బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

19 - కాళికా శంఖచూడుల యుద్ధము

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు నారదునితో పలికెను-

శివం ప్రణమ్య శిరసా దానవేంద్ర; ప్రతాపవాన్

సమారురోహి యానం చ స్వామ్యాః సహ సత్వరః

బభూవుస్తే చ సంక్షుణ్ణ; స్కంద శక్యాథిరాస్తదా

నేదుర్దుందుభయః స్వర్గే పుష్పవృష్టిర్బభూవ హ

స్కందస్యోపరి తత్రైవ సమరే చ భయంకరే

స్కందస్య సమరం దృష్ట్యా మహాదద్భుతముల్బణం

 దానవానాం క్షయకరం యథాప్రాకృతీకం లయం

రాజా విమానమారుహ్య శరవర్షం చకార హ

నృపస్య శరవృష్టిశ్చ ఘనవృష్టిర్యథా తథా

మహాన్ ఘోరాంధకారశ్చ వహ్యుత్థానం బభూవ హ

దేవాః ప్రదుర్రువుళ్చాన్యే సర్వే నందీశ్వరాదయః

ఏకాకీ, కార్తికేయస్తుతగ్గి సమరమూర్ధని

పర్వతానాం చ సర్వాణాం శిలానాం శాలినాం తథా

శశ్వచ్చకార వృష్టించ దుర్వాహ్యాం చ భయంకరీం

 నృపస్య శరవృష్ట్యా చ ప్రచ్ఛన్న: శివనందనః

నీరదేన చ సాంద్రేణ సంఛన్నో భాస్కరోయథా

 ధనుః స్కందస్య చిచ్చేద దురహర చ భయంకరం

బభంజ చ రథం దివ్యం చిచ్చేద రథఘోటకాన్

మయూరం జర్జరీభూతం దివ్యాస్త్రేణ చకార సః

శక్తిం చిక్షేప సూర్యాభాం తస్య వక్షోవిభేదినీం

క్షణం మూర్చాం చ సంప్రాప్య చేతనాముపలభ్య సః

 గృహీత్వాన్యత్ ధనుర్ధివ్యం యద్దత్తం విష్ణునా పురా

రత్మేంద్ర సారఖచితం యానమారుహ్య చాగ్నిభూః

శస్త్రమస్త్రం గృహీత్వా చ చకార రణముల్బణం

సర్వాంశ్చ పర్వతాంశ్చైవ వృక్షాంశ్చ ప్రస్తరాంస్తథా

సర్వాంశ్చిచ్ఛేద కోపేన దివ్యాస్త్రేణ శివాత్మజః

ఆగ్నేయం వారుణాస్రణ వారయామాసపై గుహః

రథం ధనుశ్చ చిచ్ఛేద శంఖచూడస్య లీలయా

సవాహం సరథం చైవ కిరీటం ముకుటోజ్వలం

చిక్షేప శక్తిముల్కాభాం మానవేంద్రస్య వక్షసే

మూర్ఛాం సంప్రాప్య రాజోపలభ్య వై చేతనాం పునః

ఆరుహ్య వై యానమన్యం ధనుర్జగ్రాహ సత్వరః

శంఖచూడుడు శివునకు నమస్కరించి తన అమాత్యులతో విమానమునెక్కెను. కాని వారందరు కుమారస్వామి వేసిన శక్తివలన చాలా బాధపడిరి. దేవతలప్పుడు సంతోషముతో పుష్పవృష్టిని గురీపించుచు దుందుభి ధ్వానమును చేసిరి. అప్పుడు స్కందుడు చేసిన యుద్ధము చాలా అద్భుతముగా నుండెను. దానవులకు ఆది ప్రాకృతికలయము వలె తోచినది.

అప్పుడు శంఖచూడుడు విమానమునెక్కి శరవర్షమును కురిపించెను. ఆ సమయమున మిక్కిలి చీకటి అలముకొను. నిప్పులు కూడ కురిసినవి. ఆ తనీ బాణయుద్ధమునకు భయపడి నందీశ్వరుడు మొదలగు దేవతలందరు పరుగెత్తుకొని పోయిరి. కేవలము కుమారస్వామి మాత్రము ఒంటరిగా యుద్ధమున నిలబడెను. శంఖచూడుడు పర్వతములు, సర్పములు, శిలలు, వృక్షములు వర్షముగా కురిపించెను. ఆ వర్షమున షణ్ముఖుడు కనిపించలేదు. అతని ధనుస్సు ఏరిగినది. రథము విరిగినది. రథాశ్వములు చనిపోయినవి. శంఖచూడుడు వేసిన సూర్య సన్నిభమైన శక్తివలన స్కందుడు కొంతకాలము మూర్ఛపోయెను.

