బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

54 –  సుయజ్ఞుడు గోలోకమున చేరుకొనుట

రాజోవాచ- మహారాజిట్లనెను-

కుత్రాధారో మహావిష్ణో సర్వధారస్య తస్య చ

కాలభీతస్య కతి చ కాలమాయా మునీశ్వర

క్షుద్రస్య కతిచిత్కాలాం బ్రహ్మణః ప్రకృతేస్తథా

మనోరింద్రస్య చంద్రస్య సూర్యప్యాయుస్తథైవ చ

ఆన్యేషాం వై జనానాం చ ప్రాకృతానాం పరం వయః

వేదోక్తం సువీచార్యం చ వదవేదవిదాం వర

 విశ్వావామూర్ధ్వభాగే చ కప్స్యాద్వా లోక ఏవసః

కథయస్య మహాభాగ సందేహిచ్ఛేదనం కురు

సమస్తమువకు ఆధారమైనవాడు, కాలమునకు భయముచెందు శ్రీమహావిష్ణువునకు ఆధారమేమి? కాలముయొక్క మాయ ఎంత ఉండును? క్షుద్ర విరాట్ స్వరూపుని ఆయుః కాలమెంత? అట్లే బ్రహ్మదేవుడు, ప్రకృతి, మనువు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు వీరి ఆయుర్దాయమెంత? అట్లే ఇతర ప్రాకృత జనుల కాలమెంత?

విశ్వములన్నిటియొక్క పై భాగమున ఎవరున్నారు? లేక ఏలోకమున్నది? ఈ సందేహములనన్నిటిని తీర్పుమని సుయజ్ఞుడడిగాను.

గోలోకో నృప విశ్వావారి విస్తృతశ్చ నభస్సమః

తథానిత్యం డింబరూపః శ్రీకృష్ణేచ్ఛా సముద్భవః

జలేన పరిపూర్ణశ్చ కృష్ణస్య ముఖబిందువా

సృష్ట్యున్ముఖస్యాది పరే పతీశాంతస్య భేలతః

ప్రకృత్యా సహ యుక్తస్య కళయా వీజయా నృప

తత్రాధారో మహావిష్ణో: విశ్వాధారస్య విస్తృతః

ప్రకృతేర్గర్భ సంయుక్త డింబోద్భూతస్య తస్య చ

సువిస్తృత జలాధారే శయానశ్చ మహావిరాట్

రాధేశ్వరస్య కృష్ణస్య జీడాంశః ప్రకీర్తితః

దూర్వాదళశ్యామరూపః సస్మితశ్చ చతుర్భుజః

వనమాలాధరః శ్రీమాన్ శోభితః పీతవాససా

ఊర్ధ్వం నభపి తదితో నిత్యమైకుంఠ ఏవచ

సమస్త విశ్వములకు పైభాగమున గోలోకమున్నది. ఆది, ఆకాశమువలె చాలా విశాలమైనది. శ్రీకృష్ణుని యొక్క ఇచ్ఛననుసరించి ఏర్పడినది. ఆ గోలోకము అండరూపముననుండును. శ్రీకృష్ణుడు ప్రకృతితో కలసి సృష్టిచేయవలెనని అనుకొన్నప్పుడు క్రీడయందు అలసిపోయిన ఆ పరమాత్మయొక్క ముఖమున ఏర్పడిన జలబిందువే జలరాశిగా ఏర్పడి గోలోకమున దాని క్రిందనున్న ఇతరలోకములలోను వ్యాపించినది.

ప్రకృతియొక్క గర్భముతో కలిసిన (పుట్టిన) అండమునుండి పుట్టిన విశ్వమునకు ఆధారమైన శ్రీమహావిష్ణువునకు పైన పేర్కొనబడ్డ గోలోకము ఆధారమగుచున్నది. ఆ శ్రీమహావిష్ణువే మహావిరాట్రూపుడు. ఆతడు అతివిశాలమైన జలము పై పవళించియుండును. ఆ మహావిరాడ్రూపుడు రాధేశ్వరుడగు శ్రీకృష్ణునియొక్క పదునారవ అంశభాగము. ఆ మహావిష్ణువు. గడ్డిపరక వలె నల్లని రూపముననుండును. ఆతనికి నాలు. భుజములుండును. ఆతడు వనమాలను, పీతాంబరమును ధరించియుండును. ఆతడుండు నిత్యవైకుంఠము అన్ని విశ్వముల పైన నుండును.

ఆత్మాఽకాశసమోనిత్యో విస్తృతశ్చంద్రబింబవత్

ఈశ్వరేచ్ఛాసముద్భూతో నిర్లక్ష్యశ్చ నిరాశ్రయః

ఆకాశవత్సువిస్తారో రత్నాఘైశ్చ వినిర్మితః

తత్ర నారాయణః శ్రీమాన్ వనమాలీ చతుర్భుజః

లక్ష్మీ సరస్వతీ గంగా తులసీపతిరీశ్వరః

సునందనంద కుముదపార్షదాదిభి రావృతః

సర్వేశ: సర్వసిద్దేశో భక్తానుగ్రహవిగ్రహః

శ్రీకృష్ణశ్చ ద్వీధాభూతో ద్విభుజశ్చ చతుర్భుజః

చతుర్భుజశ్చ వైకుంఠే గోలోకే ద్విభుజః స్వయం

ఊర్థ్వం వైకుంఠలోకాచ్చ పంచాశత్కోటి యోజనాత్

శ్రీమహావిష్ణువు నివసించు వైకుంఠము ఆత్మవలె నిత్యమైనది. ఆకాశమువలె విస్తారమైనది. చంద్రబింబమువలె ప్రకాశించునది. ఆలోకము శ్రీకృష్ణపరమాత్మయొక్క ఇచ్ఛవలన ఏర్పడినది. ఆది నిర్లక్ష్యము. దానికి ఆశ్రయముగా ఇతర లోకములు లేవు. ఆ లోకముననున్న నిర్మాణములన్నియు రత్నములచే చేయబడినవి.

ఆ వైకుంఠమున నాలుగు భుజములు కలవాడు, వనమాలాధరుడుగు శ్రీమహావిష్ణువుండును. అతనికి లక్ష్మీదేవి, సరస్వతి, గంగ, తులసి అను నలుగురు భార్యలు. అతని దగ్గర సునంద నంద, కుముద, మొదలగు అనుచరులుందరు.

సర్వేశ్వరుడు, సర్వసిద్ధులను కలిగించువాడు, భక్తులను సదో అనుగ్రహించువాడగు శ్రీకృష్ణపరమాత్మ తన ఇచ్చవలన ద్విభుజూడుగా, చతుర్భుజుడుగా రెండు రూపములను ధరించెను. చతుర్భుజుడగు శ్రీమహావిష్ణువు వైకుంఠముననుండగా ద్విభుజుడైన శ్రీకృష్ణ పరమాత్మ గోలోకముననే ఉండెను.

గోలోకో వర్తులాకార: వరిష్ఠస్సర్వలోకతః

అమూల్య రత్నఖచితైః మందిరైశ్చ విభూషితః

 రత్నేందసారఖచితైః స్తంభసోపాన చిత్రితైః

మణీంద్రదర్పణా సక్తైః కపాటై: కలశోజ్వలైః

నానాచిత్రవిచిత్రైశ్చ శిబిరైశ్చ విరాజితః

కోటియోజన విస్తీర్ణో దైర్ఘ్యే శతగుణస్తథా

సరీదర్ద ప్రమాణేన ధైర్ఘ్యేణ చ తతేన చ

శైలార్ధ పరిమాణేన యుక్తో బృందావనేన చ

తదర్ధమాన విలస ద్రాసమండల మండితః

సరిచ్చైల వనాదీనాం మధ్యే గోలోక ఏవ చ

యథా పంకజమధ్యే చ కర్ణికా సుమనోహరా

వైకుంఠలోకము పైన యాభై కోట్ల యోజనముల దూరమున గోలోకమున్నది. అది అన్ని లోకములకంటే గొప్పనిది. ఆ లోకము వర్తులముగా నుండును. ఆ లోకమున అమూల్య రత్నములచే నిర్మింపబడిన మందిరములున్నవి. అచ్చటి స్తంభములు, మెట్లుకూడ మణులచేతనే నిర్మింపబడినవి. ద్వారములకు మణిదర్పణములుండును. భవనములపై అనేక కలశములుండును. అట్లే అనేక చిత్ర విచిత్రములైన శిబిరములచట కలవు. ఆ లోకము కోటయోజన విస్తీర్ణమై దానికి నూరురెట్లున్న పాడవుతోనుండును. అచ్చట విరజ అనునదియు శతశృంగమను పర్వతమున్నది. విరజానదియొక్క పొడవులో సగము, శతశృంగపర్వతముయొక్క వైశాల్యములో సగభాగమున్న పొడవు వైశాల్యములు కల బృందావనము కలదు. ఆ బృందావనములో దీర్ఘ వైశాల్యములలో సగమున్న రాసముండలము కలదు.

