నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లనెమ-
సమాసేన శ్రుతం సర్వం దేవీనాం చరీతం విభో ।
విబోధనార్థం బోధస్య వ్యాపతో వస్తుమర్హసి ॥
స్పష్టేరాద్యా సృష్టివిధౌ కథమావిభ్రభువ హ ।
కథం వా పంచధా భూలో వద పేదవిదార వర ॥
భూతా యా యాశ్చ కళయా తయా త్రిగుణయా విభో ।
వ్యాసేన తాపాం చరితం శ్రోతు మిచ్చామి సాంప్రతం ॥
తాసాం జన్మానుకథనం ధ్యానం పూజావీధిం పరం।
స్తోత్రం కవచమైశ్వర్యం శౌర్యం వర్ణయ మంగళం ॥
భగవన్! మీ వలన సమస్త దేవీమూర్తుల చరిత్రను తెలిసికొంటిని. ఐనా దానిని విపులీకరించి నాకు తెల్పగలరు. సృష్టికి ఆద్య స్వరూపమైన ప్రకృతి ఏవిధముగా ఆవిర్భవించినదో, తిరిగి ఆమె ఐదు విధములుగా ఎట్లు మారినదో, సత్వ రజస్తమోగుణ రూపులైన ఆమె ఆంశస్వరూపలెవరో, వారి జన్మవృత్తాంతమును, ధ్యానపద్ధతిని, పూజాపద్ధతిని, స్తోత్రమును కవచమును మొదలైన వాటినన్నిటిని సవిస్తరముగా వాకు తెల్పుడు.
శ్రీనారాయణ ఉవాచ- శ్రీనారాయణుడిట్లనెను-
నిత్యాత్మా చ నభో నిత్యం కాలో నిత్యో దీశో యథా ।
విశ్వేషాం గోకులం నిత్యం నిత్యో గోలోక ఏవచ ।
తదైకదేశో వైకుంఠో లంబభాగః స వీత్యకః ।
తథైవ ప్రకృతిరీత్యా బ్రహ్మలివా సనాతనీ ॥
యథాగ్నౌ దాహికా చంద్రే పద్మే శోభా ప్రభా రవౌ ।
శశ్వద్యుక్తా న భిన్నా సా తథా ప్రకృతిరాత్మని ॥
వినా స్వర్ణం స్వర్ణకార: కుండలం కర్తుమక్షమ: ।
వినామృదం కులాలోహి ఘటం కర్తుం న హేశ్వరః ॥
న హిక్షమస్తథా బ్రహ్మా సృష్టిం స్రష్టుం తయా వినా ।
సర్వ శక్తి స్వరూపా సా తయా స్యాచ్ఛక్తిమాన్ సదా ॥
నారదా! ఆత్మ నిత్యమైనది. ఆకాశము నిత్యము. కాలము నిత్యమైనది. దిక్కులు నిత్యమైనవి. గోకులము నిత్యమైనది. గోలోకము నిత్యమైనది. ఆగోలోకములో ఒక భాగమైన వైకుంఠము" కూడ నిత్యమైనదే. అట్లే సనాతన స్వరూపిణియైన ప్రకృతి కూడ నిత్యమైనదే.
అగ్నికి కాల్చు స్వభావము సహజము. చంద్రునకు, పద్మమునకు శోభ సహజమైనది. సూర్యునకు కాంతి సహజము. ఇవి విడదీయరానివి. అట్లే పరమాత్మతో ప్రకృతి ఎల్లప్పుడు కలసి ఉండును. ప్రకృతి పరమాత్మలు భిన్న భిన్నమైనవారు కారు.
కంసాలీ బంగారము లేకుండా ఏవిధముగా కుండలములు చేయలేడో, కుమ్మరివాడు మట్టిలేకుండా కుండ లేవిధముగా చేయలేడో అట్లే పరబ్రహ్మ ప్రకృతి సహాయము లేకుండ సృష్టిని చేయలేడు. ఆ ప్రకృతి సర్వశక్తి స్వరూప. ఆమె వలననే పరమాత్మ సర్వశక్తి స్వరూపుడగుచున్నాడు.
