బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

44 - మంగళోపాఖ్యానము

నారాయణ ఉవాచ: నారాయణుడిట్లు నారదునితో అనెను-

కథితం షష్ట్యుపాఖ్యానం బ్రహ్మపుత్ర యథాగమం

దేవీ మంగళచండీ చ తదాఖ్యానం నీశామయ

తస్యా: పూజాదీకం సర్వం ధర్మవక్త్రాచ్చ యచ్చ్రూతం

 శ్రుతీ సమ్మతమేవేష్టం సర్వేషాం విదుషామపీ

 చండాయాం వర్తతే చండీ జాగ్రతీ శత్రుమండలే

మంగళేషు చ యా దక్షా మంగళా సైవ చండికా

 దుర్గాయాం విద్యతే చండీ మంగలోఽపి మహీసుతే

 మంగళాభీష్ట దేవీ యాసా స్యాన్మంగళ చండికా

మంగలో మనువంశశ్చ సప్తద్వీపావనీపతిః

 తస్య పూజ్యాఽభీష్టదేవీ తేన మంగళచండికా

 మూర్తి భేదేన సా దుర్గా మూలప్రకృతిరీశ్వరీ

కృపారూపాతిప్రత్యక్షా యోషితా మిష్టదేవతా

నారదా! నీకు ఇంతవరకు షష్ఠీదేవి చరిత్రను తెల్పితిని. ఇప్పుడు మంగళచండీదేవియొక్క ఉపాఖ్యానమును వినుము. ఆట్లే ధర్మదేవతవలన నేను విన్న ఆమె యొక్క పూజ మొదలగువానిని వినుము. ఇది సమస్త వేద సమ్మతము. విద్వాంసులచే ఆమోదితము.

శత్రువులమధ్య భయంకరముగానుండి ప్రకాశించుచున్నందువలన ఆమె చండిమైనది. అట్లే మంగళకార్యములు చేయించుటలో సమర్థురాలైనందువలన మంగళయైనది. ఆదేవి మంగళరూపిణి, అట్లే చండస్వరూపిణి. రెండువిధములైన రూపములతో నున్నందువలన ఆ దేవి మంగళ చండికయైనది.

అట్లే దుర్గాదేవికి ఇంకొక పేరు చండిక. మంగళుడను పేరు కుజునకు గలదు, ఆ మంగళునకు ఇష్టదేవత కావున ఆమె మంగళచండికయైనది.

మనువంశమునందు మంగళుడను రాజా ఈ భూమినంతయు పరిపాలించుచుండెను, ఆ మహారాజునకు ఆభీష్టదేవి కావున ఆమె మంగళచండికయైనది.

ఆ దేవియొక్క మరొక రూపమే దుర్గ. ఆ దేవి మూలప్రకృతి రూపిణి. ఈశ్వరి, మిక్కిలి దయగలది. స్త్రీలందరకు ఇష్టదేవత.

 ప్రథమే పూజితా సా చ శంకరేణ పురా పరా

 త్రిపురస్య వధే ఘోరే విష్ణునా ప్రేరితేన చ

బ్రహ్మన్ బ్రహ్మోపదేశేన దుర్గప్రస్తే చ సంకటే

ఆకాశాత్పతితే యానే రుషా దైత్యేన పాతీతే

బ్రహ్మవిష్ణూపదిష్టశ్చ్యా దుర్గాం తుష్టావ శంకరః

 సా చ మంగళచండీయం అభద్రూప భేదతః

ఈ దేవిని తొలుత శంకరుడు. త్రిపురాసురవధ కాలమున స్తుతించెను. త్రిపురాసురుల యుద్దము పరముగా జరుగుచుండగా దానపుడు కోపముతో శంకరుని రథమును ఆకాశమునుండి కిందికి పడవేయుచున్నప్పుడు బ్రహ్మ, విష్ణుమూర్తులయొక్క ప్రేరణ వలన శంకరుడు దుర్గాదేవిని స్తుతించెను. ఆ దుర్గాదేవియే రూపభేదమున మంగళచండికయైనది.

