స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

13వ అధ్యాయము

తా శ్రీ సూతులిట్లనిరి - మంగలమనే మహాతీర్థంలో నరుడు స్నానము చేసి, కల్మషరహితుడై ఆ పిదప ఏకాంతరామనాధుడనే పేరుగల కేతమునకు ఆ పిదప వెళ్ళాలి.  అక్కడ జగన్నాధుడైన రాముడు సీత లక్ష్మణులతో కలిసి హనుమంతుడు మొదలగువానరులతో చుట్టబడి  లోకములను అనుగ్రహించేకొరకు ఎల్లప్పుడూ నమీపంలో ఉంటాడు. అక్కడ వుణ్యద అను పేరుగల అమృతవు బావి ఉంది అక్కడ స్నానం చేసిన వారికి నరులకు ముసలితనము, యమ భయములేదు. ఈ అమృత బావియందు స్నానం చేసి శ్రాద్ధమాచరించిననరుడు శంకరుని అనుగ్రహం వల్ల అమృతత్వాన్ని పొందుతాడు. మహాపాతకనాశినియైన ఈ బావియందు మునిగేవారికి  శివుడు అమృతత్వము ఇవ్వటానికి దాని ఒడ్డుయందు ఎల్లప్పుడు ఉంటాడు. ఋమలిట్లనిరి - ఇది అమృత వాపి అని ఏకారణంగా పిలువబడుతుంది. మాకు దయతో ఈ విషయాన్ని చెప్పండి, వ్యాసశిష్య! అట్లాగే అమృత అను పేరుగల వారి యొక్క వైభవాన్ని కూడా చెప్పండి. నీమాటలనే అమృతాన్ని తాగే మాకు తృప్తి కలుగటం లేదు. అని అనగా శ్రీ సూతులిట్లనిరి - దీనికి గల అమృతమనే పేరును గూర్చి మనోహరమైన వైభవాన్ని గూర్చి విశేషంగా చెపుతాను. వినండి ఓ బ్రాహ్మణులారా. పూర్వం హిమవంతునకు ప్రక్కభాగంలో అనేకమంది మునులతో కూడిన సిద్ధచారణ గంధర్వ దేవకన్నరులతో సేవించ బడ్డ, సింహవ్యాఘ్రు వరాహములు ఏనుగమహిషములతో కూడిన తమాలతాలములు ప్రాంతాల చంపక అశోకము మొదలగు వృక్షములుకల, హంనకోకిలలు, వానకోయిల చక్రవాది వక్షులతో అలంకరించబడ్డ వద్మము, ఇందీవరము కల్లారుముదములతో నిండిన నరస్పుతో చుట్టబడిన ప్రాంతమున సత్యవంతుడు శీలవంతుడు వాగ్మి ఇంద్రియనిగ్రహము కల కుంభుజని సోదరుడు తవన్పు చేస్తూ ఎప్పుడూ ఉండేవాడు. మోక్షాన్ని కోరే అతడు శంకరునకు ప్రియుడు. మూల ఫలాదులలో ఇతరమైన వాటితో మూడుకాలములందు శివుని పూజిస్తూ  తన ఆశ్రమ నవమునకు వచ్చిన అతిథులను వనమందలి ఆహార

పదార్థములతో పూజిస్తూ, అగ్నిని అర్చిస్తూ, సంధ్యోపానన తత్పరుడై గాయత్ర్యాది మహా మంత్రములను ప్రతికాలమందు సంతోషంతో జపిస్తూ, నిద్రను వదలి బ్రాహ్మముహూర్తమందున, విష్ణువును ధ్యానిస్తూ స్నానంచేస్తూ, ఉషఃకాలమందు ప్రసన్నమైన బుద్ధితో సంధ్యకు నమస్కరిస్తూ, గాయత్రిని జపిస్తూ, హరి శంకరులను పూజిస్తూ వేదం అధ్యయనం చేస్తూ, శాస్త్రం పఠిస్తూ మధ్యాహ్నమందు అతిథుల పూజిస్తూ, వురాణ పాఠముల వింటూ, అగ్నికార్యముల యందు శ్రద్ధ వహిస్తూ ప్రతిరోజు వంచయజ్ఞము లాచరిస్తూ వైశ్వదేవబలులను ఇస్తూ ప్రతి సంవత్సరము పితరులకు శ్రాద్ధం చేస్తూ, అట్లాగే ఇతర శ్రాద్ధము లాచరిస్తూ ఉండేవాడు ఇట్లా నిత్యానుష్ఠాన వరుడై కాలంగడి పేడు .

