బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

63 - దుర్గాదేవి వైశ్యునితో సంభాషించుట

నారద ఉవాచ- నారదుడిట్లనెను-

 నారాయణ మహాభాగ వద వేదవిదాంవర

రాజాకేన ప్రకారేణ సీసేవే ప్రకృతిం పరాం

సమాధిర్నామం వైశ్యోవా నిష్కామం నిర్గుణం విభుం

భేజే కేన ప్రకారేణ ప్రకృతేరుపదేశతః

కిం వా పూజావిధానం చ ధ్యానం వా మమరేవచ

 కిం స్తోత్రం కవచం కిం పా దదౌ రాజ్ఞే మహామునిః

వైశ్యాయ ప్రకృతీస్తస్మై కిం వా జ్ఞానం దదౌ పరం

సాక్షాద్బభూవ పహసా కేన వా ప్రకృతిస్తయోః

 జ్ఞానం పంప్రాప్య వైశ్యశ్చ కిం పదం ప్రాప దుర్లభం

గతిర్బభూవ రాజ్ఞశ్చ కా వా తాం చ శ్రుణోమ్యహం  

వేదములన్నియు తెలిసిన నారాయణ మునీ! రాజు ఏవిధముగా ప్రకృతిరూపిణియైన దుర్గాదేవిని సేవించెనో, సమాధియను వైశ్యుడు కోరికలు లేక ప్రకృతియొక్క ఉపదేశమువలన ఏ విధముగా నిర్గుణుడైన పరమాత్మమ పేవించేవో? ఆ దేవి పూజా విధానమెట్లున్నదో, ధ్యానము, మంత్రము, సోత్రము కవచము ఎట్లున్నవో? తెలుపుము.

అట్లే ప్రకృతి రూపిణియైన దుర్గాదేవి వైశ్యునకు జ్ఞానమునెట్లు ప్రసాదించెనో? ప్రకృతి వారికెట్లు ప్రత్యక్షమయ్యెనో? ఆ దేవి దయవలన జ్ఞానము పొందిన వైశ్యుడు ఎటువంటి స్థానమును పొందెనో? రాజు ఏమయ్యెనో? ఈ విషయములనన్నిటిని వివరింపుడు.

