బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

30 - పాపులు పొందు నరక కుండములు

యమ ఉవాచ- యమధర్మరాజు సావిత్రితో ఇట్లనెను-

 హరిసేవారతః శుద్దో యోగీ శుద్ధోవ్రతీ సతి

 తపస్వీ బ్రహ్మచారీ చ న యాతి నరకం యతిః

కటువాచా బాంధవాంశ్చ బలత్వేన చ యో నరః

దగ్ధాన్ కరోతి బలవాన్ వహ్నికుండం ప్రయాతి సః

గాత్ర లోమప్రమాణాబ్దం తత్ర స్థిత్వాహుతాశనే

పశుయోనిమవాప్నోతి రౌద్రే దగ్ధస్త్రిజన్మని

శ్రీహరి పాదాబ్జములను సంతతము కొల్చువాడు, యోగి, వ్రతములు చేయువాడు, తపస్సు చేయువాడు. బ్రహ్మచారి వీరందరు పరిశుద్దమైన వారు. కావున వారు నరకమునకు ఎన్నడును వెళ్ళరు.

దుష్టుడై బంధువులను కటువైన మాటలతో బాధపెట్టువాడు వహ్నికుండమను. నరకమునకు పోవును. అచ్చట తనకు వెంట్రుకలెన్ని యున్నవో అన్ని సంవత్సరములు బాధపడి మూడు సార్లు పశుజన్మనెత్తును.

బ్రాహ్మణం తృషితం క్షుణ్ణం ప్రతప్తం గృహమాగతం

న భోజయతి యో మూడస్తప్త కుండం ప్రయాణిసః

తత్ర లోమ ప్రమాణాబ్దం స్థిత్వా తత్ర  చ దుఃఖితః

తప్తస్థలే వహ్నికుండే పక్షి చసప్తజన్మసు

ఎండలో తిరిగినందువలన బాధపడుచు దప్పిగొని ఇంటికి వచ్చిన బ్రాహ్మణునకు చల్లని నీరిచ్చి భోజనము పెట్టనిచో ఆతడు తప్తకుండమను నరకమునకు పోవును. అచ్చట తన శరీరముపై ఎస్నీ వెండ్రుకలున్నవో అన్ని సంవత్సరములు బాధలు పడుచు. తరువాత ఏడు జన్మల వరకు పక్షిగా జన్మించును.

రవి వారార్క సంక్రాత్యామమాయాం శ్రాద్దవాసరే

వస్త్రాణాం క్షారసంయోగం కరోతి. యోహి మానవః

స యాతి క్షారకుండం చ సూత్రమానాబ్దమేవచ

స వ్రజేద్రాజ కీం యోనిం సప్త జన్మసు భారతే

ఆదివారమున, సూర్యసంక్రమణ దినమున, అమావాస్యనాడు. శ్రాద్ధము పెట్టు దినమున బట్టలను చపుడు వేసి (లేక సబ్బు పెట్టి?) ఉతికినచో ఆతడు తానుతికిన బట్టలలో ఎన్నిదారములున్నవో. ఆన్ని సంవత్సరములు క్షారకుండమనే నరకమున నుండును. తరువాత ఏడు జన్మలవరకు రజకుడై పుట్టును.

స్వదత్తాం పరదత్తం వా బ్రహ్మవృత్తిం హరేత్తు యః

 షష్టి వర్ష సహస్రాణి విట్కుండం చ ప్రయాతి స

షష్టి వర్ష సహస్రాణి వీడ్ఫోజీ తత్ర తిష్ఠతి

షష్టి వర్ష సహస్రాణి విట్కృమిశ్చ పునర్భువి

తాను దానమిచ్చినది లేక ఇతరులు దానమిచ్చిన బ్రాహ్మణ వృత్తిని ఎవరు హరింతురో వారు అరవై వేల సంవత్సరములు మలకుండమను నరకముననుండి మలమును భుజించుచుందురు. ఆ తరువాత అరవై వేల సంవత్సరముల వరకు మలమును భుజించు క్రిమిగా పుట్టుదురు.

 పరకీయ తడాగే చ తడాగం యః కరోతి చ

ఉత్సృజేద్దైవ దోషేణ మూత్రకుండం ప్రయాతి సః

తద్రేణు మానవర్షం చ తద్భోజీ తత్ర తీష్ఠతీ

భారతే గోధీకా చైవ స భవేత్సప్త జన్మసు

ఇతరులు తవ్వించిన చెరువును తనదిగా ప్రకటించుకొనిన వాడు, చెరువులో మూత్రమును వదలినవాడు. తాను విడిచిన మూత్రమున ఎన్ని తుంపరలున్నవో అన్ని సంవత్సరములు మూత్రకుండమను నరకమునకు పోవును. అచ్చట మూత్రమునే ఆహారముగా స్వీకరించును. తరువాత ఏడు జన్మలవరకు ఉడుముగా పుట్టును.

ఏకాకీ మృష్టమశ్నాతి శ్లేష్మకుండం ప్రయాతి సః

 పూర్ణమబ్దశతం చైవ తద్బోజీ తత్ర తిష్ఠతి

పూర్ణమబ్ద శతం చైవ సప్రేతో భారతో భవేత్

శ్లేష్మ మూత్ర గరం చైవ పూయం భుంక్తే తతః శుచిః

ఒంటరిగా మృష్టాన్నమును తినినచో నూరు సంవత్సరములు శ్లేష్మకుండమను నరకముననుండి శ్లేష్మమును తినుచుండును. తరువాత నూరు సంవత్సరములు ప్రేతగానుండి శ్లేష్మమును, మూత్రమును, రసిని తినుచుండును.

 పితరం మాతరం చైవ గురుం భార్యాం సుతం సుతాం

 యో న పుష్ణాత్యనాథంచ గరకుండం ప్రయాతి సః

 పూర్ణమబ్దసహస్రం చ తద్భోజీ తత్రతిష్ఠతి

తతో వ్రజేద్భూత యోనిం శతవర్షం తతః శుచిః

తల్లి దండ్రులను, గురువును, భార్యను. తన సంతానమును, అనాథలను పోషింపనివాడు గరళకుండమను నరకమునకు వెళ్ళును. అచ్చట వేయి సంవత్సరములుండి తిరిగి జన్మనెత్తినను భూతమై నూరు సంవత్సరములుండును. ఆ తరువాత ఇతర జన్మల పొందును. 

దృష్ట్వాతిథిం వక్రచక్షుః కరోతి యోహి మానవః

 పితృదేవాస్తస్య జలం న గృహ్ణంతి చ పాపినః

యాని కానీ చ పాపానీ బ్రహ్మహత్యాదికాని చ

 ఇహైవ లభతే చాంతే దూషికా కుండమావ్రజేత్

 పూర్ణమబ్దశతం చైవ తద్బోజీ తత్ర తిష్ఠతి

తతో నరో భవేద్భూమౌ దరిద్రః సప్తజన్మసు

ఇంటికి అతీథరాగా ఆతనిని నిరాదరణ చేసిన పాపి చేసిన పితృతర్పణమును, పితృదేవతలు స్వీకరింపరు. పైగా ఆతనికి బ్రహ్మహత్యాది పాపములు చుట్టుకొనును. ఆతడు చనిపోయిన తరువాత దూషికాకుండమను నరకమున నూరు సంవత్సరములుండి తిరిగి మానవుడై పుట్టినను దరిద్రుడగును. ఇట్లు ఏడు జన్మలవరకు దరిద్రముననుభవించుచుండును.

దత్వా ద్రవ్యం చ విప్రాయ చాన్యస్మై దీయతే యది

స తిష్ఠతి వసాకుండే తద్భోజీ శతవత్సరం

తతో భవేత్స చండాల స్త్రీజన్మని తతః శుచిః

కృకలాసో భవేత్సోఽపి భారతే సప్తజన్మసు

బ్రాహ్మణునకు దానము చేసిన ధనమును తిరిగి తీసికొనీ ఇతరులకిచ్చీనచో అతడు వసాకుండమను నరకమున నూరు సంవత్సరములుండును. తరువాత మూడు జన్మల వరకు చండాలుడై పుట్టి ఆ తర్వాత ఏడు జన్మల వరకు తొండయై పుట్టును.

పుమాంసం కామినీవాపి కామినీం వా పుమానథ

యః శుక్రం పాయయ్యవ శుక్రకుండం ప్రయాతి సః

పూర్ణమబ్దశతం చైవ తద్భజీ తత్ర తిష్ఠతి

యోనికృమి: శతాబ్దం చ భవేద్భువి తతః శుచిః

స్త్రీ పురుషుల మధ్య అక్రమ సంబంధమున్నచో వారిద్దరు శుక్రకుండమను నరకమునకు పోయి, అచ్చట నూరు సంవత్సరములు బాధపడి, భూమిపై యోని క్రిమిగా నూరుసంవత్సరములవరకుందురు.

సం తాడ్య చ గురుం విప్రం రక్తపాతం చ కారయేత్

స చ తిష్ఠత్యసృక్కుండే తద్బోజీ శతవత్సరం

తతో భవేత్ వ్యాధజన్మ సప్తజన్మసు భారతే

తతః శుద్ధి మవాప్నోతి మానవశ్చ. క్రమేణ చ

బ్రాహ్మడగు గురువును రక్తము కారునట్లు కొట్టినవాడు రక్తకుండమను నరకమున నూరు సంవత్సరములు బాధపడును. ఆ తరువాత ఏడు జన్మలవరకు వ్యాధుడై పుట్టును.

ఆశ్రు స్రవంతం గాయంతం భక్తం దృష్ట్యా చ గద్గదం

శ్రీ కృష్ణ గుణ సంగీతే హసత్యేవ హి యో నరః

స వసేదశ్రు కుండే చ తదోజీ శతవత్సరం

తతో భవేత్స చండాలస్త్రీజన్మని తతః శుచిః

శ్రీకృష్ణుని గుణ కీర్తనమును గద్దదకంఠముతో, ఆనందబాష్పములతో చేయుచున్న భక్తుని చూచి నవ్వినచో (వెక్కిరించినచో) ఆతడు నూరు సంవత్సరములు అశ్రుకుండమను నరకమునకు పోవును. తరువాత మూడు జన్మలవరకు చండాలుడై పుట్టును.

కరోతి ఖలతాం శశ్వదశుద్ధహృదయో నరః

కుండం గాత్రమూనాం చ సచ రతీ దశాబ్దకం

తతః స గర్దభీయోనిమవాప్నోతి త్రిజన్మని

త్రిజన్మనిచ శార్గాలీం తతః శుద్ధీభవేధ్రువం

చెడు భావనతో ఇతరులపట్ల దురుసుగా ప్రవర్తించువాడు పదిసంవత్సరములు గాత్ర మలకుండమున నివసించును. ఆ తరువాత మూడు జన్మలు గాడిదగా, మూడుజన్మలు నక్కగా పుట్టును.

బధిరం యో హసత్యేవ నిందత్యేవహి మానవః

స వసేత్కర్ణవిట్కుండే తద్బోజీ శతవత్సరం

తతో భవేత్సబధిరో దరిద్ర: సప్తజన్మసు

సప్తజన్మస్వంగహీనస్తత: శుద్ధిం లభేత్ ధ్రువం

చెవిటి వానిని చూచి వెక్కిరించినచో, అతడు నూరు సంవత్సరములు కర్లమల నరకమున నుండును. తరువాత ఏడు జన్మలవరకు దరిద్రుడై చెవిటివాడుగా పుట్టును. ఆ తరువాత ఏడు జన్మలవరకు ఆంగహీనుడై జన్మించును.

