బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

43 - షష్ఠీదేవి యొక్క పూజ, స్తోత్రాదులు

నారద ఉవాచ- నారదుడు నారాయణునితో ఇట్లనెను-

అనేకాసాం చ దేవీనాం శ్రుతమాఖ్యానముత్తమం

ఆన్యాసాం చరితం బ్రహ్మన్ పదవేదవిదాం వర

నారాయణమునీ! నీ అనుగ్రహమువలన అనేక దేవతలయొక్క చరిత్రను వింటిని. వేదార్థ విదులలో శ్రేష్ఠుడా! ఇతర దేవతలయొక్క చరిత్రను కూడా నాకు చెప్పుము.

నారాయణ ఉవాచ- నారాయణుడు ఇట్లు నారదునితో ననేను-

సర్వాసాం చరితం విప్ర వేదేష్వస్తి పృథక్ పృథక్

పూర్వోక్తానాం చ దేవీనాం త్వం కాసాం శ్రోతుమిచ్ఛసి

నారదా! వేదములందు సమస్త దేవతల చరిత్ర విపులముగా ప్రత్యేకముగా కలదు. నీవు ప్రస్తుతము ఏ దేవతాస్త్రీ చరిత్ర వినదలచితివో నాకు తెలుపుము.

నారద ఉవాచ:- నారదముని ఇట్లనెను-

షష్ఠీ మంగళచండీ చ మనసా ప్రకృతేః కళాః

ఉత్పత్తిమాసాం చరితం శ్రోతుమిచ్ఛామి తత్వతః

షష్టీదేవి, మంగళచండి, మనసాదేవి వీరందరు ప్రకృతియొక్క ఆంశలు. అందువలన వీరిపుట్టు పూర్వోత్తరములను తెలిసికొనగోరుతున్నాను.

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

షష్టాంశా ప్రకృతేర్యా చ సా చ షష్ఠి ప్రకీర్తితా

బాలకాధిష్ఠాతృదేవి విష్ణుమాయా చ బాలదా

 మాతృకాసు చ విఖ్యాతా దేవసేనాధీధా చ సా

 ప్రాణాధికప్రియా సాధ్వీస్కందభార్యా చ సువ్రతా

 ఆయుః ప్రదా చ బాలానాం ధాత్రీ రక్షణకారిణీ

 సతతం శిశుపార్ష్వస్థా యోగాద్యై సిద్ధ యోగినీ

తస్యాః పూజావిధౌ బ్రహ్మన్ ఇతీహాసవిధిం శ్రుణు

యత్ శ్రుతం ధర్మముఖతః సుఖదం పుత్రదం పరం

ప్రకృతియొక్క ఆరవ ఆంశ కావున ఆమెను షఫీ అనీపిలిచిరి. షష్ఠిదేవత బాలురకు ఆధిష్టాన దేవత, పుత్ర సంపత్తినిచ్చునది, విష్ణుమాయకూడ. ఆమె షణ్మాతృకలలో ప్రఖ్యాతిచెందిన “దేవసేన” అనునది. కుమారస్వామికి ఆ దేవత ప్రాణములకంటె ప్రియమైన భార్య. బాలకులకు ఆయుస్సును కలుగజేయుచు వారినెల్లప్పుడు రక్షించుచుండును. ఆమె శిశువుల పక్కనే ఉండి వారిని రక్షించుచుండును. ఆమె సిద్ధయోగినికూడ.

ఆ షష్టీదేవియొక్క పూజావిధానమును చరిత్రను ధర్మదేవత చెప్పగా వింటినీ. ఆ వృత్తాంతమును నీవుకూడ వినుము.

