బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

58 - తారా చంద్రుల దుర్వృత్తి దోషనివారణ

నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లు నారాయణునితో పలికెను-

కస్యవంశోద్భవో రాజా సురథో ధర్మిణాం వరః

కథం సంప్రాప వై జ్ఞానం మేధసో జ్ఞానినాం వరాత్

కస్య వంశోద్భవో బ్రహ్మన్ మేధసో మునిసత్తమ

బభూవ కుత్ర సంవాదో నృపస్య మునినా సహ

సఖ్యం బభూవ కుత్రాస్య వా ప్రభో నృపవైశ్యయో:

వ్యాసేన శ్రోతుమిచ్ఛామి వద వేదవిదాం వర

నారాయణమహర్షి! సురథుడను రాజు ఏ వంశములో పుట్టెను. జ్ఞానవంతులలో శ్రేష్ఠుడగు మేధోమునీ సురథునకు ఏవిధముగా గురువయ్యెను? మేథోముని, మహారాజు ఇద్దరి మధ్య కలయిక ఎట్లేర్పడినది? అట్లే వైశ్యునకు మహారాజునకు స్నేహమెట్లేర్పడినది అను విషయములను నాకు వివరముగా తెల్పుమని ఆడిగెను.

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

 అత్రిశ్చ బ్రహ్మణః పుత్రః తస్య పుత్రో నిశాకరః

స చ కృత్వా రాజసూయం ద్వీజరాజో బభూవ హ

 గురుపత్న్యాం చ తారాం తస్యాభూచ్చ బుధః సుతః

బుధపుత్రస్తు చైత్రశ్చ తత్పుత్ర: సురథః స్మృతః

బ్రహ్మదేవుని పుత్రుడు అత్రిమహర్షి అతని పుత్రుడు చంద్రుడు. అతడు రాజసూయ యాగముచేసినందువలన ద్విజు శ్రేష్ఠుడయ్యెను. ఆ చంద్రునకు గురువైన బృహస్పతి భార్యయగు తెరకు పుట్టినవాడు బుధుడు, బుధుని పుత్రుడు చైత్రుడు. చైత్రుని కుమారుడు సురథుడను మహారాజు.

నారద ఉవాచ- నారదుడిట్లనెను-

గురుపత్న్యాం చ తారాయాం సమభూత్తత్సుతః కథం

అహోవ్యతిక్రమం బ్రూహి వేదస్య చ మహామునే

ఆచార్యా! గురుపత్నియగు తారకు చంద్రునకు పుత్రుడెట్లు కలిగెను. ఇది విపరీతముగానున్నది. అందువలన దీనిని వివరించి చెప్పమని అడిగెను.

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

సంపన్మత్తో మహాకామీ వ్యచరజ్జాహ్నవీ తటే

తారాం సురగురోః పత్నీం ధర్మిష్ఠాం చ పతివ్రతాం

సుస్నాతాం సుందరీం రమ్యాం పీనోన్నత పయోధరాం

సుశ్రోణీం సునితంబాడ్యాం మధ్యక్షీణాం మనోహరాం

సుదతీం కోమలాంగీం నవయౌవన సంయుతాం

సూక్ష్మవస్త్రపరీధానాం రత్నభూషణ భూషితాం

కస్తూరీ బిందునా సార్థమధశ్చందన బిందునా

సిందూరబిందునా చారుఫాలమధ్యస్థలోజ్వలాం

వాయునాఽధోవస్త్రహీనాం సకామాం రక్త లోచనాం

శరత్పార్వణచంద్రస్యాం పక్వబింబాధరాం వరాం

సస్మితాం నమవక్త్రాం చ లజ్జయా చంద్రదర్శనాత్

గచ్ఛంతీం స్వగృహం హర్షాత్ మత్తవారణగామినీం

తాం దృష్ట్యా మన్మథాకాంత్రశ్చంద్రో లజ్జాం జహౌమునే

పులకాంకిత సర్వాంగః సకామస్తామువాచ సః

చంద్రుడు అధిక ధనమువలన మదించి కాముకుడై గంగానదీ తీరమున తిరుగుచుండెను. అప్పుడు దేవగురువగు బృహస్పతి భార్యయైన తారాదేవి అచ్చటనుండెను. ఆమె ధర్మనిష్ఠ కలది. పతివ్రత. కానీ ఆ సమయమున ఆమె నదిలో చక్కగా స్నానము చేసివచ్చుచుండెను. ఆమె మంచి అందముగలదీ. పీవోన్నత సని, చక్కని నడుము, నీతంబములు కలది. మంచి యౌవనమున నున్నది. ఆమె ధరించిన వస్త్రములు చాలా పలుచగానుండెను. రత్నభూషణములతో, ముఖము కస్తూరీచుక్క దానికింద చందన బిందువులు, సిందూరబిందువులతో చాలా ఉజ్వలముగానున్నది. గాలివలన ఆమె ధరించిన వస్త్రము కొద్దిగా పైకి లేచినది. ఆమె కన్నులలో కామము కన్పించుచుండెను. ఆమే ముఖము శరత్కాల పూర్ణిమనాటి చంద్రబింబమువలెనుండెను. పెదవులు దొండపండువలె ఎఱ్ఱగానుండెను. ఆమె సుందరుడైన చంద్రుని చూచీ సిగ్గుతో తలవంచుకొని చిరునవ్వు నవ్వుచుండెను. మదించిన ఏనుగువంటి గమనముతో తన ఇంటికి పోవుచున్న తారను చూచి చంద్రుడు మన్మథబాధకు గురియయ్యెను. ఆందువలన శరీరము పులకించిపోగా, సిగ్గును వదలి కామముతో కూడుకున్నవాడే తారతో ఇట్లనెను.

