బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

 48 - రాధోపాఖ్యాన ప్రారంభము

నారద ఉవాచ- నారదమహాముని ఇట్లనెను-

సారాయణ మహాభాగ సారాయణ పరాయణ

నారాయణాంశ భగవన్ బ్రూహి నారాయణీం కథాం

శ్రుతం సురభ్యుపాఖ్యానం ఆతీవ సుమనోహరం

గోప్యం సర్వపురాణేషు పురావద్భిః ప్రశంసితం

ఆధునా శ్రోతుమిచ్ఛామి. రాధికాఖ్యానముత్తమం

తదుత్పత్తిం చ తద్ద్యానం స్తోత్రం కవచముత్తమం

నారాయణపరాయణుడవు, నారాయణాంశ సంభూతుడవు ఆగు నారాయణమునీ! నాకిప్పుడు నారాయణునకు సంబంధించిన కథలను వివరింపుము.

ఇంతవరకు మీరు నాకు సురభి ఉపాఖ్యానమును చాలా చక్కగా వివరించితిరి. ఇది అన్ని పురాణములందు రహస్యముగా కన్పించును. దీనిని పురాణ వీదులందరు. ప్రశంసింపుచుందురు.

ఇక ఇప్పుడు నాకు ఉత్తమమైన రాధా ఉపాఖ్యానమును, రాధాదేవి జనమును, ఆమె ధ్యానమును, స్తోత్రమును, కవచమును నాకు విపరముగా తెలుపుడు అని పలికెను.

శ్రీ నారాయణ ఉవాచ- నారాయణు డిట్లు పలికెను-

పురాకైలాస శిఖరే భగవంతం సనాతనం

సిద్దేశం సిద్ధిదం సర్వస్వరూపం శంకరం పరం

ప్రపుల్లవదనం ప్రీతం సస్మితం మునిభిః స్తుతం

కుమారాయ ప్రరోచంతం కృష్ణస్య పరమాత్మనః

రాసోత్సవ రసాఖ్యానం రాసమండలవర్ణనం

తదాఖ్యానావసానే చ ప్రస్తావావసరే సతీ

పప్రచ్చ పొర్వతీ స్పీతా సస్మితా ప్రాణవల్లభం

స్తవనం కుర్వతీ భీతా ప్రాణేశన ప్రసాదితా

ప్రోవాచ తం మహాదేవం మహాదేవీ సురేశ్వరీ

ఆపూర్వం రాధికాఖ్యానం పురాణేషు సుదుర్లభం

పూర్వకాలమున కైలాసపర్వతమున భగవంతుడు, సనాతనుడు, సిద్దేశుడు, సిద్దులను కలిగించువాడు, సమస్త స్వరూపుడగు శంకరుని మునులు సేవించుచుండగా తన పుత్రుడగు కుమారస్వామికి శ్రీకృష్ణపరమాత్మయొక్క రాసోత్సవ కథలను మధురముగా వినిపించుచుండెను.

ఆ సమయమున పార్వతీదేవి భయపడుచు తన ప్రాణవల్లభుడగు మహాదేవుని దగ్గరకు వచ్చి అపూర్వమైన రాధికాఖ్యానము చెప్పుమని ఆడిగెను.

