బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

21 -  సాలగ్రామ వివరణ

నారద ఉవాచ - నారదుడు నారాయణునితోనిట్లనెను-

 నారాయణశ్చ భగవాన్ వీర్యాధానం చకార హ

 తులస్యాం కేన రూపేణ తన్మే వ్యాఖ్యాతుమర్హసి

భగవంతుడగు నారాయణుడుతులసీదేవితో ఎట్లు సంగమించెనో ఆవృత్తాంతమునంతయు నాకు వివరముగా తెల్పగలరు.

నారాయణ ఉవాచ- సారాయణుడు నారదునితోనిట్లు పలికెను

నారాయణశ్చ భగవాన్ దేవానాం సాధనేన చ

 శంఖచూడస్య రూపేణ రేమే తద్రమయా సహ

 శంఖ చూడస్య కవచం గృహీత్వా మాయయా హరిః

 పునర్విధాయ తద్రూపం జగామ తులసీగృహం

దుందుభిం పాదయామాస తులసీ ద్వారసన్నిధౌ

 జయశబ్దరవద్వారా బోధయామాస సుందరీం

తచ్చ్రుత్వా సా చ సాద్వీచ పరమానందసంయుతా

 రాజమార్గ గవాక్షేణ దదర్శ పరమాదరాత్

బ్రాహ్మణేభ్యో ధనం దత్వా కారయామాస మంగళం

బందిభ్యో భిక్షుకేభ్యశ్చ వాచికేభ్యో ధనం దదౌ

 ఆవరుహ్య రథాద్దేవో దేవ్యాశ్చ భవనం యయౌ

అమూల్య రత్న సంక్లుప్తం సుందరం సుమనోహరం

నారాయణుడు దేవతాకార్యమును సాధించుటకై శంఖచూడుని వేషమును ధరించి తులసీదేవి గృహమును చేరెను. ఆమె ఇంటిముందు దుందుభీ వాద్యమును మ్రోగించుచు జయ శబ్దముతో తులసీదేవిని పిలిచెను. ఆప్పుడు శంఖచూడునివేషమున నున్న నారాయణుడు పలికిన జయ శబ్దమును విని తులసి తన భర్త దేవతలతోడి యుద్ధమున విజయము సాధించేనని భావించి మిక్కిలి ఆనందముతో ఆతనిని గవాక్షమునుండి (కిటికీ) చూచినదీ, వెంటనే తులసీ ఆధీక సంతోషముతో బ్రాహ్మణులకు దానములు చేసినది. అట్లే కారాగారబద్ధులకు, బిచ్చగాండ్రకు దానములు చేసినది.

అప్పుడు శంఖచూడవేషధారి యగు నారాయణుడు రథమునుండి కిందికి దిగి తులసీదేవి భవనములోనికి వె ళ్ళెను.

దృష్ట్యా చ పురతః కాంతం శాంతం కాంతా ముదాన్వితా

 తత్పాదం క్షాళయామాస ననేమ చ రురోద చ

రత్నసింహాసనే రమ్యే వాసయామాస కాముకీ

తాంబూలం చ దదౌ తస్మై కర్పూరాదీ సువాసితం

ఆద్య మే సఫలం జన్మ హ్యద్యమే సఫలాః క్రియాః

 రణాగతం చ ప్రాణేశం పశ్యంత్యాశ్చ పునర్గృహే

సస్మితా సకటాక్షం చ సకామా పులకాంచీతా

 పప్రచ్చ రణవృత్తాంతం కాంతం మధురయా గిరా

తులసీదేవి తనకేదురుగా నిలబడియున్న భర్తను (శ్రీహరిని) చూచి సంతోషముతో ఆతని కాళ్ళు కడిగి నమస్కరించి అతనిని రత్నసింహాసనమున కూర్చుండబెట్టెను. తరుపోత అతనికి కర్పూరాదీ సువాసన ద్రవ్యములచే సువాసితమై యున్న తాంబూలమునిచ్చి నా భర్త రణరంగమునుండి క్షేమముగా ఇల్లు చేరినందువలన, నా జన్మసఫలమైనది. నేను చేసిన పుణ్యకార్యములన్ని సఫలమైనవి అని తులసి పలికి రణరంగమున జరిగిన విషయములనన్నిటిని వివరింపుడని మధురమైన మాటలతో పలికినది.

 తులస్యువాచ- తులసీదేవి ఇట్లనెను

అసంఖ్య విశ్వసంహర్త్రా సార్థమాజౌ తవప్రభో

 కథం బభూవ విజయస్తన్మే బ్రూహి కృపానిధే

తులసీ వచనం శ్రుత్వా ప్రహస్య కమలాపతిః

శంఖచూడస్య రూపేణ తామువాచానృతం వచః

ఓ ప్రభూ అసంఖ్యాకమైన విశ్వములనన్నిటిని సంహరించు పరమేశ్వరునితో నీవేవిధముగా యుద్ధము చేసితివి. ఆయుద్దమున నీకు విజయమెట్లు లభించినది అని తులసి అడుగగా శంఖచూడుని రూపుననున్న నారాయణుడామెతో ఇట్లనెను.