చంద్ర ఉవాచ- చంద్రుడిట్లనెను-

యోషిచ్చ్రేష్ఠే క్షణం తిష్ఠ వరిష్ఠే రసికాసు చ

సువీదగ్ధే విదగ్ధానాం మనోహరసి సంతతం

 నిషేవ్య ప్రకృతిం జన్మసహస్రం కామసాగరే

తపః ఫలేన త్వాం ప్రాప బృహచ్చ్రోణీం బృహస్పతి:

అహో తపస్వినా సార్థమవిదగ్ధేన వేధసా

యోజితా త్వం రసవతీ శశ్వతామాతురావరా

కిం వా సుఖం పా విజ్ఞాతమవిజ్ఞేషు సమాగమే

విదగ్ధాయ విదగ్ధేన సంగమః సుఖసాగరః

కామేన కామినీ త్వం చ దగ్దాసి వ్యర్థమీశ్వరి

కర్మణావాఽత్మదోషాద్వా కో జానాతి మనః స్త్రియాః

దినేదినేవృధాయాతి దుర్లభం నవయౌవనం

నవీన యౌవనస్థా యా వృద్దేన స్వామినా తవ

శశ్వత్తపస్యా యుక్తశ్చ కృష్ణమాత్మాన మీప్సితం

స్వప్నే జాగరణే వాఽపి ధ్యాయన్నాస్తే బృహస్పతిః

సర్వకామరసజ్ఞా త్వం నిష్కామం కామమీప్సితం

 ధ్యాయంతీ కాముకీ శశ్వద్యూనాం శృంగారమాత్మని

అన్యశ్చ త్వన్మనః కామో భిన్నం త్వద్భర్తు రీప్సితం

యయోశ్చ భిన్నౌ విషయౌ కా ప్రీతి: సంగమే తయోః

వాసంతీ పుష్పతల్పే చ గంధచందన చర్చితే

మోదస్వమాం గృహీత్వా త్వం వసంతే మాధవీవనే

సుగంధ్యుత్ఫుల్ల కుసుమే నీర్జనే చందనే వనే

భవతీయువతీ భాగ్యవతీ తత్రైవ మోదతాం

చందనే చంపకవనే శీతచంపక వాయునా

రమ్యే చంపక తల్పే చ క్రీడాం కురు మయా సహ

నీవు స్త్రీలలో గొప్పదానవు, రసికస్త్రీలలో గొప్పదానివి. నీవు ఏదగ్గురాలవు. అందువలననే వీదగ్గులగు పురుషుల మనస్సును ఆకర్షించుచున్నావు. బృహస్పతి ప్రకృతిని వేలకొద్ది జన్మలనుండి పూజించి తన బహు తపః ఫలితముగా అందమైన నిన్ను భార్యగా పొందెను.

ఆ బృహస్పతి తపస్వీ, కామవిషయములేమి తెలియనివాడు. నీవు రసికురాలవు, కామముపై ఆసక్తి కలదానివి. మీ ఇద్దరిని బ్రహ్మదేవుడన్యాయముగా ఒకచోట కూర్చెను. కామశాస్త్రమేమియు తెలియని వానితో కామ విషయములలో ప్రవీణవగు నీవు సంగమించిన ప్రయోజనమేమున్నది. విదగ్గ విదగ్గునితో కలిసి రమించిన వారిద్దరు సుఖసాగరమున తేలియాడుదురు. కామీనివగు నీవు మన్మథునివలన అనేక బాధలకు గురియగుచున్నావు, ప్రతిదినము నీయొక్క యౌవనము వ్యర్థముగా గడచిపోవుచున్నది. నీ భర్త వృద్దుడు. నీవో నవయౌవనవతివి. ఆతడెల్లప్పుడు తన ఇష్టదేవతయగు శ్రీకృష్ణుని ఆరాధించుచుండును. నీవు సమస్త కామవిషయములు తెలిసినదానవు. నీవెల్లప్పుడు యువకులు చేయు శృంగారమును మనస్సులో ఎల్లప్పుడు ధ్యానించుచుందువు.

నీ మనస్సులోనుండు కోరికయొకటి. నీ భర్త కోరికయొకటి. మీ ఇద్దరి కోరికలు చాలా భిన్నమైనవి. ఇట్టి మీ ఇద్దరి సమాగమమున ప్రీతి ఏమియుండును. వసంతకాలపు పుష్పశయ్య గంధము చందనములతో సువాసితమైయున్నది. ఆ శయ్యపై మాధవీలతా నీకుంజమున నాతో రమింపుము. జనులు లేని చందన వనమున సువాసనగల పుష్పములపై నీవు సుఖింపుము. చంపకవనమున చంపక పుష్పముల వాసనలు చల్లగా వచ్చుచుండగా చంపక పుషతల్పమున నాతో రతిక్రీడ సలుపుము.

