బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

6 - సరస్వత్యుపాఖ్యానము

నారాయణ ఉవాచ- నారాయణు డిట్లనెను.

సరస్వతీ సా వైకుంఠే స్వయం నారాయణాంతికే

గంగాశాపేన కళయా కలహాద్భారతే సరీత్

పుణ్యదా పుణ్యజననీ పుణ్య తీర్థ స్వరూపిణీ

పుణ్యవద్భిర్నీ షేవ్యా చ స్థితి: పుణ్యవతాo మునే

 తపస్వినాం తపోరూపా తపస్యాకారరూపిణీ

కృతపాపేభ్మ దాహాయ జ్వలదగ్ని స్వరూపిణీ

జ్ఞానే సరస్వతీ తోయే గతం యైర్మానవైర్భువి

తేషాం స్థితిశ్చ వైకుంఠే సుచిరం హరిసంపది

భారతే కృతపాపశ్చ స్నాత్వా తత్రైవ లీలయా

ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకే వస్చేరం

చతుర్ధశ్యాం పౌర్ణమాస్యామక్షయా యాం దినక్షయే

గ్రహణే చ వ్యతీపాతేఽన్యస్మిన్పుణ్య దినేది చ

ఆనుషంగేణ యః స్నాతి పాలయా శ్రద్ధయాఽపివా

సారూప్యం లభతే నూనం వైకుంఠీ స హరే రపి

సరస్వతీమంత్రకం చ మాసమేకంతు యోజపేత్

మహామూర్ఖ: కవీంద్రశ్చ సభవేనాత్ర సంశయః

నిత్యం సరస్వతీ తోయే యః సౌత్వా ముండయేన్నరః

న గర్భవాసం కురుతే పునరేవ స మానవః

ఇత్యేవం కథితం కించద్భారతీ గుణ కీర్తనం

సుఖదం మోక్షదం సారం కిం భూయః శ్రోతుమిచ్చసి

వైకుంఠములో నారాయణునీ సమీపమున నిత్యము నివసించు సరస్వతీదేవి గంగాదేవి యొక్క శాపమువలన తన అంశతో ఈ భారత వర్షమున నదీ రూపమున ఆవతరించినది. ఆ సరస్వతీ నది పుణ్యములను కల్గించును. పుణ్యతీర్థముల స్వరూపిణి. పుణ్యవంతులచే సేవింపబడుచున్నది. తాపసుల యొక్క తపఃఫలస్వరూపిణి. తపోరూపిణి. చేసిన పాపములనన్నిటినీ సమూలముగా నాశనము చేయును. ఈ సరస్వతీ నది యొక్క నీటిలో స్నానము చేయువారు ఎల్లప్పుడు వైకుంఠమున శ్రీహరి సమీపమున ఉందురు. వారి సర్వపాపములన్నియు నశించును, చతుర్దశినాడు, పూర్ణిమనాడు, ఆక్షయ తదియనాడు, సాయంకాల సమయమున, గ్రహణసమయమున, వ్యతీపాతకాలమున, ఇతర పుణ్య దీనములలో శ్రద్ధతో స్నానము చేసినమ, శ్రద్ధలేకుండ స్నానము చేసినను వైకుంఠమున శ్రీహరి సారూప్యమును తప్పక పొందుదురు.

సరస్వతీ మంత్రమును ఒకనెల నిష్ఠతో జపించినచో మిక్కిలి మూర్ఖుడైనను మహావిద్వాంసుడు కాగలడు. అట్లే సరస్వతీ నదీ జలమున ప్రతి దినము స్నానము చేయు మానవునకు పునర్జన్మ అనునది ఉండదు.

ఈవిధముగా సుఖమును, మోక్షము నిచ్చు భారతీదేవి స్తోత్రమును తెలిపితిని. ఇంకను చెప్పవలసినదేమైన ఉన్నచో ఆడుగుము అని నారాయణ మునీ పలికెను.

సౌతిరువాచ- సౌతిమహర్షి ఇట్లు పలికెను.

నారాయణ వచః శ్రుత్వా నారదో మునిసత్తమః

పునః పప్రచ్చ సందేహచ్చేదం శౌనక సత్వరం

ఓ శౌనక మహర్షీ ! నారదముని నారాయణుని మాటలు విని తిరిగి సందేహము తొలగించు కొనుటకు ఈ విధముగా ఆడిగెను.

కథం సరస్వతీదేవీ గంగా శాపేన భారతే

కళయా కల హేనైవ సమభూత్పుణ్యదా సరిత్

శ్రవణే శ్రుతి సారాణాం వర్ధతే కౌతుకం మమ

 కథామృతానాం నో తృప్తి: కేన శ్రేయసి తృప్యతే

కథం శశాప సా గంగా పూజితాం తాం సరస్వతీం

శాంతా సత్యస్వరూపా చ పుణ్యదా సర్వదా నృణాం

 తేజస్విన్యోర్ద్వ యోర్వాదకరణం శ్రుతి సుందరం

 సుదుర్లభం పురాణేషు తన్మే వ్యాఖ్యాతుమర్హసి

గంగా సరస్వతీ దేవతలకేందుకు కలహమేర్పడినది. ఆ కలహమున సరస్వతీదేవి పుణ్యప్రదమైన నదిగా ఎందుకు మారినది?

వేదసారములైన కథలను వినవలెనని ఉన్నది. వాటిని ఎన్ని మార్లు విన్నను తృప్తి కలుగదు. మంచివాటి విషయములలో తృప్తి ఎన్నడును కలుగదుకదా.

సత్వగుణస్వరూప, మానవులకెప్పుడును పుణ్యమును కలిగించునది, శాంతురాలైన గంగ పూజ్యురాలైన సరస్వతినేందుకు శపించినది? ఈ వృత్తాంతము పురాణములలో ఎచ్చట కన్పడదు. ఆ విషయమును సమగ్రముగా వివరించుడు.