ఐశ్వర్యవచనః శక్ చ తిః పరాక్రమవాచకః ।
తత్స్యరూపా తయోర్దాత్రీ యా సా శక్తిః పరికీర్తితా ॥
సమృద్ధి బుద్ధి యశసాం వచనో భగ: ।
తేన శక్తిర్భగవతీ భగరూపా చ సా తదా ॥
తయా యుక్తః సదాఽత్మా చ భగవాంస్తేన కథ్యతే ।
స చ స్వేచ్ఛామయ: కృష్ణ: సాకారశ్చ నిరాకృతి: ॥
తేజోరూపం నీరాకారం ధ్యాయంతే యోగినః సదా ।
వదంతి తే పరం బ్రహ్మ పరమాత్మానమీశ్వరం ॥
ఆదృశ్యం సర్వ ద్రష్టారం సర్వజ్ఞం సర్వ కారణం।
సర్వదం సర్వ రూపాంతం ఆరూపం సర్వపోషకం ॥
'శక్' అనునది ఐశ్వర్యమును తెల్పును. 'తి' అనునది పరాక్రమమునకు సూచకము. ఐశ్వర్య, పరాక్రమ స్వరూపిణి, ఐశ్వర్య పరాక్రమముల నొసగునది కావున ప్రకృతిని శక్తి అని పిలుతురు.
భగ: అనునది సమృద్ధిని, బుద్ధిని, కీర్తిని తెలుపును. సమృద్ధి, బుద్ధి, యశోరూపమైన ఆ శక్తిని భగవతి అని అందురు. ఆ భగవతితో కలిసి ఉన్నందువలన పరమాత్మను భగవంతుడని పిల్తురు.
వైష్ణవాస్తం న మన్యంతే తద్భక్తా; సూక్ష్మ దర్శినః ।
వదంతి కస్య తేజస్తే ఇతి తేజస్వినం వినా ॥
తేజోమండల మధ్యస్థం బ్రహ్మ తేజస్వినం పరం ।
స్వేచ్ఛామయం సర్వరూపం సర్వకారణ కారణం ॥
అతివ సుందరం రూపం బీభ్రతం సుమనోహరం ।
కిశోరవయసం శాంతం సర్వ కాంతం పరాత్పరం ॥
నవీన నీరదా భాసం రాసైక శ్యామసుందరం ।
శర్మన్నధ్యాహ్న పద్మౌఘ శోభామోచక లోచనం ॥
ముక్తాసార మహాస్వచ్ఛ దంత పంక్తి మనోహరం ।
మయూరపుచ్ఛచూడం చ మాలతీ మాల్య మండితం ॥
సునాసం సస్మితం శశ్వద్భక్తానుగ్రహ కారకం ।
జ్వలదగ్ని విశుద్ధైక పీతాంశుక సుశోభితం ॥
ద్విభుజం మురళీహస్తం రత్నభూషణ భూషితం ।
సర్వాధారం చ సర్వేశం సర్వ శక్తియుతం విభుం ॥
సర్యైశ్యర్య ప్రదం సర్వం స్వతంత్రం సర్వమంగళం ।
పరిపూర్ణతమం సిద్ధం సిద్ధిదం సిద్ధి కారణం ॥
ధ్యాయంతే శశ్వదేవం రూపం సనాతనం ।
జన్మ మృత్యు జరావ్యాధి శోక భీతిహరం పరం ॥
శ్రీకృష్ణభక్తులగు వైష్ణవులు పరమాత్మనిరాకారుడను మాటను విశ్వసింపరు. వారి అభిప్రాయమున తేజస్వియైన సాకారరూపము లేక తేజస్సు అనునది ఉండదు.
వైష్ణవులు తేజోమండలము యొక్క మధ్యనున్న పరబ్రహ్మ పరమ తేజస్విగా భావింతురు ఆ పరబ్రహ్మ సంపూర్ణ స్వేచ్ఛామయుడు, సమస్త సృష్టి స్వరూపుడు. సమస్త సృష్టికారణములకు మూల పురుషుడని అందురు.
మిక్కిలి, సుందర రూపుడు, కిశోరవయసులో ఉన్నవాడు, శాంతుడు, పరాత్పరుడు, నూతన మేఘకాంతి కలవాడు, రాసక్రీడలో నున్న ఏకైక శ్యామసుందరుడు, పద్మములవంటి కన్నులు, ముత్యాలవంటి దంతములు కలవాడు, శిరస్సున నెమలి . ఈక కలవాడు. మాలతీ పుష్పముల మాలను ధరించినవాడు, అందమైన ముక్కుతో, చిరునవ్వుతో ఉన్నవాడు, ఎల్లప్పుడు భక్తులననుగ్రహించువాడు, అగ్నివలే పరిశుద్ధమైన పీతాంబరము కలవాడు, చేతిలో మురళి, మెడలో రత్నభూషణములు కలవాడు, సమస్త సృష్టికి ఆధారభూతుడు, సర్వేశ్వరుడు, సర్వశక్తులుకలవాడు, సర్వైశ్వర్యము నిచ్చువాడు, సర్వ స్వతంత్రుడు, సర్వమంగళ రూపుడు, సర్వ పరిపూర్ణుడు, సమస్త సిద్ధులను భక్తులకిచ్చువాడు, జన్మ, మృత్యు, బిరా, వ్యాధి, శోక, భీతులను పోగొట్టువాడుగా వారు భావించి అతనిని ధ్యానింతురు.