ఇత్యుక్త్వా మదనోన్మత్తో మదనాధిక సుందరః

పపాత చరణే దేవ్యా మందోమందాకినీ తటే

 నిరుద్ధ మార్గా చంద్రేణ శుష్క కంఠౌష్ఠ తాలుకా

ఆభీతోవాచ కోపేన రక్త పంకజ లోచనా

మన్మథునికంటే అధిక సౌందర్యము గలవాడు, మన్మథునిచే బాధీశుడైన చంద్రుడు గంగానదీ తీరమున పై విధముగా మాట్లాడుచు ఆమె కాళ్ళపై పడెను. చంద్రుడు తనను ముందుకు పోకుండ ఆపివేయగా తారాదేవి గొంతెండిపోవుచుండగా కోపముతో ఇట్లనెను.

తారోవాచ- తార ఈవిధముగా అనెను-

ధిక్ త్వాం చంద్ర తృణం మన్యే పరస్త్రీలంపటం శఠం

ఆత్రేరభాగ్యాత్త్వం పుత్రో వ్యర్థం తే జన్మ జీవనం

ఆరే కృత్వా రాజసూయమాత్మానాం మన్యసే బలీ

 బభూవ పుణ్యం తే వ్యర్థం విప్రస్త్రీషు చ యన్మనః

యస్య చిత్తం పరస్త్రీషు సోఽశుచిః సర్వకర్మసు

న కర్మ ఫలభాక్పాపీ నిందో విశ్వేషు సర్వతః

సతీత్వం మే నాశయసి యక్ష్మగస్తో భవిష్యసి

అత్యుచ్చ్రితో నిపతనం ప్రాప్నోతీత శ్రుతౌ శ్రుతం

దుష్టానాం దర్పహా కృష్ణో దర్పం తే నిహనిష్యతి

త్యజమాం మాతరం వత్స సత్యం తే శం భవిష్యతి

ఇత్యుక్త్యా తారకా సాధ్వీ రురోద చ ముహుర్ముహు:

చకార సాక్షిణం ధర్మం సూర్యం వాయుహుతాశనం

బ్రహ్మాణం పరమాత్మానమాకాశం పవనం ధరాం

దీనం రాత్రీం చ సంధ్యాం చ సర్వం సురగణం మునే

ఓ చంద్రుడా నిన్ను గడ్డిపరకతో సమానముగా తలచుచున్నాను. నీవు స్త్రీలంపటుడవు. నీచుడవు. అత్రి మహర్షి దురదృష్టమున నిన్నుతుత్రునిగా పొందెను. రాజసూయ యాగము చేసినందువలన బలవంతుడనైతినని నిన్ను నీవు తలచుచున్నావు. విప్రస్త్రీని కామీంచుటవలన నీ పుణ్యమంతయు వ్యర్థమైపోయినది. ఇతరుల భార్యను కామించువాడు అపవిత్రుడు. ఆతడు తాను చేసిన పుణ్యకర్మలయొక్క ఫలితమును పొందజాలడు. అతనిని అందరు నిందింతురు.

నీవు నా సతీత్వమును చెడగొట్టవలెనని తలచుచున్నావు. కాని నీవు క్షయరోగముచే పీడింపబడుదువు. అత్యుచ్ఛయము పతన హేతువని వేదములందు కలదు. నీవు రాజసూయాదీ యాగములవలన సంపాదించుకొన్న పుణ్యమంతయు నశించి పాపఫలమనుభవింపగలవు. దుష్టులయొక్క గర్వమును అణచివేయు శ్రీకృష్ణుడు నీ గర్వమును కూడ అణచివేయగలడు. నేను నీకు తల్లివంటి చానీని. నీవు నాకు పుత్రునివంటివాడవు, నన్ను వదలి పెట్టినచో నీకు శుభముకలుగును.

తార ఈవిధముగా పలుకుచు ఏడ్వసాగెను. అట్లే చంద్రుని కర్మకు సాక్షులుగా ధర్మాది దేవతలను ఉంచెను.

తారకావచనం శ్రుత్వా న భీతః స చుకోవ చ

కరే ధృత్వా రథే తూర్ణం స్థాపయామాస సుందరీం

 రథం చ చాలయామాస మనోయాయీ మనోహరం

 మనోహరాం గృహీత్వా తాం సచరేమే మనోహరం

విస్పందకే సురవనే చందనే పుష్పభద్రకే

పుష్కరే చ నదీతీరే పుష్పితే పుష్పకాననే

సుగంధి పుష్పతయ్పే చ పుష్పచందన వాయువా

నిర్జనే మలయద్రోణ్యాం స్నిగ్ధ చందన చర్చితే

శైలే శైలే నదేనద్యాం శృంగారం కుర్వతోస్తయోః

గతం వర్షశతం హర్షాన్ముహూర్తమీవ నారద

 తారాదేవి మాటలను లెక్క సేయక చంద్రుడు కోపముతో సుందరియగు తారను ఎత్తిపట్టుకొని తన రథమునందుంచుకొని మనోగమనమున రథమును నడిపించెను.

తరువాత చందనము, పుష్పములు కల దేవతావనమున సువాసనగల పుష్పతల్పము పైన ఆమెతో రమించేను. ఆటుపిమ్మట వారిద్దరు ప్రతి పర్వతమున ప్రతి నదీ తీరమున రమించుచుండిరి. వారికప్పుడు నూరు సంవత్సరములు ఒక ముహూర్తమువలె గడచిపోయినవి.

