నారద ఉవాచ- నారదుడ్లినెను-
శ్రుతం మహాభాగ సుధారసపరం వరం ।
స్తోత్రం చ కవచం పూజాఫలం కాలంవద ప్రభో॥
ఓ మునిసత్తమా నీవలన అమృతముకంటె ఇంపైన పెక్కువిషయములు తెలిసికొంటిని. ఇప్పుడు ఆ దుర్గాదేవి కవచమును, పూజాకాలమును, పూజా ఫలము మున్నగువాటిని తెలుపుము.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
ఆర్ద్రాయాం బోధయేద్దేవీం మూలేనైవ ప్రవేశయేత్ ।
ఉత్తరేణార్చయిత్వా తోం శ్రవణాయాం విసర్జయేత్॥
ఆర్ద్రాయుక్త నవమ్యాం తు కృత్వా దేవ్యాశ్చ బోధనం ।
పూజాయాః శతవార్షిక్యా ఫలమాప్నోతి మావనః ॥
మూలాయాం తు ప్రవేశే చ వరమేధఫలం లభేత్ ॥
కృత్వా విసర్జనం దేవ్యా శ్రవణాయాం చ మానవః ।
లక్ష్మీం చ పుత్రపౌత్రాంశ్చ లభతే నాత్ర సంశయః॥
భువః ప్రదక్షిణం పుణ్యం పూజాయాం లభతే నరః ।
నక్షత్ర యోగాభావే తు పార్వత్యాగ్రీవ నారద॥
నవమ్యాం బోధనం కృత్వా పక్షం సంపూజ్య మానవః ।
అశ్వమేధ ఫలావ్యా దశమ్యాం చ విసర్జయేత్ ॥
సప్తమ్యాం పూజనం కృత్వా బలిం దద్యాద్విచక్షణ ।
అష్టమ్యాం పూజనం శం బలిదాన వివర్జితం॥
ఆష్టమ్యాం బలిదానేన విపత్తర్జాయతే నృణాం ।
దద్యాద్విచక్షణా భక్త్యా నవమ్యాం విధివద్బలిం ॥
బలిదానేన విప్రేంద్ర దుర్గాప్రీతిర్భవేన్నృణాం ।
హింసాజన్యం న పాపం చ లభతే యజ్ఞకర్మణి ॥
ఉత్సర్గ కర్తా దాతా చ చేత్తో పోష్టా చ రక్షకః ।
అగ్రే పశ్చాన్నిబద్ధా చ సప్తైతేవధ కారీణః ॥
యోయం హంతి సతం హంతి చేతివేదోక్తమేవ చ ।
కుర్వంతి వైష్ణవీం పూజం వైష్ణవాస్తేన హేతునా ॥
నారదమునీ! దుర్గాదేవిని ఆర్ధానక్షత్రమున ఉజ్ఞాపకము చేసి మూలానక్షత్రమునాడు ఆ దేవీ అర్చామూర్తిలో ప్రవేశపెట్టవలెను. తరువాత ఉత్తరాషాఢ నక్షత్రము వరకు ఆమెను ఆర్చవసేసి శ్రవణా నక్షత్రమున ఆ దేవివి విపర్తింపవలెను. ఆర్థానక్షత్రమున్న నవమినాడు దుర్గాదేవిని ఉత్థానముచేసి పూజించిన ఆధీక ఫలితము లభించును. మూలా నక్షత్రమున ఆ దేవిని ఆర్చామూర్తీలో ప్రవేశపెట్టినచో నరమేధముచేసిన ఫలము లభించును, శ్రవణానక్షత్రమున ఆ దేవిని విసర్జించినచో ధనమున, పుత్రపౌత్రులను పొందును. అట్లే అతనికి భూమిచుట్టు ఒకసారి ప్రదక్షిణము చేసినచో కలుగు ఫలితము లభించును.