శ్రీహరిరువాచ- శంఖచూడుని వేషముననున్న శ్రీహరి ఇట్లు పలికెను

ఆనయోః సమరం కాంతే పూర్ణమబ్దం బభూవ హ

నాశో బభూవ సర్వేషాం దానవానాం చ కామిని

  ప్రీతించ కారయామాస బ్రహ్మాచ స్వయమావయోః

 దేవానామధికారశ్చ ప్రదత్తో బ్రహ్మణా పురా

మయాఽగతం స్వభవనం శివలోకం శివోగతః

ఇత్యుక్త్వా జగతాం నాథ: శయనం చ చకారహ

 రేమే రమాపతిస్తత్ర రామాయా సహా నారద

సా సాధ్వీ సుఖ సంభోగాదాకర్షణ వ్యతిక్రమాత్

సర్వం వితర్కయామాస కస్త్వమేవేత్యువాచ హ

ఓ తులసీ నాకు వరమశివునకు మధ్య ఒక సంవత్సరకాలము యుద్ధము సాగినది. చివరకు ఆయుద్ధములో రాక్షసులందరు చనిపోయిరి. అప్పుడు బ్రహ్మదేవుడు మా ఇద్దరి మధ్య సంధిని చేసెను. దాని ప్రకారము దేవతల రాజ్యము దేవతల కీయబడినది. నేను ఇచ్చటికి రాగా శివుడు శివలోకమునకు పోయెను” అని పలికి శంఖచూడుని రూపమున నున్న శ్రీహరి శయ్యపై పరుండి తులసితో సంభోగమొనర్చెను. కాని సాధియగు తులసి సుఖసంభోగమున జరిగిన వ్యతిక్రమమువలన ఆతనిని శంకించి నీవెవ్వరవని శంఖచూడుని రూపమున నున్న ఆతనినడిగెను.

 తులస్యువాచ- తులసీదేవీ ఈవిధముగా శ్రీహరితో అనెను

కో వా త్వం వద మాయేశో భుక్తాఽహం మాయయా త్వయా

 దూరీకృతం మత్సతీత్వమథవా త్వాం శపామ్యహం

 తులసీ వచనం శ్రుత్వా హరిః శాపభయేన చ

  దధార లీలయా బ్రహ్మన్ స్వాం మూర్తీం సుమనోహరం

 దదర్శపురతో దేవీ దేవదేవం సనాతనం

 నవీన నీరదశ్యామం శరత్సంకజ, లోచనం

కోటి కందర్ప లీలాభం రత్నభూషణ భూషితం

 ఈషద్దాస్యం ప్రసన్నాస్యం శోభితం పీతవాససా

 తం దృష్ట్యా కామినీ కామాత్ మూర్ఛాం సంప్రాప లీలయా

 పునశ్చ చేతనాం ప్రాప్య పునః సా తమువాచ హ

 హే నాథ తే దయా నాస్తి పాషాణ సదృశస్య చ

 ఛలేన ధర్మ భంగేన మమ స్వామీ త్వయా హతః

పాషాణ సదృశస్త్యం చ దయాహీనో యతః ప్రభో

తస్మా త్పాషాణ రూపస్త్యం భువి దేవ భవాఽధునా

యే వదంతి దయాసింధుం త్వాం తే భ్రాంతి న సంశయః

భక్తో, వినాఽపరాధీన పరార్ధే చ కథం హతః

దుర్వృతస్యం చ సర్వజ్ఞో న జానాసి పరవ్యధాం

 అతస్త్యమేక జనుషి స్వమేవ విస్మరిష్యసి

మాయావియగు నీవెవరవు? నన్ను మోసము చేసి అనుభవించితివి. నా పాతివ్రత్యమును మంటగలిపితివి. ఇన్ని మాటలెందులకు, నిన్ను ఇప్పుడే శపింతును అని తులసీ దేవి అనగా శ్రీహరి భయముతో అందమైన తన రూపును ధరించెను. తులసీదేవి తనకెదురుగా నిలుచున్న దేవదేవుడు, సనాతనుడు, నీలమేఘశ్యాముడు శరత్పద్మములవంటి నేత్రములు కలవాడు, కోటిమన్మథాకారుడు, రత్నభూషణములచే ఆలంకృతుడు, పీతవస్తుడు, చిరునవ్వుతో నున్న శ్రీహరిని చూచి కామిని వెంటనే మూర్ఛనొందినది. వెంటనే స్మృతికి వచ్చి తులసీదేవి శ్రీహరితో నిట్లనెను.

ఓలోకనాథ రాయివంటి నీకు దయలేదు. నీవు నాభర్తను మోసగించీ ఆధర్మ మార్గమున చంపితివి. నీవు దయాహీనుడవు. పాషాణము వంటివాడవు. అందువలన భూలోకమున పాషాణరూపుడవు కమ్ము. కొందరు ఆజ్ఞానమువలన నిన్ను కరుణాసింధువందురు. కాని నీభక్తుని తప్పులేకపోయినను ఇతరుల కొరకు ఆతనిని చంపితివి. నీవు దుర్మార్గుడవు, సర్వజ్ఞుడవైన నీవు ఇతరుల దుఃఖమును గమనింపలేదు.