బభూవ శరణాపన్నో భీతో దైత్యేషు చంద్రమాః

తేజస్విని తథాశుక్రే తేషాం చ బలినాం గురౌ

ఆభయం చ దదౌ తస్మై కృపయాభృగునందనః

గురుం జహాస దేవానాం సువిపక్షం బృహస్పతిం

సభాయాం జహాసుః హృష్టాః బలినో దీతీనందనా

అభయం చ దదుస్తస్మై భీతాయ చ కళంకినే

సతీ సతీత్వ ధ్వంసేన పాపిష్ఠే చంద్రమండలే

బభూవ శశరూపం చ కళంకం నిర్మలం మలం

 ఉవాచ తం మహాభీతం శుక్రోవేదవిదాం వరః

హితం పథ్యం వేదయుక్తం పరిణామ సుఖావహం

ఆ తరువాత చంద్రుడు దేవతలవలన భయముచెందీ దైత్యులను శరణువేడెను. అట్లే రాక్షసుల గురువగు శుక్రునికూడ శరణువేడెను. అప్పుడు భృగునందనుడగు శుక్రుడు దయతో చంద్రునకు అభయము నొసగెను. తరువాత తనకు ప్రతిపక్షీయగు దేవతాగురువును సభలో చూచి శుక్రుడు పరిహసించెను. ఆదేవిధముగా దైత్యులాచంద్రునకు అభయమునిచ్చి బృహస్పతిని చూచి నవ్విరి.

కాని పతివ్రతయైన తారాదేవియొక్క సతీత్వమును చంద్రుడు ధ్వంసము చేసినందువలన ఆ కళంకరూపమైన పాపము చంద్రమండలమున శశరూపమైన కళంకముగా మారినది.

అప్పుడు మిక్కిలి భయపడుతున్న చంద్రుని చూచి వేదజ్ఞులలో శ్రేష్ఠుడైన ఈ క్రమహర్షి పరిణామకాలమున సుఖమును కలిగించునది హితవైనది అగు మాటలు పలికెను.

త్వమహో బ్రహ్మణః పౌత్ర్యో త్రేర్భగవతః సుతః

దుర్నీతం కర్మ తే పుత్ర నీచవన్నయశస్కరం

రాజసూయస్య సుఫలే నిర్మలేకీర్తిమండలే

సుధారాశౌ సురాబిందు రూపమంకముపార్జితం

త్యజ దేవగురోః పత్నీం ప్రసూమివ మహాసతీం

ధర్మిష్ఠస్య వరిష్ఠస్య బ్రాహ్మణానాం బృహస్పతేః

 శంభోః సురాణామీశస్య గురుపుత్రస్య వేధసః

పౌత్రస్యాంగిరసో నిత్యం జ్వలితో బ్రహ్మతేజసా

ఓ చంద్రా! నీవు బ్రహ్మదేవుని పౌత్రుడవు. అత్రిమహర్షియొక్క పుత్రుడవు. నీవు చేసిన పని నింద్యమైనది. అది నీచుడైనవాడు చేసిన పనివలె చెడుకీర్తిని కలిగించును. నీవు రాజసూయయాగమొనర్చి దాని ఫలితముగా నిర్మలమైన కీర్తిని పొందితివి. కాని నీవు చేసిన ఈ తప్పుడు పనివలన అమృతభాండమున సురాబిందువు పడినట్లు మచ్చ ఏర్పడినది.

బృహస్పతి దేవతలందరకు గురువు. అతడు సద్ధర్మ పరాయణుడు. బ్రాహ్మణులందరిలోను శ్రేష్ఠుడు, బ్రహ్మతేజో సంపన్నుడు. అతని భార్యయగు తార మహాపతివ్రత. ఈమెను తల్లిని వలె కామింపక వదిలి పెట్టుము.

శత్రోరపి గుణావాచ్యా దోషావాచ్యా గురోరపి

ఇతి సద్వంశజాతానాం స్వభావం చ సతామపి

స శత్రుర్మే సురగురుః పరో విశ్వే నిశాకర

తథాఽపి సహజాఖ్యానం వర్ణితం ధర్మసంసదీ

యత్ర లోకాశ్చ ధర్మిష్ణా తత్ర ధర్మః సనాతనః

యతో ధర్మస్తతః కృష్ణో యతః కృష్ణస్తతో జయః

గౌరేకం పంచ చ వ్యాఘ్రీ సింహీ సప్త ప్రసూయతే

హింసకాః ప్రళయం యాంతి ధర్మో రక్షతి ధార్మికం

దేవాశ్చ గురవో విప్రాః శక్తాయద్యపీ రక్షితుం

తథాపి న హిరక్షంతి ధర్మఘ్నం పాపినం జనం

కులటా ఏప్రపత్నీనాం గమనే సురవీప్రయోః

బ్రహ్మహత్యా షోడశాంశ పాతకం చ భవేత్ ధ్రువం

 తాసా ముపస్థితానాం చ గమనే తచ్చతురర్థకం

 విప్రపత్నీ సతీనాం చ గమనం వై బలేన చేత్

బ్రహ్మహత్యా శతం పాపం భవేదేవ శ్రుతౌ శ్రుతం

ధర్మంచర మహాభాగ బ్రాహ్మణీం త్యజ సాంప్రతం

కృత్వానుతాపం పాపాచ్చ నీవృత్తిస్తు మహాపలా

ఉపాయేన చ తే పాపం దూరీ భూతం భవేన్నను

 శరణాగతస్య భీతస్య మయి దేవస్య ధర్మతః

శస్త్రహీనం చ భీతం చ దీనం చ శరణార్దినం

యో న రక్షత్యధర్మిష్ఠ కుంభీపాకే వసేత్ ధ్రువం

రాజసూయ శతానాం చ రక్షితా లభతే ఫలం

పరమైశ్వర్యయుక్తశ్చ ధర్మేణ స భవేదిహ

శత్రువైనను సత్కర్మలు చేసినచో అతని సుగుణములను కీర్తింపవలెను. అట్లే గురువైనను తప్పుడు పనులు చేసినచో ఆతని చెడుగుణములను చెప్పవలెననుట సద్వంశమున పుట్టిన మంచీవారియొక్క స్వభావము.