శ్రీ పార్వత్యువాచ- శ్రీపార్వతీదేవి ఇట్లనెను-

ఆగమం నిఖిలం నాథ శ్రుతం సర్వమనుత్తమం

పాంచరాత్రాదికం నీతిశాస్త్ర యోగం చ యోగినాం

సిద్ధానాం సిద్ధిశాస్త్రం చ నానాతంత్రం మనోహరం

భక్తానాం భక్తిశాస్త్రం చ కృష్ణస్య పరమాత్మనః

దేవీనామపి సర్వాసాం చరితం త్వన్ముఖాంబుజాత్

అధునా శ్రోతుమిచ్ఛామి రాధికాఖ్యాన ముత్తమం

శ్రుతౌ శ్రుతం ప్రశస్తం చ రాధాయాశ్చ సమాసతః

త్వన్ముఖాత్కాణ్వ శాఖాయం వ్యాసేనోక్తం వదాధునా

ఆగమాఖ్యాన కాలే చ భవతో స్వీకృతం పురా

నహీశ్వరవ్యాహృతిశ్చ మిథ్యా భవితుమర్హతి

తదుత్పత్తిం చ తద్ద్యానం నామ్నో మహాత్మ్యముత్తమం

పూజావిధానం చరితం స్తోత్రం కవచముత్తమం

ఆరాధన విధానం చ పూజాపద్దతి మీప్సితాం

సాంప్రతం బ్రూహి భగవన్మాభక్తాం భక్తవత్సల

కథం కథితం పూర్వమాగమాఖ్యాన కాలతః

పార్వతి వచనం శ్రుత్వా నమ్ర వక్త్రో బభూవ సః

నాథ! నీవు చెప్పగా పాంచరాత్రము మొదలగు సమస్త ఆగమశాస్త్రములను, నీతి శాస్త్రమును, యోగశాస్త్రమును, సిద్ధులకు సిద్ధిశాస్త్రము, భక్తులకు భక్తిశాస్త్రము ఆగు శ్రీకృష్ణ పరమాత్మ చరిత్రమును మనోహరముగా వింటిని,

అట్లే సమస్త దేవతాస్త్రీల చరిత్రలు కూడ వినవలెనని నాకు కోరిక కలదు. ప్రస్తుతము ఆ దేవతాస్త్రీలలో ప్రముఖురాలగు రాధికాదేవి చరిత్రను తెలిసికొనవలెనని ఆనుకొనుచున్నాను.

రాధాదేవియొక్క ప్రశస్తమైన చరిత్ర వేదములలో సంక్షేపముగా కనిపించుచున్నది. నీవు దానిని కాణ్వశాఖయందున్నట్లు చెప్పితివి. దానినిప్పుడు వివరించి నాకు చెప్పుము.

రాధాదేవియొక్క జన్మవృత్తాంతమును, ఆమెయొక్క ధ్యానమును, ఆమె నామమాహత్మ్యమును, పూజావిధానమును, చరిత్రను, స్తోత్రమును, కవచమును, ఆరాధనా విధానమునంతయు నీ భక్తురాలనగు నాకు చెప్పుము ఆని ఆడిగెను.

అప్పుడు శ్రీ మహాదేవుడు కొద్దిగా సిగ్గుపడెను.

పంచవ క్త్రశ్చ భగవాన్ శుష్కకంఠౌష్ఠ తాలుకః

స్వసత్య భంగభీతశ్చ మౌనీభూయ విచింతయన్

సస్మార కృష్ణం ధ్యానేనాభీష్ట దేవం కృపానిధిం

తదనుజ్ఞాం చ సంప్రాప్య స్వార్ధాంగాం తామువాచ సః

నిషిద్దోఽహం భగవతా కృష్ణేన పరమాత్మనా

ఆగమారంభసమయే రాధ ఖ్యాన ప్రసంగతః

మదర్థాంగ స్వరూపా త్వం నమద్భిన్నా స్వరూపతః

అతనుజ్జం దదౌకృష్ణా మహ్యం వస్తుం మహేశ్వరి

మదీష్టదేవకాంతా యా రాధాయాశ్చరితం సతి

ఆతీవ గోపనీయం చ సుఖదం కృష్ణభక్తిరం

జానామీ తదహాం దుర్గే సర్వం పూర్వాపరం వరం

యజ్ఞానామీ రహస్యం చ నతద్ర్బహ్మా ఫణీశ్వరః

న తత్సనత్కుమారశ్చ న చ ధర్మసనాతనః

 న దేవేంద్రో మునీంద్రాశ్చ సిద్దేంద్ర సిద్దపుంగవా

మతౌబలవతీ త్వం చ ప్రాణాంస్యక్తుం సముద్యతా

 ఆతస్త్యాం గోపనీయం చ కథయామి సురేశ్వరీ

 శ్రుణు దుర్గే ప్రవక్ష్యామి రహస్యం పరమాద్భుతం

చరితం రాధికాయాశ్చ దుర్లభం చ సుపుణ్యదం

ఐదు ముఖములు కల మహాదేవుడు పార్వతీదేవియొక్క మాటలువిని నోరు నాలుక ఎండిపోయినను, తన మాటనే తాను తప్పుట పాడిగాదని క్షణకాలము - మౌనముగా ఉండిపోయి, తనకు ఇష్టదేవతయగు శ్రీకృష్ణుని ధ్యానించెను. తరువాత శ్రీకృష్ణుని అనుజ్ఞను పొంది పార్వతితో ఇట్లు చెప్పసాగెను.

ఓ దుర్గా! ఆగమములు రచించువేళ శ్రీకృష్ణపరమాత్మ నన్ను రాధాదేవి చరిత్రను అందరకు చెప్పవద్దని నిషేధించెను.

