బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

38 - సముద్ర మథన వృత్తాంతము

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

హారిం ధ్యాత్వా హరీ: బ్రహ్మన్ జగామ బ్రహ్మణః సభాం

బృహస్పతిం పురస్కృత్య సర్వై: సురగణైః సహ

శీఘ్రం గత్వా బ్రహ్మలోకం దృష్ట్యా చ కమలోద్భవం

ప్రణేముర్దేవతాః సర్వా గురుణా సహా నారద

వృత్తాంతం కథయామాస సురాచార్యో విధిం విభుం

ప్రహస్యోపాచ తచ్చ్రుత్వా మహేంద్రం కమలోద్భవః

ఓ నారదా! దేవేంద్రుడు శ్రీమహావిష్ణువును మనస్సులో ధ్యానించుకొని బృహస్పతి, మిగిలిన దేవతాగణము వెంటరాగా బ్రహ్మలోకమునకు పోయెను. అచ్చట బృహస్పతి మహేంద్రుడు మొదలగు దేవతలు బ్రహ్మదేవునకు నమస్కరించిరి. బృహస్పతి బ్రహ్మదేవునకు దేవేంద్రుని వృత్తాంతమునంతయు వివరించగా బ్రహ్మదేవుడు నవ్వి ఇట్లనెను.

బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనెను-

వత్స మద్వంశజాతోఽసి ప్రపౌత్రో మే విచక్షణః

బృహస్పతేశ్చ శిష్యస్త్యం సురాణామధిపః స్వయం

మాతామహస్తే దక్షశ్చ విష్ణుభక్తః ప్రతాపవాన్

కులత్రయం చ యచ్బుద్ధం చ కథం సోఽహంకతో భవేత్

 మాతా పతివ్రతా యస్య పితా శుద్ధో జితేంద్రీయః

మాతామహా మాతులశ్చ కథం సోఽహంకృతో భవేత్

జనః పైతృకటో షేణ దోషాన్మాతామహస్య చ

గురోర్ధోషాత్త్రిభిర్దోషై హరిద్వేషీ భవేత్ ధ్రువం

సర్వాంతరాత్మా భగవన్ సర్వదే హేష్వపస్థితః

యస్య దేహా స ప్రయాత స శస్తక్షణం భవేత్

మనోఽహమింమంద్రియశశ్చ జ్ఞానరూపో హి శంకరః

అసవః ప్రకృతీర్విష్ణుః బుద్ధిర్భగవతి సతీ

నిద్రాదయః శక్తయశ్చ తాః సర్వాః ప్రకృతేః కళాః

ఆత్మనః ప్రతిబింబం చ జీవో భోగీ శరీర భృత్

ఆత్మనీగతే దేహాత్సర్వే యాంతి ససంభ్రమాత్

యథా వర్త్మనీ గచ్ఛంతం నరదేవ మీవానుగాః

ఓ దేవేంద్రా! నీవు నా వంశములో పుట్టితివి. నాకు నీవు మునిమనుమడవు. నీ గురువు బృహస్పతి. నీవు దేవతలకు ఆధీపతివి. నీ మాతామహుడు దక్షప్రజాపతి. ఆతడు పరాక్రమవంతుడేకాక గొప్ప విష్ణుభక్తుడు. ఈవిధముగా తండ్రివంకవారు, తల్లివంకవారు, గురువు ఈ ముగ్గురు పవిత్రులైనచో అహంకారమునకు లావు ఉండదు.

పతివ్రతయగు తల్లి, జితేంద్రియుడైన తండ్రి, సాత్విక స్వభావము కల మాతామహుడు, మేనమామ కలవాడు అహంకారి కాబోలడు. సాధారణముగా మానవుడు తండ్రి వంకనున్నవారి దోషమున, తల్లివంకనున్న వారి దోషమున గురువుయొక్క దోషమువలన శ్రీహరిని ద్వేషించును. సర్వాంతర్యామియగు పరమాత్మ సమస్త దేహములందుండును ఎవరి దేహమును ఆ పరమాత్మవదలి వేయునో అతడప్పుడే శవమగును.

