శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
30 - గోపికలు అంతర్షితుడైన శ్రీకృష్ణుని వెదుకుట
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీభగవానుడు అకస్మాత్తుగా అంతర్ధానము కాగా, ఆ గోపికలు ఆయస కానరాక, దండు నాయకుని కానరాని ఆడు యేనుగులు వలె, పీడను పొందిరి.
లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుని నడక, ప్రేమ, చిరునవ్వు, విలాసపు
చూపులు, మనోహరములైన కబుర్లు, విహారములు, మోహమును కలిగించే
ఇతర చేష్టలు ప్రేమావేశము గల ఆ గోపికల చిత్తములను విశేషముగా
ఆకర్షించినవి. వారాయనతో అభేదమును భావన చేస్తూ ఆయనయందే
మనస్సు గలవారై ఆయన చేసిన ఆయా లీలలను అనుకరించిరి.
శ్రీకృష్ణునియందు ప్రేమ గల గోపికలు ప్రియుడగు ఆయనయొక్క
నడక, చిరునవ్వు, చూపులు, మాటలు మొదలగువాటియందు ఆయనతో
అంభేదమునే సొందిరి. వారి దేహములయందు కూడ అవే లక్షణములు
ప్రకటమాయెను. వారు శ్రీకృష్ణుని విహారము యొక్క విలాససనుకరిస్తూ,
ఇదిగో! శ్రీకృష్ణుడను నేనే, అని ప్రకటించుకొనిరి.
వారు గుమిగూడి బిగ్గరగా గానము చేస్తూ పిచ్చివారు వలె ఒక
అడవినుండి మరియొక అడవికి వెళ్తూ ఈ శ్రీకృష్ణునే వెదికిరి. ఆయన
ఆకాశము వల ప్రాణుల లోపల బయట కూడ ఉండే పూర్ణపరబ్రహ్మ.
వారాయనను గురించి చటము అడిగిరి.
ఓ గావీ! జువ్వా! మర్రీ! నందుని పుత్రుడు శ్రీకృష్ణుడు ప్రేమతో
మరియు చిరు నవ్వుతో కూడిన చూపులతో మా మనస్సును అపహరించి
వెళ్లిపోయినాడు. మీకు కనబడినాడా?
ఓ ఎర్ర చామంతీ! కంకేళీ! పొన్నా! సురపొన్నా! సంపెంగా!
బలరాముని తమ్ముడగు శ్రీకృష్ణుడు, మేము సుందరులమనే గర్వము గల
యువతుల గర్వమునడంచే చిరునవ్వు గలవాడు. ఆయన ఇటు వచ్చెనా?
ఓ తులసీ! నీవు మంగళకరురాలవు. నీకు గోవిందుని పాదములపై
ప్రీతి మెండు. నీకు మిక్కిలి ప్రియుడగు ఆ శ్రీకృష్ణ భగవానుడు
తుమ్మెదల గుంపులతో కూడిన నిన్ను దాల్చును. ఆయన కనబడినాడా?
ఓ జాజీ! మల్లీ! ఉసిరీ! ఓ అడవి మొల్లా! లక్ష్మీపతియగు శ్రీకృష్ణ
భగవానుడు చేతితో తాకీ మీకు ఆనందమును కలిగిస్తూ వెళ్లినాడు. మీకు
కనబడినాడా?
ఓ రసాల మామిడీ! మోరటీ! పనసా! వేగిసా! రక్తకాంచనమా! నేరేడూ!
జిల్లేడూ! మారేడూ! పొగడా! మామిడీ! కడిమీ! మంకెనా! మీరు, మరియు
యమునానదీ తీరమునందు పెరిగే ఇతరములగు చెట్లు ఏవి గలవో అవి
మాకు శ్రీకృష్ణుని మార్గమును చెప్పుగాక! ఏలయన, పరోపకారము కొరకే
మీరు జన్మించితిరి. శ్రీకృష్ణుడు లేక మా మనస్సు శూన్యముగా నున్నది.
ఆశ్చర్యము! ఓ పృథివీ! శ్రీకృష్ణ భగవానుని పాదములు స్పర్శచే
ఉత్సవము గల నీవేమి తపస్సును చేసితివి? పైభాగమునందు మొలచిన
చెట్టుచేమలే రోమాంచము కాగా నీవు విశేషముగా ప్రకాశించుచున్నావు.
