స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
8వ అధ్యాయము
తా ॥ ఋషులిట్లా అన్నారు - ఓ భగవాన్! నూత! సర్వజ్ఞుడ ! కృష్ణ ద్వైపాయనునకు ప్రేమపాత్రుడ ! శ్రోతలకు అమృతాన్ని వర్షించే కథలను నీ ముఖంనుండి విని నీ వాగమృతాన్ని తాగే మాకు తృప్తి కలగటంలేదు. అందువల్ల శుశ్రూష చేసే మాకు శుభమైన కథలను చెప్పండి చక్రతీర్థానికి దక్షిణ భాగంలో వేతాళవరదమనే తీర్థముంది. అది మహాపుణ్య ప్రదమని మీరు ఇది వరలో చెప్పారు ఈ తీర్థానికి వేతాళవరదమనే పేరు ఎట్లా వచ్చింది ఆ తీర్థ ప్రభావమేమిటి. ఈ విషయాన్ని మాకు చెప్పండి శ్రీ సూతులిట్లనిరి - మిక్కిలి రహస్యమైన దానిని మీరు బాగా అడిగారు. నిశ్చలంగా వినండి. ఆ ఆద్బుత కథను చెప్తాను ఆ కథను విని పామరులైనా ఆనందిస్తారు ఈ కథ వుణ్య ప్రదమైంది. పూర్వంకైలాన వర్వతమందు విశ్రాంతి సమయంలో పార్వతికి శివుడు చెప్పాడు ఆ అద్భుతమైన ఆ కథను మీకు చెప్తాను పూర్వము గలవుడను మహర్షి సత్యవాక్కు కలవాడు, శుచియైనవాడు వరబ్రహ్మను చింతిస్తూ తన ఆశ్రమంలో తపమాచరించాడు ఆతని కూతురు ఉత్తమురాలు, రూపయౌవనములు కలది, కాంతిమతి అని పేరు కలది బాలతండ్రి దగ్గర ఉంటూండేది ఆ మహర్షికి బలి కొరకు వూలు తెస్తూ ఉండేది. వేదిక సమార్జనము నమిధలను తేవటం చేస్తుండేది ఇట్లా ఆ బాలతండ్రికి మంచిగా పరిచర్య చేసేది ఒకసారి ఆమె బలికొరకు పుష్పాలు తెచ్చుటకు బయలుదేరి ఆవనంలో కాంతిమతి చాలా దూరము ప్రయాణించింది. అక్కడ అందమైన పూలను బుట్టలో తీసుకొని తండ్రిని శుశ్రూష చేయాలనే ఆనక్తితో ఆ బాల తొందరగాతిరిగి బయలు దేరింది. మరలుతున్న ఆ కన్యను విద్యాధరకుమారులు సుదర్శన నుకరులను పేరుగలవారు విమానంలో నుండి ఈమెను చూచారు. రూప యావనములు గల ఆ గాలవుని కూతురును చూచి మన్మధుని వత్ని ఐన రతీదేవి వలె సుకుమారమైన మూర్తి కలదానిని, సుదర్శన అను పేరుగల విద్యాధరకు మారకుడు పెద్దవాడ నంతోషంతో విప్పారిన కళ్ళుగలవాడై కామమోహితుడై కామించాడు. పూర్ణచంద్రుని వంటి ముఖంగల ఆమెను మాటిమాటికి చూస్తూ ఆమెను అనుభవించాలనే కోరిక కలవాడై విమానం నుండి దిగాడు. మునికన్యన నమీపించి సుదర్శనుడిట్లా అన్నాడు. సుదర్శనుని మాట - రూపయౌవనములుగల నీవెవరు. ఎవరికూతురువు. నీ సాటిలేని రూవం నామనస్సును ఆహ్లాద వరుస్తోంది. రతీదేవి సదృశమైన నిన్ను చూచాక నన్ను మన్మథుడు బాధిస్తున్నాడు. సుకంఠుడు అను పేరుగల విద్యాధరపతికి నేను కుమారుణ్ణి అందగాళ్ల నుదర్శనుడని నా పేరు నన్ను స్వీకరించు. నీదయగలచూపులతో నన్ను రక్షించు నన్ను భర్తగా పొంది సర్వ భోగములను పొందగలవు అనే విద్యాధరసుతుని మాటలను విని ఆమె