పద్మముయొక్క మధ్యనున్న కర్ణికవలె విరజానది శతశృంగపర్వతము బృందావనముల మధ్య గోలోకమున్నది.

తత్ర గోగోపగోపీభిః గోపీతో రాసమండలే

రాసేశ్వర్యా రాధికయా సంయుక్త సంతతం నృప

ద్విభుజో మురళీహస్తః శిశుర్గోపాలరూపధృక్

వహ్నిశుద్ధాంశుకాధానో రత్నభూషణ భూషితః

చందనోత్క్షితసర్వాంగో రత్నమాలా విరాజితః

రత్నసింహాసనస్థశ్చ రత్నచ్చత్రేణ శోభితః

తథా సప్రియగోపాలైః సేవితః శ్వేత చామరైః

 భూషితాభిశ్చ గోపీభిః మాలాచందన చర్చితః

సస్మితః సకటాక్షాభిః సువేషాభిశ్చ వీక్షితః

గోలోకమున గోవులు, గొల్లలు, గోపికలతో, రాసేశ్వరియగు రాధికాదేవితో శ్రీకృష్ణుడుండును. అతడు రెండు భుజములు కలిగి గోపాలరూపమువనుండును. అట్లే పరిశుద్ధమైన వస్త్రము, రత్నభూషణములు ధరించి, శరీరమునందంతట చందనమును పూసికొని, రత్నముల మాల ధరించియుండుము. అట్లే ఆతడు ఆచ్చట రత్నసింహాసనమున, రత్నచ్చత్రము క్రింద తనకు మిక్కిలి ప్రియమైన గొల్లలు సేవించుచుండగా, గోపికలు చామరములు ఏయుచుండగా కూర్చొనియుండును. - గోపికాట్రలు చక్కగ ఆలంకరించుకొని చిరునవ్వుతో ఆ పరమాత్ముని చూచుచుందురు.

కథితో లోకవిస్తారో యథాశక్తి యథాగమం

యథాశ్రుతం శంభువక్త్రాత్ కాలమానం విశామయ

సుయజ్ఞమహారాజ! లోకములకు సంబంధించిన విషయమును ఆగమ శాస్త్రమున చెప్పిన విధముగా పరమేశ్వరుడు నాకు చెప్పిన దానివి నో శక్తికి తగినట్లు చెప్పితీనీ. ఇక, కాలప్రమాణమును వినుమనీ బ్రాహ్మణుడనెను.

పాత్రం షట్పల పంభూతం గభీరం చతురంగుళం

స్వర్ణమాషకృతచ్ఛిద్రం దండైచ్చ చతురంగుళై:

యావజ్జలప్లుతం పాత్రం తత్కాలం దండమేవ చ

దండద్వయం ముహూర్తం చ యామస్తస్య చతుష్టయం

వాసరశ్చాష్టభిర్యామై: పక్షస్తీర్ణశ పంచభిః

మాపో దాభ్యాం చ పక్షోభ్యాం వర్షం ద్వాదశ మాపకై:

మాపేన వై నరాణాం చ పితృణాం తదహర్ద్నీశం

కృష్ణపక్షే దివం ప్రోక్తం శుక్లే రాత్రి: ప్రకీర్తితా

వత్సరేణ నరాణాం చ దేవతానాం దీవానిశం

అయనం హ్యుత్తరమహో రాత్రిర్త్వై దక్షిణాయనం

యుగకర్మానురూపం చ నరాదీనాం వయోనృప

ఆరు పలముల బరువుగల పాత్రను తీసికొనవలెను. ఆపాత్ర యొక్క లోతు నాలుగంగుళములుండవలెను. దానికి మాపమెత్తు బంగారముచే చేసిన కత్తితో పన్నువి రంధ్రము నేర్పరుపవలెను. అట్లే నాలుగంగుళములు పొడవైవ నాలుగు కల నుంచవలెను. రంధ్రముమండి జారిపడు వీటివలన నీటిలోనున్న పాత్ర ఎప్పుడు ముసుగునో ఆ సమయమును దండమని పిలుతురు. అటువంటి రెండు దండముల పమయమున ముహూర్తమందురు. అట్టి ముహూర్తములు నాలైనచో ఒక యామమందురు. ఎనిమిది యామముల కాలము ఒక దీనమగును. పదునైదు దినములు ఒక పక్షమగును. రెండు వక్షములు ఒక మామగుమ. ఇది ఏత్సదేవతలకు ఒక దీనమగుమ. వారికి కృష్ణపక్షము పగలు శుక్లపక్షము రాత్రి. మానవుల సంవత్సరము దేవతలకు దినమగుమ, ఉత్తరాయణము వారికి పగలు. దక్షిణాయనము వారికి రాత్రి కాలము. మానవులు మొదలగు జీవులకు యుగధర్మముమ, వారివారి కర్మలనమపరించి వయస్సుండును.

ప్రకృతేః ప్రాకృతానాం చ బ్రహ్మాదీనాం నిశామయ

కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చేతి చతుర్యుగం

 దివ్యై: ద్వాదశసాహస్రైః సావధావం నిశామయ

చత్వారి త్రీణిచ ద్వ్యేకం సహస్రాణి కృతాదికం

తేషాం చ సంధ్యాసంధ్యాధ్యాం ద్వేసహసే ప్రకీర్తితo

త్రిచత్వారింశకైర్లక్షైస్సవింశతి సహస్రకై:

చతుర్యుగం పరిమితం నరమానక్రమేణ చ

లక్షైశ్చ సప్త దశభిః పాష్ట్రవంశసహస్రకైః

 కృత యుగం నృమావేవ సంఖ్యావిద్భిః ప్రకీర్తితం

సహస్రైః షణ్ణవతిభీర్ణక్షై ర్ద్వాదశభిప్సహ

త్రేతాయుగం పరిమితం కాలవీద్భిః ప్రకీర్తితం

అష్టలక్షైస్సహమితం చతుష్టష్టి సహస్రకం

పరిమాణం ద్వాపరస్య సంఖ్యావిద్భీరితీరితం

సద్వాత్రింశత్పహస్సైశ్చ చతుర్లక్షైశ్చ వత్పరైః

నృమానాద్వా కలియుగం విదుః కాలవిదో బుధా:

తత్ర సప్త చ వారా వై తిథయః. షోడశస్మృతాః

దివారాత్ర్యశ్చ పక్షాద్వౌ మాసో వర్షం చ నిర్మితం

ప్రకృతి, ప్రాకృతులగువారు, బ్రహ్మాదిదేవతల ఆయుస్సును గురించి వినుము.

కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనునవి నాలుగు యుగములు. పన్నెండువేల దివ్య సంవత్సరములు నాలుగు యుగములగును. కృతయుగము నాలుగు దివ్య సహస్ర పరిమితము. త్రేతాయుగమున మూడు దీప్య సహాస్రములుండును. ద్వాపరయుగము రెండు దీవ్య సహస్ర వర్షపరిమీతము. కలియుగము వేయి దివ్య సంవత్సరములుండును. ఈ యుగముల సంధికాలము. సంధ్యంశకాలము రెండువేల సంవత్సరములుండును.