బ్రహ్మణోవయసా యస్య నిమేష ఉపచార్యతే ।
స చాత్మా పరమంబ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే ॥
కృషిస్తద్భక్తి వచన: నశ్చ తద్దాస్య కారకః ।
భక్తి దాస్య ప్రదాతా య: స కృష్ణ: ప్రకీర్తితః ॥
కృషిశ్చ సర్వవచనో నకారో బీజవాచకః ।
సర్వబీజం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే ॥
ఆసంఖ్య బ్రహ్మణాం పాత కాలేఽతీతేఽపి నారద ।
యద్గుణానాం వాస్తి నాశస్తత్సమానో గుణేన చ ॥
స కృష్ణ సర్వసృష్ట్యాదౌ సీసృక్షుష్యేక ఏవచ ।
సృష్ట్యున్ముఖస్తదంశేన కాలేన ప్రేరీతః ప్రభుః ॥
స్వేచ్చామయః స్వేచ్చయా చ ద్వీధారూపో బభూవ హ ।
స్త్రీ రూపా వామ భాగాంశాద్ధక్షిణాంశః పుమాన్ స్మృతః ॥
తాం దదర్శ మహాకామీ కామధార: సనాతనః ।
అతీవ కమనీయాంచ చారు చంపక సన్నిభం ॥
పూర్ణేందు బింబసదృశ నీతరబయుగళాం పరాం ।
సుచారు కదళీస్తంభ సదృశ శ్రేణి సుందరీం॥
శ్రీయుక్త శ్రీఫలాకార స్తన యుగ్మ మనోహరాం ।
పుష్ట్యా యుక్తాం సులలితాం మధ్యక్షీణాం మనోహరాం ॥
ఆతీవ సుందరీం శాంతాం సస్మితాం వక్రలోచనాం ।
వహ్నిశుద్దాంశుకాధానాం రత్నభూషణ భూషితాం ॥
శశ్వచ్చక్షుశ్చరాభ్యాం పిబంతీం సతతం ముదా ।
కృష్ణస్య సుందరముఖం చంద్రకోటివినీందకం ॥
కస్తూరీ బిందుభి: సార్థం ఆధశ్చందన బిందునా ।
సమం సిందూర బిందుం చ ఫాలమద్యే చ బిభ్రతీం॥
సువక్ర కబరీభారం మాలతీ మాల్య భూషితం ।
రత్నేంద్ర సారహారం చ దధతీం కాంతకాముకీం ॥
కోటి చంద్రప్రభాజుష్ట పుష్ట శోభా సమన్వితార ।
గమనే రాజహంసీం తార దృష్ట్యా అంబిన గంజనీం ॥
అతిమాత్రం తయాసార్ధం రాసేశో రాసముండలే ।
రాసోల్లాసేషు రహసి రాసక్రీడాం చకార హ॥
నానాప్రకారశృంగారం శృంగారో మూర్తిమానివ।
చకా రసుఖ సంభోగం యావద్యై బ్రహ్మణ్యః ॥
బ్రహ్మదేవుని వయస్సంతయు ఎవరికి నిమిషమువలె ఉండునో ఆపరబ్రహ్మను శ్రీకృష్ణదేవుడని అందురు.
కృషి యనగా ఆ పరమాత్మయందలి భక్తి. 'న' అనగా ఆ పరమాత్మ దాస్యమును కలిగించుట. అందువలన కృష్ణుడనగా ఆ పరమాత్మయందు భక్తిని దాస్యబుద్ధిని కలిగించువాడు.
ఇంకను కృషి యనునది సమస్తమును తెల్సును. న అనునది బీజవాచకము. సమస్త సృష్టి కారణమైన పరబ్రహ్మమును కృష్ణుడని అందురు. అంతులేని బ్రహ్మదేవతలందరు మరణించినను, కాలమంతయు గడచిపోయినను శ్రీకృష్ణపరమాత్మ గుణములకు నాశము లేదు. అట్లే ఆతని గుణములతో సమానమైవాడెవడు ఈ సృష్టిలో కనరాడు.
ఆ కృష్ణపరమాత్మ సమస్త సృష్టి జరుగకముందు తానొక్కడే ఉన్నను సృష్టిని చేయదలచి అతని అంశమువలన, కాలమువలన ప్రేరేపింపబడి తనయొక్క ఇచ్చననుసరించి రెండు విధములుగా మారెను. ఆ పరమాత్మ ఎడమ భాగము స్త్రీ రూపము కాగా కుడిభాగము పురుషుడయ్యెను.