షణ్ముఖుడు క్షణకాలములో తేరుకొని విష్ణుమూర్తీ ఇచ్చిన దివ్యధనుస్సును ధరించి రత్న విమానమునెక్కి శస్త్రాస్త్రముల ధరించి యుద్ధము చేయసాగెను, శంఖచూడుని రథమును సారథిని అశ్వములను భంగమొనర్చెను, ఆట్లే దివ్యమైన శక్తిని రాక్షసేంద్రునీ వక్షస్థలముపై వేయగా అతడు మూర్ఛచెందెను. కొద్దిక్షణములలో మరల శంఖచూడుడు చైతన్యమును పొంది ఇంకొక రథమును వేరొక ధనుస్సును స్వీకరించెను.

చకార శరజాలం చ మాయయా మాయిసాం వరః

గుహం చాచ్చాద్య సమరే శరజాలేన నారద

జగ్రాహ శక్తిమవ్యర్థాం శతసూర్యసమప్రభాం

ప్రళయాగ్ని శిఖారూపాం విష్ణోర్యై తేజసాఽవృతాం

చిక్షేప తాం చ కో పేన మహావేగేన కార్తికే

పపాత శక్తిస్తద్గాత్రే వహ్నిరాశిరివోజ్వలా

మూర్చాం సంప్రాప శక్త్యా చ కార్తికేయో మహాబలః

కాళీ గృహీత్వా తం క్రోడే నివాయ శివసన్నిధౌ

మాయలు చేయువారిలో మేటియగు శంఖచూడుడు యుద్ధమున తన బాణవర్షముచే కుమారస్వామిని కప్పివే సెను. ఆ తరువాత మిక్కిలి శక్తి గలిగిన శక్తిని చాలా వేగముగా కుమారస్వామిపై వేసెను. కార్తికేయుడు మహాబలసంపన్నుడైనను ఆ శక్తి తగులుటచే మూర్ఛనొందెను. మూర్ఛపడి యున్న కార్తికేయుని కాళికాదేవి తీసికొని మహాదేవుని సన్నిధికి చేరెను.

శివస్తం దర్శనాదేవ జీవయామాస లీలయా

దదౌ బలమనంతం చ స చోత్తస్థౌ ప్రతాపవాన్

శివః స్వసైన్యం దేవాంశ్చ ప్రేరయామాస సత్వరః

దానవేంద్రైః ససైన్యైశ్చ యుద్ధారంభో బభూవ

స్వయం మహేంద్రో యుయుధే పార్థం చ వృషపర్వణా

భాస్కరో యుయుధే విప్రచిత్తినా సహ సత్వరః

దంభేన సహ చంద్రశ్చ చకార సమరం పరం

కాలేశ్వరేణ కాలశ్చ గోకర్ణేన హులోశనః

కుబేరః కాలకేయేన విశ్వకర్మా మయేన చ

భయంకరేణ మృత్యుశ్చ సంహారేణ యమస్తథా

 కలవింకేన వరుణశ్చంచలేన సమీరణః

బుధశ్చ ధృతపుష్టేన రక్తాక్షేణ శనైశ్చరః

జయంతో రత్నసారేణ వసవో వర్చసాం గణైః

అశ్వినౌ వై దీప్తిమతా ధూమ్రేణ నలకూబరః

ధనుర్దరేణ ధర్మశ మండూకాక్షేణ మంగళః

శోభాకరేనైవేశానః పిఠరేణ చ మన్మథః

ఉల్కా ముఖేన ధూమ్రేణ ఖడ్గేనాఽపి ద్వజేన చ

కాంచీముఖీన పిండేన ధూమ్రేణ సహ నందినా

విశ్వన చ పలాన చోదిత్యా యుయుధుః పరం

ఏకాదశ మహారుద్రాకాదశ భయంకరైః

మహారీ చ యుయు చోగ్రదండాదిభిస్సహ

నందీశ్వరాదయః పర్వే దానవానాం గణిః సహ

యుయుధుశ్చ మహద్యుద్దే ప్రళయే చ భయంకరే

వటమూలే చ శంభుశ్చ తస్థౌ కాళ్యా సుతేన చ

 సర్వే చ యుయుధు: సైన్యసమూహాః సతతం మునే

రత్నసింహాసనే రమ్యే కోటిభిర్దానవైస్సహ

ఉవాస శంఖచూడశ్చ రత్నభూషణ భూషితః

శంకరస్య చ యోధాశ్చ సర్వే యుద్ధే పరాజీ;