లోభాత్ స్వపాలనార్థాయ జీవినం హంతి యో నరః

మజ్జాకుండే వసేత్సోఽపి తద్బోజీ లక్షనరకం

తతో భవేత్సశశకో మీనశ్చ సప్త జన్మసు

ఏణాదయశ్చ కర్మభ్యః తతః శుద్ధిం లభేత్ ధ్రువం

ఆశ వలననో, తన కడుపుకొరకో ఇంకొక ప్రాణిని చంపినచో అతడు "మజ్జాకుండ" మను నరకమున లక్షసంవత్సరములుండును. అటు పిమ్మట ఏడేడు జన్మల వరకు కుందేలుగా. చేపగా, లేడిగా జన్మించుచుండును.

స్వకన్యా పాలనం కృత్వా విక్రీణాతి హి యోనరః

ఆర్థలోభాన్మహామూడో మాంసకుండం ప్రయాతి సః

కన్యాలోమ ప్రమాణాబ్దం తద్భోజీ తత్ర తిష్ఠతి

తం చ కుండే ప్రహారం చ కరోతి యమకింకరః

కూతురును కని, పెంచి కన్యాశుల్కమును తీసికొని వివాహము చేయువాడు మాంసకుండమను నరకమునకు పోవును. అచ్చట తాను శుల్కము తీసికొన్న కన్య శరీరమున ఎన్ని వెంట్రుకలున్నవో, ఆన్నీ సంవత్సరములు యమకింకరులచే బాధలనందుచుండును.

మాంసభారం మూర్ద్నీ కృత్వా రక్తదారాం లిహేత్ క్షుధా

తతో హి భారతే పాపీ కన్యావిట్సు క్రిమిర్భవేత్

షష్టివర్ష సహస్రాణి వ్యాధశ్చ సప్తజన్మసు

త్రిజన్మని వరాహశ్చ కుక్కురః సప్తజన్మసు

సప్తజన్మసు మండూకోజలౌకాః సప్తజన్మసు

సప్తజన్మసు కాకశ్చ తతః శుద్ధిం లభేత్ ధ్రువం

తలపై మాంసమును పెట్టుకొని మోసికొని పోవుచున్నప్పుడు ఆకలివల్లనైనా ఆ మాంసమునందలి రక్తమును వాకినచో పాపి ఆరవై వేల సంవత్సరములు అశుద్ధములో క్రిమిగా నుండును. ఆ తరువాత ఏడు జన్మలు వ్యాధుడు కాగా మూడు జన్మలు పందీగను, ఏడుజన్మలు కుక్కగను, ఏడుజన్మలు కప్పగను. ఏడు జన్మలు జలగగను, ఏడుజన్మలు కాకిగను పుట్టి ఆ తరువాత పరిశుద్దుడగును.

వ్రతానాముపవాసానాం శ్రాద్ధాదీనాం చ సంయమే

న కరోతి క్షౌరకర్మ సోఽశుచి: సర్వకర్మసు

సచ తిష్ఠతి కుండేషు నఖాదీనాం చ సుందరి

 తదేవ దీనమానాబ్దం తద్భోజీ దండ తాడితః

వ్రతదినములలో, ఉపవాస దినములలో, శ్రాద్ధాది దినములలో నియముగా ఉండవలసిన దినములలో క్షారము చేసికొననిచో ఆతడు అన్ని సంవత్సరములు నఖకుండమను నరకమున యమభటులు దండించుచుండగానుండును.

సకేశం పార్థివం లింగం యోవాఽర్చయతీ భారతే

సతిష్ఠతి కేశకుండే మృద్రేణుమానవర్షకం

తదంతే యావనీం యోనిం ప్రయాతి హర కోపతః

శతాబ్దాత్ శుద్ధిమప్నోతి స్వకులం లభతే ధ్రువం

పార్థివ లింగముపై కేశము పడినను గమనించక పూజ చేయుపోడు కేశకుండమను నరకమున ఆ పార్థివ లింగమున నెన్నిరేణువులున్నవో అన్ని సంవత్సరములు ఉండును. ఆ తరువాత పరమ శివుని కోపమువలన నూరు సంవత్సరములు యవనుడుగా పుట్టును.

పితృణాం యో విష్ణుపదే పిండం నైవ దదాతి చ

స తిష్ఠత్యస్థికుండే చ స్వలోమాబ్దం మహోల్బణే

తతః స్వయోనిం సంప్రాప్య ఖంజః సప్తసు జన్మసు

భవేన్మహాదరిద్రశ్చ తతః శుద్దో హి దండత:

విష్ణుస్థానమైన గయా క్షేత్రమున పితృదేవతలకు పిండము పెట్టనివాడు తన శరీరమున ఎన్ని వెంట్రుకలున్నవో అన్ని సంవత్సరములు అస్థికుండమున యమ, బాధలు పడును. ఆ తరువాత ఏడు జన్మలవరకు కాటుక పిట్టగా జన్మించును. తరువాత మానవ జన్మనెత్తినను దరిద్రుడగున.

యః సేవతే మహామూడో గుర్విణీం చ స్వకామినీం

ప్రతప్త తామకుండే చ శతవర్షం స తిష్ఠతి

గర్భవతియగు తన భార్యతో సంభోగము చేయువాడు సలసలమరుగుచున్న తామ్ర కుండమను నరకమున నూరు సంవత్సరములుండును.

ఆవిరాన్నం చ యో భుంక్తే ఋతుస్నాతాన్నమేవచ

లౌహ కుండే శతాబ్దం చ సచ తిష్ఠతి తప్తకే

సవ్రజేద్రాజకీం యోనిం కర్మకారీం చ సప్తసు

మహావ్రణీ దరిద్రశ్చ తతః శుద్దో భవేన్నరః

సంతానము లేక విధవలైన స్త్రీ (అవీర) లేక ఋతుస్నాతమైన స్త్రీ చేతి అన్నమును తిన్నచో సలసలమరుగుచున్న లోహకుండమను నరకమున నూరు సంవత్సరములుండును. ఆ తరువాత ఏడు జన్మలు రజకుడుగా, ఏడు జన్మలు కమ్మరీగా పుట్టును. ఆ జన్మలలో అతడు అనేక ప్రణములతో బాధపడుచు దరిద్రుడగును.

యో హి ఘర్మాక్త హస్తేన దేవద్రవ్యముపస్పృశేత్

శతవర్ష ప్రమాణం ఘర్మకుండే స తిష్ఠతి

చెమటపట్టిన చేతులతో దేవ పూజా ద్రవ్యములను ముట్టుకొనినచో నూరు సంవత్సరముల వరకు ఖర్మకుండమను నరకమున ఉండును.

యః శూద్రేణాఽభ్యనుజ్ఞాతో భుంక్తే శూద్రాన్నమేవ చ

స చ తప్తసురాకుండే శతాబ్దం తిష్ఠతీ ద్వీజః

తతో భవేత్ శూద్రయాజీ బ్రాహ్మణ సప్తజన్మసు

శూద్ర శ్రాద్ధాన్నభోజీ చ తత: శుద్దో భవేత్ ధ్రువం

బ్రాహ్మణుడు శూద్రుని ఇంటిలో భోజనము చేసినచో అతడు తప్తసురాకుండమను నరకమున నూరు సంవత్సరములుండును. తరువాత ఏడు జన్మలవరకు అతడు శూద్రుల ఇండ్లలో పూజా పునస్కారములు చేయుచు శూద్రుల ఇండ్లలో శ్రాద్ధాన్నమును ఏడు జన్మలవరకు తినును.

వాగ్ధుష్టా కటువాచా యా తాడయేత్ స్వామినం సదా

తీక్ష్ణ కంటక కుండే సా తదోజీ తత్ర తిష్ఠతి

తాడితా యమదూతేన దండేన చ చతుర్యుగం

తత ఉచ్చైః శ్రవాః సప్త జన్మస్వేవ తతః శుచి:

కటువుగా మాటాడుచు భర్తను ఎల్లప్పుడు పీడించు స్త్రీ తీక్షణకంటకకుండమను నరకమున నాలు యుగములవరకు యమదూతలచే బాధలుపెట్టబడను. ఆ తరువాత ఏడు జన్మలవరకు గుజ్జముగా పుట్టుచుండును.

విషేణ జీవినం హంతి నిర్ధయో యో హి పామరః

విషకుండే చ తద్భోజీ సహస్రాబ్దం చ తిష్ఠతి

తతో, భవేన్నృఘాతి చ వ్రణీ ప్యా త్సప్త జన్మసు

సప్త జన్మసు కుస్థీచ తతః శుద్దో భవేత్ ధ్రువం

దయారహితుడై విషము పెట్టి చంపిన వాడు వేయిసంవత్సరములు విషకుండమను నరకమున విషమును తినుచుండును. తరువాత మానవ జన్మనెత్తినను, మానవులను బాధపెట్టుచు, ఏడు జన్మలవరకు మహావ్రణములతోను, ఏడు జన్మలవరకు కుష్టురోగముతోను బాధపడును.

దండేన తాడయేద్యోహి వృషం చ వృషవాహకః

భృత్యద్వారా స్వతంత్రోవా పుణ్యక్షేత్రే చ భారతే

ప్రతప్త తైలకుండే చ సతితి చతుర్యుగం

గవాం లోమ ప్రమాణాబ్దం వృషోభవతి తత్పరం   

భారతవర్షమునందలి పుణ్యక్షేత్రములలో ఎడ్లనెక్కిపోవువాడు తాను కాని అతని సేవకులు గానీ ఎడ్లను కొట్టరాదు, అట్లు చేసినచో అతడు ప్రతప్త శైలకుండమున నాలుగు యుగములుండును. ఆ తర్వాత అతడు ఎద్దుగా జన్మనెత్తును.

కుంతేన హంతి జీవం యో లౌహేన బడిశేన వా

కుంతకుండే వసేత్సోఽపి వర్షాణామయుతం సతి

తతః స్వయోనిం సంప్రాప్య చోదరవ్యాధి సంయుతః

క్లిష్టేన జన్మనైకేన తతః శుద్దో భవేన్నరః

ప్రాణులను లోహముచే చేయబడిన వస్తువులచే హింసించువాడు పదివేల సంవత్సరములు కుంతకుండమను నరకమున నివసించును. తిరిగి మానవ జన్మనెత్తినను జీవితాంతము కడుపు నొప్పిచే బాధపడుచుండును.

యో భుంక్తే చ వృధా మాంసం మత్స్యభోజీ చ బ్రాహ్మణః

హరేరనైవేద్యభోజీ కృమికుండం ప్రయాతి సః

 స్వలోమమానవర్షం చ తద్భోజీ తత్ర తిష్ఠతి

తతో భవేన్లేచ్ఛ బొతి: త్రిజన్మని తతో ద్విజ:

మాంసమును, శ్రీమన్నారాయణునకు నివేదింపనీ పదార్థమును తీను బ్రాహ్మణుడు క్రిమి కుండమను. నరకమునకేగును. అతని శరీరమున ఎన్ని వెండ్రుకలున్నవో అన్ని సంవత్సరములు ఆచ్చట బాధపడి తిరిగి భూలోకమున మానవుడై జన్మించినపుడు మూడు జన్మలవరకు మ్లేచ్ఛుడై పుట్టును.