రాజా ప్రియవ్రతశ్చాసీత్ స్వాయంభువ మనోః సుతః

యోగీంద్రోనోద్వద్భార్యాం తపస్యాసు రతః సదా

బ్రహ్మాజ్ఞయా చ యత్నేన కృతధారో బభూవప

సుచిరం కృతధారశ్చ నలేభే తనయం మునే

పుత్రేష్టియజ్ఞం తచాపి కారయామాస కశ్యపః

మాలిన్యై తస్యకాంతాయై మునీర్యళ్ల చరుం దదౌ

భుక్త్యా చరుం తస్యాశ్చ సద్యోగర్భో బభూవహ

దధార తం చ సా దేవీ దైవం ద్వాదశవత్సరం

తతః సుషావ సా బ్రహ్మన్ కుమారం కనకప్రభం

 సర్వావయవ సంపన్నం మృతముత్తార లోచనం

 తందృష్ట్యా రురుదు: సర్వానార్యో వై బాంధవస్త్రియః

 మూర్ఛామవాప తన్మాత పుత్రశోకేన సువ్రతా

 శ్మశానం చ యయారాజా గృహీత్వా బాలకం మునే

 రురోద తత్ర కాంతారే పుత్రం కృత్వా స్వపక్షసి

నోత్సృజ్య బాలకం రాజా ప్రాణాన్ త్యక్తుం సముద్యతః

 జ్ఞానయోగం విసస్మార పుత్రశోకాత్ సుదారుణాత్

ఒకప్పుడు స్వాయంభువ మనువునకు ప్రియవ్రతుడను కొడుకు కలిగెను. అతడు సుజ్ఞానియై, యోగీంద్రుడై తపస్సుచేసికొనుచు వివాహము చేసికొనలేదు. కాని బ్రహ్మదేవుని ఆజ్ఞపై అతడు వివాహమును చేసికొన్నను అతనికి సంతానము కలుగలేదు. అందువలన కశ్యపప్రజాపతీ ప్రియవ్రతునిచే పుత్రకామేష్టిని చేయించి యాగమందలి చరుపును అతని భార్యయైన మాలినీ దేవికిచ్చెను.

ఆ యజ్ఞ చరువుయొక్క ప్రసాదమువలన ఆ మహారాణి వెంటనే గర్భమును ధరించి పన్నెండు దీవ్యసంవత్సరములు గర్భమును మోసి బంగారువంటి పుత్రువి కనెను. కాని ఆ శిశువు సమస్తావయవములలో నున్నను, కనుపాపలు తిరిగిపోయి మృతుడుగనే జన్మించెను.

అందువలన మాలినీదేవి పుత్రశోకముతో మూర్ఛపడిపోగా ఆమె ఆంతఃపురముననున్న స్త్రీలు, బంధువులయొక్క భార్యలు అందరు దుఃఖము పొందిరి.

రాజు ఆ శిశువును తీసికొని శ్మశానమునకు వెళ్ళినను, పుత్ర ప్రేమచే ఆ శిశువును వదలలేక జ్ఞానము నశించగా తన ప్రాణములను వదలుటకు సిద్ధపడెను.

ఏతస్మిన్నంతరే తత్ర విమానం చ దదర్శ హ

శుద్ధస్ఫటిక సంకాశం మణిరాజవీరాజితం

తేజసా జ్వలితం శశ్వత్ శోభితం క్షామవాససా

 నానాచిత్ర విచిత్రాడ్యం పుష్పమాలా విరాజితం

దదర్శ తత్ర దేవీం చ కమనీయాం మనోహరాం

 శ్వేతచంపక వర్ణాభాం రమ్యసుస్థిర యావదాం

ఈషద్దాస్య ప్రసన్నాస్యాం రత్నభూషణ భూషితాం

 కృపామయీం యోగసిద్దాం భక్తానుగ్రహ కారిణీం

దృష్ట్యా తాం పురతో రాజా తుష్టావ పరమాదరాత్

చకార పూజనం తస్యాః విహాయ భువిబాలకం

ఆ సమయమున అచ్చటికొక విమానము వచ్చెను. ఆదిపరిశుద్ధమైన స్ఫటికమువలె మీక్కిలి తెల్లనై, మణులతో ప్రకాశించుచుండెను. ఇంకను ఆది పట్టువస్త్రముతో కప్పబడి, చిత్రవిచిత్రములతో, పుష్పమాలలతో శోభించుచుండెను.

ప్రియవ్రతు డా దేవిని చూడగనే తన ఒడిలోనున్న మృత శిశువును భూమిపై వదలి భక్తి భావముతో ఆమెను పూజించెను.

