బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

16 - తులసీ శంఖచూడుల వృత్తాంతము

నారాయణ ఉవాచ - నారాయణుడిట్లు నారదునితో అనెను-

 తులసీ పరితుష్టా సా చాస్వాప్సీత్ హృష్టమానసా

నవయౌవన సంపన్నా ప్రశంసంతీ వరాంగనా

చిక్షేప పంచ బాణశ్చ పంచ బాణాంశ్చ తాం ప్రతి

పుష్పాయుధేన సా దగ్ధా పుష్పచందన చర్చితా

పులకాంచిత సర్వాంగీ కంపితా రక్తలోచనా

క్షణం సా శుష్కతాం ప్రాప క్షణం మూర్ఛామవాప హ

క్షణముద్విగ్నతాం ప్రాప క్షణం తంద్రాం సుఖావహం

క్షణం సా దహనం ప్రాప క్షణం ప్రాపప్రమత్తతాం

క్షణం సా చేతనాం ప్రాప క్షణం ప్రాప విషణ్ణతాం

ఉత్తిష్ఠంతీ క్షణం తల్పార్గచ్ఛంతీ నికటం క్షణం

భ్రమంతీ క్షణముద్వేగాత్ వివసంతీ క్షణం పునః

క్షణమేవ సముద్వేగాత్ అస్వాప్పీత్ పునరేవ సా

పుష్పచందన తల్పం చ తద్బభూవాతి కంటకం

విషమాహారకం స్వాదు దివ్యరూపం ఫలం జలం

నిలయశ్చ నిరాకారః సూక్ష్మవస్త్రం హుతాశనః

సిందూర పత్రకం చైవ వ్రణతుల్యం చ దుఃఖదం

క్షణం దదర్శ తంద్రాయాం సువేషం పురుషం సతీ

సుందరం చ యువానం చ సస్మితం రసికేశ్వరం

చందనోక్షిత సర్వాంగం రత్న భూషణ భూషితం

ఆగచ్ఛంతం మాల్యవంతం పశ్యంతం తన్ముఖాంబుజం

కథయంతం రతికథాం చుంబంతమధరం ముహుః

శయానం పుష్పతల్పే చ సమశ్లిష్యం తమంగకం

పునరేవతు గచ్ఛంతం ఆగచ్ఛంతం వసంతకం

కాంత క్వయాసి ప్రాణేశ తిష్ఠేత్యేవమువాచ సా

 పునః స్వచేతనాం ప్రాప్య విలలాప పునః పునః

ఏవం తపోవనే పా చ తస్థౌ తత్రైవ నారద

తులసీదేవి బ్రహ్మదేవుడిచ్చిన వరమువలన సంతసించి సంతోషముతో నిద్రపోయెను. ఆ సమయమున మన్మథుడు తవ పంచబాణముల నామెపై వేసెను. అందువలన తులసి అనేక విధములైన మన్మథవికారములను పొంది విపరీతముగా ప్రవర్తించినది. ఆమెకు పుషచందన తల్పము కంటకమయముగా తోచినది. మంచి ఆహారము ఫలములు, జలము విషతుల్యమైనవి. ఆమె ఉన్న ఆశ్రమము ఆకారము లేనియట్లు తాను కట్టుకొన్న వస్త్రములు మండుచున్నట్లుగా మన్మథ వికారములను పొందినది.

ఆసమయమున ఆమె మగత నిద్రలో నుండగా రసికేశ్వరుడు, యువకుడు, చక్కగా అలంకరించుకొన్న ఒక పురుషుని చూచెను. అతడు చందనాది సువాసన ద్రవ్యశోభితుడై, రత్నాలంకారములు ధరించి మాటిమాటికి తనను చూచుచున్నట్లు, ఆమెకు రతి కథలు చెప్పుచు చుంబించుచు, ఆలింగనము చేసుకొనుచున్నట్లు కనిపించెను. అతడు వెళ్ళిపోవుచున్నట్లు కనిపించగానే ప్రియా - ఎచ్చటకి పోవుచున్నావు నిలు నిలుమని అనుచు మేల్కాంచెను. ఆమె తన స్వప్పములో జరిగిన వృత్తాంతములు తలచుకొని మాటిమాటికి విలపించెను. ఇట్లు బాధపడుచు ఆమె ఆశ్రమములోనే ఉండినది.

శంఖచూడో మహాయోగీ జైగీషవ్యాన్ మనోరమం

కృష్ణస్య మంత్రం సంప్రాప్య ప్రాప్య సిద్దింతు పుష్కరే

పఠన్ సదా తు కవచం సర్వమంగళ మంగళం

బ్రహ్మేశాచ్చ వరం ప్రాప్య యత్తన్మనసి వాంఛితం

ఆజ్ఞయా బ్రహ్మణః సోఽపి బదరీం వై సమాయయౌ

ఆగచ్ఛంతం శంఖచూడమపశ్యత్తులసీ మునే

నవయౌవనసంపన్నం కామదేవ సమప్రభం

శ్వేత చంపక వర్ణాభం రత్నభూషణ భూషితం

శరత్పార్వణ చంద్రాస్యం శరత్పంకజలోచనం

మహారత్న గణాక్లుప్త విమానస్థం మనోహరం

రత్నకుండల యుగ్మాఢ్యగండస్థల విరాజితం

పారిజాత ప్రసూనాఢ్య మాల్యవంతం చ సుస్మితం

కస్తూరీ కుంకుమ యుతం సుగంధి తిలకోజ్వలం

శంఖచూడుడను మహాయోగి శ్రీకృష్ణమంత్రోపదేశము పొంది పుష్కర క్షేత్రమున మంత్ర సిద్ధిని కూడా పొంది సమస్తమంగళకరమైన శ్రీకృష్ణకవచమును పఠించుచు తులసి ఉన్న ఆశ్రమమునకు వచ్చెను.అతడు కూడ బ్రహ్మదేవుని వలన పరమేశ్వరుని వలన తనకు ఇష్టమైన వరమును పొంది బ్రహ్మదేవుని ఆదేశముపై బదరికాశ్రమమునకు వచ్చెను.

నవయౌవన సంపన్నుడు మన్మథుని వలె అందమైనవాడు, శ్వేత చంపకము వంటి శరీర కాంతి కలవాడు, శరత్కాల చంద్రునివంటి ముఖము కలవాడు శరత్కాల పద్మముల వంటి నేత్రములు కలవాడు, పారిజాత కుసుమముల మాల ధరించినవాడు, కస్తూరీ కుంకుమ ధరించిన శంఖచూడుడు ఆమె ఆశ్రమమునకు వచ్చుచుండగా తులసి ఆతనిని చూచినది.