శ్రీ నారాయణ ఉవాచ- శ్రీనారాయణుడిట్లనెను-

రాజా వైశ్య సంప్రావ్య మంత్రం వై మేధసో మునేః

 స్తోత్రం చ కవచం దేవ్యా  ధ్యానం చైవ పురస్ర్కియాం

జజాప పరమం మంత్రం రాజూవైశ్యశ్చ పుష్కరే

 స్నాత్వా శ్రీకాలం వర్షం చ తతః శుద్ధో బభూవ హా

 సాక్షార్బభూవ తత్రైవ మూలప్రకృతిరీశ్వరీ

 రాజ్ఞే దదౌ రాజ్యవరం మనుత్వం వాంఛితం సుఖం

 జ్ఞానం నిగూడం వైశ్యాయ దదౌ చాతీసుదుర్లభం

యద్దత్తం శూలినే పూర్వం కృష్ణేన పరమాత్మనా

 నిరాహారమతీక్లిష్టం దృష్ట్యా వైశ్యం కృపామయీ

 రురోధ కృత్వా క్రోడే తమచేష్టం శ్వాసవర్జితం

చేతనాం కురు భో వత్సేత్యుచ్చార్య చ పునః పునః

చేతనాం చ దదౌ తస్మై స్వయం చైతన్య రూపిణీ

 సంప్రాప్య చేతనాం వైశ్యో రురోద ప్రకృతేః పురః

తమువాచ ప్రసన్నాసౌ కృపయాఽతికృపామయీ

మేధోమహర్షివలన సురథుడు, వైశ్యుడు దుర్గాదేవియొక్క కవచమును, స్తోత్రమును. ధ్యాపమును మంత్రమును పొంది, పుష్కరక్షేత్రమున ఆ దేవిమంత్రమును జపించిరి. వారు ప్రతిసంధ్యలలో స్నానము చేయుచు ఆ దేవి మంత్రమును సంవత్సరకాలము, జపించగా మూలప్రకృతియగు దుర్గాదేవి. వారికి సాక్షాత్కరించి, రాబుకు రాజ్యమును, ఆతవికి గల ఇతర కోరికలను, మనుత్వమునిచ్చాను. కోరికలులేని వైశ్యునకు అతిదుర్లభమైన జ్ఞానమునిచ్చినది. ఆ జ్ఞానముమ పూర్వము శ్రీకృష్ణపరమాత్మ శంకరునకొసగియుండెను.

ఆ జ్ఞానమువలన నిరాహారియై భగవతిని ధ్యానించుచు కృశించిపోవుచున్న వైశ్యుడు శ్వాసలేక నిశ్చేష్టుడైయున్నప్పుడా తల్లి ఆతనిని దయతో తన ఒడిలోనికి తీసికొని కొంతసేపు బాధపడి వల్సా చైతన్యమును పొందుమని అనెను.

అప్పుడా వైశ్యుడు తెలివికి వచ్చి ఎదుటనున్న ఆ తల్లిని చూచి సంతోషమును పట్టలేక ఏడ్చెను. అప్పుడు కృపామయి యగు ఆ భగవతీ అతనిలో నిట్లనెను.

శ్రీప్రకృతిరువాచ- వైశ్యుడిట్లు పలికెను-

బ్రహ్మత్వమమరత్వం వా మాతర్మే న హి వాంఛితం

తలోఽతి దుర్లభం కిం వా న జానే తదభిప్పితం

త్వయ్యేవ శరణాపన్నో దేహి యద్వాంఛితం తవ

అనశ్వరం సర్వసారం వరం మే దాతుమర్హసి

తల్లీ! నాకు అమరత్వము కాని బ్రహ్మత్వముకాని కావలనేనను కోరికలేదు. అంతకుమించినవి ఏముండునో వాకు తెలియదు. నేను నిన్నే శరణువేడితిని. నీకు ఏది ఇష్టమో దానినే నాకిమ్ము. ఆది శాశ్వతమై అన్నిటికి సారమగువట్లు మాత్రము కావలయును అని వైశ్యుడగు సమాధి ఆమెతో అనెను.

