బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

17 - తులసీ శంఖచూడుల వృత్తాంతము

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు నారదునితో పలికెను-

బ్రహ్మా శివం సంనియోజ్య సంహారే దానవస్య చ

జగామ స్వాలయం తూర్ణం యథాస్థానం మహామునే

చంద్రభాగా నదీతీరి వటమూలే మనోహరీ

తత్ర తస్థౌ మహాదేవో దేవనిస్తారహేతవే

దూతం కృత్వా పుష్పదంతం గంధర్వేశ్వరమీప్సితం

శీఘ్రం ప్రస్థాపయామాస శంఖచూడాంతికం ముదా

సచేశ్వరాజ్ఞయా శీఘ్రం యయౌ తన్నగరం వరం

మహేంద్రనగరోత్కృష్టం కుబేరభవనాధీకం

పంచ యోజన విస్తీర్ణం దైర్గ్యే తద్ద్విగుణం మువే

ప్ఫాటికాకార మణిభి: సమంతాత్పరివేష్టితం

సప్తభిః పరిభాభిశ్చ దుర్గమాభిః సమన్వితం

జ్వలదగ్నివిభేర్నిత్యం శోభితం రత్నకోటిభిః

యుక్తం చ వీథీ శతకైర్మణివేది సమన్వితైః

పరితో వణిజాం సంఘైర్నావావపు విరాజితైః

సిందూరాకారమణిభిరర్మితైశ్చ విచిత్రితైః

భూషితం భూషితైర్దివ్యైరాగమైః శతకోటిభిః

గత్వా దదర్శ తన్మధ్యే శంఖచూడాలయం వరం     

బ్రహ్మదేవుడు శంఖచూడుని సంహారమునకై శిపుని వియోగించి తనలోకమునకు వెళ్ళాను. శంకరుడు దేవతలనుద్దరించుటకు చంద్రభాగానదీ తీరముననున్న మజచెట్టు నీడలో కూర్చుండి పుష్పదంతుడను గంధర్వుని శంఖచూడుని యొద్దకు దూతగా పంపించచెను.

ఆ శంఖచూడుని నగరము అమరావతికంటే గొప్పగా ఉండినది. అచ్చటి భవనములు కుబేరుని భవనముల కంటే మైనవి. ఆ నగరము ఐదు యోజనముల విస్తీర్ణముతో పదీయోజనములు పొడవుగా నున్నది. చుట్టు. ఏడు అగర్తలున్నవి, వందలకొలది వీథులున్నవి. వాటిలో వర్తక సమూహములు అనేక వస్తువులను తెచ్చి' విక్రయింతురు. అచ్చట దివ్యాశ్రమములు మారుకోట్లకు పైగా నున్నవి. అట్టి నగర మధ్య భాగమున పుష్పదంతుడు శంఖచూడుని చూచెను.

