నారద ఉవాచ- నారదుడిట్లనెను-
నారాయణ మహాభాగ సమశ్చైవ త్వయా ప్రభో ।
రూపేణ చ గుణైశ్చైవ యశసా తేజసా త్వీషా॥
త్వమేవ జ్ఞానినాం శ్రేష్ఠ: సిద్దానాం యోగినాం తథా।
తపస్వినాం మునీనాం చ పరో వేదవిదాం తథా ॥
ఆన్యత్కీంచి దుపాఖ్యానం నిగూడం వద సాంప్రతం ।
ఆతీవగోపనీయం యదుపయుక్తం చ సర్వతః ॥
శ్రీమన్నారాయణ! మహాభాగt రూపమున, సుగుణములలో కీర్తియందు, తేజస్సున నీకు సమానుడు లేనేలేడు, జ్ఞానవంతులలో, సిద్ధులలో, యోగులయందు, తపస్వులలో వేదవేత్తలలో వీవే శ్రేష్టుడవు. నీవలన పరమాద్భుతమైన మహాలక్ష్మీ ఉపాఖ్యానమును వింటిని.
ఇంకను మిక్కిలి రహస్యముగానుండి అందరికీ ఉపయోగపడు ఉపాఖ్యానము నొక్కదానిని నాకు వినిపింపుము.
శ్రీ నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-
నానాప్రకారమాఖ్యానం ఆప్రకాశ్యం పురాణతః ।
శ్రుతౌ కలివిధం గూఢమాస్తే బ్రహ్మన్ సుదుర్లభం ॥
తేషు యత్సారభూతం చ శ్రోతుం కిం వా త్వమిచ్ఛసి ।
తన్మేబ్రూహి మహాభాగ పశ్చాద్వక్షామి తత్పునః ॥
నారదా! వేదములలో అనేకవిధములైన ఆఖ్యానములు గూడముగా నున్నవి. వాటిలో అనేకమైన ఉపాఖ్యానములను పురాణములు వివరించలేదు.
అందువలన నీకు వేదమునందు నిగూఢముగా ఉన్న ఆఖ్యానములలో ప్రధానమని తోచిన దానిని అడిగినచో నేను చెప్పెదను.
నారద ఉవాచ- నారదుడిట్లనెను-
స్వాహా దేవ హవిర్ధానే ప్రశస్తి సర్వకర్మసు ।
పితృదానే స్వధా శస్తా దక్షిణా సర్వతో వరా ॥
ఏతాసాం చరితం జన్మస్థలం ప్రాధాన్యమేవ చ ।
శ్రోతుమిచ్ఛామి తే వక్త్రాన్ పదవేదవిదాం వర ॥
శ్రీమన్నారాయణ! అగ్నికి హవిస్సునిచ్చునప్పుడు స్వాహా దేవి, కవ్యమును ఇచ్చునప్పుడు స్వధాదేవి, అన్ని కర్మలలో దక్షిణా దేవి శ్రేష్ఠురాలని అందురు. వీరి జన్మ, చరిత్ర, ప్రాధాన్యమును వినవలెనని అనుకొనుచున్నాను. అందువలన దయచేసి చెప్పుడు.
సౌతిరువాచ- సౌతి మహర్షి శౌనకునితో ఇట్లనెను-
నారదస్య వచః శ్రుత్వా ప్రహస్య మునిపుంగవః ।
కథాం కథితుమారేభే పురాణోక్తాం పురాతనీం॥
నారదుని మాటలు విని నారాయణముని పురాణములందున్న ప్రాచీనమైన కథనట్లు చెప్పుటకు మొదలిడెను.
శ్రీనారాయణ ఉవాచ- శ్రీనారాయణుడిట్లనెను-
సృష్టేః ప్రథమతో దేవాశ్చాహారార్థం యయుః పురా।
బ్రహ్మలోకే బ్రహ్మ సభామగమ్యాం సుమనోహరాం॥
గత్వా నివేదనం చక్రుర్మునే త్వాహార హేతుకం ।
బ్రహ్మా శ్రుత్వా ప్రతిజ్ఞాయ సీషేనే శ్రీహరేః పదం ॥
యజ్ఞరూపో హి భగవన్ కళయా చ బభూవ సః ।
యజ్ఞే యద్యద్ధవిర్ధానం దత్తం తేభ్యశ్చ వేధసా ॥
హవిర్ధదతి విప్రాశ్చ భక్త్యా చ క్షత్రియాదయః ।
సురానైవ ప్రాప్నువంతి తద్దానం మునిపుంగవ ॥
సృష్టి ప్రారంభకాలమున దేవతలు ఆహారమునకై ఎవ్వరు చేరలేని బ్రహ్మసభకు వెళ్ళి ఆహార విషయమున తమకున్న బాధలను నివేదించుకొనిరి. బ్రహ్మదేవుడు వారి మాటలు విని దేవతలకు మేలు చేయుదుననీ చెప్పి శ్రీహరి నివసించు వైకుంఠమునకు వెళ్ళి శ్రీహరిని సేవించేను. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన ఆంతచే యజ్ఞరూపుడాయెను. ఆ యజ్ఞమున బ్రహ్మదేవుడొసగిన హవిస్సులను ఆయా దేవతలు పొందిరి. కానీ బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు భూలోకవాసులిచ్చిన హవిస్సులు మాత్రము దేవతలకు అందలేదు.