బ్రాహ్మణః శూద్రయాజీ య: శూద్రశ్రాద్ధాన్నభోజకః

శూద్రాణాం శవదహీ చ పూయకుండం వ్రజేత్ ధ్రువం

యావల్లోమ ప్రమాణాబ్దం యజమానస్య సువ్రతే

తాడితో యమదూలేన తద్బోజీ తత్ర తిష్ఠతి

తతో భారతమాగత్య స శూద్రః సప్తజన్మసు

మహాశూలీ దరిద్రశ్చ తతః శుద్ధః పునర్ద్విజః

శూద్రులచే పూజలు చేయించువాడు, లేక శూద్రుల శ్రాద్దాన్నమును భుజించువాడు లేక శూద్రుల శవములను దహించు బ్రాహ్మణులు పూయకుండమను నరకమునకు వెళ్ళుదురు. ఆ నరకములో ఆ శూద్రుని శరీరమున ఎన్ని వెంట్రుకలున్నవో అన్ని సంవత్సరములు యమదూతలచే బాధలనందుచు, రసిని భక్షించుచుందురు. తరువాత భారత వర్షమున ఏడు జన్మలవరకు శూద్రులై పుట్టుదురు. అప్పుడు కూడ మహాదరిద్రులై శరీరమునందంతట శూలబాధననుభవించుచుందురు.

లఘుం క్రూరం మహాంతం వా సర్పం హంతి చ యోనః

స్వాత్మలోమ ప్రమాణాబ్దం సర్పకుండం ప్రయాతి స:

సర్పేణ భక్షితః సోఽపి యమదూతేన తాడితః

వసేచ్చ సర్పవీట్ జీవీ తతః సర్ప భవేత్ ధ్రువం

తతో భవేన్మానవశ్చాప్యల్పాయు; దద్రు సంయుతః

మహాక్లేశేన తన్మృత్యుః సరేణ చ భవేత్ ధ్రువం

చిన్నదైనను, పెద్దదైనను, మిక్కిలి క్రూరమైనదైనను సర్పమును చంపినచో తన శరీరమున ఎన్ని వెండ్రుకలున్నవో ఆన్ని సంవత్సరములు సర్పకుండమను నరకమున సర్పములు కరచుచుండగా, యమదూతలు బాధ పెట్టగా సర్పమలమును భక్షించుచుండును. తరువాత అతడు సర్పజన్మమునే ఎత్తును. తరువాత మానవ జన్మనెత్తీనను దద్దురులతో బాధపడుచు అల్పాయుష్కుడై సర్పముచేతనే మరణమునొందును.

విధిం ప్రకల్ప్య జీవంశ్చ క్షుద్ర జంతూంశ్చ హంతి యః

స దంశ మశకేకుండే జన్మమానదినాబ్దికం

 దివాఽనిశం భక్షితస్తైః అనాహారశ్చ శబ్దకృత్

బద్ధ హస్త పదాదిశ్చ యమదూతేన తాడితః

తతో భవేత్ క్షుద్రజంతు: జాతీర్వై యావతీ స్మృతా

తతో భవేన్మానవశ్చ సోఽoగహీనస్తతః శుచిః

ఒక ఉపాయమును పన్ని క్షుద్రజంతువులను చంపువాడు దంశమశక కుండమను నరకమున ఆహారములేక, జు జంతువులు రాత్రింబగళ్ళు తినుచుండగా యమదూతలు బాధ పెట్టగా నరక యాతనలనుభవించును. తరువాత క్షుద్రజంతువుగా పుట్టి అటు పిమ్మట అంగహీనుడై బాధలు చెందగలడు.

యో మూఢో మధుగృహ్ణాతి హత్వా చ మధుమాక్షికా

స ఏవ గరళే కుండే, జీపమాన దినాబ్ధికం

భక్షితో గరళైర్దగ్ధో యమదూతేన తాడితః

తలో హీ మక్షికాజాతీ: సతతశుద్దో భవేన్నరః

తేనేటీగలను చంపి తేనెను సంగ్రహించువాడు గరళకుండమను నరకమునకు పోవును. అచ్చట అతడు యమదూతలు బాధలు పెట్టుచుండగా విషమును తినుచు జీవించును. నరకయాతనలనుభవించి భూలోకమున తిరిగి జన్మించినప్పుడు తాను కూడా తేనేటీగగా జన్మించి బాధలననుభవించును.

దండం కరోత్యదండ్యే చ విప్రే దండం కరోతి చ

సకుండం వజ్రదంష్ట్రాణాం కీటానాం వై ప్రయాతి చ

తల్లో మమాన వర్షం చ తత్ర తిష్ఠత్యహర్నిశం

శబ్దకృద్భక్షితస్తైశ్చ తత; శుద్ధో భవేన్నరః

తప్పు చేయని బ్రాహ్మణుని దండించినవాడు వజ్రదం కీటకుండమను నరకమునకు పోవును. అచ్చట ఆ పురుగులు చప్పుడు చేయుచు ఆతనిని తినుచుండును.

అర్థలోభేన యోభూపః ప్రజాదండం కరోతి చ

వృశ్చికానాం చ కుండేషు తల్లో మాబ్దం వసేత్ ధ్రువం

తతో వృశ్చిక జాతిశ్చ సప్తజన్మసు జాయతే

తలో నరశ్చాంగహీనో వ్యాధియుక్తో భవేత్ ధ్రువం

పరిపాలకుడు ధనము నాశించి ప్రజలను దండించినచో అతడు వృశ్చిక కుండమునకు పోవును. తరువాత ఏడు జన్మలవరకు వృశ్చికమై పుట్టి తరువాత జన్మలో మానవుడై పుట్టినను అవయవహీనుడై రోగములతో బాధలు పడును.

బ్రాహ్మణ: శస్త్రధారీ యోహ్యన్యేషాం ధావకో భవేత్

సంధ్యా హీణశ్చ మూడశ్చ హరిభక్తి విహీనకః

స తిష్ఠతి స్వలోమాబ్దం కుండాదిషు శరాదిషు

విద్ధః శరాదిభి: శశ్వత్తతః శుద్ధో భవేన్నరః

శస్త్రాస్త్రములను ధరించి, సంధ్యావందనాది నిత్యకృత్యములను, హరిభక్తిని వదులుకున్న బ్రాహ్మణుడు, ఆతని శరీరమున ఎన్ని రోమములున్నవో అన్ని సంవత్సరములు శరకుండమను నరకమున నివసించును. అచ్చట బాణములచే బాధలు పడును.

కారాగారే సాంధకారే నీబధ్నాతి ప్రజాశ్చ యః

ప్రమత్త: స్వల్ప దోషేణ గోలకుండం ప్రయాత సః

 తత్కుండం తప్తతోయాక్తం సాంధకారం భయంకరం

తీక్ష్ణదం ష్ట్రైశ్చ కీటైశ్చ సంయుక్తం గోళకుండకం

కీటైర్విద్దో వసేత్తత్ర ప్రజాలోమాబ్దమేవచ

తతో భవేనీచ భృత్యస్తతః శుద్దో నరో భువి

చిన్న తప్పుకై ప్రజలను అంధకారబంధురమైన కారణారమున వేసి బాధించు నాయకుడు గోళకుండమను నరకమునకు పోవును. ఆ గోళకుండము సలసల కాగుచున్న నీటితో, చిమ్మ చీకటితో మహాభయంకరమై యుండును. అచ్చట వాడియైన కోరలు గల కీటకములనేకముండును.

ఆ గోళకుండమున భయంకరమైన కీటకములచే బాధల ననుభవించి మానవ జన్మనెత్తినను సాధారణ భృత్యుడై పుట్టును.

సరోవరాదుత్థితాంశ్చ నక్రాదీన్ హంతి యః సతీ

సక్రకంటక మానాబ్దం నక్రకుండం ప్రయాతి సః

తతో నక్రాది జాతిశ్చ భవేన్నద్యాదిషు ధ్రువం

తతః సద్యో విశుద్ధో హి దండేనైవ నరః పునః

చెరువులలో, నదులలో నున్న మొసళ్ళు మొదలగు జలజంతువులను చంపువాడు ఆ జలజంతువులకున్న ముళ్ళ సంఖ్య గల సంవత్సరములు సక్రకుండమను నరకమునకు పోయి బాధలననుభవించి తరువాత జన్మలో తాను కూడ నదులు మొదలగు స్థలములందు మొసలి మొదలగు బొతులలో పుట్టి తీరిగీ బాధలననుభవించును.

వక్షఃశ్రోణీస్తనాస్యం చ యః పశ్యతి పరస్త్రియాః

కామేన కాముకో యో హి పుణ్యక్షేత్రే చ భారతే

స వసేత్కాక కుండం చ కాకైశ్చ క్షుణ్ణలోచనః

తతః స్వలోమమానాబ్దం తతశ్చాంధ స్త్రీజన్మని

సప్త జన్మ దరిద్రశ్చ మహాక్రూరశ్చ పాతకీ

భారత స్వర్ణకారశ్చ స చ స్వర్ణవణిక్తతః

పుణ్యక్షేత్ర సందర్శనము చేయుచున్నప్పుడు ఆచ్చటకు వచ్చు పరస్త్రీల ఆందచందములను చూచి మోహపరవశుడై పోపువాడు కాకకుండమను నరకమునకు పోవును. అచ్చట కాకులు కండ్లను పొడుచుచుండగా బాధలుపడుచుండును. తరువాత మూడు. జన్మల వరకు గుడ్డివాడుగా పుట్టును. తరువాత ఏడు జన్మలవరకు దరిద్రుడుగను, మిక్కిలి క్రూరుడుగను పాపాత్ముడుగను పుట్టును. ఆ తరువాత స్వర్ణకారుడుగను. ఆటుపిమ్మట బంగారువర్తకము చేయువాడుగాను పుట్టును.

యో భారతే తామచోరో లోహచోరశ్చ సుందరి

స స్వలోమప్రమాణాబ్దం వజ్రకుండం ప్రయాతి పై

తత్రైవ వజ్రవిడ్భోజీ వజ్జ్రైశ్చ క్షుణ్ణలోచనః

తాడితో యమదూతేన తతః శుద్ధీ భవేన్నరః

ఈ భారత దేశమున తామ్ర (రాగి) మొదలగు లోహములను దొంగిలించువాడు వజ్రకుండమను నరకమునకు పోవును. అచ్చట యమదూతల బాధలననుభవించి తిరిగి భూలోకమున జన్మించును.

భారతే దేవచోరశ్చ దేవద్రవ్యాదిహారకః

సుదుష్కరే వజ్రకుండే స్వలోమాబ్దం వసేత్ధ్రువం

దేహదగ్ధో హి తద్వజ్రైరనాహారశ్చ శబ్ధకృత్

తాడితో యమదూతేన తతః శుద్దో భవేన్నరః

భారతదేశమున దేవతా విగ్రహములను దేవతా ద్రవ్యములను అపహరించువాడు వజ్రకుండనరకమున వజ్రముల రాపిడిచే శరీరమంతయు కాలగా, ఆహారములేక, యమదూతలు బాధలు పెట్టుచుండగా హాహాకారములు చేయుచుండును.