పురుషరూపమున నున్న పరమాత్మ మహాకాముకుడై మిక్కిలి ఆందమైనదీ చంపక పుష్పము వలె కోమలమైనది. నిండు చంద్రునివలె గుండ్రనైన పిరుదులు కలది. ఆరటి కాడలవంటి తొడలు కలదీ, బిల్వ ఫలములవలె గుళడ్రని స్తనములు కలది, సన్నని నడుముగలది, మిక్కిలి ఆందమైనది, శాంత, సుస్మిత, పరిశుభ్రమైన వస్త్రములు రత్నభూషణములు ధరించినది. - కస్తూరిబిందువుల మధ్య పెద్దని సిందూరపుచుక్కను, క్రింద చందనపు చుక్కను నొసట ధరించినది. మాలతీ పుష్పముల మాలగలే వంకరకొప్పును, మెడలో రత్నములు, ఇంద్రనీలమణులు కల మాలమ ధరించినది, రాజహంసవంటీ గమనము కలది, కాటుకకంటి ఆస్తిని చూచి రహస్య ప్రదేశమున నూరు బ్రహ్మ సంవత్సరములు అనేక విధములైన శృంగార చేష్టలతో సంభోగమొనరించెను.
తతః సచ పరిశ్రాంతః తస్యా యోనౌ జగత్పితా ।
చకార వీర్యాధానం చ నిత్యానందః శుభక్షణే ॥
గాత్రతో యోషితస్తస్యాః సురశాంతే చ సువ్రత ।
ని:ససార శ్రమజలం శ్రాంతాయాస్తేజసా హరేః ॥
మహాసురతఖిన్నా యా నీశ్వాసశ్చ బభూవహ ।
తదాధారశ్రమజలం తత్సర్వం విశ్వగోలకం ॥
సచనిశ్వాస వాయుశ్చ సర్వాధారో బభూవహ ।
నిశ్వాసవాయు: సర్వేషాం జీవినాం చ భవేషు చ ॥
బభూవ మూర్తిమద్వాయోః వామాంగాత్ప్రణవల్లభా ।
తత్పత్నీ సా చ తత్పుత్రాః ప్రాణా: పంచ చ జీవినాం ॥
ప్రాణోఽపానః సమానశ్చైవోదానో వ్యాన ఏవచ ।
బభూవురేవ తత్పుత్ర అధఃప్రాణాశ్చ పంచ చ ॥
ఘర్మతోయాధిదేవశ్చ బభూవ వరుణో మహాన్ ।
తద్వామాంచ్చ తత్పత్నీ వరుణానీ బభూవ హ ॥
ఆ పురుషుడు దానివలన పరిశ్రమనొంది శుభసమయమున ఆ స్త్రీయొక్క యోనిలో తన వీర్యమునుంచెను. సురత. కొలాంతమున పరిశ్రమచెందిన ఆ స్త్రీ శరీరమునుండి చెమట బిందువులేర్పడినవి. అట్లే మహాసురతమువలన భేదము చెందిన ఆ స్త్రీ దీర్ఘ నిశ్వాసమును వదలెను.
ఆ స్త్రీ యొక్క చెమట బిందువులనుండి సమస్త విశ్వగోళకములు, ఏర్పడినవి. ఆమె యొక్క నిశ్వాసవాయువు ఈ ప్రపంచములందున్న-సమస్త ప్రాణికోట్లకు ఆధారమైన నిశ్వాసవాయువుగా పరిణమించినదీ, ఆకారముకల ఆ వాయువుయొక్క ఎడమ భాగమునుండి అతని భార్యయు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములను అతని పుత్రులు ఐదు ప్రాణములుగా ఏర్పడిరి.
ఆమె చెమటనీటినుండి నీటికి అధిదేవతయైన వరుణుడుద్భవించెను. అతని వామాంగమునుండి “వరుణాని" అనేడు ఆతని భార్య ఆవిర్భవించెను.
