నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
పూజావిధానం స్తోత్రం చ శ్రూయతాం మునిపుంగవ ।
ధ్యానం చ సామవేదోక్తం దేవీ పూజా విధానకం ॥
శ్వేత చంపకవర్ణాభాం రత్నభూషణ భూషితాం ।
వహ్నిశుద్ధాంశుకాధానం నాగయజ్ఞోపవీతినీం ॥
మహాజ్ఞానయుతాం చైవ ప్రవరాం జ్ఞానినాం సతాం।
సిద్ధాధిష్ఠాతృదేవీం చ సిద్ధాం సిద్ధిప్రదాం భజే ॥
నారద! సామవేదమున చెప్పబడిన మనసాదేవియొక్క పూజావిధానమును ధ్యానమును, స్తోత్రమును నీవు వినుము.
మనసాదేవి తెల్లని చంపక పుష్పమువంటి రంగుకలది. రత్నాలంకారములు కలది, సర్పమునే యజ్ఞోపవీతముగా ధరించునది, బంగారువన్నె కల వస్త్రములు ధరించునది, గొప్పనైన జ్ఞానము కలదీ, సిద్ధస్వరూప, సిద్ధాదిష్టాన దేవత, ఇతరులకు సిద్దులను కలిగించునది.
అట్టి మనసాదేవిని నేనెల్లప్పుడు సేవింతును.
ఇతిధ్యాత్వా చ తాం దేవీం మూలేనైవ ప్రపూజయేత్ ।
నైవేద్యైః వివిధై: దీపైః పుష్ప ధూపానులేపనై:॥
మూలమంత్రశ్చ వేదోక్తో భక్తానాం వాంఛితప్రదః ।
మూలకల్పతరుర్నామ సుసిద్దో ద్వాదశాక్షరః॥
ఓం హ్రీం శ్రీం క్రీం ఐం మనసా దేవ్యై స్వాహేతి కీర్తితః।
పంచలక్ష జపేనైవ మంత్రసిద్ధిర్భవేత్ నృణాం॥
మంత్రసిద్ధిర్భవేద్యస్య ససిద్దో జగతీ తలే ।
సుధాసమం విషం తస్య ధన్వంతరి సమో భవేత్ ॥
బ్రహ్మన్నాషాఢ సంక్రాంత్యాం గుడాశాఖాసు యత్నతః ।
ఆవాహ్య దేవీం మాసాంతం పూజయేద్యో హి భక్తిత:॥
పంచమ్యాం మానసాఖ్యాయాం దేవ్యై దద్యాచ్చయోబలిం ।
ధనవాన్ వుత్రవాంశ్చైవ కీర్తిమాన్ సభవేత్ ధ్రువం ॥
పై విధముగా మనసా దేవిని ధ్యానించి మూలమంత్రముతో పుష్పధూపదీప, అనులేపన, నైవేద్యాది షోడశోపచారములను చేయుచు ఆ దేవిని పూజింపవలెను.
మనసాదేవి మూలమంత్రము వేదములందు చెప్పబడినది. ఆది కల్పవృక్షము , వలె భక్తుల కోరికలనన్నిటిని తీర్చును. ఆ మంత్రము పన్నెండు అక్షరములు కలది.
“ఓం హ్రీం శ్రీం క్రీం ఐం మనసా దేవ్యై స్వాహా” అను ద్వాదశాక్షరమంత్రము మనసాదేవి మూలమంత్రము. దీనిని ఐదు లక్షల పర్యాయములు జపము చేసినచో మంత్రసిద్ధి కలుగును. ఈ మంత్రసిద్ది కలిగినవాడే సిద్దుడు, అతనికి విషము అమృతముతో సమానమగును. అతడు ధన్వంతరివలె సర్పములవలన ఇతరులకు కలిగిన విషమును పోగొట్టును.
నారదమహర్షీ! ఆషాఢ సంక్రాంతినాడు పత్తిచెట్టునందు మనసాదేవిని ఆవాహనచేసి ఆ నెల చివరివరకు ఆమెను పూజించుచుండవలెను. మానస(నాగ) పంచమినాడు మనసాదేవికి బలినిచ్చినచో ధనవంతుడగును. పుత్రులు కలిగియుండును. కీర్తివంతుడగును.
పూజావిధానం కథితం తదాఖ్యానం నిశామయ ।
కథయామీ మహాభాగ యచ్చ్రుతం ధర్మవక్త్రతః ॥
పురా నాగభయాక్రాoతా బభూవుర్మానసా భువి ।
యాన్యాన్ ఖాదంతీ నాగాళ్ళ న తే జీవంతి నారద ॥
మంత్రాంశ్చ ససృజే భీతః కశ్యపో బ్రహ్మణాఽర్థితః ।
వేదబీజానుసారేణ చోపదేశేన వేధసః ॥
మంత్రాధిష్ఠాతృ దేవీం తాం మనసార ససృజే తతః ।
తపసా మనసా తేన మానసా సా బభూవ హ ॥
కుమారీ సా చ సంభూయ చాగమచ్ఛంకరాలయం।
భక్త్యా సంపూజ్య కైలాసే తుష్టువే చంద్రశేఖరం ॥
దివ్యం వర్ష సహస్రం చ తం సిషేవే మునేః సుతా ।
ఆశుతోషో మహేశశ్చ తాం చతుష్టా బభూవరా॥
మహాజ్ఞానం దదౌ తస్యై పారయామాస సామ చ।
కృష్ణమంత్రం కల్పతరుం దదావష్టాక్షరం మునే ॥
నారదమహర్షీ! ఇంతవరకు నీకు మనసాదేవియొక్క పూజాపద్ధతిని చెప్పితిని. ఇక ఆ దేవి, చరిత్రను వినుము.
పూర్వము మానవులు సర్పములవలన బాధపడసాగిరి. అవి కరచినవారెల్ల చనిపోవసాగిరి. అప్పుడు బ్రహ్మదేవుడు వేడుకొనగా కశ్యపమహర్షి సర్పభయమును తొలగించు మంత్రములను సృష్టించెను. అట్లే బ్రహ్మదేవుని ఆజ్ఞపై వేదమునందలి బీజాక్షరములననుసరించి నాగమంత్రములకు అధిష్టాన దేవతయగు మానసాదేవిని సృష్టించెను.
కశ్యప ప్రజాపతీయొక్క తపోబలమువలన మనస్సంకల్పముతో పుట్టినందువలన ఆమెను మనసాదేవినిరి. ఆ కన్య పుట్టగనే కైలాసపర్వతమునకేగి శంకరుని భక్తితో పూజించి స్తుతించెను, దీవ్యములైన నూరు సంవత్సరములు ఆ మహాదేవుని పూజించగా ఆతడు సంతోషించి ఆమెకు మిక్కిలి జ్ఞానమును ప్రసాదించి సామవేదమును నేర్పెను. అట్లే ఆ దేవికి కల్పతరువువంటి అష్టాక్షరాత్మకమైన కృష్ణమంత్రమునుపదేశించెను.