నవమినాడు ఆర్తానక్షత్రము లేనిచో ఆ దేవిని నవమివాడు ఉత్థాపనచేసి పక్షము దినములవరకు ఆమెమ పూజించి దశమినాడు విసర్జన చేసినచో అశ్వమేధఫలితము లభించుమ, సప్తమినాడు పూజ తరువాత బలిని ఇవ్వవలెమ, అష్టమి శిథినాడు ఎట్టి పక్షమునను బలి ఇవ్వకూడదు, ఆట్లు చేసినచో బలి ఇచ్చినవానికి తప్పక విపత్తి జరుగును. అట్లే నవమి తిథినాడు భక్తితో ఆ దేవికి తప్పక బలి నివ్వ వలెను. ఆ దినమున బలిఇచ్చినచో దుర్గాదేవి మిక్కిలి సంతోషించును. ఈ పూజాసయమయమున బలి ఇచ్చినవానీకి పశుహింసవలన కలుగు పాపము సంభవింపదు. ఎందువలన అంటే పదములందు ఏ ప్రాణి ఏ ప్రాణిని చంపునో చంపబడినప్రాణి మరుజన్మలో చంపిన వానిని చంపుచున్నట్లు చెప్పబడినది. అందువలన ఇద్దరు పరప్పరము చంపుకొనుచున్నందువలన హింసాపాపము ఆంటబోదు. అట్లే వేదమువ వీరు వధచేయనట్లు చెప్పబడినది.
ఏవం సంపూజ్య పురథః పూర్ణం వర్షం చ భక్తితః ।
కవచం చ గళే బద్వే తుష్టావ పరమేశ్వరీం ॥
స్తోత్రేణ వరితుష్టా సా తస్య సాక్షాద్బభూవ హ ।
స దదర్శ పురో దేవీం గ్రీష్మసూర్యసమప్రభం ॥
తేజః స్వరూపాం పరమాం సగుణాం నిర్గుణాం వరాం ।
దృష్ట్వా తాం కమనీయాం చ తేజోమండల మధ్యతః ॥
స్వేచ్ఛామయీం కృపారూపాం భక్తామగ్రహ కారిణీం ।
పునస్తుష్టాన రాజేంద్రో భక్తినమ్రాత్మకం ధర॥
సురథుడా దేవిని సంవత్సర పర్యంతము భక్తితో పూజచేసెను. తన మెడలో దుర్గా కవచమును ధరించి ఆమెను స్తుతించెను.
అందువలన ఆ దేవి మహారాజునకు ప్రత్యక్షమయ్యెను. ఆమె గ్రీష్మకాలమందలి సూర్యునివంటి కాంతీకలది. తేజస్వరూప, సగుణ నిర్గుణాత్మిక, తేజో మండలమధ్యముననున్న ఆ దేవిని పురథుడు చూచి భక్తిచే తలను వంచి ఆనేకమార్లు స్తుతించెను.
స్తవేన పరీతుష్టా సా సస్మితా భక్తిపూర్వకం ।
ఉవాచ సత్యం రాజేంద్రం కృపయా జగదంబికా ॥
నారదా! సురథుడు భక్తితో చేసిన సుతికి సంతోషించిన జగన్మాత అతనితో దయతో నిట్లనెను.
