బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

25 - సావిత్రి యముని ప్రశ్నించుట

శ్రీనారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-

యమస్య వచనం శ్రుత్వా సావిత్రీ చ పతివ్రతా

తుష్టావ పరయా భక్త్యా తమువాచ మనస్వినీ

యముని మాటలు విని పతివ్రతయగు సావిత్రి యమధర్మరాజును అధికమైన భక్తిచే స్తుతించి ఇట్లనెను.

సావిత్ర్యువాచ- సావిత్రి ఇట్లు అనెను-

కిం కర్మ వా ధర్మరాజు శుభం కిం వాఽశుభం నృణాం

కర్మ నిర్మూలయంత్యేవ కేన వా సాధవో జనాః

కర్మణాం బీజరూపః కః కోవా కర్మఫల ప్రదః

 కిం కర్మ తద్భవేత్కేన కో వా తద్దేతురేవ చ

 కో వా కర్మ ఫలం భుం క్తే కోవా నిర్లిప్త ఏవచ

 కో వా దేహీ కశ్చ దేహః కోవా వై కర్మకారకః

కిం విజ్ఞానం మనోబుద్దీ: కేవా ప్రాణాః శరీరిణాం

 కానీంద్రియాణి కిం తేషాం లక్షణం దేవతాశ్చ కాః

  భోక్తా భోజయితా కోవా కో భోగః కాచ నిష్కృతిః

 కో జీవ: పరమాత్మా కస్తన్మే వ్యాఖ్యాతుమర్హసి

యమధర్మరాజా! కర్మయనునదెట్లుండును? శుభాశుభకర్మలే విధముగానుండును. సాధుపురుషులు ఏవిధముగా కర్మను నిర్మూలించుచున్నారు. కర్మలకు బీజరూపమైనది ఏది? కర్మఫలితమునిచ్చువాడెవడు? కర్మ ఫలమనుభవించువాడెవడు? నిర్లిపుడుగా ఎవరుంధరు? కర్మఫలమనుభవించువాడెవడు? నిర్లిప్తుడుగా ఎవరుందురు? దేహము, దేహి, కర్మచేయువాడు ఎవరు? విజ్ఞానము, మనస్సు, బుద్ది ప్రాణములు ఇంద్రియములు, దేవతలు భోక్త, భోజయిత, భోగము, నీష్కృతి అనగా ఏవిధముగా నుండును. జీవుడు పరమాత్మ ఎట్లుందురు? ఈ విషయములనన్నిటిని నాకు వివరించి తెల్పుమని సావిత్రి ఆడిగెను.

యమ ఉవాచ- యమ ధర్మరాజు ఇట్లనెను-

వేదేన విహితం కర్మ తన్మయే మంగళం . పరం

 అవైదికం తు యత్కర్మ తదేవాశుభమేవచ

అహైతుకీ విష్ణుసేవా సంకల్పరహితా సతాం

 కర్మ నిర్మూలనాత్మా వై సా చైవ హరిభక్తిదా

 హరిభక్తో నరో యశ్చ సచ ముక్తః శ్రుతౌ శ్రుతం

 జన్మమృత్యు జరావ్యాధి శోక భీతి వివర్జితః

 ముక్తిశ్చ ద్వీవిధా సాధ్వి శ్రుత్యుక్త సర్వసమ్మతా

 నిర్వాణపదదాత్రీ చ హరిభక్తిప్రదా నృణాం

హరిభక్తి స్వరూపాం చ ముక్తిం వాంఛంతి వైష్ణవాః

 అన్యే నిర్వాణ రూపాం చ ముక్తి మిచ్ఛంతి సాధనః

వేదములందు విధించబడిన కర్మ మంగళ ప్రదమైనది. అట్లే వేదవిరుద్ధమైన. కర్మ అమంగళకరము. సజ్జనులు సంకల్పరహితము, కారణము లేక చేయు విష్ణు సేవను కోరుకొందురు. అట్టి శ్రీహరిసేవ కర్మఫలితములను సంపూర్ణముగా నిర్మూలించును. అందువలన శ్రీహరీ భక్తి కలుగును, హరి భక్తుడైన మానవుడే ముక్తుడని వేదములందు తెలుపబడినది. అతనికి పుట్టుక, చావు, ముసలితనము, రోగములవలన కలుగు దు:ఖము మొదలగునవి కలుగవు.

వేదములలో ముక్తి రెండు విధములుగా పేర్కొనబడినది. ఒకటి నిర్వాణ మార్గమును చూపించగా రెండవది శ్రీహరి భక్తిని కలిగించును. వైష్ణవులు శ్రీహరి భక్తి స్వరూపమైన ముక్తిని మాత్రమే కోరెదరు. ఇతర సజ్జనులు నిర్వాణరూపమైన ముక్తిని ఆభిలషింతురు.