రౌవ్య గవ్యాంశుకానాం చ యశ్చోరః సురవిప్రయో:

తప్తపాషాణ కుండే చ స్వలోమాబ్దం వసేత్ ధ్రువం

త్రిజన్మని బకః సోఽపీ శ్వేతహంసస్త్రిజన్మని

జన్మైకం శంఖచిల్లశ్చ తతోఽన్యే శ్వేత పక్షిణః

తతో రక్త వికారీ చ శూలీపై మానవో భవేత్

సప్త జన్మసు చాల్సాయుః తతః శుద్ధో భవేన్నరః

దేవతలయొక్క బ్రాహ్మణుల యొక్క ధనమును, ఆవులను వాటికి చెందినవానిని, బట్టలను దొంగిలించినవాడు తప్త పాషాణకుండమను నరకమున అనేక వేల సంవత్సరములు నివసించును. తరువాత మూడు జన్మలవరకు కొంగగాను, మూడు జన్మలవరకు హంసగాను, ఒక జన్మ తెల్లగడ్డగాను, ఇంకొక జన్మలో తెల్లని ఇతర పక్షిగా జన్మనెత్తును.. ఆటుపిమ్మట మానవ జన్మనెత్తినప్పుడు ఏడు జన్మలవరకు కడుపునొప్పితో అల్పాయుష్కుడై పుట్టును.

రైత్యకాంస్యాది పాత్రం చ యోహరేత్సురవిప్రయోః

తీక్ష్ణ పాషాణ కుండే చ స్వలోమాబ్దం వసేత్ ధ్రువం

స భవేదశ్వ జాతిశ్చ భారతే సప్తజన్మసు

తతోఽధికంగయుక్తశ్చ పాదరోగీ తతః శుచిః

దేవ బ్రాహ్మణుల యొక్క పాత్రాదీ ద్రవ్యమును అపహరించువాడు తీక్షణ పాషాణకుండమున అనేక వేల సంవత్సరములు నివసించును. తరువాత ఏడుజన్మలవరకు గుజముగా పుట్టును. అటుపిమ్మట మానవుడై పుట్టినను పొడవైన ఆవయవములతో, పాదములకు వచ్చిన రోగముతో బాధలు చెందును.

 పుంశ్చల్యన్నం చ యోభుంక్తే పుంశ్చలీ జీవ్య జీవనః

స్వలోమ మానవర్షం చ లాలా కుండే వసేత్ ద్రువం

తాడితో యమదూతేన తద్భోజీ తత్ర తిష్ఠతి

తతశ్చక్షుశ్శూలరోగీ తతః శుద్ధః క్రమేణ సః

వ్యభిచరించు స్త్రీ పెట్టిన ఆన్నమును భుజించువాడు, ఆ స్త్రీవలన జీవించువారిని ఆశ్రయించుకొన్నవాడు లాలకుండమనునరకమున అనేక వేల సంవత్సరములు యమదూతలచే బాధలు పడుచుండును. తరువాత మానవుడై జన్మించినను కంట్రోగము, శూలరోగమువంటి రోగములచే బాధలు పడును.

మేచ్చసేవీ మషీజీవీ యో విప్రోభారతేభువి

స చ తప్త మషీకుండే స్వలోమాబ్దం వసేత్ ధ్రువం

తాడితో యమదూతేన తద్భోజీ తత్ర తిష్ఠతి

తతఫ్రిజన్మని భవేత్ కృష్ణవర్ణ: పశుః సతి

త్రిజన్మనీ భవేచ్చాగ: కృష్ణ సర్పస్త్రిజన్మనీ

తతశ్చ తాళవృక్షశ్చ తతః శుద్దో భవేన్నరః

మేచ్చులను (ఆభారతీయులను) సేవించువాడు, లేఖనముద్వారా బ్రతుకు బ్రాహ్మణుడు తప్తమపీకుండమను నరకమున అనేక వేల సంవత్సరములు యమదూతలచే బాధలనొందుచుండును. ఆ తర్వాత మూడు జన్మలవరకు సల్లని రంగుగల పశువుగా మారును. తరువాత మూడు జన్మల వరకు గొఱ్ఱగా పుట్టును. ఆ పైన మూడు జన్మల వరకు నల్లని బ్రా పుట్టును. అటు పిమ్మట తాటిచెట్టుగా పుట్టును. ఆ తరువాత మానవజన్మనెత్తును.

ధాన్యాది సస్యం తాంబూలం యోహరేత్సుర ఏప్రయోః

ఆసనం చ తథా తల్పం చూర్ణ కుండం ప్రయాతి సః

శతాబ్దం తత్ర నివసేద్యమ దూతేన తాడితః

తతో భవేన్మేషజాతీ: కుక్కుటశ్చ త్రిజన్మని

తతో భవేన్మానవశ్చ కాసవ్యాధియుతో భువి

వంశహీనో దరిద్రశ్చాప్యల్పాయుశ్చ తతః శుచీ:

దేవతలయొక్క బ్రాహ్మణుల యొక్క ధాన్యము మొదలగు వానిని, ఆసనమును, శయ్యను అపహరించినవాడు చూర్ణకుండమను నరకమునకు పోవును. అచ్చట వందలకొలది సంవత్సరములు యమదూతలచే బాధలు పడుచుండును. అటుపిమ్మట మూడు జన్మలవరకు మేకగాను, తరువాత మూడు జన్మలవరకు కోడిగాను జన్మించును. ఆటుపిమ్మట మానవుడై పుట్టినను శ్వాసకోశవ్యాధితో బాధపడుచు దరిద్రుడై అల్పాయుష్కుడై వంశహీనుడగును.

చక్రం కరోతి విప్రాణాం హృత్వా ద్రవ్యం చ యోనరః

స వసేచ్చక్ర కుండే చ శతాబ్దం దండతాడితః

తతో భవేన్మానవశ్చ శైలకార స్త్రిజన్మనీ

వ్యాధి యుక్తో భవేద్రోగీ వంశహీనస్తతః శుచి:

బ్రాహ్మణుల ధనమునపహరించి చక్రము చేయించుకొనువాడు నూరు సంవత్సరముల వరకు చక్ర కుండమను నరకమున యమభటులచే దండింపబడును. తరువాత మూడు జన్మలవరకు తైలకారు (గానుగవారు) డుగా జన్మించును. అప్పుడు రోగములచే బాధలు పడుచు సంతానము లేని వాడగును.

బాంధవేషు చ విప్రేషు కురుతే వక్రతాం వరః

ప్రయాతి వజ్రకుండం చ వత్తత్ర యుగం సతి

తతో భవేత్స వక్రాంగో హీనాంగః సప్తజన్మసు

దరిద్రో వంశహీనశ్చ భార్యాహీనస్తతః శుచిః

బంధువులు లేక బ్రాహ్మణులు ఇంటికి రాగా వారిని చిన్న చూపుతో చూచువాడు వజ్రకుండమనే నరకములో ఒక యుగకాలముండును. తరువాత అతడు మానవుడై పుట్టినను ఏడు జన్మల వరకు కురూపిగను, అవయవ హీనుడుగను, దరిద్రుడుగను, సంతానరహితుడుగను, భార్యాహీనుడుగను ఉండును.

శయనే కూర్మ మాంసం చ బ్రాహ్మణో యో హి భక్షతి

 కూర్మకుండే వసేత్సోఽపి శతాబ్దం కూర్మ భక్షితః

తతో భవేత్కూర్మజన్మ త్రిజన్మని చ సూకరం

త్రిజన్మనీ బిడాలశ్చ మయూరశ్చ త్రి జన్మనీ

బ్రాహ్మణుడు తాబేటి మాంసమును తినినచో నూరు సంవత్సరముల వరకు కూర్మకుండమను నరకమునకు పోవును. అచ్చట ప్రతీదినము తాబేళ్ళు అతని శరీరమును భక్షించుచుండును. తరువాత భూలోకమున మూడు జన్మలవరకు తాబేలుగను, మూడు జన్మలవరకు పందిగను, మూడు జన్మలవరకు పిల్లిగను, ఆటుపిమ్మట మూడు జన్మల వరకు నెమలిగను జన్మించును.

ఘృత శైలాదికం చైవ యోహరేత్సుర విప్రయోః

జ్వాలకుండం స వైయాతి భస్మకుండం చ పాతకీ

 తత్రస్థిత్వా శతాబ్దం చి సభవేత్తైల పాయిక:

సప్తజన్మసు మత్య్సఃస్యాత్ మూషకశ్చ తతః శుచిః

దేవ బ్రాహ్మణులకు చెందిన నేతిని, నూనెను అపహరించినవాడు జ్వాలాకుండము, భస్మకుండమను నరకములకు పోవును. అచ్చట నూరు సంవత్సరములవరకు యమభటులచే బాధలననుభవించును. ఆతరువాత బొద్దింకగా, చేపగా, ఎలుకగా . ఏడేడు జన్మలనందును.

సుగంధితైలం ధాత్రీం చ గంధ ద్రవ్యం తథైవ వా

భారతే పుణ్య వర్షేచ యోహరేత్సుర విప్రయోః

వసేద్దుర్గంధ కుండే చ దుర్గంధం చ లభేత్సదా

స్వలోమమానవర్షం చ తతో దుర్గంధికో భవేత్

దుర్గంధీకః సప్తజనౌ మృగనాభిస్త్రిజన్మని

సప్తజన్మ సుగంధిశ్చ తతో వై మానవో భవేత్

పవిత్రమైన ఈ భారతవర్షమున దేవ బ్రాహ్మణులకు సంబంధించిన సుగంధి వేరునుండి తీసిన నూనెను, భూమీని, సుగంధ ద్రవ్యమును అపహరించువాడు, దుర్గంధ కుండములో చాలా సంవత్సరములు దుర్గంధమును అనుభవించుచుండును. అటుతరువాత ఏడు జన్మల వరకు దుర్గంధమునిచ్చు వస్తువుగను, మూడు జన్మలు కస్తూరిగను, ఏడు జన్మలవరకు సుగంధిపాల వేరుగను జన్మనెత్తి తరువాత మానవుడగను.

బలేనైవ ఖలత్వేన హింసా రూపేణ వా సతి

బలీ చ యో హరేద్బూమిం భారతే పర పైతృకీం

స వసేత్తప్త శూలే చ భవేత్తప్తో దీవాఽనిశం

తప్తతైలే యథా జీవో దగ్ధో భ్రమతి సంతతం

భస్మసాన్నభవత్యేవ భోగ దేహో న నశ్యతి

సప్త మన్వంతరం పాపీ సంతప్తస్తత్ర తిష్ఠతి

శబ్దం కరోత్యనాహారో యమదూతేన తాడిత: 1

షష్టి వర్ష సహస్రాణి వీట్క్రిమిర్బారతే తతః

తతో భవేద్భూమిహీనో దరిద్రశ్చ తతః శుచిః

తతః స్వయోనిం సంప్రాప్య శుభకర్మా భవేత్పునః

బలవంతుడైనపాడు ఇతరులకు చెందిన భూమిని బలవంతముగనో, హింసించియో, ఇంకను ఇతర దుష్టపద్దతులననుసరించియో, అపహరించినచో అతడు తప్త శూలమను నరకమున రాత్రింబగళ్ళు మరుగుచున్న నూనెలో పడిన జీవీవలే బాధలు పడును. ఆ పాపి ఏడు మన్వంతరములవరకు తప్తశూల నరకమున బాధలు పడుచున్నను అతని భోగదేహము మాత్రము నశింపదు. ఆ నరకమున యమదూతలు పెట్టు బాధలకు తాళలేక, ఆహారము లేక ఏడ్చుచుండును.