తా ॥ అప్పుడు కాంతిమతి ధర్మయుక్తంగా మాట్లాడింది. ఓసుదర్శనా ! విద్యాధరుని కుమారుడ! నేను గాలవమహాత్ముని కుమార్తెనుగా గ్రహించు. కన్యను వివాహంకానిదాన్ని తండ్రి గారి సేవయం దున్నదాన్ని మాతండ్రి గారికి బలికొరకు పూలు తేవటానికి వచ్చాను. పుష్పాలు తెంపుతూ ఉంటే ఒక జాము గడిచి పోయింది నా ఆలన్యంవల్ల దేవతార్చన తత్పరుడైన ఆముని, తపన, కోపగిస్తాడు వేను పూలు కోయటం ఐంది ఇప్పుడు తొందరగా వెళ్లాను. కన్యలు తండ్రి అధీనలు ఎప్పుడూ స్వతంత్రులు కారు నీవు నన్ను ఇష్టపడేటైతే నా తండ్రిగారిని అడుగు అని, శాంతిమతి విద్యాధరసుతునకు చెప్పి తండ్రి గారిని గూర్చి ఆశంకిస్తూ తొందరగా ఆశ్రమానికి వెళ్ళటానికి బయల్దేరింది. విద్యాడర కుమారుడు వెళ్తున్న ఆమెను చూచి మదన బాధితుడై పరుగెత్తి ఆమె వెంట్రుకలను పట్టుకున్నాడు. వరుగెత్తుకొచ్చి తను వెంట్రుకలను పట్టుకుంటున్న ఆతణ్ణి చూచి ఆమె లేడి పిల్లలా పెద్దగా అరిచింది. ఓ నాన్న ! నమరుడ! ఈ విద్యాధరుని నుండి నన్ను రక్షించు బలవంతంగా నన్ను ఈదుష్టాత్ముడు విద్యాధరసుతుడు ఈ వేళ పట్టుకున్నాడు ఈ విధంగా పెద్దగా తన ఆశ్రమానికి దగ్గరలోనే అరిచింది. ఆమె ఆక్రందనను విని గంధమాదనంలో ఉండే మునులుముని శ్రేషుడైన గాలవుని ముందుంచుకొని ఇది ఏమిటో తెలుసుకుందామని ఆ ప్రదేశానికి తొందరగా వచ్చారు. ఆ ప్రదేశానికి ఆ ఋషిపుంగవులందరు వచ్చి విద్యాధరునితో గ్రహించబడ్డ ఆముని కన్యను చూచారు. దగ్గరలో ఉన్నామరో విద్యాధర కుమారుని చూచారు దీన్ని చూచి గొప్ప యోగియైన గాలవముని కొద్దిగా కోపానికి వచ్చి ఆ దురాత్ముణి శపించాడు ఓ విద్యాధరాధమ ! నీవిటువంటి పని చేశాడు కనుక నీ దుష్కర్మకు ఫలముగా మానుషయానికి వెళ్ళు మానుష జన్మను ఎక్కువ దు:ఖములకు కారణమైనదానిని పొంది అదే జన్మలో త్వరలోనే మనుష్యులు కూడా నిందించే వేతాళత్వమును పొందు. మాంసము, రక్తము ఎవ్వడు తింటూ ఉండు వేతాలు రనగా రాక్షసులతో నమానమైనవారు. స్త్రీలను బలత్కారముగా స్వీకరిస్తారు. అందువల్ల నీవు మనుష్యుడవై వేతాలత్వాన్ని పొందుతావు నీ దుష్కర్మను అనుమతించిన నీతమ్ముడు సుకరుడనే వాడు వీడు కూడా మనుష్యుడౌతాడు ఈతడు సాక్షాత్తుగా ఈపని చేయలేదు కాబట్టి ఈతనికి మానుషత్వమే, వేతాలత్వమురాదు.
తా ॥ విజ్ఞప్తి ఔతు కుడనే పేరుగల విద్యాధరాధివుని ఈకనిషుడు చూచిన వెంటనే శాపవిముక్తుడౌతాడు. ఇటువంటి మహాపాపకర్మకు కర్తవైననీవు మనుష్యజన్మనుపొంది అదే, జన్మలో వేతాల జన్మను పొంది లోకంలో చిరకాలం తిరుగుతావు. అనిగాలవుడు వలికి కన్యను తీసుకొని మహరులతో కూడి విద్యా ధరనుతులను శపించి తన ఆశ్రమమునకు వెళ్ళాడు. ఆమునిపుంగవుడు వెళ్ళాక విద్యా ధరవతీసుతులైన సుదర్శననుకరులను వారు మునిశావంతో దు:ఖార్తులై చాలావిచారించారు. సుదర్శన సుకర్షకులు ఏంచేయాలో నిశ్చయించుకుని యమునా తీరంలో ఉండే గోవిందస్వామి అనే అతనిని బ్రాహ్మణుని, శీలవంతుని, తండ్రిగా నారు భావించుకొని తమ రూప ములను వదలి అతని కుమారులుగా జన్మించారు విజయుడని అశోకదత్తుడుగా జన్మించాడు చిన్నవాడు సుకరుడు అశోక దత్తునిగా జన్మించాడు. విజయ అశోక దత్తులు క్రమంగా యావన వంతులైనారు. ఈకాలంలోనే శుభమైనయమువాతటమందు, వరాలులేని కారణంగా వన్నేండు సంవత్సరాలు దుర్భిక్షమేర్పడిందీ గోవిందస్వామి అను పేరుగల బ్రాహ్మణుడు