శ్రీపార్వత్యువాచ- శ్రీపార్వతీదేవి శంకరునితో ఇట్లనినది-
కిమూచుర్బ్రాహ్మణం బ్రహ్మన్ బ్రాహ్మణాః బ్రహ్మణః సుతాః ।
నీతిజ్ఞా నీతి వచనం తన్మాం వ్యాఖ్యాతుమర్హసి ॥
శంకరా! నీతిజ్ఞులు, బ్రహ్మదేవుని వంశమున పుట్టిన ఆ బ్రాహ్మణులు సుయజ్ఞుని శపించిన బ్రాహ్మణునితో ఎటువంటి నీతి వచనములు పల్కిరో వాటిని సవివరముగా నాకు తెలియజేయుడని పార్వతీదేవి పలికెను.
శ్రీమహాదేవ ఉవాచ- శ్రీ శంకరుడిట్లు పలికెను –
సంతోష్య తం బ్రాహ్మణం చ స్త్రవేన ఏనయేన చ ।
క్రమేణ వక్తుమారేభే ముని సంఘో వరావనే ॥
మహర్షుల సమూహమంతయు తమ వినయ విధేయతలచేత స్తోత్రములచే ఆ బ్రాహ్మణుని సంతోషపెట్టి క్రమముగా ఇట్లు మాటలాడిరి.
సనత్కుమార ఉవాచ- సనత్కుమారుడిట్లనెను.
త్వత్పశ్చాదాగతా లక్ష్మీః కీర్తిః సత్వం యశస్తథా ।
సుశీలం చ మహైశ్వర్యం పితరోఽగ్నిః సురాస్తథా ॥
ఆగతా నృపగేహేభ్యః కృత్వా భ్రష్టశ్రియం వృపం ।
భవతుష్టో ద్విజశ్రేష్ఠ చాశు తోషశ్చ బాడబః ॥
బ్రాహ్మణానాం తు హృదయం కోమలం నవనీతవత్ ।
శుద్ధం సు నిర్మలం చైవమార్జితం తపసా మువే ॥
క్షమస్వాగచ్ఛ విప్రేంద్ర శుద్ధం కురునృపాలయం ।
ఆశిషం కురు తస్మై త్వం పవిత్రమాదరేణునా ॥
ఓ బ్రాహ్మణుడా! నీవు రాజగృహమునుండి బయటకు అడుగు పెట్టగానే వీవెంట లక్ష్మీదేవి, కీర్తి, బలము, యశస్సు, సుశీలము, ఆంతులేని ఐశ్వర్యము, పితృదేవతలు, అగ్నిదేవుడు, ఇతర దేవతలందరు లక్ష్మీభ్రష్టుడైన సుయజ్ఞుని ఇంటినుండి బయటకు వచ్చిరి.
మహారాజునకు గొప్ప శిక్షపడినది కావున కోపపడక, సంతోషపడుము. బ్రాహ్మణుడెప్పుడు త్వరగా సంతృప్తిని పొందుమ. బ్రాహ్మణుల మనస్సు అప్పుడే చిలికి చేసిన వెన్నవలె మృదువుగా ఉండును. అదివారీ తపస్సుచే పరిశుద్ధమై విర్మలముగా నుండును.
అందువలన ఓ బ్రాహ్మణుడా! నీవు మహారాజును క్షమింపుము. వెనకకు రమ్ము. రాజభవనమును నీయొక్క పవిత్రమైన పాదరేణువుచే పవిత్రము చేయుము. ఆ మహారాజును ఆశీర్వదింపుము. అని పనత్కుమారుడనెమ.
భృగురువాచ- భృగుమహర్షి ఇట్లనెను –
అతిథిర్యస్య భగ్నాశో గృహాత్ప్రతినివర్తతే ।
నీరాశాః ప్రతిగచ్ఛంతి చాతిథేరప్రతిగ్రహాత్ ।
క్షమస్వాగచ్ఛ విప్రేంద్ర శుద్ధం కురు నృపాలయం ॥
స్త్రీఘ్నై గోఘ్నైః కృతఘ్నైశ్చ బ్రహ్మఘ్నైర్గురుతల్పగైః ।
తుల్యదోషోభవత్వేతైః యస్యాతిథిరనర్చితః ॥
ఆతిథ ఎవరి ఇంటికి వెళ్ళి తన ఆశ భగ్నము కాగా అతని ఇంటినుండి తిరిగిపోవునో అతని పితృదేవతలు, ఇతరదేవతలు, ఆగ్ని వీరందరు ఆ గృహస్థు ఇంటినుండి బాధతో వెళ్ళిపోవుదురు. అతిథి దేవుని గౌరవించనీ గృహస్తు స్త్రీలమ, ఆవులమ, బ్రాహ్మణులము, చంపినవారితో, కృతఘ్నులు, గురుతల్పగులతో సమానమైన పాపమును పొందుము. ఐనమ ఓ బ్రాహ్మణుడా! నీవు మహారాజు చేసిన తప్పును క్షమించి అతని గృహముమ పావనము చేయుమని భృగుమహర్షి అనెమ.