మానవ కాలమానము ప్రకారము నాలుగుయుగముల కాలము నలభైమూడు లక్షల ఇరవైవేల సంవత్సరములు, ఇందు కృతయుగము పదిహేడులక్షల ఇరవై ఎనిమిదివేల సంవత్సరములుండును. త్రేతాయుగము పన్నెండు లక్షల తొంభైయారు వేల సంవత్సరములుండును. ద్వాపరయుగము ఎనిమిది లక్షల ఆరవైనాల్గువేల సంవత్సరములుండును. కలియుగము తొలుగులక్షల ముప్పైరెండువేల సంవత్సరములుండును.

ఏడుదినముల వారము. పదహారు తిథులు, రాత్రింబగళ్ళు, రెండు పక్షములు, మాసము, సంవత్సరము అను ప్రకారముగా కాలముండును.

తథాభ్రమతి తచ్చక్రం ఏవమేవంచతుర్యుగం

తథాయుగానీ, రాజేంద్ర తథా మన్వంతరాణి చ

మన్వంతరం తు దీవ్యానాం యుగానామేక సప్తతిః

ఏవం క్రమాద్భ్రమంత్యేవ మనవశ్చ చతుర్దశః

పంచవింశతి సాహసం షష్ఠ్యంత శతపంచకం

నరమానయుగం చైవ పరం మన్వంతరం స్మృతం

చక్ర మేవిధముగా గుండ్రముగా తిరుగుచుండునో అట్లే యుగములు మన్వంతరములు ఒకదాని తరువాత ఒకటి తిరుగుచుండును. మన్వంతరమనగా ఇరువదియొక్క దీవ్యయుగములు. మానవ మానప్రకారము మన్వంతరము ఇరువదిఐదువేల ఐదువందల ఆరుయుగములు.

ఆఖ్యానం చ మనూనాం చ ధర్మిష్ఠానాం నరాధిప

యత్ శ్రుతం శివవక్త్రేణ తత్వం మత్తో నిశామయ

ధర్మీష్టులైన మనువులయొక్క చరిత్రను శంకరుడు నాకు చెప్పినట్లు నీకు తెల్పుదునని బ్రాహ్మణుడు సుయజ్ఞానితో అనెను.

ఆద్యోమనుః బ్రహ్మపుత్రః శతరూపాపతివ్రతా

ధర్మిష్ఠానాం వరిష్ఠశ్చ గరిష్ఠో మనుషు ప్రభుః

స్వాయంభువః శంభుశిష్యో విష్ణువ్రత పరాయణః

జీవన్ముక్తో మహాజ్ఞానీ భవతః ప్రపితామహః

రాజసూయ సహస్రం చ చక్రే వై నర్మదా తటే

త్రిలక్షమశ్వమేధం చ త్రిలక్షం నరమేధకం

గోమేధం చ చతుర్లక్షం వీధివన్మహదద్భుతం

బ్రాహ్మణానాం త్రి కోటీశ్చ భోజయామాస నిత్యశః

పంచలక్షగవాం మాంసైః సుపక్వైః: ఘృత సంస్కృతైః

 చన్యైశ్చోష్యైల్లేహ్యపేయై: మిష్టద్రవ్యైః సుదుర్లభైః

ఆమూల్య రత్నలక్షం చ దశ కోటి సువర్ణకం

స్వర్ణశృంగయుతం దివ్యం గవాం లక్షం సుపూజితం

ఓ మహారాజా! మొదటి మనువు స్వాయంభువు. అతడు బ్రహ్మదేవుని పుత్రుడు. ఆ మనువుయొక్క భార్య పేరు శతరూప. అతడు పరమ ధర్మిష్ణుడు. మమవులలో శ్రేష్టుడు. విష్ణుమూర్తికి పరమభక్తుడు. ఆతని గురువు సాక్షాత్ శంకరుడే. ఆతడు నీకు ముత్తాత యగును. స్వాయంభువమము నర్మదానదీ తీరమున వేయి రాజసూయయాగములను, మూడు లక్షల అశ్వమేధయాగములను, మరో మూడు లక్షల నరమేధములమ, నాలుగు లక్షల గోమేధములమ శాస్తోక ప్రకారమున పూర్తిచే సెను.

ఆ మనువు యజ్ఞములు చేయుచున్నప్పుడు ప్రతిదినము మూడు కోట్ల బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనము చేయించుచుండెను. తరువాత ఆ బ్రాహ్మణులకు లక్షలకొలది అమూల్య రత్నములను, పదికోట్ల బంగారు నాణెములను, బంగారు కొమ్ములు కల (కొమ్ములకు బంగారురేకు చుట్టిన) లక్షలకొలది ఆవులను దానముచేసెను.

వహ్నిశుద్ధాని వస్త్రాణి. మునీంద్రాణాం చ లక్షకం

భూమిం చ సర్వ సస్యాడ్యాం గజేంద్రాణాం చ లక్షకం

త్రిలక్షమశ్వరత్నం చ శాతకుంభ విభూషితం

సహస్రం రథరత్నం చ శిబికా లక్షమేవ చ

త్రికోటి స్వర్ణపత్రాణి సాన్నం సజల మీప్సితం

 త్రికోటి స్వర్ణభూషాశ్చ కర్పూరాదీ సువాసితం

తాంబూలం సువిచిత్రం చ త్రికోటి స్వర్ణతల్పకం

 రత్నేంద్ర ఖచితైర్మంచైరచితైర్విశ్వకర్మణా

వహ్నిశుద్ధాంశుకైశ్చిత్రై రాజీతం మాల్యజాలకై:

నిత్యం దదౌ బ్రాహ్మణేభ్యో విష్ణుప్రీత్యా శివాజ్ఞయా

సంప్రాప్య శంకరాత్ జ్ఞానం కృష్ణమంత్రం సుదుర్లభం

సంప్రాప్య కృష్ణదాస్యం చ గోలోకం వై దిగామ నః

మునీశ్వరులకు పరిశుద్ధమైన లక్షవస్త్రములను, మంచి సస్యములున్న భూమిని, లక్షలకొలది ఏనుగులను, మూడు లక్షల గుజములను, లక్ష పల్లకీలను, వేయి రథములను, మూడుకోట్ల బంగారు పత్రములను దానముచేసెను. ఇంకను మూడుకోట్ల బంగారు ఆభరణములను, కర్పూరము మొదలగు సువాసన ద్రవ్యములు గల తాంబూలమును, మూడుకోట్ల బంగారు శయ్యలను, రత్నఖచితమైన మంచములను మాలలను విష్ణుమూర్తికి ప్రీతీకలుగుటకై శంకరుని ఆజ్ఞననుసరించి ప్రతిదీనము దానము చేయుచుండెను.

తనకు విద్యాగురువు, జ్ఞానగురువగు శంకరుని వలన మంచి జ్ఞానమును, శ్రీకృష్ణమంత్రమును, శ్రీకృష్ణదాస్యమును పొంది చివరకు శ్రీకృష్ణుని సన్నిధియైన గోలోకమును చేరుకొనెను.

దృష్ట్వాముక్తం స్వపత్రం చ ప్రహృష్టోఽభూత్ప్రజాపతిః

తుష్టావ శంకరం తుష్ట సస్పజేఽన్యం మనుం విధిః

యతః స్వయంభుపుత్రాయమత: స్వాయంభువోమను:

. బ్రహ్మదేవుడు తనపుత్రుడగు స్వాయంభువమనువు ముక్తిని పొందేనని తెలుసుకొని తన పుత్రుని ముక్తికి కారణమైన శంకరుని స్తుతించెను. స్వయంభుపుత్రుడు కావున అతడు స్వాయంభువు ఆయెను.

స్వాయంభువ మనువు తరువాత బ్రహ్మదేవుడు ఇంకొక మనువును సృష్టించేను.