సా దృష్ట్వా సన్నిధానే తం ముఖమాచ్ఛాద్య వాససా

సస్మితా తం నిరీక్షంతీ సకటాక్షం పునః పునః

బభూవ సా నమ్రముఖీ నవసంగమ లజ్జితా

కాముకీ కామబాణేన పీడితా పులకాన్వితా

 పిబంతీ తన్ముఖాంభోజం లోచనాభ్యాం చ సంతతం

దదర్శ శంఖచూడశ్చ కన్యామేకాం తపోవనే పుష్పచందన తల్పస్థాం వసంతీం వాససా వృతాం

పశ్యంతీం తన్ముఖం శశ్వత్సస్మితాం సుమనోహరాం

సుపీన కఠినశ్రోణీం పీవోన్నత పయోధరాం

ముక్తాపంక్తి ప్రభాజష్ట దంత పంక్తిం సుబిభ్రతీం

పక్వబింబాధరోష్ఠీంచ సునాసాం సుందరీం వరాం

తప్త కాంచన వర్ణాభాం శరచ్ఛంద్ర సమప్రభాం

స్వతేజసా పరివృతాం సుఖ దృశ్యాం మనోరమాం

కస్తూరీ బిందు భస్సార్ధమధశ్చందన బిందునా

సిందూర బిందునా శశ్వత్ సీమంతాధః స్థలోజ్వలాం

నిమ్ననాభి గభీరాం చ తదధస్త్రివళీ యుతాం

కరపద్మతలా రక్తం నఖచంద్రైర్విభూషితాం

స్థల పద్మప్రభాజష్ట్రం పాదపద్మం చ బిభ్రతీం

ఆరక్తవర్ణం లలితం అలక్తక సమప్రభం

స్థలపద్మైశ్చ జలజైః పద్మరాగవిరాజితాం

 శరదిందు వినింద్యైక నఖేందోఘ విరాజితాం

అమూల్య రత్న సంమిశ్రయావకేన స్వలంకృతాం

మణీంద్ర ముఖ్య ఖచిత క్వణన్మంజీర రంజీతాం

 దధతీం కబరీ భారం మాలతీ మాల్య సంయుతం

అమూల్య రత్న సంక్లుప్త మకరాకృతి రూపిణా

చిత్రకుండల యుగ్మ శ్రీ సుషుమా పరిశోభితాం

రత్నేంద్ర ముక్తాహార శ్రీస్తన మధ్యస్థలోజ్వలాం

రత్నకంకణకేయూర శంఖభూషణ భూషితాం

రత్నాంగుళీయకైర్దివ్యైః అంగుళ్యావళిభిర్యుతాం

దృష్ట్వా తాం లలితాం రమ్యాం సుశీలాం సుదతీం సతీం

ఉవాస తత్సమీపే చ మధురం తామువాచ సః

శంఖచూడుడు తన దగ్గరికి రాగా అతని అందమునకు ఆశ్చర్యపడి తులసి తసముఖమును బట్టతో కప్పుకొని కటాక్షదృష్టితోచూడసాగినది. అతనిని చూడగనే మన్మథ బాణ పీడితయై నవ సంగమము వలన సిగ్గుపడ్డట్లు సిగ్గుపడినది. అతని ముఖ కమలమును తన కళ్ళతో తాగుచున్నట్లు తదేక దృష్టితో చూడసాగినది.

శంఖచూడుడు కూడ పుష్పచందన శయ్యపై పడుకొని తనముఖమును తదేక దీక్షతో చూచుచున్న కన్యయగు తులసిని ఆ తపోవనమున చూచెను. తులసి చాలా అందమైనది. అనేక రత్నహారములను కేయూరములను రత్నాంగుళీయకములను ధరించి మనోహరముగా కన్పించినది. అందువలన అతడు ఆమె సమీపమున కూర్చుండి మధురముగా తులసితో ఇట్లు మాట్లాడసాగెను.

శంఖచూడ ఉవాచ-శంఖచూడుడిట్లు పలికెను-

కా త్వం కస్య చ కన్యాసి ధన్యే మాన్యే సుయోషితాం

కా త్వం కామిని కల్యాణి సర్వ కల్యాణ దాయిని

 స్వర్గభోగాది సరితి విహారే హార రూపిణి

సంసారదార సారేచ మాయాధారే మనోహరే

జగద్విలక్షణే క్షామే మునీనాం మోహకారిణి

మౌనం త్యక్త్వా కింకరం మాం సంభాషాం కురు సుందరి

ఇత్యేవం వచనం శ్రుత్వా సకామా వామలోచనా

సస్మితా నమ్రవదనా సకామం తమువాచ సా

ఓ కన్యా! నీవెవరవు? ఎవరి పుత్రికవు? నీవుచాల అందమైనదానవు.స్వర్గాది భోగములను సరస్సులో విహరించుచున్నదానవు. ప్రపంచమున నీ అందము చాలా విలక్షణమైనది. నీవు మహర్షులకు కూడ మోహమును కలిగించునంత అందకత్తెవు. నీవు మౌనమును వదలి పెట్టి నీ సేవకుడనగు నాతో సంభాషింపుము అని శంఖచూడుడనగా తులసి తలవంచుకొని చిరునవ్వు ఏర్పడగా ఇట్లు మాట్లాడెను.

తులస్యువాచ- తులసీదేవి ఇట్లనెను-

ధర్మధ్వజసుతాఽహం చ తపామ్యత్ర తపోవనే

తపస్వినీహ తిష్ఠామి కస్త్వం గచ్ఛయథాసుఖం

 కామినీం కులజాతాం చ రహస్యేకాకినీం సతీం

న పృచ్ఛతి కులే జాతః ఏవమేవ శ్రుతౌ శ్రుతం

లంపటోఽత్కులే జాతో ధర్మశాస్త్రార్థ వర్జితః

యేనాఽశ్రుతః శ్రుతేరర్థః స కామీచ్ఛతి కామినీం

 ఆపాతమధురామంతే చొంతకాం పురుషస్య తాం

విషకుంభాకార రూపామమృతాస్యాం చ సంతతం

 హృదయే క్షురధారాభాం శశ్వన్మధుర భాషిణీం

స్వకార్య పరినిష్పత్తి తత్పరాం సతతం సదా

కార్యార్థే స్వామివశగాం అన్యథైవావశాం సదా

స్వాంతర్మలిన రూపాం చ ప్రసన్న వదనేక్షణాం

శ్రుతౌ పురాణే యాసాం చ చరిత్రమనిరూపితం

తాసు కో విశ్వసేత్ప్రాజ్ఞ హ్యప్రాజ్ఞ ఇవ సర్వదా

తాసాం కోవా రిపుర్మిత్రం ప్రార్థయంతీం నవం నవం

దృష్ట్వా సువేషం పురుషమిచ్ఛంతం హృదయే సదా

బాహ్యే స్వాత్మ సతీత్వం చ జ్ఞాపయంతీం ప్రయత్నతః

శశ్వత్కామాం చ రామాం చ కామధారాం మనోహరాం

 బాహ్యే ఛలాచ్ఛాదయంతీం స్వాంతర్మైథున లాలసాం

కాంతం గ్రసంతీం రహసి బాహ్యేతీవ సులజ్జితాం

 మానినీం మైథునోభావే కోపినీం కలహాంకురాం

సంభీరాం భూరి సంభోగాత్ స్వల్పమైథున దుఃఖితాం

సుమృష్టాన్నం శీతతోయమాకాంక్షంతీం చ మానసే

సుందరం రసికం కాంతం యువానం గణినం సదా

సుతాత్పరమతిస్నేహం కుర్వంతీం రతికర్తరి

ప్రాణాధికం ప్రియతమం సంభోగ కుశలం ప్రియం

పశ్యంతీం రిపుతుల్యంచ వృద్దం వా మైథునాఽక్షమం

 కలహం కుర్వతీం శశ్వత్తేవ సార్థం సుకోపనాం

 చర్చయా భక్షయంతీం తం కీనాశ ఇవ గోరజః

దుస్సాహస స్వరూపాంచ సర్వ దోషాశ్రయాం సదా

 శశ్వత్కవటరూపాంచ సర్వదోషాశ్రయం సదా

బ్రహ్మ విష్ణుశివాదీనాం దుస్త్యాజ్యం మోహరూపిణీం

 తపోమార్గార్గళాం శర్వన్ముక్తి ద్వార కపాటికాం

హరేర్భక్తి వ్యవహితాం సర్వమాయా కరండికాం

 సంసారకారాగారే శశ్వన్నిగడ రూపిణీం

ఇంద్రజాల స్వరూపాంచ మిథ్యావాది స్వరూపిణీం

బిభ్రతీం బాహ్య సౌందర్యం మధ్యాంగమతికుత్పితం

 నానా విణ్మూత్ర పూయానామాధారం మలసంయుతం

దుర్గంధి దోష సంయుక్తం రక్తాక్తం చాప్యసంస్కృతం

మాయారూపాం మాయినాం చ విధినా నిర్మితం పురా

విషరూపాం ముముక్షూణాం ఆదృశ్యాం చైవ సర్వదా

ఓ యువకుడా! నేను ధర్మధ్వజ మహారాజుగారి పుత్రికను. ఉన్నత వంశమున పుట్టినవాడెవ్వడు రహస్య ప్రదేశమున ఒంటరిగా ఉన్నకన్యతోమాట్లాడడు. ఉన్నత కులమున జన్మించక ధర్మశాస్త్రములు క్షుణ్ణముగా చదువక లంపటుడై తిరుగు కాముకుడు మాత్రమే కామిని కావలెనని కోరును.

కాని స్త్రీయన్నచో ఆపాతమధురముగానుండును. తరువాతి కాలమున పురుషుని చాలా ఇక్కట్లపాలు చేయును. హృదయము ఆసిధారవలె ఉన్నను మాటలు మాత్రము అమృతము వలె నుండును. తన కార్యము పూర్తియైన తరువాత ముఖము చూపదు. వేదములలో పురాణములలో ఇట్టి స్త్రీల స్వభావము చెప్పబడలేదు. ఆందువలన తెలివికలవాడు స్త్రీని ఎన్నడు విశ్వసింపడు.