పులస్త్య ఉవాచ- పులస్త్యమహర్షి ఇట్లవేమ –
పశ్యంతి యే వక్రదృష్ట్యా చాతిథిం గృహమాగతం ।
దత్వా స్వపాపం తస్మై తత్పుణ్యమాదాయ గచ్ఛతి ॥
క్షమస్వ నృపదోషం చ గచ్ఛవత్స యథాసుఖం ।
రాజా స్వకర్మదోషేణ నోత్తస్థౌ తత్ క్షమాం కురు ॥
అతిథి ఇంటికి రాగా ఆతనిని నిరాదరించిన గృహస్థునకు ఆతడు తాను చేసిన పాపములను సమర్పించి గృహపతి చేసిన పుణ్యమును తీసుకొని వెళ్ళును.
ఐనను ఓ బ్రాహ్మణుడా! రాజుచేసిన దోషమును క్షమింపుము. రోజు తన పూర్వకర్మ యొక్క దోషము వలన తప్పుచేసెను, అందువలన ఆ రాజును క్షమించి నీ ఇష్టమొచ్చిన చోటుకు వెళ్ళుమని పులస్త్యమహర్షి కోరెను.
పులహ ఉవాచ- పులహమహర్షి ఇట్లు పలికెను –
రాజశ్రీయా విద్యయా వా బ్రాహ్మణం యోఽనమన్యతే ।
విప్రస్త్రిసంధ్యహీనో యః శ్రీహీనః క్షత్రియో భవేత్ ॥
ఏకాదశీ విహీనశ్చ విష్ణునైవేద్యవంచితః ।
క్షమస్వాగచ్ఛ విప్రేంద్ర శుద్ధం కురు నృపాలయం ॥
తాను రాజుననియో, అధిక విద్యావంతుడవనియో బ్రాహ్మణుని అవమాన పరచినచో, అతడు బ్రాహ్మణుడైనచో త్రివంద్యలయందు సంధ్యావందనము చేయని బ్రాహ్మణబ్రువుడు పొందు ఫలిత మనుభవించును. క్షత్రియుడైనచో లక్ష్మినీ కోల్పోయి ఏకాదశివ్రతమాచరింపనివాడు, విష్ణునైవేద్యమును భుజింపనివాడు పొందు పాప ఫలితముననుభవించును.
అందువలన నీవు ఆ మహారాజును క్షమించి, మహారాజు ఇంటికి వచ్చి అతని భవనమును పరిశుద్ధము చేయుమనీ పులహా మహర్షి అనెను.
క్రతురువాచ- క్రతుమహర్షి ఇట్లు పలికెను –
బ్రాహ్మణః క్షత్రియోవాఽపి వైశ్యోవా శూద్ర ఏవ చ ।
దీక్షాహీనోభవేత్సోఽపి బ్రాహ్మణం యోఽవమన్యతే ॥
ధనహీనః పుత్రహీనః భార్యాహీనో భవేత్ ధ్రువం ।
క్షమస్వాగచ్ఛ భగవన్ శుద్ధం కురునృపాలయం ॥
ఏ కులమునందు పుట్టినవాడైనను బ్రాహ్మణుని అవమాన పరచినచో యాగదీక్షను వదలివేసినవాడు పొందు పాపమును పొందును. ఇంకను అతడు ధనము, పుత్రులు, భార్య మొదలగు వారినందరను కోల్పోవును. అయినను ఓ బ్రాహ్మణుడా! మహారాజును క్షమించి అతని భవనమునకు వచ్చి దానిని పవిత్రము చేయుమని క్రతుమహర్షి కోరెను.
అంగిరా ఉవాచ- ఆంగీరసమహర్షి ఇట్లు పలికెను –
జ్ఞానవాన్ బ్రాహ్మణో భూత్వా బ్రాహ్మణం యోఽవమన్యతే ।
వృషవాహో భవత్సోఽపి భారతే సప్త జన్మసు ॥
జ్ఞానవంతుడైన బ్రాహ్మణుడు ఇంకొక బ్రాహ్మణుని అవమాన పరచినచో అతడు భారతవర్షమున ఏడుజన్మల వరకు వృషహనడుమ అని పలికెను.
మరిచిరువాచ- మరీచి మహర్షి ఇట్లు పలికెను –
పుణ్యక్షేత్రే భారతే చ దేవం చ బ్రాహ్మణం గురుం ।
విష్ణుభక్తి విహీనశ్చ స భవేద్యోనమన్యతే ॥
పుణ్యభూమియగు ఈ భారతక్షేత్రమున దేవతలను, బ్రాహ్మణులను, గురువును ఆవమాంచినవాడు విష్ణుభక్తి విహీనుడగును.