ఈ శోభ శ్రీకృష్ణుని పాదస్పర్శ వలనా? లేక, (అంతకుముందు)
వామనుడై పెద్ద అడుగులను వేసిన శ్రీహరి నీపై వేసిన అడుగు వలనా?
లేక, (ఇంకా ముందు) వరాహమూర్తియై నిన్ను కౌగిలించినందులకా?
ఓ ఆడు లేడీ! నీవు నాకు చెలికత్తెవు. శ్రీకృష్ణ భగవానుని దేహావయవ
ములను చూచుటచే మీకు గొప్ప ఆనందము విస్తరించును సుమా!
ఆయన ప్రియురాలితో కలిసి వచ్చి నీ కంట బడినాడా? ఎందుకంటే,
గోకులప్రభువగు ఆయన దాల్చిన మల్లెల మాల యొక్క పరిమళమును
గాలి మోసుకువచ్చుచున్నది. ఆతడు ఆమెను కౌగిలించినప్పుడు ఆమె
వక్షఃస్థలమునందలి కుంకుమచే ఆ మాల ఎర్రనై యుండును.
ఓ వృక్షములారా! బలరాముని సోదరుడగు శ్రీకృష్ణుడు ఒక చేతిని
ప్రియురాలి భుజము పై వేసి మరో చేతితో పద్మమును పట్టుకొని ఇక్కడ
సంచరించి యుండును. ఆయన ధరించిన తులసి మాల చుట్టూ మత్తుతో
గ్రుడ్డివైన తుమ్మెదల గుంపులు ఆయనను వెంటాడును. మీరు వంగి చేసిన
అభివాచమును ఆయన ప్రేమతో కూడిన చూపులతో అభినందించినాడా?
ఓ చెలికత్తెలారా! చెట్టు కొమ్మలను కౌగిలించియున్న ఈ తీగలను కూడ
అడుగురు. ఆతడు తన చేతి గోళ్లతో వీటిని నిశ్చయముగా స్పృశించి
యుండును. ఇవి రోమాంచములను (చిగుళ్లు) కలిగి యున్నవి సుమా!
ఈ విధముగా శ్రీకృష్ణుని వెదుకుటలో వ్యాకులు రైన గోపికలు పిచ్చి
మాటలను పలుకుచుండిరి. వారు నిశ్చయముగా భగవానునితో భావాత్మక
ఐక్యమును పొంది ఆయనయొక్క ఆయా లీలలను అనుకరించిరి.
ఒక గోపిక పూతనను అసుకరించగా మరియొక గోపిక బాలకృష్ణుని
అనుకరిస్తూ ఆమె స్తనమును త్రాగెను. ఒకామె బాలకృష్ణుని అనుకరిస్తూ,
శకటాసురుని అనుకరించే గోపికను కాలితో తన్నెను.
ఒక గోపిక తృణావర్తుని అనుకరిస్తూ బాలకృష్ణుని అనుకరించే
ఎత్తుకుపోయేను. ఒక గోపిక కాలియందెలు
ధ్వనించునట్లుగా రెండు కాళ్లను (బాలకృష్ణుని వలె) లాగుతూ పాకెను.
ఇద్దరు గోపికలు బలరామకృష్ణులను, కొందరు గోపాలకులను అను
కరించిరి. ఒకామె కృష్ణుని అనుకరిస్తూ వత్సాసురుని అనుకరించే గోపికను,
ఇంకో గోపిక బకాసురుని అనుకరించే గోపికను సంహరించినట్లు నటించిరి.
ఒక గోపిక శ్రీకృష్ణుని అనుకరించి వేణువును వాయించి దూరమునందలి గోవులను పిలుస్తూ క్రీడించగా, ఆమెను బాగు అంటూ ఇతర గోపికలు కొనియాడుచుండిరి.
శ్రీకృష్ణునియందు లగ్న మైన మనస్సు గల మరియొక గోపిక ఇంకో
గోపికపై తన చేతిని వేసి నడుస్తూ, నేను శ్రీకృష్ణుడను, నా అందమైన
నడకను చూడుడు, అని పలికెను.
గాలికి, వర్షమునకు భయపడకుడు. వాటినుండి రక్షణ వ్యవస్థను నేను
చేసేను, అంటూ ఒక గోపిక ఒకే చేతితో ప్రయత్నపూర్వకముగా చీర
కొంగును పైకి ఎత్తి పట్టుకొనెను.