నారాయణ ఉవాచ- నారదుడిట్లడిగెను-

శ్రుణు నారద వక్ష్యామి కథామేతాం పురాతనం

యస్యాః స్మరణమాత్రేణ సర్వపాపాత్ప్రముచ్యతే

లక్ష్మీసరస్వతీ గంగా తిస్రోభార్యా హరేరపి

ప్రేమ్ణా సమాస్తాసిష్ఠంతి సతతం హరీసన్నిధౌ

చకార సైకదా గంగా విష్ణోర్ముఖి నిరీక్షణం

సస్మితా చ సకామా చ సకటాక్షం పునః పునః

విభుర్జహాస తద్వక్త్రం నిరీక్ష్య చ ముదా క్షణం

క్షమాం చకార తద్దృష్ట్వా లక్ష్మీర్నైవ సరస్వతీ

బోధయమాస తాం పద్మా సత్వరూపాచ సస్మితా

క్రోధావీష్ఠా చ సా వాణీ న చ శాంతా బభూవ హి

ఉవాచ గంగార భర్తారం రక్తాస్యా రక్తలోచనా

కంపితా కోపవేగేన శశ్వత్ ప్రస్పురితాధరా

నారద! స్మరించినంత మాత్రమున అన్ని పాపముల తొలగించు ప్రాచీనమైన ఈ కథను చెప్పెదను.

శ్రీహరికి లక్ష్మి, గంగ, సరస్వతి అను భార్యలు ముగ్గురు కలరు. వారు శ్రీహరి సన్నిధిలో అన్యోన్యముగా ప్రేమతో ఉందురు. ఒకనాడు గంగాదేవి విష్ణువును కామములో చిరునవ్వుతో చూచెను. అప్పుడు విష్ణువు కూడ ఆమె ముఖమును చూచి నవ్వెను. దీనిని చూచి లక్ష్మీదేవి సహించినను, సరస్వతీదేవి మాత్రము ఓర్చుకోలేకపోయెను. సర్వస్వరూపిణియగు లక్ష్మీదేవి సరస్వతీ దేవికి నచ్చ చెప్పినను వాణి క్రోధావిష్ణురాలై శాంతిని మాత్రము పొందలేదు. ఆ విధముగా ఎఱ్ఱనైన ముఖములో, ఎరుపెక్కిన కళ్ళలో కోపముతో వణుకుచున్న పెదవులతో, కంపించుచుండెను.

సరస్వత్యువాచ- సరస్వతీ దేవి ఇట్లనెను-

సర్వత్ర సమతా బుద్ధిః సద్భర్తుః కామినీ: ప్రతీ

ధర్మిష్ఠస్య వరిష్ఠస్య విపరీతా ఖలస్య చ

జ్ఞాతం సౌభాగ్యమధికం గంగాయాం తే గదాధర

కమలాయాం చ తత్తుల్యం నచ కించిన్మయి ప్రభో

గంగాయాః పద్మయా సార్థం ప్రీతిశ్చాపి సుసమ్మతా

క్షమాంచకార తేనేదం విపరీతం హరిప్రియా

కింజీవనేన మేఽత్రైవ దుర్భగాయాశ్చ సాంప్రతం

నిష్ఫలం జీవనం తస్యా యా పత్యు: ప్రేమవంచితో

త్వాం సర్వేశం సత్వరూపం యేవదంతి మనీషిణః

తే చ మూర్ఖా న వేదజ్ఞాః న జానంతీ మతీం త

సరస్వతీవచః శ్రుత్వా దృష్ట్వా తాం కోపసంయుతాం

మనసాతు సమాలోచ్య స జగామ బహిః సభాం

మంచి భర్త తన భార్యలందరిపై సమాన భావము కలిగి యుండును. భర్త దుష్టుడైనచో దీనికి విపరీతముగా ఎవరినో ఒకరిని ఎక్కువగా ప్రేమించుచుండును. ఓగదాధరుడవైన నారాయణ! నీ చేష్టలవలన నీకు గంగపై మిక్కిలి ప్రేమ ఉన్నట్లు కమలయైన లక్ష్మీదేవిపై కూడా ప్రేమ ఉన్నట్లు తెలియుచున్నది. అట్లే నీకు నాపై ప్రేమలేదు, గంగకు పద్మకు ఇద్దరిమధ్య సఖ్యమున్నట్లున్నది. అందువలననే గంగాదేవి యొక్క ప్రవర్తనను లక్ష్మీదేవి అనుమతించినది. అందువలన నేను బ్రతికి ప్రయోజనము లేదు.

భగవాన్! నిన్ను విద్వాంసులు సర్వేశ్వరుడవనీ, సత్యస్వరూపుడవని అందురు. కాని నా దృష్టిలో వారు మూర్ఖులు. వేదార్థమెరుగని వారు. నీ మనోభావములను గుర్తించనివారు.

ఈవిధముగా కోపముతో మాట్లాడుచున్న సరస్వతీదేవి మాటలు విని నారాయణుడు మనస్సులో బాగుగా ఆలోచించి అక్కడినుండి బయటకు వెళ్ళిపోయెను.

గతే నారాయణే గంగామవోచన్నీర్భయం రుషా

రాగాధిష్ఠాతృ దేవీ సా వాక్యం శ్రవణ దుఃసహం

హే నిర్లజ్జే సకామా త్వం స్వామిగర్వంకరోషి కిం

అధికం స్వామి సౌభాగ్యం విజ్ఞాపయితు మిచ్ఛసి

మానహానిం కరిష్యామి తవాద్య హరీసన్నిధౌ

కిం కరిష్యతి తే కాంతో మమ వై కాంత వల్లభే

ఇత్యేవ ముక్త్యా గంగా యాజిఘ్ఫక్షుం కేశముద్యతాం

వారయమాస తాం పద్మా మధ్యదేశస్థితా సతీ

శశాప వాణీ తాం పద్మాం మహాకోపవతీ సతీ

వృక్షరూపా సరిద్రూపా భవిష్యసి న సంశయః

విపరీతం యతో దృష్ట్యా కించిన్నో వస్తుమర్హసి

 సంతిష్ఠసి సభామధ్యే యథావృక్షో యథా సరిత్

 శాపం శ్రుత్వా చ సా దేవీ న శశాప చుకో న

తత్రైవ దుఃఖిలా తస్థౌ వాణీం ధృత్వా కరేణ చ

ఆత్యుద్ధతాం చ తాం దృష్ట్యా కోప ప్రస్ఫురితానన్

 ఉవాచ గంగా తాం దేవీం పద్మాం పద్మ విలోచనా

 శ్రీమన్నారాయణుడు అక్కడి నుండి వెళ్ళిపోయిన తరువాత సరస్వతీదేవి గంగను వినరానిమాటలతో ఇట్లనెను.