ఓ చంద్రుడా! బృహస్పతి నాకు బద్ధశత్రువే అయినను ధర్మవిషయమున సహజమైన దానిని చెప్పితిని. లోకములు ధర్మమార్గమున నున్నప్పుడే సనాతనుడగు ధర్మదేవత అచ్చట ఉండును. ధర్మముండుచోట కృష్ణుడు, కృష్ణుడుండు చోట జయము కలుగును,

ఆవు ఒకే దూడను కనును. కాని వ్యాఘము ఐదు పిల్లలను, సింహము ఏడు పిల్లలను కనును. కాని అవి వాటిని చంపి తినును. కావున హింసచేయువారు త్వరగా చనిపోవుదురు. ధర్మము మాత్రము ధార్మికుని రక్షించును.

దేవతలు, గురువు, బ్రాహ్మణులు ఆందరినీ రక్షింపగల్గినను, ధర్మమును చెడగొట్టు పాపిని మాత్రము వారు రక్షింపరు.

కులటలగు బ్రాహ్మణస్త్రీలను పొందినచో బ్రహ్మ హత్యా పాపమున పదునారంశగల పాపమును పొందుదురు. సమీపముననున్న బ్రాహ్మణ స్త్రీలను చెరచినచో బ్రహ్మహత్యాపాపమునకు నాలుగు రెట్లెక్కువ పాపమును పొందెదరు. వారిని బలాత్కారముగా అనుభవించినచో నూరు రెట్లెక్కువగా బ్రహ్మహత్యా పాపమును పొందుదురు.

అందువలన ఓ చంద్రుడా! ధర్మమును అనుష్ఠింపుము. బ్రాహ్మణస్త్రీని వదలి పెట్టుము. తరువాత ఆనుతాపమును పొంది పాపమునుండి నివృత్తుడవగుదువు. నీ పాపమును ఏదియో ఒక ఉపాయముచేత దూరము చేసికొనవచ్చును.

భయముచే శరణుజొచ్చిన వానిని తప్పక రక్షింపవలెను. శస్త్రములు లేని వానిని, భయముచెందినవారిని, దీనుడైనవానిని, శరణాగతుడైనవానిని రక్షింపని ధర్మహీనుడు కుంభీపాక నరకమునకు పోవును. వీరిని రక్షించినచో నూరు రాజసూయ యాగములు చేసిన పాపము పొందును. ధర్మము నాచరించినందువలన పరమైశ్యర్య సంపన్నుడగును.

ఇత్యుక్త్యా వై దైత్యగురుః స్వర్గే మందాకినీ తటే

స్నాత్వా తం స్నాపయామాస విష్ణుపూజాం చకార సః

విష్ణుపాదాబ్జజాతేన తన్నైనేద్యం శుభప్రదం

గంగోదకేన పుణ్యేన భోజయామాస చంద్రకం

క్రోడేకృత్వా తు తం భీతం సజ్జీతం పాపకర్మణా

కుశహస్తప్త మిత్యూచే స్మారంస్మారం హరిం మునే

దైత్యగురువగు శుక్రుడు చంద్రునితో నిట్లని స్వర్గముననున్న గంగానదీ తీరమున తాను స్నానముచేసి చంద్రుని స్నానము చేయించెను. తరువాత శుక్రుడు విష్ణుపూజను చేసి పుణ్యప్రదమైన గంగానదీ జలముతో చంద్రునకు భోజనము పెట్టెను. అటుపిమ్మట చంద్రుని తన తొడ పైనుంచుకొని దర్భలను చేతిలోనుంచుకొని చంద్రునితో నీవు శ్రీహరిని మాటిమాటికి స్మరింపుమనెను.