ప్రకృతీరువాచ- ప్రకృతి ఇట్లనినది-

ఆదేయం నాస్తిమే తుభ్యం దాస్యామి మమ వాంఛితం

యతో యాప్యసి గోలోకం పదమేవ సుదుర్లభం

 సర్వసారం చ యత్జ్జానం సురర్షణాం సుదుర్లభం

 తద్గృహ్యతాం మహాభాగ గచ్చ వత్స హరేః పదం

 స్మరణం వందనం ధ్యానమర్చనం గుణకీర్తనం

శ్రవణం భావనం సేవా కృష్ణే సర్వనివేదనం

 ఏతదేవం వైష్ణవానాం నవధా భక్తిలక్షణం

జన్మమృత్యు జరావ్యాధి యమలోడన ఖండనం

 ఆయుర్హరతి లోకానాం రవిరేవ హి సంతతం

 నవధాభక్తి హీనానా మసలాం పాపినా మపి

 భక్తాస్తద్ధత చిత్తాశ్చ వైష్ణవాశ్చరజీవినః

జీవన్ముక్తాశ్చ దుష్పాపా జిన్మాది పరీవర్జితాః

 శివః శేషశ్చ ధర్మశ్చ బ్రహ్మా విష్ణుర్మహాన్ విరాట్

సనత్కుమారః కపిలః సనకశ్చ సనందనః

వోడు పంచశిఖో దక్షో నారదశ్చ సనాతనః

 భృగుర్మురీచి దుర్వాసాః కశ్యపః పులహోఽoగిరాః

మేధావీ లోమశః శుక్రో వసిష్ఠః క్రతురేవ చ

 బృహస్పతి కర్దమశ్చ శక్తిరత్రీ పరాశరః

మార్కండేయో బలిశ్చైవ ప్రహ్లాదశ్చ గణేశ్వరః

 యమః సూర్యశ్చ వరుణో వాయుశ్చంద్రో హుతాశనః

ఆకూపార ఉలూకశ్చ నాడీజంఘశ్చ వాయుజః

 నరనారాయణా కూర్మ ఇంద్రదుమ్మో విభీషణః

నవధా భక్తియుక్తాశ్చ కృష్ణస్య పరమాత్మనః

ఏతే మహాంతో ధర్మిష్ఠా భక్తానాం ప్రవరాస్తథా

ఓ సమాధీ! నేను ఇవ్వలేనిదని ఏమి లేదు, ఐనను నీవు కోరుకొన్నట్లే నేను ఇష్టపడు వరమునే నీకిచ్చెదను. దానివలన సిప్పు అమరులకు కూడ సుదుర్లభమైన గోలోకమునకు పోయెదవు. నేను నీకు ఇచ్చు జ్ఞానము సర్వసారమైనది. దేవఋషులకు సహితము మిక్కిలి దుర్లభమైనది. ఈజ్ఞానము వలన నీవు శ్రీహరి నివసించు లోకమునకు పోగలవు.

 శ్రీహరిని స్మరించుట, నమస్కరించుట, ధ్యానము చేయుట అతనిని అర్చించుట ఆ దేవదేవుని అనంతకల్యాణ గుణగణములను కీర్తించుట, ఆతని గుణగణములను వినుట, ఆ పరమాత్మను మనస్సులో భావనచేయుట, ఆతని సేవచేయుట, ఆ పరమాత్మపై తన భారమునంతయు వేడుట (శరణువేడుట) అనునవి ఆ పరమాత్మ భక్తియొక్క తొమ్మిది భేదములు. ఈ భక్తివలన జన్మ, మృత్యు, జర, వ్యాధి, నరక బాధలు తప్పును.. ఆసత్పురుషులు, పాపులైన శ్రీహరిభక్తి రహితులకు ఆయస్సు వ్యర్థముగా గడచిపోవును.

శ్రీహరిభక్తులెల్లప్పుడు ఆ శ్రీహరిని మనస్సులో ధ్యానించుచుందురు. వారందరు చిరంజీవులు, జీవన్ముక్తులు పాపరహితులు.

శివుడు, శేషుడు, ధర్ముడు, బ్రహ్మ, విష్ణువు మహావిరాట్ స్వరూపుడు, సనత్కుమారుడు, కపిలుడు, సనకుడు, సనందనుడు, వోడు, పంచశిఖుడు, దక్షుడు, నారదుడు. సనాతనుడు, భృగువు, మరీచి, దుర్వాసుడు కశ్యపుడు పులహుడుంగిరుడు మేధావి, లోమశుడు, శుక్రుడు, వసిష్ఠుడు, క్రతువు, బృహస్పతి, కర్దముడు, శక్తి, అత్రి, పరాశరుడు, మార్కండేయుడు, బలి, ప్రహ్లాదుడు, గణపతి, యముడు, సూర్యుడు, వరుణుడు, వాయువు, చంద్రుడు, అగ్ని, ఆకూపారుడు, ఉలూకుడు, నాడీజంఘుడు, నరనారాయణులు, కూర్ముడు, ఇంద్రద్యుమ్నుడు, విభీషణుడు వీరందరు ధార్మికులు, శ్రీకృష్ణభక్తులలో శ్రేష్టులు, వీరందరూ శ్రీకృష్ణ పరమాత్మను నవవిధభక్తులలో ఏదోవిధభక్తితో సేవించుచున్నవారే.