ఆతీవ వలయాకారం యథాపూర్ణేందుమండలం

జ్వలదగ్ని శిఖాభిశ్చ పరిఖాభిశ్చతసృభిః

సుదుర్గమం చ శత్రూణాం అన్యేషాం సుగమం సుఖం

అ త్యుచ్చైర్గగన స్పర్ష్య మణి ప్రాచీరవేష్టితం

రాజీతం ద్వాదశద్వారే ద్వార పాలసమన్వితైః

 రత్న కృత్రిమ పద్మాడ్యై రత్న దర్పణ భూషితైః

మణీంద్రపార ఖచితైః శోభితం లక్షమందిరైః

శోభితం రత్నసోపానైః రత్నస్తంభవిరాజితైః

రత్నచిత్ర కపాటాద్యైః సద్రత్న కలశాన్వీతైః

రత్నేంద చిత్ర రాజీభిః సుదీప్తాభిర్విరాజితైః

పరితో రక్షితం శశ్వద్ధానమైః శతకోటిభిః

దివ్యాస్త్ర ధారిభిః శూరై మహాబలపరాక్రమైః

సుందరైశ్చ సువేషైశ్చ నానాలంకార భూషితైః

 తాన్ దృష్ట్యా పుష్పదంతోఽపి వరద్వారం దదర్శ సః

చంద్రునివలె వలయాకారమున నున్న అతని అంతఃపురమునకు మరొక నాలుగు ఆగడలున్నవి. వాటివల్ల శత్రువులెవరు - దానిని ప్రవేశింపలేరు. భవనములన్నియు మణి నిర్మితములు. అవి ఆకాశము నంటుచున్నవి. ద్వారపాలురు ఎల్లప్పటికి రక్షించు పది రెండు ద్వారములున్నవి. రత్నములతో, చిత్రములలో, రత్నకలశములతో నున్న కవాటము లా ద్వారములకున్నవి. వాటిని ఎల్లప్పుడు మహాబలపరాక్రమసంపన్నులై దివ్యాస్త్రములను ధరించియున్న భటులు రక్షింతురు. అటువంటి ద్వారములనన్నిటిని చూచుచు పుష్పదంతుడు ప్రధాన ద్వారమును చేరెను.

ద్వారే వియుక్తం పురుషం శూలహస్తంచ సస్మితం

తిష్ఠంతం పింగళాక్షంచ తామ్రవర్ణం భయంకరం

కథయామాస వృత్తాంతం జగామతదనుజ్ఞయా

ఆతీక్రమ సపద్వారం జగామాఽభ్యంతరం పురం

 న కైశ్చిత్ వారితో దూతో దూతరూపేణ తస్యచ

గత్వా శోఽభ్యంతర ద్వారం ద్వారపాలమువాచ హ

రణస్య సర్వవృత్తాంతం విజ్ఞాపయితుమీశ్వరం

స చ తం కథయిత్వాన దూతం గంతు మువాచ హ

స గత శంఖచూడం తం దదర్శ సుమనోహరం

రాపమండలమధ్యస్థం స్వర్ణసింహాసనస్థితం

మణీంద్ర ఖచితం చిత్రం రత్నదండ సమన్వితం

రత్న కృత్రిమపుపై ప్రశస్తం శోభితం సదా

భృత్యేన హస్త వీధృతం స్వర్ణచ్ఛత్రం మనోహరం

సేవితం పార్షదగణైర్వ్యజనైః సీత చామరైః

సువేషం సుందరం రమ్యం రత్నభూషణ భూషితం

మాల్యానులేపనం సూక్ష్మపస్త్రం చ దధతం మునే

దాపవేంద్రైః పరివృతం సువేషం చ త్రికోటిభిః

శతకోటిభిరన్యై భీమ: శస్త్రధారిభిః

ఏవంభూతం చ తం దృశ్య పుష్పదంతః సవిస్మయః

ఉవాచ రణవృత్తాంతం యదుక్తం శంకరేణ చ

పుష్పధంతుడు ప్రధానద్వారమును చేరి అచ్చట పూలహస్తం మహాభయంకరముగా నున్న ద్వారపాలకుపకు తాను వచ్చిన వృత్తాంతమును వివరించి అతనిఅనుజ్ఞతో లోనికి అంతఃపురమును ప్రవేశించెను.

అతడు దూత కావున ఎవ్వరతనిని అడ్డగించలేదు. ఆ విధముగా ఆంతఃపురమును ప్రవేశించి అచ్చటమన్న ద్వారపాలకుని ఆమజ్జలో అంతఃపురమున నున్న శంఖచూడుని దర్శించెను.

అప్పుడు శంఖచూడుడు రత్న సింహాసనముపైన కూర్చుని రత్నదండమును చేతపట్టుకొని, ఒక భృత్యుడు బంగారు ఛత్రమును పట్టకొనగా, మరికొందరు తెల్లని చామరములు. వీయుచుండగా, రత్నాలంకార శోభితుడై, సూక్ష్మ వస్త్రములను మాల్యములను, అను లేపనమును ధరించి యుండెను. అతని చుట్టు అనేకులైన రాక్షసులు కూర్చొని యుండిరి. శాస్త్రములను ధరించిన భటులు అతని చుట్టు తిరుగుచుండిరి. ఆ విధముగా సన్న ఖచూడుని చూచి పుష్పదంతుడు చాలా ఆశ్చర్యపడి కరుడు చెప్పిన యుద్ధ వృత్తాంతమును యథాతథముగా తెల్పెను.