అటుపిమ్మట ఆరవై వేల సంవత్సరములు ఆశుద్ధమున తిరుగు ప్రీమియై పుట్టును. ఆ తరువాత మానవజన్మనెత్తినను భూమిలేని వాడై దరిద్రుడగను.

ఛినత్తి జీవినం ఖడ్గైర్దయాహీనః సుదారుణః

నరఘాతీ హంతి, నరమర్థలోభేన భారతే

అసిపత్రే చ స వసేద్యావదింద్రాశ్చతుర్దశ

తేషు చేత్ బ్రాహ్మణాన్ హంతీ శతమన్వంతరం తదా

చిన్నాంగశ్చ భవేత్పాపీ ఖడ్గధారేణ సంతతం

అనాహార శబ్దకృచ్చ యమ దూతేన తాడితః

చండాల: శతజన్మాని భారతే సూకరో భవేత్

కుక్కుర: శతజన్మాని సృగాల: సప్త జన్మసు

వ్యాఘ్రశ్చ సప్త జన్మాని వృకశ్చైవ త్రీ జన్మనీ

జన్మ సప్తసు గండీస్యాత్ మహిషశ్చ త్రీ జన్మని

దయలేక అతిభయంకరముగా మరొక జీవిని డబ్బుకు ఆశపడి కత్తులచేత చంపినవాడు అసిపత్రమను నరకమున పదునల్గురు ఇంద్రులు గడచువరకుండును. అదే బ్రాహ్మణుని ఆ విధముగా నిర్దయతో చంపినచో నూరు మన్వంతరములవరకు ఆసీపత్రనరకమున నుండును. అచ్చట యమభటులు అవయవములను చేదించుచుండగా ఆహారములేక హాహాకారము చేయుచుండును. తరువాత నూరు జన్మలు చండాలునిగను, మరొక నూరు జన్మలు పందిగను, తరువాత నూరు జన్మలు కుక్కగను, ఏడుజన్మలు నక్కగను, ఏడు జన్మలు పులిగను, మూడుజన్మలు తోడేలుగను, ఏడు జన్మలు గండిగను ఆ తరువాత మూడు జన్మలు మహిషముగను జన్మించును.

గ్రామం వా నగరం వాఽపి దాహనం యః కరోతి చ

 క్షురధారే వసేత్సోఽపి ఛిన్నాంగస్త్రియుగం సతి

తతః ప్రేతో భవేత్సద్యో వహ్నివక్త్రో భ్రమేన్మహీం

సప్త జన్మామేధ్యభోజీ ఖద్యోత: సప్తజన్మసు

తతో భవేన్మహాశూలీ మానవః సప్త జన్మసు

 సప్త జన్మ గలత్కుష్ఠీ తత: శుద్దో భవేన్నరః

ఊరునో, పట్టణమునో తగలబెట్టువాడు అసిపత్రమను నరకమున మూడు యుగముల వరకు యమభటులు కత్తులచే శరీరమును కోయుచుండగా బాధపడుచుండును. తరువాత అతని ముఖము నుండి అగ్నిజ్వాలలు చెలరేగుచుండగా ప్రేమగా మారి భూమిపై తిరుగుచుండును. అటుపిమ్మట ఏడు జన్మలవరకు అమేధ్యమును తిను క్రిమీగా జన్మించును. తరువాత ఏడు జన్మలు మిణుగురు పురుగుగా జన్మించును. అటుతరువాత ఏడు జన్మలవరకు మితిమీరిన శూలరోగముతో బాధపడును. తరువాత ఏడు జన్మలవరకు కుష్టురోగముతో బాధపడుచుండును.

పరకర్ణోపజాపేన పరనిందాం కరోతి యః

పరదోషే మహాతోషీ దేవబ్రాహ్మణ నిందకః

సూచిముఖీ స చ వసేత్సూచీ విద్దో యుగత్రయం

తతో భవేత్ వృశ్చికశ్చ సర్పః స్యాత్ సప్తజన్మసు

వజ్రకీట: సప్తజనౌ భస్మకీటస్తతః పరం

తతో భవేన్మానవశ్చ మహావ్యాధిస్తత: శుచిః

ఇతరుల చెవిలో గుసగుసలు పెట్టుచు ఇతరుల నిందించువాడు, ఇతరులను నిందించుటతోనే తాను సంతోషపడువాడు, దేవతలను, బ్రాహ్మణులను నిందించువాడు సూచీముఖమను నరకమున సూదులచే పొడవబడుచు మూడు యుగముల వరకు బాధపడుచుండును. తరువాత ఏడు జన్మలు తేలుగాను, ఏడుజన్మలు సర్పముగాను, ఏడుజన్మలు వజ్రకీటకముగాను, (సాలగ్రామశిలలోనుండి ఆశీలను తొలుచు పురుగు) తరువాత ఏడు జన్మలు భస్మకీటకముగాను తరువాత మహారోగి యైన మానవుడుగా జన్మించును.

గృహిణాం చ గృహం భీత్వా వస్తుస్తేయం కరోతి యః

గాశ్చ భాగాంశ్చ మేషాంశ్చ యాతి గోధాముఖం చ సః

తతో భవేత్సప్తజనౌ గోజాతిర్వ్యాది సంయుతః

త్రిజన్మ మేష జాతిశ్చ ఛాగ జాతి స్త్రీజన్మని

తతో భవేన్మానవశ్చ నిత్యరోగీ దరిద్రకః

భార్యా హీనో బంధుహీనః సంతాపీ చ తతః శుచిః

ఇతరుల ఇండ్లను తవ్వి వస్తువులను, గోవులను, గొఱ్ఱలను, మేకలను అపహరించువాడు తరువాత ఏడు జన్మల వరకు రోగముగల గోవుగా, తరువాత మూడు జన్మల వరకు మేకగా, గొజ్జగా జన్మించి బాధలు పడును. ఆ తరువాత మానవుడై పుట్టినను ఎల్లప్పుడు రోగముతో, దరిద్రుడై, భార్యను కోల్పోయి, బంధువులందరిని కోల్పోయి బాధలు పడును.

సామాన్య ద్రవ్యచోరశ్చ యాతి నక్రముఖం యుగం

తతో భవేన్మానవశ్చ మహారోగీ తతః శుచిః

చిన్న చిన్న దొంగతనములు చేయువాడు నక్రముఖమను నరకమున ఒక యుగము వరకు మొసళ్ళచే బాధలు పడుచుండును. తరువాత మానవుడుగా జన్మించినను నిరంతరము రోగములచే బాధపడుచుండును.

హంతి గాశ్చ గజాంశ్చైవ తురగాంశ్చ నరాంస్తథా

స యాతి గజదంశం చ మహాపాపీ యుగత్రయం

తాడితో యమదూతేన గజదంతేన సంతతం

స భవేద్గజ జాతిశ్చ తురగశ్చ త్రిజన్మని

గోజాతి మేచ్ఛ జాతిశ్చ తతః శుద్దో భవేన్నరః

గోవులను, ఏనుగులను, గుఱ్ఱములను, మానవులను చంపువాడు గజదంశమను నరకమున కేగి ఆచ్చట అతనిని యమదూతలు ఏనుగు దంతములచే పొడుచుచుండగా మూడు యుగములవరకు ఉండును. తరువాత మూడు జన్మలవరకు గజముగాను, మరొక మూడు జన్మలు గుజ్జముగాను, ఆ తరువాత మూడు జన్మలు గోవుగాను, అటు పిమ్మట మూడు జన్మలు మ్లేచ్ఛుడుగను పుట్టును.

జలం పిబంతీం తృషితాం గాo వారయతి యోనరః

తచ్చుశ్రూషా విహీనశ్చ గోముఖం యాతి మానవః

నరకం గోముఖాకారం కృమి తప్తోదకాన్వీతం

తత్ర తిష్ఠతి సంతప్తో యావన్మంతరావధి

తతో నరోఽపి గోపీనో మహారోగీ దరిద్రక:

సప్త జన్మన్యంత్యజాతీ: తతః శుద్దో భవేన్నరః

దప్పికతో నీరు తాగుచున్న గోవును ఎవడు వారించునో అతడు వెంటనే ప్రాణములను కోల్పోయి గోముఖమను నరకమునకు వెళ్ళును. ఆ నరకము గోముఖాకారమున నుండును. క్రిములు, సలసలమజుగు నీరు ఉండును. అచ్చట మన్వంతరమువరకు బాధలు పడుచు మానవ జన్మనెత్తినప్పుడు ఆవులు లేక, అనేక రోగములచే, దరిద్రముచే బాధలు పడును. ఆ ఏడుజన్మలు అంత్యజాతీవాడుగా జన్మించుటచే అవమానముల పాలై బాధలు పడును.

గోహత్యాం బ్రహ్మహత్యాం చ యః కరోత్యతిదేశికీం

యో హి గచ్ఛేదగమ్యాం చ సంధ్యాహీనోఽప్యదీక్షితః

ప్రతిగ్రాహి చ తీర్దేషు గ్రామయాజీ చ దేవల:

శూద్రాణాం సూపకారశ్చ ప్రమత్తో వృషలీపతి:

గోహత్యాం బ్రహ్మహత్యాం చ స్త్రీ హత్యాం చ కరోతియః

మిత్రహత్యాం భ్రూణహత్యాం మహాపాపీ చ భారతే

కుంభీపాకే స వసేత్ యావదింద్రాశ్చతుర్దశ

తాడితో యమదూతేన చూర్ణ్యమానశ్చ సంతతం

క్షణం పతతి వహ్నా చ క్షణం పతతి కంటకే

క్షణం చ తప్తశైలేషు తప్తతైలేషు చ క్షణం

క్షణం చ తప్తపాషాణే తప్తలోహే క్షణం తతః

గృధ్రకోటిసహస్రాణి శతజన్మాని సూకరః

కాకశ్చ సప్తజన్మాని సర్పః స్యాత్ సప్తజన్మసు

షష్టి వర్ష సహస్రాణి తతోవై విట్ క్రిమిర్భవేత్

తతో భవేత్స వృషలో గలత్కుష్ఠీ దరిద్రకః

యక్ష్మగస్తో వంశహీనో భార్యాహీనస్తత: శుచిః

ఆగమ్యాగమనము చేయువాడు, సంధ్యావందనమాచరింపని వాడు, యాగదీక్ష తీసికొననివాడు, పుణ్యతీర్థములలో దానములను స్వీకరించువాడు, పూజలు చేయించువాడు (డబ్బు తీసికొని), దేవతార్చన చేసి పొట్టబోసుకొనువాడు, శూద్రుల ఇండ్లలో వంటలు చేయువాడు, అతిగా మదించినవాడు, శూద్రస్త్రీని పెండ్లిచేసుకొన్న బ్రాహ్మణుడు, గోహత్య, బ్రహ్మహత్య, స్త్రీహత్య, మీత్రహత్య, శిశుహత్య చేయువాడు కుంభీపాకమను నరకమున పదునలుగురు ఇంద్రులు గతించువరకుండును. ఆచ్చట యమ దూతలు కొట్టుచుండగా ఆతని దేహమంతయు చూర్ణమగుచుండును. యమదూతలతనిని కొంతసేపు నిప్పులో వేతురు. మరికొంతసేపు ముండ్లలో వేతురు, ఇంక కొంత సేపు మరిగే నూనెలోకి తోయుదురు. మరికొంత సేపు సలసలమరిగే నీటిలో ఉంచెదరు. కొంతసేపు మండుచున్న రాతిపై నిలబెట్టుదురు. ఇంకను కొంతసేపు మండుతున్న లోపాముపై నిలబెట్టుదురు. ఈవిధముగా నరకయాతనలనన్నిటినీ అనుభవించి భూమిపై జన్మించినపుడు అనేక కోట్ల జన్మలు గద్దగను, ఇనూరుజన్మలు పందిగాను, ఏడుజన్మలు కాకిగను, ఏడు జన్మలు. సర్పముగను, ఆరవై వేల సంవత్సరములు అశుద్ధమునందు ఉండు క్రిమిగాను, ఆ తరువాత శూద్రుడుగా జన్మించును. ఆ జన్మలో అతడు కుష్టురోగముచే బాధలు పడుచు, దరిద్రుడై, క్షయవ్యాధిచే బాధలు పడుచు సంతానములేక, భార్యలేక అనేక దుఃఖములను అనుభవించును.