ఇంద్రియములకు ఈశ్వరుడనగు నేను జీవునకు మనోరూపమున ఉందును. శంకరుడు జ్ఞానరూపుడుగానుండును. శ్రీహరి ప్రాణరూపముననుండును. భగవతియగు రాధాదేవి బుద్దీరూపముననుండును. ప్రకృతియొక్క ఆంశస్వరూపమైన శక్తులన్నీ నీద్రాద్రూపముననుందురు. పరమాత్మకు ప్రతిబింబమైన జీవుడు శరీరమును ధరించి కర్మఫలములననుభవించుచుండును. - ఆత్మకు ఈశ్వరుడైన పరమాత్మ దేహమునుండి బయటకు వచ్చినచో మహారాజువేంట పోవు ఆతని అనుచరులవలె

మనోబుధ్యహంకారాదులన్నియు ఆ పరమాత్మవెంటపోవును.

అహం శివశ్చ శేషశ్చ విష్ణుర్ధర్మో మహాన్విరాట్

వయం యదంతా భక్తాశ్చ తత్సుష్పం న్యక్కృతం త్వయా

శివేన పూజితం పాదపద్మం పుష్పేణ యేన చ

తచ్చ దుర్వాససా దత్తం దైవేనా న్యక్కతం సుర

 తత్పుష్పం మస్తకే యస్య కృష్ణపాదాబ్జాతశ్చ్యుతం

సర్వేషాం వై సురాణాం చ తత్పూజా పురతో భవేత్

నేను, పరమశివుడు, ఆదిశేషుడు, విష్ణువు, ధర్ముడు, మహావిరాట్ ఈ మేమందరము శ్రీకృష్ణుని యొక్క ఆంశస్వరూపులము. అతని భక్తులము కూడ. అట్టి పరమాత్మకు సమర్పించిన పుష్పమును నీవు తిరస్కరించితివి. పరమశివుడు ఏ పుష్పముచే శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మములను పూజించేనో ఆ పరమ పవిత్రమగు పుష్పమును దుర్వాసమహాముని నీకు ఇచ్చెను. కాని నీవు దురదృష్టము వలన దానిని గౌరవింపలేదు. శ్రీకృష్ణుని పాదపద్మములనుండి జారిపడిన పుష్పమునెవరు శిరస్సుపై ధరింతురో ఆతనిని సమస్త దేవతలు తొలుత పూజింతురు.

దైవేన వంచితస్త్యం చ దైవం చ బలవత్తరం

భాగ్యహీనం జనం మూడం కోవారక్షితుమీశ్వరః

కృష్ణం న మన్యతే యోహి శ్రీనాథం సర్వవందితం

ప్రయాతి రుష్టా తద్ధాసీ మహాలక్ష్మీ ర్విహాయ తం

శతయజ్ఞేన యాలబ్ధా దీక్షితేన త్వయా పురా

సా శ్రీర్గతాఽదునా కోపాత్ కృష్ణనిర్మాల్యవర్జనాత్

ఆధునాగచ్చ వైకుంఠం మయా చ గురుణా సహ

నిషేవ్య తత్ర శ్రీనాథం శ్రియం ప్రాప్స్యసి తద్వరాత్

ఇత్యేవముక్త్యా సబ్రహ్మా సర్యైః సురగణైః సహ

శీఘ్రం జగామ వైకుంఠం వైకుంఠం యత్రశ్రీ శస్తయా సహ

. దురదృష్టము నిన్ను మోసగించింది. అన్నిటికంటే అదృష్టము చాలా బలమైనదీ, అదృష్టములేని వానిని ఎవ్వరు కూడ రక్షింపలేరు. అందరిచే నమస్కరింపబడుచున్నవాడు, శ్రీనాథుడగు శ్రీకృష్ణుని ఎవరు గౌరవింపరో అతని దగ్గర మహాలక్ష్మి అసలే యుండదు. నీవు నూరు అశ్వమేధయాగములుచేసి సంపాదించుకొన్న లక్ష్మి శ్రీకృష్ణనిర్మాల్యమును పరిహరించుటవలన కోపముతో నిన్ను వదలిపోయినది.