పుష్పదంత ఉవాచ- పుష్పదంతుడిట్లు పలికెను-

రాజేంద్ర శివదూతోఽహం పుష్పదంతాభిధః ప్రభో

యదుక్తం శంకరేణై వ త త్భ్రవీమి నిళామయ

రాజ్యం దేహి చ దేవానామధికారం చ సాంప్రతం

దేవాశ్చ శరణాపన్నా దేవేరే శ్రీహరి పరే

దత్వాత్రిశూలం హరిణా తుభ్యం ప్రస్థాపితః శివః

చంద్రభాగానదీతీరే వటమూలే త్రిలోచనః

విషయం దేహితేషాంచ యుద్ధం వా కురు నిష్చయం

గత్వా వక్ష్యామి కిం శంభుం తద్భవాన్ వ క్తుమర్హతి

ఓ మహారాజా! నేను శివుని దూతను. నాపేరు పుష్పదంతుడు, శంకరుడు చెప్పిప మాటలను యథాతథముగా చెప్పుచున్నాము. విషము. దేవతలకు రాజ్యమును అధికారమును ఇచ్చి వేయుము. దేవతలండరు ఈ విషయమున శ్రీహరిని శరణువేడిరి. అతడు శివునకు త్రిశూలమునిచ్చి నీగురించి పంపెను. ఆ పరమశిపుడు చంద్రభాగానదీతీరమున మత చెట్టు వీడలో కూర్చోని యున్నాడు. నీవు దేవతలకు వారి రాజ్యమువిత్తువో యుద్ధము చేయుదువో స్పష్టముగా చెప్పినచో శంకరునకు నేమ ఎప్పుదును ఆనెను. వేమ చెప్పుదును అనెను.

దూతస్య వచనం శ్రుత్వా శంఖచూడః ప్రహస్య చ

ప్రభాతేహ్యగమిష్యామి త్వంచ గచ్ఛేత్యువాచ హ

స గత్యోవాచ తూర్ణం తం వటమూలస్థమీశ్వరం

శంఖచూడవ్య వచనం తదీయం యత్పరిచ్ఛదం

దూతగా వచ్చిన పుష్పదంతుని మాటలు విని శంఖచూడుడు నప్పి నేను రేపుదయము వత్తును నీవు వెళ్ళిపొమ్మనెను.

పుష్పదంతుడట్లే బయలుదేరి వటవృక్షము యొక్క నీడలో మన్న శివునితో శంఖచూడుని మాటలను అతని బలమును వివరించి చెప్పను.

ఏతస్మిన్నంతరే స్కందః ఆజగామ శివాంతికం

వీరభద్రశ్చ నందీచ మహాకాళః సుభద్రకః

విశాలాక్షశ్చ బాణశ్చ పింగళాక్ష వికంపనః

విరూపో వికృతిశ్చైవ మణిభద్రశ్చ భాష్కలః

కపిలాక్షో దీర్ఘదంష్ట్రో వికటసామ్రలోచనః

కాలంకటో బలీ భద్రః కాలజిహ్వా: కుటీచరః

 బలోన్మత్తో రణ దుర్జయో దుర్గమస్తథా

అష్టౌచ భైరవా రౌద్రా రుద్రాకాదశసృ్మతా:

వాసవో వాసవాద్యాల ఆదిత్య ద్వాదశసతాః

హుతాశనశ్చ చంద్రశ్చ విశ్వకర్మాత్వినౌ చ శా

కుభేరశ్చ యమశ్చైవ జయంతో నల కూబరః

వాయులీ కరుణవ బుధోపై మంగళస్తథా

ధర్మర శనిరీశానః కామదేవ్చ వీర్యవాన్

ఉగ్రదంషా చోగ్రచండా కోట్టరీ కైటభ తథా

స్వయం శతభుజాదేవి భద్రకాళీ భయంకరీ

రత్నందరాజి ఖచిత విమానోపరి సంస్థితా

రక్తవస్త్రపరిధానా రక్తమాల్యాసులేపనో

నృత్యంత చ హసింత న గాయంతీ సుస్వరం ముదా

ఆభయం దదతీ భక్తమభయాసా భయం రిపుం

బిభ్రతీ వికటాం జిహ్వాం సులోలాం యోజనాయతాం

ఖర్పరం వర్తులాకారం గంభీరం యోజనాయతాం

 త్రిశూలం గగన స్పర్శి శక్తి వై యోజనాయతాం

 శంఖం చక్రం గదాం పద్మం శరాపం భయంకరం

ముద్గరం ముసలం వజ్రం ఖడ్గం ఫలకముజ్వలం

 ప్రస్రం వారుణాస్త్రం ఆగ్నేయం నాగపాకం

నారాయణాస్త్రం బ్రహ్మాస్త్రం గాంధర్వం గారుడం తథా

పార్జన్యంవై పాశుపతం జృంభణాస్త్రంచ పార్వతం

మాహిశ్వరాస్త్రం వాయవ్యం దండం సంమోహనం తథా

నానావిధాన్యాయుధాని దీవ్యా స్త్ర శతకం పరం

ఆగత్య తత్ర తిస్థౌ యోగినీనాం త్రికోటిభిః

సార్థం పై డాకినీనాం చ వికటాచారి త్రికోటిభిః

భూత ప్రేత పిశాచశ్చ కూష్మాండ బ్రహ్మ రాక్షసా:

వేతాలాశ్చైవ యక్షాశ్చే రాక్షసావ కింకరా

తాభిశ్చైవ సహ స్కందో నల్వానై చంద్రశేఖరం

పితుః పా ర్ష్వే సభాయాంచ సమువాస భవాజ్ఞయా

ఆ సమయమున వీరభద్రుడు, నంది, మహాకాళుడు, సుభద్రకుడు, విశాలాక్షుడు, బాణుడు, పింగళాక్షుడు, ఏకంపనుడు. వీరూపుడు, వికృతి, మణిభద్రుడు, బాష్కలుడు, కపిలాక్షుడు, దీర్ఘదండు, వికటుడు, రామలోచనుడు, కాలంకటుడు, బలి భద్రుడు, కాలజిహ్వుడు, కుటీచరుడు, బలోన్మత్తుడు రణ, దుర్జయుడు, దుర్గముడు, ఎనమండుగురు ఔరపులు, ఏకాదశరుద్రులు, ఇంద్రుడు మొదలగు దేవతలు, అష్టదిక్పాలురు, కోట్టర్, కైటభీ, మొదలగువారు వచ్చిరి. భద్రకాళి త్రిశూలము, శంఖ చక్ర, గదాద్యాయుధములు, వైష్ణవాస్త్రము, వారుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము వంటి ఆస్త్రములు ధరించి డాకినులు, వికటలు, వెంటరాగా అచ్చటికి వచ్చెను. భూత ప్రేత పిశాచగణము కూష్మాండ బ్రహ్మరాక్షసులు, భేతాళులు, యక్షులు మొదలగువారందరితో కలిసి కుమారస్వామి వచ్చి తండ్రికి నమస్కరించి అతని ప్రక్క కూర్చుండెను.

అథ దూతే గతే తత్ర శంఖచూడః ప్రతాపవాన్

ఉవాచ తులసీం వార్తాం గత్వాఽభ్యంతరమేవచ

రణవార్తాం చేసా శ్రుత్వా శుష్కకంఠోష్ఠ తాలుకా

ఉవాచ మధురం సాధ్వీ హృదయేన విదూయతా

దూతయైన పుష్పదంతుడు వెళ్ళిపోయిన తరువాత శంఖచూడుడు ఆంతః పురమునకు వెళ్ళి తులసితో ఈవిషయమునంతయు చెప్పెను. యుద్దవార్త వినబడగానే తులసి బాధపడుచు. పెదవులెండి పోగా ఈ విధముగా తన భర్తతో అనెను.