నీవు నాకు అర్థాంగివి. నా కంటే భిన్నమైన దానవుకాదు. కావున శ్రీకృష్ణ దేవుడు రాధాదేవి చరిత్ర నీకు చెప్పుటకు అనుమతి నొసంగెను. రాధాదేవి నాకు ఇష్ట దేవుడగు శ్రీకృష్ణుని భార్య. ఆమె చరిత్ర మీక్కిలి రహస్యమైనది. సుఖమును, శ్రీకృష్ణ భక్తిని ఇచ్చునది. రాధాదేవికి సంబంధించిన చరిత్ర అంతయు నాకు మాత్రము తెలియును. ఇదీ బ్రహ్మకు గానీ ఆదిశేషునకుగాని, సనత్కుమారునకుగాని, ధర్మునకు గాని, దేవేంద్రునకు గాని, మునీంద్రులకుగాని, సిద్ధేంద్రులకుగాని ఎవ్వరికిని తెలియదు.

రాధాదేవి చరిత్ర చాలా రహస్యమైన నీవునాకు ప్రాణముల కంటే గొప్ప దానవు గావున దీనిని నీకు చెప్పుచున్నాను.

పురాబృందావనే రమ్యే గోలోకేరాసమండలే

శత శృంగైక దేశే చ మాలతీ మల్లికావనే

రత్న సింహాసనే రమ్యే తస్థ తత్ర జగత్పతి:

స్వేచ్ఛామయశ్చ భగవాన్బభూవ రమణోత్సుకః

రిరంసోస్తస్య జగతాం పత్యుస్తన్మల్లి కావనే

ఇచ్ఛయా చ భవేత్సర్వం తస్య స్వేచ్ఛామయస్య చ

ఏతస్మిన్నంతరే దుర్గే ద్విధా రూపో బభూవ సః

దక్షిణాంగం చ శ్రీకృష్ణో వామార్థాంగా చ రాధికా

బభూవ రమణీ రమ్యా రాసేశా రమణోత్సుకా

అమూల్య రత్నాభరణా రత్నసింహాసన స్థితా

వహ్ని శుద్ధాంశుకాధానా కోటిపూర్ణ శశీ ప్రభా

తప్త కాంచన వర్ణాభా రాజితా చ స్వతేజసా

సస్మితా సుదతీ శుద్దా శరత్పద్మనిభాననా

భిభ్రతీ కబరీం రమ్యాం మాలతీ మాల్యమండితాం

రత్నమాలాం చ చ దధతీ గ్రీష్మ సూర్య సమప్రభాం

ముక్తా హారేణ శుభ్రణ గంగా ధారాని భేన చ

సంయుక్తం వర్తులోత్తుంగం సుమేరుగిరీ సన్నిభం

 కఠినం  సుందరం దృశ్యం కస్తూరీ పత్ర చిహితం

మాంగళ్యం మంగళార్హం చ స్తనయుగ్మం చ బిభ్రతీ

నితంబశ్రోణి భారార్తా నవయౌవనసుందరీ

కామాతురః సస్మితాం తాం దదర్శ రసికేశ్వరః

దృష్ట్యా కాంతాం జగత్కాంతో బభూవ రమణోత్సుకః

పూర్వము బృందావనమున నున్న రానమండలములో శతశృంగపర్వతమున రత్నసింహాసనమున శ్రీకృష్ణపరమాత్మ కూర్చొనియుండెను. స్వేచ్చామయుడగు ఆ పరమాత్మకప్పుడు రమింపవలెనని కోరిక కలిగినది. అప్పుడాతని ఇచ్చేవలన ఆతడే రెండు రూపములుగా నయ్యెను. కుడిపార్శ్వము శ్రీకృష్ణుడుగను ఎడమ పార్వము రాధాదేవిగను ఏర్పడెను.

రాధాదేవి ఆమూల్యరత్నాభరణములు, బంగారు వన్నెగల వస్త్రము ధరించి రత్నసింహాసనమున కూర్చీండినది. ఆమె శరీర కాంతికూడ బంగారు వర్ణముననుండెను. చక్కని పలువరుస కలిగి చిరునవ్వుతో ఆమె ఉండెను. శరత్కాలమందలి పద్మమువంటి ముఖముతో మాలతీ పుష్పములమాల చుట్టబడిన కొప్పుతో, సూర్యునివంటి రత్నమాలను, గంగానది ధారవంటి ముత్యాలమాలను ధరించి - చాలా ఆందముగా కన్పించినది.

నూతన యౌవనమున కన్పించు రాధాదేవిని చూడగానే రసికేశ్వరుడగు శ్రీకృష్ణునకు రమింపవలెనను కోరిక ఎక్కువాయెను.

