బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

52 - కర్మఫలములను వివరించుట

శ్రీపార్వత్యువాచ- పార్వతీదేవి శంకరునితో ఇట్లనెను –

అన్యేషాం చ కృతఘ్ననాం యద్యత్కర్మ ఫలం ప్రభో

తేషాం కి మచుర్మునయో వేదవేదాంగపారగాః

వేదవేదాంగములన్నియు తెలిసిన మునులు, ఇతర కృతఘ్నుల పాప ఫలితమును గూర్చి ఏమనిరో నాకు విపులముగా తెలుపుమనెను.

శ్రీ మహేశ్వర ఉవాచ- మహేశ్వరుడిట్లనెను –

ప్రశ్నం కుర్వతి రాజేంద్రే సర్వేషు మునీషు ప్రియే

తత్ర ప్రవకుమారేభే ఋషిర్నారాయణో మహాన్

సుయజ్ఞ మహారాజు ఇతర కృతఘ్నుల కర్మవిషయమును ప్రశ్నించినపుడు అచ్చటనున్న మునులలో శ్రేష్ఠుడైన నారాయణఋషి ఇట్లు సమాధానమునిచ్చెను.

శ్రీనారాయణ ఉవాచ- సారాయణమునీ ఇట్లనెను –

స్వదత్తాం పరదత్తాం వా బ్రహ్మవృత్తిం హరేత్తు యః

స కృతఘ్న ఇతి జ్ఞేయః ఫలంచ శ్రుణు భూమిప

యావంతో రేణవః సిక్తా విప్రాణాం నేత్రబిందుభిః

తావద్వర్ష సహస్రం చ శూలపోతే సతిష్ఠతి

తప్తాంగారం చ తద్భక్ష్యం పొనం వై తప్తమూత్రకం

తప్తాంగారే చ శయనం తాడితో యమకింకరైః

తదంతే చ మహాపాపీ విష్టాయాం జాయతే కృమీః

షష్టివర్షసహస్రాణి దేవమానేన భారతే  

తతో భవేద్భూమిహీనః ప్రజాహీనశ్చ మానవః

దరిద్రః కృపణో రోగి శూద్రో నింద్యస్తతః శుచిః

తాను దానము చేసినను, ఇతరులు దానము చేసినను బ్రాహ్మణ వృత్తిగా సంక్రమించిన భూమిని అపహరించువానిని కృతఘ్నుడందురు. అతని కర్మఫలమిట్లుండును.

తాను సంపాదించుకొనిన భూమిని ఇతరులాక్రమించిరనీ బ్రాహ్మణుడేడ్చుచుండగా అతని కన్నీళ్ళచే ఎన్ని రేణువులు తడి చెందినవో అన్ని సంవత్సరములా కృతఘ్నుడు “శూలపోత"మను నరకమున నరకయాతనలననుభవించును. అచ్చట అతడు మండుచున్న నిప్పు కణికలను తినుచు వేడిగానున్న మూత్రము తాగుచు మండుచున్న నిప్పు కణికలున్న శయ్యపై యమకింకరులు బాధలుపెట్టుచుండగా పడుకొనవలసి వచ్చును.

ఈవిధముగా యమయాతనలనుభవించిన తరువాత ఆ మహాపాపి దివ్యములైన ఆరువేల సంవత్సరములు మలమున క్రిమిగానుండి తరువాత భూమీ, సంతానములేని మానవుడై పుట్టును. అతడు రోగములచే దరిద్రుడై అందరిచే నిందలు పొందును. అటుపిమ్మట పరిశుద్దుడగుసు.

నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను –

హంతి యః పరకీర్తిం వా స్వకీర్తిం వా నరాధమః

స కృతఘ్న ఇతి ఖ్యాతః తత్ఫలం చ నిశామయ

అంధకూపే వసేత్సోఽపి యావదింద్రాశ్చతుర్ధశ

కీటైర్నకుల గృధైశ్చ భక్షితః సతతం నృప

తప్తక్షారోదకం పాపీ నిత్యం పిబతి పై తతః

సప్తజన్మస్వతః సర్పః కోకః పంచస్వతః శుచిః

ఇతరుల కీర్తిని గావి తన కీర్తివిగాని చెడగొట్టు దుష్టుడు కృతఘ్నుడని పిలువబడుచున్నాడు. అతడు అంథకూపమను నరకమున పదునలుగురు ఇంద్రులు గతించువరకు నరకదుఃఖములననుభవించుచుండును. అచ్చట ఆ పాపిని కీటకములు, నకులములు, గద్దలు ఎల్లప్పుడు భక్షించుచండును. ఆ నరకముననున్న వేడియైన ఉప్పునీటిని ఎల్లప్పుడు తాగుచుండును. ఆనరకయాతనల తరువాత ఏడు జన్మలు సర్పముగాను ఐదు జన్మలు కాకిగాను పుట్టి తరువాత పరిశుద్దుడగును.

దేవల ఉవాచ- దేవలమునీ ఇట్లనెను –

బ్రహ్మస్వంవా గురుస్వం వా దేవస్వం వాఽపియో హరేత్

స కృతఘ్న ఇతిజ్ఞేయే మహాపాపీ చ భారతే

అవలోదే వసేత్సోఽపి యావదింద్రాశ్చతుర్ధశ

తతో భవేత్సరాపీ స తతః శూద్రస్తతః శుచిః

బ్రాహ్మణుని లేక గురుపు, లేక దేవుని సొత్తునపహరించువానినీ కృతఘ్నుడందురు, అతడు మహాపాపీగా పరిగణింపబడును.

ఆ మహాపాపి పదునలుగురు ఇంద్రులు గతించువరకు అవటోదమను నరకమున బాధలననుభవించి తరువాత నురాపానము చేయువాడుగా జన్మించి పరిశుద్దుడగును.

జౌగీషవ్య ఉవాచ- జౌగీషవ్యుడను ముని ఇట్లనెను –

పితృమాతృ గురూంశ్చాపి భక్తిహీనో న పాలయేత్

వాచాఽపితాడయేత్తంశ్చ స కృతఘ్న ఇతి స్మృతః

వాచా చ తాడయేన్నిత్యం స్వామినం కులటా చ యా

సాకృతఘ్నీతివిఖ్యాతా భారతే పాపినీ వరా

వహ్నికుండం మహాఘోరం తౌ ప్రయాతః సునిశ్చితం

తత్ర వహ్నౌ వసత్యేవ యావచ్చంద్రదివాకరౌ

తతో భవేజ్జలౌకశ్చ సప్తజన్మస్వతః శుచిః

తల్లిని, తండ్రిని, గురువును భక్తిహీనుడై రక్షింపనివానిని, వారిని మాటలతో నైనను హింసించువానివి కృతఘ్నుడందురు. అట్లే తన భర్తను మాటలతో ప్రతీదినము బాధపెట్టు స్త్రీని కూడ కృతఘ్నురాలని అందురు. వీరిద్దరు మహాభయంకరమైన వహ్నికుండమను నరకమునకు వెళ్ళి అచ్చట సూర్యచంద్రులున్నంతవరకు అగ్నిలో ఉండి బాధలననుభవింతురు. ఆ నరకమునుండి బయటకు వచ్చిన తరువాత ఏడు జన్మలవరకు జలగగా బ్రతుకుదురు. అటుపిమ్మట పరిశుద్దులగుదురు.