కశ్యప ఉవాచ- కశ్యప ప్రజాపతి ఇట్లనెను –
వైష్ణవం బ్రాహ్మణం దృష్ట్యా యోఽసత్య మవమన్యతే ।
విష్ణుమంత్ర విహీనశ్చ తత్పూజావిరతో భవేత్ ॥
వైష్ణవుడగు బ్రాహ్మణుని అవమానపరచినవాడు విష్ణు మంత్రవిహీనుడగును. అట్లే విష్ణుపూజకు విముఖుడగును.
ప్రచేతా ఉవాచ- ప్రచేతసుడిట్లనెను –
అతిథిం బ్రాహ్మణం దృష్ట్వా నాభ్యుత్థానం కరోతి యః ।
పితృభక్తి విహీనః స్యాత్ సభవేత్ భారతే భువి ॥
ప్రాప్నోతి కౌంజరీం యోనిం సే మూడః సప్త జన్మసు ।
శీఘ్రం గచ్ఛ ద్విజశ్రేష్ఠ రాజ్ఞే దేహ్యాశిషః శుబాః ॥
అతిథియగు బ్రాహ్మణుని చూచి గౌరవముతో ఎవడు లేచినిలబడడో అతడీ భారతక్షేత్రమున పితృభక్తివిహీనుడగును. అట్లే అతడు ఏడు జన్మలవరకు ఏనుగై పుట్టుమ.
ఐనమ ఓ బ్రాహ్మణోత్తమా! త్వరగా వెనకకు పోయి సుయజ్ఞువకు ఆశీర్వాదమునిమ్ము అని ప్రచేతసుడనెను.
దుర్వాసా ఉవాచ- దుర్వాసమహర్షి ఇట్లనెను –
గురుం వా బ్రాహ్మణం వాపి దేవతా ప్రతిమామపి ।
దృష్ట్యా శీఘ్రం న ప్రణమేత్సభవేత్సూకరోభువి ॥
మిథ్యాసాక్షీ చ భవతి తథా విశ్వాస ఘాతకః ।
క్షమప్ప సర్వమస్మాకం ఆతిథ్య గ్రహణం కురు ॥
గురువునైనా, బ్రాహ్మణునైనా, దేవతామూర్తినైనా చూచిన వెంటనే నమస్కరింపనివాడు తరువాతి జన్మలో పందిగా పుట్టును. కానిచో అబద్దపు సాక్ష్యములు చెప్పువాడగును. అట్లే విశ్వాసఘాతకుడగును.
ఐనను మాతప్పులన్నియు క్షమించి మా ఆతిథ్యమును స్వీకరింపుమని దుర్వాసమహర్షి ఆ బ్రాహ్మణునితో ననెను.
రాజోవాచ- సుయజ్ఞ మహారాజిట్లనెను –
ఛలేన కథితో ధర్మో యుష్మాభిర్ముని పుంగవైః ।
సర్వం కృత్వా చ విస్పష్టం మాం మూడం బోధయంత్వహో ॥
స్త్రీఘ్నగోఘ్న కృతఘ్ననాం గురుస్త్రీగామినాం తథా ।
బ్రహ్మఘ్నానాం చ కో దోషో బ్రూత మాం యోగినాం వరాః ॥
మీరందరు ధర్మమును విస్పష్టముగా తెలుపలేదు. మూడుడనగు నాకు ధర్మమును స్పష్టముగా బోధింపుడు. స్త్రీ గో, కృతఘ్నులు, గురుస్త్రీగమనము చేసినవారు, బ్రాహ్మణుని చంపిన వారికి ఏ పాపమంటుతో మీరు స్పష్టముగా తెలుపడని అనెను.
వసిష్ఠ ఉవాచ- వసిష్ఠుడు సుయజ్ఞానితో నిట్లనెను –
కామతో గోవధే రాజన్ వర్షం తీర్థం భ్రమేన్నరః ।
యవయావక భోజీ చ కరేణ చ జలం పిబేత్ ॥
తథాధేనుశతం దివ్యం బ్రాహ్మణేభ్యః సదక్షిణం ।
దత్వాముంచతి పాపాచ్చ భోజయిత్వా శతం ద్విజాన్ ॥
ప్రాయశ్చిత్తే తు పై చీర్ణే సర్వపాపాన్ని ముచ్యతే ।
పాపావశేషాద్భవతి దుఃఖీ చాండాల ఏవచ ॥
ఆతిదేశిక హత్యాయాం తదర్ధం ఫలమశ్నుతే ।
ప్రాయశ్చిత్తానుకల్పేన సర్వపాపా న్న ముచ్యతే ॥
తెలిసి తెలిసి గోవధ చేసినవాడు ఒక సంవత్సరము తీర్థయాత్ర చేయవలెను. యపలు యవలకు సంబంధమైన వాటిని తినుచు దప్పియైనచో చేతితో నీటిని తాగుచు కాలము గడపవలెను. తరువాత నూరు ఆవులమ దక్షిణలలో బ్రాహ్మణులకు దానముచేయవలెను. తరువాత నూరుగురు బ్రాహ్మణులకు భోజనమును పెట్టవలెను. ఇట్లు ప్రాయశ్చిత్తము చేసికొప్పుచే పాపము పోవును. కానీ సమస్త పాపము తొలగిపోదు. పాపము కొంత మీగులుటచే అతడు దుఃఖమును పొందుచు చండాలుడగుచున్నాడు.