దేవా వీషణ్ణా స్తే సర్వే తత్సభాం చ పునర్యయు ।
గత్వానివేదనం చక్రు రాహారాభావ హేతుకం ॥
బ్రహ్మా శ్రుత్వా తు మనసా శ్రీకృష్ణం శరణం యయౌ ।
ప్రకృతిం పూజయామాస ధ్యాయన్నేవ తదాజ్ఞయా ॥
ప్రకృతి: క:ళయా చైవ సర్వశక్తి స్వరూపిణీ ।
బభూవ దాహికాశక్తి: అగ్నే: స్వాహాస్వరూపిణీ ॥
అందువలన దేవతలు మరల దుఃఖించుచు బ్రహ్మదేవుని సభకు పోయి తమకు ఆహారము దొరుకుచులేదని విన్నవించిరి. బ్రహ్మదేవుడు వారి మాటలు విని దయదలచి శ్రీకృష్ణుని ధ్యానించుచునే అతని ఆజ్ఞననుసరించి ప్రకృతిని పూజించెను. సర్వశక్తి స్వరూపిణియగు ఆ ప్రకృతి తన ఆంశస్వరూపముతో అగ్నియొక్క దాకా శక్తి “స్వాహా" రూపమున ఆవిర్భవించినది.
గ్రీష్మమధ్యాహ్నమార్తండ ప్రభాన్యక్కార కారిణీ ।
ఆతీవసుందరీ రామా రమణీయా మనోహరా ॥
ఈషద్దాస్య ప్రసన్నాస్యా భక్తానుగ్రహకారిణీ ।
ఉవాచేతి విధేరగ్రే పద్మయోనే వరం వృణు ॥
విధిస్తద్వచనం శ్రుత్వా సంభ్రమాత్సముపాచ తాం । ।
స్వాహాదేవి గ్రీష్మకాలమందలి మధ్యాహ్న సూర్యునికన్న మిన్నయైన కాంతితో చిరునవ్వుగల ముఖముతో భక్తులను అనుగ్రహించునదై బ్రహ్మదేవుని వరము వేడుకొమ్మని కోరినది.
స్వాహాదేవియొక్క మాటలు విని బ్రహ్మదేవుడు ససంభ్రమముగా ఆమెతోనిట్లనెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికను-
త్వమగ్నేర్దాహికాశక్తిర్భవపత్నీ చ సుందరీ ।
దగ్ధుం న శక్తః స్వహుతం హుతాశశ్చ త్వయా వినా॥
త్వన్నామోచ్ఛార్య మంత్రాంతే యద్ధాస్యతి హవీర్నరః ।
సురేభ్యతాప్నువంతి సురా: సానం ద పూర్వకం ॥
అగ్నే: సంపత్స్వరూపా చ శ్రీరూపా చ గృహేశ్వరీ ।
దేవానాం పూజితా శశ్వనరాదీవాం భవాంబికే ॥
బ్రహ్మణశ్చ వచః శ్రుత్వా సా విషణ్ణా బభూవ హ ।
తమువాచ స్వయు దేవి స్వాభిప్రాయం స్వయంభువం ॥
ఓ స్వాహాదేవీ! నీవు ఆగ్నియొక్క దాహక శక్తివీ, ఆందమైన దానవు, ఆతనికి భార్యవుకమ్ము. నీవే లేనిచో అగ్ని దేవుడు తనకు సమర్పింపబడ్డ హవిస్సులను దగ్గము చేసికోవలేడు. మంత్రము యొక్క చివర నీ పేరును (స్వాహా) ఉచ్చరించి దేవతలకు మానవులు సమర్పించిన హవిస్సులను దేవతలు ఆనందముతో స్వీకరింతురు. నీవు అగ్నియొక్క సంపదవు. శ్రీ రూపమైన గృహిణివి. ఓ తల్లి నిన్ను ఎల్లప్పుడు దేవతలు, మానవులు పూజింతురు. ఆనీ బ్రహ్మదేవుడనగా స్వాహాదేవి విచారవదనముతో విట్లనెను.
స్వాహోవాచ- స్వాహాదేవి ఇట్లనెను-
ఆహం కృష్ణంభజిష్యామి తపసా సుచిరేణ చ।
బ్రహ్మన్ తదన్యద్యత్కించిత్ స్వప్నవద్భ్రమ ఏవ చ ॥
విధాతా జగతాం త్వం చ శంభు ర్ముత్యుంజయః ప్రభుః ।
బీభర్తీ శేషో విశ్వం చ ధర్మః సాక్షి చ దేహినాం ॥
సర్వాద్యపూజ్యో దేవానాం గణేషు చ గణేశ్వరః ।
ప్రకృతి: సర్వసూః సర్వే పూజితాయత్రసాదతః ॥
ఋషయో మునయశ్చైవ పూజితా యం నిషేవ్య చ ।
తత్పాదపద్మం బ్రహ్మైక్యభావాద్యై చింతయామ్యహం ॥
ఓ బ్రహ్మదేవుడా! నేను చాలాకాలము తపస్సుచేయుచు శ్రీకృష్ణుని సేవించుచున్నాను. శ్రీకృష్ణుడు తప్ప మిగిలిన ప్రపంచమంతయు స్వప్నమువలె కరిగిపోవును. అశాశ్వతమైనది. అన్ని లోకములకు సృష్టికర్తవగు నీవు. మృత్యుంజయుడైన శంకరుడు. ఈ విశ్వమున తన పడగలపై మోయుచున్న ఆదిశేషుడు, ప్రాణులు చేయు కర్మలకు పాక్షియగు ధర్మదేవత, దేవతలందరిలో ఆదిపూజను పొందు గణపతి, ఈ ప్రపంచమునకంతయు తల్లియైన ప్రకృతి, వీరందరు ఆ శ్రీకృష్ణుని అనుగ్రహమువలననే పూజలనందుకొనుచున్నారు. అట్లే ఆ మహామహుని సేవించి ఋషులు, మునులు గౌరవింపబడుచున్నారు.
పరబ్రహ్మమునందు ఐక్యము కావలెనని నేను శ్రీకృష్ణుని పదపంకజములను ధ్యానించుచున్నాను.