 యే తద్భక్తాస్తే తదంతా జీవన్ముక్తాశ్చ సంతతం

 పాపహరాస్తీర్థానాం పృథివ్యాశ్చ విశాం పతే

శ్రీకృష్ణపరమాత్మ అంశకల అతని భక్తులందరు జీవన్ముక్తులు, పృథివీ, తీర్థక్షేత్రములందు పాపులవల్ల ఏర్పడు పాపమునపహరింతురు.

ఊర్థ్వం చ సప్తస్వర్గాశ్చ సప్తద్వీపా వసుంధరా

ఆధః సప్త చ పాతాళా ఏతద్రహ్మాండ మేవ చ

 ఏవం విధానాం విశ్వాసం సంఖ్యా నాస్యేవ పుత్రక

 ఏవం చ ప్రతివిశ్వేషు బ్రహ్మవిష్ణు శాపాదయః

దేపా దేవర్షయశ్చైవ మనవో మానవాదయః

 సర్వాశ్రమాశ్చ సర్వత్ర సంతి బద్ధాశ్చ మాయయా

 మహావిష్ణోర్లోమకూపే సంతివిశ్వాని యస్య చ

స షోడశాంశః కృష్ణస్య చాత్మనశ్చ మహావిరాట్

భజ సత్యం పరం బ్రహ్మ నిత్యం నిర్గుణమచ్యుతం

ప్రకృతేః పరమీశానం కృష్ణమాత్మానమీప్పితం

నిరీహం చ నీరాకారం నిర్వికారం నిరంజనం

నిష్కామం నిర్విరోధం చ నిత్యానందం సనాతనం

 స్వేచ్ఛామయం సర్వరూపం భక్తానుగ్రహ విగ్రహం

తేజ స్వరూపం పరమం దాతారం సర్వసంపదాం

 ధ్యానసాధ్యం దురారాధ్యం కాదీనాం చ యోగినాం

సర్వేశ్వరం సర్వపూజ్యం సర్వేషాం సర్వకామదం

సర్వాధారం చ సర్వజ్ఞం సర్వానందకరం పరం

 పర్వధర్మప్రదం సర్వం సర్వజ్ఞం ప్రాణరూపిణం

సర్వధర్మస్వరూపం చ సర్వకారణకారణం

సుఖదం మోక్షదం సారం వరరూపం చ భక్తిదం

 దాస్యదం ధర్మదం చైవ సర్వసిద్ధిప్రదం సతాం

సర్వం తదతిరిక్తం చ నశ్వరం కృత్రీమం సదా

పరాత్పరం శుద్ధం పరిపూర్ణతమం శివం

యథాసుఖం గచ్ఛవత్స భగవంతమధోక్షజం

సప్తద్వీపములు గల భూఖండమునకు పై భాగమున ఏడు స్వర్గలోకములు, అధోభాగమున ఏడు పాతాళ లోకములు కలవు. ఈ చతుర్ధశ లోకములను బ్రహ్మాండమని అందురు.

ఈ ప్రపంచమున ఇట్టి బ్రహ్మాండము లెన్నియో కలవు. ప్రతి బ్రహ్మాండమున బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలగు దేవతలు దేవఋషులు, మనుషులు, మానవులు వారీలోనున్న ఆశ్రమములన్నీ ఉన్నవి. వీరందరు విష్ణుమాయకు బద్దులైయుందురు.

ఈ బ్రహ్మాండములన్నియు శ్రీమహావిష్ణువు యొక్క రోమకూపములందున్నవి. ఆ మహావిష్ణువు శ్రీకృష్ణపరమాత్మయొక్క పదునారవ ఆంశ.