ఆతిదేశిక గోహత్యయందు అనగా పొరపాటువలన గోవధ జరిగినను, గోవధతో సమానమైన పాపము చేసినన, తెలిసి గోవధ చేసిన పాపములో సగము పాపమును పొందును. ప్రాయశ్చిత్తము వంటి దానిని చేసికొన్నమ పమ పాపమును పోగొట్టుకొనడు అని వసిష్ఠుడనెను.
శుక్ర ఉవాచ- శుక్రుడిట్లనెను –
గోహత్యాత్ ద్విగుణం పాపం స్త్రీహత్యాయాం భవేద్ద్రువం ।
షష్టివర్ష సహస్రాణి కాలసూత్రే వసేత్ ధ్రువం ॥
తతో భవేన్మహాపాపీ సూకరః సప్తజన్మసు ।
తతో భవతి సర్పశ్చ సప్తజన్మస్యతః శుచిః ॥
స్త్రీహత్య చేసినచో గోహత్యను చేసిన పాపము కంటే రెండు రెట్లెక్కువ పాపమును పొందుము. ఆరవైవేల సంవత్సరములు నరకమున బాధలననుభవించును. ఆ తరువాత ఏడు జన్మముల వరకు పందీగను తరువాత ఏడుజన్మలు సర్పముగను పుట్టి తరువాత పరిశుద్దుడగును.
బృహస్పతిరుపాచ- బృహస్పతి ఇట్లనెను –
స్త్రీహత్యాత్ ద్విగుణం పాపం బ్రహ్మహత్యాకృతోభవేత్ ।
లక్షవర్షం మహాఘోరే కుంభీపాకే పసేత్ ధ్రువం ॥
తతో భవేన్మహాపాపీ విష్ఠాకీటః శతాబ్దికం ।
తతో భవతి సర్పశ్చ సప్త జన్మన్యతః శుచిః ॥
బ్రాహ్మణుని చంపినచో స్త్రీహత్యచేసిన దావీకి రెట్టింపు పాపమును పొందుమ. అతడు కుంభీపాకమను మహాభయంకరమైన నరకమున లక్షసంవత్సరములు నరకయాతన అనుభవించును. తరువాత అతడు నూరు సంవత్సరములు అశుద్ధమునందలి పురుగుగా నుండును. ఆ తర్వాత ఏడు జన్మలవరకు పర్పముగా ఉండి పరిశుద్ధుడగునని బృహస్పతి చెప్పెను.
గౌతమ ఉవాచ- గౌతమ మహర్షి ఇట్లనెను –
దోషః కృతఘ్నే రాజేంద్ర బ్రహ్మహత్యాచతుర్గుణః ।
నిష్కృతిర్నాస్తి వేదోక్త కృతఘ్ననాం చ నిశ్చితం ॥
మేలుచేసిన వారికి అపకారము చేయువానికి బ్రహ్మహత్యాపాపమునకు నాల్గురెట్లెక్కువ పాపము లభించును. కృతఘ్నుని పాపపరిహారమునకై వేదమున ప్రాయశ్చిత్తము కన్పించదు. అందువలన కృతఘ్నుడు చాలా నీచుడని గౌతమ మహర్షి అనెను.
రాజోవాచ- రాజా ఇట్లు పలికెను –
లక్షణం చ కృతఘ్ననాం వద వేదవేదాంవర ।
కృతఘ్నః కతిధా ప్రోక్తః కేషు కో దోష ఏవ చ ॥
వేదవేదార్థములు తెలిసిన వారిలో శ్రేష్ఠుడా! కృతఘ్నుడనగా ఎట్టివాడు? వారెన్నివిధములుగా నుందురు. వారి దోషములేట్లుండును చెప్పుమనెను.
ఋష్యశృంగ ఉవాచ- ఋష్యశృంగుడిట్లనెను –
కృతఘ్నాః షోడశవిధాః సామవేదే నిరూపితాః ।
సర్వం ప్రత్యేక దోషేణ ప్రత్యేకం ఫలమశ్నుతే ॥
కృతే సత్యే చ పుణ్యే చ స్వధర్మే తపసిస్థితే ।
ప్రతిజ్జాయాం చ దానే చ స్వగోష్ఠీ పరిపాలనే ॥
గురుకృత్యే దేవకృత్యే కామ్యకృత్యే ద్వీజార్చనే ।
నిత్యకృత్యే చ విశ్వాసే పరధర్మ ప్రదానయోః ॥
ఏతాన్యోమంతి పాపిష్ఠః సకృతఘ్న ఇతిస్మృతః ।
ఏతేషాం సంతి లోకాశ్చ తజ్జన్మ భిన్నయానిషు ॥
యాన్యాంశ్చ నరకాంస్తే చ యాంతి రాజేంద్ర పాపినః ।
తె తే చ నరకాః సంతి యమలోకే సునిశ్చితం ॥
సామవేదమువ కృతఘ్నులు పదహారు రకములుగా ఉన్నట్లు చెప్పబడినది. వారు తమ తమ ప్రత్యేక పాపములననుసరించి ఫలితమును సైతము ప్రత్యేకముగా పొందుచున్నారు.
