నారద ఉవాచ - నారదుడు నారాయణునితో ఇట్లనెను.
తులసీ చ జగత్పూజ్యా పూతా నారాయణ ప్రియా ।
తస్యాః పూజావిధానం చ స్తోత్రం కిం న శ్రుతం మయా ॥
కేన పూజ్య స్తుతా కేన పురా ప్రథమతో మునే ।
తవ పూజ్యా సా బభూవ కేన వా వద మామహో ॥
తులసీదేవి నారాయణునకు ప్రియురాలు, పవిత్రమైనది. అందరిచే పూజింపదగినది. ఐతే ఆమె యొక్క పూజావిధానము, స్త్రోత్రము నాకు తెలియవు. అట్లే ఆమెను తొలుత ఎవరు పూజించిరి. ఎవరామెను తొలుత స్తుతించిరి. ఓ శ్రీహరీ! ఆమె నీకెందులకు పూజనీయురాలైనది. ఈవిషయములనన్నిటిని నాకు వివరించి చెప్పుము.
సూత ఉవాచ- సూతుడీవిధముగా శానకునితో అనెను.
నారదస్య వచః శ్రుత్వా ప్రహస్య గరుడధ్వజః 1
కధిం కథితుమారేభే పుణ్యరూపాం పురాతనీం
నారదుని మాటలు విని శ్రీహరి సనాతనము, పుణ్యరూపమైన తులసి విషయమునిట్లు
చెప్పదొడగెను..
హరిః సంప్రాస్య తులసీం రేమే చ రమయా సహా ।
రమాసమాం తాం సౌభాగ్యం చకార గౌరవేణ చ॥
సేహే లక్ష్మీశ్చ గంగా చ తస్యాశ్చ నవసంగమం ।
సౌభాగ్యం గౌరవం కోపాన్న సేహే చ సరస్వతీ ॥
సా తాం జఘాన కలహే మానినీ హరి సన్నిధి ।
వ్రీడయా స్వాపమానాచ్చ సాంతర్ధానం చకార హ ॥
సర్వసిద్ధేశ్వరీ దేవి జ్ఞానినీ సిద్ధయోగినీ ।
బభూవాదర్శనం కోపాత్సర్వత్ర చ హరేరహో॥
హరిర్న దృష్ట్యా తులసీం బోధయిత్వా సరస్వతీం
తదనుజ్ఞాం గృహీత్వా చ జగామ తులసీ వనం॥
శ్రీహరి తులసీదేవిని పొంది లక్ష్మీదేవితో సమానముగా ఆమెతో రమింపసాగెను. ఆమెకు లక్ష్మీదేవితో సమానమైన గౌరవమును మర్యాదను ఇచ్చెను. శ్రీహరి భార్యలగు లక్ష్మి, గంగలు తులసీ శ్రీహరుల నూతన సమాగమమును సహించుకొనిరి. కాని సరస్వతి దేవి మాత్రము కోపముతో దానిని సహింపలేదు. పైగా శ్రీహరి సన్నిధిలోనే సరస్వతీదేవి తులసితో వాదులాడి తులసిని కొట్టెను. అందువలన తులసీదేవి సిగ్గుపడి తనకు జరిగిన అవమానమును సహించలేక అగిదర్ధానమైనది. అందువలన శ్రీహరి సరస్వతిని ఓదార్చి ఆమె అనుజ్ఞను తీసికొని తులసీవనమునకు వెళ్ళెను.
తత్ర గత్వా చ స్నాత్వా చ తులస్యా తులసీం సతీం ।
పూజయామాస ధ్యాత్వా తాం స్తొత్రం భక్త్యా చకారహ ॥
శ్రీహరీ తులసీవనమునకు వెళ్ళి అచ్చట స్నానము చేసి తులసిని ధ్యానించి పూజించెను. అట్లే ఆతడు తులసీ స్తోత్రమునీట్లు చేసెను.