"ఓసిగ్గులేనిదానా కాముకురాలవైస్వామి {భర్త నావాడన్నట్లు గర్వంగా ప్రవర్తించుచు భర్త నిన్నే అధికముగా ప్రేమించుచున్నట్లు దానిని అందరకు తెలుపుటకు ప్రయత్నించుచునోపు, శ్రీహరీ సన్నీధిలోనే నీ గర్వమునడంతును. అప్పుడు నీప్రియుడేమి చేయునో చూచెదను.” అని గంగాదేవి యొక్క వెంట్రుకలు పట్టుకొని లాగుటకు ప్రయత్నించుచున్న సరస్వతీదేవిని మధ్యలో ఉన్న లక్ష్మీదేవి నివారింపజూచెను.

అప్పుడు సరస్వతి లక్ష్మీదేవిని మిక్కిలి కోపముతో చూచి ఇక్కడ విపరీతమైన కార్యము జరుగుచున్నను వృక్షమువలె, నదివలె మాట్లాడక ఉన్నందువలన నీవు వృక్షముగా, నదిగా మారుమని శాపమును పెట్టెను.

సరస్వతీదేవి తనకు శాపమిచ్చినను లక్ష్మీదేవి కోపగించక దు:ఖముతో ఆ సరస్వతీదేవి చేతిని పట్టుకొని నిలుచుండెను.

సరస్వతీదేవి కోపముతో చాలా ఉద్ధతగానున్నట్లు భావించిన గంగ, లక్ష్మీదేవితో కోపముతో ఈవిధముగా అనెను.

గంగోవాచ- గంగాదేవి ఇట్లనెను

త్వముత్స్పజ మహోగ్రాం తాం పద్మే కిం మే కరిష్యతి

వాగ్ధుష్ఠా వాగధిష్ఠాత్రి దేవియం కలహప్రియా

 యావతీ యోగ్య తాశ్యాశ్చ యావతీ శక్తిరేవ వా

తథా కరోతు వాదం చ మయసార్థం సుదుర్ముఖా

స్వబలం యన్మమబలం విజ్ఞాపయితుమర్హతు

జానంతు సర్వే:ప్యుభయోః ప్రభావం విక్రమం సఽ ఇత్యేవ ముక్త్యా సా దేవీ వాణ్యై శాపం దదావితీ

సరీత్స్వరూపా భవతు సా య త్వాంశపద్రుషా

ఆధోమర్త్యం సా ప్రయాతు సంతి యత్రైవ పాపినః

కలౌ తేషాం చ పాపాంశం లభీష్యతి న సంశయ:

ఓ లక్ష్మీదేవి చాలా కోపముతోనున్న ఈ సరస్వతిని వదలి పెట్టుము, ఈమె, వాక్కులకు అధిష్టాన దేవతయైనప్పటికిని, మంచి మాటలు మాట్లాడువది కాదు. కలహములు పెట్టుకొను స్వభావము కలది. ఆమెకు 'యోగ్యత ఎంతవరకున్నదో ఆమె శక్తి కూడ ఆంతనే ఉన్నది. ఆమె నాతోటి మాత్రమే కాదు పెట్టుకొననిమ్ము. ఇద్దరి బలము ప్రభావము అందరికి తెలియును' అవి గంగాదేవి సరస్వతి దేవికి ఈ విధముగా, శాపమునిచ్చెను.

సరస్వతీ దేవి! నీవుకూడ నదిగా మరి భూలోకమునకు వెళ్ళుము. పాపులున్న ప్రాంతములో ప్రవహించుటవలన వారి పాపములలో కొంత భాగము నీకు తప్పక లభించగలదు.

ఇత్యేవం వచనం శ్రుత్వా తాం శశాప సరస్వతి

త్వమేవ యాస్యసి మహీం పాపిపాపం లభిష్యసి

గంగాదేవి మాటలు విని సరస్వతీదేవి కోపముతో “నీవే భూలోకమునకు వెళ్ళి అచ్చటి పాపాత్ముల పాపమును పొందెద" వని గంగను శపించెను.

ఏతస్మిన్నంతరే తత్ర భగవానాజగామ హ

చతుర్భుజశ్చతుర్భిశ్చ పార్షదైశ్చ చతుర్బుజై:

సరస్వతీం కరే ధృత్వా వాసయామాస పక్షసి

బోధయామాస సర్వజ్ఞః సర్వజ్ఞానం పురాతనం

శ్రుత్వా రహస్యం తాసాం చ శాపస్య కలహస్యం

ఉవాచ దుఃఖితాస్తాశ్చ వాక్యం సామయికం విభుః

అప్పుడు చతుర్భుజుడైన నారాయణుడు, చతుర్భుజులైన తన సహచరులతో అక్కడకు వచ్చెను. అతడు సరస్వతీ దేవి చేయిపట్టుకొని ఆమెను తన రొమ్మునకు చేర్చుకొని వారి కలహ కారణమును, శాపమును తెలుసుకొని సమయానుకూలమైన మాటలతో వారితో ఇట్లనెను. శ్రీభగవానువాచ- భగవంతుడైన నారాయణు డిట్లనెను-