పద్మాస్యా పాద్మమిత్యుక్యా పద్మలాభానుసారతః।
జగామ తపసే పాద్మే పద్మాధీశస్య పద్మజా॥
తపస్తేపే లక్షవర్షం ఏకపాదేన పద్మజా ।
తదా దదర్శ శ్రీకృష్ణం నిర్గుణం ప్రకృతేః పరం ॥
ఆతీవ కమనీయం చ రూపం దృష్ట్యాతీసుందరీ ।
మూర్ఛాం సంప్రాప కామేన కామేశస్య చ కాముకీ॥
విజ్ఞాయ తదభిప్రాయం సర్వజ్ఞస్తామువాచ హ ।
స్వక్రోడే చ సముత్థావ్య క్షీణాంగీం తపసా చిరం ॥
తామరపువ్వు వంటి ముఖముగల స్వాహాదేవి బ్రహ్మదేవునితో నిట్లని, శ్రీకృష్ణునికై తపస్సు చేయుటకు పోయెను. ఆమె ఒంటికాలుపై నిలుచుండి లక్షసంవత్సరములు తపస్సు చేసెను. అప్పుడామె నిర్గుణ స్వరూపి, ప్రకృతీకంటే శ్రేష్టుడగు శ్రీకృష్ణుని దర్శించుకొనగలిగెను. శ్రీకృష్ణుని రూపమతీసుందరము కాన అతనిని చూడగనే కామముతో మూర్ఛనొందెను.
మూర్ఛపడివ స్వాహాదేవి మనోభావమును తెలిసికొన్న సర్వజ్ఞడు తపస్సుచే కృశించిపోయిన స్వాహాదేవిని తన ఆంకమున ఉంచుకొని ఆమెతో ఇట్లనెను.
శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణుడిట్లు పలికెను-
వరాహే చ త్వమంశేన మమపత్నీ భవిష్యసి ।
నామ్నా నాగ్నజితీ కన్యాకాంతే నగ్నజితస్య చ ॥
ఆధునాఽగ్నేర్జాహికా త్వం భవ పత్నీ చ భావిని ।
మంత్రాంగరూపా వూతా చ మత్ప్రసాదాద్భవిష్యసి ॥
వహ్నిస్యాం భక్తిభావేన సంపూజ్య చ గృహేశ్వరీం ।
రమిష్యతే త్వయా సార్థం రామయా రమణీయయా॥
ఓ స్వాహాదేవీ! భావికాలమున శ్వేతవరాహ కల్పమున నీ ఆంశతో నీవు వాగ్నజితి యను పేర నా భార్యవగుదుపు. ఇప్పుడు నీవు ఆగ్నేయొక్క దాహకశక్తిగా అతని భార్యగా నుందువు. నా అనుగ్రహమువలన నీవు మంత్రాంగరూపపై పవిత్రురాలవగుదువు, అగ్నిదేవుడు నిన్ను భక్తిభావముచే గౌరవించి గృహేశ్వరీవగు నీతో రమించుము.
ఇత్యుక్త్వాంతర్దధే దేవో దేవీ మాశ్వాస నారద ।
తత్రాజగామ సంత్రస్తో వహిర్భ్రహ్మనీ దేశతః ॥
ధ్యానైశ్చ సామవేదోక్తైః; ధ్యాత్వా తాం జగదంబికాం ।
సంపూజ్య పరితుష్టావ పాణిం జగ్రాహ మంత్రతః ॥
తదా దివ్యం వర్షశతం సరేమే రామయా సహ।
ఆతీవనిర్జనే రమ్యే సంభోగసుఖదే సదా॥
బభూవ గర్భం తస్యాశ్చ హుతాశస్యైవ తేజసా ।
తద్ధధార చ సా దేవీ దివ్యం ద్వాదశవత్పరం॥
తతః సుషాన పుత్రాంశ్చ రమణీయాన్మనోహరాన్ ।
దక్షిణాగ్నిర్గార్హపత్యాహవనీయన్ క్రమేణ చ ॥
శ్రీకృష్ణుడు తన్ను పూజించిన స్వాహాదేవితో ఫైవిధముగా పలికి, ఆమెను ఓదార్చి ఆంతర్థానమునొందెను.
బ్రహ్మదేవుని ఆజ్ఞవలన అచ్చటకు అగ్నిదేవుడు వచ్చి స్వాహాదేవిని పామవేదముననున్న ధ్యానమంత్రములచే ధ్యానించి గౌరవించి మంత్రపూర్వకముగానామెను వివాహము చేసికొనెను.
అగ్నిదేవుడు సంపూర్ణముగా నిర్ణవమైన వనమున దివ్యమైన వర్షశతము తన భార్యతో సుఖముగానుండెను. అప్పుడామెకు గర్భమాయెను. ఆ గర్భమును స్వాహాదేవి దివ్యమైన పన్నెండు సంవత్సరములు మోసి దక్షిణ్నా. గార్హపత్యాన్ని, ఆహవనీయాన్ని ఆను ముగ్గురు పుత్రులను కనెను.
ఋషయో మునయశ్చైవ బ్రాహ్మణాః క్షత్రీయాదయః ।
స్వాహాంతం మంత్రముచ్చార్య హవిర్దదతీ నిత్యశః॥
స్వాహాయుక్తం చ మంత్రం చ యో గృహ్ణాతి ప్రశస్తకం ।
సర్వసిద్ధిర్భవేత్తస్య బ్రహ్మన్ గ్రహణ మాతః ॥
విషహీనో యథాసర్పోవేదహీనో యథాద్విజః ।
పతిసేవా విహీనా స్త్రీ విద్యాహీనో యథాసరః ॥
ఫల శాఖా విహీనశ్చ యథావృక్షోహి నిందతః ।
స్వాహాహీనస్తథా మంత్రో న దృతం తలదాయకః ॥
పరీతుష్టాః ద్వీఙాః సర్వే సంప్రాపు రాహుతీం ।
స్వాహాంతేనైన మంత్రేణ సఫలం సర్వకర్మ చ ॥
ఆప్పటినుండి ఋషులు, మునులు, బ్రాహ్మణాదు లందరు మంత్రముయొక్క చీవర స్వాహాకారమును చేసి ప్రతీదివము అగ్నియందు హవిస్సుల నొసగుచున్నారు.