సీత్కర్మ, సత్యము, పుణ్యము, స్వధర్మము, తపస్పు, ప్రతిజ్ఞ, దానము, స్వగోష్ఠి పరిపాలనము, గురుకృత్యము, దేవకృత్యము. కామ్యకృత్యము, బ్రాహ్మణారాధన, నిత్యకృత్యము, విశ్వాసము, పరధర్మము, ప్రదానము అనువాటిలో నిష్ఠగలిగియున్నవారిని చంపు పాపినీ కృతఘ్నుడని అందురు. ఇటువంటి కృతఘ్నులకు ప్రత్యేకమైన నరకములు కలవు. అట్లే వారు భిన్న భిన్నమైన జన్మలు పొందుదురు. అనేక విధములుగానుండు కృతఘ్నులు పొందు నరకములన్నియు యమలోకమున ఉన్నవని ఋష్యశృంగ మహర్షి చెప్పెను.
సుయజ్ఞ ఉవాచ- సుయజ్ఞుడిట్లనెను –
కే కింకృత్వా కృతఘ్నశ్చ కాంస్యాన్గచ్ఛంతి రౌరవాన్ ।
ప్రత్యేకం శ్రోతుమిచ్ఛామి వక్తుమర్హసి మే ప్రభో ॥
ఎటువంటి కృతఘ్నులు ఎటువంటి నరకమునకు పోవుచున్నారో ఆ విషయమును వివరముగా నాకు చెప్పుడని మహారాజడిగేను.
కాత్యాయన ఉవాచ- కాత్యాయనుడిట్లనెమ –
కృత్వా శపథరూపం చ సత్యం హంతి న పాలయేత్ ।
స కృతఘ్నః కాలసూత్రే వసేదేవ చతుర్యుగం ॥
సప్తజన్మసు కాకశ్చ సప్తజన్మసు పేచకః ।
తతః శూద్రో మహావ్యాధిః సప్తజన్మస్వతః శుచిః ॥
శపథముచేసి దానిని అనుష్ఠించని కృతఘ్నుడు కాలసూత్రనరకమున నాలుగు యుగములుండును. తరువాత ఏడుజన్మలు కాకిగామ, ఏడు జన్మలు గుడ్లగూబగా జన్మనెత్తును. తరువాత ఏడుజన్మలు రోగిష్ఠియై చివరకు పరిశుద్ధుడగును.
శ్రీసనందన ఉవాచ- శ్రీసనందను డిట్లనెన –
పుణ్యం కృత్వా వదత్యేవ కీర్తివర్ధన హేతునా ।
స కృతఘ్నస్తప్తసూర్మ్యాం వసత్యేవ యుగత్రయం ॥
పంచజన్మసు మండూకః త్రిషు జన్మసు కర్కటః ।
తదామూకో మహావ్యాధిర్ధరిద్రశ్చ తతః శుచిః ॥
పుణ్యకర్మలు చేసి తన కీర్తిని పెంచుకొనుటకై వాటిని గురించి చెప్పుకొనువాడు కూడ కృతఘ్నుడే. అతడు తస్తసూర్మి అను నరకమున మూడు యుగములవరకుండి నరకయాతవలననుభవించి తరువాత ఐదుజన్మలు కప్పగాను, తరువాత మూడు జన్మలు ఎండిగాను జన్మించి ఆ తరువాత మూగవాడై మహావ్యాధిగల దరిద్రుడగును. ఆ తరువాత పరిశుద్ధు డగును అని సనందనుడనెను.