సావిత్ర్యువాచ- సావిత్రి యమధర్మరాజుతో నిట్లనెను-

బ్రహ్మహత్యా చ గోహత్యా కింవిదా వాంఽతీదేశికీ

కావా నృణా మగమ్యావా కోవా సంధ్యా విహీనకః

అదీక్షితః పుమాన్ కోవా కోవా తీర్థే ప్రతిగ్రహీ

 ద్వీజ: కోవా గ్రామయాజీ ద్విజః కోవా విప్రశ్చ దేవల:

శూద్రాణాం సూపకారః కః ప్రమత్తో వృషలీ పతిః

ఏతేషాం లక్షణం సర్వం వద వేదవిదాం వర

ఓ యమధర్మరాజా! బ్రహ్మహత్య, గోహత్య, అతిదేశికి ఏ విధముగా నుండును. అగమ్య అనగా నెవరు? సంధ్యావందనము లేనివాడెవరు? ఆదీక్షితుడు, పుణ్యతీర్థములందు దానము స్వీకరించువాడెట్లుండును. అట్లే గ్రామయాజి, దేవలుడు, శూద్రసూపకారుడు, వృషలీపతి యనగా ఎట్లుండును. వేదములు వేదార్థములు తెలిసిన వారిలో శ్రేష్టుడవైన యమధర్మరాజా! వీరి లక్షణములనన్నిటిని వివరముగా నాకు తెలుపుము.

యమ ఉవాచ- యమ ధర్మరాజిట్లనెను-

శ్రీకృష్ణే చ తపర్చాయాం మృన్మయ్యాం ప్రకృతౌ తథా

శివే చ శివలింగేవా సూర్యే సూర్యమణౌ తథా

గణశే వా తదర్చాయామేవం సర్వత్ర సుందరి

కరోతి భేదబుద్ధిం యో బ్రహ్మహత్యాం లభేత్తు సః

 స్వగురౌ స్వేష్టదేవే వా జన్మదాతం మాతరి

కరోతి భేదబుద్ధిం యో బ్రహ్మహత్యాం లభేత్తు సః

వైష్ణవేష్వన్య భక్తేషు బ్రాహ్మణేపితరేషు చ

కరోతి సమతాం యోహి బ్రహ్మహత్యాం లభేత్తు సః

శ్రీకృష్ణునకు, ఆతని అర్చావిగ్రహమునకు, శివునకు శివలింగమునకు సూర్యునకు, సూర్యమణికి, గణపతికి ఆతని విగ్రహమునకు మధ్య ఈ విధముగా ఇతరత్ర భేద భావన చేయువాడు బ్రహ్మహత్యా పాపమును పొందును.

ఆట్లే తన గురువును, తన ఇష్టదేవతను, తన తల్లిని నిరాదరించువాడు బ్రహ్మహత్యా పాపముననుభవించును.

వైష్ణవులను, ఇతర దేవతా భక్తులను, బ్రాహ్మణులను, బ్రాహ్మణేతరులను సమానముగా చూచువాడు బ్రహ్మ హత్యాపాపముననుభవించును.

యో మూడో విష్ణునైవేద్యే చాన్యనైవేద్యకే తథా

హరేః పాదోదకేష్వన్య దేవ పాదోదకే తథా

కరోతి సమతాం యోహీ బ్రహ్మహత్యాం లభేత్తు సః

విష్ణుమూర్తికి సమర్పించిన నైవేద్యమును, ఇతర దేవతలకు ఇవ్వబడిన నైవేద్యమును, శ్రీహరి పాదోదకమును, ఇతర దేవతల పాదోదకమును సమానముగా చూచువాడు బ్రహ్మ హత్యా పాపమును అనుభవించును.

సర్వేశ్వరేశ్వరే కృష్ణే సర్వకారణ కారణే

సర్వాద్యే సర్వదేవానాం సేవ్యే సర్వాంతరాత్మని

మాయయాఽనేక రూపే వాప్యేక ఏవహి నిర్గుణే

కరోత్యన్యేన సమతాం బ్రహ్మహత్యాం లభేత్తు సః

సమస్త సృష్టికి మూలపురుషుడు, ఆదిపురుషుడు, సర్వదేవతలచే సేవితుడు, తనమాయవలన అనేక రూపములతో కనపడుచున్నమ అద్వితీయుడును, సర్వేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుని ఇతర దేవతలతో సమానముగా భావించువాడు బ్రహ్మహత్యా ఫలితమును పొందును.

పితృదేవార్చనాం పౌర్వాపరాం వేద వినిర్మితాం

యః కరోతి నిషేధం చ బ్రహ్మహత్యాం లభేతు సః

వేదమంత్రములు కలది, పూర్వకర్మ అపరకర్మ అనే పేర్లతో ప్రసిద్ధమైన దేవతార్చనను పితృదేవతార్చనను చేయనివాడు బ్రహ్మహత్యాపాపమును పొందును.

యే నిందంతీ హృషీకేశం తన్మంత్రోపాసకం తథా

పవిత్రాణాం పవిత్రం చ బ్రహ్మహత్యాం లభంతి తే

పరమ పవిత్రుడగు శ్రీమన్నారాయణుని, శ్రీమన్నారాయణ మంత్రోపాసకుని నిందించువారు బ్రహ్మహత్యా పాపమును పొందుచున్నారు.

శివం శివస్వరూపం చ కృష్ణ ప్రాణాధికం ప్రియం

పవిత్రాణాం పవిత్రం చ జ్ఞానానందం సనాతనం

ప్రధానం వైష్ణవానాం చ దేవానాం సవ్యమీశ్వరం

యే నార్చయంతి నిందంతి బ్రహ్మహత్యాం లభంతి తే

మంగళ స్వరూపుడు, శ్రీకృష్ణునకు తన ప్రాణములకంటే మిన్నయైనవాడు, పరమ పవిత్రుడు, జ్ఞానానందస్వరూపుడు, సనాతనుడు, విష్ణు భక్తులందరిలో శ్రేష్ఠుడు, దేవతలకు పరమేశ్వరుడగు శివుని పూజించని వారు, నిందించువారు బ్రహ్మహత్యాపాపమును పొందుదురు.

యే విష్ణుమాయాం నిందంతి విష్ణుభక్తి ప్రదాం సతీం

సర్వ శక్తి స్వరూపాం చ ప్రకృతిం సర్వమాతరం

సర్వదేవీ స్వరూపాం చ సర్వాద్యాం సర్వవందితాం

సర్వ కారణ రూపాం చ బ్రహ్మ హత్యాం లభంతి తే

శ్రీమన్నారాయణునిపై భక్తి భావనను కలిగించునది, సమస్త శక్తి స్వరూపిణి, అందరికి మాతృస్వరూపిణి, సర్వదేవీ స్వరూప, అందరిచే నమస్కారములనందుకొనుచున్నది, సమస్త సృష్టికి కారణమైనదీ ఐన విష్ణుమాయను నిందించువారు బ్రహ్మహత్యా ఫలమును పొందుదురు.

కృష్ణ జన్మాష్టమీం రామనవమీం పుణ్యదాం పరాం

శివరాత్రిం తథా చైకాదశీం వారం రవేస్తథా

పంచ పర్వాణి పుణ్యాని యే న కుర్వంతి మానవాః

లభంతే బ్రహ్మ హత్యాం తే చాండాలాధీక పాపినః

అంబువిచ్యంబు ఖననే జలే శౌచాదికంచ యే

కుర్వంతి భారతే వత్స బ్రహ్మహత్యాం లభంతి తే

పవిత్రమైన పంచపర్వములను (అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, సూర్యసంక్రమణమను ఐదు పర్వములు) శ్రీకృష్ణాష్టమి, శ్రీరామనవమి, శివరాత్రి, ఏకాదశి, ఆదివారమను ఐదుపర్వములను ఆచరించనివారు బ్రహ్మ హత్యా దోషమును పొందుదురు.

అట్లే నదులలో, దిగుడుబావులలో మూత్ర పురీషములను విసర్జించినవారు బ్రహ్మహత్యాపాపమునొందుదురు.

గురుం చ మాతరం తాతం సాద్వీం భార్యాం సుతం సుతాం

అనాథాన్ యో న పుష్ణాతి బ్రహ్మహత్యాం లభేత్తు సః

గురువును తల్లి దండ్రులను, పతివ్రతయగు భార్యను, సంతానమును అట్లే అనాథలైనవారిని పోషింపనివాడు బ్రహ్మహత్యాపాపమును పొందును.

వివాహో యస్య న భవేన్నపశ్యతి సుతం చ యః

హరి భక్తి విహీనో యో బ్రహ్మహత్యాం లభేత్తు సః

పుత్ర సంతానము లేనివాడు, వివాహము చేసికొననివాడు, శ్రీ హరీ భక్తి లేనివాడు బ్రహ్మ హత్యా ఫలమును పొందును.

హరేరనైవేద్యభోజీ నిత్యం విష్ణుం న పూజయేత్

పుణ్యం పార్థివలింగం వా బ్రహ్మహత్యాం లభేత్తు సః

శ్రీమన్నారాయణునకు సమర్పించిన నైవేద్యమును తీననివాడు, ప్రతి దినము శ్రీహరి పూజ చేయనివాడు, పవిత్రమైన శివలింగమును పూజించని వాడు బ్రహ్మహత్యా ఫలితమును పొందును.

పైవన్నియు ఆతిదేశికములైన బ్రహ్మహత్యలు.

ఆహారం కుర్వతీం గాంచ పిబంతీం యోనివారయేత్

యాతీ గో విప్రయోర్మధ్యే గోహత్యాం చ లభేత్తు సః

మేత మేయుచున్న ఆవును, నీరు త్రాగుచున్న ఆవును అదలించి నీరు తాగకుండ, మేతమేయకుండా చేయువాడు గోవును చంపిన ఫలమును పొందును.