అట్లే మోహరూపిణియైన స్త్రీ బ్రహ్మాదులకు సైతము మోహమును పుట్టించును. ఈమె తపోమార్గమునకు ఆడ్డంకుగానుండును. ముక్తిద్వారమునకు ద్వారమువంటిది. సంసారమనే కారాగారమున నున్న ఇనుపగొలుసు వంటిది. మోసము చేయువారినే మోపము చేయు స్వభావము కలది. మోక్షము కోరువారికి విషరూపిణి. ఆట్టి స్త్రీతో ఉన్నత వంశ భవుడెవ్వడు రహస్య ప్రదేశమున మాట్లాడడు.

ఇత్యుక్త్యా తులసీ తం చ విరరామ చ నారద

సస్మితః శంఖచూడశ్చ ప్రవక్తుముపచక్రమే

తులసి ఈ విధముగా శంఖచూడునితో చెప్పగా అతడు చిరునవ్వుతో ఇట్లనెను.

శంఖ చూడ ఉవాచ - శంఖచూడు డిట్లనెను-

 త్వయా యత్కథితం దేవి న చ సర్వమలీకకం

కించిత్సత్యమలీకం చ కించిన్మత్తో నీశామయ

నిర్మితం ద్వివిధం ధాత్రా స్త్రీరూపం సర్వమోహనం

కృత్యారూపం వాస్తవం చ ప్రశస్యం చాప్రశంసితం

 లక్ష్మీ సరస్వతీ దుర్గా సావిత్రి రాధికాదికం

 సృష్టి సూత్ర స్వరూపం చాప్యాద్యం స్రష్ట్రాతు నిర్మితం

 ఏతాసామంతరూపం యత్ స్త్రీ రూపం వాస్తవం స్మృతం

తత్ప్రశస్యం యశోరూపం సర్వమంగళ కారణం

శతరూపా దేవహూతి; స్వధా స్వాహా చ దక్షిణా

ఛాయావతీ రోహిణీ చ వరుణానీ శచీ తథా

కుబేర వాయుపత్నీ సాఽప్యదితీశ్చ దితిస్తథా

లోపాముద్రాఽనసూయాచ కైటభీ తులసీ తథా

ఆహల్యారుంధతిమేనా తారామండోదరీ పరా

దమయంతీ వేదవతి గంగా చ యమునా తథా

పుష్టిస్తుష్టి: స్మృతిర్మేధా కాళికా చ వసుంధరా

షష్టీ మంగళచండీ చ మూర్తిర్యై ధర్మకామినీ

స్వస్తి శ్రద్ధా చ కాంతిశ్చ తుష్టిః శాంతిస్తథా పరా

 నిద్రా తంద్రా క్షుత్సిపాసా సంధ్యా రాత్రిర్దినానీ చ

సంపత్తి వృత్తి కీర్త్యశ్చ క్రియాశోభా ప్రభాంశకం

యత్ స్త్రీరూపం చ సంభూతం ఉత్తమం తద్యుగే యుగే

కృత్యాస్వరూపం తద్యత్తు సర్వేశ్యాదీకమేవవా

తదప్రశస్యం విశ్వేషు పుంశ్చలీ రూపమేవచ

సత్వ ప్రధానం యద్రూపం తచ్చ శుద్ధం స్వభావత:

తదుత్తమం చ విశ్వేషు సాధ్వీరూపం ప్రశంసితం

తద్వాస్తవం చ విజ్ఞేయం ప్రవదంతి మనీషిణః

రజోరూపం తమోరూపం కృత్యాపు ద్వివిధం స్మృతం

స్థానాభావాత్ క్షణాభావాత్ మద్యవృత్తెరభావతః

దేహ క్లెశేన రోగేణ తత్సంసర్గేణ సుందరి

బహుగోష్ఠావృతేనైవ రిపురాజ భయేన చ

రజోరూపస్య. సాధ్వీత్వమేతేనైవోప జాయతే

ఇదం మధ్యమ రూపం చ ప్రవదంతీ మనీషిణః

 తమోరూపం దుర్నీవార్యమధమం తద్విదుర్బుధాః

న పృచ్ఛతి కులే జాత: పండితశ్చ పరస్త్రీయం

నిర్జనే దుర్జనే వాఽపి రహస్యే వచసా స్త్రీయం

ఆగచ్చామి త్వత్సమీపమాజ్ఞయా బ్రహ్మణోదునా

 గాంధర్వేణ వివాహేన త్వాం గృహీష్యామి శోభనే

ఓ తులసీదేవి! నీవు చెప్పినదంతయు అసత్యము కాదు. మీ మాటలలో కొంతసత్యము, కొంత అసత్యము కూడ ఉన్నది. అందువలన నామాటలను వినుము.

బ్రహ్మదేవుడు స్త్రీ రూపమును అందరకు మోహమును కల్గించునట్లు చేసెను. అట్టి స్త్రీరూపము ప్రశంసించతగిన వాస్తవరూపము, నిందించతగిన కృత్యోరూపముఅని రెండువిధములుగానున్నది.

లక్ష్మీ, సరస్వతి, దుర్గా, సావిత్రి, రాధ వారి అంశలవలన జన్మించిన స్త్రీలందరు ఉత్తములు. వారి రూపము అన్నీ యుగములలో అంతట కూడ ప్రశంసింపతగినది. ఇది సత్వగుణ ప్రధానమైనది. స్వభావతః శుద్దమైన సాధ్వీరూపము ప్రశంసించతగినది. దీనిని పండితులు వాస్తవరూపమందురు.

ఇక రెండవదైన కృత్యారూపము, దేవవేశ్యల రూపము. ఈ భూమీపైనున్న సైరచారిణులైన స్త్రీల రూపము నిందింపదగినది. కృత్యారూపము రజోరూపము తమోరూపమనీ రెండు విధములుగా ఉన్నది.

స్థలము దొరకకనో, సమయము చిక్కకనో, మధ్యవ్యక్తులు లేకనో శరీరము బాగుగా లేనందువలననో, శత్రువులు, రాజులయొక్క భయమువలననో ఇంకను కొన్ని ఇతర కారణములవలన రజోరూపలైన స్త్రీలు పతివ్రతలుగా నున్నారు. ఇది మధ్యమరూపమని పండితులు పేర్కొనుచున్నారు. తమోగుణరూపము చాలా ఆధమమైనదని అందురు.

ఉన్నత వంశమున పుట్టిన పాడెవడు నిర్జన ప్రదేశముననున్నను దుర్జనులున్న ప్రదేశముననున్నను పరస్త్రీతో రహస్యముగా సంభాషణ చేయడు.

నేను బ్రహ్మదేవుని ఆజ్ఞవలన నీ దగ్గరికి వచ్చినాము. నిన్ను గాంధర్వ వివాహము చేసికొనుటకు. ఇష్టపడుచున్నాను.

అహమేవ శంఖచూడో దేవవీద్రావకారకః

దనువంశోద్భవో విశ్వే సుదామాచార హరేః పురే

 ఆహమష్టసు గోపేషు గోగోపీ పార్షదేషుచ

ఆధునా దానవేంద్రోఽహం రాధీకాయాశ్చ శాపతః

జాతిస్మరోఽహం జానామి కృష్ణమంత్రం ప్రభావతః

జాతిస్మరా త్వం తులసీ సంసక్తా హరిణా పురా

త్వమేవ రాధికా కోపాజ్జాతాఽసి భారతే భువే

త్వాం సంభోక్తుమిచ్చకోఽహం నాలం. రాధా భయాత్రత:

ఇత్యేవ ముక్త్యా సపుమాన్వీరరామ మహామునే

సస్మితా తులసీ హృష్ణా ప్రవర్తుముపచక్రమే

నేను దనుజవంశములో పుట్టి దేవతలనందరను భయ పెట్టుచున్న శంఖచూడుడను వాడను. నేను వైకుంఠమున శ్రీహరిదగ్గర సుదాముడను పేరుతో నుంటిని. అచ్చట గోపకులకు, గోపికలకు అనుచరులుగా నున్న ఎనమండుగురు. గొల్లలలో నేనొకడను. కాని రాధాదేవి శాపమువలన దానవేంద్రుడిగా జన్మనెత్తీతిని. శ్రీకృష్ణుని మంత్ర ప్రభావమువలన పూర్వ జన్మ జ్ఞానము నాకు కలదు. ఆట్లే నీపేరు తులసి. నీకు కూడా నీ పూర్వజన్మజ్ఞానము కలదు. పూర్వము నీవు శ్రీహరితో సంగమించినందువలన దానిని చూచిన రాధికా దేవి కోపముతో పెట్టిన శాపమువలన ఈ భారతభూమిలో జన్మనెత్తితివి. వైకుంఠమున నున్న నీ సంభోగము నాశించినను రాధాదేవి భయమువలన నేను సాహసము చేయలేదు.