అందువలన నీవు వెంటనే వైకుంఠమునకు పొమ్ము. నీవెంట నేను, దేవతల గురువైన బృహస్పతి కూడ వచ్చును. నీవా శ్రీకృష్ణపరమాత్మను ప్రసన్నముచేసికొని అతని అనుగ్రహమువలన మరల వీ స్వర్గలక్ష్మిని పొందెదవు.

బ్రహ్మదేవుడిట్లు మహేంద్రునితో పలికి దేవేంద్రుడు దేవతలందరు వెంటరాగా శ్రీనాథుడున్న వైకుంఠమునకు పోయెను.

తత్రగత్వా పరంబ్రహ్మ భగవంతం సనాతనం

దృష్ట్యా తేజ: స్వరూపం చ ప్రజ్వలంతం స్వతేజసా

గ్రీష్మ మధ్యాహ్న మార్తండ శతకోటి సమప్రభం

శాంతం చానాదీ మధ్యాంతం లక్ష్మీకాంతమనంతకం

చతుర్భుజై: పార్షదైశ్చ సరస్వత్యాస్తుతం నతం

భక్తా చతుర్చిగ్వేదైశ్చ గంగయా పరిషేవితం

తoప్రణేము: సురా: సర్వే మూర్ధ్నా బ్రహ్మపురోగమా

 భక్తినమ్రా సాశ్రునేత్రా తుష్టుపు: పురుషోత్తమం

వృత్తాంతం కథయామాస స్వయం బ్రహ్మా కృతాంజలిః

 రురుదుర్దేవతాః సర్వాః స్వాధీకాంత్ చ్యుతాశ్చ తా:

దేవతలందరు వైకుంఠమునకు పోయి అచ్చట సనాతనుడు, భగవంతుడు, పరబ్రహ్మస్వరూపుడు, తేజ: స్వరూపుడు గ్రీష్మకాల మధ్యాహ్న సమయమున ప్రజ్వలించుచున్న కోటి సూర్యులవంటికాంతి కలవాడు, పరమశాంతుడు, ఆదిమధ్యాంత రహితుడు, శ్రీనాథుడు అనంతుడగు నారాయణుని దేవతలు చూచిరి. అతనియొద్ద నాలు భుజములు కల ఆతని అనుచరవర్గము సరస్వతి, నాల్గువేదములు, గంగాదేవి ఉండిరి.

అప్పుడు బ్రహ్మదేవుడు, భార్యలతో సేవితుడైన శ్రీమన్నారాయణుని భక్తిచే తలలు వంచుకొని నమస్కరించిరి.

అప్పుడు బ్రహ్మదేవుడు చేతులు కట్టుకొని ఇంద్రుని వృత్తాంతమంతయు శ్రీమన్నారాయణునకు నివేదింపగా తమ ఆధికారమును కోల్పోయిన దేవతలందరు అతని పాదములపైబడి ఏడ్వసాగిరి.

స చాపశ్యత్పురగణం వీపద్గ్రస్తం భయాకులం

వస్త్రభూషణ శూన్యం చ వాహనాది వీవర్జితం

శోభాశూన్యం హతశ్రీకం పరివారైరనావృతం

ఉవాచ కాతరం దృష్ట్వా విపన్న భయభంజనః

శ్రీమన్నారాయణుడు ఆపదలలో మునిగి భయములో నున్నవారు, వస్త్రములు, ఆభరణములు లేనివారు, వాహనములు మొదలైనవి లేనివారు. సంపద తొలగిపోగా ముఖమున కాంతి లేనివారు పరివారము సహితము లేనివారగు దేవతాగణమును చూచి ఆపదలలోనున్నవారి భయమును పోగొట్టువాడై వారితోనిట్లనెను.

నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-

మా బైర్బ్రహ్మన్ హే సురాశ్చ భయం కిం వోమయిస్థితే

దాస్యామి లక్ష్మీ మచలాం పరమైశ్వర్య వర్ధినీం

కించ మ ద్వచనం కించిత్ ట్రాయతాం సమయోచితం

హితం నత్యం సారభూతం పరిణామసుఖావహం

జనాశ్చాసంఖ్య విశ్వస్థా: మదధీనాశ్చా సంతతం

యథా తథాఽహం మద్భక్తైః పరాధీనః స్వతంత్రకః

యోయో రుష్ణో హి మద్భక్తే మత్సరే హి నిరంకుశః

తధ్గృహేఽయం న తిష్ఠామి పద్మయా సహ నిశ్చితం

ఓ బ్రహ్మదేవుడా! దేవతలారా! నేనుండగా మీరు భయపడవద్దు, నేను మీకు పరమైశ్వర్యములనిచ్చు సుస్థిర లక్ష్మిని ఇచ్చెదను. ఐనను హితమైన నామాటను కొద్దిగా వినుడు.

ఈ ప్రపంచములలో నున్న జనులందరు ఎల్లప్పుడు నాకు ఆధీనులై ఉందురు. అట్లే నేను స్వతంత్రుడనైనను, నా భక్తపరతంత్రుడనై ఉందును. నన్ను ఎల్లప్పుడు సేవించు నా భక్తుని కోపించువాని ఇంటిలో లక్ష్మీదేవితో సహా నేనెల్లప్పుడు నివసించను.

దుర్వాసాః శంకరాంశశ్చ వైష్ణవో మత్పరాయణః

తచ్చాపాదాగతోఽహం చ సశ్రీకో వో గృహాదపి

 యత్ర శంఖద్వవిర్నాస్తి తులసీ చ శిలార్చనం

న భోజనం చ విప్రాణాం న పద్మా తత్ర తిష్ఠతి

మద్భక్తానాం చ మే విందా యత్ర తత్ర భవేత్పురాః

 మహారుష్టా మహాలక్ష్మీస్తతో యాతి పరాభవాత్

మద్భక్తిహీనో యో మూడో యో భుంక్తే హరివాసరే

మమజన్మదినే చాపి యాతీ శ్రీస్తద్గృహాదపి

మన్నామ విక్రయీ యశ్చ విక్రీణాతిస్వకన్యకాం

యత్రాతిథిర్నభుంక్తే చ మత్ప్రియా యాతీ తధ్గృహాత్

పాపినాం యో గృహం యాతి శూద్రశ్రాద్ధాన్న భోజినాo

మహారుష్టా తతో యాతి మందిరాత్కమలాలయా

శూద్రాణాం పదహీ చ భాగ్యహీనశ్చ బాడవః

యాతి రుష్టాతధ్గృహాచ్చ దేవీ కమలవాసినీ

శూద్రాణాం సూపకారో యో బ్రాహ్మణో వృషవాహకః

తత్తోయపానభీతా చ కమలా యాతి తధ్గృహాత్

విప్రో యవనసేవీచ దేవల: శూద్రయాజక:

 తత్తోయపాన భీతా చవైష్టవీ యాతీ తధ్గృహాత్

దుర్వాసమహర్షి శంకరుని ఆంశవలన పుట్టినవాడు. పరమ వైష్ణవుడు. ఆతని శాపము వలననే నేను లక్ష్మీదేవితో కలసి మీ ఇండ్లనుండి బయటకు వచ్చితిని.