దండైర్గాస్తాడయేన్మూర్ఖో యోవిప్రో వృషవాహకః

దినే దినే గవాం హత్యాం లభతే నాఽత్ర సంశయః

దదాతి గోభ్య ఉచ్ఛిష్టం యోజయేద్వృష వాహకం

భోజయేత్ వృషవాహాన్నం సగోహత్యాం లభేత్ ధ్రువం

 వృషలీపతిం యాజమేద్యో భుంక్తేఽన్నం తస్య యో నరః

గోహత్యా శతకం సోఽపి లభతే నాత్ర సంశయః

పాదం దదాతి వహ్నౌ చ గాశ్చ పాదేన తాడయేత్

గృహం విశేదదౌతాంఘ్రి: సాల్వా గోవధమాప్నుయాత్

యోభుంక్తేస్నిగ్ధపాదేన శేతే స్నిగ్ధాoఘ్రి రేవ చ

సూర్యోదయే చ ద్వీర్భోజీ సగోహత్యాం లభేత్ ధ్రువం

ఆవీరాన్నం చ యో భుంక్తే యోనీజీవీ చ యో ద్విజః

 యః త్రిసంధ్యావిహీనశ్చ స గోహత్యాం లభేత్ ధ్రువం

పితౄంశ్చ సర్వకాలే చ తిథికాలే చ దేవతాం

 న సేవతేఽతిథిం యోహి గోహత్యాం స లభేత్ ధ్రువం

స్వభర్తరీ చ కృష్ణే చ భేదబుద్ధిం కరోతి యా

కటూక్త్యా తాడయేతాంతం సా గోహత్యాం లభేత్ ధ్రువం

గోమార్గ ఖననం కృత్వా వపతే సస్యమేవ చ

తడాగే వా తదూర్ద్వం వా సగోహత్యాం లభేత్ ధ్రువం

ప్రాయశ్చిత్తం గోవధస్య యః కరోతి వ్యతిక్రమం

ఆర్థలోభాదథాజ్ఞానాత్ స గోహత్యాం లభేత్ ధ్రువం

రాజకే దైవకే యత్నాత్ గోస్వామీ గార న పాతయేత్

దుఃఖం దదాతి యో మూడో గోహత్యాం స లభేత్ ధ్రువం

ప్రాణినం లంఘయేద్యోహి దేవార్చాయాం రతం జలం

నైవేద్యం పుష్పమన్నం చ స గోహత్యాం లభేద్రువం

 శశ్వన్నాస్తితి వాదీ యో మిథ్యావాదీ ప్రతారకః

 దేవద్వేషీ గురుద్వేషీ సగోహత్యాం లభేద్రువం

దేవతా ప్రతిమాం దృష్ట్యా గురుం వా బ్రాహ్మణం సతి

సంభ్రమాన్ననమేద్యోహి స గోహత్యాం లభేద్ద్రువం

న దదాత్యాశిషం కోపాత్ర్పణతాయ చ యో ద్వీజః

విద్యార్థినే చ విద్యాం వై సగోహత్యాం లభేద్ద్రువం

గోహత్యా బ్రహ్మహత్యా చ కథితా చాతిదేశీకీ

యథా శ్రుతం సూర్య వక్త్రాత్ కింభూయః శ్రోతు మిచ్ఛసి

ఆవులను కఱ్ఱతో కొట్టువాడు, ఎద్దులపై బరువులు మోపువాడు లేక గోవుపై కూర్చొనియుండువాడు ప్రతిదినము గోహత్య చేసిన వానితో సమానుడు. ఆవులకు తిని పారేసిన ఎంగిళ్ళను పెట్టువాడు, ఎద్దులను బండికి కట్టువాడు, అతని ఇంట భుజించువాడు గోహత్యాపాపమును పొందును. అట్లే తన పాదములను నిప్పుకెదురుగా ఉంచి కాచుకొనువాడు, గోవులను కాలితో తన్నువాడు, నదిలోనో బావిలోనో స్నానము చేసి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుగుకొనక ఇంటిలోపలికి వెళ్ళువాడు, తడిగల కాళ్ళతో భోజనము చేయువాడు, తడి కాళ్ళతోనే నిద్రపోవువాడు, సూర్యోదయకాలమున రెండుమార్లు తినువాడు గోహత్యాఫలితమును పొందును. సంతానములేని విధవ పెట్టిన అన్నము తినువాడు, తన భార్యను ఇతరులకు తార్చీ బ్రతుకువాడు, మూడు సంధ్యలలో సంధ్యావందన మాచరింపని బ్రాహ్మణుడు, సర్వకాలములందు పితృదేవతార్చనమును, తిథికాలమున దేవతార్చనను చేయనివాడు, ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద చేయనివాడు గోహత్యా ఫలితమును పొందును.

అట్లే శ్రీకృష్ణుని తన భర్తను భేదభావముతో చూచుస్తీ, భర్తను తిట్టుచు, కొట్టుచుండు స్వభావముగల స్త్రీ గోహత్యా ఫలితమును పొందును.

గోవులు నడచు త్రోవను చెడగొట్టి వ్యవసాయమునకు ఉపయోగించుకొనువాడు, చెరువులోను, చేరువుపైభాగమున వ్యవసాయము చేయువాడు (తన స్వార్థమునకై చెరువులోను, దాని పై భాగమున నీరు రాకుండ చేసి వ్యవసాయము చేసి కొనువాడు) ,గోహత్యా ఫలితమును పొందును. పిసినారితనమువలననో, అజ్ఞానమువలననో గోవధ ప్రాయశ్చిత్తమును విధి విహితముగా చేయని వానికి గోహత్యాపాపమంటును.

రాజుకు సంబంధించినవి లేక దైవమునకు సంబంధించిన అనావృష్ట్యాది ఉపద్రవములందు తనకు చెందిన గోవులను రక్షింపనివాడు, ఆసమయములలో ఆవులకు కష్టమును కలిగించువాడు గోహత్యా ఫలితమును పొందును, ఏ ప్రాణినైనా, దేవతార్చన సమయమున ఉపయోగించిన జలమును, దైవమునకు సమర్పించిన నైవేద్యమును, పుష్పము మొదలగువాటిని దాటినచో అతనికి గోహత్యా ఫలితము దొరకును.

ఎప్పుడును లేదు లేదు అని అబద్ధములాడువాడు, ఆట్లే ప్రతారణ చేయువాడు, దేవతలను, గురువును ద్వేషించువాడు గోహత్యాసలితమును పొందును. అట్లే దేవతయొక్క ఆర్చామూర్తిని, గురువును బ్రాహ్మణుని చూచి వెంటనే నమస్కారము చేయనివాడు, తనకు వినయముతో నమస్కరించినను కోపముతో ఆశీర్వదించనీ బ్రాహ్మణుడు, వినయముతో తనను విద్య చెప్పమని అడిగినప్పుడు మదముతో విద్యాబోధ చేయని బ్రాహ్మణుడు గోహత్యా ఫలితమును పొందును.

సావిత్రి! నీవడిగినట్లు ఆతిదేశికములైన గోహత్య, బ్రాహ్మణహత్యలెట్లుండునో తెలిపితిని, ఈ విషయములనన్నిటిని మాతండ్రి యగు సూర్యుని వలన తెలిసికొంటిని. ఇంకను నీకేమైన తెలుసుకొనవలసిన విషయములున్నచో అడుగుము.

సావిత్ర వాచ- సావిత్రి యమునితో ఇట్లు పలికెను-

వాస్తవేచాఽ తీదేశేచ సంబంధే పుణ్య పాపయోః

న్యూనాధికే చ కో భేదః తన్మాం వ్యాఖ్యాతు మర్హసి

యమధర్మరాజా! వాస్తవమైన పుణ్యమునకు ఆతిదేశమైన పుణ్యమునకు, వాస్తవమైన పాపమునకు ఆతిదేశమైన పాపమునకు మధ్య గల భేదమును నాకు వివరింపుము.

యమ ఉవాచ- యమధర్మరాజిట్లనెను-

కుత్రాఽపి వాస్తవః శ్రేష్ఠ న్యూనోఽతిదేశికః సదా

 కుత్రాఽతిదేశికః శ్రేష్ఠ వాస్తవో న్యూన ఏవచ

కుత్ర వా సమతా సాధ్వి తయార్వేద ప్రమాణ తః

కరోతి తత్రనాఽస్థాం యో గురుహత్యాం లభేత్తు సః

పాప పుణ్యములందెచ్చటనైనను వాస్తవ పుణ్యపాపములు చాలా గొప్పవి. అట్లే ఆ దేశీక పుణ్యపాపములు ఎచ్చటనైనను వాస్తవమైనవాటికంటే తక్కువైనవి.

ఎట్టి ఆతిదేశిక పుణ్యపాపములు శ్రేష్ఠమైనవి, ఎటువంటి వాస్తవ పుణ్యపాపములు తక్కువైనవి, ఎటువంటివి సమానమైనవి అను విషయమును వేద ప్రమాణముననుసరించి నీశ్చయింపవలెను. ఈ విషయమును పట్టించుకోననివాడు గురువును చంపిన పాపమును పొందును.

పురా పరిచితే విప్రే విద్యామంత్రప్రదాతరి

గురి పితృత్వమారోపాత్ వస్తుతః శ్రేష్ఠ ఉచ్యతే

పూర్వ పరిచయముగల బ్రాహ్మణుడు, విద్యను, మంత్రమును ఉపదేశించిన గురువునందు పిల్పత్వమారోపించబడును. అందువలన ఆతడు శ్రేష్ఠుడగును.

పితు: శత గుణా మాతా మాతుఃశతగుణస్తథా

విద్యామంత్రప్రదాతా చ గురుః పూజ్య: శ్రుతేర్మతః

 గురుతో గురుపత్ని చ గౌరవే చ గరీయసీ

యథేష్టం దేవపత్నీ చ పూజ్యా చాభిష్టదేవతా

తండ్రకంటి తల్లి నూరురెట్లు గొప్పది. తల్లికంటె విద్యను, మంత్రమునుపదేశించిన గురువు నూరురెట్లు గొప్పవాడు గురువు కన్న గురు భార్యను ఎక్కువ గౌరవింపవలెను. దేవపత్ని ఇష్టదేవత కూడ గౌరవించదగినవారు.

విప్ర: శివసమో యశ్చ విష్ణుతుల్య పరాక్రమః

రాజాఽతిదేశీకాత్ శ్రేష్ఠో వాస్తవో గుణ లక్షతః

విష్ణుమూర్తితో సమానమైన లక్షణములు గల బ్రాహ్మణుడు శివునితో సమానమైనవాడు. రాజువంటివానికంటె రాజు లక్షరెట్లు గొప్పవాడు.

సర్వం గంగాసమం తోయం సర్వే వ్యాస సమా ద్విజాః

గ్రహణే సూర్య శశినోశ్చాత్రైవ సమతా తయోః

అతిదేశిక హత్యాయా: వాస్తవశ్చ చతుర్గుణః

సమ్మతః సర్వవేదానామిత్యాహ కమలోద్భవః

సూర్యచంద్రుల గ్రహణకాలమున అన్ని నదులలోని నీరు గంగానదీతో సమానమైది. అప్పుడు బ్రాహ్మణులందరు వ్యాసమహర్షితో సమానమైనవారు. ఈసమయమున మాత్రమే ఈరెంటియందు సమానత్వము కనిపించును.

హత్య వంటి దాని కన్న వాస్తవమైన హత్య నాల్గురెట్లు గొప్పనిది. ఇది సమస్త వేదములకు సమ్మతమైనదనీ బ్రహ్మదేవుడు చెప్పెను.

