బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

 9 - పృథ్వీ ఉపాఖ్యానము

నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను-

 భూమి దానకృతం పుణ్యం పాపం తద్దరణేన యత్

పరభూమౌ శ్రాద్దరూపం కూపే కుపదజం తధా

ఆంబువీచి భూఖనన బీజల్యాగజమేవ చ

దీపాది స్థాపనాత్సావం శ్రోతుమిచ్చామి యత్నతః

అన్యద్వో పృథివీ జన్యం పాపం యత్ప్రశ్నతః పరం

 యదస్తి తత్ప్రతీకారం వద వేద విదార వర

భూదానము చేసినందువలన కలుగు పుణ్య మెట్టిదో, దానము చేసిన భూమిని అపహరించినందువలన, ఇతరుల ఇండ్లలో శ్రాద్ధము చేసినందువలన, దిగుడుబావులలో మైల అంటుకొనిన కాళ్ళు పెట్టినందువలస, భూమిని తవ్వినందువలన, వీర్యమున భూమిపై వదలినందువలన, భూమిపై దీపాదులను పెట్టినందువలన ఏర్పడు పాపమును, పృథివి వల్ల సంభవించు ఇతర పాపములను, వాటి నివారణ మార్గములనన్నిటిని నాకు వివరించి చెప్పుడు.