ఉవాచ పురతః శంభో: భయం నాస్తితి తే ప్రభో

భగవాన్ వృషరూపశ్చ సర్వేశశ్చ బభూవ హ

యుద్ధశక్తి స్వరూపాఽహo భవిష్యామి తదాజ్ఞయా

 మయాత్మనాచ హరిణా సహాయేన వృషధ్వజ

 జహి దైత్యం చ దేవేశ సురాణాం పదఘాతకం

 ఇత్యుక్త్వాoఽతర్షితా దేవీ శంభో: శక్తిర్బభూవహ

విష్ణుదత్తైన శస్త్రేణ జఘాన తముమాపతిః

మునీంద్ర పతితే దైత్యే సర్వే దేవా మహర్షయః

తుష్టువు: శంకరం దేవాః భక్తినమ్రాత్మ కంధరాః

సద్యః శిరసీ శంభోశ్చ పుష్పవృష్టిర్బభూవ హ

ఆ మంగళచండిక శంకరునితో నీవు భయపడవలసిన అవసరము లేదు, భగవంతుడు సర్వేశ్వరుడగు శ్రీహరి నీకు వృషభరూపమును ధరించును, నేను ఆ శ్రీహరి ఆజ్ఞననుసరించి యుద్ధ శక్తిస్వరూపనై నీకు సహాయము చేయుదును. మా యిద్దరి సహాయముతో దేవతలను స్వర్గమునుండి తొలగించిన త్రిపురాసురుని సంహరింపుమని చెప్పి ఆ దేవి అంతర్ధానము చెందెను. ఆ తర్వాత ఆమె శంకరునకు శక్తిగా మారినది. అప్పుడు శంకరుడు శ్రీహరి తనకిచ్చిన శస్త్రముచే త్రిపురాసురుని సంహరించను.

అప్పుడు దేవతలు, మహర్షులందరు సంతోషపడిరి. దేవతలు శంకరునకు భక్తిశ్రద్ధలతో పోత్రములు చేసిరి. ఆతని శిరస్సుపై పుష్పవృష్టిని కురిపించిరి.

బ్రహ్మా విష్ణుశ్చ సంతుష్టౌ దదౌ తస్మై శుభాశిషం

 బ్రహ్మావిష్ణూపదిష్టశ్చ సుస్నాతః శంకరః శుచిః

 పూజయామాస తాం శక్తిం దేవీం మంగళచండికాం

పాద్యార్ఘ్యాచమనీయైశ్చ బలిభిర్వివిధైరపి

పుష్పచందన నైవేద్యై: భక్త్యా నానావిధైర్మునే

ఛాగైర్మేషైశ్చ మహిషైర్గండై ర్మాయా విభిర్వరైః

వస్త్రాలంకార మాల్యైశ్చ పాయసైః పిష్టకైరపి

మధుభిశ్చ సుధాభిశ్చ పక్వైర్నానావిధైః ఫలైః

సంగీతైర్నర్తనై రాద్యైరుత్సవైః కృష్ణకీర్తన:

ధ్యాత్వా మాధ్యందినోక్తేన ధ్యానేన విధిపూర్వకం

 దదౌద్రవ్యాణి మూలేన మంత్రేశైవ చ నారద

 ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళ చండికే

 ఐం క్రూం ఫట్ స్వాహేత్యేవం చాప్యేకవింశాక్షరోమనుః

బ్రహ్మదేవుడు నారాయణుడు సంతోషించి శంకరునకు శుభాశీస్సుల నొసగిరి, తరువాత శ్రీహరి ఉపదేశముననుసరించి శంకరుడు స్నానముచేసి శుచియై మంగళచండికాదేవిని ఇట్లు పూజించెను.

ఆర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, వివిధబలులు, పుష్పములు, చందనము, గొఱ్ఱెలు, మేకలు, దున్నపోతులు మొదలగు నైవేద్యములు, వస్త్రములు, అలంకారములు, మాలలు, పాయసములు, పిండివంటలు, తేనెలు మొదలగు తీపి వస్తువులు, అనేక విధములైన పక్వాన్నములు, పండ్లు, సంగీతము, నృత్యము, వాద్యము మొదలగు వాటిచే శ్రీకృష్ణకీర్తనలచే మంగళ చండికను శాస్త్రొక్తప్రకారముగా మాధ్యందిన శోఖయందు చెప్పబడిన పద్ధతిలో మూలమంత్రముతో శంకరుడు పూజించెను.

ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవిమంగళచండికే ఐం క్రూం ఫట్ స్వాహా అనునది మూలమంత్రము.