లక్ష్మీ మాయా కామబీజం ఔంతం కృష్ణపదం తథా ।
ఓం శ్రీం హ్రం క్లీం కృష్ణాయ (నమః)
త్రైలోక్య మంగళం నామ కవచం పూజనక్రమం॥
స్తవనం సర్వపూజ్యం చ ధ్యానం భువన పావనం ।
పురశ్చర్యాక్రమం చాపి వేదోక్తం సర్వసమ్మతం॥
ప్రాప్య మృత్యుంజయాత్ జ్ఞానం పరం మృత్యుంజయం సతీ।
జగామ తపసే సాద్వీ పుష్కరం శంకరాజ్ఞయా ॥
త్రియుగం చ తపస్తప్యా కృష్ణస్య పరమాత్మనః ।
సిద్దా బభూవ సా దేవీ దదర్శపురతః ప్రభుం ॥
దృష్ట్వా కృశాంగీం బాలాం చ కృపయా చ కృపాం నిధిః ।
పూజాం చ కారయామాస చకార చ హరి: స్వయం ॥
వరం చ ప్రదదౌ తస్యై పూజీతా త్వం భవే భవ ।
వరం దత్ప చ కల్యాణ్యై పద్యశ్చాంతర్గదే నీభుః ॥
ప్రథమే పూజితా పా చ కృషేవ పరమాత్మనా ।
ద్వితీయ శంకరేశైవ కశ్యపేన సురేణ చ ॥
మమనా మునినా చైవ హ్యహినా మానవాదినా ।
బభూవ పూజితా సా చ త్రిషులోకేషు సుశ్రుతా ॥
జరత్కారుమునీంద్రాయ కశ్యపస్తాం దదౌ పురా ।
ఆయాచితో మునిశ్రేష్ఠో జగ్రాహ బ్రాహ్మణాజ్ఞయా ॥
లక్ష్మీ బీజమగు "శ్రీం", మాయాబిజమగు "హీం", కామబీజమగు "క్లీం" అనువాటితో చతుర్థి విభక్ష్యంతమైన కృష్ణశబ్దముతో ఉన్నది (నమస్కార పదము ఆంతమున గలది) శ్రీకృష్ణమంత్రము.
ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ (నమః) అనువది కృష్ణాష్టాక్షరీ మంత్రము. ఆ మంత్రముతోపాటు ముల్లోకములకు మేలును కలిగించు శ్రీకృష్ణ కవచమును పూజాక్రమమును, స్తోత్రమును, ధ్యానమును వేదములందు చెప్పబడిన శ్రీకృష్ణమంత్ర పురశ్చరణను శంకరునివల్ల మనసాదేవి పొందినది. అట్లే ఆమెకు పరమశివుడు మృత్యువును జయించు జ్ఞానమును కూడ ప్రసాదించెను.
ఆటుపిమ్మట మానసాదేవి శంకరుని ఆజ్ఞననుసరించి పుష్కర క్షేత్రమువకు. పోయి, అచ్చట శ్రీకృష్ణుని గురించి మూడు యుగములవరకు తపప్పుచేపి మంత్రసిద్ధిని పొంది కృష్ణ పరమాత్మ దర్శనము చేసికొన్నది.
శ్రీకృష్ణుడు తనముందు తపస్సు చేయుచు కృశించిపోయిన అవయవములు కల బాలికయగు మానసాదేవిని చూచీ దయాసముద్రుడైన నారాయణుడు తానే స్వయముగా ఆ మానసాదేవిని పూజించమ, తరువాత నీవు భూలోకమున పూజింపబడుదువని ఆమెకు వరమునిచ్చి ఆంతర్జానము చెందెను.
ఆ మానసాదేవినీ తొలుత పరమాత్మయగు శ్రీకృష్ణుడు పూజించగా, తరువాత శంకరుడు, ఆ తరువాత కశ్యపుడు, దేవతలు, మనువు, మునులు, సర్పములు, మానవులు మొదలగువారందరు పూజించిరి. ఈ విధముగా ఆ దేవి మూడు లోకములందు పూజలు పొందినది.
కశ్యప మహర్షి తన కన్యయగు మావతీదేవిని జరత్కారు మునీంద్రువకు యాచింపక పూర్వమే భార్యగా నివ్వగా ఆ మువి జరత్కారు దేవిని కశ్యప మహర్షి అజ్ఞవమసరించి స్వీకరించెను.
కృతోద్వాహం మహాయోగీ విశ్రాంతస్తపసా చీరం ।
సుష్వాప దేవ్యా జఘనే పటమూలే చ పుష్కరే ॥
నిద్రాం జగామ సముని: స్మృత్వా విధీశమీశ్వరం।
జగామాస్తం దినకరః సాయంకాల ఉపస్థితః ॥
సంచిత మనసా తత్ర మనసా చ పతివ్రతా ।
ధర్మ లోపభయేనైవ చకారాలోచనం సతీ ॥
ఆకృత్వా పశ్చిమాం సంధ్యాం నిత్యాం చైవ ద్వీజన్మనాం।
బ్రహ్మహత్యాదికం పాపం లభిష్యతి పతిర్మమ ॥
నోపతిష్థతి యః పూర్వాం నోపాస్తే యశ్చ పశ్చిమాం।
స సర్వదాఽశుచిర్నిత్యం బ్రహ్మహత్యాదీకం లభేత్ ॥
వేదోక్తమితి పంచింత్య బోధయామాస తం మువిం ।
స చ బుధ్వా మునిశ్రష్ఠస్తాం చుకోప భృశం కిల ॥
జరత్కారుమహర్షి జరత్కారువుమ వివాహము చేసికొని చాలా కాలము తపస్పును వదలివేసి పుష్కర క్షేత్రమున ఒకనాడు తన భార్య ఒడిలో పండుకొనెను. అప్పుడు నిద్రవచ్చుటచే నిద్రకు ఈశ్వరుడైన పరమాత్మను తలచుకొని నిద్రపోయేను. అప్పుడు సాయంకాలమయ్యెమ, ఆ సమయమువ పతివ్రతయైన మనసాదేవి ఇట్లు ఆలోచించాడు. బ్రాహ్మణుడు వీత్యకృత్యమైన పాయం సంధ్యము మరువరాదు. ఆ విధముగా చేసిన బ్రహ్మహత్యాపాతకమతనికంటును. ఉదయసంధ్యను సాయంసంధ్యమ చేయని ద్విజుడు ఎల్లప్పుడు ఆశుచీకాగలడు. అట్లే అతడు- బ్రహ్మహత్యాది పాపములను పొందును. ఇదీ వేదములలో చెప్పబడినది కావున ధర్మలోపము కలుగునని భయపడి జరత్కారుమునీవి విద్రలే పెను.
జరత్కారుముని లేచి నిద్రాభంగమునకు చాలా కోపగించెను.
జరత్కారురువాచ- జరత్కారుముని ఇట్లు పలికెను-
కథం మే సువ్రతే సాధ్వి నిద్రాభంగః కృతస్త్వయా ।
వ్యర్థం ప్రతాదికం తస్యా యా భర్చుశ్చాపకారిణీ ॥
తపశ్చానశం చైవ వ్రతం దానాదికం చయత్ ।
భర్తరప్రియకారిణ్యాః సర్వం భవతి నిష్ఫలం॥
యయాపతి పూజితశ్చ శ్రీకృష్ణ పూజితక్షయా।
పతివ్రతా ప్రతార్థం చ పతిరూపీ జనార్దనః॥
సర్వదావం సర్వయజ్ఞ సర్వతీర్థ నిషేవణం ।
సర్వం వ్రతం తపః పర్వం ఉపవాసాదికం చ యత్॥
సర్వధర్మశ్చ సత్యం చ సర్వదేవప్రపూజనం ।
తత్పర్వం స్వామిపేవాయాః కళార నార్హంతి షోడశీం॥
సుపుణ్యే భారతవర్ష పతిపేవాం కరోతి యా।
వైకుంఠం స్వామినాసార్థం సాయాతి బ్రహ్మణః పదం॥
విప్రియం కురుతే భర్తుః విప్రియం వదతి ప్రియం ।
అసత్కుల ప్రజాతా యా తత్ఫలం ప్రయతాం పతి॥
కుంభీపాకం వ్రజేత్సా చ యావచ్చంద్రదివాకరౌ ।
తతోభవతి చాండాలి పతిపుత్ర వివర్జితా ॥
ఇత్యుక్త్వా చ మునిశ్రష్ఠో బభూవ స్పురితాధరః।
చ కంపే మనసా సాద్వి భయేనోవాచ తం పతిం॥
భర్తను కష్టపెట్టు క్రీ చేయు వ్రతములు, తపము, దానము మొదలగునవన్నియు వ్యర్థమగును. భర్తను పూజించినచో శ్రీకృష్ణుని పూజించినట్లగును. పతివ్రతలయొక్క ప్రతములు చక్కగా పూర్తియగుటకు భగవంతుడగు శ్రీహరి ప్రతిరూపమున ఉండును. సమస్తదానములు, సమస్త యజ్ఞములు, సమస్తతీర్థ సేవనము, సమస్త వ్రతములు, సమస్త ఉపవాసములు, సమస్త ధర్మములు, సమస్త దేవతలను పూజించుటలు. ఇవన్నియు భర్త పూషా ఫలితముప పదహారవ వంతు కాజాలవు.