లక్ష్మి త్వం కళయా గచ్ఛ ధర్మధ్వజగృహం శుభే

ఆయోనిసంభవా భూమౌ తస్య కన్యా భవిష్యసి

తత్రైవ దైవదోషణ వృక్షత్వం చే లభీష్యసి

మదంశస్యాసురస్యైవ శంఖచూడస్య కామినీ

భూత్వా పశ్చాచ్చ మత్పత్నీ భవిష్యసి న సంశయః

త్రైలోక్యపావనీ నామ్నా తులసీతీ చ భారతే

కళయా చ సరిద్భూత్వా శీఘ్రం గచ్చ వరాననే

భారతం భారతిశాపాన్నామ్న పద్మావతీ భవ

గంగే యాస్యసి చాంశేన పశ్చాత్త్వం విశ్వపావనీ

భారతం భారతీశాపాత్పాపదహాయ దేహినాం

భగీరథస్య తపసా లేవ నీతా సుదుష్కరాత్

నామా భాగీరథ పూతో భవిష్యసి మహీతలే

మదంశస్య సముద్రస్య జాయా జాయే మమాజ్ఞయా

మత్కలాంశస్య భూపస్య శంతనోశ్చ సురేశ్వరి

ఓలక్ష్మి! నీవు నీ ఆంశాంశరూపముతో ఆయోనిజ ధర్మధ్వజుడను మహారాజునకు, కూతురుగా పుట్టి దైవాపచారము వలన వృక్షముగా తులసియను పేరుతో ముల్లోకములను పవిత్రము చేయగలవు, ఆట్లే నా ఆంశవలన పుట్టిన శంఖ చూడుడమ రాక్షసునకు భార్యపై తరువాత కొంతకాలమునకు మరల. నాకు భార్యపు కాగలవు. అదే విధముగా వీపు ఈ భరతఖండమున పద్మావతీ యనుపేర సదిగా మారగలవు.

ఓగంగ! నీవు కూడ నీ ఆంశస్వరూపముతో ఈ భరత ఖండమున ముల్లోకములను పవిత్రము చేయు పాపాత్ముల పాపములను ధ్వంసము చేయునదిగా మారగలవు. భగీరథుడను రాజర్షి చేసిన అఖండ తపస్సువలన భాగీరథిగో భూలోకమునకు వచ్చి నా ఆంశస్వరూపుడైన సముద్రునికి, నా అంశాంశరూపుడైన శంతను మహారాజునకు భార్యపు కాగలవు.

గంగాశాపేన కళయా భారతం గచ్చ భారతి

కలహస్య ఫలం భుంక్ష్వ సపత్నిభ్యాం సహాఽచ్యుతే

 స్వయం చ బ్రహ్మసదనం బ్రహ్మణ: కామినీ భవ

గంగా యాతు శీవస్థానమత్ర పద్మైవ తిష్ఠతు

శారతో చ క్రోధరహితా మద్భక్తా మత్స్వరూపిణీ

మహాపార్వీ మహాభాగా సుశీలా ధర్మచారిణీ

యదంశకళయా.పతివ్రతాః సర్వా ధర్మిషాశ్చ

శాంతరూపాః సుశీలాశ్చ ప్రతివిశ్వేషు యోషితః

తీస్రో భార్యా త్రయఃశ్యాలో త్రయోభృత్యాశ్చ బాంధవాః

ధ్రువం వేదవిరుద్దాశ్చ వ హ్యేతే మంగళప్రదా:

 స్త్రీపుంవచ్చ గృహే యేషాం గృహిణాం స్త్రీవశః పుమాన్

 నిష్ఫలం జన్మ వై తేషామశుభం చ పదే పదే

ముఖదుష్టా యోని దుష్టా యస్య స్త్రీ కలహప్రియా

ఆరణ్యం లేవ గంతవ్యం మహారణ్యం గృహార్వరం

జలానాం చ స్థలానాంచ ఫలానాం ప్రాప్తిరేవచ

 సతతం సులభా తత్ర వతేషాం తధృహదీ చ

వరమగ్నౌస్థితి: హింస పొంతూసార సన్నీధౌ సుఖం

తతోఽపిదుఃఖం పుంపాంచ దుష్టప్రీసన్నిధౌ ధ్రువం

వ్యాధిజ్వాలా ఏషజ్వాలా వరం పుంసాం వరాననే

దుష్టస్త్రీణాం ముఖజ్వాలా మరణాగతిరిచ్యతే

పుంసశ్చ స్త్రీజితస్యేహ జీవితం నిష్ఫలం ధ్రువం

యదహ్న కురుతే కర్మ. న తస్యఫలభాగవేత్

 స నిందితోఽత్ర సర్వత్ర పరత్ర నరకం వ్రజేత్

యశః కీర్తివిహీనో యో జీవన్నది మృతో హి సః

బహ్వీనాం చ సపత్నీనాం నైకత శ్రేయసీ స్థితి:

ఏకభార్య సుఖీ నైవ బహుభార్యః కదాచన

ఓ సరస్వతీ! నీవు గంగాదేవియొక్క శాపముననుసరించి భారతదేశమునకు వెళ్ళి, మీ కలహ ఫలమును నీ సవతులతో కలిసి అనుభవింపుము.

వీవు బ్రహ్మలోకమునకు పోయి బ్రహ్మదేవునకు భార్యగా కమ్ము, గంగాదేవి శివలోకమునకు పోవును.

శాంతురాలు, నాభక్తురాలు, మహాపతివ్రత, సుశీల, ధర్మచారిణి యగు లక్ష్మీదేవి సో దగ్గరనే ఉండుమ. ఆ లక్ష్మీదేవియొక్క ఆంశాంశవలన జన్మించిన స్త్రీలందరు పరమ ధార్మికులు, పతివ్రతలు, సౌశీల్యవతులు శాంత స్వరూపలుగా నుందురు.

భిన్న మనస్తత్వం గలిగిన భార్యలు. భృత్యువులు, బంధువులుండుట వేదములకు విరుద్ధమైన విషయము. ఇటువంటి వారెన్నడును మేలుమ కలిగించరు. ఎవరి ఇంట స్త్రీ పురుషుని వలె ప్రవర్తించునో, ఏపురుషుడు పశమై యుండునో వారి జన్మ నిప్పులమగును. వారికి ఆడుగడుగునో కష్టములే దాపురించుము. కలహములు పెట్టుకొనుస్త్రీ, దుర్భాషలాడుసీ వ్యభిచారి - కలపురుషునకు ఇంటికంటే ఆడవిలో ఉండుటయే శ్రేష్టమైనది. ఆడవిలో నీరు, స్థలము, పండ్లు పుష్కలముగా సులభముగా లభించును గదా.