ప్రకృతిరువాచ- ప్రకృతి ఈ విధముగా అనినది-
సాక్షాత్ సంప్రాప్య మాం రాజన్ వృణోషి విభవం వరం।
దదామి తుభ్యం వీభవం సాంప్రతం వాంఛితం తవ॥
నిర్జిత్య సర్వాన్ శత్రూంశ్చ లబ్ద్వా రాజ్యమకంటకం।
భవిష్యసి మహారాజు సావర్ణిర్మనురష్టమ॥
దాస్యామి తుభ్యం జ్ఞానం చ పరిణామే నరాధిప ।
భక్తిం దాస్యం చ పరమం శ్రీకృష్ణ పరమాత్మని ॥
వృణోతి వీభవం యోది సాక్ష్మాహ్మం ప్రాప్య మందధీః ।
మాయయా వంచితః సోది విషమత్యమృతం లభేత్ ॥
బ్రహ్మాదిస్తంబ పర్యంతం సర్వం నశ్వరమేవ చ ।
నిత్యం సత్యం పరం బ్రహ్మ కృష్ణం నిర్గుణ మేవ చ ॥
బ్రహ్మవిష్ణు శివాచీనామహ మాద్యా పరాత్పరా।
సగుణా నిర్గుణాచాది వరా స్వేచ్ఛమయీ సదా॥
నిత్యానీత్యా సర్వరూపా సర్వకారణకారణం।
బీజరూపా చ సర్వేషాం మూలప్రకృతిరీశ్వరీ॥
పుణ్యేటందావనే రమ్యే గోలోకే రాసమండలే ।
రాధా ప్రాణాధికార చ కృష్ణస్య పరమాత్మనః ॥
అహం దుర్గా విష్ణుమాయా బుధ్యధిష్ఠాతృదేవతా ।
అహం లక్ష్మీశ్చ వైకుంఠే స్వయం దేవీ సరస్వతీ॥
సావిత్రీ వేదమాతాహం బ్రహ్మాజీ బ్రహ్మలోకతః ।
అహం గంగా చ తులసీ సర్వాధారా వసుంధరా ॥
నానావీధాహం కళయా మాయయా సర్వయోషితః ।
పాల కృష్ణేన సంసృష్టి నృప భ్రూభంగలీలయా॥
ఓ రాజా నేను నీకు సాక్షాత్కరించినను నీవు రాజ్యవైభవము కావలెనని కోరుచున్నావు. నీవు కోరుకున్నట్లే నీకు రాజ్య వైభవమును ఇత్తును. నీవు నీ శత్రువుల నందర సంహరించి రాజ్యమును ఎదురులేకుండ పరిపాలించి చివరకు సావర్ణిమమపమ ఎనిమిదవ మనువు కాగలవు. నేను నీకు చివరకు జ్ఞానమునిత్తును. దానివలన వీపు శ్రీకృష్ణ భక్తినీ, శ్రీకృష్ణ దాస్యమును పొందెదవు.
నేను సాక్షాత్కరించినపుడు బుద్ధి తక్కువై వైభవమునెవరు కోరునో వాడు మాయా మోహితుడై ఆ పని చేయుచున్నాడు, ఆట్లే ఆతడు ఆమృతమునకు బదులు విషమును పొందుచున్నాడు. ఈ ప్రపంచమున బ్రహ్మ మొదలు స్తంభమువరకు సమస్తము ఆశాశ్వతమైనది. నిత్యుడు, సత్యస్వరూపుడు నిర్గుణుడు పరమాత్మయగు శ్రీకృష్ణుడొక్కడే.
నేను బ్రహ్మ విష్ణు శివాది దేవతలకంటే ముందు పుట్టిన దానను, పరాత్పరు, సగుణను, వీరుణను, ఐనమ ఎల్లప్పుడు స్వేచ్ఛగానుందును. నేను నిత్యురాలను, అనీత్యురాలను, సమస్త రూపములు నావే అన్ని జీవులకు నేను మూలకారణమును. నేనే మూలప్రకృతిని. పుణ్యమైన బృందావనములోని సురమ్యమైన రాసమండలమున శ్రీకృష్ణపరమాత్మకు రాధాదేవికంటెను ఇష్టమైనదానిని. నేను బుద్దీకి అధిష్టానదేవతను, విష్ణుమాయయగు దుర్గాదేవిని, వైకుంఠమున లక్ష్మీదేవిగా, సరస్వతీ దేవిగానున్నాను. బ్రహ్మలోకమున నేను వేదమాతయగు సావిత్రీ దేవిగానున్నాను. అట్లే నేను గంగా, తులసీ, భూమి మొదలగు ఆకారములతోనున్నాను. నా మాయవలన జనించినవారే నా ఆంశస్వరూపలైన స్త్రీలు.