ఇట్లుశంఖచూడుడు చెప్పి ఊరకుండగా తులసి మిక్కిలి సంతోషంతో ఇట్లుచెప్పనారంభించినది.

తులస్యువాచ: తులసి ఇట్లు చెప్పినది-

ఏవం విధో బుధో విశ్వే బుధేషు చ ప్రశంసితః

కాంతమేవం విధం కాంతా శశ్వదిచ్ఛతి కామతః

త్వయాఽహమధునా సత్యం విచారణ పరాజితా

స నిందితశ్చాప్య శుచిః యః పుమాంశ్చ స్త్రీయా జితః

నిందంతీ పితరోదేవా బాంధవాః స్త్రీజితం జనం

స్త్రీ జీతం మనసా వాచా పితా భ్రాతా చ విందతి  

శుధ్యద్వీప్రో దశాపాన జూతకే మృతకే తథా

భూమిపో ద్వాదశాహేన వైశ్య: వంచదశాహతః

శూద్రో మాసేన వేదేషు మాతృవద్వర్ణ సంకరః

ఆశుచిః స్త్రీజితః శుధ్యత్ చితా దహన కాలతః

న గృష్ణాంతిచ్ఛయా తస్య పితర: పిండ తర్పణం

న గృష్ణాంతిచ్ఛయా దేవాః తస్య పుష్ప జలాదికం

 కిం తస్యజ్ఞాన తపసా జపహోమ ప్రపూజనైః

కిం విద్యయా వా యశసా శ్రీభిర్యస్య మనోహ్పతం

విద్యాప్రభావ జ్ఞానార్థం మయా త్వం చ పరీక్షితః

కృత్వా పరీక్షాo కాంతస్య వృణోతి కామినీ వరం

 వరాయ గుణహీనాయ వృద్ధాయాజ్ఞానినే తథా

దరిద్రాయ చ మూర్ఖాయ రోగిణే కుత్సితాయ చ

అత్యంత కోపయుక్తాయ చాత్యంత దుర్ముఖాయచ

పంగులాయాంగహీనాయ చాంధాయ బధిరాయ చ

జడాయ చైవ మూకాయ క్లీబతుల్యాయ పాపినే

బ్రహ్మహత్యాం లభేత్సోపి యః స్వకన్యాం దదాతి చ

శాంతాయ గుణినే చైవ యూనే చ విదుషే తథా

వైష్ణవాయ సుతాం దత్వా దశవాజీఫలం లభేత్

య: కన్యాపాలనం కృత్వా కరోతి విక్రయం యది

విపదా ధనలోభేన కుంభీపాకం స గచ్చతి

కన్యామూత్రపురీషం చ తత్ర భక్షతి పాతకీ

కృమిభిర్థంశితః కాకైః యావదింద్రాశ్చతుర్దశ

తదంతే వ్యాధయోనౌ చ లభతే జన్మనిశ్చితం

విక్రీణాతి మాంసభారం వహత్యేవ దీవానీశం

ఇత్యేవముక్త్యా తులసీ విరరామ తపోవనే

ఏతస్మిన్నంతరే బ్రహ్మా తయోరంతికమాయయౌ

నీవంటి విద్వాంసుని అందరు ప్రశంసింతురు. నీవలె దాపరికములేకుండ మాట్లాడు యువకుని ప్రతిష్తి ఎప్పటికి కోరుకొనును. నీ ఆలోచనా రీతీ చాలా గొప్పది. నీ ఆలోచనా రీతి వల్ల నేను, పరాజయమును పొందితిని.

స్త్రీకి లోబడిన పురుషుని పితరులు, దేవతలు, బంధువులు, తండ్రి అన్నదమ్ములు ఆందరు నిందింతురు. జాతకర్మలోనైనా, మృతుడైనప్పుడు కూడ బ్రాహ్మణుడు పది దినములలో పరిశుద్ధుడగును, శూద్రుడు నెలలోపల పరిశుద్ధుడగును. స్త్రీజితుడైనవాడు చితిలో కాలిన తరువాతనే పరిశుద్దుడగును. అతడు పెట్టు పిండతర్పణములను పితృదేవతలు సంతోషముగా తీసికొనరు. అట్లే దేవతలు స్త్రీకి లోబడినవాడిచ్చు పుష్పజాలాదికమును స్వీకరింపరు. అట్టివాడు జ్ఞానమును సంపాదించుకొనివను, తపస్సు, చేసినను, జపహోమాది కార్యక్రమములు చేసినను అన్నియు వ్యర్థమగును.

నీ విద్యాప్రభావమును తెలిసికొనుటకై నీన్ను పరీక్షించితిని. స్త్రీ తనకు నచ్చిన యువకుని శక్తియుక్తులను పరీక్షించి ఆతనిని వరించును.

గుణహీనునకు, వృద్ధునకు, అజ్ఞానికి, దరిద్రునకు, సదారోగికి, మూరునకు, దుష్టునకు, అతికోపము కలవానికి, అంగహీనునకు, జడుసకు, నపుంసకునకు తన పుత్రికనిచ్చి వివాహము చేసినచో ఆతడు బ్రహ్మహత్యాపాపమును పొందును.

సుగుణాలరాశి, విద్వాంసుడు, శాంతుడగు యువకుడైన వైష్ణవునకు పిల్లనిచ్చినవాడు పది ఆశ్వమేధయాగములు చేసిన ఫలితము పొందును.

చిన్నప్పటినుండి పిల్లను పెంచి పెద్దచేసి ఆపదవల్లనో ధనమునకాశపడో కన్యావిక్రమయము చేసినవాడు కుంభీపాక నరకముననుభవించును. పదునలుగురింద్రులు గడచునంతవరకు. నరకమున చిత్ర విచిత్ర శీక్షల ననుభవించును. ఆతరువాత ఆటవికుల ఇంట జన్మించును.

ఈవిధముగా తులసి శంఖచూడునీతో మాట్లాడుచున్నప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చెను.

మూర్ధ్నా ననామ తులసీ శంఖచూడశ్చ నారద

ఉవాస తత్ర దేవేశ్చవాచ చ తయోర్హితం

కిం కరోషి శంఖచూడ సంవాదమనయా సహ

గాంధర్వేణ వివాహేన త్వమస్యా గ్రహణం కురు

త్వం చ పురుషరత్నం చ స్త్రీరత్నం స్త్రీష్వియం సతీ

విదగ్ధాయావీదగ్ధేన సంగమో గుణవాన్ భవేత్

నిర్వీరోధసుఖం రాజన్ కోవా త్యజత దుర్లభం

యోఽవిరోధ సుఖత్యాగీ స పశుర్నాత్ర సంశయః

క్రీముపేక్షసి త్వం కాంతం ఈదృశం గుణినం సతీ

దేవానామసురాణాంచ దానవానాం విమర్ధనం

యథా లక్ష్మీశ్చ లక్ష్మీసే యథా కృష్ణే చ రాధికా

యథా మయి చ సావిత్రీ భవానీ చ భవే యథా

యథా ధరా వరాహేచ యథా మేన హిమాలయే

యథాలాపనసూయాచ దమయంతి నలే యథా

రోహిణీ చ యథా చంద్రే యథా కామే రతిః సతి

యథాఽదీతీ: కశ్యపే చ వసిష్ఠేఽరుంధతీ యథా

 యథాఽహల్యో గౌతమేచ దేవహూతిశ్చ కర్దమే

 యథా బృహస్పతౌ తారా శతరూపా మనౌ యథా

యథా చ దక్షిణా యజ్ఞే యథా స్వాహా హుతాశనే

యథా శచీ మహేంద్రీచ యథా పుష్టిర్గణేశ్వరీ

దేవసేనా యథాస్కందే ధర్మే మూర్తిర్యదా సతీ

సౌభాగ్యా సుప్రియా త్వం చ శంఖచూడే తథా భవ

అనేన సార్థం సుచిరం సుందరేణ చ సుందరి

స్థానే స్థానే వీహారంచ యథేచ్చం కురు సంతతం

తులసీ శంఖచూడులు బ్రహ్మదేవునికి నమస్కరించిరి. బ్రహ్మదేవుడచ్చట కూర్చొని శంఖచూడుడా! తులసితో ఏమి మాట్లాడుచున్నావు. నీవామెను గాంధర్వవిధితో వివాహమును చేసికొనుము. నీవు పురుషులలో శ్రేష్టుడవు, తులసి స్త్రీలలో రత్నము వంటిది. మీ ఇద్దరి కలయిక మిక్కిలి మేలును కలిగించును. విరుద్దము కానీ సుఖమును ఎవరు వదులుదురు? వదలినచో అతడు పశుతుల్యుడు.