పూజ్య: కల్పతరుశ్చైవ భక్తానాం సర్వకామదః

 దశలక్షజపేనైవ మంత్రసిద్ధి: భవేత్ నృణాం

మంత్రసిద్ధిర్భవేద్యస్య సవిష్ణుః సర్వకామద:

ఈ మూలమంత్రము కల్పతరువు వంటిది. భక్తులయొక్క సమస్త కోరికలను తీర్చును. ఈ మంత్రమును పదిలక్షల పర్యాయము జపించినచో మంత్రసిద్ధి కలుగును.

 ధ్యానం చ శ్రూయతాం బ్రహ్మాన్ వేదోక్తం సర్వసమ్మతం

దేవీం షోడశవర్షీయాం రమ్యాం సుస్థిర యావనాం

సర్వరూపగుణాఢ్యాం చ కోమలాంగీం మనోహరాం

శ్వేతచంపకవర్ణాభాం చంద్రకోటి సమప్రభాం

 వహ్నిశుద్దాంశుకాధానం రత్నభూషణభూషితాం

 బిభ్రతీం కబరీభారం మల్లికా మాల్యభూషితం

 బింబోష్టిం సుదతీం శుద్దాం శరత్పద్మనీభాననాం

 ఈషద్దాసప్రసన్నాస్యాం సునీలోత్పల లోచనాం

 జగద్ధాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యః సర్వసంపదాం

సంసారసాగరే ఫరే పోతరూపాం వరాం భజే

నారదా! మంగళచండికయొక్క ధ్యానశ్లోకములను వినుము. ఆది వేదములందు చెప్పబడినది సర్వసమ్మతమైనది. మంగళచండికాదేవి పదునారు సంవత్సరముల వయసు కలదీ, అందమైనది. స్థిరమైన వయసు కలది. సమస్త రూపములు గుణములు కలది. కోమలమైన అవయవములు కలది. తెల్లని చంపక పుష్పములవంటి రంగుకలది. కోటి చంద్రులవంటి కాంతి కలది. మేలిమి బంగారువన్నెగల వస్త్రము ధరించునదీ. రత్నభూషణములు కలది. మల్లెలమాలలను కొప్పున ధరించునది. దొండపండువంటి పెదవులు, చక్కని పలువరుస, శరత్కాలచంద్రునీవంటి ముఖము, చిరునవ్వు కల ముఖము, నీలోత్పలములవంటి కండ్లు కలది. ఈ లోకములనన్నిటిని రక్షించునది. సమస్త సంపదల నొసగునది. భయంకరమైన సంసారమనే సముద్రమున నున్న ఓడ వంటిది.

అట్టి మంగళ చండికాదేవిని నేనెల్లప్పుడు సేవించుచుందును.

దేవ్యాశ్చ ధ్యానమిత్యేవం స్తవనం శ్రూయతాం మునే

 ప్రయతః సంకటగ్రస్తో యేన తుష్టావ శంకరః

ఇది మంగళచండీదేవియొక్క ధ్యానము. ఇక ఆపద కలిగినప్పుడు శంకరుడు మంగళచండికను ఎట్లు స్తుతించెనో దానిని నీకు తెలుపుతున్నానని సారాయణుడనేను.

శంకర ఉవాచ- శంకరుడిట్లు పలికెను-

రక్షరక్ష జగన్మాత: దేవి మంగళ చండికే

 సంహర్త్రి విపదాం రాశే దేవి మంగళ చండికే

హర్షమంగళదక్షే చ హర్ష మంగళ చండికే

 శుభే మంగళదక్షే చ శుభమంగళ చండికే

మంగళ మంగళార్హే చ సర్వమంగళ మంగళే

సతాం మంగళదే దేవీ సర్వేషాం మంగళాలయే

పూజ్యా మంగళవారే చ మంగళాభీష్ట దైవతే

 పూజ్యే మంగళభూషప్య మనువంశస్య సంతతం

 మంగళాధిష్ఠాతృదేవి మంగళానాం చ మంగళ

సంసారే మంగళాధారే మోక్షమంగళ దాయినీ

 సారే చ మంగళాధారే పారే త్వం సర్వకర్మణాం

ప్రతి మంగళవారం చ పూజ్యే త్వం మంగళప్రదే

స్తోత్రేణానేన శంభుశ్చ శ్రుత్వా మంగళ చండికాం

 ప్రతీ మంగళవారే చ పూబోర కృత్వా గతః శివః

మంగళ చండికా స్త్రోత్రము-

ఓ దేవి! మంగళచండికా! జగములకు తల్లీ! నన్ను రక్షింపుము. నీవు ఆపదలను పోగొట్టెదపు. సంతోషమును మంగళములను కలిగించు దానవు, శుభస్వరూపిణివి. శుభమంగళ చండికపు. సమస్త మంగళములకు మంగళమైన దానవు. నీవు మంగళగా, మంగళారవుగా పిలువబడుచున్నావు,