అగ్నిలో సైతముండవచ్చును. క్రూర జంతువుల సమీపముననైన ఉండవచ్చును. కాని దుష్టసీల సమీపములో ఉండలేము. దుష్టస్త్రీల ముఖఙ్వాల కంటే (పరుషమైన మాటలకంటే) వ్యాధి బాలయైనను, ఏషజ్వాలయైనను సులభమైనవే. స్త్రీకి సంపూర్ణముగా లొంగిన మానవుని జీవితము వ్యర్థమైనది. ఆతడు తాను చేసిన సత్కర్మల ఫలితముననుభవింపజాలడు. ఆతడు ఇహలోకమున మీందలు పొందుచు పరలోకమున నరకమును పొందును. కీర్తిలేని - మానవుడు జీవించిసమ చనిపోయినవాడే అగును.

అనేక భార్యలు కలవాడు ఎన్నడు సుఖమనుభవింపలేడు. అందువలన ఒకే భార్య ఉండుట అన్ని విధములుగా శ్రేయస్కరమైనది.

గచ్చ గంగే శివస్థానం బ్రహ్మస్థానం సరస్వతి

ఆత్ర తిష్ఠతు మద్దేహే సుశీలా కమలాలయా

సుసాధ్యా యస్య పత్నీ చ సుశీల చ పతివ్రతా

 ఇహ స్వర్గసుఖం తస్య ధర్మమోక్షౌ పరత్ర చ

పతివ్రతా యస్యపత్నీ పచ ముక్తః శుచిః సుఖీ

జీవన్మతోఽశుచిర్దు:ఖీ దుఃశీలాపతిరేవ యః

ఇత్యుక్త్వా జగతాం నాథో విరరామ చ నారద

ఓ గంగాదేవి! నీవు శివలోకమునకు పొమ్ము, సరస్వతి నీవు బ్రహ్మలోకమునకు పొమ్ము. సౌశీల్యవతియగు లక్ష్మీదేవి నా దేహముననే ఉండును.

సుశీలవతి, పతివ్రతయగు భార్య కలవానికి ఇహలోకమున స్వర్గసౌఖ్యములు, పరలోకమున మోక్షము కలుగును. శీలవతికాని స్త్రీ యొక్క భర్త దుఃఖములనను భవించును. అతడు బ్రదికియున్నను చచ్చినవానితో సమానము.

ఈ విధముగా జగన్నాయకుడైన నారాయణుడు లక్ష్మీ, గంగా, సరస్వతులతో పలికి ఊరకుండెను.

అత్యుచ్చైరురుదుర్దేవ్య సమాలింగ్య పరస్పరం

తాశ్చ సర్వాసమాలోచ్య క్రమేణోచుః సదీశ్వరం

కంపితాః సాశ్రునేత్రాశ్చ శోకేన చ భయేన చ

శ్రీమన్నారాయణునీ మాటలు విని లక్ష్మీ, గంగో, సరస్వతులు ఒకరి నొకరు కౌగిలించుకొని, ఉచ్చ స్వరముతో ఏడ్చిరి. కొంతసేపైన తరువాత వారందరు తమలో తామాలోచించుకొని, శోకభయములతో కన్నీళ్ళు కారగా కంపించుచు నారాయణునితో ఇట్లు పలికిరి.

సరస్వత్యువాచ- సరస్వతి దేవి ఇట్లనెను-

ప్రాయశ్చిత్తం దేహి నాథ దుష్టాయాం జన్మ శోధకం

 సత్ స్వామినా పరిత్యక్తా కుత్ర జీవంతి కాః స్త్రియః

 దేహత్యాగం కరిష్యామి ధ్రువం యోగేన భారతే

అత్యుచ్చతో నీపతనం ప్రాప్తుమర్హతి నిశ్చితం

భర్త వదలివేసినచో స్త్రీ లేవిధముగా బ్రతుకుదురు. అందువలన మా జన్మను పవిత్రము చేయు ప్రాయశ్చిత్తమును ఉపదేశింపుము. లేనిచో యోగము ద్వారా ఈశరీరమును . వదిలివేతును. కానిచో ఎత్తైన శిఖరము నుండి కిందపడియైనను దేహత్యాగమును చేయుదును.

గంగోవాచ- గంగాదేవి ఇట్లనెను-

అహం కేవాపరాధన త్వయాత్యక్తా జగత్పతే

దేహత్యాగం కరిష్యామి నిర్దోషా యా వధం లభ

నిర్దోష కామినీ త్యాగం కురుతే యో జనో భవే

స యాతి నరకం కల్పం కిం తే సర్వేశ్వరస్య వా

నేను ఏ తప్పువలన వదిలి వేయబడినానో తెలుపుము. లేనిచో నేను దేహత్యాగము చేయుదును. అందువలన నిర్దోషురాలిని చంపిన పాపమును నీవు పొందుదువు. తప్పులేని భార్యను వదలివేసినచో ఆతనికి కల్పకాలము నరకము సిద్ధించును. సర్వేశ్వరుడవగు నీకు దీనిని గురించి ప్రత్యేకముగ చెప్పవలసిన పనిలేదు.

 లక్ష్మీరువాచ - లక్ష్మీదేవి ఇట్లనెను-

నాత సర్వస్వరూపస్త్యం కోపః కథమహో తవ

 ప్రసాదం కురు చాస్మభ్యం సదీశస్య క్షమా వరా

 భారతం భారతీశాపాద్యాస్యామి కళయా యది

కతికాలం స్థితిస్తత్ర కదా ద్రక్ష్యామి తే పదం

దాస్యంత పాపిసః పాపం మహ్యం స్నానావగాహనాత్

కేన తస్మాద్విముక్తాఽహమాగమిష్యామి తే పదం

కళయా తులసీరూపా ధర్మధ్వజసుతా సతి

భూత్వా కదా లభీష్యామి త్వత్పాదాంబుజమచ్యుత

 వృక్షరూపా భవిష్యామి తదధిష్ఠాతృదేవతా

మాముద్ధరిష్యసి కదా తన్మే బ్రూహి కృపానిధే

గంగా సరస్వతీ పాద్యది యాస్యతి భారతం

శాపేన ముక్తా పాపాచ్చ కదా త్వాం వా లభిష్యతి

 గంగాళాపేన పా వాణీ యది యాస్యతి భారతం

 కదా శాపాద్వినిర్ముచ్య లభిష్యతి పదం తవ

ఇత్యుక్తా కమలా మూర్తపదం ధృత్వా వనామ చ

సుకేశైర్వేష్టయిత్వా చ రురోద చ పునః పునః

హే నాథ! నీవు సత్వగుణ స్వరూపుడవు. నీకు కోపము ఎట్లు వచ్చును. నీవంటివానికి క్షమించేగుణము ఉండును. అందువలన మమ్ములనందరిని క్షమించుము.