ఓ తులసి! నీవు ఇటువంటి సుద్దుణములు కలవానీని, అందమైన వానిని పతిగా పొందుటకు ఎందులకు ఉపేక్ష చేయుచున్నాడు. ఇతడు దేవతలను. ఆసురులను, దానవులను కూడ జయించిన వీరుడు.  

లక్ష్మీదేవి విష్ణువునకు, కృష్ణునకు రాధిక, నాకు సావిత్రి, శ్రీవునకు పార్వతి, ఆదివరాహునకు భూమి, హిమాలయమునకు మేన, అత్రిమహర్షికి ఆనసూయ, నలుసకు దమయంతి, చంద్రునకు రోహిణి, మన్మథునకు రతీదేవి, కశ్యపునకు దితి, వశిష్ఠునకు ఆరుంధతి, గౌతమునకు ఆహల్య, కర్దమ మహర్షికి దేవహూతీ, బృహస్పతికి తార, మనువునకు శతరూప, యజ్ఞమునకు దక్షిణ, అగ్నికి స్వాహాదేవి, దేవేంద్రునకు శచీదేవి, గణపతికి పుష్టి. సుబ్రహ్మణ్యస్వామికి దేవసేన, ధర్మునకు మూర్తీదేవి ఏవిధముగా ప్రియమైనవారో అట్లే శంఖచూడునికి నీపై అమితమైన ప్రేమ కలదు. అందువలన సుందరుడైన ఈ శంఖచూడునితో యథేచ్ఛగా విహరింపుము.

పశ్చాతాప్యసి గోవిందం గోలోకే పునరేవ చ

చతుర్భుజం చ వైకుంఠే శంఖచూడే మృతే సతి

ఇత్యేవమాశిషం కృత్వా స్వాలయం ప్రయయా విధి:

గాంధర్వణ వివాహేన జగృహే తాం చ నారద

ఈ శంఖచూడుడు చనిపోయిన పిదప గోలోకమున నున్న శ్రీకృష్ణుని, వైకుంఠమున నున్న చతుర్భుజుడైన శ్రీమహావిష్ణువును పొందుదువు, అని బ్రహ్మదేవుడు వారిద్దరకు శుభాశీస్సులొసగి బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయెను.

            అప్పుడు శంఖచూడుడు గాంధర్వవిధితో తులసిని పరిణయమాడెను.

స్వర్గే దుందుభివాద్యం చ పుష్పవృష్టిర్బభూవహ

స రేమే రమయా పార్థం వాసగేహే మనోహరే

మూర్ఛాం సంప్రాప తులసీ నవసంగమ సంగతా

నీమగ్నా నిర్జనే సాద్వీ సంభోగసుఖ సాగరే

చతుః షష్టి కళామానం చతు: షష్టివిదం సుఖం

 కామశాస్త్రే యన్నీరుక్తం రసికానాం యథేప్సితం

అంగప్రత్యంగ సంశ్లేష పూర్వకం స్త్రీ మనోహరం

 తత్సర్వం సుఖశృంగారం చకార రసికేశ్వరః

ఆతీవ రమ్యే దేశేచ సర్వజంతు వివర్జితే

పుష్ప చందన తల్పేచ పుష్పచందన వాయునా

పుష్పోద్యానే నదీతీరే పుష్పచందన చర్చితే

 గృహీత్వా రసికాం రామాం పుష్ప చందన చర్చితార

భూషితాం భూషజ్ఞః సర్వైరతీవ సుమనోహరాం

సురతేర్విరతీ రాస్తి తయోః సురత విజ్ఞయోః

జహార మానసం భక్తుర్లీలయా తులసీ సతి

చేతనాం రసికాయాశ్చ జహర రసభావవీత్

వక్షసశ్చందనం బాహ్వొస్తిలకం విజహార సా

స చ జగ్రాహ తస్యాశ్చ సిందూర బిందు పత్రకం

స తద్వక్షసి తస్యాశ్చ నఖరేఖాం దదౌ ముదా

సా దదౌ తద్వామ పార్శ్వేకరభూషణ లక్షణం

రాజా తదోష్ఠపుటకే దదౌ దశనదంశనం

తద్గండయుగళే నీ చ ప్రదదౌ తచ్చతుర్గుణం

సురతేర్విరతౌ తౌ చ సముత్థాయ పరస్పరం

సువేషం చక్రతుస్తత్ర యత్తన్మనసీ వాంఛితం

తులసీ శంఖచూడుల వివాహసమయమున స్వర్గమున దుందుభివాద్యములు చెలరేగినవి. దేవతలు పుష్పవృష్టిని కురిపించిరీ, శంఖచూడుడు తన భార్యతో కామశాస్త్రమున చెప్పబడిన చతుషష్టి కళలను, చతుషష్టివీధములుగా అనుభవించెను. చాల అందమైన ప్రదేశమున నదీతీరమున పుష్పోద్యానమున పుష్పచందన శయ్యపై పుష్పముల, చందనముల వాయువు వీయుచుండగా సుఖసంభోగమున మునిగెను. వారి రతికి ఆంతులేకుండ పోయెను.

తులసి తన భర్త మనుస్సును హరింపగా, శంఖచూడుడు రసికయగు తన భార్య మనస్సును హరించెను. రత్యనంతరము వారు కోరుకున్నట్లు ఆలంకరించుకొనిరి.