 తా ॥ ఈ విధంగా ఉంటూ ఉత్తమమైన తపమాచరిస్తున్న ఆతనికి  వేయివంవత్సరాలు గడిచిపోయాయి. శంకరుని యందు ఆవక్తికలవాడైవా ఈతనికి శంకరుడు ప్రత్యక్షం కాలేదు. పిదప అగస్త్యుని బ్రాలైన ఈతడు ఎండాకాలమందు పంచాగ్నుల మధ్య ఉంటూ, సూర్యుని పై దృష్టిని నిలిపి, మౌన వ్రతం పాటిస్తూ  ఎడమకాలి చిటికన వేలి పై నిశ్చలంగా నిలిచి, చేతులు పైకెత్తి ఏ ఆధారంలేకుండా అతి దారుణమైన తపమాచరించాడు దయానిధియైవ మహాదేవుడు ప్రసన్నహృదయుడై తన వెలుగులో పదిదిక్కులను వెలిగింపచేస్తూ అతని ఎదుట ప్రత్యక్ష మైనాడు.అప్పుడు ముని వృషభమందున్న శంభుని సాంబుణ్ణి చూచాడు. చూచిననుసరించి భవానీ పతియైన ఈశ్వరుని ఇట్లా స్తుతించాడు ముని ఇట్లన్నారు - పార్వతి నాథ నీలకంఠ, మహేశ్వర, శివ, రుద్ర, మహాదేవ శంభో! నమస్కారము  శ్రీకంఠ, ఉమావతి, శూల, భగవేత్ర, హర, అవ్యయ, గంగాధర, విరూపాక్ష, రుద్ర, మన్యో! నీకు నమస్కారము అంతరి, కామశత్రువ, దేవదేవ, జగత్పతి, పశుపతి, శర్వ, శతధ్వనిన్ ! నీకు నమస్కారము.దక్షయజ్ఞ వినాశక, స్నాయువతి, నిచేరవ, వుష్టవతి కృపానిలయ, మహాదేవ ! మరో మరోమారు నీకు నమస్కారము. ఓ త్రిలోచన ! దుస్తరమైన సంసార సముద్రము నుండి నన్ను ఒడెక్కించు అగస్త్య సోదరునితోనుతింపబడ్డ శివుడు తన మాటలతో కుంభుజుని తమ్ముడైన మునిని సంతోష పరుస్తూ ఇట్లా అన్నాడు. ఈశ్వరుని మాట - ఓ కుంభుజుని తమ్ముడ! నీకు పుణ్యప్రదమైన ముత్తుపాయాన్ని చెప్తాను. పేతుమధ్య మందు గంధ మాదన పర్వతమందు మహాతీర్థముంది  మంగల మను తీర్థమునకు చాలా దగ్గరలో ఉంది. అక్కడికి వెళ్ళి స్నానం చేయి. పిదప ముక్తిని పొందుతావు  ఆ తీర్థ సేవనముకన్న నులభమైన మోకోపాయము మరొకటి లేదు. ఆ తీర్థ వైశిష్ట్యమును చెవుట వాడు గూడా చేత కాదు  ఓముని నత్తమ ! నీవు ఈ రోజు ఈ విషయంలో సందేహించకూడదు. పంపారనాశము కావాలనుకుంటే అక్కడికే వెళ్ళు. అని పలికి భగవంతుడైన ఈశుడు అక్కడే కన్పించకుండా పోయాడు ,