పూజావేళయందు శంఖద్వని లేనిచోట, తులసీ, సాలగ్రామశిలార్చన చేయనిచోట, బ్రాహ్మణులకు భోజనము దొరకనిచోట లక్ష్మీదేవి విలువదు. అట్లే నా భక్తులను నిందించుచోట, లక్ష్మీదేవి తనకవమానము జరిగినట్లు భావించి కోపముతో ఆ ఇంటినుండి వెళ్ళిపోవును. సాయందు భక్తిలేని మూరుడు ఏకాదళీ లీథినాడు శ్రీకృష్ణాష్టమీ దినమున భోజనము చేయును. కొందరు నా పేరు చెప్పుకొని ధవమార్జింతురు. మరికొందరు తమ కస్యలను విక్రయింతురు. కొందరు ఆతిథి అభ్యాగతులకు భోజనము పెట్టారు. కొందరు పాపులను ఆశ్రయింతురు. కొందరు బ్రాహ్మణులు శూద్రుడు పెట్టిన శ్రాద్దాన్నమును అందురు. కొందరు బీదబ్రాహ్మణులు శవములు కాల్చుచుందురు. వంటలు వండుచు బ్రతుకుచుందురు. కొంరు బ్రాహ్మణులు ఎద్దులపై కూర్చుండి పోవుచుందురు. యవనులను కొందరు బ్రాహ్మణులు సేవింతురు. దేవాలయమున అర్చనచేసి బ్రతుకుదురు. అట్లే మరికొందరు బ్రాహ్మణులు శూద్రులచే యాగములు చేయింతురు. ఇటువంటివారి ఇండ్లలో లక్ష్మీదేవి ఉండదు.

విశ్వాసఘాతీ మిత్రఘ్నో నరఘాతీ కృతఘ్నకః

అగమ్యాం యాతి యో విప్రో మద్భార్యా యాతీ తధ్గృహాత్

ఆశుద్దహృదయః క్రూరో హింసకో వింద ద్వీజః

బ్రాహ్మణ్యాం శూద్రజాతశ్చ యాతి దేవి చ తధ్గృహాత్

యో విప్రో పుంశ్చలిపుత్రో మహాపాపీ చ తత్పతిః

ఆప్రాన్నం యో భుంక్తే తస్మాద్యాతి జగత్ర్పసూః

తృణం భినత్తి నఖరైః తైర్వా యో పా మహీం లిఖేత్

జీహ్మో వా మలవాసాశ్చ సాప్రయాతి చ తధ్గృహాత్

సూర్యోదయే చ ద్వీర్భోజీ దీవాశాయీ చ బాడవః

దీపా మైథునకారీ చ తస్మాద్యాత హరిప్రియా

ఆచారహీనో యో విప్రో యశ్చ శూద్రప్రతిగ్రహీ

ఆదీక్షితో హీ యో మూఢస్తస్మాల్లోలా ప్రయతీచ

విశ్వాసఘాతి, మిత్రులను వంచనచేయు బ్రాహ్మణుడు, మానవులను చంపువాడు, కృతఘ్నుడు, అగమ్యాగమనము చేయు బ్రాహ్మణుల ఇంట లక్ష్మీదేవి ఉండదు. ఆట్లే అపవిత్రమైన హృదయముకలవాడు, క్రూరుడు, హింసించువాడు, పరులను నిందించు బ్రాహ్మణుల ఇంట, బ్రాహ్మణస్త్రీకి జన్మించిన శూద్రుని ఇంటిలో, బారస్త్రీకి పుట్టినవాడు, మహాపాపములు చేయువాని పుత్రుడు భర్త మరియు, సంతానము లేని స్త్రీ పెట్టిన అన్నము భుజించు బ్రాహ్మణుల ఇంటిలో లక్ష్మీదేవి ఉండదు.

ఆనవసరముగా గోళ్ళతో గడ్డిని గిల్లువాడు, అట్లే గోళ్ళతో భూమిపై వ్రాయుచుండువాడు, కుటీలుడు, మలినమైన బట్టలు ధరించువాడు సూర్యోదయమువరకు రెండు పర్యాయములు భుజించువాడు, పగటి పూజ నిద్రపోపు వాడు, పగటిపూట మైథునము చేయు బ్రాహ్మణుల ఇండ్లలో లక్ష్మీదేవి నివసించదు. సదాచారము లేనివాడు, శూద్రుడు చేసిన దానము స్వీకరించువాడు, యాగదీక్షితుడు కావి బ్రాహ్మణుల ఇంట లక్ష్మీదేవి ఉండదు.