సనాతన ఉవాచ- సనాతనుడిట్లనెను –
స్వధర్మం హంతి యో విప్రః సంధ్యాత్రయ వివర్జితః ।
అతర్పయంశ్చ యః స్నాతి విష్ణునైవేద్య వర్జితః ॥
విష్ణుపూజావిహీనశ్చ విష్ణుమంత్ర విహీనకః ।
ఏకాదశీవిహీనః శ్రీకృష్ణజన్మదినే తథా ॥
శివరాత్రౌ చ యోభుంక్తే శ్రీరామనవమీ దినే ।
పితృకృత్యాది హీనో యః స కృతఘ్య్న ఇతిస్మృతః ॥
కుంభీపాకే వసత్యేవం యావదీంద్రాశ్చతుర్ధశ ।
తతశ్చాండాలతాం యాతి సప్తజన్మసు నిశ్చితం ॥
శతజన్మని గృధ్రశ్చ శతజన్మని సూకరః ।
తతో భవేద్బ్రాహ్మణశ్చ శూద్రాణాం సూపకారకః ॥
తతో భవేజ్జన్మ సప్త బ్రాహ్మణో వృషవాహకః ।
శూద్రాణాం శవదహీ చ భవేత్సషసు జన్మసు ॥
ద్విజోభూత్వా సప్తజనౌ భారతే వృషలీ పతిః ।
భుక్త్వా స్వభోగలేశం చ భ్రమిత్వా యాతి రౌరవం ॥
పునః పునః పాపయోనిం నరకం చ పునః పునః ।
తతో భవేద్గర్దభశ్చ మార్జారః పంచజన్మసు ॥
పంచజన్మసు మండూకో భవేచ్ఛుద్ధస్తతః క్రమాత్ ॥
బ్రాహ్మణుడు త్రి సంధ్యలలో సంధ్యావందనము చేయక, తర్పణలు చేయకుండా స్నానము చేయుచు, విష్ణుమూర్తికి నివేదించిన అన్నమును విసర్జించి, విష్ణుపూజను చేయక విష్ణమంత్రమును జపింపక, ఏకాదశీవ్రత విహీనుడై శివరాత్రి, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి మొదలగు దినములలో భోజనము చేయుచు పితృకర్మలను వదలివేయుచు బ్రాహ్మణులకు నిర్దిష్టమైన ధర్మమును వదలివేయు వాడు కూడ కృతఘ్నుడే యగును.
ఆట్టి కృతఘ్నుడు కుంభీపాక నరకమున పదునలుగురు ఇంద్రులు గతించువరకు యమయాతనల ననుభవించును. తరువాత ఏడు జన్మలు చండాలుడై నూరుజన్మలు గద్దగాపుట్టి, నూరుజన్మలు పందిగా జన్మించి, తరువాత ఏడు జన్మలు వృషవాహకుడైన బ్రాహ్మణుడై, తరువాత ఏడు జన్మలు శవములను తగులబెట్టువాడై, తరువాత వృషలీపతియగు బ్రాహ్మణుడగును. ఇంకను అనుభవింపవలసిన పాపమేమైనా ఉన్నచో రౌరవ నరకమునకు వెళ్ళి అచ్చట నరకయాతనలననుభవించును. తరువాత పాపీగా పుట్టి తరువాత నరకయాతనలననుభవించును. తిరిగి పాపిగా పుట్టును. ఇట్లు నరకబాధలు పొంది ఐదేసి జన్మలు గాడిదగాను, పిల్లిగాను, కప్పగాను జన్మించి పాప ఫలితమునంతయు అనుభవించును. ఇట్లు పాప ఫలితమునంతయు అనుభవించిన తరువాత పరిశుద్ధుడగునని సనాతనుడు చెప్పెను.
సుయజ్ఞ ఉవాచ- సుయజ్ఞా డిట్లు పలికెను –
శూద్రాణాం సూపకరణే శూద్రాణాం శవదహనే ।
శూద్రాన్నభోజనేవాఽపి శూద్రస్త్రీగమనేఽపి ॥
బ్రాహ్మణానాం చ కోదోషో వృషాణాం వాహనే తథా ।
ఏతాన్సర్వాన్సమాలోచ్య బ్రూహి మాం నిశ్చయం మునే ॥
బ్రాహ్మణుడు శూద్రుల ఇంటిలో వంటచేసినచో, శవములను తగులబెట్టినచో, శూద్రుల అన్నమును తినినచో, శూద్రస్త్రీని అనుభవించినచో వృషవాహనుడైనచో అతని తప్పేమి కలదు. వీటిని చక్కగా నాకు వివరించి చెప్పుమని అడిగెను.
పరాశర ఉవాచ- పరాశర మహర్షి ఇట్లనెను –
శూద్రాణాం సూపకారశ్చ యో విప్రోజ్ఞాన దుర్బలః ।
అసిపత్రే వసత్యేవ యుగొనా మేకసప్తతిః ॥
తతోభవేద్గ ర్గభశ్చ మూషికః సప్త జన్మసు ।
తైల కీట స్సప్త జన్మస్వతః శుద్ధో భవేన్నరః ॥
బ్రాహ్మణుడు చదువుకొనక శూద్రుల ఇండ్లలో వంటలు చేసిపెట్టుచు జీవించుచున్నచో అసీపత్రమను నరకమున డెబ్భైయొక్క యుగములుండును. అటుపిమ్మట ఏడేడు జన్మలు గాడిదగాను, ఎలుకగాను, జిల్ల పురుగుగామ పుట్టును. అటుపిమ్మట అతడు పరిశుద్ధుడగును.