పవిత్రమైన ఈ భారతవర్షమువ భర్త సేవను చక్కగా చేయు స్త్రీ భర్తతో కలపి శ్రీకృష్ణ పరబ్రహ్మను చేరుకోగలదు.
భర్తను కష్టపెట్టు దుష్టస్త్రీ కుంభీపాకనరకమున సూర్యచంద్రులున్నంతవరకుండును. ఆ తరువాత పుత్రులు లేక భర్త చనిపోయి బాధపడును.
జరత్కారుమహర్షి ఇట్లు కోపముతో పలుకుచుండగా సాధ్వియగు జరత్కారు (మనసాదేవి) భయపడి ఇట్లు పలికెను.
మనసోవాచ- మనసాదేవి ఇట్లు పలికెను-
సంధ్యాలోపభయేనైవ నిద్రాభంగ: కృతస్తవ ।
కురుశాంతిం మహాభాగ దుష్టాయ మమ సుప్రత ॥
శృంగారాహార నిద్రాణాం యశ్చభంగం కరోతి చ ।
సవ్రజేత్కాలసూత్రం చ స్వామినశ్చ విశేషతః ॥
ఇత్యుక్త్వా మనసాదేవి స్వామినశ్చరణాంబుజే ।
పపాత భక్త్యా భీతా చ రురోద చ పునః పునః॥
చక్కగా వ్రతములను పరిపాలించు ఓనాథా! నీయొక్క సంధ్యావందనమువకు లోపము కలుగునవి వీకు విద్రాభంగము కలిగించితిని. దుష్టురాలైన నాద్వితీయ ఖండము - 46వ అధ్యాయము శాంతింపుము. శృంగారమునకు, ఆహారమునకు, నిద్రకు భంగము చేయువాడు, ఇంకను భర్తకు సంబంధించిన ఈ విషయములలో భంగము కలిగించు వ్యక్తి కాలసూత్రమనే నరకమునకు పోవును.
మనసాదేవి ఇట్లని తన భర్తయొక్క కాళ్ళపై భక్తితో ఏడ్చుచు పడెను.
కుపితం చ మునిం దృష్ట్యా శ్రీసూర్యం శప్తుముద్యతం ।
తత్రాజగామ భగవాన్ సంద్యయా సహ నారద॥
తత్రాగత్య మునిశ్రేష్ఠమవోచద్భాస్కరః స్వయం ।
వివయేన వినీతశ్చ తయాసహ యథోచితం ॥
జరత్కారుముని మనసాదేవి మాటలు విని ఆమెపై కోపమును వదిలి సూర్యుని శపింపబోను. అప్పుడు సూర్యుడు సంధ్యాదేవితో కలిపి అచ్చటకు స్వయముగా వచ్చి వినయముతో ఇట్లనెను.
శ్రీసూర్య ఉవాచ- శ్రీసూర్య భగవానుడిట్లనెను-
సూర్యాస్తమయం దృష్ట్యా ధర్మలోపభయేన చ।
త్వాం బోధయామాస నాహమస్తంగతస్తదా ॥
క్షమస్వ భగవన్ బ్రహ్మన్ మాం శప్తుం నోచితం మునే ।
బ్రాహ్మణానాం చ హృదయం నవనీత సమం సదా ॥
తేషాం క్షణార్ధం కోపశ్చ తతోభస్మ భవేజ్జగత్।
పున: స్రష్టుం ద్విజుః శక్తి న తేజస్వీ ద్విజాత్పరః ॥
బ్రహ్మణ్వంశసంభూతః ప్రజ్వలన్ బ్రహ్మతేజసా।
శ్రీకృష్ణం భావయేన్నిత్యం బ్రహ్మజ్యోతి: సనాతనం॥
సూర్యస్య వచనం శ్రుత్వా ద్వీజస్తుష్టోబభూవ।
సూర్యోజగామ స్వస్థానం గృహీత్వా బ్రాహ్మణాశిషం॥
ఓ మహర్షీ! నేను అస్తమించితినని భావించి బ్రాహ్మణధర్మము లోపించునము భయముచే నీ భార్య నిన్ను లేపినది. కాని వీజముగా నేనస్తమీంపలేదు. అందువలన ఓ మహర్షీ నీవు నన్ను క్షమింపుము. నన్ను శపించుట నీకు తగదు, బ్రాహ్మణుల హృదయము వెన్నువలెనుండును. వారికి కోపము వచ్చినను ఆరక్షణము మాత్రమే ఉండును. లేనిచో ఈ ప్రపంచమే భస్మమగును. ద్విజాడు ఈ లోకమును భస్మము చేసి తిరిగి సృష్టింపగలడు. అట్టి తేజస్వీ ఎవ్వరు కారు. బ్రాహ్మణుడు బ్రహ్మదేవుని వంశమున పుట్టి బ్రహ్మతేజస్సుచే ప్రకాశించుచు ప్రతిదినము సనాతనుడు వరంజ్యోతియగు శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించును.
సూర్యదేవుని మాటలకు జరత్కారు మహర్షి సంతృప్తి చెందినందువలన సూర్యుడు సంధ్యాదేవితో కలిసి స్వస్థానమునకు వెళ్ళిపోయెను.
తత్యాజ మనసాం విప్ర: ప్రతిజ్ఞా పాలనాయ చ।
రుదంతీం శోకయుక్తాం చ హృదయేన విదూయతా ॥
సా సస్మార గురుం శంభుం ఇష్టదేవం హరిం వీధిం।
కశ్యపం జన్మదాతారం వీపత్తౌ భయకర్శితా ॥
తత్రాజిగామ భగవాన్ గోపీశ శంభురేవ చ ।
విధిశ్చ కశ్యపశ్చైవ మనసాం పరిచింతయన్ ॥
స చ దృష్ట్వాఽభీష్ట దేవం నిర్గుణం ప్రకృతేః పరం ।
తుష్టావ పరయా భక్త్యా ప్రణనామ ముహుర్ముహుః ॥
నమశ్చకార శంభుం చ బ్రహ్మాణం కశ్యపం తథా ।
కథమాగమనం త్వత్రేత్యేవం ప్రశ్నం చకార పః॥
బ్రహ్మా తద్వచనం శ్రుత్వా సహసా సమయోచితం ।
తమువాచ నమస్కృత్య హృషీకేశ పదాంబుజం॥
యది త్యక్తా ధర్మపత్ని ధర్మిషా మనసా సతీ ।
కురుష్వాస్యాం సుతోత్పత్తిం ధర్మ సంస్థాపనాయ వై।
యతీర్వా బ్రహ్మచారీ వా భిక్షుర్వనచరోఽపి వా ।
జాయాయాం చ సుఖోత్పత్తిం కృత్వా పశ్చాద్భవేన్మునః ॥
అకృత్వా తు సుజోత్పత్తిం విరాగీ యస్త్యజేత్ప్రియాం ।
స్రవేత్తపస్తత్పుణ్యం చ చాలిన్యాం చ యథా జలం॥
జరత్కారు మహర్షి తన మనస్సు బాధపడుచున్నను తన మాట నిలబెట్టు కొమటకై దుఃఖముతో ఏడ్చుచున్న తన భార్యయగు మనసాదేవిని వదలి పెట్టెను.
మనసాదేవి ఈ ఆపత్సమయమున భయపడి తన గురువగు శంకరుని, ఇష్టదేవతయగు శ్రీహరిని, బ్రహ్మదేవుని, తండ్రియగు కశ్యపుని స్మరించుకోనగానే వారందరు మనసాదేవిని గూర్చీ చింతించుచు అచ్చటకు వచ్చిరి.
వారిని చూచి జరత్కారుమహర్షి ఆందరకు భక్తితో నమస్కరించి ఆగమన కారణమడిగెను. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీహరికి నమస్కరించి సమయోచితముగా ఇట్లు పలికెను.