ఇత్యుక్త్యా చ మహాసాధ్వీ నిపత్య చరణే హరేః

 భృశం రురోద శోకార్తా విలలాప ముహుర్మహు

తస్యాశ్చ కరుణాం దృష్ట్యా కరుణామయసాగరః

 నారాయణస్తాం బోధయితుమువాచ కమలాపతి ;

తులసీదేవి శ్రీహరితో వైవిధముగా పలికి శ్రీహరి చరణముల పై వ్రాలి చాలాకాలమేడ్చినది. దయాసాగరుడు లక్ష్మీపతియగు నారాయణుడు తులసీని ఈవిధముగా ఓదార్చేను.

శ్రీభగవానువాచ- భగవంతుడగు శ్రీహరి తులసితో ఇట్లనెను.

 తపస్త్యయా కృతం సాద్వి మదర్ధే భారతే చిరం

త్వదర్ధే శంఖచూడశ్చ చకార సుచిరం తపః

కృత్వా త్వాం కామినీం కామీ ఏజహార చ తత్ఫలాత్

 అధునా దాతుముచితం తవైవ తపసః ఫలం

 ఇదం శరీరం త్యక్త్యా చ దివ్యదేహం విధాయ చ

 రాసే మే రమయా సార్థం త్వం రమా సదృశీ భవ

ఇయం తనుర్నదీ రూపా గండకీతి చ విశ్రుతా

 పూతా సుపుణ్యదా నృణాం పుణ్యా భవతు భారతే

 తవ కేశసమూహాశ్చ పుణ్యవృక్షా భవం త్వితి

తులసీ కేశ సంభూతా తులసీతి చ విశ్రుతా

 త్రిలోకేషు చ పుష్పాణాం పత్రాణాం దేవపూజనే

 ప్రధాన రూపీ తులసీ భవిష్యతి వరాననే

 స్వర్గే మర్త్యే చ పాతాళే వైకుంఠీ మమ సన్నిధౌ

 భవంతు తులసీవృక్షా వరా: పుష్పేషు సుందరి

 గోలోకే విరజాతీరే రాసే బృందావనే భువి

 భాండీరే చంపకవనే రమ్యే చందన కాననే

మాధవీ కేతకీ కుంద మల్లికా మాలీవనే

 భవంతు తరవస్తత్ర పుష్పస్థానేషు పుణ్యదాః

 తులసీ తరుమూలే చ పుణ్య దేశే సుపుణ్యదే

అధిష్టానం తు తీర్ధానాం సర్వేషాం చ భవిష్యతి

 తత్రైవ సర్వదేవానాం సమధిష్టానమేవ చ

తులసీ పత్ర పతనం ప్రాయో యత్ర వరాననే

సస్నాతః సర్వతీర్ధేషు సర్పయజ్ఞేషు దీక్షిత:

 తులసీ పత్రతోయేన యోఽభిషేకం సమాచరేత్

సుధాఘట సహస్రేణ సా తుష్టిర్నభవేత్ హరేః

యా చ త్షుటిః భవేత్ నౄణాం తులసీపత్రదానతః

గవామయుతదానేన యత్సలం లభతే నరః

 తులసీపత్ర దానేన తత్ఫలం లభతే సతి

తులసీ పత్రతోయం చ మృత్యుకాలే చ యో లభేత్

స ముచ్యతే సర్వపాపాత్ విష్ణులోకం స గచ్ఛతి

నిత్యం యస్తులసీ తోయం భుంక్తే భక్త్యాచ యో నరః

స ఏవ జీవన్ముక్తశ్చ గంగాస్నాన ఫలం లభేత్

నిత్యం యస్తులసీం దత్వా పూజయేన్మాం చ నారద

లక్షాశ్వమేధం పుణ్యం లభతే నాత్ర సంశయః

తులసీం స్వకరే ధృత్వా దేహే ధృత్వా చ మానవః

 ప్రాణాంస్త్యజతి తీర్ధేషు విష్ణులోకం స గచ్ఛతి

తులసీకాష్ట్ర నిర్మాణమాలాం గృష్ణాతి యో నరః

పదే పదేశ్వమేధస్య లభతే నిశ్చితం ఫలం

 తులసీం స్వకరే ధృత్వా స్వీకారం యో నరక్షతి

సయాతి కాలసూత్రం చ యావదింద్రాశ్చతుర్దశ

కరోతి మిథ్యా శపథం తులస్యా యోహి మానవః

సయాతి కుంభీపాకం చ యావదింద్రాశ్చతుర్ధశ

తులసీతోయ కణీకాం మృత్యుకాలే చ యో లభేత్

రత్నయానం సమారుహ్య వైకుంఠం స ప్రయాతి చ

 పూర్ణిమాయాం అమాయాం చ ద్వాదశ్యాం రవి సంక్రమే

 తైలాభ్యంగే చాసాలే చ మధ్యాహ్నే నీశి సంధ్యయోః

 అశౌచే2శుచికాలే వా రాత్రి వా సాన్వితే నరః

 తులసీం యే చ ఛిందంతి తే ఛిందంతి హరేః శిరః

 త్రిరాత్రం తులసీ పత్రం శుద్ధం పర్యుషితం సతి

శ్రాద్ధే ప్రతే వా దానే వా ప్రతిష్టాయాం సురార్చనే

భూగతం తోయపతితం యద్దత్తం విష్ణవే సతి

 శుద్ధం తు తులసీపత్రం క్షాళనాదన్యకర్మణీ

 వృక్షాధిష్ఠాత్రీ దేవీ యా గోలోకే చ నిరామయే

కృష్ణేన సార్థం రహసి నిత్యం క్రీడాం కరిష్యతి

నద్యధిష్ఠాతృదేవీ యా భారతే చ సుపుణ్యదా

లవణోద్స్య పత్నీ చ మదంశస్య భవిష్యతి

త్వం చ స్వయం మహాసాధ్వీ వేకుంఠే మమ సన్నిధౌ

 రమా సమా చ రాసే చ భవిష్యసి న సంశయః

సాధ్వియైన ఓ తులసీదేవీ నీవు భారతఖండమున నన్ను పొందవలేనని పెక్కేండ్లు తపమాచరించితివి. శంఖచూడుడు నీకై చాలాకాలము తపస్సు చేసెను. ఆ తపః ఫలితముగానే ఆతడు నీను భార్యగా పొంది చాలాకాలము సుఖముగానుండి తన శరీరమును వరలి పెట్టెను.

అట్లే నీతపఃఫలితమును పొందుటకు నీకిప్పుడు యోగ్యత లభించినది. నీవు ఈ నీ శరీరమును వదలి దివ్యదేహము ధరించి రాసక్రీడలో లక్ష్మీదేవివలే నీవుకూడ ఆమెతో కలిసి విహరింతువు. ప్రస్తుతమున్న నీయొక్క పార్థివశరీరము నదీరూపును దాల్చి గండకీనదీగా ప్రసిద్ధమగును. అది భారత ఖండములో పవిత్రమై ఆచ్చటి జనులకు పుణ్యమును కలిగించును. నీతల వెండ్రుకలు పుణ్యవృక్షములు కాగలవు, తులసీదేవి కేశములనుండి పుట్టిన చెట్లు తులసియను పేరుతోనే ప్రఖ్యాతి వహించును.

ఈ తులసి, దేవతార్చనమున పత్ర, పుష్పములలో ప్రధానస్థానమాక్రమించును. ముల్లోకములలోను, నాలోకములోను నాసమీపమున నున్న పుష్పములలో ఇవీ శ్రేష్టములగును. గోలోకమున, విరజానదీతీరమున, రాసప్రదేశమున, మాధవి, కేతకి, కుంద, మల్లికా పుష్పములు గల మాలతీవనమున, పుష్పములుండు స్థలములో తులసీవృక్షములు పుణ్యప్రదములు కాగలవు, పుణ్యప్రదమైన తులసీ వృక్షము క్రింద సమస్త తీర్థములు సమస్త దేవతలు నివసింతురు. తులసీపత్రములు పడిన స్థలము కూడ మిక్కిలి పవిత్రమైనది. తులసీ పత్రములున్న నీటితో ఎవరు స్నానము చేయుదురో వారు సమస్త తీర్థస్నాన ఫలితమును పొందుదురు. అట్లే సమస్త యజ్ఞములు చేసిన ఫలితమును ఆనుభవింతురు. అట్లే తులసీ పత్రములు శ్రీహరికి సమర్పించినచో వేయి ఆమత కలశములను అతనికి సమర్పించిన దానికన్న మిన్నగా శ్రీమస్నోరాయణుడు సంతోషపడును. అట్లే లక్షల కొలది గోవులు దానము చేసిన ఫలమునతడు పొందును.

చనిపోవునప్పుడు తులసీ తీర్థమిచ్చినచో మృతిచెందిన వ్యక్తి తాను పాపములనన్నీటిని పోగొట్టుకొనీ విష్ణులోకమునకు వెళ్ళును. ప్రతిదినము తులసీ తీర్థమును భక్తితో త్రాగు మానవుడు. జీవన్ముక్తుడగును పైగా అతనికి గంగానదిలో స్నానము చేసిన ఫలము లభించగలదు.

 ప్రతిదినము నన్ను తులసీదళములతో పూజించినచో లక్ష అశ్వమేధయాగములు చేసిన ఫలితమును పొందును. తులసీ దళమును తనచేతిలో పట్టుకొని లేక శరీరమున ధరించి పుణ్యతీర్థమున చనిపోయిన వాడు వైకుంఠమును చేరును. తులసిమాలనుధరించినవానికి అనేక అశ్వమేధయాగములు చేసిన ఫలితము లభించును.

   తులసీపత్రమును చేతితో తాకి దానిని తిరస్కరించువాడు సూర్యచంద్రులున్నంతవరకు నరకమున ఉండును. అట్లే తులసీపత్రమును తాకి తప్పుడు ప్రమాణమును చేసినచో అతడు పదునలుగురు దేవేంద్రులు గతించువరకు కుంభీపాకనరకమున నివసించును.

 పూర్ణిమనాడు, అమావొస్యనాడు, ద్వాదశినాడు, సూర్య సంక్రమణకాలమున, తైలాభ్యంగనముచేయు సమయమున, స్నానము చేయక, మధ్యాహ్నమున, రాత్రికాలమున, సాయంప్రాతస్సంధ్యాకాలములలో అశుచిగానున్నప్పుడు జాతాశౌచ, మృతాశాచ కొలములలో రాత్రి కట్టుకున్న వస్త్రములను ధరించియున్నప్పుడు తులసీ దళమును తెంపినచో శ్రీహరి శిరస్సును ఛేదించిన పాపము లభించును.

