బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

29 - నరకకుండముల పేర్లు

శ్రీనారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

 యమస్తస్యై విష్ణుమంత్రం దత్వా చ విధిపూర్వకం

కర్మాఽశుభ విపాకం చ తామువాచా రవే: సుతః

యమధర్మరాజు సావిత్రికి శ్రీమన్నారాయణుని మంత్రమును విధిపూర్వకముగా ఉపదేశించీ ఆ తరువాత అశుభకర్మల విపాకమెట్లుండునో తెల్పసాగెను.

యమ ఉవాచ- యమధర్మరాజు ఇట్లు అనెను-

శుభకర్మవిపాకం చ శ్రుతం నానావిధం సతి

కర్మాఽశుభవిపాకం చ కథయామి నిశామయ

నానా ప్రకారం స్వర్గం చ యాతిజీవః సుకర్మణా

కుకర్మణా చ నరకం యాతి నానావిధం నరః

ఓసావిత్రి! నీవు అనేక పుణ్యకర్మల ఫలితమెట్లుండునో తెలిసికొంటివి కదా! ఇప్పుడు నీవు కోరినట్లు ఆశుభకర్మల విపాకమెట్లుండునో తెలిపెదను. జీవుడు పుణ్యకర్మలు చేసి అనేక విధములైన స్వర్గములను పొందుచున్నాడు. అట్లే అశుభ కర్మలవలన అనేకవిధములైన నరకములను పొందుచున్నాడు.

 నరకాణాం చ కుండాని సంతి నానావిధాని చ

 నానాపురాణ భేదేన నామభేదాని తాని చ

 విస్తృతాని గభీరాణి క్లేశదాని చ జీవితాం

భయంకరాణి ఫహారాణి హే వత్సే కుత్సితాని చ

షడశీతిశ్చ కుండానీ సంయమన్యాం చ సంతి చ

 నీబోధ తేషాం నామాని ప్రసిద్ధానీ శ్రుతౌ సతి

పురాణములలో నరకముల పేర్లు అనేక విధములుగా కన్పించుచున్నవి. అవి జీవులకు చాల క్లేశమును కలిగించును. చాలా భయంకరమైనవి. చాలా ఘోరమైనవి. చాలా నీచమైనవి కూడ. అట్టి నరకకుండములు ఎనుబది యారు, వేదములలో ప్రసిద్ధముగా కన్పించుచున్నవి.

వహ్నికుండం తప్త కుండం క్షమ కుండం భయానకం

విట్కుండం మూత్రకుండం చ శ్లేష్మకుండం చ దు:సహం

 గరకుండం దూషికాకుండం వసాకుండం తథైవ చ

 శుక్ర కుండమసృక్కుండం అశ్రుకుండం చ కుత్సితం

కుండం గాత్రమలానాం చ కర్ణవిట్కుండమేవచ

మజ్జాకుండం మాంసకుండం నఖ కుండం చ దుస్తరం

లోమ్నాం కుండం కేశకుండం అస్థికుండం చ దు:ఖదం

 తామ్రకుండం లౌహకుండం ప్రతస్తం క్లేశదం మహత్

 తీక్ష్ణకంటక కుండం చ విషకుండం చ విఘ్నదం

ధర్మకుండం తప్తసురాకుండం చాఽపి ప్రకీర్తితం

 అవి వహ్నికుండము, తప్తకుండము, భయంకరమైన క్షమ కుండము, మలకుండము, మూత్రకుండము, సహించరానీ శ్లేష్మకుండము. గరళకుండము, దూషికాకుండము, వసాకుండము, శుక్రకుండము, రక్తకుండము, అశ్రుకుండము, శరీరమలున్నకుండము, చెవిలోని మలమున్న కుండము, మజ్ఞకుండము, మాంసకుండము, నఖకుండము, రోమకుండము, కేశకుండము, ఆస్థికుండము, చాలామేడిగామండి భయంకరమైన తామకుండము, లోహకుండము, వాడియైన ముళుకలకుండము, విషకుండము, ధర్మకుండము, మిక్కిలి మరుగుతున్న సురాకుండము అనునవి.