జరత్కారు మహర్షి నీవు ధర్మముగా నడచుచున్న నీ ధర్మపత్నియగు మనసాదేవిని వదలి పెట్బ దలచినచో ధర్మమును రక్షించుటకై ఆమెయందు పుత్రుని కనుము. యతియైనను, బ్రహ్మచారియైనను, భిక్షుకుడైనను, చివరకు వానప్రస్థాశ్రమముననున్నను తన భార్యయందు కొడుకును కన్నతరువాతనే సన్యాసమును స్వీకరింపవలెను. .
తన భార్యయందు సంతానమును పొందక వైరాగ్యముతో భార్యను వదలి పెట్టినచో కాలువలో పడిపోవు నీటివలె అతని తపస్సు, పుణ్యము తొలగిపోవును.
బ్రహ్మణో వచనం శ్రుత్వా జరత్కారుర్మునీశ్వరః।
చక్రే తన్నాభి సంస్పర్శం యోగాద్యై మంత్రపూర్వకం ॥
తస్యై శుభాశిషం దత్వా యయుర్దేవాః ముదాన్వితాః ।
ముదాన్వితా చ మనసా జరత్కారుర్ముదాన్వితః॥
బ్రహ్మదేవుని మాటలు విని జరత్కారుమహర్షి యోగబలముతో మంత్రములు జపించుచు జరత్కారుదేవియొక్క నాభిని ముట్టుకొనెను, అప్పుడు దేవతలందరు ఆ జరత్కారుదేవికి (మనసాదేవికి) శుభాశీస్సుల నొసగి సంతోషముతో వెళ్ళిపోయిరి. ఆందువలన మనసాదేవి సంతోషపడెను. జరత్కారు మహర్షికూడ సంతోషించెను.
మునే: కరస్పర్శమాత్రాత్సద్యోగర్భో బభూవ హ।
మనసాయా మునిశ్రేష్ఠ మునిశ్రేష్ఠ ఉవాచ తాం॥
నారదమునీ జరత్కారు మహర్షియొక్క చేయి తగులగనే మనసాదేవికి సద్యోగర్భమాయెమ. ఆప్పుడు ఆ ముని ఆమెతో : ఇట్లు పలికెను.
జరత్కారురువాచ- జరత్కారు మహర్షి ఇట్లు పలికెను-
గర్భేణానేన మనసే తవపుత్రో భవిష్యతి ।
జితేంద్రియాణాం ప్రవరో ధర్మిష్ఠో వైష్ణవాగ్రణీః ॥
తేజస్వీ చ తపస్వీ చ యశస్వీ చ గుణాన్వితః।
వరో వేదవిదాo చైవ యోగినాం జ్ఞానినాం తథా ॥
స చ పుత్రో విష్ణుభక్తి ధార్మికః కులముద్ధరేత్ ।
నృత్యంత పితరః సర్వే జన్మమాత్రేణ వై ముదా॥
పతివ్రతా సుశీలా యా సుప్రియా ప్రియవాదినీ।
ధర్మిష్ఠా పుత్రమాతా చ కులజా కులపాలికా ॥
హరిభక్తి ప్రదోబంధుః తదిష్టం యత్సుఖప్రదం ।
యోబంధచ్ఛిత్స చ పితా హరేర్వర్త్మ ప్రదర్శకః॥
సాగర్బధారిణీ యా చ గర్భవాసవిమోచినీ ।
విష్ణుమంత్రప్రదాతా చ సగురుర్విష్ణు భక్తిదః ॥
గురుశ్చ జ్ఞానదాతా చ తత్ జ్ఞానం కృపభావసం ।
ఆబ్రహ్మస్తంబ పర్యంతం యతోవిశ్వం చరాచరం ॥
ఆవిర్భూతం తిరోభూతం కిం వా జ్ఞానం తదన్యతః ।
వేదజం యోగజం యద్యత్తత్సారం హరిసేవనం ॥
తత్వానాం సారభూతం చ హరేరన్యద్విడంబనం ।
దత్తం జ్ఞానం మయా తుభ్యం సస్వామి జ్ఞానదో హియః ॥
జ్ఞానాత్ప్రముచ్యతే బంధాత్ స రిపుర్యో హి బంధదః ।
విష్ణుభక్తియుత జ్ఞానం యోదదాతి సమై గురుః ॥
సరిపుః శిష్యఘాతీ చ యతో బంధాన్నమోచయేత్ ।
జననీ గర్భజాత్ క్లేశాత్ యమతాడనజాత్తథా ॥
న మోచయేద్య స కథం గురుః లాతో హి బాంధవః ।
పరమానందరూపం చ కృష్ణమార్గమనశ్వరం ॥
న దర్శయేద్యః స కథం కీదృశో బాంధవో నృణాం ।
భజ సాద్వి పరం బ్రహ్మాచ్యుతం కృష్ణం చ నిర్గుణం ॥
నిర్మూలం చ పురాకర్మ భవేద్యత్సేవయా ధ్రువం ॥
మయా ఛలేన త్వం త్యక్తా దోషం మే క్షమ్యతాం ప్రియే ।
క్షమాయుతానాం సాధ్వీనార సత్వాత్ క్రోధో నవిద్యతే॥
పుష్కరే తపసే యామి గచ్చ దేవి యథాసుఖం ।
శ్రీకృష్ణుచరణాంభోజీ ధ్యానవిచ్ఛేదకాతరః ॥
ధనాదిషుస్త్రియాం ప్రీతీ: ప్రవృత్తి పథగామినాం ।
శ్రీకృష్ణ చరణాంభోజే నిస్పృహాణాం మనోరథాః ॥
ఓ మనసాదేవి! నీకు కలుగబోవు పుత్రుడు జితేంద్రియులలో శ్రేష్ఠుడు. ధర్మిష్ఠుడు, వైష్ణవులలో గొప్పవాడు, తేజస్వి, యశస్వి, తపస్వి. సుగుణములఖని, వేదజ్ఞానముకలవారిలో శ్రేష్ఠుడు కాగలడు. అతడు విష్ణుభక్తుడై పరమధార్మికుడై నీ వంశమును ఉద్దరించును. ఆ శిశువు పుట్టగనే పితృదేవతలు సంతోషముతో నృత్యము చేయుదురు.
ఆ శిశువు యొక్క తల్లివగు నీవు పతీవ్రతవు. మంచి శీలముకలదానవు, ప్రియురాలవు, ప్రియముగా మాట్లాడు దానవు, ఆట్లే నీవు ధర్మమార్గమున నడుచుచున్నదానివి, కులమును రక్షించుదానవు.
హరిభక్తిని కలిగించు వాడే బంధువు. ఆ హరిభక్తి సుఖమును కలిగించునది. ఆందరకు ఇష్టమైనది. సంసార బంధమును ఛేదించువాడు. హరిభక్తిని కలిగించువాడే తండ్రియగును. గర్భవాసమను దుఃఖమును తొలగించునదే తల్లియగును. విష్ణుభక్తిని కలిగించువాడు శ్రీహరి మంత్రమును ఉపదేశించువాడే గురువు కాగలడు. జ్ఞానమును కళించువాడే గురువు. జ్ఞానమనగా శ్రీకృష్ణునీ ధ్యానముచేయుటయే. బ్రహ్మదేవుడు మొదలుకొని స్తంబమువరకున్న ఈ చరాచర జగత్తు ఆ శ్రీకృష్ణుని వలననే పుట్టుచున్నది. నశించుచున్నది. అందువలన ఆ శ్రీకృష్ణునకు సంబంధించినదే జ్ఞానము. ఇతరమైనదీ జ్ఞానము కాజాలదు. శ్రీహరి సేవనమే పరమార్థమైన జ్ఞానము. ఆది వేదసారమై, యోగసారమైయున్నది. అన్ని తత్వములకు ఆది సారముగా కన్పించును.