దేవాశ్చ దుద్రువుః సర్వేభీతాశ్చ క్షతవిక్షతాః

చకార కోపం స్కందశ్చ దేవేభ్యశ్చాభయం దదౌ

మూర్చపడియున్న కుమారస్వామిని శివుడు తన చూపుతోడనే బ్రతికించెను. పరమ శివుడాతనికి అనంతమైన బలమునిచ్చెను. తరువాత తన సైన్యమును యుద్ధము చేయుటకు పంపెను. ఆంత దేవతలకు శంఖచూడుని సైన్యములతో గొప్ప యుద్ధము జరిగినది.

దేవేంద్రుడు వృషపర్వునితోను, భాస్కరుడు విప్రచిత్తితోను, చంద్రుడు దంభునిలోను, కాలుడు కాళేశ్వరునితోను, అగ్ని గోకర్లుని తోడను, కుబేరుడు కాలకేయుని తోడను, విశ్వకర్మ మయునితోను, మృత్యువు భయంకరునితోడను, యముడు సంహారునీలోను, వరుణుడు కలవింకునితో, వాయువు చంచలునితో, బుధుడు ధృతపుష్టునితో, శని రక్తాక్షునిలో, జయంతుడు రత్నసారునితో, అష్టవసువులు వర్చోగణముతో, అశ్వినీకుమారులు దీప్తిమంతునితో, నలకూబరుడు ధూమ్రునితో, ధర్ముడు ధనుర్ధరునితో, కుజూడు మండూకాక్షునీతో, ఈశ్వరుడు శోభాకరునీలో, మన్మథుడు పిఠరునీలో, ద్వాదశాదిత్యులు ఉల్కాముఖాది రాక్షసులతో, ఏకాదశ రుద్రులు భయంకరులైన పదకొండుగురు రాక్షసులతో, నందీశ్వరాదులు ఇతర రాక్షస " గణముతో యుద్ధముచేసిరి. యుద్ధానంతరము వటవృక్షము క్రింద శంకరుడు మహాకాళితో, షణ్ముఖునితో కలిసి కూర్చుండెను. శంకరునీ సైనికులందరు యుద్ధమున ఓడిపోయినందువలన శంఖ చూడుడు తన దానవసమూహముతో రత్నసింహాసనమున కూర్చొనియుండెను.

శంఖచూడునితో జరిగిన యుద్ధమున దేవతలందరు ఓడిపోయి భయముతో పరుగెత్తిరి. దానిని చూచి కుమారస్వామి రాక్షసులపై కోపించి దేవతలకు అభయమునిచ్చెను.

బలం చ స్వగణానాం శ్రీ వర్దయామాస తేజసా

స్వయమేకశ్చ యయుధే దానవాసం గణైస్పహ

అక్షౌహిణీనోం శతకం సమరే స జఘాన హ

 ఖర్పరం పాతయామాస కాళీ కమలలోచనా

పపౌ రక్తం దానవానాం కృద్దా సా శతఖర్పరం

దశలక్షం గజేంద్రాణాం శతలక్షం చ వాజినాం

 సమాదాయైకహస్తేన ముఖేచిక్షేప లీలయా

కబంధానేర సహస్రం చ సనర్త సమరే మునే

స్కందస్య శరజాలేన దానవాః క్షతవీక్షతాః

భీతాశ్చ దుదువుస్సర్వే మహాబలపరాక్రమాః

వృషపర్వా విప్రచిత్తిర్థంభశ్చాపి వికంకణ:

 స్కందేన సార్థం యుయుధుస్తే చ సర్వే క్రమేణ చ

కాళీ జగామ సమరమరక్షత్కార్తీకం శివః

వీరాస్తామనుజగ్ముశ్చ తే చ నందీశ్వరాదయః

సర్వదేవాశ్చ గంధర్వా యక్షరాక్షస కిన్నరా:

రాజ్యభాండాశ్చ బహుశః శతకోటిర్బలాహకాః

 సా చ గత్వా చ సంగ్రామం సింహనాదం చకారం

దేవ్యావై సింహనాదేన ప్రాపుర్మూరాంచ దానవా:

అట్టాట్టహాసమశివం చకార చ పునః పునః

హృష్టా పపౌచ మాద్వీకం ననర్త రణమూర్ఖని

ఉగ్రదంష్ట్రా చోగ్రచండా కౌట్టరీ చ పపౌ మధు

యోగినీనాం డాకినీనాం గణాః సురగణాదయః

దృష్ట్యా కాళీం శంఖచూడః శీఘ్రమాజిం సమాయయౌ

 దానవాశ్చ భయం ప్రాపూరాజు తేభ్యోఽభయం దదా

కాళీ చిక్షేప చిగ్నేయం ప్రళయాగ్ని శిఖోపమం

రాజా నిర్వాపయామాస వారుణేన స లీలయా

చిక్షేప వరుణం చ తత్తీవ్రం మహదద్భుతం

 గాంధర్వణ చ చిచ్చేద దానవేంద్రశ్చ లీలయా

మాహేశ్వరం ప్రచిక్షేప కాళీ వహ్ని శిఖోపమం

రాజా జఘాన తచ్చీఘ్రం వైష్ణవేన చ లీలయా

నారాయణాస్త్రం సా దేవీ చిక్షిపే మంత్రపూర్వకం

రాజా ననామ తం దృష్ట్యా చావరుహ్య రథాదహో

ఊర్ధ్వం జగామ తచ్ఛస్త్రం ప్రళయాగ్ని శిఖోపమం

పపాత శంఖచూడశ్చ భక్త్యా పై దండషద్భువి

 బ్రహ్మాస్త్రేణ మహారాజః నీర్వాణం చ చకారహా

చిక్షేపాతివ దివ్యాస్త్రం సా దేవీ మంత్రపూర్వకం

రాజా దివ్యాస్త్ర జాలేన నిర్వాణం చ చకార

దేవీ చిక్షేప శక్తించ యత్నతో యోజనాయతం

రాజా తీక్ష్ణాస్త్రజాలేన శతఖండం చకారహ

కార్తికేయుడు తన సైన్యమునకు ఉత్సాహమును పెంచసాగను. అట్లే తానొక్కడే దానవులతో యుద్ధము చేయసాగెను. ఆతనీవలన రాక్షససైన్యమున నూరు అక్షౌహిణీల సైన్యము మృతిచెందెను.

అప్పుడు కాళికాదేవి కోపముతో నూరుపుజెలతో రాక్షసుల రక్తము తాగెను. అట్లే పదిలక్షల ఏమగులను సూరులక్షల గుఱ్ఱములను ఒకే చేత బట్టుకొని మ్రింగెను. వేలకొలదీ మొండెములు యుద్ధమున నేల రాలినవి.

స్కందుని యొక్క బాణములవలన దానవులు క్షతగాత్రులై భయపడి పరుగెత్తిరి. వృషపర్వది. దానవులు కార్తికేయువీతో క్రమముగా యుద్ధమొనరించిరి. రణరంగమున నున్న స్కందుని శివుడు రక్షించుచుండెను..

కాళికాదేవి రణరంగమునకు బయలు దేరగా నందీశ్వరాది వీరులు ఆమె వెంట నడిచిరి. రణరంగమును ప్రవేశింపగనే కాళీక సింహనాదమొనర్చివది. ఆ సింహవాదమునకు రాక్షసులందరు మూర్చిల్లి, సంతోషముతోనామె సురను సేవించి అట్టహాసమొనర్చినది. అట్లే రణరంగమున సంతోషమును పట్టలేక నాట్యమాడినది.