ఇట్టి నన్ను కృష్ణపరమాత్మ తన లీలతో సృష్టించెను.
భ్రూ భంగలీలయా సృష్ణో యేన పుంసా మహాన్విరాట్ ।
లోమ్నాం కూపేషు విశ్వాని యన్య సంపాహి నిత్యశః॥
అసంఖ్యాని చ అన్యేన కృత్రిమాణీ చ మాయయా ।
అనిత్య సత్యబుద్దిం చ సర్వే కుర్వంతి సంతతం ॥
సప్తసాగర సంయుక్తా సప్తద్వీపా వసుంధరా ।
తదధః సప్తపాతాళాః స్వర్లోకాశైవ సప్త చ ॥
ఏవం విశ్వం బహువీధం బ్రహ్మాండం బ్రహ్మణా కృతం ।
ప్రత్యేకం సర్వవిధ్యండే బ్రహ్మ విష్ణు శివాదయః॥
సర్వేషామీశ్వరః కృష్ణ ఇతిజ్జానం పరాత్పరం ।
వేదానాం చ వ్రతానాం చ తీర్థానాం తపసాం తథా ॥
దేవానాం చైవ సర్వేషాం సారః కృష్ణ ఇతిస్మృతః ।
తద్భక్తి హీనో మూఢస్పద జీవన్మలో ధ్రువం ॥
పవిత్రాణి చ తీర్థాని తద్భక్త స్పర్శవాయునా ।
తన్మంత్రోపాసకశ్చైవ జీవన్ముక్త ఇతిస్మతః ॥
మంత్రగ్రహణమాత్రేణ సరో వారాయణో భవేత్ ।
వినా జపేన తపసావినా తీర్తేన పూజయా ॥
మాతామహానాం శతకం పితౄనాం చ సహస్రకం ।
పుంసామేవం సముద్ధత్య గోలోకం చ స గచ్చతి॥
ఇదం జ్ఞానం సారభూతం కథితం తే నరాధిప ।
శ్రీకృష్ణ పరమాత్మయొక్క లిల చేతనే మహావిరాట్ స్వరూపుడు సృష్టింపబడెను. అతని రోమకూపములందు అనేక విశ్వములున్నవి. ఇవి యన్నియు పరమాత్మయొక్క మాయవలన సృస్టింపబడినవి. ఈ మాయవలననే ఆందరు అనిత్యములైన వస్తువులను నిత్యములని తలంచుచున్నారు.
సప్త సముద్రములు, సప్త ద్వీపములతో నున్న ఈ భూమికి క్రింద పాతాళాది లోకము లేడు పైన స్వర్గాది లోకములేడు. కలవు. ఇట్టి లోకములు అనేకములున్నవి. బ్రహ్మాండమును బ్రహ్మదేవుడు సృష్టించుచున్నాడు. ఇట్టి బ్రహ్మాండములన్నిటిలో బ్రహ్మవిష్ణు శివాది దేవతలు ప్రత్యేకముగా నున్నారు.
అందరకు శ్రీకృష్ణ పరమాత్మ ఈశ్వరుడను జ్ఞానము చాలా మిన్నయైనది. వేదములకు, తపస్సులకు, వ్రతములకు, తీర్థములకు, దేవతలకందరకు శ్రీకృష్ణుడే సారభూతుడు. శ్రీకృష్ణభక్తిలేనివాడు జీవన్మృతుడగును. ఆ శ్రీకృష్ణ భక్తులకు తగిలిన వాయువు సోకినచో సమస్త తీర్థములు పవిత్రములగును.
శ్రీకృష్ణ మంత్రమును ఉపాసన చేయు భక్తుడు జీవన్ముక్తుడగును. శ్రీకృష్టమంత్రమును గురుముఖతః పొందగనే నరుడు నారాయణునితో సమానుడగుచున్నాడు. అతనికి జపము.తపము, తీర్థసేవన, పూజమున్నగునవి అవసరములేదు శ్రీకృషమంత్రమును గురుముఖతః పొందిన భక్తుడు అతని తల్లి వంశము వారిని నూరు తరములవారిని, తండ్రి వంశమువారిని వేయి తరముల వారినీ సముద్ధరించును. చివరకాభక్తుడు గోలోకమును చేరుకొనును.