తా ॥ మహాదేవుని వచనాన్ననుసరించి అగస్త్యుని సహోదరుడు సేతువునకు నముద్రమందలి గంధమాదన పర్వతమునకు వెళ్ళి ఈశ్వరుడు చెప్పిన ఆ తీర్థమునకు త్వరగా వెళ్ళాడు స్నానం చేసిన వారికి ముక్తినిచ్చే ఆ పుణ్యప్రదమైన తీర్థమందు, ఏకాంతరామపోథ అను పేరుగల, క్షేత్రముల కలంకారమైన శుభమైన ఆ చోట నియమ పూర్వకముగా మూడు సంవత్సరములు అతడు స్నానం చేశాడు. పిదవ వాల్గవ సంవత్సరమందు మహాముని సమాధిస్థితుడై యోగశక్తితో ప్రాణవాయువును మూర్థమందు బ్రహ్మనాడియందారోపించి బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణములను వదిలాడు. పిదవ ఆ అగస్త్యానుజుడు. ఆ శరీరాన్ని వదలి, ఆ తీర్థవైభవం వల్ల వరమమైన ముక్తిని పొందాడు ఆ తీర్థస్నాన వైభవం వల్ల అశేష దు:ఖములు నశించి ఆమునికి అమృతత్వం సిద్ధించింది కనుక దీనికి అమృతవాహి అని పేరొచ్చింది, ఓమునులారా ! ఈ తీర్థమందు మూడు సంవత్సరాలు నిశ్చలంగా స్నానం చేసిన నరులు తప్పకుండా అమృతత్వాన్ని పొందుతారు. ఈ విధముగా అమృతవా అనే పేరు దాని ప్రశస్తి మీకు వివరించాను ఓ వివ్రులారా! ఇంకా ఏమివినదలుచుకున్నారు  అని అనగా ఋషులిట్లనిరి - ఆ క్షేత్రమునకు ఏకాంతరామనాధమనే పేరు ఎట్లా వచ్చింది. సూత ! దీన్ని వివరించ నీవు నమరుడవు మాకు దాన్ని సేవించాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంది. ఓమునీ! అని అన్నారు .

మూ ॥ శ్రీ సూత ఉవాచ -

తా శ్రీ నూతులిట్లనిరి - పూర్వం దశరథ రాముడు సుగ్రీవ విభీషణులతో కలిసి తమ్ముడైన లక్ష్మణునితో కలిసి మంత్రజ్ఞుడైన హనుమంతునితో కూడా ఉండగా  సముద్రమధ్యమునుండి సేతువును వానరులు నిర్మిస్తూ ఉండగా, రాముడు సీతను మనస్సులో స్మరిస్తూ, ఏకాంతంలో వారితో మంత్రాలోచన చేశాడు రావణాదులవధను గూర్చి వారు ఆలోచిస్తూ ఉండగా సముద్రము  అలలు మిక్కిలి ఎగిసిపడుతూ ధ్వనించాయి. మహా భయంకరమైన నముద్ర ధ్వని అధికమౌతుండగా, వారు పరస్పరం మాట్లాడుకునే మాటలను ఒకరినొకరు వినలేకపోయారు అప్పుడు రాముడు కొంచెం కోపగించినట్టే కనుబొమలు ముడిచుటచే వక్రమైన చూపులు గలవాడై, భ్రూభంగ విలాస ముల చేతనే రాముడు సముద్రాన్ని నియమించి రాక్షసులను చంపటం గూర్చి మంత్రాలోచన చేసాడు. ఏకాంతమందు వారితో కూడి మంత్రాలోచన చేసాడు రాముడు కనుక ఆ క్షేత్రము ఏకాంతరామనాథమవే పేరుగలదైంది. ఈ రకంగా రాముని భ్రూభంగలీలతో నియమించబడిన వార్థి నేటికి కూడా నిశ్చలమైన జలముకలదై ఆ ప్రదేశంలో కన్పిస్తోంది. ఏకాంతరామనాథమను పేరుగల ఈ క్షేత్రము ఎంతో ఉత్తమమైనది.ఇక్కడికి వచ్చి అమృతవాకి యందు నియమపూర్వకముగా స్నానము చేసి రామాదులను సేవించిన వారు అంతా ముక్తిని పొందుతారు అద్వైత విజ్ఞాన వివేకములు లేనివారు, విరక్తి లేనివారు, నమాధిలేనివారు, యాగాదులనుతించుటను వదలిన వారు ఇక్కడ స్నానం చేసి అమృతత్వం పొందుతారు. ఓ బ్రాహ్మణులారా ! అని శ్రీ స్కాంద మహా పురాణంలో ఎనుబది ఒక్కవేల సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండ మందు సేతుమాహాత్మ్యమందు అమృతవాది ప్రశంసయందు అగస్త్య భ్రాతవిముక్తి వర్ణనము అనునది పదమూడవ అధ్యాయము సమాప్తము