శ్రాద్ధకాలమున, వ్రతములనుష్ఠించు సమయమున, దానము చేయునప్పుడు, దేవప్రతిష్టాకాలమున, దేవతార్చన కాలమున ఉపయోగించిన తులసీదళము మూడు దీనములవరకు పవిత్రమైయుండును. భూమిపై పడినను విష్ణువునకు సమర్పితమైన తులసీదళమును కడిగినచో పరిశుద్ధమై ఇతర కార్యముల యందుపయోగమునకు వచ్చును. వృక్షమునకు అధిష్టాన దేవతయగు తులసి గోలోకమున శ్రీకృష్ణునితో ప్రతిదినము రహస్యక్రీడలు సాగించును. గండకీనదికి ఆధిష్టాన దేవతగా నున్న తులసి భారతదేశమున జనులందరకు పుణ్యప్రదమై నా అంశస్వరూపుడైన సముద్రునకు భార్య కాగలదు.

స్త్రీ రూపమున నున్న నీవు వైకుంఠమున నా సన్నిధిలో లక్ష్మీదేవితో సమానమై మెలగగలవు.

 అహం చ శైలరూపీ చ గండకీ తీర సన్నిధౌ

అధిష్టానం కరిష్యామి భారతే తవ శాపతః

  వజ్రకీటాశ్చ కృమయో నజ్రదంష్ట్రాశ్చ తత్రవై

 తచ్ఛిలాకుహరే చక్రం కరిష్యంతి మదీయకం

ఓ తులసీ! నేను నీయొక్క శాపముననుసరించి భారత దేశమందలి గండకీనదీ తీరమున శిలారూపముతోనుందును. వజ్రములవంటి పండ్లు గల వఱకీటకములు వజ్రక్రిములు ఆ శిలలో చక్రమువంటి రంధ్రములను చేయును.

ఏకద్వారే చతుశ్చక్రం వనమాలా విభూషితం

 నవీన నీరద శ్యామం లక్ష్మీనారాయణాభిధం

గండకీనదీ తీరమందు లభించు శిలలలో ఒకే రంధ్రముండి అందు నాలుగు చక్రములుండి వనమాలా విభూషితమై నల్లని రంగులో లభించు సాలగ్రామ శిల లక్ష్మీనారాయణము.

ఏకద్వారే చతుశ్చక్రం నవీన నీరదోషమం

లక్ష్మీజనార్థనం జ్ఞేయం రహితం వనమాలయా

ఒకే రంధ్రమున నాలుగు చక్రములుండి వనమాల లేని నల్లని శిలను లక్ష్మీ జనార్దనమందురు.

ద్వారద్వయే చతుశ్చక్రం గోష్పదేన సమన్వితం

 రఘునాథాభిధం జ్ఞేయం రహితం వనమాలయా

రెండు రంధ్రములలో నాల్గు చక్రములు, గోష్పాదముండి వనమాల లేనిచో ఆ శిలను రఘునాథ సాలగ్రామముగా పేర్కొందురు.

 అతిక్షుద్రం ద్విచక్రం చ నవీన జలద ప్రభం

దధివామనాభిధం జ్ఞేయం గృహిణాం చ సుఖ ప్రదం

రెండు చక్రములుండి నల్లగా, మిక్కిలి చిన్నగానుండు సాలగ్రామమును దధివామనమని అందురు. ఆ సాలగ్రామమునారాధించినచో గృహస్థులకు మేలు చేకూరును.

 అతిక్షుద్రం ద్విచక్రం చ వనమాలా విభూషితం

విజ్ఞేయం శ్రీధరం దేవం శ్రీప్రదం గృహిణాం సదా

రెండు చక్రములు వనమాల కలిగియున్న చిన్న సాలగ్రామమును శ్రీధరమని అందురు. అదికూడ గృహస్థులకు శుభమును కలిగించుచున్నది.

స్థూలం చ వర్తులాకారం రహితం వనమాలయా

 ద్విచక్రం స్ఫుటమత్యంతం జ్ఞేయం దామోదరాభిధం

గుండ్రముగా లావుగానుండి వనమాల లేక రెండు చక్రములు స్పష్టముగా కనిపించు సాలగ్రామమును దామోదరమందురు.

మధ్యమం వర్తులాకారం ద్వీచక్రం బాణ విక్షతం

 రణరామాభిధం జ్ఞేయం శరతూణ సమన్వితం

గుండ్రముగా, బాణవిద్ధమై రెండు చక్రములుండి మరీ చిన్నగా, మరీ లావుగా కొక మధ్య రీతిలోనుండి అమ్ములపొది ఉన్న సాలగ్రామమును రణరామమని. పిల్చేదరు.

మధ్యమం సప్తచక్రం చ ఛత్ర తూణసమన్వితం

 రాజరాజేశ్వరం శ్రేయం రాజసంపత్ర్పదం సృణాం

ఏడు చక్రములు, ఛత్రము, బోణము కలిగి మధ్యమాకారమున నుండు సాలగ్రామమును రాజరాజేశ్వరమందురు, దానిని పూజించినచో రాజ సంపదలు కలుగును.

ద్వీసప్త చక్రం స్టూలం చ నవీన జలదప్రభం

అనంతాఖ్యం చ విజ్ఞేయం చతుర్వర్గఫలప్రదం

పదునాలుగు చక్రములతో లావుగాను, నల్లగానున్న సాలగ్రామము ధర్మార్థ కామమోక్షములనే చతుర్వర్గ ఫలితమునిచ్చు 'అనంత' సాలగ్రామము.