అథ సా కృష్ణశక్తిశ్చ కృష్ణాధ్గర్భం దధారహ ।
శతమన్వంతరం యావత్ జ్వలంతీ బ్రహ్మ తేజసా ॥
కృష్ణప్రాణాధిదేవీ సా కృష్ణప్రాణాధిక ప్రియా ।
కృష్ణస్య సంగినీ శశ్వత్ కృష్ణ వక్షస్థల స్థితా ॥
శతమన్వంతరాతీతే కాలే పరమ సుందరీ ।
సుషావాండం సువర్ణాభం విశ్వాధారాలయం పరం ॥
దృష్ట్యా చాండం హి సాదేవీ, హృదయేన ఏదూయతా ।
ఉత్ససర్జ చ కోపేన తదండం గోళకే జలే ॥
దృష్ట్వా కృష్ణశ్చ తత్యాగం హాహాకారం చకార హ ।
శశాప దేవీం దేవేశ: తక్షణం చ యథోచితం ॥
యతోఽపత్యం త్వయాత్యక్తం కోపశీలే సునిష్ఠురే ।
భవ త్వమనపత్యాఽపి చాద్య ప్రభృతి నిశ్చితం ॥
యాస్త్యదంశరూపాశ్చ భవిష్యంతి సురప్రియః ।
అనపత్యాశ్చ తాః సర్వాః తత్సమా నిత్యయౌవనాః ॥
శ్రీకృష్ణ శక్తి స్వరూపిణియగు ఆస్త్రీ శ్రీకృష్ణుని వలన గర్భమును. శతమన్వంతరకాలము ధరించెను. ఆమె శ్రీకృష్ణుని ప్రాణములకు అధిదేవత, ఆతని ప్రాణములకంటే ఎక్కువ ప్రియమైనది. శ్రీకృష్ణుని వక్షస్థలముపై నున్న ఆమె ఎల్లప్పుడు అతనిని వదలక ఉండునది.
శతమన్వంతరముల తరువాత ఆమె బంగారు కాంతిగలదియు వీతధారణయోగ్యమైన అండమును ప్రసవించినది. అవయవములు లేని ఆ ఆండమును చూచి బాధాతప్తమైన హృదయములో కోపముతో దానినామె బ్రహ్మాండ గోళకమందలి జలములో పారవేసినది. శ్రీకృష్ణుడా దృశ్యమునుచూచి హాహాకారము చేయుచు. కోపస్వభావముగలదానా! నీవు నీ బిడ్డను చేజేతులారా దూరము చేసికొన్నందువలన నీవు కాని, నీ ఆంశస్వరూపాలైన దేవతా స్త్రీలుగాని నీవలె నిత్యయౌవనలైనా సంతానమునకు నోచుకోరు." అని శపించెను.
ఏతస్మిన్మంతరే దేవీ జిహ్వాగ్రాత్పహసా తతః ।
ఆవిర్బభూవ కన్యైకా శుక్లా వర్ణి మనోహరా ॥
పీతవస్త్ర పరీధావా వీణా పుస్తక ధారిణీ ।
రత్న భూషణ భూషాఢ్య సర్వశాస్త్రాదిదేవతా ॥
ఆథ కాలాంతరే పాచ ద్విధారూపా బభూవ హి ।
వామార్థాంగా చ కమలా దక్షిణార్ధా చ రాధికా ॥
ఏతస్మిన్నంతరే కృష్ణ ద్విధారూపో బభూవ హి ।
దక్షిణార్ధః స్యాత్ ద్విభుజః వామార్థశ్చ చతుర్భుజః ॥
ఉవాచ వాణీం శ్రీకృష్ణ: త్వమస్య భవ కామినీ ।
అత్రైవ మానీనీ రాధా నైవ భద్రం భవిష్యతి॥
ఏవం లక్ష్మీం సప్రదదౌ తుష్టో నారాయణాయ వై ।
సంజగామ చ వైకుంఠం తాభ్యాం సార్థం జగత్పతిః ॥
అనపత్యే చ తే. ద్వేచ యతో రాధాంశ సంభవే ।
నారాయణాంగాదభవన్ పార్షదాశ్చ చతుర్బుజాః ॥
తేజసా వయసా రూపగుణాభ్యాం చ సమా: హరేః ।
బభూవుః కమలాంగాచ్ఛ దాసీకోట్యశ్చ తత్సమా: ॥
దేవియొక్క జిహ్వాగ్రమునుండి తెల్లని రంగుతో అందమైనది. పీతాంబరమును, రత్నభూషణములను ధరించినది, చేతులలో వీణ, పుస్తకములను ధరించినది, సమస్త శాస్త్రములకు అధిదేవతయైన సరస్వతి దేవి వెంటనే ఉదయించినది.
కొంతకాలమున కామె వామార్ధాంగమునుండి లక్ష్మిగా, దక్షిణార్ధాంగమునుండి రాధగా రెండు రూపములనందనది. అట్లే శ్రీకృష్ణుడు కూడ దక్షిణార్ధాంగమునుండి ద్విభుజూడైన కృష్ణుడుగా వామార్ధాంగమునుండి చతుర్భుజుడైన నారాయణుడుగా రెండు రూపములు పొందెను.