ఓదేవి! నీవు సజ్జనులకు మేలును చేకూరును. మంగళములకు నిలయమైన దానవు. మంగళవారమున పూజలనందుకొనుచున్న దానవు. మంగళుడగు కుజునకు ఇష్టదేవతవు. అట్లే మనువంశమున పుట్టిన సంగళుడను భూపతిచే పూజలనందుకొన్న దానవు. మంగళములకు అధిష్టాన దేవతవు, మంగళములకే మంగళమైన దానవు. మంగళమయమైన సంసారమున అందరకు మోక్షమును మంగళమును కలిగించుదానవు, నీకు సార, మంగళాధారము మొదలగు పేర్లు కలవు. ప్రతిమంగళవారమున పూజించదగిన దానవు. నీవు ఆందరకు మంగళములను కళించుదానవు.

శంకరుడిట్టి స్తోత్రముచే మంగళచండికను స్తుతించి ప్రతిమంగళవారమున ఆమెకు పూజచేసి తన లోకమును చేరుకొనెను.

దేవ్యాశ్చ మంగళస్తోత్రం యః శ్రుణోతి సమాహితః

 తన్మంగళం భవేత్ శశ్వత్ న భవేత్తదమంగళం

ప్రథమే పూజితా దేవీ శంభునా సర్వమంగళా

ద్వితీయే పూజితా దేవీ మంగళేన గ్రహేణ చ

 తృతీయే పూజితా భద్రా మంగళేన నృపేణ చ

 చతుర్థే మంగళవారే సుందరీభిశ్చ పూజితా

పంచమే మంగళాకాంక్షైః నరైః మంగళచండికా

పూజితా ప్రతివిశ్వేషు విశ్వశైః పూజితా సదా

తతః సర్వత్ర సంపూజ్య సా బభూవ సురేశ్వరీ

దేవాదిభిశ్చ మునిభిర్మనుభీర్మానవైర్మునే

మంగళచండికాదేవియొక్క ఈ స్తోత్రమును ఎవరు శ్రద్ధతో విందురో వారికి ఎల్లప్పుడు మంగళమే జరుగును. అమంగళము. ఎప్పుడును జరుగదు.

ఆ దేవిని తొలుత శంకరుడు పూజించెను. తరువాత మంగళగ్రహమగు కుజుడు పూజించెను. అటుపిమ్మట మంగళుడను రాజు ఆమెను పూజించెను. ఆ తరువాత మంగళవారమున ఆమెను స్త్రీలు పూజించిరి. పిమ్మట మంగళములను కోరుకొను మానపు లా మంగళచండికను పూజించిరి. ఆ దేవిని ప్రపంచముననున్న దేవతలందరు పూజింతురు. ఆ తర్వాత ఆమెను దేవతలు, మునులు, మనువులు, మానవులు అందరు పూజించిరి. ఆందువలన ఆ దేవి దేవతలకందరకు ఈశ్వరియైనది.

దేవ్యాశ్చమంగళస్తోత్రం యః శ్రుణోతి సమాహితః

తన్మంగళం భవేత్ శశ్వత్ న భవేత్తదమంగళం

వర్థంతే తత్పుత్ర పౌత్రా మంగళం చ దినే దీనే

మంగళదేవియొక్క ఈ స్తోత్రమును భక్తి శ్రద్దలతో విన్నవారికి ఎల్లప్పుడు మంగళమే కలుగునుకాని అమంగళము మాత్రము కలుగదు. వారికి ప్రతిదినము పుత్రపౌత్రాభివృద్ధి తప్పక జరుగును.

ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే మంగళోపాఖ్యానే తత్ స్తోత్రాదికథనం నామ చతుశ్చత్వారింశత్తమోఽధ్యాయః

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున, నారదనారాయణ  సంవాదమున చెప్పబడిన మంగళచండికా కథలో ఆమె సోత్రాదులను తెలుపు నలభై నాలుగవ అధ్యాయము సమాప్తము.