పప్రచ్ఛ రాజా తాం దృష్ట్యా గ్రీష్మసూర్యసమప్రభాం

తేజసా జ్వలితాం శాంతాం కాంతాంస్కందస్య నారద

గ్రీష్మకాలమందలి సూర్యుని ప్రకాశముతో వెలిగిపోవుచున్నప్పటికి, పరమశాంతముగానున్న దేవసేనను చూచి రాజు ఇట్లడిగెను.

ప్రియవ్రత ఉవాచ- ప్రియవ్రతమహారాజిట్లనెను-

కాత్వం సుశోభనే కాంతే కస్యకారణాఽసి సువ్రతే

కస్య కన్యావరారోహే ధన్యాయాన్యా చ యోషితాం

నృపేంద్రస్య వచ- శ్రుత్వా జగన్మంగళ దాయినీ

ఉవాచ దేవసేనా పా దేవరక్షణ కారిణీ

దేవానాం దైత్యభీతానాం పురాసేనా బభూవసా

 జయం దదౌ చ తేభ్యశ్చ దేవసేనా చ తేన సా

ఆమ్మా నీవెవరవు? నీ భర్త ఎవడు? నీ తలిదండ్రులెవరు? నీవలన స్త్రీలందరకు గౌరవమేర్పడుచున్నది అని మహారాజనగా ప్రపంచమునకంతయు మంగళమును కలిగించు ఆ దేవసేన ఇట్లనెను, పూర్వము దేవతలు రాక్షసులకు భయపడగా తానే దేవతలకు సేనగా మారి వారికి విజయము చేకూర్చినందువలన ఆమె దేవసేన యైనది.

దేవసేనోవాచ- దేవ సేన ఇట్లు పలికెను-

బ్రహ్మణో మానసీ కన్యా దేవసేనాహమీశ్వరీ

సృష్ట్యా మాం మనసో ధాతా దదౌ స్కందాయ భూమీప

మాతృకాసు చ విఖ్యాతాస్కంద సేనా చ సువ్రతా

విశ్వ షష్ఠేతి విఖ్యాతా షష్టాంశ ప్రకృతేర్యతః

పుత్రదాఽహమపుత్రాయ ప్రియాదాత్రీ ప్రియాయ చ

ధనదాచ దరిద్రేభ్యః కర్బభ్యః శుభ కర్మదా

 సుఖం దుఃఖం భయం శోకం హర్షం మంగళమేవ చ

 సంపత్తిశ్చ విపత్తీశ్చ సర్వం భవతి కర్మణా

కర్మణా బహుపుత్రీచ వంశహీనశ్చ కర్మణా

కర్మణా రూపవాంశ్చైవ రోగీశశ్వత్ స్వకర్మణా

 కర్మణా మృతపుత్రశ్చ కర్మణా చీరజీవినః

 కర్మణా గుణవంతశ్చ కర్మణా చాంగహీనకా

తస్మాత్కర్మ పరం రాజన్ సర్వేభ్యశ్చ శ్రుతా శ్రుతం

 కర్మరూపే చ భగవాన్ తద్వారా ఫలదో హరిః

మహారాబి! నేను బ్రహ్మదేవునియొక్క మానసపుత్రిని. బ్రహ్మ నన్ను సృష్టించి కుమారస్వామికి భార్యగా వమ్న ఒసగెను. నేను షణ్మాతృ దేవతలలో ప్రఖ్యాతిగాంచిన స్కందసేనను. ప్రకృతియొక్క ఆరవంశను కావున నన్ను షష్ఠి అని కూడ పిలుతురు.

నేను పుత్రులులేని వారికి పుత్రులను, ప్రేయసిలేవి వారికి ప్రేయసిని, దరిద్రులకు ధనమును కర్మలు చేయువారికి శుభకర్మలను, ఇత్తును. జీవులకు పంపదయైనను, ఆపదయినను వారువారు చేసికొన్న కర్మలవలననే జరుగుమ. ఆ కర్మవలన జీవుడు బహుసంతానవంతుడుగామ, సంతాన హీనుడుగామ, రూపవంతుడుగాను, రోగిగాను, మృతపుత్రుడుగామ, చిరంజీవిగాను అగుచున్నాడు.

