కారణమైన ఆతీర్థమును ఉత్తమమైనదిగా భావిస్తూ, అన్నిలోకములవారు చూస్తుండగా స్వర్గలోకమునకు వెళ్ళిరి. (165) అప్పటి నుండి అందరు ఆ తీర్థ వైభవాన్ని తెలుసుకొని ఈ పవిత్రమైన చక్రతీర్థములో ఎప్పుడూ స్నానం చేస్తున్నారు (16 6) ఇట్టి ప్రభావముగల ఆ తీర్థమునకు వచ్చి ఒక్కసారి స్నానము చేసిన మానవులు అందరు స్వర్గవాసులౌతారు (167) ఈ విధముగా గొప్పవైన విధూముని చరిత్రను మీకు చెప్పాను ఓ బ్రాహ్మణులారా! ఈ అధ్యాయాన్ని చదివినవారు, శ్రద్ధగా విన్నవారు కోరిన కోరికలన్నీ తొందరగా పొందుతారు. (168)

అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఎనుబది ఒక్కవేల సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు పేతుమాహాత్మ్యమందు చక్రతీర్థ ప్రశంసయందు అలంబున విధూముల శాపవిమోచనమనునది ఐదవ అధ్యాయము సమాప్తము.