శుక్ర ఉవాచ- శుక్రుడిట్లనెను-

యద్యస్తిమే తపః సత్యం సత్యం పూజాఫలం హరేః

సత్యంవ్రత ఫలం చైవ సత్యం వచః ఫలం

తీర్థస్నానఫలం సత్యం సత్యం దానఫలం యది

ఉపవాసఫలం సత్యం పాపాన్ముక్తో భవాన్భవేత్

విప్రం త్రి సంధ్యహీనం యా విష్ణుపూజా విహీనకం

తమాప్నోతు మహాఘోరం చంద్రపాపం సుదారుణం

స్వభార్యావంచనం కృత్వా యః ప్రయాతిపరస్త్రీయం

సయాతు నరకం ఘోరం చంద్రపాపేన పాతకీ

వాచా వా తాడయేల్కోంతం దుః శీలా దుర్ముఖా చ యా

సాయుగం చంద్రపాపేన యాతు లాలాముఖం ధ్రువం

అనైవేద్యం వృథాన్నం చ యశ్చభుంక్తే హరేర్దిజః

స యాతు కాలసూత్రం చ చంద్రపాపాచ్చతుర్యుగం

అంబువాచ్యం భూఖననం యః కరోతి నరాధమః

చంద్రపాపాద్యుగశతం కాలసూత్రం సగచ్చతు

స్వకాంతం వంచయిత్వా చ యా యాతీ పరపురుషం

 సా యాతు వహ్నికుండం చ చంద్రపాపాచ్చతుర్యుగం

కీర్తిం కరోతీ రజసా పరకీర్తిం విలుష్య చ

స యుగం చంద్రపాపేన కుంభీపాకం చ గచ్చతు

పితరం మాతరం భార్యాం యో న పుష్ణాతి పాతకీ

స్వగురుం చంద్రపాపేన యాతు చండాలతాం ధ్రువం

కులటాన్నమవీరన్నమృతుస్నాతోన్న మేవ చ

యోఽశ్నాత చంద్రపాపం చ యాతు తం పాపీనం ధ్రువం

 సయాతు తేన పాపేన కుంభీపాకం చతుర్యుగం

తస్మాదుత్తీర్య చాండాలీం యోనిమాప్నోతి పాతకీ

దివసే యో గ్రామ్యధర్మం మహాపాపీ కరోతి చ

యో గచ్చేత్కామతః కామీ గుర్విణీం వా రజస్వలాం

 తం యాతు చంద్రపాపం చ మహాఘోరం చ పాపీనం

 స యాతు తేన పాపేన కాలసూత్రం చతుర్యుగం

నా తపః ఫలితమున్నచో, నేను పూజించు శ్రీహారియొక్క పూజాఫలమున్నచో, నాయొక్క వ్రతముల ఫలితము, నా సత్యవాక్పలితము, నా తీర్థస్నాన ఫలము, నేను చేసిన దానములయొక్క ఫలము నా ఉపవాసముల ఫలమున్నచో చంద్రుడు అతడు చేసిన పాపములనుండి విముక్తుడగును.

త్రికాల సంధ్యలు ఆచరింపని వానికి, విష్ణుపూజ చేయనివానికి మహాభయంకరమైన చంద్రపాపము అంటును. తన భార్యను మోసగించి ఇతర స్త్రీలతో పోవువానీకి చంద్రపాపము ఆంటును. చెడునడక లేక కలహములు పెట్టుకొను స్త్రీ తన భర్తను బాధించినచో ఆమే చంద్రపాపము వలన తులాముఖమును నరకమును పొందును. శ్రీహరికి నివేదింపని అన్నమును పనికిరాని అన్నమును ఆనువాడు చంద్రపాపము వలన కాలసూత్రమను నరకమున నాలుగు యుగముల వరకుండును.

భూమిని తవ్వు పాపాత్మునకు చంద్రపాపము వలన నూరు యుగములవరకు కాలసూత్ర నరకము లభించును. తన భర్తను మోసగించి ఇతర పురుషునితో పోవు స్త్రీ చంద్రపాపమువలన వహ్నికుండమను నరకమున నాల్లు యుగములుండును. తన తలిదండ్రులను, భార్యను తనగురువును పోషింపనివాడు చంద్రపాపమువలన చండాలుడగును. కులటయగు స్త్రీ పెట్టిన అన్నమును, భర్త, సంతానములేని స్త్రీ పెట్టిన అన్నమును, ఋతుస్నాతమైన స్త్రీ పెట్టిన అన్నమును భుజించువాడు చంద్రుని పాపమువలన నాలుగు యుగములవరకు కుంభీపాక నరకముననుభవించి తరువాత చండాలుడగును, పగటివేళయందు రతిక్రీడ సలుపువాడు, గర్భవతి, రజస్వలయగు స్త్రీతో రతిని చేయువాడు చంద్రపాపము వలన నాలుగు యుగములవరకు కాలసూత్రమను నరకమున యాతనలననుభవించును.