నారాయణ ఉవాచ- నారాయణమూర్తి ఇట్లు చెప్పెను-

 వితస్తిమాత్రం భూమిం చ యోదదాతి చ భారతే

సంధ్యాపూతాయ విప్రాయ ప యాయాద్విష్ణుమందిరం

భూమించ సర్వ సస్యాఢ్యం బ్రాహ్మణాయదదాతి యః

భూమిరేణు ప్రమాణే చ, పర్షి విష్ణుపదే పసేత్

 గ్రామం భూమిం చ ధాన్యం చ యోదదాత్యాదదాతి యః

సర్వ పాపాదినిర్ముక్తౌ చౌభౌ వైకుంఠవాసినా

భూమిదానం చ తత్కాలే యః సాధుశ్చానుమోదతే

స ప్రయాతి చ వైకుంఠం మిత్ర గోత్ర సమన్వితం

స్పదత్తాం పరదత్తాం వో బ్రహ్మవృత్తిం హరిత్తు యః

కాలసూత్రే తిష్ఠతి ప యావచ్చంద్ర దివాకరా

తత్పుత్ర పౌత్ర ప్రభృతి ర్భూమిహీనః శ్రీయహతః

సుఖహీనో దరిద్రఃస్యాత్ అంతే యాతి చ గౌరవం

గవాం మార్గం వినీష్కృష్య యశ్చ సస్యం దదాతి సః

దివ్యం వర్షశతం చైవ కుంభీపాకి చ తిష్ఠతి

గోష్ఠo తటాకం నిష్కృష్య మార్గం సస్యం దదాతి యః

స చ తిష్ఠత్యసీపత్రే యావచ్చంద్ర దివాకరౌ

న పంచపిండ ముద్దృత్య స్నాతి కూపీ పరస్య యః

 ప్రాప్నోతి నరకం చైవ న స్నానఫలమేవచ

కామీ భూమౌ చ రహసి బీజత్యాగం కరోతి యః

స్నిగ్ధరేణు ప్రమాణం చ వర్షం తిష్ఠతి రౌరనే

ఆంబువిచ్యంబు ఖననం యః కరోతి చ మానవః

స యాతి కృమిదంశం చ స్థిరీస్తత్ర చ తుర్యుగం

పరకీయే లుప్త కూపే కూపం మూడః కరోతి యః

 పుష్కరిణ్యాంచ లుప్తాయాం తాం దదాతి చ యోనరః

సర్వం ఫలం పర స్యైవ తప్తసూర్మిం వ్రజేత్తు సః

తత్రతిష్ఠతి సoతప్తో యావదింద్రాశ్చతుర్దశ

పరకీయ తడాగే చ పంకముద్దృత్య చోత్స్వజేత్

రేణు ప్రమాణవర్షంచ బ్రహ్మలోకి వసేన్నరః

పిండం పిత్రే భూతి భర్తుః న ప్రదాయ చ మానవః

శ్రార్ధం కరోతి యో మూడో నరకం యారి నిశ్చితం

 భూమౌ దీపం య్పోఽర్పయతీ సోంఽధః సప్తసు జన్మసు

 భూమా శంఖం చ సంస్ధాప్య కుష్ఠం జన్మాంతం లభేత్

ముకో మాణిక్యహ్రం చ సువర్ణం చ మణిం తథా

యశ్చ సంస్థాపయే ద్భూమౌ దరిద్రః సప్త జన్మసు

శివలింగం శిలామర్చ్యాం యర్పయతి భూతలే

శతమన్వంతరం యావత్కృమి భక్ష స తీర్థత

సూక్తం మంత్రం శిలాతోయం పుష్పంచ తులసీదళం

యశ్చార్సయతి భూమౌ చ సతిష్టేన్నరకి యుగం

 జపమాలాం పుష్పమాలాం కర్పూరం రోచనాం తథా

యో మూఢశ్చార్పయేద్భూమౌ స యాతి నరకంధ్రువం

ఈ భారతదేశమున మూడుపూటలు సంధ్యావందనమాచరించి గాయత్రీ జపము చేసి పవిత్రుడైన బ్రాహ్మణునకు లేశమాత్రము భూమిని దానము చేసిన వాడు వైకుంఠమునకు తప్పక పోవును. గ్రామమును, భూమిని, ధాన్యమును ఎవరు దానము చేయుదురో, దానముగా స్వీకరింతురో వారిద్దరు సమస్త పాపములనుండి వినిర్ముక్తులై వైకుంఠమున నివసింతురు.

తానుదానము చేసినను, ఇతరులు దానమొనర్చినను, బ్రాహ్మణుల కిచ్చిన వృత్తిని ఎవరు నాశనము చేయుదురో వారు సూర్య చంద్రులున్నంతవరకు నరకలోకమున శిక్షలనుభవింతురు, ఆంతేకాక అతనీ సంతానము, వంశము భూమిని కోల్పోయి దరిద్రులై రౌరవనరకమున నివసించును.

ఆవులు తిరుగు త్రోవలన చెడగొట్టి వ్యవసాయమునకై వినియోగించుకొనువాడు, ఆవుల కొట్టమును, చెరువును చెడగొట్టి , ప్వార్ధమునకు వినియోగించుకోమవాడు, సూర్యచంద్రులున్నంతవరకు నరకమున కత్తులపై నిలుబడియుండగలడు.

శ్రాద్ధమున పంచపిండములు పెట్టకుండ ఇతరుల బావిలో స్నానము చేసినచో నరకము మాత్రమే కాక స్నానఫలము సహితము పొందలేడు.

భూమిపై తన వీర్యమును వదిలినవాడు, ఇతరులు తవ్వించిన బావి పూడ్కొనినచో ఆ పూడికను తీయించినవాడు దానఫలమును పొందలేడు. ఆ ఫలితము పూర్వపు యజమానికి మాత్రమే చెందును.

కాని ఇతరులు త్రవ్వించిన చెరువులోని పూడికను తీయించినచో క్షణకాలమైనను బ్రహ్మలోకప్రాప్తి కలుగును.

పిండము పెట్టక శ్రాద్దము చేసినవాడు నరకమును పొందగా, భూమిపై దీపమునుంచినవాడు వీడు జన్మలవరకు గుడ్డివాడు కాగలడు. అట్లే భూమి పై శంఖమునుంచీవ కుష్టురోగమునకు గురియగును. శివలింగమును, సాలగ్రామ శీలసు, మంత్రపుస్తకమును, సాలగ్రాముయొక్క అభి షేకతీర్థమును. పుష్పముసు. తులసిని, జపమాలను, కర్పూరమును, గోరోజనమును భూమిపై పెట్టువాడు తప్పక నరకవాసఫలమనుభవించును.