 చక్రాకారం ద్విచక్రం చ సశ్రీకం జలదప్రభం

 సగోష్పదం మధ్యమం చ విజ్ఞేయం మధుసూదనం.

రెండు చక్రములు, గోష్పదము, లక్ష్మిని కలిగి చక్రాకారమున మధ్యమముగా నున్న నల్లని సాలగ్రామమును మధుసూదనమని ఏలుతురు.

 సుదర్శనం చైకచక్రం గుప్తచక్రం గదాధరం

ద్వీచక్రం హయవక్త్రాభం హయగ్రీవం ప్రకీర్తితం.

ఒకే చక్రమున్న సాలగ్రామమును సుదర్శనమని, చక్రము కనపడక యున్నచో గదాధరమనీ రెండు చక్రములతో శుద్ధ స్ఫటిక కాంతితో నుండు సాలగ్రామమును హయగ్రీవమనీ అందురు.

ఆతీవ విస్తృతాస్యం చ ద్వీచక్రం వికటం సతి

నరసింహాభిధం జేయం సద్యో వైరాగ్యదం నృణాం

మిక్కిలి వెడల్పైన రంధ్రముతో రెండు చక్రములతో వికటముగా నున్న సాలగ్రామము వైరాగ్యమును వెంటనే కలిగించు నరసింహసాలగ్రామము.

ద్విచక్రం విస్త్రతాస్యం చ వనమాలా సమన్వితం

లక్ష్మీనృసింహం విజ్ఞేయం గృహాణాం సుఖదం సదా

మిక్కిలి వెడలైన రంధ్రము, వనమాల, రెండు చక్రములు గల సాలగ్రామము గృహస్థులకు సుఖసంపదలనిచ్చు లక్ష్మీనృసింహ సాలగ్రామము.

ద్వారదేశే ద్విచక్రం చ సశ్రీకం చ సమం స్పుటం

 వాసుదేవం చ విజ్ఞేయం సర్వకామఫలప్రదం

రంధ్రము యొక్క ప్రారంభభాగముననే రెండు చక్రములుండి సమానముగాను, లక్ష్మీదేవి కలిగియున్న సాలగ్రామము వాసుదేవము, అది సమస్త వాంఛలను తీర్చును.

ప్రద్యుమ్నం సూక్ష్మచక్రం చ నవీన నీరదప్రభం

సుషిరే ఛిద్రబహుళం గృహిణాంచ సుఖప్రదం

సూక్ష్మమైన చక్రము, రంధ్రమున , ఎక్కువఛిద్రములున్న నల్లని సాలగ్రామము ప్రద్యుమ్నము. అది గృహస్థులకు మేలును కలిగించును.

ద్వేచక్రీ చైకలగ్నే చ పృష్ఠే యత్ర తు పుష్కలం

సంకర్షణం తు విజ్ఞేయం సుఖదం గృహిణాం సదా

రెండు చక్రములు ఒకదానికొకటి తగులుకొని యుండి కింది భాగము విశాలముగా నుండునది సంకర్షణ సాలగ్రామము. అది గృహస్థులకు శభమును కల్గించును.

 అనిరుద్ధం తు పీతాభం వర్తులం చాతి శోభనం

 సుఖప్రదం గృహస్థానాం ప్రవదంతి మనీషిణః

పచ్చని కాంతితో గుండ్రముగా నుండు సాలగ్రామము అనిరుద్ధము, ఆది గృహస్థులకు సుఖశాంతులనిచ్చును.

సాలగ్రామ శిలా యత్ర తత్ర సన్నిహితో హరీః

 తత్రైవ లక్ష్మీర్వసతీ సర్వ తీర్థ సమన్వితా

శాలగ్రామ శిలయుండుచోట శ్రీహరి ఎల్లప్పుడు నివసించును, అచ్చట లక్ష్మీదేవి సమస్త పుణ్యతీర్థములతో కలిసియుండుమ.

యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికాని చ

          తాని సర్వాణి నశ్యంతి శాలగ్రామ శిలార్చనాల్    

బ్రహ్మహత్యాదీ పాపములన్నియు సాలగ్రామము నారాధించినందువలన నశించుచున్నవి.

చత్రాకారే భవేద్రాజ్యం వర్తులే చ మహాశ్రియం

 దుఃఖంచ శకటాకారే శూలాగ్రే మరణం ధ్రువం

 వికృతాస్యేచ దారిద్ర్యం పింగళే హానిరేవచ

భగ్న చక్రే భవేద్వ్యాధి: విదీర్ణే మరణం ధ్రువం

సాలగ్రామ శిల చత్రాకారమున నున్నచో రాజ్యము లభించును. అట్లే గుండ్రని సాలగ్రామము వారాధించిన ఆధీక సంపద కలుగును. రథము వంటి శాలగ్రామము దు:ఖమును, శూలము యొక్క చివర భాగముప్పట్లు వాడిగా యున్న సొలగ్రామము మరణమును కలిగించును. నీకు కారమున నున్న సాలగ్రామము దారిద్ర్యమును కలిగించగా నలుపు పసుపు రంగులు కలిసియున్న సాలగ్రామము హానిచేయును. ఆదే విధముగా భగ్నచక్రమున్నచో వ్యాధిని కలిగించును. పగిలిపోయిన సాలగ్రామము ఇంటి యజమానికి తప్పక మరణమును కలిగించును.