మంత్రము స్వాహాకారాంతమైనచో అది ప్రశస్తమగుచున్నది. దానివలన సమస్తసిద్ధులు కలుగును.
స్వాహాకారములేని మంత్రము విషములేని సర్పమువలె వేదములు వేర్వని ద్విజూనివటి, పతిసేవ చేయని స్త్రీవలె, విద్యాగంధములేని మానవునివలె పండ్లకొమ్మలు లేని చెట్టువలె పనికిరానిది.
ద్విజులందరు సంతుష్టులై స్వాహాకారంతమైన మంత్రములనుచ్చరించుచు ఆహుతుల నివ్వసాగిరి. సమస్త యః కర్మలు స్వాహాంతమైన మంత్రములవలననే సఫలమగుచున్నవి.
ఇత్యేవం వర్ణితం సర్వం స్వాహోపాఖ్యానముత్తమం ।
సుఖదం మోక్షదం సారం కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥
ఈవిధముగా మోక్షమును సుఖమునిచ్చు స్వాహోపఖ్యానమును నీకు తెలిపితిని. ఇంకను వినవలసినదేమైన ఉన్నచో ఆడుగుము.
నారద ఉవాచ- నారదుడిట్లనెను-
స్వాహాపూజావిధానం చ ధ్యానం స్తోత్రం మునీశ్వర ।
సంపూజ్య వహ్నిస్తుష్టావ యేన తాం పదమప్రభో॥
అగ్నిదేవుడు స్వాహాదేవిని ఏవిధముగా స్తుతించి పూజించెను. ఆ పూజావిధానమును, ధ్యానమును, స్తోత్రమును, నాకు తెలుపుడనీ నారాయణునితో అనెను.
నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-
ధ్యానం చ సామవేదోక్తం స్తోత్రం పూజావిధానకం ।
వదామి శ్రూయతాం బ్రహ్మన్ సావధానం నిశామయ॥
సర్వయజ్ఞారంభకాలే శాలగ్రామే ఘటేఽథవా ।
స్వాహాం సంపూజ్య యత్నేన యజ్ఞం కుర్యాత్ఫలాప్తయే ॥
స్వాహాం మంత్రాంగ భూతాం చ మంత్రసిద్ధి స్వరూపిణీం ।
సిద్దాంచ సిద్ధిదాం నృణాం కర్మణాం ఫలదాం భజే ॥
ఇతి ధ్యాత్వా చ మూలేన దత్వా పాద్యాదికం నరః।
సర్వసిద్ధిం లభేత్ స్తుత్వా మూలం స్తోత్రంమునే శ్రుణు॥
నారదా! సామవేదమునందున్న స్వాహాదేవి ధ్యానమును స్తోత్రమును పూజావిధానమును సావధానముగా వినుము.
సమస్తయజ్ఞములు ప్రారంభించునపుడు సాలగ్రామమున లేక కలశమందు స్వాహాదేవిని ఆవాహనచేసి ఆరాధించి యజ్ఞమును చేయవలెను.
మంత్రసిద్ధి స్వరూపిణి, మంత్రమునకు అంగభూతమైనది, స్వయముగా సిద్ధస్వరూపము కలది, మానవులకు సిద్ధిని కలిగించునది సమస్త కర్మలయొక్క ఫలితములనిచ్చు స్వాహాదేవిని ధ్యానింతుసని ధ్యానించి మూలమంత్రముచే పాద్యాది ఉపచారములనొసగి స్తోత్రము చేయవలెను.
ఇక స్వాహాదేవియొక్క మూలమంత్రమును, స్తోత్రమును నీవు వినుమని నారదునితో అనెను.
ఓం హ్రీం శ్రీం వహిజోయా యై దేవ్యై స్వాహేతనేన చ ।
య: పూజయేచ్ఛతాం దేవీం సర్వేష్టం లభతే ధ్రువం॥
“ఓం హ్రీం శ్రీం వహ్నిజాయాయై దేవ్యై స్వాహా" అనుమూల మంత్రముచే స్వాహాదేవిని పూజించువాడు అన్ని కోరికలను పొందును.
వహ్నిరుదాచ- అగ్నిదేవుడిట్లనెను-
స్వాహాఽద్యా ప్రకృతేరంశా మంత్ర తంత్రాంగరూపిణీ ।
మంత్రాణాం ఫలదాత్రీ చ ధాత్రీచ జగతాం సతీ ॥
సిద్ధిస్వరూపా సిద్ధా చ సిద్ధిదా సర్వదానృణాం ।
హుతాశదాహికాశక్తి; తత్ప్రణాధిక రూపిణీ ॥
సంసారసారరూపా చ దేవపోషణ కారిణీ ॥
షోడశైతాని నామాని యః పఠేద్భక్తి సంయుతః ।
సర్వసిద్ధిర్భవేత్తస్య చేహలోకే పరత్ర చ ॥
సాంగహీనో భవేత్తస్య సర్వకర్మసు శోభనం ।
అపుత్రో లభతే పుత్రమభార్యో లభతే ప్రియాం ॥
స్వాహా, ఆది ప్రకృతియొక్క అంశ, మంత్రతంత్రాంగ రూపిణీ, మంత్రములయొక్క ఫలితము నొసగునది. లోకములనన్నిటిని భరించునది, సిద్ధిస్వరూప, సిద్ధ, మానవులకెల్లప్పుడు సిద్ధిని చేకూర్చునది, అగ్నియొక్క దాహిళాశక్తి, అగ్నికి ప్రాణముల కంటే ఎక్కువ ప్రియమైనది, సంసార సారరూప, భయంకరమైన సంసారమునుండి కడకు చేర్చునది, దేవతలకు ప్రాణరూపమైనది, దేవతలను పోషించునది అను స్వాహాదేవియొక్క పదహారు పేర్లను భక్తితో ప్రతిదినము పఠించినవానికి ఇహపరలోకములలో సమస్త సిద్ధులు కలుగును. అన్నిపనులలో మంచి జరుగును. పుత్రులు లేనివానికి పుత్రులు, భార్యలేనిపానికి భార్య లభించును.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే సరదనారాయణ సంవాదే స్వాహోపాఖ్యానే స్వాహాజన్మాదికథనం నామ చత్వారింశత్తమోఽధ్యాయః ॥
ఇతి స్వావోపాఖ్యానం సమాప్తం శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతిఖండములో నారదనారాయణ సంవాదములో తెలుపబడిన స్వాహోపాఖ్యానములో స్వాహాదేవి జన్మాది వృత్తాంతమును తెలుపు నలభయ్యవ అధ్యాయము సమాప్తము.