ఓ పరీక్షిన్మహారాజా! ఒక గోపిక మరియొక గోపిక యొక్క తల పైకెక్కి
కాలితో తొక్కి, ఓ పాడు సర్పమా! పొమ్ము, దుష్టులను నిశ్చయముగా
శిక్షించుటకై నేను అవతరించితిని, అని పలికెను.
వారిలో ఒకామె ఇల్లు పలికెను గోపాలకులారా! భయంకరమగు
కార్చిచ్చును. కనుడు. వెంటనే కళ్లను మూసుకొనుడు. మీకు నేసు తేలికగా
క్షేమమును కలిగించెదను.
వారిలో ఒక సుందరి మరియొక గోపికను రోటికి మాలతో కట్టివేసెను.
అపుడా గోపిక భయపడుతూ అందమైన కళ్లు గల ముఖమును చేతులతో
కప్పుకొని, భయపడే శ్రీకృష్ణుని అనుకరించెను.
ఈ విధముగా గోపికలు బృందావనమునందలి చెట్లను, లతలను
శ్రీకృష్ణ పరమాత్మ గురించి ప్రశ్నించుచుండిరి. ఇంతలో వారికి అడవి
ప్రదేశమునందు ఆయన కాలి గుర్తులు కనబడెను.
ఇవి స్పష్టముగా దొడ్డ మనసు గల శ్రీకృష్ణుని కాలి గురుతులే.
ఏలయన, జెండా, పద్మము, వజ్రము, అంకుశము, ధాన్యపు గింజ, చక్రము మొదలగువాటిచే నందపుత్రుని సందపుత్రుని కాలి ముద్రలను గుర్తు పట్టవచ్చును.
ఆయా కాలి ముద్రలతో ఆ శ్రీకృష్ణుని మార్గమునా గోపికలు వెదుకు
చుండిరి. ఇంతలో వారికి ఆయన కాలి గురుతులతో బాగా కలిసి ఉన్న స్త్రీ కాలి ముద్రలు కనబడెను. వారు మనోవ్యథను పొంది ఇట్లు పలికిరి.
నందపుత్రుడగు శ్రీకృష్ణుడు ఒక యువతి భుజముపై తస ముంజేతిని,
మగ ఏనుగు తుండమును ఆడు ఏనుగుపై వలె ఉంచి కలిసి నడచినట్లు
ఈ కాలి గురుతులను బట్టి తెలియుచున్నది. ఆమె ఎవరై యుండును?
ఈమె నిశ్చయముగా జగన్నాథుడగు శ్రీకృష్ణ భగవానుని ఆరాధించి
ప్రేతుని చేసినది. ఎందుకంటే, ఆ గోవిందుడు మనలను ప్రక్కనబెట్టి
ఏకాంతముగా ఆమెతో కలిసి నడచి వెళ్ళెను.
ఆహా! చెలికత్తేలారా! ఈ గోవిందుని పాదపద్మముల ధూలికణములు
పరమపవిత్రములు. ఎందుకంటే బ్రహ్మదేవుడు, శివుడు, లక్ష్మీదేవి
దోష నివారణకై వాటిని తమ తలపై దాల్చిరి.
ఆ యువతి గోపికల సొత్తనదగిన శ్రీకృష్ణ భగవానుని ఎత్తుకుపోయి
ఆయన అధరముననుభవించుచున్నది. ఆమెయొక్క ఈ కాలి గురుతులు
మనకు అధికముగా మానసికక్షోభను కలిగించుచున్నవి.
ఇచట ఆమె కాలి గురుతులు కనబడుట లేదు. ప్రియుడగు గోవిందుడు
ప్రియురాలి సుకుమారమైన అరికాళ్లకు గడ్డి కొనలచే నొప్పి కలుగగా
ఎత్తుకొని తీసుకువెళ్లి యుండును. ఇది నిశ్చయము.
ఓ గోపికలారా! ఇక్కడి కాలి గురుతులను చూడుడు. ఇవి బాగా
లోతుగా నున్నవి. కాముకుడగు శ్రీకృష్ణుడు ప్రియురాలిని మోసినప్పుడు
ఆ బరువుచే కాళ్లు దిగబడియుండును.
ఇచట చూడుడు. మట్టిలో కాలి అగ్రభాగముల గుర్తులు మాత్రమే
పడినవి. పూర్తి కాలి గుర్తులు పడలేదు. దీనిని బట్టి, శ్రీకృష్ణుడు
ప్రియురాలినిక్కడ క్రింద దింపి ఆమె కొరకు (ఎత్తున ఉన్న) పూలను కోసి
యుండును. ఆయన దొడ్డ మనసు గల ప్రియుడే.