శ్రీకృష్ణుడు సరస్వతిని నారాయణునకు ప్రియురాలుగా చేసెను. పూజ్యారాలైన రాధాదేవి ఇచ్చటనే ఉండునని చెప్పి లక్ష్మీదేవిని కూడ నారాయుణన కివ్వగా ఆతడు వారితో కలసి వైకుంఠమునకు పోయెను.
రాధాంతమున జన్మించిన లక్ష్మీ సరస్వతులకు కూడ సంతానము కలుగలేదు. కాని లక్ష్మీ దేవి యొక్క అవయములనుండి ఆమెతో సమానమైన దాసీ జనమెంతయో పుట్టినది. ఆట్లే నారాయణుని అవయవముల నుండి వయస్సున, రూపమున, గుణములతో ఆతవికి సమానులైన చతుర్భుజూలైన అనుచరులెందరో ఉద్భవించిరి.
ఆథగోలోక నాథస్య లోమ్నాం వివరతో మునే ।
ఆసన్న సంఖ్యగోపాశ్చ పయసా తేజసా సమా: ॥
రూపేణ సుగుణీనైవ వేషాద్వా విక్రమేణ చ ।
ప్రాణతుల్యా ప్రియాః సర్వే బభూవుః పార్షదా విభో ॥
రాధాంగ లోమ కూపేభ్యో బభూవుర్గోపకన్యకాః ।
రాధా తుల్యాశ్చ సర్వాస్తా: నాఽన్యతుల్యా ప్రియంవదా:॥
రత్నభూషణ భూషాడ్యా శశ్వతుస్థిర యౌవనాః ।
అనపత్యాశ్చ తాః సర్వాః పుంసః, శాపేన సంతతం ॥
గోలోక నాథుడైన శ్రీకృష్ణుని రోమ కూపములనుండి వయస్సులో, తేజస్సులో, రూపమున, గుణములలో పరాక్రమమున శ్రీకృష్ణునితో సమామలైన అసంఖ్యాకులైన గోపాలబాలురు ఉదయించిరి. వీరందరు ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ప్రాణములతో సమానమైన అనుచరవర్గము. అట్లే రాధాదేవి యొక్క దోమ కూపములనుండి రాధాదేవితో సమానమైనవారు, రత్నభూషణములు కలవారు, స్థిరమైన యౌవనము కల అనేక గోపికా కన్యలావిర్భవించిరి. కాని వారందరు రాధాంశసంభూతలు. కావున పరమపురుషుని యొక్క శాపము వలన సంతాన రహితలైరి.
ఏతస్మిన్నంతరే విప్ర సహసా కృష్ణదేహతః ।
ఆవిర్బభూవ సాదుర్గా విష్ణుమాయా పనాతనీ॥
దేవీ నారాయణీశావా సర్వశక్తి స్వరూపిణీ ।
బుధ్యధిష్ఠాతృదేవీ సా కృష్ణస్య పరమాత్మనః ॥
దేవీనాం బీజరూపా చ మూల ప్రకృతిరీశ్వరీ ।
పరిపూర్ణతమా తేజః స్వరూపా త్రిగుణాత్మికా ॥
తప్తకాంచన వర్ణాభా సూర్యకోటి సమప్రభా ।
ఈషద్ధాస ప్రసన్నాస్యా సహస్ర భుజ సంయులో ॥
నానా శస్త్రాస్త్ర నికరం బిభ్రతీ సా త్రిలోచనా ।
వహ్ని శుద్ధాంశుకాధానా రత్నభూషణ భూషితా ॥
యస్యాశ్చాంశాంశకలయా బభూవుః సర్వయోషితః ।
సర్వ విశ్వస్థితా లోకా మోహితా మాయయా యయా ॥
సర్వైశ్వర్య ప్రదాత్రీ చ కామినాం గృహమేధినాం ।
కృష్ణభక్తి ప్రదాత్రీ చ వైష్ణవానాం చ వైష్ణవీ ॥
ముముక్షూణాం మోక్షదాత్రీ సుఖీనాం సుఖదాయినీ।
స్వర్గేషు స్వర్గలక్ష్మీ: సా గృహలక్ష్మీ; గృహేష్వసౌ ॥
తపస్విషు తపస్యా చ శ్రీరూపా సా నృపేషు చ ।
యా చాగ్నౌ దాహికా రూపా ప్రభారూపాచ భాస్కరే ॥
శోభాస్వరూపా చంద్రే చ పద్మేషు చ సుశోభనా ।
సర్వశక్తి స్వరూపా యా శ్రీకృష్ణే పరమాత్మని ॥
యయా చ శక్తిమావాత్మా యయా వై శక్తిమజ్జగత్ ।
యయా వినా జగత్సర్వం జీవన్మృతమివస్థితం ॥
యా చ సంసార వృక్షస్య బీజరూపా సనాతన ।