స్వారోచిషో మనుశ్చైవ ద్వితీయో వహ్నినందనః

రాజా వదాన్యో ధర్మిష్ఠ: స్వాయంభువసమోమహాన్

ప్రియవ్రతసుతావన్యౌ ద్వౌ మనూ ధర్మిణాం వరౌ

తౌ తృతీయౌ చతుర్థి చ వైష్ణమౌ తాపసోత్తమౌ

తౌ చ శంకర శిష్యౌ చ కృష్ణభక్తి పరాయణౌ

ధర్మిష్ఠానాం వరిష్ఠశ్చ రైవతః పంచమోమనుః

షష్ఠశ్చ చాక్షుషో జ్ఞేయః: విష్ణుభక్తి పరాయణః

శ్రాద్ధదేవః సూర్యసుతో వైష్ణవః సప్తమో మనుః

సావర్ణి: సూర్యతనయో వైష్ణవో మనురష్టమః

నవమో దక్షసావర్ణి: విష్ణువత పరాయణః

దశమో బ్రహ్మసావర్లీ: బ్రహ్మజ్ఞాన విశారదః

తతశ్చ ధర్మసావర్ణిః మనురేకాదశస్మృతః

ధర్మిష్ఠశ్చ వరిష్ఠశ్చ వైష్ణవ వ్రత తత్పరః

జ్ఞానీ చ రుద్రసావర్ణిః మనుశ్చ ద్వాదశ స్మృతః

ధర్మాత్మా దేవసావర్ణి; మనురేవం త్రయోదశ

చతుర్దశో మహాజ్ఞానీ చంద్రసావర్ణిరేవ చ

యావదాయుర్మమానాం స్యాదింద్రాణాం తావదేవ హి

రెండవ మనువైన స్వారోచిషమనువు అగ్నిదేవుని పుత్రుడు. ఆ మనువుకూడ స్వాయంభువ మనువువలె వరమధార్మికుడు, అంతులేని దానములు చేసినవాడు. మూడవ, నాలుగవ మనువులు ప్రియవ్రత మహారాజు పుత్రులు. వారుకూడ గొప్ప ధార్మికులే. వారిద్దరు కృష్ణభక్తి పరాయణులు. వారీగురువు మహేశ్వరుడు. ఐదవ మనువు రైవతమనువు, ఆరవ మనువు విష్ణుభక్తి పరాయణుడైన చాక్షుష మనువు. ఏడవ మనువు సూర్యపుత్రుడైన శ్రాద్ధదేవుడు. ఎనిమిదవ మనువుకూడ సూర్యునియొక్క పుత్రుడే. అతని పేరు సావర్ణి. తొమ్మిదవ మనువు దక్షసావర్ణి, పదవ మనువు. పేరు బ్రహ్మసాపల్లి. పదకొండవ మనువు పేరు ధర్మసావర్ణి, పన్నెండవ మనువు రుద్రసావర్ణి. పదమూడవ మమపు దేవసావర్ణి, పదనాలుగవ మనువు ఆంతులేనీ జ్ఞాన సంపన్నుడైన చంద్రసావర్ణి.

ఈ మనువులందరు పరమ ధర్మిష్ఠులై మహాజ్ఞానులై శ్రీకృష్ణుని ఆరాధించినవారే. - మనువులయొక్క వయసెంత ఉండునో ఇంద్రుల వయస్సుకూడ ఆంతే ఉండును. అనగా ఇంద్రుని వయస్సుకూడ డెబ్సైయొక్క దివ్య యుగములు, మానవ మావముననుసరించినచో ఇరువదిఐదువేల ఐదువందల ఆరు యుగములుండును.

చతుర్దశేంద్రావచ్చిన్నం బ్రహ్మణో దినముచ్యతే

తావతీ బ్రహ్మణో రాత్రిః సా చ బ్రహ్మీ నిశానృపః

 కాలరాత్రిశ్చ సాజ్ఞేయా వేదేషు పరికీర్తితా

బ్రహ్మణోవాసరో రాజన్ క్షుద్రకల్పః ప్రకీర్తితః

 సప్తకల్పే చిరంజీవి మార్కండేయో మహాతపాః

బ్రహ్మలోకాదధః సర్వేలోకా దగ్దాశ్చ తత్రవై

ఉత్థితేనైవ సహసా సంకర్షణముఖాగ్నినా

చంద్రార్క బ్రహ్మపుత్రాశ్చ బ్రహ్మలోకం గతాధ్రువం

 బ్రహ్మరాత్రి వ్యతితే తు పునశ్చ ససృజే విధి:

తస్యాం బ్రహ్మనిశాయాం చ క్షుద్రః ప్రళయ ఉచ్యతే

 దేవాశ్చ మవవశ్చైవ తత్ర దగ్ధా నరాదయ:

ఏవం త్రింశద్దిహరాత్రైర్భ్ర ణో మాసఏవ చ

వర్షం ద్వాదశమాసైశ్చ బ్రహ్మసంబంధి చైవ హి

ఏవం పంచదశాబ్ధే తు గతే చ బ్రహ్మణో వృప

 దైనందిన స్తు ప్రళయో వేదేషు పరికీర్తితః

మోహరాత్రశ్చ సాప్రోక్తా వేదవిదీః పురాతనైః

తత్ర సర్వే ప్రణష్టా స్పు చంద్రార్కాది దిగీశ్వరా

ఆదిత్యా వసవో రుద్రా మనతో మానవాదయః

ఋషయో మువయశ్చైవ గంధర్వా రాక్షసాదయః

మార్కండేయో లోమశశ్చ పేచకశ్చిరజీవినః

ఇంద్రద్యుమ్నశ్చ నృపతిశ్చాకూపారశ్చ కచ్ఛపః

నాడీజంఘో బకశ్చైవ సర్వే నష్టాశ్చ తత్ర వై

బ్రహ్మలోకా దధ స్సర్వే లోకా నాగాలయాప్తథా

బ్రహ్మలోకం యయుః సర్వే బ్రహ్మపుత్రాదయస్తథా

గతే దైనందినే బ్రహ్మా లోకాంశ్చ ససృజే పున:

పదునలుగురు ఇంద్రులు గతించినచో బ్రహ్మదేవునకు ఒక పగలగుమ. అట్లే పదునలుగురు ఇంద్రులు గతించిన కోలము అతనికి రాత్రియగును. ఆ రాత్రినే బ్రహ్మ రాత్రియని యందురు. ఆ రాత్రిని వేదములలో కాలరాత్రియని చెప్పబడినది.

బ్రహ్మదేవునకు ఒకదినము గడచినచో దానిని క్షుద్ర కల్పమనీ అందురు.

చీరంజీవియగు మార్కండేయుడు ఏడు కల్పములవరకు జీవించును.

బ్రహ్మలోకము క్రిందనున్న లోకములన్నియు సంకర్షణుని (ఆదిశేషుని) ముఖమునుండి బయలుదేరిన ఆగ్నేవలన దగ్గములగుచున్నవి. ఆ సమయమున సూర్యుడు, చంద్రుడు, ఇతర బ్రహ్మపుత్రులందరు బ్రహ్మలోకమునకు పోవుదురు. ఆ బ్రహ్మరాత్రి గడచిన పిమ్మట అనగా క్షుద్రకల్పము తరువాత బ్రహ్మదేవుడు తిరిగి సృష్టికార్యమును ప్రారంభించును. ఈ బ్రహ్మరాత్రియందు దేవతలు మనుషులు, మానవులు మొదలగు జీవులన్నీయు చనిపోవును..

బ్రహ్మదేవునకిట్టి రాత్రిపగలు (దినము) ముప్పదియైనచో ఒక బ్రహ్మపమగును. ఇటువంటి పన్నెండు మాసములు గడచినచో బ్రహ్మదేవునకు ఒక సంవత్సరమగును. ఈ విధముగా బ్రహ్మదేవువకు పదునైదు సంవత్సరములు గడచినచో దానిని దైనందిన ప్రళయమందురు. ఆ దైనందిన ప్రళయమును వేదములు తెలిసిన పెద్దలు మోహరాత్రియని అందురు. ఆ సమయమున సూర్యచంద్రులు దిక్పాలకులు, ఆదిత్యులు, వసవులు, ఏకాదశరుద్రులు, చతుర్ధశ మనువులు, ఋషులు, మునులు, గంధర్వులు, రాక్షసులు మొదలగువారందరు నశించి పోవుదురు.