ప్రియుడగు శ్రీకృష్ణుడు నిశ్చయముగా ఇక్కడనైతే కూర్చుండి ప్రియురాలి జుట్టు సరిచేసి ముడివేసి సరిచేసి ముడి వేసి ఆ పూలను ముడిలో తురిమియుండును.
శ్రీకృష్ణుడు తనయందే రమించి క్రీడించే పూర్ణుడు. కాముకులు
దైన్యమును పొందెదరనియు, కాముకులు యెడల కామినులు
దౌర్జన్యమును చూ పెదరనియు లోకమునకు నిరూపించువాడై ఆయన
ఆమెతో విహరించెను (ఇది శుకుని వచనము).
ఈ విధముగా మతి పోయినట్లున్న ఆ గోపికలు శ్రీకృష్ణుని కాలి
గుర్తులను చూపిస్తూ సంచరించిరి. అడవిలో ఇతరయువతులను విడిచిపెట్టి
శ్రీకృష్ణుడు ఏ గోపికను తీసుకువెళ్లినో, ఆమె తాను యువతులందరిలో
గొప్పదాననని తలపోసెను. ప్రియుడైన శ్రీకృష్ణుడు తనను కోరే
ఇతరగోపికలను కాదని నన్ను సేవించుచున్నాడని ఆమె తలంపు.
గర్వించిన ఆ గోపిక తరువాత అడవిలోని ఒక స్థానమును చేరి శ్రీకృష్ణ
భగవామనితో నిట్లనెను నేను నడవ లేకున్నాను. ఎక్కడకు వెళ్లాలని
నీవు. తలచెడవో, అచటకు నన్ను మోసుకొని పొమ్ము.
అనురాగవతియగు ఆ గోపిక ఇల్లు పలుకగా శ్రీకృష్ణుడు భుజము
నెక్కుము అని చెప్పి అంతర్ధాసమాయెను. ఆ యువతి (అట్లు
అన్నందుకు) పశ్చాత్తాపపడెను.
ఓ ప్రభూ! ఆహ్లాదమును కలిగించువాడా! నీవు ప్రియతముడవు,
గొప్ప భుజశక్తి గలవాడవు. ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? నేను
దీనురాలను, నీ దాసిని. నాకు నీ సాన్నిధ్యమును కలిగించుము.
శ్రీకృష్ణ భగవానుని మార్గమును వెదుకుచున్న గోపికలకు వారి చెలికత్తె
కనిపించెను. ఆమె ప్రియుడగు శ్రీకృష్ణుని విరహముచే దుఃఖితురాలై
మోహమును పొంది యుండెను.
లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుడు తనను సమ్మానించుటను, తాను
దౌర్జన్యము చేసి ఆయనను అవమానించుటను (ఆయన అంతర్ధానమై
తనను అవమానించుటను) గురించి కూడ ఆమె చెప్పెను. ఆ
వృత్తాంతమును విన్న గోపికలకు చాల ఆశ్చర్యము కలిగెను.
తరువాత చంద్రుని వెన్నెలలో అడవి కనబడుచున్నంతవరకు వారా
ఆడవిలో శ్రీకృష్ణుని వెదికిరి. తరువాత అంతటా చీకటి వచ్చుటను గాంచి
ఆ గోపికలు వెనుదిరిగిరి.
ఆ గోపికల మనస్సు శ్రీకృష్ణునియందు మాత్రమే లగ్నమై యుండెను. వారు ఆయన గురించియే మాటలాడుతూ ఆయన చేష్టలనే అనుకరిస్తూ ఆయనతో అభేదమును పొందిరి. ఆయన గుణములనే చేయుచున్న ఆ గోపికలకు తమ దేహముల స్పృహ గాని, ఇళ్ల గురించి గుర్తు గాని లేకుండెను.
శ్రీకృష్ణుని రాకను ఆకాంక్షించే ఆ గోపికలు శ్రీకృష్ణునే ధ్యానిస్తూ
మరల యమునానది యొక్క ఇసుకతిన్నె వద్దకు వచ్చిరి. వారందరు కలిసి
ఆయన గురించి గానము చేసిరి.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము
పూర్వార్ధములో గోపికలు అంతర్హితుడైన శ్రీకృష్ణుని వెదుకుటను
వర్ణించే ముప్పదియవ అధ్యాయము ముగిసినది (30).