అందువలన ఓ వైశ్యుడా! నీవు సత్యస్వరూపుడు, పరబ్రహ్మరూపుడు, నిత్యుడు, నిర్గుణుడు, అచ్యుతుడు, ప్రకృతికంటే పరుడు, ఈశ్వరుడగు శ్రీకృష్ణుని సేవింపుము. ఆ పరమాత్మ నిరీహుడు, నిరాకారుడు, నిర్వికారుడు, నిరంజనుడు, నిష్కాముడు, నిర్విరోధుడు, నిత్యానందుడు, సనాతనుడు, స్వేచ్చామయుడు, సర్వరూపి, భక్తులననుగ్రహించుటకై శరీరమును స్వీకరించినవాడు. తేజ స్వరూపుడు, సమస్త సంపదలను కలిగించువాడు, ధ్యానముచేత మాత్రము సులభసాధ్యుడు, శివుడు మొదలగు మహాయోగులు సైతము ఆరాధించుటకు అసాధ్యుడు, సర్వేశ్వరుడు, సర్వపూజ్యాడు. అందరకు ఆన్నీ కోరికలు తీర్చువాడు, సర్వాధారుడు, సర్వజ్ఞుడు, అందరకు ఆనందమును కలిగించువాడు, సర్వధర్మములనొసగువాడు, సర్వప్రాణరూపి, సర్వధర్మ స్వరూపుడు, సమస్త కారణములకు కారణభూతుడు, సుఖమును, మోక్షమును ఒసగువాడు, పరరూపుడు, భక్తిదాత, దాస్యభక్తినిచ్చువాడు, సజ్జనులకు సమస్త సిద్ధులను కలిగించువాడు. ఆ పరమాత్మ భిన్నమైన దంతయు ఆశాశ్వతమైనది, ఆసహజమైనది. అట్టి శుద్ధస్వరూపుడైన పరమాత్మను సేవించుటకై సుఖముగా పొమ్ము.

కృష్ణేతి ద్వ్యక్షరం మంత్రం గృహీత్వా కృష్ణ దాస్యదం

 పుష్కరం దుష్కరం గత్వా దశలక్ష    మిమం జప

దళలక్షజపేనైవ మంత్రసిద్ధిర్భవేత్తవ

ఇత్యుక్త్యా సా భగవతీ తత్త్రైవాంతరధీయత

 వైశ్యోనత్వా చ తాం భక్త్యా చాగమత్పుష్కురం మునే

 పుష్కరే దుష్కరం తప్యా స లేభే కృష్ణమీశ్వరం

భగవత్యాః ప్రసాదేన కృష్ణదాసో బభూవ సః

శ్రీకృష్ణ దాస్యమును కలిగించు కృష్ణ అను రెండక్షరముల మంత్రమును తీసికొని పుష్కర క్షేత్రమునకు పోయి ఆ మంత్రమును పదిలక్షలమార్లు జపింపుము. నీవు ఆ మంత్రమును పది లక్షలసార్లు జపింపగానే సిద్ధిపొందుదువు అని చెప్పి భగవతియగు దుర్గామాత ఆంతర్ధానము చెందెను.

వైశ్యు డాదేవిని భక్తితో నమస్కరించి ఆమె చెప్పినట్లు పుష్కర క్షేత్రమునకు వెళ్ళి దుష్కరమైన తపస్సుచేసి శ్రీకృష్ణపరమాత్మను పొందెను. ఈవిధముగా సమాధియను ఆ వైశ్యుడు దుర్గాదేవియొక్క అనుగ్రహమువలన శ్రీకృష్ణదాసుడయ్యెను. అని నారాయణుడు నారదమహర్షితో అనెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే దుర్గోపాఖ్యానే సురథ సమాధి మేధస్సంవాదే ప్రకృతి వైశ్య సంవాదకథనం నామ త్రిషష్టితమోఽధ్యాయః

 శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమందలి నారదనారాయణ సంవాదమున చెప్పబడిన దురోపాఖ్యానములోని సురథసమాధి, మేధోమునుల మధ్య జరిగిన సంవాదమున ప్రకృతి వైశ్యుల సంవాదమును చెప్పు అరవై మూడవ అధ్యాయము సమాప్తము.