స్థితీరూపా బుద్ధిరూపా ఫలరూపాచ నారద ॥
క్షుత్పిపాసా దయాశ్రద్ధా నిద్రాతంద్రాక్షమా ధృతిః ।
శాంతిర్లజ్జాతుష్టి పుష్టి భ్రాంతి కాంత్యాది రూపిణీ ॥
సా చ సంస్తూయ సర్వేశం తత్పురః సముపస్థితా ।
రత్నసింహాసనం తస్యై ప్రదదౌ రాధికేశ్వరః ॥
ఆసమయమున శ్రీకృష్ణుని దేహమునుండి విష్ణుమాయయైన దుర్గవెంటనే ఆవిర్భవించినది. ఆ దుర్గాదేవి నారాయణుని మాయా స్వరూపిణి. శంకరుని యొక్క పత్ని. సమస్త శక్తి స్వరూపిణి. శ్రీకృష్ణ పరమాత్మయొక్క బుద్ధికి అధిష్టాన దేవత. దేవతాస్త్రీలందరకు కారణరూపిణి, ఆమెయే మూలప్రకృతి. సర్వ పరిపూర్ణమైనది. తేజ: స్వరూప. సత్వరజాధిర్రిగుణాత్మక, బంగారు వంటి కాంతి కలది. సూర్యునివంటీ తేజస్సు కలది. వేయి చేతులలో అనేక విధములైన శస్త్రాస్త్రములను ధరించినది. మూడు కన్నులు కలది. పరిశుద్దమైన వస్త్రములన రత్నాభరణములను ధరించినది.
ఆ దుర్గాదేవియొక్క ఆంశమువలన ఆంశాంశముల వలన సమస్త స్త్రీలు ఉద్భవించిరి. సమస్త లోళములు ఈమె యొక్క మాయవలన మోహించబడినవి. ఈమె భక్తులమొక్క అన్ని కోర్కెలను తీర్చును. వైష్ణవి యగు ఏ దుర్గ పులకు విష్ణుభక్తిని కలుగజేయును. మోక్షము కోరువారికి మోక్షమునిచ్చును. సుఖము కోరువారికి సుఖములనిచ్చును. ఈమె స్వర్గమున స్వర్గలక్ష్మిగా, గృహములందు గృహలక్ష్మిగా, తపస్సు చేసికొనువారికి తపస్సు, రాజాలకు లక్ష్మీరూపమున కనిపించును.
ఈ దుర్గాదేవి ఆగ్నేయందు దాహకశక్తిగా, సూర్యునీయందు కాంతిగా, చంద్రునిలో పద్మములలో శోభారూపిణిగా, శ్రీకృష్ణ పరమాత్మయందు సర్వశక్తిమంతమగుచున్నది. పరమాత్మ సహితము ఈ దుర్గాదేవివలన శక్తివంతుడగుచున్నాడు. ఈమె లేనిచో జగత్తతంతయు జీవన్మతముగా కన్పించును.
సనాతని యగు ఈ దుర్గ సంసారమనే వృక్షమునకు మూలకారణమైనది. స్థితికి కారణమైనది. బుద్ధి, ఫలస్వరూపిణిగా నున్నది. ఆకలి దప్పులు, దయ, శ్రద్ధ, నీద్ర. తంద్ర, క్షమ, ధృతి, శాంతి, లజ్జ, తుష్టి పుష్టి భ్రాంతి, కాంతి మొదలగునవన్నియు ఈమె స్వరూపములే.
ఆ దుర్గాదేవి శ్రీ కృష్ణపరమాత్మను స్తుతింపగా నతడు ఆమె కూర్చుండుటకై రత్న సింహాసనము నొసగెను.
ఏతస్మిన్నంతరే తత్ర సస్త్రీకశ్చ చతుర్ముఖః।
పద్మనాభో నాభిపద్మాన్నిస్ససార పుమాన్మునే ।
కమండలుధరః శ్రీమాన్ తపస్వీ జ్ఞానానాం వరః ।
చతుర్ముఖస్తం తుష్టావ. ప్రజ్వలన్ బ్రహ్మతేజషా।
సుదతీ సుందరీ శ్రేష్ఠా శతచంద్రసమప్రభా ।
వహ్నిశుద్ధాంశుకాధానా రత్న భూషణ భూషితా ॥
రత్నసింహాసనే రమ్యే స్తుతి పై సర్వకారణం ।
ఉవాస స్వామినా సార్థం కృష్ణస్య. పురతో ముదా ॥
ఆ సమయమున విష్ణుమూర్తియొక్క నాభికమలమునుండి కమండలువు ధరించినవాడు, తపస్వి, జ్ఞానులలో శ్రేష్ఠుడు, చతుర్ముఖుడగు బ్రహ్మదేవుడు భార్యాసహితముగా బ్రహ్మతేజస్సుచే ప్రకాశించుచు బయలువెడలెను.