సరస్వతీ దేవి శాపముననుసరించి నేను నా అంశస్వరూపముతో భారతదేశమునకు పోయినచో అక్కడ ఎంతకాలముందును? మరల నిన్ను ఎప్పుడు చూడగలను?

నదీరూపమున నున్న నా నీటిలో పాపులు స్నానము చేసి తమ తమ పాపముల నాకిచ్చినచో ఆ పాపములనుండి నాకు విముక్తి ఏవిధముగా లభించును? అట్లే నా ఆంశవలన ధర్మధ్వజ మహారాజ పుత్రికయైన తులసిగా మారినచో తిరిగి నీపరమ పదమునెప్పుడు చేరుకోగలను. తులసిగా వృక్షాధిష్టాన దేవతగా వృక్షరూపమున ఉండుపన్ను ఎప్పుడు పునరుద్ధరించగలవు? ఈవిషయమును దయాసముద్రుడవైన నీవు తెలుపగలవు.

సరస్వతీ దేవి శాపముననుసరించి గంగ భారతదేశమునకు పోయినచో ఆ శాపమునుండి, పాపుల పాపముల నుండి ఎప్పుడు ముక్తి చెందును?

సరస్వతిని బ్రహ్మలోకమునకు పొమ్మని గంగను శివమందిరమునకు పొమ్మని అనిన నీ మాటను ప్రస్తుతము క్షమించి వదలివేయుము.

ఈవిధముగా లక్ష్మీదేవి తన భర్త పాదములను పట్టుకొని నమస్కరించుచు మాటిమాటికి ఏడ్చెను.

ఉవాచ పద్మనాభస్తాం ప్రభాం కృత్వా స్వవక్షసి

ఈషద్దాసః ప్రసన్నాస్య: భక్తానుగ్రహకారకః

భక్త జనముననుగ్రహించు నారాయణుడు ఆమెను తన అక్కునకు చేర్చుకొని చిరునవ్వుతో ఇట్లు పలికెను.

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

త్వద్వాక్యమాచరిష్యమి స్వవాక్యం చ  సురేశ్వరి

సమతాం చ కరిష్యామి శ్రుణు తత్క్రమమేవ చ

భారతి యాతు కళయా సరిద్రూపా చ భారతం

అర్ధాంశా బ్రహ్మసదనం స్వయం తీద్దతు మద్గృహే

భగీరథేన నీతా సా గంగా యాస్యతి భారతం

పూతం కర్తుం శ్రీభువనం స్వయం తిష్ఠతు మద్గృహే

తత్రైవ చంద్రమౌళీశ్చ మౌళీం ప్రాప్స్యతి దుర్లభం

తతః స్వభావతః పూజాఽప్యతీపూతో భవిష్యత్

ఓ సురేశ్వరి, లక్ష్మీదేవి! నీమాట, నామాట రెండు జరుగునట్లు చేయుదును. ఆదెట్లనగా సరస్వతీదేవి తన ఆరశాంశ స్వరూపమున నదీ రూపు వహించి భారత దేశమునకు వెళ్ళును. అట్లే ఆమె యొక్క అర్థాంశ రూపము బ్రహ్మలోకమునకు పోవును. ఇక మిగిలిన ఆంశలో ఇచ్చటనే ఉండును.

గంగాదేవి భగీరధుని వలన ముల్లోకములను పవిత్రము చేయుటకు భారతదేశమునకు పోవుము. అట్లే చంద్రశేఖరుడైన పరమశివుని శిరస్సుపై చేరి సహజముగా పవిత్రమైనదైనా అతి పవిత్రము కాగలదు.