వాల్మీకి రువాచ- వాల్మీకి మహర్షి ఇట్లనెను –

యథా తరుషు వృక్షత్వం సర్వత్ర న జహాతి చ

తథా కృతఘ్నతా రాజన్ సర్వపాపేషు వర్తతే

మీథ్యా సాక్ష్యం యోదదాతి కామాత్య్రోదాత్తథా భయాత్

సభాయాం పాక్షికం వక్తి స కృతఘ్న ఇతి స్మృతః

పుణ్యమాత్రం చాపి రాజన్ యో హంతి స కృతఘ్నుకః

సర్వత్రాపీ చ సర్వేషాం పుణ్యహానౌ కృతఘ్నతా

మిథ్యా సాక్ష్యం పాక్షికం వా భారతే వక్తి యో నృప

యావదింద్ర సహస్రం చ సర్పకుండే వసేత్ ధ్రువం

సంతతం వేష్టితః సర్పైర్భీతో వై భక్షితస్తథా

భుంక్తే చ సర్వ విణ్మూత్రం యమదూతేన తాడితః

కృకలాసో భవేత్తత్ర భారతే సప్తజన్మసు

సప్త జన్మసు మండూకః పితృభిః సప్తభిః సహ

తతో భవేద్వై వృక్షశ్చ మహారణ్యేతు శాల్మలిః

తతో భవేన్నరో మూకస్తతః శూద్రస్తతః శుచిః

వృక్షములలో వృక్షత్వ మే విధముగా శాశ్వతముగానుండునో అట్లే పాపులయందు కృతఘ్న స్వభావముండును.

ఆశవలననో, కోపము వలననో, భయమువలననో తప్పుడు సాక్ష్యము చెప్పువానిని కృతఘ్నుడని అందురు. అట్లే ఇతరులు చేసిన పుణ్యకార్యములను చెడగొట్టువానిని కూడ కృతఘ్నుడని అదరు.

తప్పుడు సాక్ష్యమును కొద్దిగా చెప్పినను అతడువేయి ఇంద్రులు గతించువరకు సర్పకుండమను నరమున నుండును. అచ్చట అతనిని సర్పములు కాట్లు వేయుచుండగా యమభటులు దండించుచుండగా మలమూత్రములను భక్షించును. తరువాత ఏడు జన్మలవరకు తొండగా, ఏడుజన్మలవరకు తన పితృదేవతలతో సహ కప్పుగా బ్రతుకును. ఆ తరువాత మహారణ్యములో బూరుగు చెట్టుగా నుండును. ఆ తరువాత మూగవాడైయుండి చివరకు పరిశుద్ధుడగుమ అనీ వాల్మీకి మహర్షి అనెను.

ఆస్తీక ఉవాచ- ఆస్తీక ముని ఇట్లనెను –

గుర్వంగనానాం గమనే మాతృగామీ భవేన్నరః

నరాణాం మాతృగమనే ప్రాయశ్చిత్తం న విద్యతే

భారతే చ నృవశ్రేష్ఠ యో దోషో మాతృగామినాం

బ్రాహ్మణీగమనే చైవ శూద్రాణాం తావదేవ హి

బ్రాహ్మణ్యాస్తావదేవ స్యాద్దోషః శూద్రేణ మైథునే

కన్యానాం పుత్రపత్నీనాం శ్వశూణాం గమనే తథా

సగర్భభ్రాతృపత్నీనాం భగినీనాం తథైవ చ

దోషం వక్ష్యామి రాజేంద్ర యథాహ కమలోద్భవః

గురుభార్యతో సంగమించువాడు తల్లితో సంగమించినంత పాపమును పొందును. అట్లే శూద్రుడు బ్రాహ్మణ స్త్రీలో సంగమించినను, బ్రాహ్మణ స్త్రీ శూద్రునితో తిరిగినను, తన కూతుళ్ళు, కోడలు, అత్త, అన్నదమ్ముల భార్యలు, చెల్లెలు మొదలగువారితో వ్యభిచారము చేసినచో కలుగు పాపము కలుగునని ఆస్తీకముని చెప్పెను.