ఏకచత్వారింశత్తమ్శోఽధ్యాయః - స్వధాదేవి జన్మ మరియు పూజావిధానం
సారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
శ్రుణునారదవక్ష్యామి స్వధోపాఖ్యానముత్తమం ।
పితృణాం వై తృప్తికరం శ్రాద్ధాసాం ఫలవర్ధనం ॥
సృష్టేరాదౌ పితృగణాన్ ససర్జ జగతాం విధిః ।
చతురోవై మూర్తిమత: త్రీంశ్చ తేజః స్వరూపిణః ॥
సప్తదృష్ట్యా పితృగణాన్ సిద్ది రూపాన్మనోహరాన్ ।
ఆహారం ససృజే తేషాం శ్రాద్ధ తర్పణపూర్వకం ॥
స్నానం తర్పణపర్యంతం శ్రాద్ధాంతం దేవపూజనం ।
అహ్నికం చ త్రిసంధ్యాంతం శ్రాద్ధాంతం దేవపూజనం ॥
ఆహ్నికం చ త్రిసంధ్యాంతం విప్రాణాం శుశ్రుతౌ శ్రుతం ॥
నిత్యం న కుర్యాద్యో విప్రస్త్రిసంధ్యం శ్రాద్ధ తర్పణం ।
బలిం వేదధ్వనిం సోఽపి విషహీనో యథోరగః ॥
హరిసేవావిహీనశ్చ శ్రీహరే రనివేద్యభుక్ ।
భస్మాంతం సూతకం తస్య న కర్మార్హ: స నారద ॥
నారదా! నీకిప్పుడు స్వధా చరిత్రను చెప్పుదును. ఇది పితృదేవతలకు తృప్తిని కలిగించును. శ్రాద్ధఫలమును పెంపొందించును.
సృష్టిప్రారంభమున బ్రహ్మదేవుడు పితృగణమును సృష్టించెను. వారిలో నలుగురికి శరీరమున్నది. తక్కిన ముగ్గురు తేజోరూపులు. బ్రహ్మదేవుడు ఈ ఏడుగురు పితృగణమును సృష్టించి వారికి శ్రాద్ధ తర్పణపూర్వకమైన ఆహారమును సృష్టించెను.
తర్పణాంతమైన స్నానమును, శ్రాద్ధాంతమైన దేవతాపూజను, త్రికాల సంధ్యాంతమైన ఆహ్నికకర్మను బ్రాహ్మణుడు చేయవలెనని వేదములలో కలదు. త్రిసంధ్యాకాలములందు శ్రాద్దమును, తర్పణమును, బలిని, వేదపఠనమును (స్వాధ్యాయము) చేయని బ్రాహ్మణుడు విషములేని పామువంటివాడు. శ్రీహరి సేవ చేయక శ్రీహరికి పెట్టిన నైవేద్యమును తనని బ్రాహ్మణునకు చనిపోవువరకు సూతకము (ఆశవ్చము) ఉండును. అందువలన ఆతడు వైదిక కర్మలు చేయుటకు ఏమాత్రము అర్హుడు కాడు.
బ్రహ్మా శ్రాద్ధాదీకం సృష్ట్వా జగామ పితృహేతవే ।
న ప్రాప్నువంతి పితరో దదతి బ్రాహ్మణాదయః ॥
సర్వే ప్రజగ్ము: క్షుధితా: విషణ్ణా: బ్రహ్మణ: సభాం।
సర్వే నివేదనం చక్రుస్తమేవ జగతాం విధిం॥
బ్రహ్మా చ మానసీం కన్యాం ససృజే తాం మనోహరాం ।
రూపయౌవన సంపన్నాం శరచ్చంద్రసమప్రభం ॥
విద్యావతీం గుణవతీమపి రూపవతీం సతీం ।
శ్వేతచంపక వర్ణాభాం రత్నభూషణ భూషితాం ॥
విశుద్దాం ప్రకృతేరంశాం సస్మితాం వరదాం శుభాం ।
స్వధాభిధానాం సుదతీం లక్ష్మీం లక్షణసంయుతాం॥
శతపద్మపదన్యస్తపాదపద్మం చ బిభ్రతీం ।
పత్నీం పితృణాం పద్మాస్యాం పద్మజాం పద్మలోచనాం॥
పితృభ్యస్తాం దదౌ కన్యాం తుష్టేభ్యస్తుష్టిరూపిణీం ।
బ్రాహ్మణానాం చోపదేశం చక్రే వై గోపనీయకం । ।
బ్రహ్మదేవుడు పితృదేవతల ఆహారార్థమై శ్రాద్ధ తర్పణములు సృష్టించినను, బ్రాహ్మణులు పిండములు మొదలగు వాటిని ఇచ్చుచున్నను, పితృదేవతలకవి దక్కలేదు. అందువలన పితృదేవతలందరు ఆకలితో బాధపడుచు బ్రహ్మదేవుని సభకు వెళ్ళి అక్కడ తమ బాధను విన్నవించుకొనిరి.