మునే చందన కాష్ఠంచ రుద్రాక్షం కుశమూలకం

సంస్థాప్య భూమౌ నరకే వసేన్మన్వంతరావధి

 పుస్తకం యజ్ఞసూత్రంచ భూమౌ సంస్థాపయేత్తుయః

నభవేద్విప్రయోనౌ చ తస్య జన్మాంతరే జనః

 బ్రహ్మహత్యాసమం పాపం ఇహపై లభతే ధ్రువం

గ్రంథియుక్తం యజ్ఞసూత్రం పూజ్యం స్యాత్సర్వవర్ణకై:

 యజ్ఞం కృత్వాతు యో భూమీక్షీరేణ వహి సించతి

 సయాతీ తప్త సూర్మించ సంతప్తః సర్వ జన్మను

 భూకంపే గ్రహణే యోఽహి కరోతి ఖననం భువః

జన్మాంతరే మహాపాపీ సోంఽగహీనోభవేత్ ధ్రువం

భవనం యత్ర సర్వేషాం భూమీస్తన ప్రకీర్తితా

 వసురత్నం యాదధాతి వసుధా చ వసుంధరా

హరేరూరౌ చ యాజతా సా చోర్వీ పరికీర్తితా

ధరా ధరిత్రీ ధరిణి: సర్వేషాం ధరణాత్తు యా

ఇజ్యా చ యాగభరణాత్ క్షోణీ క్షీణా లయే చయా

 మహాలయే క్షయం యాతీ క్షితిస్తేన ప్రకీర్తితా

కాశ్యపీ కశ్యపస్యేయం ఆచలా స్థితి రూపతః

విశ్వంభరా తద్ధరణచ్ఛానంతానంతరూపతః

 పృథివీ పృథుక కన్యాత్వాత్ ద్వీతీయ ఖండము - 8వ అధ్యాయము విస్తృతత్వా న్మహీమునే

చందనపు కట్టెమ, రుద్రాక్షను, దర్భను భూమి పైనుంచినచో మన్వంతరము వరకు నరకమున నివసించును.

పుస్తకమును, యజ్ఞోపవీతమును భూమిపై ఉంచినచో అతడు తర్వాతి జన్మలలో బ్రాహ్మణుగా పుట్టరు. ఇది బ్రహ్మహత్యతో సమానమైన పాపము. ముడివేసిన యజ్ఞోపవీతము అన్ని కులములవారికి గౌరవించదగినది.

యజ్ఞమును చేసి యజ్ఞాంతమున ఆ భూమిని పాలచే తడుపనిచో అతడు తప్తసూర్మి అను నరకమును అనుభవించును. భూకంపము వచ్చినప్పుడు, గ్రహణ కాలమున భూమిని ఎవ్వడు త్రవ్వునో అతడు మహాపాపి యగును. ఇతర జన్మలలో ఆంగహిమడుగా పుట్టును. ధనమును రత్పాదులను (పసుపును) ధరించినందువలన వసుధయవి పిల్చిరి. శ్రీహరియొక్క ఊరువులనుండి పుట్టినందువలన దానిని "ఉర్వి" యనిరి. యాగవస్తువులను భరించుచున్నందువలన "ఇజ్య" యనిరీ. లయకాలమువ క్షీణించుచున్నందువలన "క్షీణియైనది. మహాలయకాలమున సంపూర్ణముగా క్షతి చెందుచున్నందువలన "క్షితి' ' అనే పేర ప్రసిద్ధిబడపినది. కశ్యపమహర్షికి సంబంధించినది కావున దీనినీ “కాశ్యపి" యనీరి. చంచలము కాకుండా ఉన్నందువలన "అచలమైనది. విశ్వమునంతయు భరించుచున్నందువలన “విశ్వంభర'గా ప్రసిద్ధి చెందినది. అనంతమైన రూపము ఉన్నందువలన "అనంత" యమ పేరుతో, పృథుమహారాజు కూతురు కావున "పృథ్వి" యను పేరుతో చాలా విస్తరించి యున్నందువలన “మహీ" యను పేర ప్రసిద్ది చెందినది.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే పృథివ్యుపాఖ్యానం నామ వపమోఽధ్యాయః !!

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణ సంవాదసమయమున తెలుపబడిన పృథివీ ఉపాఖ్యానమను తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.