లక్ష్మీమాయా కామపాణీ బీజపూర్వం దశాక్షరం ।
బృందావనీతి జేంతం చ వహ్ని జాయాం తమేవచ॥
శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహా ।
అనేన కల్పతరుణా మంత్ర రాజేన నారద ॥
పూజయేచ్చ విధానేన సర్వసిద్ధిం లభిన్నరః।
ఘృతదీపేన ధూపేన సిందూర చందనేన చ ॥
నైవేద్యాన చ పుష్పేణ చోపహారేణ నారద।
హరిస్తోత్రేణ తుష్టాసా చా విర్భూయ మహిరుహాత్ ॥
ప్రపన్నా చరణాంభో జగామ శరణం శుభం ।
వరం తస్యై దదౌ విష్ణు; జగత్పూజ్యా భవేతి చ ॥
అహం త్వాం చ ధరిష్యామి స్వమూ వక్షసీతి చ ।
సర్వే త్వాం ధారయిష్యంతి స్వయం మూర్ధ్ని సురాదయః ॥
ఇత్యుక్య తార గృహీత్వా చ ప్రయయౌ స్వాలయం విభుః॥
లక్షి, మాయ, కాముడు, సరస్వతి వీరి బీజాక్షరములు పూర్వమున నుండగా చతుర్థి విభక్యంతమైన బృందావనీ శబ్దమునకు ఆగ్ని భార్యయగు స్వాహా శబ్దాంతమైనది తులసీ దేవి మంత్రము. అది పది యక్షరములు గలది. శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహా యమనది. కల్ప వృక్షమువంటి ఈ మంత్రముచే శాస్తోక విధానమున సరస్వతీ దేవిని పూజించినచో సమస్త సిద్ధులు లభించును.
తులసీ దేవిని నేతి దీపముతో, ధూపములో, సిందూర చందనానులేపనములతో పూజించి నైవేద్యమును పెట్టి పుష్పములచే ఆర్చన చేసి ఉపహారమును నైవేద్యముగా పెట్టవలెను.
ఇట్లు శ్రీహరీ చేసిన తులసీ స్తోత్రమున తులసీదేవి సంతోషపడి తులసీ వృక్షము నుండి మరల ఆవిర్భవించినది. వెంటనే ఆ తులసీదేవి విష్ణుమూర్తి పాదములపై బడి శరణువేడుకొన్నది. అందువలన నారాయణుడు తులసీ దేవితో నిన్నందరు పూజింతురని వరమిచ్చెను. అట్లే తులసీదళమును తన శిరస్సుపైవ ధరింతునని, తులసీదేవిని తన వక్షస్థలముపై ధరింతునవి ఆట్లే దేవతలందరు ఆ దేవిని తమ శిరస్సులపై ధరింతురని చెప్పి తనలోకమునకు వెళ్ళిపోయెను.
నారద ఉవాచ- నారదుడిట్లడిగెను
కిం ధ్యానం స్తవనం కిం వా కిం వా పూజావిధిక్రమం ।
తులస్యాశ్చ మహాభాగ తన్మే వ్యాఖ్యాతు మర్హసి॥
సరస్వతీ దేవి ధ్యానమెట్లుండును? ఆమె స్తోత్రము పూజా పద్ధతి ఎట్లుండునో వివరించమని నారాయణుని ఆడిగెను.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు నారదునితో అనెను.
అంతర్హితాయాం తస్యాం చ గత్వా చ తులసీవనం ।
హరిః సంపూజ, తుష్టావ తులసీం వీరహాతురః II
సరస్వతీ దేవి చేష్టలవలన తులసీదేవి కోపించి అంతర్ధానము చెందినప్పుడు శ్రీహరి తులసీవనమునకు వెళ్ళి ఆమెను పూజించి స్తోత్రము చేసెను.
శ్రీభగవానువాచ- శ్రీమన్నారాయణుడిట్లు ప్రార్థించెను.