తులస్యువాచ - తులసి ఇట్లు పలికినది-

హేప్రాణనాథ హే బంధో తిష్ఠ మే వక్షసి క్షణం

హే ప్రాణాధిష్ఠాతృదేవ రక్ష మే జీవనం క్షణం

 భుంక్ష్వ జన్మసు బోగ్యం తద్యదై మనసీ వాంఛితం

పశ్యామి త్వాం క్షణం కించిల్లోచనాభ్యాం పిపాసితా

 ఆందోలయంతి ప్రాణా మే మనోదగ్ధం చ సంతతం

దుస్స్వప్నం చాధ్యమే దృష్టం చాద్యైవ చేరమేనిశి

తులసీవచనం శ్రుత్వా భుక్త్యా పీత్వా నృపేశ్వరః

ఉవాచ వచనం ప్రాజ్ఞో హితం సత్యం యథోచితం

ఓ ప్రాణనాథుడా! ఒక్క క్షణము నా ఎదపై ఉండుము. నాప్రాణములను రక్షించుము. నీ మనసులోని కోరికను తీర్చుకొనుము. నేను నిన్ను తనివి తీర చూడనిమ్ము నీమాటవినగానే నా మనస్సు ఆందోళన చెందుచున్నది. అట్లే ఈ తెల్లవారుజామున నా కొక పీడకల, వచ్చినది. అందువలన యుద్దమును విరమించుకొమ్మని తులసి ప్రార్థించగా రాజైన శంఖచూడుడు తులసి దగ్గరనే తిని, రాగి, సత్యము హితవైన మాటనిట్లు పలికెను.

శంఖచూడ ఉవాచ – శంఖచూడుడిట్లనెను-

కాలేన యోజితం సర్వం కర్మభోగ నిబంధనే

 శుభం హర్షం సుఖం దుఃఖం భయం శోకమమంగళం

 కాలే భవంతి వృక్షాశ్చ శాఖామంతశ్చ కాలతః

క్రమేణ పుష్పవంతశ్చ ఫలవంతశ్చ కాలతః

తేషాం పలానీ పక్వాని ప్రభవంత్యేవ కాలతః

తే సర్వే ఫలినః కాలే కాలే కాలం ప్రయాంతి చ

భవంతి కాలే భూతాని కాలే కాలం ప్రయాంతి చ

 కాలే భవంతి విశ్వాని కాలే నశ్యంతి సుందరి

 ప్రతీ చి కాలే సృజతి పాతాపాతీ చ కాలతః

సంహర్తా సంహరేత్కాలే సంచరంతి క్రమేణ తే

 బ్రహ్మ విష్ణు శివాదీనాం ఈశ్వరః ప్రకృతేః పరః

 స్రష్టా పాలాచ సంహర్తా సకృత్స్నాంశేన సర్వదా

కాలే స ఏవ ప్రకృతి నిర్మాయ స్వేచ్ఛయా ప్రభుః

 నిర్మాయ ప్రాకృతాన్ సర్వాన్ విశ్వస్థాంశ్చ చరాచరావ్

 ఆబ్రహ్మస్తంబపర్యంతం సర్వం కృత్రిమమేవచ ప్రవదంతి చ

కాలేన నశ్యత్యపిహి నశ్వరం

భజ సత్యం పరం బ్రహ్మ రాధేశం త్రిగుణాత్పరం

సర్వేశం సర్వరూపంచ సర్వాత్మానంతమీశ్వరం

జలం జలేన సృజతి జలం    పాతి జలేన య:

హరేజలం బలేవైవ తం కృష్ణం భజు సంతతం

యస్యాజ్ఞయా వాతి వాతః శీఘమీ చ సంతతం

యస్యార్జియా చ తపన: తపత్యేన యథాక్షణం

యథాక్షణం వర్షతింద్రో మృత్యుశ్చరతి జంతుషు

యథాక్షణం దహత్యగ్నిః చంద్రౌభ్రమతి భీతవత్

 మృత్యోర్మూలం కాలమూలం యమస్యచ యమం పరం

స్రష్టారం స్రష్టురపిచ పాతు: పాలక మేవచ

 సంహర్తారం చ సంహర్తు; తం కృష్ణం శరణం వ్రజ

 కో బంధవ కేషాం వా సర్వబంధుం భజ ప్రియే!