యః కరోతి మహాపాపీ చైతాభిః సహమైథునం

జీవన్మృతో భవేత్సోఽపి చండాలోఽస్పృశ్య ఏవచ

నాధికారో భవేత్తస్య సూర్యమండల దర్శనే

శాలగ్రామం తజ్జాలం చ తులస్యాశ్చ దళం జలం

సర్వతీర్థజలం చైవ విప్రపాదోదకం తథా

స్ప్రష్టం చ నైవ శక్నోతి విట్తుల్యః పాతకే నరః

దేవం గురుం బ్రాహ్మణం చ నమస్కర్తుం న చార్హతి

విష్ఠాదీకం తదన్నం చ జలం మూత్రాదికం తథా

దేవతాః పితరో విప్రా నైవ గృహ్ణంతి భారతే

భవేత్తదంగ వాతేన తీర్థమంగార వాహనం

సప్తరాత్రం హ్యుపవసేద్దైవస్పర్శాత్తథా ద్విజః

భారక్రాంతా చ పృథివీ తద్భారం వోఢుముక్షమా

తత్పాపాత్పతితో దేశః కన్యావిక్రయిణో యథా

తత్స్పర్శాచ్చ తదాలాపాత్ శయనాశ్రయ భోజనాత్

నృణాం చ తత్సమం పాపం భవత్యేవ వ సంశయః

కుంభీపాకే వసేత్సోఽపి యావద్యై బ్రహ్మణో వయః

దీవానీశం భ్రమేత్తత్ర చక్రావర్తం నిరంతరం

దగ్ధోవాఽగ్నిశిఖాభిశ్చ యమదూతైశ్చ తాడితః

ఏవం నిత్యం మహాపాపీ భుంక్తే నిరయయాతనాం

విష్ఠాహారశ్చ సర్వత్ర కుంభీపాకేఽథ పాతితః

పైవారీతో వ్యభిచరించు మహాపాపి బ్రతికియున్నను చనిపోయినవానితో సమానుడగును. అస్పృత్యుడగును. ఆ పాపికి సూర్యమండలమును దర్శించు అధికారములేదు, సాలగ్రామము, సాలగ్రామ జలము, తులసీదళము, తులసీజలము, పవిత్రమైన తీర్ణముల జలము, బ్రాహ్మణులయొక్క పాదోదకము వీటిని ముట్టుటకు కూడ అధికారములేదు. అట్లే ఆ పాతకి దేవతలను, గురువును. బ్రాహ్మణుని నమస్కరించు అధీకారము కోల్పోవును. వారు ఆ పాపాత్ముడు చేయు పూజను స్వీకరింపరు. ఆ పాపాత్ముని శరీరమునకు తగిలిన గాలి సోకినచో పుణ్యతీర్థము కూడ నిప్పుల కుంపటియగును.

ఆ పాతకినీ పొరపాటున తగిలినను ఏడు దినములు ఉపవాసముండవలెను. ఇంతమంది ప్రాణుల భారమును మోయుచున్న భూమి ఆ పాపాత్ముని బరువును మోయలేదు. తన కన్యలను అమ్ముకొను వానివలె (కన్యా విక్రయం) ఈ పాపియున్నందువలన ఆ స్థలము అపవిత్రమగును.

ఆ పాపిని తగిలినను, అతనితో మాట్లాడినను, అతనితో కలసి పడుకొన్ననను, భోజనము చేసినను వారికి ఆ పాపితో సమానమైన పాపము లభించును. ఆ పాపి కుంభీపాకనరకమున బ్రహ్మయొక్క జీవితకాలమువరకుండును. ఆ నరకమున ప్రతిదినము నిరంతరము చక్రమునకు కట్టివేయబడి తీరుగుచుండును. అతనిని యమభటులు ఎల్లప్పుడు బాధించుచుందురు. అతనిని నిప్పులలో పడద్రోయుదురు. ఈవిధముగా ఆ పాపి కుంభీపాక నరకమున మలమూత్రములను భుజించుచు నరకయాతనల ననుభవించును.