ముఖం శ్రోణీం స్తనం చాపి యః పశ్యతీ పరస్త్రీయాః

కామతః కామ దగ్ధశ్చ యాతు తం చంద్రకల్మషం

స యాతు లాలాభక్ష్యం చ చంద్రపాపాచ్చతుర్యుగం

తస్మాదుత్తీర్యభవతు చాండాలోఽధో నపుంసకః

 కుహరాపూర్ణేందు సంక్రాంతి చతుర్దశ్యష్టమీషు చ

మాంసం మసూరం లకుచం యశ్చ భుంక్తే రవేర్దినే

కురుతే గ్రామ్యధర్మం చ యాతు తం చంద్రకిల్బిషం

చతుర్యుగం కాలసూత్రం తేన పాపేన గచ్చతు

తస్మాదుత్తీర్య చాండాలీం యోనిమాప్నోత పాతకీ

సప్త జన్మసు రోగీ చ దరిద్రః కుబ్జ ఏవ చ

ఏకాదశ్యాం చ యోభుంక్తే కృష్ణ జన్మాష్టమీ దినే

శివరాత్రౌ మహాపాపీ యాతు తం చంద్ర పాతకం

స యాతు కుంభీపాకం చ యావదీంద్రాశ్చతుర్ధశ

తేన పాపేన చాప్నోతు చాండాలీం యోనిమేవచ

తామ్రస్థం దుగ్ధమాధ్వీకముచ్ఛిష్ట ఘృతమేవ చ

నారికేళోదకం కాంస్య దుగ్ధం సలవణం తథా

పీతశేషజలం చైవ భుక్తశేషం తథాదనం

అసకృచ్చాదనం భుంక్తే సూర్యేస్తంగతే ద్విజః

 తం యాతు చంద్రపాపం చ దుర్పివారం చ దారుణం

స యాతు తేన పాపేన చాంధకూపం చతుర్యుగం

స్వకన్యావిక్రయీ విప్రో దేవలో వృషవాహకః

శూద్రాణాం శవదహీ చ తేషాం వై సూపకారకః

 అశ్వత్థ తరుఘాతీ చ విష్ణువైష్ణవ నీందకః

తం యాతు చంద్రపాపం చ దారుణం పాపినం ధ్రువం

 సయాతు తస్మాత్సాహచ్చ తప్తసూర్మీం చ పాతకీ

శశ్వద్దగ్దో భవతు సః యావదీంద్రాశ్చతుర్దశ

తస్మాదుత్తీర్య చాండాలీం యోని మాప్నోతి పాతకీ

సప్త జన్మసు చాండాలో వృషభః పంచజన్మసు

గర్దభో జన్మ శతకం సూకరస్సప్త జన్మసు

తీర్థ ధ్వాక్షస్సప్తసు వై విట్క్రుమిః పంచజన్మసు

పరస్త్రీయొక్క ముఖమును, స్తనములను, పిరుదులను కామ దృష్టితో చూచు కాముకుడు చంద్రపాపమువలన లాలాభక్ష్యమను నరకమున నాలుగు యుగములుండును. అటుపిమ్మట బొండాలుడగును తరువాత నపుంసకుడగును.

అమావాస్య, పూర్ణిమ, సూర్య సంక్రాంతి, చతుర్దశి, అష్టమీ, ఆదివారములందు మాంసమును, సిరిశనగపప్పును, లకుచమును తినువాడు, పై దీనములలో రతికార్యము సలుపువాడు చంద్ర పాపమును పొందీ ఆ పాపమువలన నాలుగు యుగములవరకు కాలసూత్రమను నరకముననుభవించును. అటుపిమ్మట చండాలుడగును. ఏడు జన్మలవరకు రోగి మరియు దరిద్రుడగును,

ఏకాదశినాడు శ్రీకృష్ణాష్టమి, శివరాత్రి దినములందు భోజనము చేయు పాపాత్ముడు పదునలుగురు ఇంద్రులు గతీంచునంతవరకు చంద్రపాపము వలన కుంభీపాక నరకమును పొందును. తరువాత చండాలుడగును.

రాగిపాత్రలోనున్న పాలను, తేనెను, ఎంగిళ్ళలో పడిన నేతిని, కంచుపాత్రలోనున్న నారికేళ ఫలోదకమును, ఉప్పుగల పాలను, తాగగా మిగిలిన జలమును, తినగా మిగిలిన అన్నమును, మాటీకీమాటికి అన్నమును, సాయంసంధ్యయందు భోజనమును చేయువాడు చంద్రపాపమును పొంది. దానివలన నాలుగు యుగములు అంధకూపమను నరకమున యాతనలనుభవించును.

తన కూతురును డబ్బుకాశపడి అమ్ముకొనువాడు. దేవుని పూజించి బ్రదుకు బ్రాహ్మణుడు, ఎద్దుల వాహనము కల బ్రాహ్మణుడు, శూద్రుల శవదాహము చేయువాడు, శూద్రుల ఇండ్లలో వంటలు చేసి బ్రతుకు బ్రాహ్మణుడు, రావిచెట్టును నరకు బ్రాహ్మణుడు, విష్ణుమూర్తిని విష్ణుభక్తులను నిందించు బ్రాహ్మణుడు భయంకరమైన చంద్రపాపమువలన తప్తసూర్మియను నరకమును పొంది అచ్చట మన్వంతర కాలము బాధలననుభవించును. ఆ తరువాత చండాలుడై పుట్టును. అటుపిమ్మట ఐదు జన్మలవరకు వృషభమై జన్మించును. నూరుజన్మలవరకు గాడిదగా పుట్టును. అటుపిమ్మట, ఏడు జన్మలు అడవి పందియగును. ఏడు జన్మలు కాకిగాను ఆ తరువాత ఐదు జన్మలవరకు మలములోని క్రిమీగా జన్మించును.