కళాంశాంశేన గచ్చ త్వం భారతే కమలోద్భవే

పద్మావతీ సరిద్రూపా తులసీ వృక్షరూపిణీ

కలే: పంచ సహస్రే చ గతే వర్షే చ మోక్షణం

యుష్మాకం సరితాం భూయో మద్గృహే చాగమిష్యథ

సంపదాం హేతుభూతా చ విపత్తి: సర్వదేహినాం

 వినా విపత్తేర్మహిమా కేషాం పద్మే భవేద్భవే

మన్మంత్రోపాసకానాం చ సతాం స్పానావగాహనాత్

యుష్మాకం మోక్షణం పాపాత్ పాపి స్పర్శన హేతుత్

పృధివ్యాం యాని తీర్థానీ సంత్యసంఖ్యాని సుందరి

భవిష్యంతి చ పూతాని మద్భక్త స్పర్శ దర్శనాత్

మన్మంత్రోపాసకో భక్తా భ్రమంతే భారతే సతీ

పూతం కర్తుం భారతం చ సుపవీత్రాం వసుంధరాం

మద్భక్తా యత్ర తిష్ఠంతి పాదం ప్రక్షాళయంతి చ

 తత్ స్థానం చ మహాతీర్థం సుపవిత్రం భవేద్ద్రువం

స్త్రీఘ్నో గోఘ్న: కృతఘ్నశ్చ బ్రహ్మ గురుతల్పగః

జీవన్ముకో భవేత్పూతో మద్భక్త స్పర్శ దర్శనాత్

ఆసిజీవి మషీజీపీ ధావకః శూద్రయాజకః

వృషవాహో భవేత్పూతో మద్భక్త స్పర్శ దర్శనాత్

విశ్వాసఘాతీ మిత్రభ్నే మిథ్యాసాక్ష్యప్రదాయకః

 న్యాసహారీ భవేత్సూతో మద్భక్త స్పర్శ దర్శనాత్

 ఋణగ్రస్తో వార్డుషికో జారజః పుంశ్చలి పతిః

 పూతశ్చ పుంశ్చలీ పుత్రో మద్భక్త స్పర్శ దర్శనాత్

ఏదైనాం సూపకారశ్చ దేవలో గోమయాజకః

ఆదీక్షితో భవేత్పూతో మద్భక్త స్పర్శ దర్శనాత్

ఆశ్వత్తఘాతకశ్చైవ మద్భక్తానాం చ నిందకః

అనీవేదిత భోజీ చ పూలో మద్భక్త స్పర్శ దర్శనాత్

మాతరం పితరం భార్యాం భ్రాతరం తనయం సుతాం

గురోఃకులం చ భగినీం వంశనం చ బాంధవం

శ్వశ్రుం చ శ్వశురం. చైవ యో న పుషాలి. నారద

సమహాపాతకీ పూతో మద్భక్త స్పర్శ దర్శనాత్

దేవద్రవ్యాపహారచ వీవద్రవ్యాపహారకః

లాక్షాలోహ రసానాం చ విక్రేతా దుహితుస్తథా

మహాపాతకిన్వశ్చైతే శూద్రాణాం శవదాహకాః

భవేయు రేలే పూతాశ్చ మద్భక్త స్పర్శ దర్శనాత్

ఓ లక్ష్మీదేవి నీవు నీ ఆరశాంశాంశ స్వరూపముతో భారతదేశమున "పద్మావతీ" యను నదిగా తులసీ వృక్షముగా జన్మించుము.

కలియుగమున ఐదువేల సంవత్సరముల పిదప నదీ రూపముననున్న మీరందరు మోక్షము చెంది నాసాన్నిధ్యమున కేతెంతురు.

సమస్త జీవులకు ఆపదలు సంపత్తుకు కారణమగుచున్నవి. ఈ సంసారమున ఆపదలు లేకుండా ఆభివృద్ధి ఎవరికి జరుగును.

నామంత్రమును ఉపాసన చేయు భక్తులు స్నానము చేయుట వలన పాపులను తగిలిన పాపమునుండి మీకు మోక్షము లభించును.

ఈభూమిపై నున్న అంతులేని తీర్థములన్ని నా, భక్తుల స్పర్శవలన దర్శనము వలన పునీతములగును. నామంత్రమును ఉపాసన చేయు భక్తులు ఈ భూమిని పవిత్రమొనర్చుటకై తిరుగుచున్నారు. నా భక్తులు ఎక్కడ ఉందురో పాదప్రక్షాళనము చేయుదురో ఆ స్థలము అత్యంత పవిత్రమైన మహాతీర్థము కాగలదు. నా భక్తులయొక్క స్పర్శవలన, దర్శనమువలన స్త్రీ హత్య చేసిన వాడైనను గోవులను చంపినను, బ్రాహ్మణుని చంపినను, గురుభార్యా సమాగమము చేసినను, కృతఘ్నుడైనను పవిత్రుడై జీవన్ముక్తుడగును. అట్లే ఆయుధములను నమ్ముకొని బ్రతుకు సైనికుడు మొదలగువారు, ఇతరులకు కాగితములు వ్రాయుచు బ్రతికి లేఖకులు, శూద్రయాజకుడు, వృషభమునెక్కి తిరిగేవాడు, విశ్వాసములేనివాడు, మిత్రులను చంపినవాడు, తప్పుడు సాక్ష్యములు చెప్పువాడు, తన వద్ద దాచి యుంచిన సొమ్మును అపహరించువాడు, ఋణగ్రస్తుడు, జారత్వమువలన పుట్టినవాడు పుంశ్చలీపతి, పుంశ్చలీపుత్రుడు, అన్యాయమైన వడ్డీలవల్ల బ్రతుకుపాడు వీరందరు నా భక్తుల స్పర్శవలన దర్శనమువలన ముక్తిని పొందుదురు. అదేవిధముగ శూద్రుల ఇంటిలో వంటచేయువాడు, దేవాలయమున పూజలు చేసి బ్రతుకువాడు, దీక్షితుడు కానీవాడు, రావిచెట్టును పడగొట్టినవాడు, నా భక్తులను నిందించువాడు, నాకు నివేదింపబడనీ అన్నము తినువాడు. తల్లిని, తండ్రిని, భార్యను, పుత్రులను, సోదరునీ, గురువుయొక్క వంశమును, సోదరిని, సంతానములేని బంధువును, అత్తమామలను పోషింపనివాడు మహాపాతకి ఐనను నా భక్తుల స్పర్శ దర్శనమువలన అతడు పవిత్రుడగును. అట్లే దేవ ద్రవ్యమును అపహరించువాడు బ్రాహ్మణద్రవ్యమును అపహరించువాడు. కన్యాశుల్కము తీసికొన్నవాడు, లత్తుక, లోహద్రవ్యములు. రసద్రవ్యములను అమ్ముకొనువాడు, శూద్రశవములను దహించువాడు వీరందరు కూడ మహాపాతకము చేసి కొన్నవారు. వీరు సైతము నా భక్తుల పాదస్పర్శవలన, వారి దర్శనమువలన పవిత్రులగుదురు.

లక్ష్మీరువాచ- లక్ష్మీదేవి ఇట్లు పలికెను-

భక్తానాం లక్షణం బ్రూహి భక్తానుగ్రహ కారక

యేషాం సందర్శన స్పర్శాత్సద్య: పూతా నరాధమాః

హరి భక్తివిహీనాశ్చ మహాహంకార సంయుతాః

స్వప్రశంసారతా ధూర్తి శఠావై సాధునిందకాః

పునంతి సర్వతీర్థాని యేషాం స్నానావగాహనాత్

యేషాంచ పాదరజసా పూతా పాదోదకాన్మహే

యేషాం సందర్శనం స్పర్శం దేవో వాంఛంతి భారతే

సర్వేషాం పరమోలాభో వైష్ణవానాం సమాగమః

నహ్యమ్మయాన్ని తీర్థానీ న దేవా మృచ్చిలామయాః

తేపునంత్యురుకాలేన విష్ణుభక్తాః క్షణాదహో

భక్తుల ననుగ్రహించు పరమాత్మా! నీ భక్తులు పాదస్పర్శవలన, వారి దర్శనమువలన హరిభక్తిరహితులు, మిక్కిలి గర్వించువారు, ఆత్మప్రశంస చేసికొనువారు, సాధుపురుషులను నిందించు దుష్టులు పునీతులగుదురు. ఆ హరిభక్తులు స్నానము చేసినందువలన సమస్త పుణ్యతీర్థములు, వారి పాదధూళివలన, పాదోదకమువలన భూమి పవిత్రమగును. దేవతలందరు ఆహరి భక్తుల సందర్శనమును, పాదస్పర్శమును ఎల్లప్పుడు కోరుకొందురు. ఆవైష్ణవులలోటి సమాగమము అందరకు లాభమును చేకూర్చును. పుణ్యతీర్థములు, దేవతా విగ్రహములు పవిత్రము చేయ బోలని వారిని విష్ణుభక్తులు క్షణములో పునీతులుగా నొనర్తురు. అందువలన ఆ హరిభక్తుల లక్షణము తెలుపుము.

సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లనెను-

మహాలక్ష్మీ వచః శ్రుత్వా లక్ష్మీకాంతశ్చ సస్మితః

నిగూఢతత్వం కథితుం ఋషి శ్రేష్ఠోపచక్రమే

మహాలక్ష్మీ దేవి మాటలు విని నారాయణుడు చిరునవ్వుతో నిగూఢతత్వమగు విషయమునిట్లు చెప్పెను.

శ్రీనారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

 భక్తానాం లక్షణం లక్ష్మి గూడం శ్రుతి పురాణయోః

పుణ్యస్వరూపం పాపఘ్నం సుఖదం ముక్తిదాయకం

సారభూతం గోపనీయం న వక్తవ్యం ఖలేషు చ

 త్వాం పవిత్రాం ప్రాణతుల్యాం కథయామి నిశామయ

గురువక్త్రాత్ విష్ణుమంత్రో యస్య కర్ణే విశేద్వరః

వదంతి వేదవేదాంగాత్ తం పవిత్రం నరోత్తమం

పురుషాణాం శతం పూర్వం పూతం తజ్జన్మమాత్రతః

స్వర్గస్థం నరకస్థం వా ముక్తిం ప్రాప్నోతి తత్క్షణాత్

యైః కశ్చిద్యత్ర వా జన్మ లబ్దం యేషు చ జంతుషు

జీవన్ముక్తాస్తే చ పూతా యాంతి కాలే హరేః పదం

మద్భక్తియుక్తో మత్పూజానియుక్తో మద్గుణాన్వితః

మద్గుణశ్లాఘనీయశ్చ మనివిష్టశ్చ సంతతం

మద్గుణ శ్రుతి మాత్రేణ సానందః పులకాన్వితః

సగద్గద: సాశ్రునేత్ర: స్వాత్మవిస్మతిరేవచ

నవాంఛంతి సుఖం ముక్తిం సాలోక్యాచీ చతుష్టయం

బ్రహ్మతమమరత్వం వా తద్వాంఛా మమ సేవవే

 ఇంద్రత్వం చ మనుత్వం చ దేవత్వం చ సుదుర్లభం

స్వర్గరాజ్యాదిభోగం చ స్వప్నేఽపి సహి వాంఛతి

బ్రహ్మాండాని వినశ్యంతి దేవా (బ్రహ్మాదయస్తథా

కల్యాణ భక్తి యుక్తశ్చ మద్బక్తి న ప్రణశ్యతి

భ్రమం భారతే భక్త్వా లబ్ద్వా జన్మ సుదుర్లభం

లేపి యాంతి మహీం పూతాం కృత్వా తీర్థం మమాలయం

ఓ లక్ష్మీదేవి! నా భక్తుల లక్షణము వేదపురాణములకు సహితముందనిది. పుణ్యస్వరూపమైనది. పాపముల పోగొట్టువది. ముక్తిని కలిగించునది కావున దీనిని దుర్మార్గులకు చెప్ప తగదు. నీవు పరమ పవిత్రమైన దానవు. నా ప్రాణములతో సమానమైన దానవు కావున నీకు నా భక్తుల లక్షణమును చెప్పుచున్నాను.

ఏ భక్తుని చెవీలో విష్ణుమంత్రము గురువుయొక్క ముఖము నుండి ప్రవేశించునో ఆ భక్తుడు వేద వేదాంగములకంటె పవిత్రుడు. ఆతని జన్మవలననే ఆతని పూర్వీకులు నూరు తరములవారు పవిత్రులగుదురు. వారు నరకమందున్నా, స్వర్గమందున్నా వెంటనే ముక్తిని పొందుదురు. అతని పూర్వీకులు ఎట్టి జన్మపొందినను జీవన్ముక్తులై కాలక్రమమున శ్రీహరి స్థానమును పొందుదురు. నా భక్తి కలవాడు, నాపూజలు సేయువాడు. నావంటి గుణములు కలవాడు ఎల్లప్పుడు కీర్తింపబడును. నా కథలు వినినంతమాత్రమున ఆనందముతో పులకాన్వితుడై కన్నీరుకారగా తనను తాను మరచిపోవును, అతనికి నాసేవ తప్ప ముక్తి సుఖము, స్వర్గాది భోగములవసరములేదు. వాటిని కలలోనైనా స్మరింపడు. బ్రహ్మాండాదీలోకములు. దేవతలు, బ్రహ్మాదులు నశించినప్పటికిని నా భక్తుడు మాత్రము నశింపడు.

నా భక్తులు భారతదేశమున జన్మించి దేశాటనము సేయుచు ఈ భూమిని పవిత్రము చేసి, చివరకు నేనుండు ప్రాంతమును చేరుదురు.

ఇత్యేతత్కథితం సర్వం కురు పద్మే యథోఽచితం

తదాజ్ఞా తాశ్చ శాశ్చకు: హరీ: తగ్గే సుఖాసనే

ఓలక్ష్మీ! నా భక్తుల లక్షణమును సర్వము నీకు తెలిపితిని అని నారాయణుడనిన తరువాత అతని ఆనుజ్జగైకొని అందరు ఆచ్చట సుఖాసనములందు కూర్చొనిరి.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే సరస్వత్యుపాఖ్యానం నామ షష్ణోఽధ్యాయః

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదగు ప్రకృతిఖండములోని నారదనారాయణ సంవాదములో సరస్వత్యుపాఖ్యానము అను ఆరవ అధ్యాయము సమాప్తము.