అప్పుడు బ్రహ్మదేవుడు సుమనోహర, రూపయౌవన సంపన్న, శరత్కాలచంద్రునివంటి కాంతిగలది, విద్య, సుగుణములు, రూపము కలది, రత్నభూషణములు కలది, పరిశుద్ధమైనది, వరములనిచ్చునది, మంచి లక్షణములు కలది ఆగు స్వధా అను కన్యను మనస్సునుండి సృష్టించెను. పద్మములవంటి పాదములు, ముఖముకల స్వధాదేవిని పితృదేవతలకు భార్యగా బ్రహ్మదేవుడిచ్చెను.
స్వధాంతం మంత్రముచ్చార్య పితృభ్యో దేహి చేతి చ ।
క్రమేణ తేన విప్రాశ్చ పిత్రే దానం దదు: పురా ॥
స్వధాకారంతమైన మంత్రమునుచ్చరించి పితృదేవతలకు పిండము మొదలుగువానీని ఇవ్వవలయునని బ్రహ్మదేవుడు బ్రాహ్మణులకు రహస్యముగా ఉపదేశించెను. ఆనాటినుండి బ్రాహ్మణులు పితృదేవతలకు పిండాది దానమును స్వధాకారాంతముగ చేయుచుండిరి.
స్వాహా శస్తా దేవదానే పితృదానే స్వధా వరా ।
సర్వత్ర దక్షిణా శస్తా హతో యజ్ఞస్త్వదక్షిణః ॥
పితరో దేవలా వీప్రా మునయో మానవాస్తథా ।
పూజాం చక్రుః స్వధాo శాంతాం తుష్టావ పరమాదరం ॥
దేవాదయశ్చ సంతుష్టా: పరిపూర్ణమనోరథాః ।
వీప్రాదయశ్చ పితరః స్వధాదేవీవరేణ చ ॥
దేవతలకు ఆహుతులిచ్చునపుడు మంత్రాంతమందు స్వాహాకారమును ప్రయోగించుట శ్రేష్ఠము. అట్లే పితృదేవతలకు పిండదానము చేయునపుడు స్వధాకారాంతముగా చేయుట మంచిది. దేవపితృయజ్ఞములందు దక్షిణ తప్పక ఈయవలెను. దక్షిణలేని యాగము సఫలము కాదు.
స్వధాదేవియొక్క వరమువలన దేవతలు, పితరులు, బ్రాహ్మణులు మొదలగువారందరు సంతోషమును పొందిరి.
ఇత్యేవం కథితం సర్వం స్వరోపాఖ్యాన ముత్తమం ।
సర్వేషాం వై తుష్టికరం కిం భూయః శ్రోతుమిచ్చేసి॥
నారదా! ఇంతవరకు నీకు స్వధాదేవి చరిత్రను చెప్పితిని. ఇంకను నీవు వినవలసినదేదైన ఉన్నచో అడుగుము. అని నారాయణుడనెను.
నారద ఉవాచ- నారదుడిట్లనెను-
స్వధాపూజావిధానం చ ధ్యానం స్తోత్రం మహామువే ।
శ్రోతుమిచ్ఛామి యత్నేన వదవేదవిదాం వర ॥
శ్రీమన్నారాయణ! నాకు స్వధాదేవియొక్క పూజావిధానమును ధ్యానము, స్తోత్రపద్ధతిని వినవలెనని యున్నది. వేదార్థ విజ్ఞానవేత్తలలో శ్రేష్ఠుడా నాకు వీటిని వివరింపుము.
నారాయణ ఉవాచ: నారాయణుడిట్లనెను-
తద్ధ్యానం స్తవనం బ్రహ్మన్ వేదోక్తం సర్వసమ్మతం ।
సర్వం జానాసి వక్ష్యే వై జ్ఞాతుమచ్చనీ వృద్దయే ॥
శరత్కృష్ణత్రయోదశ్యాం మఘాయాం శ్రాద్దవాసరే ।
స్వధాం సంపూజ్య యత్నేన తతః అడ్డం సమాచరేత్ ॥
స్వధాం నాఽభ్యర్చ్య యోవిప్రః శ్రాద్ధం కుర్యాదహరమతి।
నభవేత్ఫలభాకృత్యం శ్రాద్ధతర్పణయోస్తథా ॥
నారదా! స్వధాదేవి ధ్యానము, స్తోత్రము వేదములలో చెప్పబడినది. అది నీకు కూడ తెలియును. అయినను జ్ఞానవృద్దికై తెలిసికోదలచితివి కావున చెప్పుదును.
శరదృతువులోని ఆశ్వయుజ? కృష్ణ త్రయోదశినాడు, లేక మఖా నక్షత్రమునాడు, కానిచో శ్రాద్ధ దినమున స్వధాదేవిని, పూజించి శ్రాద్ధమునాచరింపవలెను. బ్రాహ్మణుడు అహంకారముతో శ్రాద్ధమునాడు ప్వధాదేవిని పూజింపక శ్రాద్ధమును చేసినచో అతనికి శ్రాద్ధతర్పణముల ఫలితము లభింపదు.
బ్రహ్మణో మానసీం కన్యాం శ్వత్ సుస్థిర యౌవనాం ।
పూజ్యాం పితృణాం దేవానాం శ్రాద్ధానాం ఫలదాంభజే ॥
ఎల్లప్పుడు సుస్థిరమైన యావనము కలది, పితృదేవతలకు దేవతలకు పూజ్యారాలు, శ్రాద్ధఫలితము నొపగునది అగు బ్రహ్మమానస పుత్రికను (స్వధాదేవిని) నమస్కరించుచున్నాను.