అందువలన కర్మ అన్నిటికంటే గొప్పదని వేదములందు చెప్పబడినది. శ్రీహరి ఆయా జీవులు చేసిన కర్మల ననుసరించి ఆయా ఫలితముల నొసగుచున్నాడు.

ఇత్యేవముక్త్యా సా దేవీ గృహీత్వా బాలకం మునే

మహాజ్ఞానేన సహ జీవయామాస లీలయా

రాజా దదర్శ తం బాలం సస్మితం కనకప్రభం

 దేవసేనా చ పశ్యంతం నృపమంబరమేవ చ

 గృహీత్వా బాలకం దేవి గగనం గంతుముద్యతా

పునస్తుష్టాన తాo రాజా శుష్కకంఠౌష్ఠాతాలుకః

వృషస్తోత్రేణ సా దేవీ పరీలుష్ణా బభూవ హ

 ఉవాచ తం నృపం బ్రహ్మన్ వేదోక్తం కర్మ నిర్మితం

షష్టీదేవి మహారాజుతో పై విధముగా అని చనిపోయిన ఆ బాలుని చేతిలోనికి తీసికొని అతనిని బ్రతికించెను. తనపుత్రుడు బ్రతికి నవ్వుతున్నట్లు కన్పించెను. అప్పుడు దేవి బాలకుని పట్టుకొని ఆకాశములోకి ఎగిరిపోపుటకు ప్రయత్నించినది, అప్పుడా రాజు తన పుత్రుడు బ్రతికినను సంతోషముతో ఉండగానే, దేవసేన శిశువుమ తన లోకమునకు తీసికొని పోమండుట చూచి పెదవులు గొంతు, నాలుక ఆరిపోగా. బాధతో ఆ దేవిని మరల స్తుతించెను,

రాజు చేసిన ప్రతికి సంతోషపడి ఆ దేవీ అతనితో ఇట్లనెను.

దేవసేనోవాచ- దేవసేన ఇట్లు పలికెను-

త్రిషులోకేషు రాణా త్వం స్వాయంభువ మనోః సుతః

 మమపూజాం చ సర్వత్ర కారయిత్వా స్వయం కురు

 తదాదాస్యామీ పుత్రం తే కులపద్మం మనోహరం

సువ్రతం నామ వీఖ్యాతం గుణవంతం సపండితం

జాతీష్మరం చ యోగీంద్రం నారాయణ పరాయణం

 శతక్రతుకరం శ్రేష్ఠం క్షత్రియాణాం చ వందతం

మత్తమాతంగలక్షాణాం ధృతవంతం బలం శుభం

ధన్విన గుణసం శుద్ధం విదుషాం ప్రియమేవ చ

యోగినం జ్ఞానినం చైవ సిద్ధరూపం తపస్వినం

యశస్వివం చే లోకేషు దాతారం సర్వసంపదాం

ప్రియవ్రత మహారాజా! నీవు ముల్లోకములకు రాజుపు, నీ తండ్రి మనుసైన స్వాయంభువు. అటువంటి వీపు నా పూజను స్వయముగా చేయుచు ఇతరులతో కూడ చేయింపుము. అప్పుడు నేను నీ పుత్రుని నీకు తిరిగి ఇత్తును.

నీ కుమారుడు సువ్రతుడను పేరుతో మంచిగుణములు కలవాడై, పండితుడై, తన గతస్మతి కలవాడై యుండును. అతడు శ్రీమన్నారాయణభక్తుడగును. అట్లే ఆతడు . నూరు రాజసూయయాగములు చేసి ఈ లోకమందున్న క్షత్రియులందరిచే మన్ననలు పొందును. అతడు మదించిన లక్ష ఏనుగుల బలము కలవాడై యోగియై, జ్ఞానియై తపస్వియై, యశస్వియై వెలుగొందుమ.