బృందారూపాశ్చ వృక్షాశ్చ యదైకత్ర భవంతి హీ ।
విదుర్భుదాస్తేన బృందాం మత్ర్పయాం తాం భజామ్యహం ॥
పురా బభూవ యా దేవీ హ్యాడో బృందావనే వనే ।
తేన బృందావనీ ఖ్యాతా తాం సౌభాగ్యాం భజామ్యహం॥
ఆసంఖ్యేషు చ విశ్వేష పూజితా యా నీరంతరం ।
తేన విశ్వపూజీతాఖ్యాం జగత్పూజ్యాం భజామ్యహం ॥
అసంఖ్యాని చ విశ్వాని పవిత్రాణి యయా సదా ।
తాం విశ్వపావనీం దేవీం విరహేణ స్మరామ్యహం ॥
దేవా నతుష్టాః పుష్పాణాం సమూహేన యయా వినా ।
తార పుష్పసారాం శుద్దాం చ ద్రష్టుమిచ్ఛామి శోకతః ॥
విశ్వే యత్ర్పాప్తి మాత్రేణ భక్త్యాఽనందో భవేత్ ధ్రువం ।
నందినీ తేన విఖ్యాత సా ప్రీతా భవితా హి మే ॥
యస్యా దేవ్యాస్తులా నాస్తి విశ్వేషు నిఖిలేషు చ ।
తులసీ తేన విఖ్యాతా తాం యామీ శరణం ప్రియే ॥
కృష్ణజీవన రూపా యా శశ్వత్ప్రియతమా సతీ ।
తేన కృష్ణజీవనీతి మమ రక్షతు జీవనం ॥
బృందా (తులసి) వృక్షములు ఎచ్చటనుండునో ఆ ప్రదేశమును బృందావనమందురు. వృక్షరూపమున నున్న నా ప్రేయసిని తులసిని సేవింతును. బృందావనమున మొదలున్నందువలన ఆమెను బృందావని యని పిలుతురు. సకల సౌభాగ్యవతి యగు. తులసీని సేవింతును, సమస్త లోకములలో పూజలనందుకొనుటవలన తులసి విశ్వపూజిత అను పేర ప్రసిద్ది చెందినది. సమస్త ప్రపంచములను పవిత్రము చేసినందువలన ఆమె విశ్వపానియైనదీ. అట్టి తులసిని సేవింతుమ. దేవతలకు ఎన్ని విధములైన పుష్పములు సమర్పించినను తులసీ లేనిచో వారు సంతోషపడరు. ఆ విధముగ పుష్పములలో సారభూతమైనది, పరిశుద్ధమైనదీ యగు తులసిని చూడవలెననీ యున్నది. ప్రపంచమున భగవత్సేవ చేయు సమయములో తులసి లభించినంత మాత్రమున ప్రజలు సంతోషింతురు. . కావున ఆమె నందిని యైనది. అట్టి తులసిని చూచినచో నాకు చాల సంతోషము కలుగును. ఈ ప్రపంచములందన్నీటిలోను తులసితో తుల తూగేవారెవరు లేనందువలన ఆమెను తులసి యందురు. ఆట్టి తులసిని నేను శరణువేడెదను. ఆమె కృష్ణుడనగు నాకు జీవనము (ప్రాణము) వంటిది. అందువలన " కృష్ణజీవనియైనది. నాకు ఎల్లప్పుడు ప్రేయసియగు తులసి నా ప్రాణములను రక్షించుగాక.
ఇత్యేవం స్తవనం కృత్వా తత్రతస్థా రమాపతిః ।
దదర్శ తులసీం సాక్షాత్ పాదపద్మే నతాం సతీం ॥
రుదతీమభిమానేన మానినీం మానపూజితాం ।
ప్రియాం దృష్ట్యా ప్రియః శీఘ్రం వాసయామాస వక్షసి॥
భారత్యాజ్ఞాం గృహీత్వా చ స్వాలయం చ యయౌ హరిః ।
భారత్యా సహ తత్ర్పీతిం కారయామాస సత్వరం ॥
శ్రీమన్నారాయణుడు ఈవిధముగా స్తోత్రము చేయగా తులసీదేవి దర్శనమొసగి ఆతని పాదపద్మముల పై పడెను. ఆభిమానవతి కావుననే ఏడ్చుచున్న ఆ ప్రియురాలైన తులసిని చూచి శ్రీహరి ఆమెను తన రొమ్మున చేర్చుకొనెను.