వ్రతం దానం ప్రతిష్ఠా చ శ్రాద్ధం చ దేవపూజనం

శాలగ్రామ శీలాయాశ్చైవాధిష్టానాత్ ప్రశస్తకం

సాలగ్రామమున్నందువలన ఆఇంటిలో చేసిన వ్రతములు, దానము, దేవతాప్రతిష్ఠ దేవతాపూజ, శ్రాద్ధము మొదలగునవి ప్రశస్తమగుచున్నవి.

స స్నాతః సర్వతీర్ధేషు సర్వ యజ్ఞేషు దీక్షితః

 శాలగ్రామ శిలాతోయైః యొఽభిషేకం సమాచరేత్

సర్పదానేషు యత్పుణ్యం పాదక్షిణ్యే భువో యథా

 సర్వయజ్ఞేషు పార్టీషు ప్రతేష్వనశనేషు చ

తస్య స్పర్శం చ వాంఛంతీ తీర్ధాని నిఖిలాని చ

 జీవన్ముక్తో మహాపూతో భవేదేవ న సంశయః

పాఠే చతుర్ణాం వేదానాం తపసాం కరణే సతి

తత్పుణ్యం లభతే నూనం శాలగ్రామ శీలార్చనాత్

 శాలగ్రామ శిలాతోయం నిత్యం భుంక్తే చ యో నరః

సురేప్పితం ప్రసాదం చ జన్మమృత్యు జరాహరం

 తస్య స్పర్శం చ వాంఛంతీ తీర్థాని నిఖిలాని చ

 జీవన్ముక్తో మహాపూతోఽ స్యంతే యాతి హరేః పదం

 యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికాని చ

 తం చ దృష్ట్యా భీయ యాంతి వైనతీయమీవోరగా

 తత్రైవ హరిణా సార్ధం అసంఖ్యం ప్రాకృతం లయం

 పశ్యత్యేవ హి దాస్యేచ నిర్ముక్తో దాస్య కర్మణి

 తత్పాదపద్మ రజసా సద్యః పూతా వసుంధరా

పుంసాం లక్షం తత్పి తౄణాం నిస్తారస్తస్య జన్మనః

 శాలగ్రామశిలాతోయం మృత్యుకాలే చ యో లభేత్

 సర్వపాపాద్వినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి

నిర్వాణముక్తిం లభతే కర్మభోగాద్విముచ్యతే

విష్ణుపాదే ప్రలీనశ్చ భవిష్యతి న సంశయః

 శాలగ్రామశిలాంధృత్వా మిథ్యావాదం వదేత్తు యః

 స యాతి కూర్మదంష్ట్రం చ యావద్యై బ్రహ్మణోవయః

  శాలగ్రామశీలాం స్పృష్ట్వా స్వీకారం యో న పాలయేత్

 స ప్రయాత్యసిపత్రం చ లక్షమన్వంతరాధికం

తులసీ పత్ర విచ్ఛేదం శాలగ్రామే కరోతి యః

తస్య జన్మాంతరే కాలే స్త్రీవిచ్ఛేదో భవిష్యతి

సాలగ్రామమునభిషేకించిన నీటిని శిరస్సుపై ప్రోక్షించుకొన్నచో సమస్త పుణ్యతీర్థములందు స్నానము చేసిన ఫలము. సమస్త యజ్ఞములు చేసిన పుణ్యము లభించును. అట్లే అన్ని విధములైన దానములు చేసిన పుణ్యము, భూమి ప్రదక్షిణము చేసిన ఫలితము, సమస్త ప్రతములు ఉపవాసములుచేసిన పుణ్యము దొరకును,

సమస్త పుణ్య తీర్థములు సాలగ్రామ శిలాతోయమును శిరస్సుపై చల్లుకొనువాని స్పర్శను కోరుకొనును. ఆతడు పరమ పవిత్రుడై జీవన్ముక్తుడగును. సాలగ్రామము నర్చించినచో అతనికి సమస్త వేదములు చదివిన పుణ్యము, ఆన్నీ విధములైన తపస్సులు చేసిన పుణ్యము లభించును.

శాలగ్రామమునభిషేకించిన తీర్థమును ప్రతినిత్యము స్వీకరించుచున్నవానికి అది జరామరణములను పునర్జన్మమును పోగొట్టి, దేవతలు ఇష్టపడు ప్రసాదమగును, బ్రహ్మహత్యాది పాపములన్నియు ఆ భక్తుని చూడగనే గరుత్మంతుని చూచిన సర్పములవలె పరుగెత్తును. అతడు శ్రీహరి సాన్నిధ్యమున నుండి అచటినుండి అనేక ప్రాకృతలయములను చూచును. అతని పాదరేణువులవలన ఈ భూమి పవిత్రమగుచున్నదీ, అతని పితరులు లక్షతరముల వాండ్డినను ముక్తి చెందుదురు.

శాలగ్రామాభిషేక తీర్థమున మృత్యుకాలమందు పొందినచో వారు సమస్త పాపవిముక్తులై వైకుంఠమును చేరుకొందురు. అతడు కర్మఫలితము లన్నిటినండి విముక్తుడై శ్రీహరిపాదమున విలీనమగును.