ఇతి ధ్యాత్వా ఘటేరమ్యే శాలగ్రామేఽథవా శుభే ।
దద్యాత్పాద్యాదీకం తస్యై మూలేనేతి శ్రుతౌ శ్రుతం॥
ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహేతి చ మహామనుం ।
సముచ్చార్య చ సంపూజ్యస్తుత్వా తాం ప్రణమేద్ద్విజః॥
ఈవిధముగా స్వధాదేవిని రమ్యమైన కలశమున, లేక సాలగ్రామశిలయందు ఆవాహనచేసికొని ధ్యానించి. మూలమంత్రముతో పాద్యము మొదలగు ఉపచారములను సమర్పించవలెను.
“ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహా" అను మూలమంత్రముచే ఆమెను పూజించి స్తోత్రము చేసి నమస్కరింపవలెను.
స్తోత్రం శ్రుణు మునీశ్రేష్ఠ బ్రహ్మపుత్ర విశారద ।
సర్వవాంఛాప్రదం నృణాం బ్రహ్మదాయత్కృతం పురా ॥
బ్రహ్మపుత్రుడవగు నారదా! మానవులయొక్క సమస్త వాంఛలను తీర్చునది, బ్రహ్మదేవుడు చేసిన స్వధాస్తోత్రమును వినుము.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనెను-
స్వధోచ్చారణమాత్రేణ తీర్థస్నాయీ భవేన్నరః ।
ముచ్యతే సర్వపాపేభ్యో వాజపేయఫలం లభేత్ ॥
స్వధాస్వధా స్వధీత్వేవం యదిపారత్రయం స్మరేత్ ।
శ్రాద్ధస్యఫలమాప్నోతి కాలతర్పణయోస్తథా ॥
శ్రాద్ధకాలే స్వధాస్తోత్రం యః శ్రుణోతి సమాహితః ।
లభేత్ శ్రాద్ధశతానాం చ పుణ్యమేవ న సంశయః ॥
స్వధాస్వధా స్వదేత్యేపం త్రిసంధ్యం యః పఠేన్నరః ।
ప్రియాం వినీతాం స లభేత్పాద్వీం పుత్రగుణాన్వితార ॥
పితృణాం ప్రాణతుల్యా త్వం ద్విజ జీవన రూపిణీ ।
శ్రాద్ధాధిష్ఠాతృదేవీ చ శ్రాద్ధాదీనాం ఫలప్రదా ॥
బహిర్మన్మసో గచ్చ పితౄణాం తుష్టిహేతవే ।
సంప్రీతయే ద్విజాతీనాం గృహిణాల వృద్ధి హేతవే ॥
నిత్యా నిత్యస్వరూపాసి గుణరూపాఽసి సువ్రతే ।
ఆవిర్భావస్తిరోభావః సృజీ చ ప్రళయే తవ ॥
స్వధాశబ్దమునుచ్చరించినంత మాత్రమున మానవుడు పుణ్యతీర్థములందు స్నానముచేసిన ఫలమును పొందును. అతని సమస్త పాపములు తొలగిపోవును. వాజపేయయాగము చేసిన ఫలమును పొందును.
స్వధాస్వధా స్వధా యని మూడుమార్లు ఉచ్చరించినంతమాత్రమున శ్రాద్ధఫలితమును, సకాలమున తర్పణ చేసిన ఫలమును పొందును. శ్రాద్ధసమయమున స్వధాస్తోత్రమును విన్నవాడు నూరు శ్రాద్ధములు చేసిన పుణ్యమును పొందును. స్వధాయని మూడుమార్లు ప్రతిదినము పఠించినచో భార్యారహితుడు మంచిభార్యను పొందును.
నీవు పితృదేవతలకు ప్రాణముతో సమానురాలవు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ప్రాణమువంటిదానివి. శ్రాద్దమునకు ఆధిష్టాన దేవతవు. శ్రాద్ధాదుల ఫలితము నొసగుదాన వు. పితృదేవతలకు సంతోషమునకై ద్విజులుల సంప్రీతికై గృహస్థుల అభివృద్ధికి నీవు బయటకు రమ్ము. నీవు నీత్యపు, నీత్యస్వరూపవు, సుగుణరూపిణి. సృష్టిలయములందు నీవు ప్రత్యక్షమగుదువు, మాయమగుదువు, .
ఓం స్వస్తి చ నమః స్వాహా స్వధా త్వం దక్షిణా తథా ।
నిరూపితాశ్చతుర్వేదే షట్ ప్రశస్తాశ్చ కర్మిణాం ॥
పురాఽసీస్త్యం స్వధా గోపీ గోలోకే రాధికా సఖీ ।
ధృతా స్వోరసి కృష్ణేన యతస్తేన స్వధా స్మృతా॥
ద్వస్తా త్వం రాధికా శాపాత్ గోలోకాద్వీశ్వమాగతా ।
కృష్ణాఽశ్లిష్టా తయా దృష్టి పురాబృందావనే వనే ॥
కృష్ణలింగన పుణ్యేన భూతామే మానసీ సుతా ।
ఆతృప్తి సురతా తేన చతుర్ణాo స్వామినాం ప్రియా॥
స్వాహా సా సుందరీ గోపీ పురాసీద్రాధికా సఖీ ।
రతౌ స్వయం కృష్ణమాహా తేన స్వాహా ప్రకీర్తితా ॥
నీవు వేదములందు ఓంకార రూపిణివిగా, నమ:, స్వస్తి, స్వాహా, స్వధా, దక్షిణా స్వరూపములలో కీర్తింపబడినావు, ఆట్లే నీవు పూర్వకాలము గోలోకమున రాధాదేవి ప్రియసఖియైన "స్వధా" అను గోపికపు. శ్రీకృష్ణుడు నిన్ను స్వక్షస్థలమున ధరించినందువలన "స్వధా" అను పేరు పొందితివి. అట్లే నీవు శ్రీకృష్ణుని వక్షస్థలమున ఉండగా రాధాదేవిచూచి శపించినందువలన నీవు భూలోకమునకు వచ్చితివి. నీవు శ్రీకృష్ణుని ఆలింగనము చేసికొన్న పుణ్యమువలన నాకు మానసపుత్రికగా జన్మించితివి. నీకు "స్వాహా" యను పేరుకూడ కలదు. శ్రీకృష్ణునితో రతిసమయమున స్వయముగా (ఆహా) జనీనందున నీకు "స్వాహా” యను పేరు కల్గినది.