ఆ సమయమున చిరంజీవులగు మార్కండేయుడు, లోమశుడు, పేచకుడనువారు మాత్రముందురు, ఇంద్రద్యుమ్నుడను రాజు, ఆకూపారుడు, కచ్చపుడు, వాడీజంఘుడు, బకుడు మొదలగు వారందరు నశింతురు. బ్రహ్మలోకము క్రిందమన్న నాగలోకములన్నియు అప్పుడు నశించిపోవును.

ఈ దైనందిన ప్రళయము గడచిన పిదప బ్రహ్మదేవుడు మరల లోకములను సృష్టించుము.

ఏవం శతాబ్ద పర్యంతం పరమాయుః ప్రజాపతేః

 బ్రహ్మణశ్చ నిపాతే న్మహాకల్పో భవే న్నృప

ప్రకీర్తితా మహారాత్రి: సైవ చేహ పురాతనైః

బ్రహ్మణశ్చ నిపాతే చ బ్రహ్మాండౌఘో జలప్లుతః

దేవమాతా చ సావిత్రీ వేదా ధర్మాదయస్తథా

సర్వేప్రణష్ఠా మృత్యుశ్చ ప్రకృతిం చ శివం వినా

 నారాయణే ప్రలీసాశ్చ విశ్వస్థా వైష్ణవాస్తథా

కాలాగ్నిరుద్రః సంహర్తా సర్వరుద్రగణైః సహ

మృత్యుంజయే మహాదేవే ప్రలీనః స తమోగుణః

 బ్రహ్మణశ్చ నిపాతేన నిమేష: ప్రకృతేర్భవేత్

నారాయణస్య శంభోశ్చ మహావిష్ణోశ్చ నిశ్చితం

నిమేషాంతే పునః సృష్టి భవేత్కృష్ణేచ్ఛయా పునః

ఈవిధముగా నూరుసంవత్సరములు బ్రహ్మదేవుని ఆయుస్సు ఉండును. బ్రహ్మదేవునకు నూరు సంవత్సరములు నిండినచో బ్రహ్మదేవుడు గతించును. దానిని మహాకల్పమనీ అందురు. మహారాత్రి అనికూడ ఏలుతురు. ఆ సమయమున బ్రహ్మాండములన్నీయు నీటిలో మునిగిపోవును. దేవమాతయైన. అదితి, సావిత్రీదేవి, వేదములు, ధర్మము మొదలగునవన్నియు నశించుమ, మృత్యువు, ప్రకృతి, శివుడు మాత్రము మీగులుదురు.

ఆ సమయమున వైష్ణవులందరు వారాయణుని యందు లీనమగుదురు, సంహారకారుడైన కాలాగ్ని రుద్రుడు మొదలగు రుద్రులందరు తమోగుణముతో కలిసి మృత్యుంజయుడగు మహాదేవునియందు విలీనమగుదురు,

బ్రహ్మదేవుడు గతించినచో ఆ కాలము ప్రకృతికి ఒక ఏమీషకాలము. నారాయణునకు, మహాదేవునకు మహావిరాడ్రూపుడైన శ్రీమహావిష్ణువునకు కూడ నిమిషలమగును. ఆ నిమిషకాలము తరువాత శ్రీకృష్ణపరమాత్మయొక్క ఇచ్ఛనుసరించి మరల పృష్టికార్యము ప్రారంభమగును.

కృష్ణో నిమేష రహితో నిర్గుణః ప్రకృతేః పరః

సగుణానాం నిమేషశ్చ కాలసంఖ్యాపయోమితః

నీర్గుణస్య చ నిత్యస్య చాద్యంత రహితస్య చ

నిమేషాణాం సహస్రేణ ప్రకృతేర్ధండ ఉచ్యతే

షష్టిదండాత్మికాస్తస్యా వాసరశ్చ ప్రకీర్తితః

త్రింశద్రాత్రిందినైర్మాసో వర్షం ద్వాదశమాసకైః

 ఏవం గతే శతాబ్ధే చ శ్రీకృష్ణే ప్రకృతేర్లయః

ప్రకృత్యాం చ ప్రలీనాయాం శ్రీకృష్ణ ప్రాకృతోలయః

సర్వాన్ సంహృత్య సా చైకా మహావిష్ణో ప్రసూశ్చయా

కృష్ణవక్షసి లీనా చ మూలప్రకృతి రీశ్వరీ

శ్రీకృష్ణునకు నిమేషము (రెప్పపాటు) లేదు. అతడు నిర్గుణుడు ప్రకృతికంటే విశిష్ఠుడు. సగుణులయొక్క నిమేషములకే కాలము, సంఖ్యా, వయస్సు అనునవి యుండును. నిర్గుణుడు విత్యుడు, ఆద్యంత రహితుడైన ఆ పరమాత్మకు కాల సంఖ్యావయ: పరిమితి ఎట్లుండును? "

ప్రకృతికి వేయి నిమేషములైనచో ఆ కాలమును దండమందురు. ఆరవై దండముల కాలము ప్రకృతికి ఒక దినమగుమ. ఆట్టి దినములు ముప్పది గడిచినచో ప్రకృతి మాసమగును. ప్రకృతి మాసములు పన్నెండు గడచినచో అది ప్రకృతి సంవత్పరమగును. ఆట్టి ప్రకృతి సంవత్సరములు నూరు గడచినచో ప్రకృతి లయము జరుగును. ప్రకృతియొక్క లయమును ప్రాకృత లయమని కూడ ఆందురు. అప్పుడు మూలప్రకృతి అందరిని సంహరించి శ్రీకృష్ణుని వక్షస్థలమున విలీనమైపోవును.

సంతో వదంతి తాం దుర్గాం విష్ణుమాయాం సనాతనీం

సర్వశక్తి స్వరూపాం చ పరాం నారాయణీం సతీం

బుద్ధ్యధిష్ఠాతృదేవీంచ శ్రీకృష్ణస్యైవ నిర్గుణాం

యన్మాయా మోహితాశ్చ బ్రహ్మవిష్ణు శివాదయః

వైష్ణవాస్తాం మహాలక్ష్మీం పరాం రాధాం వదంతి తే

అర్ధాంగాం చ మహాలక్ష్మీః ప్రియానారాయణస్య చ

ప్రాణాధిష్ఠాతృదేవీం చ ప్రేమ్ణా ప్రాణాధికాం వరాం

 స్థిరమమయీం శక్తిం నిర్గుణాం నిర్గుణవ్య చ

నారాయణశ్చ శంభుశ్చ: సంహృత్య స్వగణాన్ బహూన్

శుద్ధసత్వస్వరూపే శ్రీకృష్ణే లీనశ్చ నిర్గుణే

గోపా గోప్యశ్చ గావశ్చ సవతాశ్చ నరాధిప

సర్వే లీనాః ప్రకృత్యాం చ ప్రకృతిః పరమేశ్వరే

మహావిష్ణౌ పలినాశ్చ తే సర్వే క్షుద్రవిష్ణవః

మహావిష్ణుః ప్రకృత్యాం చ సా చైవ పరమాత్మని

ప్రకృతిర్యోగనిద్రాచ శ్రీకృష్ణునయన ద్వయే

అధిష్టానం చకారైవం మాయయా చేశ్వరేచ్చయా

మూల ప్రకృతిని దుర్గయనియు, విష్ణుమాయ యనియు పెద్దలు చెప్పుదురు. ఆమె సనాతవి, సర్వక్తి రూపిణి, వారాయణి, ఆ దేవి శ్రీకృష్ణునకు నిర్గుణస్వరూపిణి, బుద్ధికి అధిష్టాన దేవత. ఆ దేవియొక్క మాయవలన బ్రహ్మ విష్ణు శివాదులందరు మోహమును చేందుచున్నారు. వైష్ణవులందరు ఆ దేవిని “మహాలక్ష్మి" యనియు "పరరాఢ" అవీయు పిలుచుచున్నారు. ఆ దేవి నారాయణునకు ఆర్ధాంగి, ఆతనికి ప్రియురాలు. నిర్గుణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ప్రాణములకు వీరుణమైన రాధాదేవి ఆధిష్టానదేవత. ప్రేమవలన ప్రాణములకంటె మిన్నయైనది. సుస్థిరమైన ప్రేమగలది.