అహం కోవా త్వం చ కావా విధి యోజిత: పురా

 త్వయా సార్థం కర్మణాచ పునస్త్వ వియోజితః

 అజ్ఞానీ కాతరః శోకే విపత్తా చ న పండితః

సుఖం దుఃఖం భ్రమత్యేవ చక్రనేమి క్రమేణ చ

నారాయణం తం సర్వేశం కాంతం ప్రాప్త్యసి నిశ్చితం

తపః కృతం యదగ్ధచ పురా బదరికాశ్రమే

 మయా త్వం తపసాలబ్దా బ్రహ్మణశ్చ వరేణహి

హరేరర్థే తన తపో హరిం ప్రాప్త్యసి కామీని

బృందావనే చ గోవిందం గోలోకే త్వం లభిష్యసి

 ఆహం యాస్యామి తల్లోకం తనుం త్యక్త్యా చ దానవీం

తత్ర ద్రక్ష్యసి మాం త్వం చ త్వాంచద్రక్ష్యామి సంతతం

ఆగమం రాధికాశాపాత్ భారతం చ సుదుర్లభం

పునరాస్యామి తత్రైవ కః శోకమే శ్రుణుప్రియే

త్వం హి దేహం పరిత్యజ్య దివ్యరూపం విధాయచ

తత్కాలం ప్రాప్స్యసి హరిం మా కాంతే కాతరా భవ

 ఇత్యుక్త్వా చ దీనాంతే చ తయా సార్థం మనోహరే

ఓ తులసి! కాలము అన్నిటినీ కలిగించును. సుఖం, హర్షము, దు:ఖం, భయం మొదలగునవన్నియు కాలము వల్లనే జరుగుచున్నవి. చెట్లు పెరిగి పెద్దవై పుష్పఫలములనిచ్చి పండి పడిపోవుట కొలమూలముననే జరుగుచున్నది. ప్రాణులన్నియు ఈకాలము వలననే పుట్టుచున్నవి నశించుచున్నవి. బ్రహ్మదేవుడు కాలముననుసరించి ఈ విశ్వసృష్టి చేయగా విష్ణువు కాలముననుసరించి రక్షించుచున్నాడు. అట్లే శంకరుడు కాలప్రభావమువలననే ఈవిశ్వమును లయింప చేయుచున్నాడు. పరబ్రహ్మయగు కృష్ణుడు సైతము కాలముననుసరించియే బ్రహ్మాది దేవతలను, ప్రకృతిని సృష్టించుచున్నాడు.

బ్రహ్మదేవుడు మొదలుకొని చీమల వరకున్న సమస్త ప్రపంచము అశాశ్వతమైనది, వాటి కాలము తీరగనే నశించుచున్నది. అందువలన సత్యస్వరూపుడు పరాత్పరుడు అగు శ్రీకృష్ణుని సేవింపుము. అతని ఆజ్ఞవలననే గాలి వీచుచున్నది. అగ్నిమండుచున్నది. ఇంద్రుడు వర్షించుచున్నాడు. మృత్యువు తన కార్యక్రమమును పూర్తి చేయుచున్నాడు. మృత్యువునకు, కాలమునకు యమునకు, సమస్త చరాచరసృష్టికి మూలపురుషుడగు శ్రీకృష్ణుని శరణు పొందుము. నీవెవరు నేనెవరు? ఎవరు ఎవరికి బంధువు. ఆ భగవంతుడే నిన్ను నన్ను ఈ విధముగా కలిపినాడు. మరల వియోగము కలిగింపనున్నాడు.

అజ్ఞాని యగువాడు ఆపదలందు, శోకసమయమున బాధపడును. కాని జ్ఞానవంతుడట్లు కాదు. అతడు సుఖదుఃఖములు చక్రములో ఆకులు పైకి కిందికి తిరుగుచున్నట్లే వచ్చునని భావించును.

 నీవు ఎవరిగురించి పూర్వము తపస్సు చేసినానో ఆవారాయణునీ వచ్చు జన్మలో భర్తగా పొందగలవు, నేను కూడ తపస్సు చేసి బ్రహ్మదేవుని వలన నీన్ను భార్యగా పొందినాను. గోలోకమందలి బృందావనములో నీవు నీ తపస్పున కనుకూలముగా గోవిందుని భర్తగా పొందుదువు. నేను కూడ ఈ రాక్షస శరీరమును వదలి గోలోకమువకు వచ్చి నిన్ను చూతును. నీవుకూడ అక్కడ సస్ను చూచెదవు. నేను రాధాదేవి శాపమువలన ఈ భారత భూమికి వచ్చితిని. మరల తిరిగి పోవుచున్నాను. అందువలన దు:ఖింపవలసిన పనిలేదు. వీపుకూడ నీ శరీరమును వదిలి దివ్యరూపము ధరించి శ్రీహరిని పొందుదువు. అందువలన శోకింపనవసరములేదు ఆనీ శంఖచూడుడు తులసితో అనెను.