 ప్రతప్త తైలకుండం చ దంతకుండం చ దురహం

 కృమికుండం పూయకుండం సర్పకుండం దురంతకం

మశకుండం దంశకుండం భీమం గరళ కుండకం

కుండం చ వజ్రదంష్ట్రాణాం వృశ్చికానాం చ సువ్రతే

 శరకుండం శూలకుండం ఖడ్గకుండం చ భీషణం

 గోళకుండం నక్రకుండం కాకకుండం శుచాస్పదం

సంచాలకుండం, వాజకుండం బంధకుండం సుదుస్తరం

 తప్తపాషాణకుండం చ శిక్షపాషాణ కుండకం

లాలాకుండమపి కుండం చూర్లకుండం సుదారుణం

 చక్రకుండం వజ్రకుండo కూర్మకుండం మహోల్బణం

 జ్వాలకుండం భస్మకుండం పూతికుండం చ సుందరి

 తస్తసూర్యమసీపత్రం క్షురధారం సుచీముఖం

గోధోముఖం వక్రముఖం గజదంశం చ గోముఖం

 కుంభీపాకం కాలసూత్రమటోదమరుంతుదం

పాంశుభోజం పాతవేష్టం శూలప్రోతం ప్రకంపనం

 ఉల్కాముఖమంధముఖం. వేధనం దండడనం

బాలబంధం దేహచూర్ణం దళనం శోషణం కరం

సర్వజ్వాలాముఖం జిహ్మధూమాంధం నాగవేష్టనం

కుండాన్యేతాని సావిత్రి పాపినాం క్లేశదానీ చ

ఇంకను ప్రతప్త శైలకుండము, దంతకుండము, కృమి కుండము, పూయకుండము, సర్పకుండము, మశకకుండము. దంకుండము, గరళకుండము, వజ్రదంష్ట్రకుండము, వృశ్చిక కుండము, శరకుండము, శూలకుండము, ఖడ్గకుండము, గోళకుండము, సక్రకుండము, కాకకుండము, సంచాలకుండము, వాజకుండము, బంధకుండము, తప్తపాషాణకుండము, తీక్షపాషాణకుండము, లాభాకుండము, అసికుండము, చూర్ణకుండము, చక్రతుండము, వఱకుండము, కూర్మకుండము, జ్వాలాకుండము, భస్మకుండము, చెప్తసూర్యకుండము, అసిపత్రకుండము, క్షురధాగకుండము, షూచీముఖ కుండము, గోధోముఖకుండము, సక్రముఖకుండము, గజదంశకుండము, గోముఖకుండము, కుంభీపాకకుండము, కాలసూత్రకుండము, ఆటోదకుండము, అరుంతుదకుండము, పాంశుభోజకుండము, పాశవేష్టకుండము, శూలప్రోతకుండము, ప్రకంపన కుండము, ఉల్కాముఖ కుండము, ఆంధముఖకుండము, వేధనకుండము, దండతాడనకుండము, జాలాబంధకుండము, దేహచూర్ణకుండము, దళనశోషణకుండము, సర్పజాలాముఖ కుండము, జిహ్మకుండము, ధూమాంధకుండము, నాగవేష్టన కుండము, అసునవి నరకములో వివిధములైనవి.

ఓసావిత్ర! ఈ నరకములన్నీ పాపాత్ములకు ఆధికమైన దుఃఖముమ కలిగించును.

నియుక్తైః కింకరగణైః రక్షితాని చ సంతతం

దండ హస్తైః శూల హస్తైః పాళహస్తైః భయకరై;

 శక్తిహస్తైఃగదా హస్తైర్మద మతైశ్చ దారుణైః

 తమోయుక్తైః దయాహీనై: దుర్నివార్యం చ సర్వతః

తేజస్విభిశ్చ ని:శంకైః తామ్ర పింగళలోచనైః

 యోగయుక్తైః సిద్ధయోగైః నానారూపధరైర్వరై:

ఆసన్న మృత్యుభిర్ద్రుష్టై: పాపిభిః సర్వజీవిభి:

స్వ కర్మ నిరతై: శైవై: శాక్తై: పౌరైశ్చ గాణపైః

అదృష్టైః పుణ్యకృద్భిశ్చ సిద్ధయోగిభిరేవచ

స్వధర్మ నిరతైర్వాఽపి వీరతైర్వా స్వతంత్రకై:

 బలవద్భిశ్చ నీ:శంకై: స్వప్న దృష్టైశ్స్చ వైష్ణవైః

పై నరకములనన్నిటినీ దండము, శూలము, పాశము, శక్తి, గద కలిగినవారు, మదము కలవారు, భయంకరులు, తమోగుణము కలవారు, దయలేని వారగు. కింకరులు కాపాడుచున్నారు. పోరు. తేజసమాయుక్తులు. వారి కండ్లు రాగివలె పింగళవర్ణమున నుండును. పాపము చేసికొన్న సమస్త జీవులకు మృత్యువాసన్నమైనప్పుడు వారు కన్పింతురు. తమతమ ధర్మములను చారించుకొనుచున్న శైవులు, శాక్తేయులు, సూర్యభక్తులు, గణపతి భక్తులకు పుణ్యము చేసికొన్న వారికి, సిద్ధయోగులకు వారెన్నడు కన్పించరు. అట్లే తమ తమ ధర్మములను చక్కగా ఆచరించుచు తమ ఇష్టదేవతను స్వప్నమందైనను సందర్శించిన వైష్ణవులకు యమకింకరులెన్నడు కన్పించరు.

 ఏతత్తే కథితం సాద్వి కుండ సంఖ్యా నిరూపణం

యేషాం నీవాసో యత్కుండే నిబోధ కథయామి తే

ఓ సావిత్రి! నీకు నరక కుండములెన్ని కలవో వాటి పేర్లేమిటో కూడా తెలిపితిని. ఇప్పుడు ఆయా నరక కుండములందు నివసించువారిని గూర్చి వివరింతును. జాగ్రత్తగా వినుమని యమధర్మరాజు సావిత్రితో పలికెను.

 ఇతి శ్రీ బ్రహ్మ వైవర్తే మహాపురాణే నారద నారాయణ సంవాదే ద్వితీయే ప్రకృతిఖండే సావిత్ర్యుపాఖ్యానే యమసావిత్రీ సంవాదే సరకకుండ సంఖ్యానం నామ ఏకోనత్రింశోఽధ్యాయః

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున సావిత్రి ఉపాఖ్యానమున కనిపించు యమధర్మరాజు సావిత్రీ సంవాదమున నరకములోని కుండ సంఖ్యను వివరించు ఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.