నారాయణుడు, మహాదేవుడు తమ తమగణములను ఉపసంహరించుకొని శుద్ద సత్వస్వరూపుడు, నిర్గుణుడు అగు శ్రీకృష్ణ పరమాత్మునిలో విలీనమగుదురు. గోపులు, గోపికలు, దూడలతోనున్న గోవులన్నియు ప్రకృతిలో లీనముకాగా ఆ ప్రకృతి పరమాత్మయందు విలీనమగును. సమస్త క్షుద్ర విష్ణువులు శ్రీమహావిష్ణువులో విలీనము కాగా మహావిష్ణువు ప్రకృతియందు విలీనమగును. ఆ ప్రకృతి పరమాత్మలో విలీనమగును. ప్రకృతి, యోగనిద్ర ఈ రెండు శ్రీకృష్ణురమాత్మయొక్క నయనములలో మాయ మరియు ఈశ్వరేచ్ఛ వలన నివాసముండినవి.

ప్రకృతే ర్వాసరో యావన్మతః కాలః ప్రకీర్తితః

తావత్ బృందావనే నిద్రా కృష్ణస్య పరమాత్మనః

అమూల్యరత్నతల్పే చ వహ్ని శుద్ధాంశుకార్చితే

గంధచందన మాల్యౌషు వాయ్వాదిసురభికృతే

పునః ప్రజాగరే తస్య సర్వసృష్టిర్భవేత్పునః

ఏవం సర్వే ప్రాకృతాశ్చ శ్రీకృష్ణం నిర్గుణం వినా

తద్వందనం తస్మరణం తస్య ధ్యానం తదర్చనం

కీర్తనం తదుణానాం చ మహాపాతక నాశనం

ఏతత్తే కథితం సర్వం యద్యన్మృత్యుంజయాచ్చృతం

యథాగమం మహారాజ కిo భూయః శ్రోతుమిచ్ఛసి

ప్రకృతియొక్క ఒక దిన (రాత్రిందినము) కాలమున శ్రీకృష్ణుడు బృందావనమున అమూల్యమైన రత్నతల్పమున, పరిశుద్ధమైన వస్త్రము పై గంధము, మాలలయొక్క సువాసనలు గుబాళించుచుండ నీద్రపోవును.

ఆ పరమాత్మ మేల్కొనగానే మరల సమస్త సృష్టికార్యక్రమము ప్రారంభమగును. నిర్గుణుడగు శ్రీకృష్ణపరమాత్మ తప్ప మిగిలిన వారందరు ప్రాకృతులు.

ఆ శ్రీకృష్ణ పరమాత్మను నమస్కరించుట, ఆతనిని స్మరించుట ఆతనిని ధ్యానము, ఆతని అర్చన, ఆతని. మంగళ గుణకీర్తనచేసినచో సమస్త మహాపాపములు నాశనమై పోవును.  శ్రీమహాదేవుని వలన విన్న ఈ విషయమంతయు నీకు తెల్పితిని.

సుయజ్ఞ ఉవాచ- సుయజ్ఞ మహారాజిట్లనెను-

కాలాగ్ని రుద్రో విశ్వాసం సంహర్తా చ తమోగుణః

బ్రహ్మణేఽoతే విలీనశ్చ సత్వం మృత్యుంజయే శివే

 శివో లీనో నిర్గుణేచ శ్రీకృష్ణే ప్రాకృతేలయే

కథం తవ గురోర్నామ మృత్యుంజయ ఇతివ్రతం

కథం ప్రసూర్మహావిష్ణోర్మూల ప్రకృతిరీశ్వరీ

అసంఖ్యాని చ విశ్వాని సంతివై యస్య లోమసు

కాలాగ్నిరుద్రుడు సమస్త విశ్వములను సంహరించువాడవి. ఆతడు తమోగుణుడని, మీరు చెప్పితిరి. అట్లే ఆ కాలాగ్ని రుద్రుడు బ్రహ్మదేవుని జీవిత కాలాంతమున మృత్యుంజయుడైన శివునిలో విలీనమైనట్లు చెప్పితం. ఆ మృత్యుంజయుడు ప్రాకృత లయమున నిర్గుణుడైన శ్రీకృష్ణ పరమాత్మలో విలీనమై మృత్యువును పొందినందువలన అతడు మృత్యుంజయుడెట్లు ఆగుసు?

అట్లే అసంఖ్యాకమైన లోకములు శ్రీమహావిష్ణువుయొక్క రోమములలోనున్నట్లు చెప్పితిరి. అట్టి శ్రీమహావిష్ణువునకు మూలప్రకృతిమాతగా ఎటైనది? అని సుయజ్ఞాడడిగెను.

సుతపా ఉవాచ- సుతపుడను బ్రాహ్మణుడిట్లు పలికెను-

బ్రహ్మణోంతే మృత్యుకస్యా ప్రణష్ణా జలబింబవత్

సంహర్త్రీ సర్వలోకానాం బ్రహ్మాదీనాం నరాధిప

కతీధా మృత్యుకన్యానాం బ్రహ్మణాం కోటిలయే

కాలేన లినః శంభుశ్చ సత్వరూపే చ నిర్గుణే

మృత్యుకన్యా జితాశశ్వత్ శివేన గురుణామమ

న మృత్యునా జితః శంభుః కల్పే శ్రుతౌ శ్రుతం

శంభోర్నారాయణస్యై ప్రకృతేశ్చ నరాధిప

నిత్యానాం లీనతా నిత్యే తన్మయా నతు వాస్తవి

స్వయం పుమాన్నిర్గుణశ్చ కాలేన వగుణః స్వయం

స్వయం నారాయణః శంభుః మాయయా ప్రకృతి: స్వయం

తదంశః తత్సమః శశ్వద్యథావహ్నేః స్ఫులింగవత్

యేయే చ బ్రహ్మణా సృష్టా రుద్రాదిత్యాదయస్తథా

కల్పే కల్పే జితాస్తే నశ్వరా మృత్యుకన్యయా

న శివోబ్రహ్మణా సృష్ట: సత్యో నిత్యం సనాతనః

బ్రహ్మదేవుని ఆయుస్సు తీరి అతడు గతించినప్పుడు సమస్త లోకములమ, బ్రహ్మదేవుని సైతము సంహరించు మృత్యుకిన్య నీటిలో కనిపించు ప్రతిబింబమువలె నశించిపోవుచున్నది. ఎందరో మృత్యుకన్యలు, కోట్లకొలది బ్రహ్మదేవతలు నశించినను, శివుడు మాత్రము నశింపలేదు. అతడు సమయముననుసరించి విర్గుణుడు, సత్వరూపుడగు శ్రీకృష్ణ పరమాత్మలో విలీనమగును. పరమశివుడు మృత్యుకన్యను జయించెనుగాని, మృత్యుకన్య అతనినెప్పుడు జయించలేదని ప్రతీ కల్పమున చెప్పబడినది. విత్యులగు శివుడు, నారాయణుడు. ప్రకృతి ఈ ముగ్గురు నిత్యుడైన శ్రీకృష్ణ పరమాత్మలో వీలీనమగుట వాస్తవముకాదు. వీరుణుడు, పురుషోత్తముడగు శ్రీకృష్ణుడు కాలముననుసరించి సగుణుడగుచున్నాడు, అతడే తన మాయవలన సొరాయణుడుగా, శివుడుగా, ప్రకృతిగా రూపమునొందుచున్నాడు. వీరు ముగ్గురు పరమాత్మతో సమానమైనవారు. అతని అంశరూపులు. ఆగ్నీకి నిప్పురవ్వలకు భేదములేనట్లే వీరికి పరమాత్మకు మధ్య భేదములేదు.