ఇత్యేవ ముక్త్వా సా దేవీ తస్మై తద్బాలకం దదౌ

 రాజా చ తం స్వీచకార తత్పూజార్థం చ సువ్రతః

జగామ దేవీ స్వర్గం చ దత్వా తస్మై శుభం వరం

ఆజగామ మహారాజః స్వగృహం హృష్టమానసః

ఆగత్య కథయా మాస వృత్తాంతం పుత్రహేతుకం

తుష్టా బభూవుః సంతుష్టా నర నార్యశ్చ నారద

 మంగళం కారయామాస సర్వత్ర సుతపాతుకం

 దేవీం చ పూజయామాస బ్రాహ్మణేభ్యో ధనం దదౌ

ఈ విధముగా దేవసేన సుప్రియవ్రత మహారాజుతో అనగా ఆతడు సరే అనెను. అప్పుడా దేవీ ఆ శిశువును మహారాజువకు ఇచ్చెను. ఆతనికి శుభములను కలుగజేయుచు స్వర్గమునకు వెళ్ళాను.

మహారాజు సంతోషముతో ఇంటికివచ్చి ఆందరకు తన పుత్రుని వృత్తాంతమును వినిపించగా వారందరు సంతోషించిరి.

తరువాత మహారాజు తనకు పుత్రుడు కలిగిన వేడుకను జరిపించెను. అట్లే దేవసేనను పూజించి బ్రాహ్మణులకు ధనమును పంచి పెట్టెను.

రాజా చ ప్రతిమాసేషు శుక్లషష్ఠ్యాం మహోత్సవం

 షష్ఠ్యా దేవ్యాశ్చ యత్నేన కారయామాస సర్వతః

 బాలానాం సూతీకాగారే షష్ఠాహే యత్న పూర్వకం

తత్పూజాం కారయామాస చైకవింశతి వాసరే

బాలానాం శుభకార్యే చ శుభాన్నప్రాశనే తథా

సర్వత్ర వర్ధయామాస స్వయమేవ చకార హ

ప్రియవ్రతుడు ప్రతినెలలో శుద్ధషష్ఠినాడు షష్ఠీదేవీ పూజను ఆంతట అందరిచే చేయించేను. పిల్లలు పుట్టిన ఆరవ దినమున, ఇరువది ఒకటవ నాడు అన్నప్రాశనము చేయించునాడు దేవసేనా దేవిపూజ అంతట జరుగునట్లు ఏర్పాటుచేసెను. ఆట్లే తానుకూడ ఆ దీనములలో దేవిని పూజించెను.

 ధ్యానం పూజా విధానం చ స్తోత్రం మత్తో నీశామయ 1

యచ్చ్రుతం ధర్మవక్త్రేణ కౌథుమోక్తం చ సువ్రత

శాలగ్రామే ఘటే వాఽథ వటమూల్మేఽథవా మునే

బిత్యాం పుత్తలికాం కృత్వా పూజయే ద్వా విచక్షణః

 షష్ఠాంశం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్ఠాం చ సువ్రతాం

 సుపుత్రదాం చ శుభదార దయారూపాం జగత్ర్పసూం

శ్వేతచంపకవర్ణాభాం రత్నభూషణ భూషితాం

పవిత్రరూపాం పరమాం దేవసేవామహం భజే

నారద! “దేవసేన" యొక్క ధ్యానశ్లోకములను, స్తోత్రమును, పూజావిధిని వినుము. ఇదీ కొథుమశాఖయందు కన్పించును, దీనిని ధర్మదేవత నాకు తెల్పెను.

. తొలుత సాలగ్రామమున లేక కలశమున కాకపోయినచో వటవృక్షముయొక్క మూలమున లేక గోడపై షష్ఠీదేవి బొమ్మను వేసి ఆమెను పూజింపవలెను.

ఆమె ప్రకృతియొక్క ఆరవ అంశ, పరిశుద్ధురాలు, మంచి ప్రతిష్ఠగలది. చక్కని పుత్రులనిచ్చునది. శుభములనిచ్చునది. కృపామయి. లోకములకు తల్లి, తెల్లని చంపక పుష్పములవంటి కాంతిగలది. రత్నాలంకారములు కలది పవిత్రమైనది. అట్టి దేవసేనను నేను సేవించుచున్నాను.