ఆతిదేశిక హత్యాయాః భేదశ్చ కథత: సతీ

యా యాఽగమ్యా నృణామేవ నిబోధ కథయామి తే

ఓ సావిత్రి! ఆతిదేశిక హత్యకు హస్తహత్యకు గల భేదమును నీకు తెలిపితిని. ఇక మానవులకు ఆగమ్యలైన స్త్రీల గురించి వివరింతును.

స్వస్త్రీ గమ్యాచ సర్వేషామీతివేదే నిరూపితా !

అగమ్యాచ్చ తదన్యా యా నిబోధ కథయామి తే

సామాన్యం కథితం సర్వం విశేషం శ్రుణు సుందరీ

ఆత్యగమ్యాశ్చ యాయావై నిబోధ కథయామి తే

అందరకు తన భార్య గమ్యయగును. తన భార్య కంటే భిన్నమైన స్త్రీ ఆగమ్య యని వేదశాస్త్రాస్త్రకోవిదులుచెప్పుదురు. కానీ ఇది సామాన్యమైన విషయము. విశేషాంశమునిప్పుడు వినుము. ఆత్యగమ్యలగు స్త్రీల గురించి చెప్పుదును వినుము.

శూద్రాణాం విప్రపత్నీ చ విప్రాణాం శూద్రకామినీ

అత్యగమ్యాంఽతినింధ్యాచ లోకే వేదే పతివ్రతే

శూద్రశ్చేద్భ్రాహ్మణీం గచ్ఛేత్ బ్రహ్మహత్యాశతం లభేత్

తత్సమం బ్రాహ్మణే చాపి కుంభీపాకం వ్రజేత్ ధ్రువం

 యది శూద్రాం వ్రజేద్విప్రో వృషరీపతి దేవ సః

సభ్రష్టో విప్రజాతేశ్చ చండాలాత్సోఽధమః స్మృతః

విష్ఠా సమశ్చ తత్పిండో మూత్రతుల్యం చ తర్పణం

తత్పితృణాం సురాణాం చ పూజనే తత్సమం సతి

కోటిజన్మార్జితం పుణ్యం సంధ్యార్చా తపసార్జితం

ద్వీజస్య వృషలీభోగాన్నశ్యత్యేవ న సంశయః

బ్రాహ్మణశ్చ సురాపీతి విట్భోజీ వృషలీపతిః

హరివాసర భోజీ చ కుంభీపాకం వ్రజేత్ ధ్రువం

గురుపత్నీం రాజపత్నీం సఫత్నీమాతరం ప్రసూం

సుతాం పుత్రవధూo శ్వశ్రూం సగర్భాం భగినీం సతి

 సోదర భ్రాతృజాయాం చ మాతులానీం పితృప్రసూo

 మాతుః ప్రసూం తత్వసారం భగినీం భ్రాతృకన్యకాం

శిష్యాం చ శిష్యపత్నీం చ భగినేయస్య కామినీం

భ్రాతుః పుత్రప్రియాం చైవాఽవ్యగమ్యామాహ పద్మజ:

శూద్రులు బ్రాహ్మణ స్త్రీలోనో, బ్రాహ్మణుడు శూద్రుని భార్యతోను సంగమించకూడదు. వీరు పూర్తిగా ఆగమ్యలు. ఈసంబంధము మిక్కిలి నిందించ తగినది.

శూద్రుడు బ్రాహ్మణస్త్రీతో సంగమము చేసినచో ఆతడు నూరుగురు బ్రాహ్మణులను హత్య చేసిన పాపమును పొందును. అట్లే శూద్రునితో పోవు బ్రాహ్మణస్త్రీ కూడా బ్రహ్మహత్యాపాపమును పొందును. ఇంకను కుంభీపాకమమ నరకమునకు తప్పకపోవును.

బ్రాహ్మణుడు శూద్రుస్తీ వేంట పోయినచో అతడు వృషలీపతియని పిలువబడును. ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణ జాతి భ్రష్టుడై చండాలునికన్నను అధముడగును. ఆతడు పితృదేవతలకు సమర్పించిన పిండము మలమువంటిదగును. అతడు విడిచిన పితృతర్పణబిలము మూత్రముతో సమానమగును. అతడు చేయు దేవ పిత్సపూజలు వ్యర్థములగును.

బ్రాహ్మణుడు శూద్రస్త్రీ సంగమము చేసినచో అతడు కోటి జన్మలనుండి చేయుచున్న పుణ్యము ఆతని సంధ్యా, తపస్సు, దేవతార్చనల వలన సంపాదించుకొన్న పుణ్యమంతయు నశించిపోవును. ఆతడు కల్లును లాగిన పాపమును, ఏకాదశినాడు భోజనము చేసిన పాపమును పొందును. పైగా కుంభీపాక నరకమునకు తప్పక పోవును.

గురువు భార్య, రాజు భార్య. సవతి తల్లి, ఆమె కూతురు, తనకూతురు. కోడలు, అత్తగారు, గర్భవతి మైన స్త్రీ చెల్లెలు, వదిన మరదళ్ళు (తమ్ముని భార్య) మేనమామ భార్య, మేనత్త, తమ్ముని కూతురు, శిష్యురాలు, శిష్యుని భార్య, మేనల్లుని భార్య, అన్న, తమ్ముల కోడళ్లు వీరందరు ఆగమ్యలని బ్రహ్మదేవుడు తెలిపెను.

ఏతాస్వేకాం అనేకాం పా యో వ్రజేన్మానవోఽధమః

స్వమాతృగామీ వేదేషు బ్రహ్మహత్యాశతం వ్రజేత్

 అకర్మార్హోఽపి సోఽస్పృశ్య: లోకే వేదేఽతినిందితః

స యాతి కుంభీపాకం చ మహాపాపీ సుదుస్తరం

కరోత్యశుద్ధాం సంధ్యాం చ సంధ్యాం వా నకరోతి యః

త్రిసంధ్యాం వర్జయేద్యో వా సంధ్యాహీనశ్చ సద్విజః

పైన చెప్పబడిన వారిలో ఒక స్త్రీతోనో అనేక స్త్రీలతోనో వ్యభిచరించువాడు తన తల్లితో సంగమించువానితో సమానమైన పాపమును పొందును. అట్లే నూరు బ్రహ్మహత్యల ఫలితమును పొందును. అతడు పుణ్యకర్మలు చేయుటకు తగడు, అతడు అస్పృశ్యుడగును. అట్లే మహాపాపియగు ఆతడు కుంభీపాకనరకమునకు తప్పక పోవును.

సంధ్యావందనమును సరిగా చేయనివాడు, అసలు సంధ్యనే చేయనివాడు లేక ఒకటి లేక రెండు సంధ్యలు చేసి తక్కిన వావిని చేయని ద్విజుడు సంధ్యాహీనుడని చెప్పబడును.

వైష్ణవం చ తథా సౌరం శాక్తం శైవం చ గాణపం

యోహంకారాన్నగృహ్ణాతి మంత్రం సోఽదీక్షితః స్మత:

విష్ణువునకు, సూర్యునకు, శక్తికి, శివునకు, గణపతికి సంబంధించిన మంత్రములలో దేనినైనను ఆహంకారముతో స్వీకరింపనివానిని ఆదీక్షితుడని యందురు.

ప్రవాహమవధీం కృత్వా యావద్ధస్త చతుష్టయం

తత్ర నారాయణ స్వామీ గంగా గర్భాంతరే వరే

 తత్ర నారాయణ క్షేత్రే కురుక్షేత్రే హారే: పదే

వారాణస్యాం బదర్యాం చ గంగా సాగర సంగమే

పుష్కరే భాస్కర క్షేత్రే ప్రభాసే రాస మండలే

హరిద్వారే చ కేదారే సోమే బదరపావనే

సరస్వతీ నదీ తీరే పుణ్యే బృందావనే వనే

గోదావర్యాం చ కౌశిక్యాం త్రివేణ్యాం చ హిమాలయే

ఏష్వన్యత్ర చ యో దానం ప్రతిగృహ్ణాతి కామతః

స చ తీర్థ ప్రతిగ్రాహీ కుంభీపాకం ప్రయాతి చ

నదీ తీరమునకు నాలుగు హస్తముల దూరమున నీటిలో శ్రీమన్నారాయణుడు నివసించును. దానిని నారాయణ క్షేత్రమందురు. అచ్చట, కురుక్షేత్రమున, కాళీయందు, బదరీక్షేత్రమున గంగా సాగర సంగమ స్థలమున, పుష్కర క్షేత్రమున, ప్రభాసక్షేత్రమున, హరి ద్వారమున, కేదారేశ్వరమున, సోమక్షేత్రమున, సరస్వతీ నదీ తీరమున, పవిత్రమైన బృందావనమున, గోదావరి నదీతీరమున, కౌశికీ నదీ తీరమున, త్రివేణీ సంగమమున, హిమాలయ పర్వతములందు ఇతరత్ర ధనముపై ఆశవలన దానము స్వీకరించువానిని తీర్థ ప్రతి గ్రాహి యందురు. అతడు కుంభీపాక నరకమునకు తప్పక పోవును.

శూద్రాతీ రిక్త యాజీ యో గ్రామ యాజీ చ కీర్తితః

తథా దేవోపజీవీ యో దేవల: పరికీర్తితః

శూద్ర పాకోపజీవీ యః సూపకార ఇతీస్మృతః

సంధ్యా పూజా విహీనశ్చ: ప్రమత్తః పతితః స్మృతః

శూద్రులు తప్ప తక్కిన ద్విజులచే యాగములు చేయించువానిని గ్రామయాజి యని పిలుతురు, ఆట్లే దేవాలయమున, ఇతరుల ఇండ్లలో దేవతార్చనము చేసి బ్రతుకు వానిని దేవలుడని ఆందురు. శూద్రుల ఇండ్లలో వంటచేసి జీవనము సాగించువానిని నూపకారుడని పిల్చెదరు. సంధ్యావందనము, పూజాదికము లేక జీవించువానిని ప్రమత్తుడని, పతీతుడని పిల్చెదరు.

ఉక్తం పూర్వ ప్రకరణే లక్షణం వృషలీ పతేః

ఏతే మహాపాతకినః కుంభీపాకం ప్రయాంతితే

కుండాన్యన్యాని తే యాంతి నిబోధ కథయామి తే

వృషలీపతి యొక్క లక్షణమును ఇంతకు ముందే వివరించితిని. మహాపాతకులైన వీరందరు కుంభీపాకమను నరకమునకు ఇతర నరకకుండములకు సహితము. పోదురు. వాటి నన్నిటినీ నీకు ముందు చెప్పుదును.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృత ఖండే నారద నారాయణ సంవాదే సావిత్ర్యుపాఖ్యానే యమ సావిత్రి సంవాదే కర్మ విపాకీ పాపి నరకనిరూపణం శివప్రాశస్త్యం బ్రహ్మహత్యాది పదార్థ పరిభాషా నిరూపణం నామ త్రింశత్తమోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణుల సంవాదమున తెల్పబడిన సావిత్ర్యుపాఖ్యానములో పాపుల నరకనిరూపణము, శివుని గొప్పదనము, బ్రహ్మహత్యాది విషయముల నిరూపణమనే ముప్పదియవ అధ్యాయము సమాప్తము.