రుద్రులు, ఆదిత్యులు, మొదలగు వారినందరిని బ్రహ్మదేవుడు సృష్టించెను. అందువలన వారందరివి మృత్యుకన్య జయించినది. కాని పరమశివుడు సత్వరూపుడు, నిత్యుడు, సనాతనుడు ఆగు. శివుని మృత్యుకన్య ఎప్పుడు జయించలేదు కావున అతడు మృత్యుంజయుడగుచున్నాడు.

కతిధా బహ్మణాం పాతో యన్నిమేషేణ భూమిప

అథాదిసర్గే శ్రీకృష్ణ: ప్రకృత్యాం చ జగద్గురుః

చకారవీర్యాధానం చ పుణ్యే బృందావనే వనే

తద్వామాంశ సముద్భూతా రాసే రాసేశ్వరీపురా

గర్భం దధార పారాధా యావద్వైబ్రహ్మణో వయః

తతః సుషావ సాడింభం గోలోకే రాసమండలే

చుకోవ డింభం సా దృష్ట్యా హృదయేన విదూయతా

తడ్డింభం ప్రేరయామాస తదదో విశ్వగోళకే

త్యక్త్వాఽపత్యం మహాదేవీ రురోదచ మహుర్ముహుః

కృష్ణస్తాం బోధయామాస మహాయోగేన యోగవిత్

బభూవ తస్మాడ్డింభాచ్చ సర్వాధారో మహావిరాట్

మృత్యుంజయుడైన పరమశివుని రెప్పపాటు కాలమున ఎందరో బ్రహ్మదేవులు గతించిరి. ఆదిసృష్టి సమయమున జగద్గురువగు శ్రీకృష్ణపరమాత్మ బృందావనమున ప్రకృతికి వీర్యాదానము చేయగా ఆ పరమాత్మ వామభాగమునుండి ఉద్భవించిన ఆ రాసేశ్వరియగు రాధాదేవి బ్రహ్మదేవుని ఆయుస్సుండునంతవరకు, గర్భమును ధరించెను. ఆ తరువాత పరాప్రకృతి రూపిణియగు ఆ రాధాదేవి గోలోకమందలి రాస్తమండలమున ఒక అండమును కనెను. రాధాదేవి ఆ అండమును చూచి బాధకు గురికాగా కోపముతో ఆ అండమును గోలోకమునుండి అధోభాగమున నున్న విశ్వగోళకమున పడవేసెను.

ఆ రాధాదేవి తవ సంతానమును వదిలి పెట్టి ఏడ్చుచుండగా శ్రీకృష్ణపరమాత్మ మహాయోగజ్ఞానమును బోధించి ఆమెను ఓదార్చిమ.

విశ్వగోళకమున పడిపోవుచున్న ఆ ఆండమునుండి సమస్తలోకములకు ఆధారభూతుడగు మహావిరాట్పురుషుడు (మహావిష్ణువు) ఉదయించెను.

సుయజ్ఞ ఉవాచ- సుయజ్ఞ మహారాజిట్లనెను-

ఆద్యమే సఫలం జన్మ జీవనం సార్థకం మమ

శాపో మే వరరూపశ్చాప్యభవద్భక్తి కారణం

సుదుర్లభాహరేర్భక్తిః: పర్వమంగళమంగళా

 న తస్యాశ్చ సమం విప్ర వేదోక్తం భక్తి పంచకం

యథాభక్తిర్మమభవేత్ శ్రీ కృష్ణే పరమాత్మని

సుదుర్లభా చ సర్వేషాం తత్కురుష్వ మహామునే

నహమ్మయాని తీర్థానీ న దేవా మృచ్ఛిలామయా:

తే పునంత్యురు కాలేన కృష్ణభక్తాశ్చ దర్శనాత్

సర్వేషా మాశ్రమాణాం చ ద్విజాతేర్జాతీరుత్తమా

స్వధర్మ నిరతాశ్చైవ తేషు శ్రేషాశ్చ భారతే

కృష్ణ మంత్రోపాసకశ్చ కృష్ణభక్తి పరాయణః

నిత్యం నైవేద్య భోజీ చ తతః శ్రేష్ఠో మహాన్ శుచిః

త్వాం వైష్ణవం ద్విజశ్రేష్ఠం మహాజ్ఞానార్ణవం పరం

సంప్రాప్య శివశీష్యం చ కం యామి శరణం మునే

అధునాపం గళత్కుష్ఠీ తన శాపాన్మహామునే

కథం తపస్యామ్యశుచిః నాధీకారీ కరోమి చ

ఓ మహాత్మా! నా జీవితము ధన్యమైనది. నా జన్మ సఫలమైనది.. భగవంతునిపై భక్తిని కలిగించిన మీ శాపము వా పాలిట వరమైనది. సమస్త మంగళములకు మంగళరూపమైన శ్రీహరి భక్తి అందరకు తేలికగా లభించునదికాదు. వేదములందు చెప్పబడిన భక్తి పంచకము శ్రీహరి భక్తితో సమానమైనదికాదు. అందువలన ఆందరికి లభింపని శ్రీకృష్ణపరమాత్మ భక్తి నాకు కలుగునట్లు అనుగ్రహింపుడు.

పవిత్రమైన జలముండు తీర్థములు మాత్రమే తీర్థములుకాదు. ఆట్లే మట్టి, శీలానిర్మితములైన వారు మాత్రమే దేవతలు కాజాలరు. పైగా తీర్థములు, దేవతలు, చాలాకాలము సేవించినగానీ పవిత్రము చేయరు. కానీ శ్రీకృష్ణ భక్తులు దర్శనమాత్రముననే వారిని పవిత్రముగా చేతురు. అన్ని ఆశ్రమములలో (వర్ణములలో) బ్రాహ్మణజాతి చాలా శ్రేష్టమైనది. వారిలో స్వధర్మనిరతులైనవారు చాలా శ్రేష్ఠులు. కృష్ణమంత్రోపాసకుడు, కృష్ణభక్తి పరాయణుడు, ప్రతిదినము శ్రీహరి నైవేద్యమును భుజించువాడు స్వధర్మవిరతుడైన

బ్రాహ్మణునికంటె శ్రేష్ఠుడు.

జ్ఞానసముద్రుడు. వైష్ణవుడు, శంకరుని శిష్యుడు, బ్రాహ్మణ శ్రేష్ఠులగు మీరుండగా జ్ఞానమునకై శాపవిమోచనమునకై నేనెవరినీ శరణుపొందవలెను? మీ శాపమువలన నేనిప్పుడు కుష్టురోగగ్రస్తుడనైతిని. ఈ విధముగా అశుచీవైవ నేను తపస్సు ఎట్లు చేయగలుదునో తెలుపుడని సుయజ్ఞుడు సుతపుతో ననెను.