కుంకుమాక్త చందనేన సా తస్మై తిలకం దదౌ

సర్వాంగే సుందరే రమ్యే చకార చానులేపనం

సువాసితం చ తాంబూలం వహ్ని శుద్ధే చ వాససీ

పారిజాతస్య కుసుమం మాల్యం చైవ సుశోభవం

అమూల్య రత్న నిర్మాణమంగుళీయకముత్తమం

సుందరం చ మణివరం త్రిషులోకేషు దుర్లభం

దాసీ తవాహమిత్యేవం సముచ్చార్య పునః పునః

ననామ పరయా భక్త్యా స్వామీనం గుణశాలివం

సస్మి తన్ముఖాంభోజం లోచనాభ్యాం పపౌ పునః

నీమేషరహితాభ్యాం చ సకటాక్షం చ సుందరం

సచ తాం చ పమాకృష్య చకార వక్షసి ప్రియాం

సస్మితం వాససాబచ్చన్నం దదర్శ ముఖ పంకజం

 చుచుంబ కఠినే గండే బిబోష్ఠే పునరేవచ

దదౌ తస్యై వస్త్రయుగ్మం వరుణాదాహృతం చ యత్

తదాహృతాం రత్నమాలాం త్రీషులోకేషు విశ్రుతాం

దదౌ మంజీరయుగ్మం చ స్వాహాయాశ్చ హృతం చ యత్

కేయూరయుగ్మం ఛాయాయా రోహిణ్యశ్చైవ కుండలం

అంగుళీయక రత్నాని రత్యాశ్చ వరభూషణం

శంఖం సురుచీరం చిత్రం యద్దత్తం విశ్వకర్మణా

విచిత్రపీఠక శ్రేణీం శయ్యాం చాపి సుదుర్లభాం

భూషణాని చ దల చ పరిహారం చకార పా

 నిర్మాయ కబరీభారం. తస్యాశ్చ మాల్యసంయుతం

సుచిత్రం పత్రకం గండే జయలేఖ సమం తథా

 చంద్రలేఖా త్రిభిరుక్తం చందనేన సుగంధినా

పరీతః పరితశ్చితైః సార్థం కుంకుమ బిందుభిః

జ్వలత్ర్పదీపాకారం చ సిందూర తిలకం దదో

తత్పాద పద్మయుగళే స్థల పద్మవినిందితే

 చిత్రాలక్తక రాగం చ నఖరేషు దదౌ ముదా

స్వవక్షసి ముహుర్వ్యస్తం సరాగం చరణాంబుజం

హేదేవి తవ దాసోఽహమిత్యుచ్చార్య పునః పునః

రత్న నిర్మాణ యానేన తార చ కృత్వాస్వవక్షసి

తపోవనం పరిత్యజ్య రాజాస్థానాంతరం యయా

మలయే దేవనిలయే శైలే శైలే వునః పునః

స్థానే స్థానేఽతి రమ్యే చ పుష్పోద్యానేతి నిర్జనే

కందరే కందరే సింధుతీరే చ సుందరే వనే

పుష్ప భద్రానదీ తీరే నీరవాత మనొహరే

పులినే పులివే దివ్య నద్యాం వద్యాం నదే నయి

మధా మధుకరాణాం చ మధుర ధ్వని నాగితే

వినిస్యందే సుపవనే నందనే గంధమాదనే

 దేవోద్యావో దేవవనే చిత్ర చందన కాననే

 చంపకానాం కేతకీనాం మాధవీనాం చ మాధవే

 కుందానాం మాలతీనాంచ కుముదాంభోజ కాననే

కల్పవృక్షే కల్పవృక్ష పారిజాతవనే వనే

నిర్జనే కాంచనీస్థానే ధన్యే కాంచన పర్వతే

కాంచీవనే కించనకీ కంచకే కాంచనాకరే

పుష్పచందన తల్పే చ పుంస్కోకిలరుత శ్రుతే

పుష్పచందన సంయుక్తః పుప్ప చందనవాయునా

కాముక్యా కాముక: కామాత్ స రేమే రమయా సహ

 న తృప్తో దానవేంద్రశ్చ తృప్తిం నైవ జగామ సా

హవిషా కృష్ణవర్త్మేవ వవృధీ మదనస్తయోః

తయా సహ సమాగత్య స్వాశ్రమం దానవస్తతః

రమ్యం క్రీడాలయం కృత్వా విజహార పునస్తతః

ఏవం సంబుభుజే రాజ్యం శంఖచూడ: ప్రతాపవాన్

తులసి శంఖచూడునకు కుంకుమ అద్దిన చందనముతో తిలకము దిద్దెను. అట్లే అతని శరీరమున కంతట చందనానులేపనము చేసినది. ఆతరువాత సువాసన గల తాంబూలమును పరిశుద్ధమైన వస్త్రములను, పారిజాత పుష్పమును, అమూల్య రత్నములచే నిర్మింపబడిన ఉంగరము నిచ్చి నేను నీ దాసురాలను అని చెప్పి అనేక నమస్కారములు చేసెను. అతని ముఖమును రెప్పవాల్చక చూడసాగిమ.

ఆట్లే శంఖచూడుడు తన ప్రియురాలిని రొమ్ముపై నుంచుకోని ముసుగుతో కప్పబడిన ఆమె ముఖమును చూచుచు మాటిమాటికి ముద్దు పెట్టుకొనెను. తరువాత తులసికి వరుణుని గెలిచి తెచ్చిన వస్త్రములను, రత్నమాలను, ఆగ్నిదేవుని జయించి తెచ్చిన ప్వాహాదేవి యొక్క నూపురములను, చంద్రుని జయించి తెచ్చిన రోహిణీదేవి కుండలములను, ఉంగరములను, విశ్వకర్మ ఒపగిన వస్తువులను, విచిత్రమైన పీటలను, గొప్పనైన శయ్యను ఇచ్చెను. ఆట్టే ఆమె వెంట్రుకలు దువ్వుచు కొప్పు పెట్టి దానికి మాలలు చుట్టెను. తులసీదేవి చెక్కిళ్ళపై చిత్రవిచిత్రములైన మకరికా పత్రములనమర్చెను. చందనముతో తులసీదేవి నొసట మూడు చంద్రరేఖలు దిద్ది దాని చుట్టు కుంకుమబిందువులు పెట్టి దీపజ్వాలవలె నున్న తిలకమును తీర్చిదిద్దెను. గోళ్లకు చిత్రవిచిత్రమైన లత్తుకనద్దెను. ఆమె పాదములను తన రొమ్ముపైనుంచుకొని ఓదేవి నేను నీ దాసుడనని మాటిమాటికి ఉచ్చరించి రత్న విమానమున ఇంకొక స్థానమునకు తీసికొని వెళ్ళెను.

దేవతలకు నిలయమైన మలయపర్వతమున ఆతి రమ్యమైన పుష్పోద్యానమున, సింధునదీ తీరమున నున్న సుందర వనములో, పుష్ప భద్రానదీ తీరముననున్న ఇసుకల పైన, తుమ్మెదల వాదముతో మనోహరమైన గంధమాదన పర్వతమందలి ఉద్యానవనమున, నందనోద్యానవనమున మల్లెలు, మౌలతులు, కలువలు, తామరలు కల ఉవనమున, మేరు పర్వతముపై నున్న ఉపవనములో పుష్పశయ్యపై పుష్పముల చందనముల గాలి వీచుచుండ వారిద్దరు రతి కేళి చేసిరి. ఐనను వారిద్దరి కోరిక తీరలేదు. నేయిబోపినచో మండు మంటవలె వారి కోరిక చల్లారలేదు, పైగా అభివృద్ధి కాసాగినది.

చివరకు తులసీ శంఖచూడులు తమ ఆశ్రమమునకు తిరిగి వచ్చి ఆందమైన క్రీడాలయమును నిర్మించుకొని సుఖముగా విహరించసాగిరి.

ఏకమన్వంతరం పూర్ణం రాజరాజేశ్వరో బలీ

దేవనామసురాణాం చ దానవానాం చ సంతతం

గంధర్వాణాం కిన్నరాణాం రాక్షసానాం చ శాస్తిదః

హృతాధికారా దేవాశ్చ చరంతి భిక్షుకా యథా

పూజాహోమాదికం తేషాం ఆహార విషయం. బలాత్

ఆశ్రయం చాధికారం చ శస్త్రాస్త్ర భూషణాదికం

విరుద్యమాః సురాః సర్వే చిత్రపుత్తలికా యథా

 తే చ సర్వే విషణ్ణశ్చ ప్రజగ్ముః బ్రహ్మణః సభాం

బలవంతుడు, చక్రవర్తియగు శంఖచూడుడు ఒక మన్వంతర కాలము దేవదానవ, గంధర్వ కిన్నరాదులకు, రాక్షసులకు దానవులకు ఆజ్ఞలిచ్చుచు పరిపాలనము చేసెను.

అప్పుడు దేవతలు అధికారమును కోల్పోయి బిచ్చగాండ్రవలె ఇటునటు తిరుగసాగిరి. వారి పూజాహోమాదికములను, ఆధికారమును, శస్త్రాస్తభూషణాదికములను శంఖచూడుడు బలవంతముగా తీసికొనెను. అందువలన దేవతలందరు పనిపాటలు లేక చిత్రమునందలి బొమ్మలవలెనైరి.

అందువలన దేవతలందరు తమ కష్టములను చెప్పుకొనుటకు బ్రహ్మలోకమునకు వెళ్ళిరి.

వృత్తాంతం కథయామాసూ రురుదుశ్చ భృశం ముహు:

తదా బ్రహ్మా సురైస్సార్థం జగామ శంకరాలయం

దేవతలు తమ బాధలన్నిటిని బ్రహ్మదేవునికి చెప్పుకొనగా ఆతడు వారిని తీసికొని కైలాసమునకు వెళ్ళెను.