వృథా మాంసం చ యో భుంక్తే స్వార్థం పాకాన్నమేవ చ

తదదత్తం మహాపాపీ ప్రాప్నుయాచ్చంద్ర పాతకం

సయాతు చంద్రపాపేన చాసిపత్రం చతుర్యుగం

తతో భవతుసర్పశ్చ పశుః స్యాత్సప్త జన్మసు

విప్రోవార్దుషికో యో హి యోనిజీవీ చికిత్సకః

హరేర్నామ్నాం చ విక్రేతా యశ్చవా స్వాంగ విక్రయీ

స్వధర్మకథకశ్చైవ యశ్చ స్వాత్మ ప్రశంసకః

మషీజీవీ ధావకశ్చ కులటాపోష్య ఏవ చ

తం యాతు చంద్రపాపం చ చంద్రోభవతు విజ్వరః

సయాతు తేన పాపేన శూలప్రోతం సుదారుణం

తత్రవిద్దోభవతు స యావదింద్రాశ్చతుర్దశ

తతోదరిద్రో రోగీచ దీక్షాహీనో నరః పశుః

 లాక్షా మాంస రసానాంచ తీలానాం లవణస్య చ

అశ్వానాం చైవ లౌహానాం విక్రేతా నరఘాతకః

విప్రః కులాల చౌరశ్చ యాతు తం చంద్రపాతకం

స యాతు చంద్రపాపేన క్షురధారం సుదుస్సహం

తత్ర ఛిన్నో భవతు ప యావదీంద్ర సహస్రకం

తస్మాదుత్తీర్య సభవేత్ సృగాలః సప్తజన్మసు

సప్త జన్మసు మార్జారో మహిషో జన్మపంచకం

సప్తజన్మసు భల్లూకః కుక్కురస్సప్త జన్మసు

మత్స్యశ్చ జన్మశతకం కర్కటీ జన్మపంచకం

గోధికా జన్మశతకం గర్దభః సప్తజన్మసు

సప్తజన్మసు మండూకస్తతః స్యాన్మానవోఽధమః

చర్మకారశ్చ రజక స్తైల కారశ్చ వర్ధకిః

నావికః శవజీవీ చ వ్యాధశ్చ స్వర్ణకారకః

కుంభకారో లోహకారస్తతః క్షత్రస్తతో ద్విజః

వ్యర్థముగా మాంసమును తినువాడు తనకోరకు మాత్రమే వంటచేసికొని భుజించువాడు మహాపాపి. అతడు చంద్రపాపమును పొంది నాలుగు యుగములు అసిపత్రమను నరకమున బాధలుపడును. నరకానంతరము ఏడుజన్మలు సర్పముగాను, ఏడు జన్మలు పశువుగా పుట్టును.

వడ్డీ వ్యాపారము చేయుచు, వ్యభిచారము నడుపుచు బ్రతుకుచున్న బ్రాహ్మణుఁడు వైద్యుడగు బ్రాహ్మణుడు, శ్రీహరి పేరును చెప్పి బ్రతుకువాడు, తన అవయవములనమ్ముకొని బ్రతుకువాడు, తన ధర్మమును గురించి మాటలు మాత్రము మాట్లాడువాడు, ఆత్మ ప్రశంస చేసికొనువాడు. ఇతరులకు వ్రాసి పెట్టి బ్రతుకువాడు, ధోవకుడు, కులటను పోషించువాడు చంద్రపాపమును పొందును. అందువలన చంద్రునకు పాపవిముక్తి కలుగును. వీరందరు చంద్రపాపమువలన భయంకరమైన శూలప్రోతమను నరకమునకు పోవుదురు. అచ్చట మన్వంతరమునుండి తరువాత దరిద్రులై పుట్టి రోగములచే బాధపడుదురు.

లక్కను, మాంసమును, రసద్రవ్యములను, నువ్వులను, ఉప్పును, ఆశ్వములను, లోహములను, అమ్ముపోడు, తోటి మానవుని చంపు బ్రాహ్మణుడు, కులాలుడు, చోరుడు, వీరందరకు చంద్రపాపము చుట్టుకొనును. అందువలన ఆ పాపి ఒక మన్వంతర కాలము క్షుగధారమను నరకమున దుస్సహమైన యాతనలననుభవించును. ఆ తరువాత నక్కగాను, పిల్లిగాను, బజ్జిగాను, ఎలుగుబంటిగాను, కుక్కగా, చేపగా, ఎండీగా, బల్లిగా, గాడిదగా కప్పగా అనేకమార్లు జన్మలనెత్తి మానవుడై పుట్టును. ఆప్పుడు తొలుతచర్మకారుడుగో, అటుపిమ్మట, రజకుడుగా తైలకారుడుగా, వడ్డీలిచ్చువాడుగా, నావికుడుగా, శవముల మోసీ బతుకువాడు, వ్యాధుడుగో, స్వర్ణకారుడుగా, కుంభకారుడుగా, లోహకారుడుగా, జన్మనెత్తి తరువాత క్షత్రియుడై పుట్టి చివరకు బ్రాహ్మణ జన్మపొందును.

ఇతి చంద్రం శుచిం కృత్వా సమువాచ తు తారకాం

త్యక్త్యా చంద్రం మహాసాధ్వి గచ్చకాంతమితీ ద్విజః

ప్రాయశ్చిత్తం వినాపూతా త్వమేవం శుద్ద మానసా

అకామా యా బలిష్ఠేన న స్త్రీ జారేణ దుష్యతి

 ఇత్యేవముక్త్యా శుక్రశ్చ చంద్రం వా తారకాం సతీం

సస్మితాం సస్మితం చైవ చకార చ శుభాశిషః

చంద్రుని ఈవిధముగా పాపరహితునిగా చేసి శుక్రుడు తారతో ఇట్లనెను. పతీవ్రతా! నీవు చంద్రుని వదిలి పెట్టి నీ భర్త దగ్గరకు పొమ్ము, నీవు పరిశుద్ధమైన మనస్సు కలదానవు. అందువలన నీకు జారత్వము వలన కలుగు పాపమంటదు. ప్రాయశ్చిత్తము చేసికొన నప్పటికి నీవు పవిత్రురాలవే. తనకు కోరికలేక బలవంతుడైన పురుషుని వలన బలాత్కరింపబడినచో ఆ స్త్రీకి జారత్వ పాపమంటదు అని శుక్రుడు వారిద్దరకు శుభాశీస్సులనొసగి పోయెను.

ఇతిశ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే ద్వీతీయే ప్రకృతఖండే నారదనారాయణ సంవాదే దుర్గోపాఖ్యానే తారాచంద్రయోర్దోషనివారణం నామాష్టపంచాశత్తమోధ్యాయః

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండములోని నారదనారాయణ సంవాదమున తెలుపబడిన దుర్గోపాఖ్యానములోని తారాచంద్రుల పాపనివారణమను యాభైఎనిమిదవ అధ్యాయము సమాప్తము.