ఇట్టి శ్రీహరి సేవనమనే జ్ఞానమును నీకు ఇచ్చితిని. భర్తయైనవాడు పరమాత్మ జ్ఞానమును కలిగించవలెను. సంసార బంధమును కలిగించువాడు శత్రువు. విష్ణుభక్తిని కలిగించు జ్ఞానమిచ్చువాడే గురువు అట్లే సంసారబంధమునుండి విముక్తి కలిగించని గురువు శిష్యులకు అపకారముచేసిన వాడగును. అట్లే అతడు శత్రుతుల్యుడగుచున్నాడు. తల్లియొక్క గర్భవాస క్లేశమునుండి, నరకవాసమునుండి తప్పింపనివాడు, పరమానందరూపమైనది, శాశ్వతమైనది అగు శ్రీకృష్ణ మార్గమును చూపించనివాడు గురువు 'కాజాలడు, తండ్రి కాబోలడు, అట్లే బంధువు కాజాలడు.
అందువలన నీవు, బ్రహ్మ శ్రీహరులకంటె మిన్నయైనపాడు విర్గుణరూపుడు అగు శ్రీకృష్ణపరమాత్మను సేవింపుము. ఆతనిని సేవించినచో వీ పూర్వకర్మలన్నియు నిర్మూలనమగును.
ఓ ప్రియురాలా! నేను నిన్ను ఈ వ్యాజములో వదిలి పెట్టితినే తప్ప వీపై ప్రేమలేకకాదు. అందువలన వీపు నా తప్పును క్షమింపవలెను.
ఓర్సుకల స్త్రీలకు సత్వగుణమున్నందువలన వారికి కోపము సంభవింపదు. నేను పుష్కర క్షేత్రమున తపస్సుచేయుటకై పోపుచున్నాము. ఇచ్చట నున్నచో శ్రీకృష్ణ చరణాంభోజముననవ నాధ్యానము సడలిపోవచ్చుమ,
సాధారణముగా ప్రవృత్తి మార్గమున పోపు స్త్రీలకు ధనాదులపై ప్రేమ ఎక్కువగానుండును. కాని నిప్పుహులైనవారికి శ్రీకృష్ణుని పైననే భక్తియుండగలదు.
జరత్కారు వచః శ్రుత్వా మనసా శోకకాతురా ।
సా సాశ్రునేత్రా వినయాదువాచ ప్రాణవల్లభం ॥
జరత్కారుమహర్షి మాటలు విని మనసాదేవి దుఃఖముతో కన్నీళ్ళు రాలగా వినయముగా అతనితో ఇట్లనెను.
మనసోవాచ-మనసాదేవి ఇట్లు పలికెను-
దోషేణాహం త్వయాత్యక్తా నిద్రాభంగేన తే ప్రభో ।
యత్ర స్మరామి త్వాం బంధో తత్ర మామాగమిష్యసి ॥
బంధు భేదః క్లేశతమః పుత్రభేదస్తతః పరః ।
ప్రాణేశ భేదః ప్రాణానాం విచ్చేదాత్పర్వతః పరః ॥
పతి: పతివ్రతానాం చ శతపుత్రాధిక: ప్రియః ।
సర్వస్మాచ్చ ప్రియ: స్త్రీణాం ప్రయస్తేనోచ్యతే బుధైః ॥
పుత్రే యదైక పుత్రాణాం వైష్ణవానాం యథాహరౌ ।
నేత్రే యదైక నేత్రాణాం తృషితానాం యథాబలే ॥
క్షుధితానాం యథాన్నే చ కాముకానాం యథా స్త్రీయాం।
యథా పరస్వే చోరాణాం యథాజారే కుయోషితాం ॥
విదుషాం చ యథా శాస్త్రే వణిజ్యే వణిజాం యథా ।
తథా శర్వన్మనః కాంతే సాధ్వీనాం యోషితార ప్రభో॥
ఇత్యుక్త్యా మనసా దేవీ పపాత స్వామినః పదే।
క్షణం చకార క్రోడే తాం కృపయా చ కృపానిధి:॥
హే నాథ! నేను నీకు నిద్రాభంగము చేసితినన్న దోషముతో నన్ను వదిలి పెట్టితివి. ఆయినను నేను నిన్నెప్పుడు తలచుకొనిన ఆప్పుడు నీవు తప్పక రావలెను.
బంధువియోగముకన్న పుత్రవియోగము, దానికంటే పతివియోగము ప్రాణములు పోవు దానికంటెను బాధకలిగించును. పతివ్రతలగు స్త్రీలకు భర్త నూరుగురు కొడుకులకంటె ప్రియమైన వాడగుటచే అతనిని ప్రియుడందురు.
ఒకే పుత్రుడు కలవారికి ఆ పుత్రునివలె, విష్ణుభక్తులకు శంకరునివలె, దప్పిగొన్నవారికి నీటివల, ఆకలిగొన్నవారికి అన్నమువలె, కాముకులకు స్త్రీవలె, దొంగలకు ఇతరుల ధనమువలె, విద్వాంసులకు శాస్త్రమువలె, పరమ సాధ్వీమణులకు భర్త పైన ప్రేమయుండును,
ఈ విధముగా అని మనసాదేవీ భర్త పాదముల పై పడగా దయానిధియగు జరత్కారు మహర్షి ఆమెను క్షణకాలము తన ఒడిలోనికి తీసుకొనెను.
నేత్రోదకేన మనసాం స్నాపయామాస తాం మునిః ।
సాఽశ్రుణా చ మునేః క్రోడం సిషేవే ఖేదకాతరా॥
తదా జ్ఞానేన తౌ ద్వౌ చ విశోకా చ బభూవతుః ।
స్మారం స్మారం పదాంభోజం కృష్ణస్య పరమాత్మనః॥
జగామ తపసే విప్ర: స కాంతాం సుప్రబోధ్య చ ।
జగామ మనసా శంభో: కైలాసం మందిరం గురోః ॥
పార్వతి బోధయామాస మనసాం శోకకర్శితాం ।
శివశ్చాతివ బోధేన శివేన చ శివాలయే ॥
జరత్కారుమహర్షి తనభార్యయగు మనసాదేవిని ఒడిలోకి తీసికొని కన్నీరు కార్చెను. మనసాదేవి సైతము భర్తవియోగమునకు భయపడుచు ఏడ్చుచు భర్త ఒడిలోనికి చేరినది.
కొంతకాలమునకు వారిద్దరు శ్రీకృష్ణపరమాత్మను మాటిమాటికీ జ్ఞాపకము చేసికొనుచు శోకమును వదలి పెట్టిరి. జరత్కారుముని భార్యను చక్కగా ఓదార్చి తపస్సుచేసికొనుటకు వెళ్ళాను. మనసాదేవి తన గురువైన శంకరుడుండు కైలాసమునకు వెళ్ళినది. అచ్చట పార్వతీపరమేశ్వరులిద్దరు భర్భవియోగదు:ఖముతో కృశించి పోవుచున్న మనసాదేవిని ఊరడించిరి.
సుప్రశస్తే దినే సాధ్వీ సుషవే మంగళే క్షణే।
నారాయణాంశం పుత్రం చ జ్ఞానీనాం యోగినాం గురు: ॥
గర్భస్థితో మహాజ్ఞానం శ్రుత్వా శంకరవక్త్రతః ।
స బభూవ మహాయోగీ యోగినాం జ్ఞానినా గురుః ॥
జాతకం కారయామాస వాచయామస మంగళం ।
వేదాంశ్చ పారయామాస శివాయ చ శివః శిశో:॥
రత్నత్రికోటి లక్షం చ బ్రాహ్మణేభ్యో దదౌ శివః ।
పార్వతి చ గవాం లక్షం రత్నాని వివిధోనీ చ ॥
శంభుశ్చ చతురో వేదాన్ వేదాంగానీతరాంస్తథా ।
బాలకం పాథయామాస జ్ఞానం మృత్యుంజయం పరం ॥
భక్తిరాస్తే స్వకాంతే చాభీష్టే దేవే హరౌ గురౌ ।
యస్యాస్తే చ తత్పుత్రో బభూవాస్తీక ఏవ చ ॥
మనసాదేవి మంచిదినమున, మంచిముహూర్తమున నారాయణాంశ సంభూతుడు, జ్ఞానులకు యోగులకు గురువైన కుమారుని ప్రసవించెను. ఆ శిశువు తల్లి గర్భములో ఉండగానే పరమయోగియైన శంకరుని వలన మహాజ్ఞానమును పొంది తరువాత అతడు మహాయోగిగా, యోగులలో జ్ఞానవంతులలో శ్రేష్టుడుగా మారిను.