గతే ప్రాకృతికే ఘోరే మహతి ప్రళయే తథా

పునః సృష్టే సమారంభే తద్విధో వా భవేత్పునః

షష్టివర్షసహస్రాణి విష్టాయాం చ కృమిర్భవేత్

తతో భవతి చండాలో భార్యాహీనో నపుంసకః

సప్తజన్మసు శూద్రశ్చ గళత్కుష్ఠీ నపుసంకః

తతోభవేద్బ్రాహ్మణశ్చాప్యంధః కుష్ఠీ నపుంసకః

లబ్ద్వైవం సప్తజస్మాని మహాపాపీ భవేచ్ఛుచిః

ప్రకృతి సంబంధమైన ప్రళయముగడిచి మరల సృష్టి ప్రారంభమైనను ఈ పాపి అట్లే నరకయాతనలననుభవించును. అతడు అరవైవేల సంవత్సరములు మలములోని పురుగుగా బ్రతుకును. తరువాత చండాలుడై, భార్యాహీనుడై నపుంసకుడగును. తరువాత ఏడు జన్మలవరకు శూద్రుడైపుట్టి కుఘ్ఠరోగముతో బాధపడుచు, నపుంసకుడగును. ఆ తరువాత బ్రాహ్మణజన్మ లభించినను గుడ్డివాడై నపుంసకుడుగానుండును. ఈ విధముగా ఏడుజన్మలవరకు గుడ్డివాడై చివరకు పవిత్రమగును అని ఆస్తీక మహర్షి అనేను.

మునయ: ఊచుః - మునులు ఇట్లనిరి –

ఇత్యేవం కథితం సర్వం ఆస్మాభిర్వో యథాగమం

ఏభిస్తుల్యోభవేద్దోషోఽప్యతిథీనాం పరాభవే

ప్రణామం కురు విప్రేంద్రం గృహం ప్రాపయ నిశ్చితం

సంపూజ్య బ్రాహ్మణ యత్నాత్ గృహీత్వా బ్రాహ్మణాశిషం

వనం గచ్చ మహారాజు తపస్యాం కురు సత్వరం

బ్రహ్మశాఫైర్వినిర్ముక్తః పునరేవాగమిష్యసి

ఇత్యుక్త్యా మునయః సర్వేయయుస్తూర్ణం స్వమందిరం

సురాశ్చాపి చ రాజానో బంధువర్గాశ్చ పార్వతి

ఓ మహారాజా కృతఘ్నులు ఏవిధముగానుందురో వారు ఎట్టి కర్మఫలితముననుభవింతురో ఇంతవరకు చెప్పితిమి. ఇంటికి వచ్చిన అతిథని పరాభవించినను ఇంతటి పాపము కలుగును.

అందువలన నీపు ఈ బ్రాహ్మణునకు నమస్కరించి అతనిని తృప్తిపరచి కష్టపడియైనమ నీ ఇంటికి తీసుకొనివెళ్ళి అతని ఆశీర్వచనములను స్వీకరింపుము, అటుపిమ్మట అడవికి వెళ్ళి తపస్సు చేసినచో బ్రాహ్మణ శాపదోషమునుండి విముక్తుడవగుదుపు.

ఈ విధముగా సుయజ్ఞమహారాజుతో మహర్షులు పలికి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అట్లే దేవతలు, రాజులు, అతని బంధువులందరు తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదాంతర్గత హరగౌరీపంవాదే రాధోపాఖ్యానే సుయజ్ఞోపాఖ్యానే కర్మవిపాకోనామ ద్వీపంచాశత్తమోఽధ్యాయః

 శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతీఖండములోని నారదనారాయణ సంవాదములో కనిపించు గౌరీశంకరుల సంపాదములోని రాధోపాఖ్యానమున చెప్పబడిన సుయజ్ఞోపాఖ్యానమున కర్మవిపాకమను యభైరెండవ అధ్యాయము సమాప్తము.