వేదపారగుడు, తన నగరందుర్భిక్షంతో బాధపడటంచూసి భార్యా పుత్రులతో కలిసి కాశీనగరానికి బయలు దేరాడు. అతడుప్రయాగకుచేరి, మహానటమును పుణ్యప్రదమైనదానిని చూచి దాని ఎదుట కపాల మాల ఆభరణంగా గల యతనిచూచాడు, గోవిందస్వామివితే ఆమునినినమస్కరించాడు పుత్రులు భార్యతో కూడిన అతనికి ముని ఆశీర్వాదము పలికాడు. గోవిందస్వామితో ఆముని ఇట్లా . అన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ! ఈ పెద్దకొడుకు విజయదశునితో నీరు త్వరలో వియోగం కలుగబోతోంది అనేఆతని మాటలను విని గోవిందస్వామి, సూర్యుడు అస్తమించాక, అక్కడే నంధ్యకర్మను నమాప్తి చేసి భార్యతో పుత్రునితో చాలాదూరం ప్రయాణంచేయటంవల్ల అలసి పోయి, ఆరాత్రి మాన్యమైనదేవాలయంలో వసించాడు. అశోకదత్తుడు బ్రాహ్మణికలన భూమిపై వస్త్రం వరిచి రాత్రినిద్రించారు.
తా ॥ విజయదత్తుడు చాలా దూరం ప్రయాణం చేసినందువల్ల బాగా అలసిపోయాడు. శీత జ్వరంతో బాధపడుతూ చలిబాధనివృత్తి కొరకు గోవింద స్వామీతో తండ్రితో, గట్టిగా కౌగిలించుకోబడుతున్నా ఆతనికి చలిబాధపోలేదు నాన్న ! నన్ను చలిజ్వరము ఇప్పుడు మిక్కిలి బాధిస్తోంది. ఈ బాధని వృత్తి కొరకు త్వరగా అగ్నిని తీసుకురండి అనే కొడుకు మాటలను విని అంతటా అగ్నిని వెతుకుతు అగ్ని లభించక తిరిగి వచ్చి పుత్రునితో ఇట్లా అన్నాడు అంతటా వెతికినా కూడా కుమార ! అగ్ని లభించటంలేదు. అర్ధరాత్రి సమీపించినందువల్ల ద్వారాలన్నీ మూసివేసారు పౌరులంతా నిద్రా పరవశులైనారు అగ్నిని ఇవ్వటంలేదు అని ఈ రకంగా జ్వరంతో బాధపడే విజయదతునితో తండ్రి చెప్పాడు ఆతడు మరల తండ్రిని దీనమైన వాక్కులతో అగ్ని కావాలని అడిగాడు. శీత జ్వరం వల్ల కల్గిన చలిబాధతో ఏడింపబడిన నన్ను మంచు తుంపరలవంటి చల్లనిగాలి నన్ను ఈ వేళ రెట్టింపుగా బాధిస్తోంది. అగ్ని లభించటం లేదని నీవు అబద్ధం చెప్పావు నాన్న! దూరంగా ఇదుగో ముందు భాగంలో జ్వాలా మాలలతో కూడినటువంటిది,తన జ్వాలలతో ఆకాశాన్నితాకుతున్నట్లున్నది అగ్నికన్పిస్తోంది చూడు. నాన్న! నాచలిపోయేందుకు తొందరగా ఆ ఆగ్నిని తీసుకురా. ఇట్లా అంటున్న ఆకొడుకుతో తండ్రి ఇట్లా అన్నాడు కుమారా! ఈవేళనేను అబద్ధం చెప్పటంలేదు. నిజమే చెప్తున్నాను దూరంగా కన్పించే అగ్ని ఉన్న ప్రాంతముందేఅది పితరుల అడవి ప్రదేశంఅదే అని తెలుసుకో. ఆకాశాన్నంటే జ్వాలలుగలది ఎదురుగా మండుతున్న అగ్ని భయాన్ని కల్గించేది అదిచితాగ్నిగా తెలుసుకో. ఇది అమంగళమైనది. దీనిని తాకరాదు, సేవించరాదు. ఇది చితాగ్ని చితాగ్నిని ముట్టుకున్న వాని ఆయువు క్షీణిస్తుంది కుమార! నీ ఆయువు క్షీణించకూడదనే, కుమార అమంగళకరము, తాకరానిది ఈచిత్రాన్ని అందుకే తీసుకురాలేదు. అని అన్నతండ్రితో కుమారుడే దీనుడై ఇట్లన్నాడు ఇదిశవానలంకాని యజ్ఞాగ్నికానీ, ఎట్లాగైనా దీన్నితీసుకురాలేని పక్షంలో నాకు మరణం సంభవిస్తుంది వుత్ర స్నేహం అతిగా గలవాడై చితాగ్నిని తేవటానికి గోవిందస్వామి శ్మశానానికి తొందరగా వెళ్ళాడు.