శంకరుడా శిశువునకు జాతక కర్మాది విధులను చేసి పుణ్యాహ మంగళమును చేసెను. అట్లే శిశువునకు శుభము కలుగవలెనని వేదములు చదివించెను. బ్రాహ్మణులకు అనేక రత్నములను దానముచేసెను. పార్వతీదేవి సహితము అనేక గోవులను, రత్నములను బ్రాహ్మణులకు దానము చేసెను. దినదిన ప్రవర్ధమానుడగుచున్న ఆ కుమారునకు శివుడు వేదములను, వేదాంగములను, ఇతరవిషయములను, మృత్యువును జయించు తత్వజ్ఞానమును ఉపదేశించెను.
మనసాదేవి భర్త ఆమెను వదలి పెట్టినను ఆతని పైన, ఆమెకభీష్ట దేవతయగు శ్రీహరి పైన, ఆమె గురువగు శంకరుని పైన అపారమైన భక్తియున్నందువలన ఆమె పుత్రునకు ఆస్తీకుడను పేరు వచ్చినది.
జగామ తపసే విష్ణో: పుష్కరం శంకరాజ్ఞయా ।
సంప్రాప్య చ మహామంత్రం తపశ్చ పరమాత్మనః ॥
దీవ్యం వర్షత్రిలక్షం చ తపస్తపా తపోధనః ।
జబిగామ మహాయోగీ నమస్కర్తుం శివం ప్రభుం ॥
శంకరం చ నమస్కృత్య పురః కృత్వా చ బాలకం।
సా చాజగామ మనసా కశ్యపస్యాశ్రమం పితు:॥
భాం సపుత్రాం సుతాం దృష్ట్వా ముదం ప్రాప ప్రజాపతిః ।
శతలక్షం చ రత్నానాం బ్రాహ్మణేభ్యో దదా మునే ॥
బ్రాహ్మణాన్ఫోజయామాస త్వసంఖ్యాన్ శ్రేయసే శిశోః ।
ఆదితిశ్చ దితిశ్చిన్యా ముదం ప్రాపుః పరం తథా ॥
సాసపుత్రా చ సుచీరం తస్థౌ తాతాలయే ముదా ।
తదీయం పునరాఖ్యానం వక్ష్యే త్వం తన్నిశామయ॥
ఆ బాలుడు శంకరుని ఆజ్ఞపై విష్ణువునుగూర్చి తపస్సు చేయుటకు పుష్కర క్షేత్రమునకు వెళ్ళి అచ్చట మూడులక్షల దివ్య సంవత్సరములు శ్రీమన్మహావిష్ణువును గూర్చి తపమాచరించి మహాయోగియై కైలాసమునకు వచ్చి శివుని నమస్కరించెను.
మనసాదేవి శంకరుని వద్ద అనుజ్ఞతీసికొని తన పుత్రునివెంట పెట్టుకొని తండ్రియగు కశ్యప ప్రజాపతి ఆశ్రమమునకు వచ్చినది. కశ్యప ప్రజాపతి తనకూతురును, మనుమని చూచి అమితానందమునొంది బ్రాహ్మణులకు అంతులేని దానములు చేసెను. ఆటే ఆ బాలునికి శుభము కలుగుటకై బ్రాహ్మణుల కందరికి అన్నదానము చేసెను. మనసాదేవిని, ఆమె పుత్రుడైన ఆస్తీకమునిని చూచీ దితి, అదితి మొదలగు కశ్యపుని భార్యలందరు సంతోషపడిరి. ఈ విధముగా మనసాదేవి తండ్రి దగ్గర తనపుత్రునితో కాలము గడపుచుండెను.
నారదమహర్షికి మనసాదేవి కథను నీకు తరువాత వినిపించెదను. ప్రస్తుతము నేను చెప్పుదానిని వినుము.
అథాభిమన్యునయే బ్రహ్మశాపః పరీక్షితే ।
బభూవ సహసా బ్రహ్మన్ దైవదోషేణ కర్మణా ॥
సప్తాహే సమతీతతు తక్షకన్యం చ దలక్ష్యతి ।
శశాప శృంగీ కౌశిక్యా జలం సంసశ్య చేతిసః ॥
రాజాశ్రుత్వా తత్ర్పవృత్తం గంగాద్వారం జగామ సః ।
తత్ర తఽస్థౌ చ సప్తాహం శుత్రనే ధర్మసంహితాం॥
సప్తా హే సమతీవేతు గచ్ఛంతం తక్షకం పఠి ।
ధన్వంతరిర్మోచయితుమపశ్యద్గంతుకో నృపం ॥
తయోర్బభూవ సంవాదః సుప్రీతిశ్చ పరస్పరం ।
ధన్వంతరే: మణిం శ్రేష్ఠం తక్షకః స్వేచ్ఛయా దదౌ ॥
సయమౌ తం గృహీత్వా తు తుష్ట సంహృష్ట మానసః ।
అపశ్యతక్షకస్తూ ర్ణం సృపం మంచక సంస్థితం॥
రాజా జగామ వైకుంఠం స్మారం స్మారం హరింగురుం ।
సంస్కారం కారయామాప పితు ర్వై జనమేజయః ॥
ఒకప్పుడు కౌరవ వంశమున పుట్టిన అభిమన్యునీ పుత్రుడైన పరీక్షిత్తునకు దురదృష్టము వలన శమీకముని పుత్రుడైన శృంగిముని ఏడు దినములలో నిన్ను తక్షకుడు చంపుననీ శాపమునిచ్చెను. పరీక్షిన్మహారాజావిషయమును తెలుసుకొని గంగానదీ తీరమునకు పోయి, ఆ ఏడు దినములలో ధర్మసంహితయగు భాగవతమును వినుచుండెను.
ఏడు దినములు గడిచిన పిమ్మట ఆ పరీక్షిత్తును కాటువేయదలచి తక్షకుడు పోవుచుండగా వైద్యులలో మిక్కిలి షుడైన ధన్వంతరి మహారాజును తక్షక వీషమునుండి కాపాడుటకు పోవుచుండెను. మార్గమధ్యమున తక్షకునకు ధన్వంతరికి మధ్య మాటలు స్నేహపూర్వకముగా జరిగినవి. అప్పుడు తక్షకుడు ధన్వంతరికీ అమూల్యమైన మణిని ఇచ్చి పంపించెను. ఆ తరువాత తక్షకుడు మంచెపైనున్న మహారాజును కాటువేసెను. అందువలన పరీక్షిన్మహారాజు శ్రీహరినీ మాటిమాటికి స్మరించుచు చనిపోయెను, అతని పుత్రుడగు జనమేజయుడు తండ్రికి పితృ సంస్కారములనన్నిటిని కావించెను.