దృష్ట్యా చైనం సుకాంతం చ సాదధార హరేః పురః

తేన రాధా సమాఖ్యాతా పురావద్భిః మహేశ్వరి

రాధా భజతి తం కృష్ణం స చ తాం చ పరస్పరం

ఉభయోః సర్వసామ్యం చ సద సంతో వదంతి చ

భరణం ధారణం రాసే స్మరత్యాలింగనం జపన్

తేన జల్పతి సంకేతం తత్ర రాధాం స ఈశ్వరః

రాశబ్రోచ్చారణాద్బక్తో యాతి ముక్తిం సుదుర్లభాం

ధాశబ్ధోచ్చారణాద్ధుర్గే ధావత్యేవ హరేః పదం

కృష్ణవామాంశసంభూతా రాధా రాసేశ్వరీ పురా

తస్యాంశాంశకళయా బభూవుర్దేవ యోషితః

రాఇత్యాదాన వచనః ధాచ నిర్వాణ వాచకః

తతోవాఽప్నోతి ముక్తిం చ తేన రాధా ప్రకీర్తితా

రాధాదేవి శ్రీకృష్ణుని చూడగానే అతని ముందు తన రూపమును మరింత ఆందముగా చేసుకొన్నందువలన రాధ అను పేరు ఆమెకు వచ్చినదని పెద్దలందరు.

రాధాదేవి శ్రీకృష్ణుని, శ్రీకృష్ణుడు రాధాదేవిని ఇట్లు పరస్పరము అనురాగము కలిగి సేవించుచుండిరి. వారిద్దరి మధ్య అన్ని విషయములలోను సమానత్వమున్నదని పూర్పులు చెప్పుదురు.

ఆ రాసమండలమందలి మాలతీమల్లికానికుంజమున శ్రీకృష్ణుడు రాధాదేవిని భరించెడివాడు, స్మరించెడివాడు, ఆలింగనముచేసికొనెడివాడు. ఆమె నామమును జపించెడివాడు.

"రా" శబ్దమునుచ్చరించుటచే భక్తుడు అత్యంత దుర్లభమైన ముక్తిని పొందుచున్నాడు. "ధా" శబ్దమునుచ్చరించగనే ఆ భక్తుడు శ్రీహరి నివసించు వైకుంఠమునకు పరుగెత్తుకుని పోవుచున్నాడు. “రా" అనునది ఇచ్చుటను “ధా" అనునది " ముక్తిని తెలుపును కావున - ముక్తిని ప్రసాదించు ఆ దేవి "రాధ" యైనదనీ అందురు.

శ్రీకృష్ణుని పామపార్వమునుండి రాసేశ్వరియగు రాధాదేవి ఆవిర్భవించగా ఆమెయొక్క ఆంశవలన, అంశాంశలవలన, దాని ఆంశములవలన దేవతా స్త్రీలందరు ఆవిర్భవించిరి.

బభూవ గోపీసంఘశ్చ రాధాయా లోమకూపతః

శ్రీకృష్ణ లోమకూపేభ్యో బభూవుః సర్వబల్లవాః

రాధావామాంశ భాగేన మహాలక్ష్మీర్బభూవ సా

తస్యాధిష్ఠాతృదేవీ సా గృహలక్ష్మీర్బభూవ సా

చతుర్బుజస్య సా పత్ని దేవీ వైకుంఠ వాసినీ

తదంతా రాజలక్ష్మీశ్చ రాజసంపత్ర్పదాయినీ

 తదంశామర్త్యలక్ష్మీశ్చ గృహిణాం చ గృహే గృహే

దీపాధిష్ఠాతృదేవీ చ తస్యైవ పరమాత్మనః

స్వయం రాధాకృష్ణుపత్నీ కృష్ణవక్షస్థలస్థితా

 ప్రాణాధిష్ఠాతృదేవీ చ తస్యైవ పరమాత్మనః

రాధాదేవియొక్క రోమకూపములనుండి గోపికా సంఘము ఉత్పన్నముకోగా శ్రీకృష్ణుని రోమకూపములనుండి సమస్త గోపజనము ఆవిర్భవించినది.