కర్మణో బీజ రూపశ్చ సంతతం. తత్ఫల ప్రదః

కర్మ రూపశ్చ భగవాన్ శ్రీకృష్ణ ప్రకృతేః పరః

 సోఽసి తద్ధేతు రూపశ్చ కర్మ తేన భవేత్సతి

 జీవః కర్మఫలం భుంక్తే ఆత్మా నిర్లిప్త ఏవచ

 ఆత్మనః ప్రతిబింబిం చ దేహీ జీవః స ఏవచ

 పాంచభౌతికరూపశ్చ దేహో నశ్వర ఏవచ

 పృధివీవాయురాకాశో జలం తేజస్తథైవ చ

 ఏతాని సూత్రరూపాణి సృష్టిః సృష్టివిదౌ హరేః

 కర్తా భోక్తా చ దేహీ చ స్వాత్మా భోజయితా సదా

 భోగో విభవ భేదశ్చ నిష్కృతిర్ముక్తి రేవ చ

సదసద్భేద బీజం చ జ్ఞానం నానావిధం భవేత్

 విషయాణాం విభాగానాం భేదబీజం చ కీర్తితం

 బుద్ధిర్వివేచనా రూపా జ్ఞాన సందీపినీ శ్రుతౌ

వాయుభేదాశ్చ వై ప్రాణః బలరూపాశ్చ దేహినాం

కర్మల కన్నిటికి మూలభూతుడు, కర్మ స్వరూపి, కర్మ ఫలితములనిచ్చువాడు ప్రకృతి కంటే భిన్నడైనవాడు శ్రీకృష్ణుడు. అతడే కర్మకారకుడు. కర్మ ఫలితమును జీపుడు అనుభవించుచున్నాడు. ఆత్మ విగ్రీష్టమైనది. దాని ప్రతిబింబమే- దేహి లేక జీవుడు. శరీరము, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశమను పంచ భూతములచే నిండినది. ఇది ఆశాశ్వతమైనది. శ్రీహరి లోకముల సృష్టింపదలచినప్పుడు ఈ పంచభూతములు సృష్టికి కారణమైనవిదేహి రూపి యగు జీవుడు కర్త మరియు  కర్మఫలములనమభవించుచున్నాడు. ఆ ఆత్మయే భోజయిత (కర్మఫలములననుభవపజేయునదిసుఖ దుఃఖప్పరూపమైన వీభవమునకు మారుపేరే భోగము, విష్కృతి యనగా ముక్తియే.

మంచి చెడుల యొక్క విచక్షణకు కారణమైన జ్ఞానము అనేక ప్రకారములుగా -మన్నది. ఘటము, పటము ఇత్యాది విషయములయొక్క జ్ఞానమే జ్ఞాన భేదముగా పేర్కొనబడుచున్నది. వివేకమును కలిగించు బుద్ధియే జ్ఞానసందీపివి యని వేదములలో పేర్కొనబడినది. జీవుల శరీరములలో ఉండే ప్రాణములు ప్రాణాపాన వ్యావోదాన సమానమను పేర్లుగల పాయువులే. ఇవి బలరూపమైనవి.

ఇంద్రియానాం వై ప్రవరం ఈశ్వరాణాం సమూహకం

ప్రేరకం కర్మణాం చైవ దుర్నివార్యం చ దేహినాం

ఆవిరూప్యమదృశ్యం చ జ్ఞానభేదం మనః స్మృతం

 లోచనం శ్రవణం ఘ్రాణం త్వగ్జిహ్వదికమింద్రింయం

ఆంగినామంగరూపం చ ప్రేరకం సర్వ కర్మణాం

 రీపురూపం మిత్రరూపం సుఖదం దుఃఖదం సదా

జీవులు చేయు కర్మలను ప్రేరేపించునది, నివారింపలేనిది, ఇంద్రియములలో మైనది మనస్సు. ఇది ఇదమిత్థముగా విరసించుటకు వీలుకానిది. కంటికి కనిపించనిది. అట్లే కళ్ళు, చెవులు, ముక్కు, త్వగింద్రియము నాలుక మొదలగు జ్ఞాన కర్మేంద్రియములు కలవు. ఇవి జీవులకు ఆవయవరూపముగానుండి సమస్త కర్మలు చేయుటకు ప్రేరణనిచ్చుచున్నవి. ఇవి జీవునకు స్నేహితునివలె మఖమువీచ్చును. శత్రువువలె దుఃఖమును కూడ కలిగించును.

సూర్యోవాయుశ్చ పృథివీ వాణ్యాద్యా దేవతా: స్మృతాః

 ప్రాణ దేహాదీభృద్యోహి స జీవః పరికీర్తితః

పరమాత్మా పరం బ్రహ్మ నిర్గుణః ప్రకృతేః పరః

 కారణం కారణానాం చ శ్రీకృష్ణో భగవాన్ స్వయం

 ఇత్యేవం కథితం సర్వం మయా సృష్టం యథాగమం

జ్ఞానాం జ్ఞానరూపం చ గచ్ఛ వత్సే యథాసుఖం

సూర్యుడు, వాయువు, పృథివి, సరస్వతి మొదలగువారు దేవతలు. ప్రాణములను దేహమును కలిగినవాడే దేహి లేక జీవుడు. పరమాత్మ, పరబ్రహ్మ, విర్గుణుడు, ప్రకృతి కంటే భిన్నమైనవాడు, సృష్టికర్తలను సృష్టించువాడు శ్రీకృష్ణభగవామడు మాత్రమే..