సరస్వతీ దేవి ఆజ్ఞను తీసికొని శ్రీహరి తులసీదేవితో కలిసి వైకుంఠమును చేరెను. తరువాత అతడు సరస్వతితో కలిసి తులసికి సంతోషమును కలిగించుచుండెను.
వరం విష్ణుర్దదౌ తస్యై విశ్వపూజ్యా భవేతి చ ।
శిరోధార్యాచ సర్వేషాం వంద్యా మాన్యా మమేతి చ ॥
విష్ణోర్వరేణ పా దేవీ పరీతుష్టా బభూవ హ ।
సరస్వతీ తామాశ్లిష్య వాసయామాస సన్నిధౌ ॥
లక్ష్మీర్గంగా సస్మితాం తాం సమశ్లిష్య చ నారద ।
గృహం ప్రవేశయామాస వినయేన సతీం తదా॥
శ్రీమహావిష్ణువు తులసికి నీవు ప్రపంచమందు అందరిచే పూజింపబడుదువనీ, శిరోధార్యగా కాగలవవి, నాకు కూడ పూజనీయురాలవగుదువని వరమొసగెను. తులసి విష్ణుమూర్తి ఇచ్చిన వరమునకు సంతోషపడెను. సరస్వతీదేవి తులసిని కౌగిలించుకొని శ్రీహరి సన్నీధిలో ఉంచెను. అట్లే లక్ష్మీ, గంగలు ఆమెను అక్కున చేర్చుకొని ఇంటికి తీసికొని వెళ్ళిరి.
బృందాం బృందావనీం విశ్వపావనీం విశ్వపూజితాం ।
పుష్పసారాం నందినీం చ తులసీం కృష్ణజీవనం. ॥
ఏతన్నామాష్టకం చైతత్ స్తోత్ర నామార్థసంయుతం ।
యః పఠేతాం చ సంపూజ్య సోఽశ్వమేధఫలం లభేత్ ॥
బృంద, బృందావని, విశ్వపావని, విశ్వపూజిత, పుష్పసార, నందిని, తులసి, కృష్ణజీవని అనే తులసి మొక్క ఎనిమిది పేర్లను ఆర్థసహితముగా చదువుచు ఆమెను పూజించినవారికి అశ్వమేధయాగముచేసిన ఫలితము లభించును.
కార్తీకీ పౌర్ణిమాయాంచ తులస్యా జన్మ మంగళం ।
తత్ర తస్యాశ్చ పూజా చ విహితా హరిణా పురా ॥
తస్యాం యః పూజయేత్తాం చ భక్త్యా చ విశ్వపావనీం ।
సర్వపాపాదినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి ॥
కార్తికే తులసీపత్రం విష్ణవే యో దదాతి చ ।
గవామయుత దానస్య ఫలమాప్నోతి నిశ్చితం ॥
అపుత్రో లభతే పుత్రం ప్రియాహీనో లభేత్ప్రియాం ।
బంధుహీనో లభేద్బంధుం సోత్రస్మరణ మాత్రతః ॥
రోగాత్ప్రముచ్యేత రోగాత్ బద్దోముచ్యేత బంధనాత్ ।
భయాన్ముచ్యేత భీతస్తు పాపాన్ముచ్యేత పాతకీ॥
కార్తీక పౌర్ణిమనాడు తులసి జన్మించినది. అందువలన ఆ నాడు శ్రీహరి తులసీపూజను తొలుత చేసినాడు. అట్లే ఆదినమున తులసీదేవి పూజను భక్తితో చేసిన మానవుడు సమస్త పాపములనుండి వినిర్ముక్తుడై విష్ణులోకమునకు చేరుకొనును.
కార్తీకమాసమున విష్ణువును తులసితో పూజచేసిన వాడు పదివేల ఆవులను దానము చేసిన ఫలమును పొందును. తులసీదేవి యొక్క అష్టనామ స్తోత్రమును స్మరించినంతనే పుత్రులు లేనివానికి పుత్రులు కలుగుదురు. భార్యలేనివానికి భార్య బంధువులు లేనివానికి బంధువులు లభింతురు. అట్లే రోగి రోగమునుండి ముక్తుడగును, కారాగారబద్దుడు కారాగారబంధనమునుండి దూరమగును. భయపడినవాని భయములు, పాపాత్ముని పాపములు అన్నియు తొలగి పోవును.