కృష్ణేన సార్థం సుచిరం వసంతే రాసమండలే ।
ప్రద్వత్తా సురతే శ్లిష్టా దృష్టి సారాధయా పురా ॥
తస్యాః శాపేన సా ధ్వస్తా గోలోకాద్వీశ్వమాగతా ।
కృష్ణాఽలింగన పుణ్యేన సమభూద్వహ్ని కామినీ ॥
పవిత్రరూపా పరమా దేవాద్యైర్వందితానృభి: ।
యన్నామోచ్చారణేనైన నరో ముచ్యత పాతకాత్॥
రాసమండలమున శ్రీకృష్ణునితో కలిసి మైమరచి నిద్రించుచుండగా రాధాదేవీ చూచి శపించగా భూలోకమునకు చేరితీవి. శ్రీకృష్ణుని ఆలింగనము చేసికొన్న పుణ్యమువలన అగ్నికి భార్యవైతివి. 'స్వాహాదేవి' రూపముననుండు నీవు మిక్కిలి పవిత్రమైనదానవు, పూనపులు, దేవతలచే పూజింపబడితివి. నీ నామోచ్చారణచేసినంత మాత్రముననే మాసపులు చేసిన సమస్తపాపములు తొలగిపోవును.
యా సుశీలాభిథా గోపీ పురాసీద్రాధికా సఖీ ।
ఉవాస దక్షిణేక్రోడీ కృష్ణస్య చ మహాత్మనః ॥
ప్రధ్వస్తా సా చ తచ్చాపాద్గో లోకాద్విశ్వమాగతో ।
కృష్ణాలింగనపుణ్యేన సాబభూవ చ దక్షిణా ॥
సా ప్రేయసీ రతౌ దక్ష ప్రశస్తా సర్వ కర్మసు ।
ఉవాస దక్షిణేభర్తు: దక్షిణా తేన కీర్తితా ॥
గోప్యో బభూవుస్తిస్రోవై స్వధా స్వాహా చ దక్షిణా ।
కర్మీణాం కర్మపూర్ణార్థం పురా చైవేశ్వరేచ్చయా॥
రాధాదేవి ప్రియసఖియగు సుశీలయను గోపిక శ్రీకృష్ణుని ఆలింగనము చేసికొని అతని దక్షిణభాగమునమన్నందువలన ఆమె దక్షిణయైనది. అట్లే రతికార్యమున దక్షురాలు కొవున ఆమె దక్షిణమైనది.
ఈవిధముగా శ్రీకృష్ణపరమాత్మయొక్క ఇచ్ఛవలన మానవుల కర్మలను పూర్తిచేయుటకు "స్వధా", "స్వాహా "దక్షిణా" అను ముగ్గురు గోపికలు భూలోకమున జన్మించిది.
ఇత్యేవ ముక్త్యా స బ్రహ్మా బ్రహ్మలోకే చ సంసదీ ।
తస్థౌ చ సహసా సద్యః స్వధా సాఽవిర్బభూవహ ॥
తదా పితృభ్యః ప్రదదౌ తామేవ కమలాననాం ।
తార సంప్రాప్య యయుస్తే చ పితరశ్చ ప్రహర్షితాః॥
స్వధాస్తోత్రమిదం పుణ్యం యః శ్రుణోతి సమాహితః ।
సస్నాతః సర్వతీర్ధేషు వేదపాఠఫలం లభేత్ ॥
బ్రహ్మదేవుడు దేవతలతో పితృగణముతో ఈవిధముగా పల్కుచున్నప్పుడే స్వధాదేవి అక్కడ ఆవిర్భవించెను. ఆమెను బ్రహ్మదేవుడు పితృదేవతల కొసగగా వారు సంతోషముతో వెళ్ళిపోయిరి.
ఈ స్వధాస్తోత్రమును శ్రద్ధతో చదివినవారు సమస్త తీర్థములలో స్నానము చేసిన ఫలితమును, వేదాధ్యయనము చేసిన ఫలమును తప్పక పొందుదురు.
ఇతి శ్రీబ్రహ్మవైవర్త్ మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే స్వధోపాఖ్యానే స్వధోత్పత్తి తత్పూజాది కథనం నామ ఏక చత్వారింశోఽధ్యాయః ॥
ఇతి స్వధోపాఖ్యానం
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణుల సంహాదసమయమున తెల్పబడిన స్వధాచరీత్రయందు స్వధాదేవి ఉత్పత్తి పూజాదికములు కల నలభైయొకటవ అధ్యాయము సమాప్తము.
.
Summary of chapter 40 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
This grand chapter describes the heroic cosmic event of Samudra Manthana, where the Devas and Asuras united to churn the ocean of milk under the direct guidance of Lord Śrī Vishṇu, who assumed the divine Kurma Avatāra to support the sinking mountain upon His back. As the ocean churned, numerous divine treasures emerged, including the deadly Kālakūṭa poison absorbed by Lord Śiva, the divine wish-fulfilling tree, the celestial elephant, and the horse Uchchaiḥśravas. Finally, Goddess Lakshmī manifested from the glowing waves in radiant splendour, holding a garland of lotus flowers, and willingly chose Lord Śrī Nārāyaṇa as Her eternal consort amidst the joyful chants of all celestial beings.