 సర్వం సంకథయామాస వీధాతా చంద్రశేఖరం

బ్రహ్మా శివశ్చతైస్సార్థం వైకుంఠం చ జగామ హ

సుదుర్లభం పరంధామ జరామృత్యుహరం పరం

సంప్రాప చ వరం ద్వారమాశ్రమాణాం హరేరహో

దదర్శ ద్వారపాలాంశ్చ రత్న సింహాసన స్థితామ్

శోభితాన్ పీతవస్రైశ్చ రత్నభూషణ భూషితామ్

వనమాలాన్వితాన్ సర్వాన్ శ్యామసుందర విగ్రహాన్

శంఖ చక్ర గదా పద్మ ధరాంశ్చైవ చతుర్భుజాన్

సస్మితాన్ పద్మవక్రాంశ్చ పద్మనేత్రాన్ మనోహరాన్

బ్రహ్మా తాన్ కథయామానే వృత్తాంతం గమనార్థకం

 తేఽనుజ్ఞాం చ దదుస్తస్మై ప్రవివేశ తదాజ్ఞయా

ఏవంచ షోడశ ద్వారాన్ విరీక్ష్య కమలోద్భవః

దేవైస్పార్థం తొనతీత్య ప్రవివేశ హరేః సభాం

 దేవర్షిభిః పరివృతాం పార్షదైశ్చ చతుర్భుజైః

నారాయణ స్వరూపైశ్చ సర్వై: కౌస్తుభ భూషితైః

 పూర్ణేందు మండలాకారాం చతురస్రం మనోహరాం

మణీంద్ర సార నిర్మాణాం హీరసార సుశోభితాం

అమూల్య రత్నఖచితొం రచితాం స్వేచ్చయా హరేః

మాణిక్యమాలా జాలాడ్యాం ముకోపంక్తివిభూషితాం

మండితాం మండలాకారై రత్నదర్పణ కోటిభిః

 విచిత్రేశ్చిత్రరేఖాభిః నానాచిత్రవిచిత్రితాం

పద్మరాగేంద్ర రచితై రచితాం పద్మకృత్రిమైః

సోపాన శతకైర్యుక్తాం స్యమంతక వినిర్మితైః

పట్టసూత్రగ్రంథియుతైశ్చారు చందన పల్లవైః

ఇంద్రనీలమణిస్తంబైర్వేష్టితాం సుమనోహరాం

సద్రత్న పూర్ణకుంభానాం సమూహైశ్చ సమన్వితాం

పారిజాత ప్రసూనానాం మాలాజాలైర్విరాజితాం

కస్తూరీకుంకుమాక్తైశ్చ సుగంధి చందన ద్రవైః

సుసంస్కృతాం తు సర్వత్ర వాసితాo గంధవాయునా

విద్యాధరీ సమూహానాం సంగీతైశ్చ మనోహరాం

సహస్రయోజనాయామాం పరిపూర్ణాంచ కింకరైః

దదర్శ శ్రీహరిం బ్రహ్మా శంకరశ్చ సురైః సహ

బ్రహ్మదేవుడు దేవతలు పడుతున్న బాధలన్నిటిని చంద్రశేఖరునకు వెల్లడించెను. అప్పుడు శంకరుడు కూడ వారి వెంట రాగా దేవతలందరు వైకుంఠమునకు పోయిరి.

అచ్చట సుదుర్లభమైనది, ఉన్నతమైనది, జరామృత్యువులను పోగొట్టునది అగు శ్రీహరీ నివాసస్థానముయొక్క ప్రథమ ద్వారము చేరిరి. అచ్చట పట్టువస్త్రములు ధరించి మంచి ఆభరణములు కలిగి రత్నసింహాసనమున నున్న నాలు భుజములు కల ద్వారపాలకులను దేవతలు చూచిరి. ఆ ద్వారపాలకులు నారాయణునివలె శ్యామసుందర విగ్రహులు, వనమాల ధరించినవారు శంఖ చక్రాద్యాయుధముల ధరించినవారు. పద్మముఖులు తామరస నేత్రులు.

బ్రహ్మదేవుడు వారికి తాము వచ్చిన విషయమును తెల్పి వారి అనుజ్ఞతో లోపలికి ప్రవేశించెను. ఇటువంటి పదహారు ద్వారములను దాటి శ్రీహరి యొక్క సభలోనికి దేవతలందరు ప్రవేశించిరి.

ఆ శ్రీహరి సభలో దేవర్షులు నాలుభుజములు కల శ్రీహరి సేవకులున్నారు. వారందరు నారాయణ స్వరూపులు అందరు కౌస్తుభ రత్నభూషితులు. ఆ సభ గొప్పదైన రత్నమాణిక్యములచే శోభిల్లునది. మాణిక్యముల మాలలు ముత్యాలమాలలు ఆ సభను అలంకరించినవి. గుండ్రని అద్దములతో చిత్రరేఖలతో అనేక విధములైన చిత్రములతో ఆ సభనిండిపోయినది. ఆ సభా భవనము యొక్క మెట్లు పద్మరాగమణులతో స్యమంతకమణులతో నిర్మించబడినవి. ఇంద్రనీలమణుల స్థంభములతో మంచి రత్నములచే చేయబడిన పూర్ణకుంభములతో ఆ సభ ఆలంకరింపబడినది. అచ్చట పారిజాత పుష్పముల మాలలు కనిపించును. చందనద్రవముతో ఆలికి కస్తూరీ కుంకుమలతో ఆ సభాప్రాంగణము ముగ్గులు పెట్టబడినది. సహస్రయోజన పరిమితమై విద్యాధర స్త్రీల సంగీతములతో ఆ సభ మనోహరముగా నుండినది. అట్టి సభలో బ్రహ్మ శంకరాది దేవతలు శ్రీహరిని సందర్శించుకొనిరి.

వసంతం తన్మధ్యదేశే యథేందుం తారకావృతం

 అమూల్య రత్న నిర్మాణ చిత్ర సీంహాసన స్థితం

కిరీటినం కుండలీనం వనమాల విభూషితం

శంఖ చక్రగదా పద్మ ధారిణం చ చతుర్భుజం

నవీననీరదశ్యామం సుందరం సుమనోహరం

అమూల్య రత్న నిర్మాణ సర్వాభరణ భూషితం

చందనోక్షితసర్వాంగం బీభ్రతం కేపంకబిం

పురతో నృత్య గీతం చ పశ్యంతం సప్మితం ముదా

శాంతం సరస్వతీ కాంతం లక్ష్మీధృత పదాంబుజం

భక్త ప్రదత్త తాంబూలం. భుక్తవంతం సువాసితం

 గంగయా పరయా భక్త్యా పీవితం శ్వేత చామరైః

సర్వైశ్చ స్తూయమానం చ భక్తి సమ్రాత్మ కంధరైః

 ఏవం విశిష్ట తం దృష్ట్యా పరిపూర్ణతమం విభుం

బ్రహ్మాదయః పురా: సర్వే ప్రణమ్య తుష్టువుస్తదా

ఆ సభామధ్యమున చుక్కల మధ్య చంద్రునిపలె ఉన్నవాడును, రత్నసింహాసనమున నున్నవాడు, వాలు భుజములు కలవాడు కిరీటి, గది, చక్రహస్తి, కుండలి, వనమాలాధరుడు, ఆమూల్య రత్నాభరణములు కలవాడు శరీరమునందంతటా చందనము పూసుకొన్నవాడు, ముందు జరుగుచున్న నృత్యమును, గీతమును ఆలకించుచున్నవాడు, పరస్వతికి ప్రియుడు, లక్ష్మిదేవి చరణసేవ సేయుచుండగా గంగ చామరములు వీయుచుండగా భక్తులందరు సేవించుచున్న శ్రీవారిని దేవతలందరు చూచిరి.

పులకాంకిత సర్వాంగా: సాశ్రునేత్రాః సగద్గదాః

భక్త్యా పరమయా భక్తా భీతా సమ్రాత్మ కంధరాః

పుటాంజలి యుతో భూత్వా విధాతా జగమపి

వృత్తాంతం కథయామాస వినయేన హరిః పురః

హరిః తద్వచనం శ్రుత్వా సర్వజ్ఞ: సర్వభావవిత్

ప్రహస్యోవాచ బ్రహ్మాణం రహస్యం చ మనోహరం

దేవతలందరు పులకాంకితులై కన్నీరు కారగా గద్గద స్వరముతో శిరసు వంచుకొని యుండిరి. జగములనన్నిటిని సృష్టించు బ్రహ్మదేవుడు చేతులు కట్టుకొని శ్రీహరి ముందు దేవతల విషయమును విన్నవించెమ. శ్రీవారి బ్రహ్మదేవుని మాటలు విని నవ్వుచు రహస్యభూతమైన ఈ విషయమునట్లు తెలిపెను.