ఓ మహారాజా! నీకు సారభూతమైన జ్ఞానమును చెప్పితిని.
మన్వంతరాంతే భోగాంతే భక్తిం దాస్యామి తే హరౌ ॥
నాజభుక్తం క్షీయతే కర్మ కల్పకోటిశతైరపి ।
అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాఽశుభం॥
అహం యమునుగృహ్ణమి తప్మై దాస్యామి నిర్మలాం।
నిశ్చలాం సుదృఢం భక్తిం శ్రీకృష్ణ పరమాత్మని ॥
కరోమి వంచనాం యంయం తేభ్యోదాస్యామి సంపదం ।
ప్రాతః స్వప్న స్వరూపాంచ మీథ్యేతి భ్రమ రూపిణీం॥
ఇతి తే కథితం జ్ఞానం గచ్ఛ వత్స యథా సుఖం ।
ఇత్యుక్త్యా చ మహాదేవ తత్రైవాంతరధీయత॥
ఓ రాజా! మన్వంతరము చివర లేక నీ కర్మ భోగము పూర్తియైన తరువాత శ్రీకృష్ణభక్తిని కల్పింతును. జీవుడు చేసిన కర్మమ సంపూర్ణముగా అనుభవించనిదే ఎన్ని సంవత్సరములు గడచినను తీరదు. అట్లే నేను ఎవరిని అనుగ్రహింతునో అతనికి నిర్మలము, నిశ్చలమైన శ్రీకృష్ణభక్తిని ఇత్తును. నేను ఎవరిని మోసగింతునో అతనికి ప్రాతః కాలమున పడిన స్వప్నమువంటిది. మీథ్య అను భ్రమను కలిగించు సంపదను ఇత్తును.
వత్స! నీకు ఇట్టి జ్ఞానమును కలిగించితిని. నీవు సుఖముగా నీ ఇంటికి వెళ్ళుమని దుర్గాదేవి అక్కడే ఆంతర్థానము చెందెనని వారాయణుడు నారదునితో చెప్పెను.
రాజా సంప్రాప్య రాజ్యం చ నత్వా తాం ప్రయయా గృహం।
ఇతి తే కథితం వత్స దుర్గోపాఖ్యాన ముత్తమం॥
సురథుడు ఆ దుర్గాదేవికి నమస్కరించి గృహమునకు పోయి రాజ్యమును తిరిగి సంపాదించేను. నారాయణా! నీకు ఇట్లు దుర్లోపాఖ్యానమును సంపూర్ణముగా వివరించితిని అని నారాయణుడు పలికెను.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే ద్వీతీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే దుర్గోపాఖ్యానే ప్రకృతి సురథ సంవాదే జ్ఞాన కథనం నామ పంచషష్టితమోధ్యాయః ॥
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములోని రెండవదైన ప్రకృతిఖండమున నారదనారాయణుల సంవాదమున చెప్పబడిన దుర్గోపాఖ్యానములోని ప్రకృతి సురథుల సంవాదమున జ్ఞాన కథనమన అరవైయైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 65 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
This chapter compiles the primary sacred Mantras, transcendent Stotras, and protective Kavacha armors of all the manifestations of Parā Prakṛti for the daily practice of devotees. It provides the exact seed-syllables, meditation verses, and ritual chanting counts for Sarasvatī, Lakshmī, Sāvitrī, Durgā, and Śrī Rādhā, serving as a complete practical manual for devotional worship. The text asserts that practicing these sacred vibrations purifies the subtle body, destroys all negative karmic impressions, and establishes an indestructible spiritual shield around the devotee's life.