ఓ సావిత్రీ! నీవు అడిగిన సందేహములకన్నిటికి సమాధానమును శాస్త్రబద్దముగా తెల్పినాను. అందువలన నీవు సుఖముగా నీ ఇంటికి తరలిపొమ్మని యమధర్మరాజు పలికెను.

సావిత్ర్యువాచ- సావిత్రి ఇట్లు పలికెను-

త్యక్త్యా క్వ యామి కాంతం వా త్వాం వా జ్ఞానార్ణవం బుధం

 ప్రశ్నం యద్యత్కరోమి త్వాం తద్భవాన్ వక్తుమర్హతి

  కాం కాం యోనిం యాతి జీవః కర్మణా కేన వా యమ

కేన వా కర్మణా స్వర్గం కేన వా వరకం పిత;

 కేన వా కర్మణా ముక్తి  కేన  భక్తిః  భవేత్  హరేః

 కేన వా కర్మణా రోగీ చారోగీ కేన కర్మణా

 కేన వా దీర్ఘ జీవీ చ కేనల్పాయుశ్చ కర్మణా 

 కేన వా కర్మణా దుఃఖీ కేన వా కర్మణా సుఖీ

అంగహీనశ్చ కాణశ్చ బధిర: కేన కర్మణా

 ఆంధో వా కృపణో వాఽపి ప్రమత్తః కేన కర్మణా

క్షిప్తొఽతిలుబ్ధశ్చైవ   వ   నరఘాతకః

కేన సిద్దిమవాప్నోతి సాలోక్యాది చతుష్టయం

 కేన వా బ్రాహ్మణత్వం చ తపస్విత్వం చ కేన వా

 స్వర్గబోగాదీకం కేన వైకుంఠం కేన కర్మణా

వైకుంఠం కేన పో బ్రహ్మన్ సర్వోత్కృష్టం నిరామయం

 సరకం వా కతివిధం కిం సంఖ్యం  నామ కిం తథా

కోకా కం నరకం యాతి కియంతం తేషు తిష్ఠతి

పాపినాం  కర్మణా కేన కోవా వ్యాధిః ప్రజాయతే

యద్యస్తి చ మయావృష్టం తన్మే వ్యాఖ్యాతు మర్హసి

ఓ యమధర్మరాజా ! నా భర్తను వదలి జ్ఞానసాగరుడవైన నిన్ను వదలిపెట్టి నేను ఎక్కడికి పోదును. అందువలన నేనడిగిన ప్రశ్నలకన్నిటికి సరియైన సమాధానములను మీరు చెప్పవలెను.

ఏయే కర్మలు చేసి ఏయే జన్మలు జీవుడిత్తును. ఓతండ్రి ఎట్టి కర్మ చేసిన స్వర్గమును లేక నరకమును జీవుడు పొందును. ఎట్టి కర్మలు చేసిన ముక్తి లేక శ్రీహరి వదపంకజములపై భక్తి కలుగును. ఎట్టి కర్మలాచరించిన జీవి రోగిగనో ఆరోగ్యవంతుడుగనో జీవించుచున్నాడు. ఏ కర్మలవలన జీవి దీర్ఘజీవిగనో అల్పాయుష్కుడుగనో దుఃఖవంతుడుగనో, సుఖవంతుడుగానో చెవిటి, గుడి మొదలగు అవయవహీనుడుగనో, మిక్కిలి పిసినారిగనో, హంతకుడుగనో అగుచున్నాడు. అట్లే ఏ కర్మలవలన మానవుడు సాలోక్యాది చతుర్విధముక్తులను స్వర్గలోక భోగములను, జరావ్యాధిరహితమైన వైకుంఠమును పొందుచున్నాడు.

నరకములు ఎన్ని విధములుగా నున్నవి. వాటి పేర్లేమి? ఎవరు ఎట్టి నరకమును పొందుదురు? అచ్చట ఎంతకాలముందురు? ఎట్టి పాపకర్మవలన ఎట్టి వ్యాధులు పుట్టుచున్నవి? మొదలగు విషయములనన్నిటిని నాకు వివరించి చెప్పుడు.

ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదే కర్మవిపాకి యమోక్ష్యంతరం సావిత్రి ప్రశ్నో నామ పంచవింశోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున రెండవదైవ ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాద సమయమున తెల్పబడిన కర్మ విపాకమున యముని మాటల తరువాత సావిత్రి వేసిన ప్రశ్నలనే ఇరువది యైదవ అధ్యాయము సమాప్తము.