స్నిగ్ధపాదశ్చ నగ్నో వా యః శేతే జ్ఞాన దుర్బలః

శశ్వద్ధర్మాతివాచాలో యాతి నైతద్గృహాత్పతి

శిరస్నాతశ్చ తైలెన యోఽన్యదరగం సముపస్పుల్

 స్వాంగే చ వాదయే ద్వాద్యం రమాయాతి తద్గృహాత్

వ్రతోపవాస హీనోయః సంధ్యాహీనోఽశుచిర్ద్విజః

విష్ణుభక్తివిహీనో యప్తస్మాద్యాతి హరిప్రియా

బ్రాహ్మణం నిందయే ద్యోహి తాన్వై ద్వేష్టి చ సంతతం

హింసాకారీ దయాహీనో యాతి సర్వప్రసూస్తతః

తడియారని కాళ్ళతో, లేక నగ్నముగా పడుకొనువాడు ఎల్లప్పుడు ధర్మమును గురించి విపరీతముగా మాట్లాడుచు తాను మాత్రము ధర్మమనుష్ఠింపనివాడు, నూనె అంటుకొని శిరస్నానము చేసిన తరువాత మర్మాంగమును స్పంచువాడు, వ్రతములు ఉపవాసములు చేయనివాడు, సంధ్యావందన మాచరింపనివాడు, విష్ణుభక్తి లేనివాడు, బ్రాహ్మణులను నిందించువాడు, వారిని ద్వేషించువాడు, దయాహీనుడు, ఇటువంటివారి ఇండ్లలో లక్ష్మీదేవి నివసించదు.

యత్ర తత్ర హరేర్భా హరేరుత్కీర్తనం శుభం

తత్ర తిష్ఠతి సాదేవీ కమలా సర్వమంగళా

యత్ర ప్రశంసాకృష్ణస్య తద్భక్తస్య, పితామహ

 సా చ కృష్ణప్రియా దేవీ తత్ర తిష్ఠతి సంతతం

యత్ర శంఖ ధ్వనిః శంఖః శిలా చ తులసీదళం

తత్సేవా వందనం ధ్యానం తత్ర సాతిష్ఠతి స్వయం

శివలింగార్చనం యత్ర తస్య చోత్కీర్తనం శుభం

దుర్గార్చనం తద్గుణాశ్చ తత్ర పద్మనివాసినీ

విప్రాణాం సేవనం యత్ర తేషాం పై భోజనం శుభం

ఆర్చనం సర్వదేవానాం తత్ర పద్మముఖీ సతీ

శ్రీహరి పూజ, శ్రీహరి గుణకీర్తనము జరుగుచోట, శంఖముల ద్వనీ, శంఖము, సాలగ్రామ శీల, తులసి, తులసీ సేవ, నమస్కారములు జరుగు ప్రదేశమున, శివలింగార్చన, పరమశివుని గుణకీర్తన జరుగుస్థలమున, సమస్త దేవతార్చన జరుగు ప్రదేశమున లక్ష్మీదేవి ఎల్లప్పుడు నివసించును.