శతచంద్రులతో సమానమైన కాంతిగలది, సుందరి, పరిశుద్ధమైన వస్త్రములను, రత్నభూషణములను ధరించిన ఆతని స్త్రీ సమస్త సృష్టికి కారణుడైన శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించి అతని ముందు తన స్వామితో కలసి రత్న సింహాసనముపై కూర్చుండెను.
ఏతస్మిన్నంతరే కృష్ణో ద్విధారూపో బభూవ హ ।
వామార్థాంగో మహాదేవో దక్షిణో గోపికాపతిః ॥
శుద్ధస్ఫటికసంకాశః శతకోటిరవిప్రభః ।
త్రిశూలపట్టిశధరో వ్యాఘ్రచర్మధరో హరః ॥
తప్తకాంచనవర్ణాభజటాభారధరః పరః ।
భస్మభూషణగాత్రశ్చ సస్మితశ్చంద్రశేఖరః ॥
దిగంబరో నీలకంఠః సర్పభూషణభూషితః ।
బీభ్రద్ధక్షిణహస్తేన రత్నమాలాం సుసంస్కృతాం ॥
ప్రజపన్ పంచవక్త్రేణ బ్రహ్మజ్యోతి: సనాతనం ।
సత్యస్వరూపం శ్రీకృష్ణ పరమాత్మానమీశ్వరం ॥
కారణం కారణానాం చ సర్వమంగళ మంగళం ।
జన్మమృత్యు జరావ్యాది శోక భీతి హరం పరం ॥
సంస్తూయ మృత్యోర్ముత్యుం తం జాతో మృత్యుంజయాభిధః ।
రత్న సింహాసనే రమ్యే సముపాప హరేః పురః ॥
ఆ సమయమున కృష్ణుడు తన కుడిపార్శ్వమున శ్రీకృష్ణుడుగా, ఎడమపార్వమువ మహాదేవుడుగా మారెను.
ఆ మహాదేవుడు పరిశుద్ధమైన స్పటికమువంటి వన్నె కలవాడు, శతకోటి సూర్యులతో సమానమైన కాంతి కలవాడు. త్రిశూలము, పట్టిమను ఆయుధములను.. వ్యాఘ్రచర్మమును, బంగారువన్నెగల జడలను ధరించినవాడు. శరీరమున భస్మమే భూషణముగా కలవాడు. చంద్రుని ఆభరణముగా ధరించినవాడు, దిగంబరుడు, నీలకంఠుడు, సర్పములే ఆభరణములుగా కలవాడు. అతడు తన కుడి చేతిలో రత్నమాలను ధరించి, తన ఐదు ముఖములతో సత్య స్వరూపుడైన శ్రీకృష్ణపరమాత్మను జపించుచుండెను.
కారణకారణుడు. సర్వమంగళములకు మంగళమైనవాడు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, శోక, భీతులను తొలగించువాడు, మృత్యువునకే మృత్యువగు ఆ శ్రీకృష్ణుని జపించి మహాదేవుడు మృత్యుంజయుడయ్యెను. ఆ మహాదేవుడు శ్రీకృష్ణుని స్తుతించి అతని ముందు రత్నసింహాసనమున కూర్చుండెను.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయ ప్రకృతఖండే నారాయణ నారద సంవాదే దేవదేవ్యుత్పత్తిర్నామ ద్వీతీయోఽధ్యాయః ॥
శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమున రెండవదియగు ప్రకృతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున తెలుపబడిన దేవ, దేవ్యుత్పత్తి యనెడు ద్వితీయాధ్యాయము సమాప్తము.
Summary of chapter 2 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
Continuing the sacred discourse, the text reveals how the unmanifest primordial Prakṛti emerged directly from the left side of Lord Śrī Kṛshṇa's transcendent form in the supreme realm of Goloka. Upon Her manifestation, She gazed upon the Supreme Lord with boundless devotion and was divided by His supreme will into Her primary fivefold forms and countless secondary expansions. From Her divine potencies arose the great celestial mothers, the rivers of liberation, and the guardian energies of every realm. The narrative emphasizes that all female entities in the universe, whether celestial maidens, virtuous earthly women, or nature itself, are direct fractions and parts of this supreme energy, establishing the sacred origin of all female life in the cosmos.