సుష్వాప శోభనే తల్పే పుష్పచందన చర్చితే

వానా ప్రకారవిభవే చకార రత్న మందిరే

రత్నప్రదీప సంయుక్తే స్త్రీరత్నం ప్రాప్య సుందరీం

నినాయ రజినీం రాజా క్రీడా కౌతుక మంగళైః

కృత్వా వక్షసి కాంతం తాం రుదంతీమతిదు:ఖితాం

కృశోదరీం నీరాహారాం నీమగాం శోకసాగరే

పునస్తాం బోధయామాస దివ్యజ్ఞానేన బోధవిత్

 పురా కృష్ణేన యర్ధత్తం భాండీరే తత్వముత్తమం

న చ తస్యై దదో తచ్చ సర్వశోకహరం పరం

జ్ఞానం సంప్రాప్య సాదేవీ ప్రసన్న వదవేక్షణా

 క్రీడాం చకార హర్షేణ సర్వం మత్వాతీ స్వరం

తౌ దంపతీ చ క్రీడార్తౌ నిమగ్నౌ సుఖసాగరే

పులకాంకిత సర్వాంగో మూర్ఛితా నిర్జనే వనే

ఆంగప్రత్యంగ పంయుక్త సుప్రీతా సురతోత్పుకో

ఏకాంగో చ తథా తొ డ్వొ చార్థనారీశ్వరౌ యథా

ప్రాణేశ్వరం చ తులసీమెనే ప్రాణాధికం పరం

ప్రాణాధికాం చ తాం మేనేరాజా ప్రాణాధికేశ్వరం

తా స్థితా సుఖసుత్తా చ తంత్రీతా సుందరా సమౌ

సువేషా సుఖసంభోగాదచేష్టా సుమనోహరా

క్షణం సచేతనో నౌ చ కథయంతో రసాశ్రయాం

భుక్తవంతౌ చ తాంబూలం ప్రదత్తం చ పరస్పరం

పరస్పరం సేవితౌ చ సుప్రీత్యా శ్వేతచామరై:

 క్షణం శయానో సానందా వసంతా చ క్షణం పునః

క్షణం కేళినియుక్తౌ చ రసభావసమన్వితా

సురతాద్విర్నతిరాస్తి తౌ తద్వీషయ పండితా

సతతం జయయుక్తౌ ద్వౌ క్షణం నైవ పరాజితౌ

శంఖచూడుడు ఆ తర్వాత పుష్పచందనములు కల శృంగార తల్పముపై పడుకి సెమ. తులసిని తన దగ్గరకు తీసికొని ఏడ్చుచు అతి దు:ఖితయై నిరాహారగాయున్న తులసిని మరల ఓదార్పసాగెను. అట్లే శ్రీకృష్ణుడు తెలిపిన తత్వమునామెకు ఉపదేశించమ. అజ్ఞానమును పొంది తులసి సమస్తము క్షణికమని భావించి శోకవిదూరమైనది.

రతి క్రీడయందు ఆర్తులైన ఆ తులసి శంఖచూడులు నిర్జనవనమున తమ కోర్కె తీర్చుకొనిరి. శృంగారమునకు చెందిన కథలను చెప్పుకొనుచు వారిరువురు అర్ధనారీశ్వరులవలె ఏకాంగులన్నట్లుగా భాసించిరి. ఒకరి కొకరు తాంబూలము నిచ్చుకొని తీనుచు, భుక్తశేషమును పరస్పరము మార్చుకొనుచు, ఒకరి కొకరు చామరములు ఏయుచు శృంగార రసమున ఓలలాడిరి. వారిరువురకు శృంగార విషయమున అపజయము లేదు. ఒకరిని మించి మరొకరన్నట్లుగా ఇద్దరు జయము పొందిరి.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదే తులసీ శంఖచూడ సంభోగో నామ సప్తదశోఽధ్యాయః

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండపదగు ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాదమున తెలుపబడిన తులసీ శంఖచూడుల సంభోగమను పదునేడవ అధ్యాయము సమాప్తము.