ఇతిధ్యాత్వా స్వశిరసి పుష్పం దత్వా విచక్షణః

పునర్ద్యాత్వా చ మూలేన పూజయేత్ సువ్రతః సతీం

పాద్యార్ఘ్యాచమనీయైశ్చ గంధధూపప్రదీపకై:

 నైవేద్ర్య ర్వివిధైశ్చాపి ఫలేన చ శుభేన చ

 మూలమోం హీం షష్ఠి దేవ్యై స్వాహేతి విధిపూర్వకం

 అష్టాక్షరం మహామంత్రం యథాశక్తి జపేన్నరః

తత్రస్తుత్వా చ నమతే భక్తియుక్త సమాహితః

స్తోత్రం చ సామవేదోక్తం ధనపుత్రఫలప్రదం

ఆష్టాక్షరం మహామంత్రం లక్షధా యో జపేన్నరః

 స పుత్రం లభతే నూనమిత్యాహ కమలోద్భవః

స్తోత్రం శ్రుణు మునిశ్రేష్ఠ సర్వేషాం చ శుభావహం

వాంఛాప్రదం చ సర్వేషాం గూఢం వేదే చ నారద

ఈవిధముగా ధ్యానించి పుష్పములను సమర్పించి మరల మూలమంత్రముచే ధ్యానము చేయవలెను. ఆ తరువాత ఆర్యము పాద్యము, ఆచమనీయము, గంధము, ధూపము, దీపము నైవేద్యము మొదలగు షోడశోపచారములతో దేవసేవా దేవిని పూజింపవలెను.

ఓం హీం షష్ఠిదేవ్యై స్వాహా ఆను ఆష్టాక్షరీ మంత్రము మూలమంత్రము. ఆ మంత్రమును యథాశక్తి జపించవలెను. దీనిని లక్షమార్లు జపము చేసినచో సంతానము కలుగునని బ్రహ్మదేవుడు చెప్పెను.

నారదమునీ! దేవసేనాదేవియొక్క సోత్రము అందరకు శుభమును కలిగించును, అన్ని కోరికలు తీర్చును. ఇది వేదములందు నిగూడమై ఉన్నది. ఆ స్తోత్రమును నీకు వినిపించెదను.

 ప్రియవ్రత ఉవాచ- ప్రియవ్రత మహారాజిట్లనెను-

నమోదేవ్యై మహాదేవ్యై సీధ్యైశాంత్యై నమో నమః

 సుఖదాయై మోక్షదాయై షష్ఠిదేవ్యై నమోనమః

వరదాయై పుత్రదాయై ధనదాయై నమోనమః

 సుఖదాయై మోక్షదాయై షష్ఠిదేవ్యై నమోనమః

శక్తిః షష్టాంశ రూపాయై సిద్ధాయై చ నమోనమః

 మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమోనమః

పరాయై పారదాయై చ షష్ఠిదేవ్యై నమో నమః

 సారాయై సారదాయై చ పారాయై సర్వకర్మణాం

బాలాధిష్ఠాతృదేవ్యై చ షష్టీ దేవ్యై నమోనమః

 కళ్యాణదాయై కళ్యాణ్యే ఫలదాయై చ కర్మణాం

 ప్రత్యక్షాయై చ భక్తానాం షష్ఠి దేవ్యై నమోనమః

 పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు

 దేవరక్షణ కొరియ్యై షష్ఠిదేవ్యై నమో నమః

 శుద్ధ పత్వ స్వరూపాయై వందితాయై నృణాంసదా

హింసా క్రోధైర్వర్జితాయై షష్ఠిదేవ్యై నమోనమః

ధనం దేహి ప్రియాం దేహి పుత్రం దేహి సురేశ్వరి

 ధర్మందేహి యశోదేహి షష్టీ దేవ్యై నమోనమః

భూమిం దేహి ప్రజాం దేహి దేహి విద్యాం సుపూజితే

కళ్యాణం చ జయం దేహి షష్ఠి దేవ్యై నమోనమః

 ఇతి దేవీం చ సంస్థూయ లేభే పుత్రం ప్రియవ్రత:

 యశస్వినం చ రాజేంద్రం షష్ఠిదేవీ ప్రసాదతః

షష్ఠీదేవి మహాదేవి సిద్ధిరూపిణి, శాంతి స్వరూపిణి, సుఖమును ప్రసాదించునది. మోక్షమును కల్గించునది. వరములను, పుత్రులను, ధనమును ఇచ్చునది. శక్తిరూపిణియైన ప్రకృతియొక్క ఆరవ అంశ. సిద్ధరూపిణి మాయాస్వరూపిణి, సిద్ధయోగిని, పరా, పారద, సార, పారద, పారారూపిణి, బాలురకు ఆధిష్టానదేవత. కల్యాణముల కలిగించునది. కల్యాణ రూపిణి. సమస్తకర్మల ఫలితము నొసగునది. భక్తులకు ప్రత్యక్షమగువది. పూజించ తగినది. కుమారస్వామికి భార్య, దేవతలను రక్షించునది. శుద్ధసత్వస్వరూప. మానవులందరిచే నమస్కరించదగినది. హింస, క్రోధము మొదలగు దుర్గుణములు లేనిది, అట్టి షష్ఠి దేవతమ నేను మాటిమాటికి నమస్కరింతును..

ఓ తల్లీ! నీవు నాకు ధనమును, భార్యను, పుత్రుని, ధర్మమును, కీర్తిని, భూమిని, సత్సంతానమును, శుభమును, జయమును, కల్గింపుము.

 ఈవిధముగా ప్రియవ్రతుడు షష్ఠీదేవిని స్తుతించి ఆమె అనుగ్రహమునువలన తన పుత్రుని పడసెను.

షష్ఠి స్తోత్రమిదం పుణ్యం యః శ్రుణోతి చ వత్సరం

 అపుత్రో లభతే పుత్రం వరం సుచిరజీవినం

 వర్షమేకం చ యో భక్త్యా సంయుక్త్వేదం త్రుణోతి చ

 సర్వపాపాదినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే

 వీరపుత్రం చ గుణినం విద్యావంతం యశస్వినం

 సుచిరాయుష్మంతమేవ షష్ఠీ మాతృప్రసాదతః

కాకవంధ్యా చ యా నారీ మృతాపత్యా చ యాభవేత్

వర్షం శ్రుత్వా లభేత్పుత్రం షష్ఠీదేవీ ప్రసాదతః

రోగయుక్తే చ బాలే చ పితామాతా శ్రుణోతి చ

 మాసం చ ముచ్యతే బాల: షష్ఠిదేవీ ప్రసాదతః

షష్ఠిదేవతయొక్క ఈ స్తోత్రమును సంవత్సర పర్యంతము ఎవరు విందురో వారికి పుత్రులు లేనిచో చిరంజీవియగు పుత్రుని, పొందుదురు. ఆ స్త్రీ ఎంత గొడ్రాలైనను సమస్త పాపములనుండి ముక్తిపొంది వీరుడు, మంచిగుణవంతుడు, విద్యావంతుడు కీర్తివంతుడు మంచి ఆయుస్సు కలవాడగు పుత్రుని ప్రసవించును. ఒకే సంతానము కలిగిన స్త్రీ లేక సంతానము కలిగిన తరువాత ఆ పంతానము నశించు స్త్రీ సైతము ఒక సంవత్సరకాలము ఈస్తోతమును భక్తితో పిన్నచో దీర్గాయుస్సు కల సంభావమును పొందును. అనారోగ్యముగా తమ సంతానమున్నచో ఆ శిశువు తలిదండ్రులు ఒక నెలవరకు నీయమముగా షష్ఠీదేవియొక్క స్తోత్రమును వినినచో ఆ శిశువు షష్ఠీదేవియొక్క అనుగ్రహమువలన రోగనిర్ముక్తుడగును.             

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వీతీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే షష్ఠ్యు పాఖ్యానే షష్టీ దేవ్యుత్పత్తి తత్పూజా స్తోత్రాది కథనం నామ శ్రీచత్వారింశత్రమోఽధ్యాయః

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతిఖండమును నారదనారాయణుల సంవాదమున చెప్పబడిన షష్ఠిదేవత ఉపాఖ్యానము షష్ఠీదేవి జననము, ఆమె పూజా స్తోత్రాదులు గల నలభైమూడవ అధ్యాయము సమాప్తము.