రాజా చకార యజ్ఞం చ సర్పసత్రాభిధం మునే ।
ప్రాణాంస్తత్యాజ సర్పాణాం సమూహో బ్రహ్మ తేజసా ॥
స తక్షకశ్చ భీతశ్చ మహేంద్రం శరణం యయౌ ।
సేంద్రం చ తక్షకం హంతుం విప్రవర్గః సముద్యతః ॥
అథదేవాశ్చమునయశ్చాయయు ర్మనసాంతికం ।
తాం తుష్టావ మహేంద్రశ్చ సమక్షం భయ కాతరః ॥
తత్ర ఆస్తీక ఆగత్య మాతుర్యజ్ఞమథాజ్ఞయా ।
మహేంద్ర తక్షక ప్రాణాన్యయాచే భూమీపం పరం ॥
దదౌ వరం నృపశ్రేష్ఠః కృపయా బ్రాహ్మణాజ్ఞయా ।
యజ్ఞం సమాప్య విప్రేభ్యో దక్షిణాం చ దదౌ ముదా ॥
విప్రాశ్చ మునయో దేవా గత్వా చ మనసాంతికం ।
మనసాం పూజయామాసున్తుష్టువుశ్చ పృథక్ పృథక్ ॥
శక్రః సంభృత సంభారోభక్తియుక్తః సదాశుచిః।
మనసాం పూజయామాస తుష్టాన పరమాదరాత్ ॥
ఉపచారైః షోడశభిర్బలిం దత్వా ప్రియం తదా ।
ప్రదదౌ పంతుష్టశ్చ బ్రహ్మవిష్ణు సురాజ్ఞయా ॥
సంపూజ్య మనసాదేవీం ప్రయయుః స్వాలయం చ తే ।
ఇత్యేవం కథితం సర్వం కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥
జనమేజయ మహారాజు సర్పముల పైగల కోపముచే సర్పయజ్ఞమును తలపెట్టెను. ఆ యజ్ఞమున సర్పములన్నియు తండోపతండములుగా వచ్చి చనిపోవుచుండెను.
ఆందువలన తక్షకుడు భయముతో మహేంద్రుని శరణువేడగా దానిని గమనించిన బ్రాహ్మణవర్గము మహేంద్రునితో కలిపి తక్షకుని యాగమున సంహరించుటకు ప్రయత్నించినది. అందువలన దేవతలు మునులు భయపడి మనసాదేవి దగ్గరకు వచ్చి ఆమెను స్తుతించిరి. అప్పుడు మనసాదేవి పుత్రుడైన ఆస్తీకుడు తల్లి ఆజ్ఞననుసరించి యజ్ఞవాటికకు వచ్చి మహారాజగు జనమేజయుని తక్షకుడు, మహేంద్రుల ప్రాణములను కాపాడుమనీ అడిగెను.
జనమేజయుడు తన యజ్ఞ నిర్వాహకులైన ఋత్విక్కుల అనుజ్ఞపై ఆస్తీకుడు కోరిన వరమునిచ్చెను. ఆ తరువాత యజ్ఞమును పూర్తిచేసి బ్రాహ్మణులందరకు దక్షిణలొసగెను.
మనసాదేవి చేసిన సహాయమునకు సంతుష్టులైన దేవతలు, మునులు, మానవులందరు మనసాదేవి దగ్గరకు వెళ్ళి ఆమెను మిక్కిలి గౌరవముతో పూజించిరి. దేవేంద్రుడు ఆదరములో షోడశోపచారములలో మనసాదేవిని స్తోత్రము చేసి పూజించెను అటు పిమ్మట వారందరు తమతమ ఇండ్లకు పోయిరి.
నారదమునీ! ఇంతవరకు మనసాదేవి చరిత్రను నీకు చెప్పితిని. ఇంకను నీవు వినదలచినదేదైన ఉన్నచో ఆడుగుమని నారాయణుడనెను.
నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను-
కేన స్తోత్రేణ తుష్టావ మహేంద్రో మనసాం సతీం ।
పూజావిధిక్రమం తస్యాః శ్రోతుమిచ్ఛామి తత్వతః॥
నారాయణమునీ! దేవేంద్రుడు మనసాదేవిని ఏ స్తోత్రముచే స్తుతించెనో ఏవిధముగా పూజించెనో నాకు వివరముగా తెలుపుడు.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
సుస్నాతః శుచీరాచాలతో ధృత్వా దౌతే చ వాససీ ।
రత్నాసింహాసనే దేవీం వాసయామాస భక్తితః ॥
స్వర్గగంగాజలేనైవ రత్నకుంభస్థితేన చ ।
స్నాపయామాస మనసాం మహేంద్రో వేదమంత్రతః ॥
వాససీ వాసయామాస వహ్నిశుద్దే మనోరమే ।
సర్వాంగే చందనం లిప్త్వా పాద్యార్ఘ్యం భక్తిసంయుతః ॥
గణేశం చ దినేశం చ వహ్నిం విష్ణుం శివం శివాం ।
సంపూజ్య దేవషట్కం చ పూజయామాస తాం సతీం ॥
ఓం హ్రీం శ్రీం మనసా దేవ్యై స్వాహేత్యేవం చ మంత్రతః ।
దశాక్షరేణ మంత్రేణ దదౌసర్వన్యథోఽచితం ॥
ఉపచారాన్ షోడశకాన్ భక్తితో దుర్లభాన్ హరి: ।
పూజయామాస భక్త్యా చ బ్రహ్మణా ప్రేరితో ముదా॥
వాద్యం నానాప్రకారం చ వాదయామాస తత్ర వై ।
బభూవ పుష్పవృష్టిశ్చ నభసో మనసోపరి॥
దేవో విప్రాజ్ఞయా తత్ర బ్రహ్మవిష్ణు శివాజ్ఞయా ।
తుష్టావ సామ్రనేత్రశ్చ పులకాంచిత విగ్రహః ॥
దేవేంద్రుడు చక్కగా స్నానముచేసి శుచియై ఉదీకిన వస్త్రములు ధరించీ భక్తితో మనసాదేవిని పూజించెను. ఆమెను రత్నసింహాసనమున ఉంచీ రత్నకుంభమున నున్న ఆకాశగంగ యొక్క జలముచే ఆ దేవినీ మంత్రపూర్వకముగా అభిషేకించేను. తరువాత పరిశుద్ధమైన వస్త్రముల వా దేవికి ఆతడు సమర్పించుకొనెను. ఆ దేవి శరీరంమంతట చందనమునద్దీ భక్తితో అర్ఘ్య పాద్యాదికములనిచ్చెను. .
తొలుత గణపతిని, సూర్యునీ, అగ్నినీ, విష్ణువును, శివుని, దుర్గను, ఈ ఆరుగురు దేవతలను పూజించి ఓం హీం శ్రీం మనసా దేవ్యై స్వాహా యను దశాక్షరమంత్రముతో 'షోడశోపచారములను సమర్పించెను. తరువాత అనేక విధములైన వాద్యములను మ్రోగించెను. అప్పుడు మనసాదేవి పై పుష్పవర్షము కురిసినది. ఆ తరువాత బ్రాహ్మణులు త్రిమూర్తుల ఆజ్ఞ గైకొని కన్నీళ్ళు ప్రవీంచగా మనసాదేవిని ఇట్లు స్తుతించెను.