జరత్కారురువాచ- జరత్కారు మహర్షి ఇట్లనెను –
భృత్యద్వారా స్వయంవాఽపి యోవిప్రో వృషవాహకః ।
స కృతఘ్ను ఇతిఖ్యాతః ప్రసిద్ధో భారతే నృప ॥
బ్రహ్మహత్యా సమంపాపం తన్నీత్యం వృషతాడనే ।
వృషపృష్ఠే భారదానాత్పాపం తద్ద్విగుణం భవేత్ ॥
సూర్యాతపే వాహయేద్యః క్షుధితం తృషితం వృషం ।
బ్రహ్మహత్యాశతం పాపం లభతే నాఽత్ర సంశయః ॥
అన్నం విష్ఠా జలం మూత్రం విప్రాణాం వృషవాహినాం ।
నాధికారో భవేత్తేషాం పితృదేవార్చవే నృప ॥
లాలాకుండే వసత్యేవ యావచ్చంద్ర దీవాకరౌ ।
విష్ఠాభక్ష్యం మూత్రజలం తత్ర తస్య భవేద్ద్రువం ॥
త్రిసంధ్యం తాడయేత్తం చ శూలేవ యమకింకరః ।
ఉల్కాం దదాతి ముఖతః సూచ్యా కృంతతి సంతతం ॥
షష్టివర్షసహస్రాణి విష్టాయాం చ కృమిర్భవేత్ ।
తతః కాకః పంచజన్మస్వథైకం బక ఏవ చ ॥
పంచ జన్మసు గృధ్రశ్చ శృగాలః సప్తజన్మను ।
తతో దరిద్రః శూద్రశ్చ మహావ్యాధిసైతః శుచిః ॥
స్వయముగా కాని, భృత్యునితోకాని వృషభమువాహనముగా చేసికొని తిరుగు బ్రాహ్మణుడు కృతఘ్నుడని చెప్పబడుచున్నాడు. అతడు వాహనముగాచేసికొని తిరుగునపుడు వృషభమును కొట్టును కావున అతనికి బ్రహ్మహత్య చేసినంత పాపము కలుగును. వృషభములను ఎండలో దిప్పుచు వాటికి ఆకలి దప్పులగుచున్నను వాహనముగా తిప్పును కావున అతడు నూరు బ్రహ్మహత్యలు చేసిన పాపమును పొందును.
వృషభవాహనులగు బ్రాహ్మణులు తాగు నీరు మూత్రము వంటిది. అన్నము అశుద్దముతో సమానమగును. వారు పితృదేవతలను అర్చనసేయు అధికారమును కోల్పోవుదురు. వారు చంద్రసూర్యులున్నంతవరకు లాలాకుండమను నరకమున బాధలననుభవింతురు. అచ్చట అశుద్దమును తినుచు, మూత్రమును తాగుచుందురు. నరకమున అతనిని యమకింకరులు శూలములతో మూడుపూటలు బాధలు పెట్టుదురు. ముఖముపై పిడుగులు వేయుదురు, సూదులతో ముఖమును పొడుతురు.
ఇట్లు నరకయాతనలననుభవించిన తరువాత ఆ కృతఘ్నుడు అరవై వేల సంవత్సరములు మలముననుండు పురుగుగా జన్మించును. అటుపిమ్మట ఐదుజన్మలు కాకిగాను, ఒక జన్మ కొంగగాను, ఐదు జన్మలు గద్దగాను, ఏడుజన్మలు నక్కగాను పుట్టును. ఆ తరువాత దరిద్రుడై మహావ్యాధితో బాధపడును. అటుపిమ్మట అతడు పరిశుద్దుడు కాగలడు అని అనెను.
భారద్వాజ ఉవాచ- భారద్వాజ మహర్షి ఇట్లనెను –
శూద్రాణాం శవదాహీ యః స కృతఘ్న ఇతి స్మృతః ।
వయః ప్రమాణం రాజేంద్ర బ్రహ్మహత్యాం లభేత్ ధ్రువం ॥
తత్తుల్యయోని భ్రమణాత్ తత్తుల్య నరకాచ్ఛుచిః ।
యో దోషో బ్రాహ్మణానాం చ శూద్రాణాం శవదహనే ॥
తావదేవ భవే ద్దోషః శూద్రశ్రాద్ధాన్నభోజనే ॥
శవములను తగులబెట్టు బ్రాహ్మణుడు కూడ కృతఘ్నుడని పిలువబడుచున్నాడు. నూరు సంవత్సరములవరకు అతడు బ్రహ్మహత్యాపాపమును పొందుచున్నాడు. ఈ నూరు సంవత్సరములు బ్రహ్మహత్యా పాపము చేసినవాడనుభవించు నరకయాతనలను ఇతడు కూడ అనుభవించును. అతనివలే ఇతడు కూడ అనేక జన్మలెత్తును.