సాలగ్రామమును చేతిలో పెట్టుకొవీ అబద్ధమైన ప్రమాణములు చేసినచో బ్రహ్మదేవుడున్నంతవరకు కూర్మదంష్ట్రమనే నరకమును పొందును, సాలగ్రామ శిలను నిరాదరణచేసినచో లక్షమన్వంతరములవరకు ఆసి పత్రమనే నరకమును పొందును. పాలగ్రామముపై తులసీ పత్రములను తెంపివేసినచో అతనికి తరువాత జన్మలో భార్యా వియోగము సంభవించును.

తులసీపత్రవిచ్చేదం శంఖే యో హి కరోతి చ

భార్యా హీనో భవేత్సోఽపి రోగి చ సప్తజన్మసు

శాలగ్రామం చ తులసీం శంఖమేకత్ర ఏవ చ

 యో రక్షతి మహాజ్ఞాని స భవేత్ శ్రీహరి ప్రియః

శంఖమునందు తులసీ పత్రములను తుంచి సమర్పించినచో ఆతడు ఏడు జన్మలవరకు రోగమనుభవించును. అట్లే భార్యావిహీనుడు కూడ కాగలడు. సాలగ్రామమును, తులసిని, శంఖమును ఒకచోట ఉంచి పూజ చేసినచో ఆతడు గొప్ప జ్ఞానమును పొందును. అట్లే శ్రీహరికి ఇష్టమైన భక్తుడు కూడ కాగలడు.

 సకృదేవ హి యో యస్యాం వీర్యాధావం కరోతి యః

తద్వీచ్ఛేదే తప్య దుఃఖం భవే ద్భేవ పరస్పరం

త్వం ప్రియా శంఖచూడస్య చైకమన్వంతరావధి

 శంఖేన సార్థం త్వద్భేదః కేవలం దుఃఖదస్తవ

స్త్రీ పురుషులిద్దరు పరస్పరాను రాగముతో ఒకసారి కలిసినను ఆ తరువాత వారిరువురకు వియోగమేర్పడినచో ఇరువురకు దుఃఖము కల్గును. నీవు శంఖచూడునకు ఒక మన్వంతరము వరకు భార్యవు. తరువాత ఇద్దరకు వియోగము జరుగవలసినదే. అందువలన శంఖచూడునితో నీ కేర్పడిన వియోగము నిమిత్త మాత్రమైన దుఃఖమును మాత్రము కలిగించినది.

 ఇత్యుక్త్యా శ్రీహరిస్తాం చ వీరరామ చ సాదరం

 సా చ దేహం పరిత్యజ్య దివ్యరూపం దధార హ

 యథా శ్రీశ్చ తథా సా చాప్యువాస హరీవక్షసి

 ప్రజగామ తయా సార్థం వైకుంఠం కమలాపతి:

 లక్ష్మీ: సరస్వతి గంగా. తులసీ చాపి నారద

హరేః ప్రియాః చతస్రశ్చ బభూవురీశ్వరస్య చ

ఈవిధముగా శ్రీహరీ తులసిని ఓదార్చి ఊరకుండగా ఆమె తన శరీరమును వదిలి పెట్టి దివ్యరూపమును ధరించినది. లక్ష్మీదేవి వలె తులసి కూడా శ్రీహరి వక్షస్థలమున చోటుచేసికొన్నది. ఈ విధముగా శ్రీహరికి లక్ష్మీ, సరస్వతి, గంగ, తులసి భార్యలైరి.

సద్యస్తద్దెహజాతా చ బభూవ గండకీ నదీ

హరే రంశేన శైలశ్చ తత్తీరే పుణ్యదో నృణాం

కుర్వంతి తత్ర కీటాశ్చ శిలాం బహువిధాం మునే

 జలే పతంతీ యా యాశ్చ జలదాభాశ్చ నిశ్చితం

స్థలస్థాః పింగళాజ్ఞేయాశ్చోపతాపాత్హరేరితి

 ఇత్యేవం కథితం సర్వం కిం భూయః శ్రోతు మిచ్ఛసి

తులసీ దేహమునుండి గండకీనది ఆవిర్భవించినది. అట్లే ఆ నదీతీరమున శ్రీహరియొక్క అంశవలన పుణ్యప్రదమైన పర్వతము ఏర్పడినది. ఆ పర్వతమునందలి శిలలను కీటకములు అనేక విధములుగా తొలుచుచున్నందువలన నీలమేఘమువలె నల్లని శీలలు నీటిలో పడిపోవును. శ్రీహరికి కలిగిన ఉపతాపమువలన భూమిపై పడిన సాలగ్రామశీలలు పింగళవర్ణమున ఉన్నవి.

నారదా! ఈ విధముగా తులసీదేవి చరిత్రనంతయు నీకు విశదీకరించితిని. ఇంకను వీవు వినగోరుచున్న విషయమేదైన ఉన్నచో చెప్పెదను.

ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే తులస్యుపాఖ్యానం నామ ఏకవింశోఽధ్యాయః

శ్రీ బ్రహవైవర్తమను మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణుల సంవాదమువ తెల్పబడిన  తులసీ ఉపాఖ్యానమను

ఇరువది ఒకటవ అధ్యాయము సమాప్తము.