రాధాదేవియొక్క ఎడమపార్వమున మహాలక్ష్మి ఆవిర్భవించినది. ఆ మహాలక్ష్మి జగత్పతియొక్క ఆధిష్టానదేవతగా గృహలక్ష్మిగా పిలువబడినది. పైకుంఠనాథుడగు చతుర్భుజుడైన నారాయణునకు ఆ మహాలక్ష్మి భార్యయైనది. ఆమెయొక్క జంశస్వరూపమే రాజలక్ష్మి. ఆ దేవి రాజులకు రాజసంపదను కలిగించును, రాజలక్ష్మియొక్క అంశస్వరూపము మర్త్యలక్ష్మి, ఈదేవి భూలోకమున అందరి ఇండ్లలో దీపాధిష్టాన దేవతగా నున్నది.

శ్రీరాధాదేవి శ్రీకృష్ణుని వక్షస్థలమున ఎల్లప్పుడుండును. ఆమె ఆ పరమాత్మయొక్క ప్రాణములకు అధిష్టాన దేవత.

ఆబ్రహ్మస్తంబపర్యంతం సర్వం మిథ్యైవ పార్వతి

భజ సత్యం పరంబ్రహ్మ రాధేశం త్రిగుణాత్పరం

పరం ప్రధానం పరమం పరమాత్మాన మీశ్వరం

సర్వాద్యం సర్వపూజ్యం చ నీరీహం ప్రకృతేః పరం

స్వేచ్చామయం నిత్యరూపం భక్తానుగ్రహ విగ్రహం

 తద్బిన్నానాం చ దేవానాం ప్రాకృతం రూపమేవ చ

తస్యప్రాణాధికా రాధా బహుసౌభాగ్యసంయుతా

మహావిష్ణోః ప్రసూః సా చ మూలప్రకృతిరీశ్వరీ

మానినీం రాధికార సంత: సేవంతే నిత్యశః సదా

సులభం యత్పదాంభోజం బ్రహ్మాదీనాం సుదుర్లభం

స్వప్నే రాధా పదాంభోజం నహిపశ్యంతీ బల్లవాః

స్వయం దేవీ హరేః క్రోడే ఛాయా రూపేణ కామినీ

బ్రహ్మదేవుడు మొదలుకొని స్తంబపర్యంతమున్న ఈచరాచర జగత్తు సమస్తము నశ్వరమైనది. శాశ్వతమైనవాడు త్రిగుణాతీతుడు, పరాత్పరుడైన రాధాకాంతుడొక్కడే పరమాత్మ, ఈశ్వరుడు సర్వసృష్టికి వీభూతుడు సమస్తజనులచే పూజలనందుకొనువాడు, కోరికలులేనివాడు. ప్రకృతికంటే శ్రేష్ఠుడు. స్వేచ్చామయుడు, భక్తులననుగ్రహించువాడు అగు శ్రీకృష్ణుని నీవు ఆరాధింపుము.

అతడు తప్ప మిగిలిన దేవతలయొక్క రూపము ప్రాకృతమైనది. రాధాదేవి శ్రీకృష్ణునకు తన ప్రాణములకంటె ప్రియమైనది. ఆమె బహుభాగ్యవతి. శ్రీమహావిష్ణువునకు మాత. ఆమెయే మూలప్రకృతి.

సత్పురుషులెల్లప్పుడు రాధాదేవిని సేవించుచుందురు. బ్రహ్మాది దేవతలకు కూడ దుర్లభమైన ఆమె పాదసేవ వారికి సులభముగా లభించును. గోలోకముననున్న గోపకులకు సైతము ఆమె పదపంకజముల సేవ కలలోనైనా లభింపదు, ఆట్టి రాధాదేవి శ్రీకృష్ణుని వక్షస్థలమున ఛాయగా ఎల్లప్పుడు నివసించుచుండును.

స చ ద్వాదశగోపానాం రాయణ ప్రవర: ప్రియే

శ్రీకృష్ణాంశశ్చ భగవాన్ విష్ణుతుల్య పరాక్రమః

సుదామ శాపాత్సా దేవీ గోలోకాదాగతా మహీం

వృషభాను గృహే జూతా తన్మాతా చ కళావతీ

ఆ రాధిక సుదాముని యొక్క శాపమువలన భూలోకమున కళావతి వృషభానులకు కూతురుగా జన్మించెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతఖండే నారదనారాయణ సంవాదాంతర్గత హరగౌరీ సంవాదే రాధోపాఖ్యానే రాధోత్పత్తి తత్పూజాది కథనం సామ ఆష్టచత్వారింశత్తమోఽధ్యాయః

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణ సంవాదమున కనిపించి గౌరీశంకరుల సంవాదమున చెప్పబడిన రాధోపాఖ్యానమున రాధాదేవి జననము ఆమెయొక్క పూజాదులు గల నలభై ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.