అదేవిధముగ శూద్రుని ఇంటిలో శ్రాద్ధాన్నమును భుజించినచో శవదహనము చేసిన బ్రాహ్మణుడు పొందుపాప ఫలితముననుభవించును.
విభాండక ఉవాచ- విభాండక మహర్షి ఇట్లనెను –
పితృశ్రాద్ధే చ శూద్రాణాం భుంక్తే యో బ్రాహ్మణోఽధమః ।
సురాపీతీ బ్రహ్మఘాతీ పితృదేవార్చనాద్భహిః ॥
శూద్రులు పెట్టు పితృశ్రాద్ధమున అన్నమును తిను బ్రాహ్మణుడు సురాపానము చేయువాడు. బ్రాహ్మణుని చంపువాడు పొందు పాపమును పొందును. అతడు పితృదేవతలను, ఇష్టదేవతలను అర్చనసేయు అర్హతను గోల్పోవును.
మార్కండేయ ఉవాచ- మార్కండేయుడిట్లనెను –
యో దోషో బ్రాహ్మణానాం చ శూద్ర స్త్రీ గమనే నృప ।
అహం వక్ష్యామి వేదోక్తం సావధానం నిశామయ ॥
కృతఘ్ననాం ప్రధానశ్చ యోవిప్రోవృషలీపతిః ।
కృమిదంష్ట్రే వసేత్సోఽపి యావదింద్రాశ్చతుర్దశ ॥
కృమి భక్ష్యో భవే ద్విప్రో విహ్వలోయమకింకరైః ।
ప్రతిమం తాం తప్తలౌహీం ఆశ్లేషయతి నిత్యశః ॥
తతశ్చ పుంశ్చలీయోనౌ కృమిర్భవతి నిశ్చితం ।
ఏవం వర్షసహస్రం చ తతః శూద్రస్తతః శుచిః ॥
బ్రాహ్మణుడు శూద్రస్త్రీతో వ్యభిచరించినచో కలుగు పాపము వేదమున చెప్పబడినది. అతడు కృతఘ్నులందరిలో గొప్పవాడు. అతడు పదునలుగురీంద్రులు గతించువరకు కృమిదంష్ట్రమను నరకమున క్రిములతో బాధలందుచుండును. అచ్చట యమకింకరులు బాగుగా వేడిచేసిన లోహప్రతిమను ప్రతిదినము కౌగలించుకొనునట్లు చేయుదురు. ఆతరువాత అతడు జారస్త్రీయొక్క యోనిలో కృమిగా వేయి సంవత్సరములుండును. ఆ తరువాత శూద్ర జన్మనెత్తి పరిశుద్ధుడగును.
సుయజ్ఞ ఉవాచ- సుయజ్ఞమహారాజిట్లనెను –
అన్యేషాం చ కృతఘ్ననాం వద కర్మఫలం మునే ।
శ్లాఘ్యా మే బ్రహ్మశాపశ్చ కస్యసంపద్వినాఽపదం ॥
దన్యోఽహంకృతకృత్యొఽహంమ సఫలం జీవనం మ ।
ఆగతాస్తు యతోముక్తా మద్గేహేమునయః సురాః ॥
ఇంకను నాకు ఇతర కృతఘ్నులు ఎటువంటి కర్మఫలమును పొందుదురో చెప్పుడు. నాకు బ్రహ్మశాపము కూడ వరముగా మారినది. ఆపదలు లేకుండ సంపదలెవ్వరికి లభింపవుగదా!
నేను ధన్యుడను, కృతకృత్యుడవైతిని నాజీవితము సఫలమైనది. ఎందుకనగా నా ఇంటికి ముక్తులైన మునులు దేవతలు విచ్చేయుట నా ఆదృష్టముననే జరిగినదని సుయజ్ఞడనెను.
ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే ద్వీతీయే ప్రకృతిఖండే నారదపారాయణ సంవాదాంతర్గత హరగౌరీ సంవాది రాధోపాఖ్యానే నృపముని పంవాదే కర్మవిహికోనామ ఏకపంచాశత్రయోఽధ్యాయః ॥
శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున నారదనారాయణుల సంవాదములోని గౌరీశంకరుల సంవాదమున తెల్పబడిన రాధోపాఖ్యానమున నున్న నృపమునీసంవాదమున చెప్పబడిన కర్మవిపాకమను యాభైఒకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 50 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
Fulfilling the divine decree, Goddess Śrī Rādhā manifested on earth in the holy land of Vraja as the radiant daughter of King Vṛshabhānu and Queen Kalāvatī in the village of Barsānā. The moment She appeared, Her eyes remained closed until Lord Śrī Kṛshṇa was brought before Her crib, whereupon She opened Her eyes for the first time to behold Her eternal beloved, filling her parents and all of Vraja with overwhelming bliss. Her childhood pastimes in Barsānā were filled with divine sweetness, purity, and miraculous signs, captivating the hearts of all cowherd maidens and setting the stage for the revelation of supreme divine love.