శ్రీభగవానువాచ- భగవంతుడగు శ్రీహరి ఇట్లనెను-

శంఖచూడస్య వృత్తాంతం సర్వం జానామి పద్మజ

మద్భక్తస్య చ గోపస్య మహాతేజస్వినః పురా

పరాః శ్రుణుత తత్సర్వం ఇతిహాసం పురాభవం

గోలోకస్యైవ చరితం పాపఘ్నం పుణ్యకారణం

సుదామా నామగోశ్చ పార్షద ప్రవరో మమ

స ప్రాం దాసవీం యోవీం రాధారాపాత్సుదారుణం

తత్రైకదాఽహమగమం స్వాలయాద్రాపమండలం

విహాయ మావినీం రాధాం మమప్రాణాధికారి పరాం

సా మాo వీరజయా పార్ధం విజ్ఞాయ కింకరీముఖాత్

పశ్చాత్క్రుధా సాఽజగామ మాం దదర్శ  తత్రచ

 విరజాం చ నదీరూపాం మాం జ్ఞాత్వాచ తిరోహితాం

పునర్జగామ సా రుష్టా స్వాలయం సభిభి: సహ

 మారదృష్ట్యా మందిరే దేవీ సుదామ సహితం పురా

భృశం మాం భర్శయామాస మాసీభూతం చ సుస్థిరం

తచ్చ్రుత్వా చ సుమహాంశ్చ సుదామా లాం చుకోవహ

స చ లౌం భర్బయామాష కోపేన మమ సన్నిధౌ

తచ్చ్రుత్వా సా కోపయుక్తా రక్తపంకజలోచనా

బహిష్కర్తుం చకారాజ్ఞాం సంత్రప్తా మమ సంపది

సఖీలక్షం సముత్తణ్ణి దుర్వారం తేజసోఽజ్వలం

బహిశ్చకార తం తూర్ణం జల్పంతం చ పునః పునః

బ్రహ్మదేవుడా! శంఖ చూడుని వృత్తాంతమంతయు నాకు తెలియును. అతడు పూర్వజన్మలో నా భక్తుడు. గోపులలో నొకడు. దేవతలారా! అనీ చరిత్ర ఇది.

ఆతడు పూర్వజన్మలో మదాముడనే గోపాలుడు. నా అనుచరులలో శ్రేష్ఠుడు. రాధాదేవి యొక్క శాపమువలన దానవుడై పుట్టినాడు.

ఒకప్పుడు నేను నాకు ప్రాణముకంటె మిన్నయైన రాధాదేవి లేకుండ ఒంటరిగా నా గృహమునుండి రాపమండలమునకు వెళ్ళి విరజ యనే గోపికలో విహరించుచుంటిని. ఈ విషయమును చెలికత్తెలు రాధాదేవికి చెప్పిరి. ఆమె అతికోపములో రాసమండల స్థలమునకు రాగానే విరజ నదీరూపమై పోయినది. నేను కూడ మాయమైతివి. ఆ కోపముతోనే రాధాదేవి ఆంతఃపురమునకు వెళ్ళినది. అచ్చట వేను సుదాముడు కలిసి మాట్లాడుకొనుచున్నాము. నమ్ను చూడగానే రాధాదేవి కోమువాపుకొవలేక పన్ను మాటలలో పీడించసాగినది. వేనప్పుడు ఏమి అనక మౌనముగా నుంటివి. కాని సుదాముడామె మాటలను వివి సహించలేక నాముందరనే ఆమెను నిందింపసాగెను. సుదాముని మాటలు వినగానే 'రాధాదేవి కోపములో ఆతని వచటమండి. వెళ్ళగొట్టుటకనుమతి వచ్చినది. రాధాదేవి ఆజ్ఞను ఏవగానే ఆమె చెలికత్తెలు అతనిని అక్కడినుండి బలవంతముగా గెంటివేసిరి. అప్పుడు కూడ సుదాముడు తనధోరణి మార్చుకొనలేదు.

సా చ తద్వచనం శ్రుత్వా సమారుష్టా శశాప తం

యాసా రే దానవీం యోనిమిత్యేవం దారుణం వచః

తం గచ్ఛంతం శవంతం చ రుదంతం మాo ప్రణమ్య చ

వారయామాస సా తుష్టా రుదంతీ కృపయా పువః

హే వత్చ తిష్ట మాగచ్ఛ కయాతి పునః పునః

సముచ్చార్యచ తల్పశ్చిజ్జగామ పా చ విస్మితా

గోప్యశ్చ రురుదు: పర్వా: గోపాతి పుదు:ఖితా

 తే సర్వే రాధికా చాపి తత్పశ్చాత్ బోధితా మయా

ఆయాస్యతి క్షణార్థేన కృత్వా పప్య పాలనం

సుదామస్ త్వమహాగచ్చేత్యువాచ సా నివారీ

గోలోకస్య క్షణార్థన వైకమన్వంతరంభవేత్

పృథివ్యాం జగతాం ధాతః ఇత్యేవం వచనం ధ్రువం

ప ఏవ శంఖచూడశ్చ పునస్తత్రైవ యాస్యతి

మహాబలిష్ఠో యోగీశః సర్వమాయావిశారదః

సుదాముడు తన ధోరణి మార్చుకోవక ఇంకా ఏవో మాటలు మాట్లాడుతూ ఉంటే అతని మాటలు విని రాధాదేవి ఆతవీవీ దానవుడవై పుట్టుమనీ శపించెను.

అప్పుడా సుదాముడు నాకు. నమస్కరించి ఏడ్చుచూ పోవుచుండగా రాధాదేవియే అతనీని నివారించినది. అక్కడి గోపికలు గోపాలకులు సుదామునకు ఇచ్చిన శాపమునకు మిక్కిలి చింతించిరి.

అప్పుడు నేను రాధికను, గోపగోపికలందరిని ఓదార్చి సుదాముడు క్షణార్గములో గోలోకమునకు తిరిగి వచ్చునంటివి. గోలోక మందలి ఆరక్షణము భూమిపై ఒక మన్వంతరము. అందువలన శంఖచూడుడు భూమిపై ఒక మన్వంతరము గడిపి తిరిగి గోలోకమునకు వచ్చును.

మమ శూలం గృహీత్వా చ శీఘ్రం గచ్ఛత భారతం

శివః కరోతు సంహారం మమశూలేన రక్షసః

మమైవ కవచం కంఠే సర్వమంగళ మంగళం

బిభర్తీ దానవః శశ్వత్ సంసారవిజయీ తతః

తత్ర బ్రహ్మన్ స్థితే కంఠే న కోఽపి హింసితుం క్షమ:

తద్యాద్ధాం చ కరిష్యామీ విప్రరూపోసమేవ చ

సతిత్వ భంగస్తత్ఫత్యా యత్ర కాలే భవిష్యతి

తత్రైవ కాలే తన్ముత్యురీతి దతో వరస్యయా

తత్పత్యోశ్చాదరే వీర్యమర్పయిష్యామి నిశ్చితం

తక్షణేనైవ తన్మృత్యుర్భవిష్యతి న సంశయః

పశ్చాత్సా దేహముత్సృజ్య భవిష్యతి ప్రియా మమ

ఇత్యుక్త్యా జగతాం నాథో దదో శూలం హరాయ చ

శూలం దత్వా యయా శీఘ్రం హరిరభ్యంతరం ముదా

భారతం చ యయుర్దేవా బ్రహ్మ రుద్ర పురోగమా:

శివుడు నాశూలముతో శంఖచూడుని సంహరించును. అట్లే శంఖచూడుడు సర్వమంగళములకు మంగళప్రదమైన నా కవచమును మెడలో పర్వదా ధరించును. ఆ కవచమాతని కంఠమున ఉండగా ఆతనినెవ్వరు హింసించసైనలేరు. అందువలన నేను బ్రాహ్మణవేషమున దానిని యాచించెదను. ఆట్లే ఆతని భార్య సతిత్వము సైతమాతని నెల్లప్పుడు కొపాడుచుండును. ఆతని భార్య సతీశ్వభంగము జరిగినప్పుడే అతనికి మృత్యువగునని నీవే వరమిచ్చితివి. అందువలన నేనే తులసీయొక్క పతిత్వమును సైతము భంగము చేయుదుమ. ఆమె తన దేహత్యాగము చేసి తిరిగి నాకు ప్రియురాలు కాగలదు అని శ్రీహరి దేవతలలో పలికి తన శూలమును . వారికి ఇచ్చెను. దేవతలందరు సంతోషముతో భారతదేశమునకు వెళ్ళిరి.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతి ఖండే తులస్యుపాఖ్యానం నామ షోడశోఽధ్యాయః

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున తులస్యుపాఖ్యానమను పదునారవ అధ్యాయము సమాప్తము.