ఇత్యుక్త్వా చ సురాస్సర్వాన్ రమామాహ రమా పతిః

క్షీరోద సాగరే జన్మ లభస్వ కళయా రమే

ఇత్యుక్త్యాo తాం జగన్నాథో బ్రహ్మాణం పునరాహ చ

మథిత్వా సాగరం లక్ష్మీం దేవేభ్యో దేహీ పద్మజ

ఇత్యుక్త్యా కమలాకాంతో దేవశ్చాంతరధాన్మునే

దేవాశ్చిరేణ కాలేన యయుః క్షీరోద సాగరం

శ్రీమహావిష్ణువు దేవతలతోనిట్లు పలికి, లక్ష్మీదేవితో నీవు నీయొక్క అంశస్వరూపమున పాలసముద్రమున జన్మించుమని చెప్పెను. అట్లే బ్రహ్మదేవునితో మీరందరు పాలసముద్రమును చీలికి ఆ పాలకడలినుండి పుట్టిన లక్ష్మిని దేవతలకు ఇమ్మని చెప్పెను.

శ్రీహరియొక్క ఆజ్ఞననుసరించి దేవతలందరు క్షీరసాగరమునకు వెళ్ళిరి.

మంథానం మందరం కృత్వా కూర్మం కృత్వా చ భాజనం

రజ్జుం కృత్వా వాసుకిం చ మమంథుశ్చైవ సాగరం

ధన్వంతరిం చ పీయూషం ఉచైః శ్రవసమీప్సితం

నానారత్నం హస్తిరత్నం ప్రాపుర్లక్ష్మ్యాశ్చ దరిశనం

 వనమాలాం దదౌ సా చ క్షీరోదశాయినే మునే

సర్వేశ్వరాయ రమ్యాయ విష్ణవే వైష్ణవే సతీ

దేవైస్తుతా పూజితా చ బ్రహ్మణా శంకరేణ చ

దదౌ దృష్టి సురగృహో బ్రహ్మ విమోచీకాం

ప్రాపుర్దేవాః స్వవిషయం దైత్యైర్గ్రస్తం భయంకరైః

మహాలక్ష్మీప్రసాదేన వరదానేన నారద

క్షీరసాగరమున మందరపర్వతముమ కవ్వముగా, ఆది కూర్మమును పాత్రగా, వాసుకిని చిలుకుటకు ఉపయోగించు తాడుగా చేసికొని ఆ సముద్రమును మథించిరి. అప్పుడు బిపక్వరుడైన ధన్వంతరి, ఆమృతకలశము, ఉచ్ఛై: శ్రీవమను ఆశ్వరాజము, కౌస్తుభాది నావారత్నములు, ఐరావతమను ఏమగు, లక్ష్మీదేవి ఆవిర్భవించిరి..

లక్ష్మీదేవి క్షీరసాగరమున పవళించియున్నవాడు, సుందరుడు, సర్వేశ్వరుడు అగు విష్ణుమూర్తి మెడలో వైష్ణవియగు లక్ష్మీదేవి వన(ర?) మాలను వేసింది. ఆమెను బ్రహ్మ, శంకరుడు మొదలగు దేవతలు పూజింపగా ఆ లక్ష్మీదేవి దేవతలపై దుర్వాసమహర్షి శాపమును పోగొట్టు దయాదృష్టిని ప్రసరింపచేపినది.

ఆ మహాలక్ష్మీదేవియొక్క అనుగ్రహమువలన, ఆమె ఇచ్చిన వరమువలన దైత్యులాక్రమించుకొనిన దేవలోకమును దేవతలు తిరిగి పొందిరి.

ఇత్యేవం కథితం సర్వం లక్ష్ముపాఖ్యానముత్తమం

సుఖదం సారభూతం చ కిం భూయః శ్రోతుమిచ్ఛసి

నారదా! ఉత్తమమైన లక్ష్మి ఉపాభ్యాసమును నీకు నేను వివరించితిని. ఇంకను వినదలచినదేదైనా ఉన్నచో ఆడుగుము.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే లక్ష్ముపాఖ్యానే సముద్రమథనం నామాష్టా త్రింషోఽధ్యాయః

శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమున రెండవదైన ప్రకృతిఖండమున నరనారాయణుల సంవాదమున తెల్పబడిన లక్ష్మీ ఉపాఖ్యానములో సముద్రమథనమను ముప్పై ఎనిమిదవ అధ్యాయము సమాప్తము