॥ తా ॥ చితాగ్నిని గోవింద స్వామి తీసుకురావటానికి వెళ్ళగా, వేగంగా విజయదత్తుడుకూడ అట్లా వెళ్తున్న అతనిని అనుసరించాడు వేడిమిని సమీపించి బొక్కలతో నిండిన చితాగ్నిని కౌగిలించుకుంటున్నట్లు ఉద్వేగంతో కూడి మెల్లగా ఊరటను పొందాడు ఆతడు తండ్రితో ఇట్లా అన్నాడు - ఆచుట్టూ గుండ్రంగా ఉన్నది బాగా వెలుగుతున్నది అగ్నిలో ప్రకాశిస్తున్నది ఎర్రతామరవలే ఉన్నట్టిది అది ఏమిటి, అని ఆ పుత్రుని మాటలను బ్రాహ్మణోత్తముడు విని, అదిఏమిటో నిశ్చయించుకొని మళ్ళా ఇట్లన్నాడు గోవిందస్వామివచనం - అగ్నిజ్వాలల వలయంతో గుండ్రంగా ఉన్నది ఇదిక పాలము, వన (బొడక్రింది) కొవ్వు కీకన (ఎముక) మాంసములతో కూడినది, ఎర్రతామరలా ఉన్నది కపాలమని బ్రాహ్మణ కుమారుడువిని కట్టెచివరతో దాన్ని కొట్టాడు. అది పగిలి పైకి వచ్చిన పనతో ఆతనిముఖంతడిసిపోయింది కపాలాన్ని కొట్టటంవల్ల తన ముఖం పై వత్తరక్తాన్ని నాలుకతోచప్పరిస్తూ ఈతడుమాటిమాటికి ఆరక్తాన్ని ఆస్వాదించాడు ఈరకంగా ఆస్వాదించి ఆకపాలాన్ని తీసుకొని వ్యాకులుడై పనను తాగిమహా, కాయుడు, అతిభయంకరుడుఐనాడు వెంటనే వేతాళుడైనాడు. రాత్రితీక్షణమైనకోరలుగలవాడైనాడు. ఆతనిఅట్టహాసశబ్దంతోదిక్కులు,అన్నిప్రదేశములుస్వర్గముఅంతరిక్షము,భూమిఅన్నివిధములపగిలిపోయినట్లుంది. ఆతడువేగంగా లాగి తండ్రిని చంపబోయేంతలో ఇటువంటి సాహసంచెయ్యొద్దని ఆకాశంలో ఒకవాక్కు వినిపించింది. అతడు దివ్యవాక్కును విని అతిభయంకరుడై వేతాలుడు తండ్రిని వదలి వేగంతో కూడి తొందరగా ఆకాశం ప్రవేశించి తొట్రుపాటు లేని నడక గలిగి అతడు చాలా దూరంవెళ్ళి వేతాలురతో కూడాడు. వచ్చిన అతణి చూచి వేతాలురందరు, కపాలస్పోటన చేసి ఈతడు వేతాల రూపాన్ని పొందాడు కనుక ఈతనిని కపాల. స్ఫోటుడనే పేరుతో పిలువసాగారు ఈకపాలస్ఫోటుడు వేతాలురతో చుట్టబడి వేతాలరాజైన, నరాశిభూషణుడనే వాని సమీపమునకు బలము కలవాడై తొందరగా వెళ్ళాడు. సర్మాభూషణుడీతనిని సేవాపతిని చేశాడు. బలవంతుడైన చిత్ర పేనుడనే పేరుగల గంధర్వుడు ఒకసారి యుద్ధం చేసి, యుద్ధంలో రాష్ట్రాభూషణుడనే వాళ చంపాడు నర్మాభూషణుడు గంధర్వునితో యుద్ధంలో చంపబడ్డాక అప్పుడు ఈ కపాలస్పోటుడు ఆ పదవిని పొందాడు విద్యాధరుని కొడుకునుదర్శనుడు మొదటమనుష్యుడై మహర్షి శాపంవల్ల ఆవేదవ వేతాలత్వాన్ని పొంది క్రమంగా వేతాలవతి ఐవాడు అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఎనుబది యొక్క వేల వంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండ మందు పేతుమాహాత్మ్యమందు వేతాల వరద తీర్థ ప్రశంసయందు సుదర్శనుడు వేతాలుడగుట అనుదాని వర్ణన అనునది ఎనిమిదవ అధ్యాయము.