మహేంద్ర ఉవాచ- మహేంద్రుడిట్లనెను-
దేవిత్వాం స్తోతుమిచ్ఛామి సాద్వీసాం ప్రవరాం వరారి।
పరాత్పరాం చ పరమాం నహిస్తోతుం క్షమ్మోఽధునా ॥
స్తోత్రాణాం లక్షణం వేదే స్వభావాఖ్యానతః పరం।
నక్షమ: ప్రకృతిం వక్తుం గుణానాం తవ సుప్రతే ॥
శుద్ధ సత్వస్వరూపాత్వం కోపహింసా వివర్జితా ।
న చ శస్తోమునిస్తేన త్యక్తాయా చ త్వయాయతః ॥
త్వం మయా పూజితాసాధ్వీ జననీ చ యథాఽదితిః ॥
దయారూపా చ భగినీ క్షమారూపాయథా ప్రసూః।
త్వయా మే రక్షితాః ప్రాణాః పుత్రదారాః సురేశ్వరి ॥
అహం కరోమి త్వాం పూజ్యాం మమప్రీతీశ్చ వర్ధతే ।
నిత్యం యద్యపి పూజ్యా త్వం భవేఽత్ర జగదంబికే ॥
తథాఽపి తవపూజాం వైవర్ధయామి పునః పునః ।
యే త్వామాషాఢ సంక్రాంత్యాం పూజయిష్యంతి భక్తితః ॥
పంచమ్యాం మనసాభ్యాయాం మాసాంతేవా దీనేదినే ।
పుత్రపౌత్రాదయ: తేషాం వర్ధంతే చ ధనాని చ ॥
యశస్వినః కీర్తిమంలో విద్యావంతో గుణాన్వితాః ।
యే త్వాం న పూజయిష్యంతి నిందంత్యజ్ఞానతో జనాః ॥
లక్ష్మీ హీన భవిష్యంతి తేషాం సాగభయం సదా ।
త్వం స్వర్గలక్ష్మీ: స్వర్గే చ వైకుంఠే కమలా కళా॥
నారాయణాంశో భగవాన్ జరత్కారుర్మునీశ్వరః ।
తపసా తేజసా త్వాం చ మనసా ససృజే పితా ॥
అస్మాకం రక్షణాయైవ తేన త్వం మనసాభిధా।
మనసా దేవితుం శక్తి చాత్మనా సిద్ధయోగినీ ॥
తేన త్వం మనసాదేవీ పూజితా వందితా భవే।
యాం భక్త్యా మనసా దేవా పూజయంత్యనిశం భృశం ॥
తేన త్వాం మనసాం దేవీం ప్రవదంతి పురావీదః।
సత్వరూపా చ దేవీ త్వం శశ్వత్సత్య నిషేవయా ॥
యో దా యద్భావయేన్నిత్యం శతం ప్రాప్నోతి తత్సమం।
ఓ మనసాదేవి! పతివ్రతలలో శ్రేష్ఠురాలవగు నిన్ను స్తుతింపవలెనని అనుకొనుచున్నాను. పరాత్పరవు పరమస్వరూపనగు నిన్ను ఇప్పుడు స్తుతింపలేను.
వేదములలో స్తోత్రలక్షణము స్వభావమును తెలుపుట అని వివరించబడినది. కానీ ఓ దేవి ,నీ గుణములను నేను చెప్పలేను. నీవు శుద్ధ సత్వ గుణస్వరూపవు, హింస, కోపాది దుర్గుణములు లేని దానవు, అందువలననే జరత్కారుముని నిన్ను ఆకారణముగ వదలి పెట్టినపుడు అతనిని శపింపక వదలిపెట్టితివి.
నేమ నా తల్లిగు అదితిదేవి వలె నిన్ను పూజింతుము. దయారూపిణివేన సోదరివలె క్షమారూపయగు తల్లివలె వీపు నా ప్రాణములను, నా భార్యా పిల్లలను రక్షించితివి, నీవు ఈ లోకమున అందరిచే పూజలనందుకొనుచున్నమ నిన్ను పూజించవలెవను కోరిక నాలో పెరుగుచున్నది. నిన్ను అందరు పూజించునట్లు ప్రచారము చేయుదును.
నిన్ను ఆషాఢ సంక్రాంతినాడు, మనసా పంచమినాడు (నాగపంచమి) లేక అమావాస్యనాడు కాక ప్రతిదినము భక్తితో నిన్ను పూజించువారికి పుత్ర పౌత్రాభివృద్ధి, ధనాభివృద్ధి జరుగుమ. నిన్ను పూజించువారు యశసు, విద్య, గుణములు కలియుందురు.
విన్ను పూజింపక పోయినను, అజ్ఞానమున నిందించినను వారు లక్ష్మీహీనులగుదురు. వారికెల్లప్పుడు సర్పభయము కలుగును.
నీవు స్వర్గమున స్వర్గలక్ష్మిగా, వైకుంఠమున లక్ష్మీదేవిగా పేరు పొందినావు. జరత్కారు మునీశ్వరుడు నారాయణాంశుడు కాపున లక్ష్మీదేవి అంశమగునీవు అతని భార్యవైతివి.
సీతండ్రి మమ్ము రక్షించుటకై తన తపస్పును తేజస్సును వెచ్చించి తన మనసుంకల్పముచేతనే విన్ను సృష్టించెను. అందువలన నీవు మనసాదేవి ప్రతీతి. సిద్ధయోగినివగు నీవు నీ మనోబలముచే అంతట తిరుగు శక్తి కలదావవగుటవలన నిన్ను మనసాదేవియనీర్. లేక దేవతలెల్లప్పుడు విన్ను మనస్సులో ధ్యానింతురు కావున మనసాదేవినైతివి. నీఎల్లప్పుడు సత్వగుణమును సేవించుటవలన సత్వ స్వరూపమైతివి.
ఇంద్రశ్చ మనసాంస్తుత్వా గృహిత్వా భగినీం చ తాం॥
నిర్జగామ స్వభవనం భూషాపపరిచ్ఛదాం ।
పుత్రేణసార్థం సా దేవీ చీరం తస్థౌపితుర్గృహే ॥
భ్రాతృభిః పూజితా శశ్వన్మాన్యా వంద్యా చ సర్వతః ।
గోలోకాత్సురభీ బ్రహ్మన్ తత్రాగత్య సుపూజితాం ॥
తాం స్నాపయిత్వా క్షీరేణ పూజయామాస సాదరం ।
జ్ఞానస్య కథయామాస స్వరూపం సర్వదుర్లభుం ॥
తదా దేవైః పూజితా సా స్వర్గలోకం పునర్యయౌ॥
ఇంద్రుడు మనసాదేవిని స్తుతించి సోదరియగు ఆమెను స్వర్గలోకమువమన్న తవ గృహమునకు తీసికొని వెళ్ళాను. ఆదేవి తండ్రిదగ్గర తన కుమారునితో కలిసి చాలాకాలముండెను. అచ్చట ఆమె సోదరులచే మన్ననలను పొందుచుండెను. అప్పుడు గోలోకమునుండి సురభి అచ్చటికి వచ్చి తన క్షీరములచే ఆ దేవికి స్నానముచేసి పూజించేమ. ఆమె అచ్చట అందరకు సహజముగా లభించని జ్ఞానమును ఉపదేశించెను.
ఆందువలన దేవతలా మనసాదేవిని పూజించుచు మరల స్వర్గలోకమునకు తీసికొనిపోయిరి.
ఇదం స్తోత్రం పుణ్యబిజం తాం సంపూజ్యచ యః పఠేత్ ।
తస్య నాగభయం నాస్తి తస్య వంశే భవేచ్చ యః ॥
విషం భవేత్సుధాతుల్యం సిద్ధస్తోత్రం యదా పఠేత్।
పంచలక్షజపేనైవ సిద్ధ స్తోత్రో భవేన్నరః॥ సర్పశాయీ భవేత్సోఽపి విశ్చితం పరవాహనః ॥
పుణ్యమువకు కారణమైన ఈ స్తోత్రమును పూజించి చదువువారికి, వారి వంశపువారికి నాగభయమమనది ఉండదు. ఈ స్తోత్రమును ఐదులక్షల పర్యాయములు జపించినచో పొత్రము సిద్ధిపొందును. అప్పుడతనికి వీషము అమృతము పలెనగును. అతడు సర్పములపై పడుకొన్నమ, సర్పవాహమడైవమ విశ్చింతగా ఉండవచ్చును.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తి మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే వారదనారాయణ, పరపాదే మనపోపాఖ్యానే తదుత్పత్తి పూజాస్తోత్రాది కథనం వామ షట్చత్వారింశత్రమోఽధ్యాయః ॥
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమునందలి రెండవదైన ప్రకృతిఖండమున పారద. వారాయణుల సంవాదసమయమున శిల్పబడిన మనసోపాఖ్యానమున మమపాదేవి పుట్టుక, ఆమె పూజూవత్రాదులు గల నలభై యారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 45 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
A war of unprecedented scale erupted as Mahishāsura's massive armies clashed with Goddess Durgā, who rode Her lion into the battlefield like a blazing cosmic fire. Mahishāsura used his terrifying shape-shifting powers, transforming successively into a giant elephant, a roaring lion, a ferocious warrior, and a wild buffalo to overpower the Divine Mother. With effortless grace, divine laughter, and supreme martial skill, Goddess Durgā destroyed his demon generals, severed his magical illusions, and finally severed the head of the buffalo demon with Her razor-sharp disc, liberating the three worlds from demonic oppression.