ఇత్యేవం కథితం స్తోత్రం ధ్యానం పూజావిధిం శ్రుణు ।
త్వమేవ వేద బోనాసి కాణ్వశాభోక్తమేవ చ ॥
యద్వక్ష్యే పూజయేత్రాం చ భక్త్యా చావాహనం వినా ।
ఉపచారైః షోడశభిః ధ్యానం పాతకనాశనం ॥
తులసీం పుష్పసారాం చ సతీం పూజ్యాం మనోహరాం ।
కృత్స్న పాపేధ్మ దాహాయ జ్వలదగ్ని శిఖోపమాం ॥
పుష్పేషు తులనాఽవ్యస్యా నాసీద్దేవీషు వా మునే ।
పవిత్రరూపా సర్వాసు తులసీ సా చ కీర్తితా ॥
శిరోధార్యం చ సర్వేషాం ఈప్సితాం విశ్వపావనీం ।
జీవన్ముక్తాం ముక్తిదాం చ భజతాం హరిభక్తిదాం ! ॥
ఇతీధ్యాత్వా చ సంపూజ్య సుత్వ చ ప్రణమేద్బుధః ।
ఉక్తం తులస్యుపాఖ్యానం కిం భూయః శ్రోతుమిచ్ఛసి ॥
తులసీదేవి స్తోత్రము పై విధముగా నున్నది. ధ్యానము పూజావిధిని నీకు తెల్పెదను. కాణ్వశాఖయందు పేర్కొనబడిన తులసీదేవి పూజావిధి నీకు కూడా తెలియును. ఐనను నీకు దానిని పేర్కొందును. తులసీదేవిని ఆవాహనము చేయకుండనే భక్తిలో షోడశోపచారములలో ఆమెను పూజించవలెను, ఆమె తులసి, పుష్పసార, సతీ, పూజ్యురాలు, మానవులు చేసిన పాపములనన్నిటిని నశింపచేయునది.. పుష్పములలో, దేవతలలో తులసికి (తులన) సమానము ఎవ్వరు లేనందువలన ఆమె తులసియైనది. ఆమె అందరికీ శిరోధార్య. ఆందరికోరికలు తీర్చునది, విశ్వపావనీ, జీవన్ముక్త, ఆమెను సేవించువారికి హరిభక్తిని ముక్తిని ఇచ్చు స్వభావము కలది. కావున తులసిని ధ్యానించి తరువాత షోడశోపచారములతో పూజించి స్తోత్రము చేసి ఆమెకు నమస్కారము చేయవలెను.
నారదా! నీకింతవరకు తులస్యుపాఖ్యానమును తెలిపితిని. ఐనను వినవలసినదేమైన ఉన్నచో ఆడుగుము. నీకు నేను చెప్పిదను అని నారాయణుడనెను.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణి ద్వితీయే ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదే
తులస్యుపాఖ్యానం నామ ద్వావింశతితమోఽధ్యాయః ॥
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములోని రెండవదగు ప్రకృతి ఖండమున, నారద నారాయణ సంవాదములోని తులస్యుపాఖ్యానమను
ఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 22 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
The discourse transitions to the glorification of Goddess Sāvitrī, the third primary manifestation of Parā Prakṛti who embodies the sacred Gayatrī Mantra, Vedic knowledge, and righteous moral conduct. Originating from the tongue of the Supreme Lord Śrī Kṛshṇa, Goddess Sāvitrī was bestowed upon Lord Brahmā as His divine consort to assist in the systemic creation of cosmic laws, Vedic scriptures, and righteous human society. The chapter outlines Her formal worship procedure, her secret Stotra, and Her divine grace, declaring that those who meditate upon Her daily attain flawless memory, spiritual illumination, and complete freedom from the darkness of ignorance.