రణరంగమున వీరవిహారము చేయుచున్న కాలికను చూచి శంఖచూడుడు రణరంగమునకు వచ్చి భయపడి వరుడు తన సైన్యమునకు ధైర్యము చెప్పెను. కాళికాదేవి ఆగ్నేయాస్త్రము వేయగా శంఖచూడుడు వారుణాస్త్రముతో దానిని చల్లార్చాను. కాళికాదేవి వారుణాస్త్రమును సంధింపగా అతడు గాంధర్వాస్త్రముతో దోనీనుపశమీపడేసెను. కాళికాదేవి మాహ్విరాస్త్రమును ప్రయోగింపగా నారాయణాస్త్రముతో నతడు దానిని ఖండించెను. కాళికాదేవి నారాయణాస్త్రమును చేయగా శంఖచూడుడు వెంటనే రథమునుండి కిందికి దిగి సాష్టాంగ నమస్కారము చేయగా ఆ అసము ఆకాశములోనికి వెళ్ళిపోయినది. కాళికాదేవి ప్రయోగించుచున్న దివ్యాస్త్రములను శంఖచూడుడు దివ్యాస్త్రముల చేతనే ఉపసంహరించెను. చివరకు కాళిక {$ని ప్రయోగింపగా తన దివ్యాస్త్రములచే దానిని ముక్కలు ముక్కలు చేసెను.

జగ్రాహ మంత్రపూర్వం. చ దేవి పాశుపతం రుషా

నిక్షేప్తుంసా నిషిద్ధా చ హగ్బభూవాశరీరిణీ

మృత్యుః పాశుపతే నాస్తి నృపస్య చ మహాత్మనః

యావద స్యేవ కంఠేస్య కవచం హి హరేరితి

యావత్సతిత్వమస్తీహ సత్యాశ్చ నృపయోషితః

తావదస్య జరామృత్యురాస్తితి బ్రహ్మణో వరః

ఇత్యాకర్ణ్య మహాకాళీ న తచ్ఛిక్షిప సాసతీ

శతలక్షం దానవానాం అగ్రహీల్లీలయా కృధా

ఆత్తుం జగామ వేగేన శంఖచూడం భయంకరీ

దీవ్యాస్త్రేణ సుతీక్షేణన వారయామాస దానవః

ఖడ్గం చిక్షేప సా దేవీ గ్రీష్మపూర్యోపమం పరం

దీవ్యాస్త్రేర్ధానవేంద్రోఽయం శతఖండం చకార సః

 పునరత్తుం మహాదేవి వేగిన చ జగామ తం

సర్వసిద్దేశ్వరః శ్రీమాన్ వవృధీ దానవేశ్వరః

నా వారయామాస చ తాం సర్వసిద్దేశ్వరో వరః

వేగేన ముష్టినా కాళి కోపయుక్తా భయంకరీ

బభంజాఽథ రథం తస్య చాహనతారథం సతీ

వామహస్తేన జగ్రాహ శంఖచూడశ్చ లీలయా

ముష్ట్యా జఘన తం దేవీ మహాకో పేన పేగతః

బభ్రాము వ్యథయా దైత్య: క్షణం మూర్ఛామవాప హ

క్షణేన చేతనార ప్రాప్య సముత్తస్థౌ ప్రతాపవాన్

న చక్రే బాహుయుద్ధం స దేవ్యాసహ ననామ తాం

దేవ్యాశాస్త్రంచ చిచ్చేద చాగ్రహీత్స్వేన తేజసా

 నాఽస్త్రం చిక్షేప తాం భక్త్యా మాతృబుధ్యా చ వైష్ణవః

గృహీత్వా దానవం దేవీ భామయిత్వా పునః పునః

ఊర్ద్వంచ ప్రేరయామాస మహావేగేన కోపత:

 ఊర్ధ్వాత్పపాత వేగేన శంఖచూడః ప్రతాపవాన్

 నీపత్య చ సముత్తస్థౌ స నత్వా భద్రకాళీకాం

శంఖచూడునితో జరుగుతున్న యుద్దమున తన శస్త్రాస్త్రములు విఫలమగుటవలన కాళికాదేవి కోపముతో పాశుపతాస్త్రమును సంధింపనెంచెను. కాని అశరీరవాణి శంఖచూడుని మరణము పాశుపతాస్త్రమున లేదనియు, ఆతని కంఠములోని శ్రీహరి కవచము, అతని భార్యయొక్క సత్త్వముండునంతవరకు అతనికి జర, మృత్యువులు లేవని చెప్పుటచే ఆమె పాశుపతాస్త్రమును సంధింపలేదు. ఆమె కోటి దానవులను ఒక్కసారిగా చంపి శంఖచూడుని తినుటకై వెళ్ళాను. కాని శంఖచూడుడు వాడియగు దివ్యాస్త్రముచే ఆమె ప్రయత్నమును వ్యర్థము గావించెను. ఆమె ప్రయోగించిన ఖడ్గమును సైతము తన దివ్యాస్త్రముచే తుత్తునీయలు గావించెను. అదేవిధముగ రెండవసారి అతనిని తినవలెనని కాళిక చేసిన ప్రయత్నము సర్వసిద్దేశ్వరుని వలన విఫలమయ్యెను. అందువలన కోపముతో ఆమె తన పిడికిటతో అతని రథమును, అతని సారథిని పడగొట్టి అతనిపై ప్రళయాగ్నిజ్వాల వంటి శూలమును వేసెను. కాళికాదేవి కోపముతో తన పిడికిటితో అతనినీ గుద్దగా క్షణకాలమతడు మూర్చిల్లెను. తరువాత వెంటనే తేరుకొని లేచి నిలబడెను. ఆమె బాహు యుద్ధము చేయుట కిష్టపడగా ఆతడు దానికి ఒప్పుకొనక నమస్కరించెను. ఆమె వేసిన శస్త్రాస్త్రములన్నిటిని ఆ దానవుడు వ్యర్థము చేయసాగెను. అట్లే ఆమెపైగల మాతృబుద్ధితో కాళికాదేవిపై అస్త్రములు వేయలేదు. ఐనను కాళికాదేవి కోపముతో అతనిని పట్టుకొని ఎత్తి గిరగిర చుట్టు తిప్పి పడవేసెను. అయినను ఆతడు వెంటనే లేచి నిలబడి భద్రకాళీకి నమస్కరించెను.

రతేంద్రసారఖచితం విమానాగ్యం మనోహరం

ఆరురోహ రథం హృష్ఠో న విశ్రాంతో మహారణే

క్షతజం దానవానాం చ మాంసం చవిపులం క్షుధా

పీత్వా భూక్త్వా భద్రకాళీ యయౌ సా శంకరాంతికం

ఉవాచ రణవృత్తాంతం పౌర్వాపర్యం యథాక్రమం

శ్రుత్వా జుహాస శంభుశ్చ దానవానాం వినాశనం

లక్షం చ దానవేంద్రోణామవశీష్టం రణేఽ ధునా

ఉద్వృత్తం భూభృతా సార్థం తదన్యం భుక్తమీశ్వర

సంగ్రామే దానవేంద్రం చ హంతుల పాశుపతేన వై

అవధ్యస్తవ రాజేతి వాగ్బభూవాశరీరిణీ

రాజేంద్రశ్చ మహాజ్ఞానీ మహాబలపరాక్రమః

న చ చీక్షేప మయ్యస్త్రం చిచ్చేద మమసాయకం

శంఖచూడుడు వెంటనే రత్ననిర్మితమైన విమానము నధిరోహించెను. ఇంతసేపు యుద్ధము చేసినను అతడు అలసిపోలేదు. పైగా సంతోషముతో అతడుండెను. భద్రకాళీ రాక్షసుల మాంసమును తీనీ రక్తమును త్రాగీ చిరపకు శంకరునివద్దకేగి యుద్ధవృత్తాంతమునంతయు పూసగుచ్చినట్లు వివరించినది. ఇప్పుడు దానవేంద్రుని దగ్గర. లక్షసైనికులు మాత్రమున్నారు. మిగిలినవారందరిని నేను తీంటిని. ఇంకను రణరంగమున అతని చంపుటకై పాశుపతాస్త్రమును సంధింపబోగా ఆశరీరవాణి అతడు నీతో చావడనీ నాకు చెప్పెను. ఎటైనను రాజేంద్రుడు మంచి బలపరాక్రమములు కలవాడు పైగా జ్ఞానవంతుడు. ఇంత యుద్ధము జరిగినను అతడు నా శస్త్రాస్త్రములను ఖండించెనే కాని తనకు తానుగా నాపై ఒక అస్త్రమును వేయలేదని భద్రకాళీ శంకరునితో ననగా శంకరుడు నవ్వి ఊరకుండెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వీతీయే. ప్రకృతిఖండే వారద నారయణ సంవాదే తులస్యుపాఖ్యానే కాళీ శంఖచూడయుద్ధోనామ ఏకోనవింశోఽధ్యాయః

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతిఖండములో నారద నారాయణ సంవాద సమయమున తెల్పబడిన తులస్యుపాఖ్యానములో కాళీ శంఖచూడుల యుద్దమను పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.