సుతపా ఉవాచ- సుతపుడను ఆ బ్రాహ్మణుడిట్లనెను-

హరిభక్తి ప్రదాత్రీ సా విష్ణుమాయా సనాతనీ

సా చ యాననుగృహ్ణాతి తేభ్యో భక్తిం దదాతి చ

యాంశ్చ మాయా మోహయతి తేభ్యస్తాం నదదాతి చ

కరోతి వంచనాం తేషాం నశ్వరేణ ధనేన చ

 కృష్ణ ప్రేమమయీం శక్తిం ప్రాణాధిష్ఠాతృదేవతాం

భజ రాధాం నీర్గుణాం తాం ప్రదాత్రీం సర్వసంపదాం

శీఘ్రం యాస్యసి గోలోకం తదనుగ్రహసేవయా

సాసేవితా శ్రీకృష్ణేన సర్వారాథ్యేన పూజితా

ధ్యానసాధ్యం దురారాధ్యం భక్తా సంసేవ్య నిర్గుణం

సుచిరేణ చ గోలోకం. ప్రయాంతి బహుజన్మతః

కృపామయీం చ సంసేవ్య భక్తా యాంత్యచిరేణవై

సా ప్రసూశ్చ మహావిష్ణోః సర్వసంపత్స్వరూపిణీ

సహస్రవర్ష పర్యంతం విప్రపాదోదకం పిబ

కామదేవ స్వరూపశ్చ రోగహీనో భవిష్యసి

విప్రపాదోదక క్లిన్నా యావత్తిష్ఠతి మేదినీ

తావత్పుష్కర పత్రేషు పిబంతీ పితరో జలం

పృథివ్యాం యానీ తీర్థాని తానితీర్థానీ సాగరే

సాగరేయాని తీర్థాని విప్రపాదేషు తాని

విప్రపాదోదకం చైవ పాపవ్యాధి వినాశనం

సర్వతీర్ధోదక సమం భుక్తి ముక్తిప్రదం శుభం

విప్రో మానవరూపీ చ దేవదేవోజనార్దనః

విప్రేణ దత్తం ద్రవ్యం చ భుంజతే సర్వదేవతాః

సనాతని యగు విష్ణుమాయ శ్రీహరిపై భక్తిని కలిగించును. ఆమె అనుగ్రహించిన వారికి మాత్రమే శ్రీహరి భక్తివి కలిగించును. మాయచే మోహితులైనవారికి ఆ దేవి శ్రీకృష్ణ భక్తిని కలిగించక వంచించుచు ఆశాశ్వతమైన ధనమునిచ్చును.

ఆందువలన శ్రీకృష్ణ ప్రేమ రూపిణి, శ్రీకృష్ణుని ప్రాణములకు ఆధిదేవత, శక్తిస్వరూపిణి. సమస్త సంపదల నొసగునది, నీర్గుణ స్వరూపిణియగు రాధాదేవిని సేవింపుము, ఆమెను సర్వారాధ్యుడైన శ్రీకృపడే ఆరాధించుచు సేవించును. ఆమెను సేవించి అనుగ్రహము పొందినచో నీవు త్వరగా గోలోకమునకు పోయెదవు.

శ్రీకృష్ణ భక్తులు నిర్గుణుడు, కష్టముతో ఆరాధింప తగినవాడు, ధ్యానముచేతనే సాధ్యమైన శ్రీకృష్ణుని అవేక జన్మలలో చాలాకాలము సేవించి గోలోకమును చేరుచున్నారు. అందువలన శ్రీకృష్ణుని సేవించుటకంటె మాతృమూర్తియగు రాధాదేవిని సేవించుట బహుసులభము. దయామూర్తి, సమస్త సంపదల వొసగునది శ్రీమహావిష్ణువువకు మాతృరూపిణి అగు రాధాదేవిని సేవించిన భక్తులు త్వరగా గోలోకమును చేరుకొందురు.

అట్లే వేయి సంవత్సరములవరకు బ్రాహ్మణుల పాదోదకమును వీపు స్వీకరించినచో కుష్ఠురోగ నిరుక్తుడవై మన్మథునీ . వంటి ఆకారమును పొందెదపు. బ్రాహ్మణుల సేవించుచు వారి పాదోదకమును స్వీకరించునపుడు భూమిపై వారి పాదోదకమెంతకాలము పడునో ఆంతవరకు ఆ భక్తుని పితృదేవతలు తరణ జలమును కమలపత్రములలో ఆనందముగా స్వీకరించెదరు. భూమి పైనున్న సమస్త తీర్థములు సముద్రముననున్నవి. సముద్రముననున్న సమస్త తీర్థములు విప్రుల పాదోదకముననుండును. ఆ ఉదకము సమస్త పాపములను, రోగములను పోగొట్టును. సమస్త తీర్థములందున్న నీటితో సమానమైనది. భుక్తినీ, ముక్తిని కలిగించును. బ్రాహ్మణుడు మానవరూపముననున్న సాక్షాత్ శ్రీమహావిష్ణువు. ఆతడు చేసిన పూజను సమస్త దేవతలు సంతోషముతో స్వీకరింతురు.

ఇత్యేవ ముక్త్యా విప్రశ్చ గృహీత్వా తస్యపూజనం

జగామ గృహమిత్యుక్త్యా త్వాయాస్యే వత్సరాంతరే

భక్త్యా చ బుభుజే రాజా విప్రపాదోదకం శివే

విప్రాంశ్చ పూజయామాస భోజయామాస వత్సరం

సంవత్సరే వ్యతీతేతు నిర్ముకో వ్యాధితో నృపః

ఆజగామ మునిశ్రేష్ఠ సుతపాః కశ్యపాగ్రణీ:

సుతపుడు పైవిధముగా సుయజ్ఞమహారాజునకు ఉపదేశించి ఆ మహారాజొనర్చిన పూజను స్వీకరించి సంవత్సరకాలము దాటిన తరువాత వత్తునని చెప్పిపోయెను.

సుయజ్ఞమహారాజు సుతపబ్రాహ్మణుడు చెప్పినట్లు సంవత్సరకాలము బ్రాహ్మణులను సేవించుచు వారికి భక్తితో భోజనము పెట్టుచు వారి పాదోదకమును స్వీకరించెను. అందువలన అతనికంటిన కుష్టువ్యాధి మటుమాయమయ్యెను. ఆ సమయమున పూర్వము చెప్పినట్లే సుతప బ్రాహ్మణుడు ఆ మహారాజు ఇంటికి తిరిగివచ్చెను.

రాధా పూజావిధానం చ స్తోత్రం చ కవచం మనుం

ధ్యానం చ సామవేదోక్తం దదౌ తస్మై నృపాయసః రాజన్ నిర్గమ్యతాం శీఘ్రమిత్యుక్త్వా తపసే ముని:

జగామ స్వాలయాద్దుర్గం నిర్జగామ త్వరన్ నృపః

 రురుదుర్బాంధవాస్సర్వే త్రిరాత్రం శోకమూర్చితాః

భార్యాశ్చ తత్యజుః ప్రాణాన్ పుత్ర రాజా బభూవ హ

సుయజ్ఞ: పుష్కరంగత్వా చక్రేవై దుష్కరం తపః

దివ్యం వర్షశతం రాజా జజాప పరమం మనుం

తదా దదర్శ గగనే రథస్థాం పరమేశ్వరీం

స తద్దర్శన మాత్రేణ నిష్పాపశ్చ బభూవ హి

తత్యాజ మానుషం దేహం దీవ్యాం మూర్తీం దధార హ

సాదేవి తేన యానేన రత్నేంద్రైర్నిర్మితేన చ

 నృపం నీత్వా చ గోలోకం తత్రచైషా యయా తదా

రాజా దదర్శ గోలోకం నద్యా విరజయావృతం

సుతపబ్రాహ్మణుడతనికి రాధికాదేవి పూజావిధానమును స్తోత్రమును, కవచమును, మంత్రమును, పామవేదమునందు చెప్పబడిన ఆమె ధ్యానమును ఆంతయు మహారాజునకు చెప్పెను. తరువాత ఓ రాజా! నీవు వెంటనే తపస్సు చేయుటకు అడవికి పొమ్ము అని చెప్పగా రాజువెంటనే అడవికి వెళ్ళాను. అప్పుడతని భార్యలు మూడురాత్రులు శోకముచే మూర్ఛనొంది చనిపోయిరి. బంధువులు దు:ఖించిరి.

ఐనను సుయజ్ఞుడు పుష్కరమునకు వెళ్ళి అచ్చట తీవ్రమైన తపమాచరించెను. ఆతడచ్చట నూరు దివ్య సంవత్సరములు సుతపుడు చెప్పిన రాధికా మంత్రమును జపించెను.

అప్పుడాదేవి రథముపై ఆచ్చటకు వచ్చి ఆ మహారాజునకు దర్శనమొసగెను. ఆ రాధికాదేవి దర్శనమాత్రముననే అతని పాపములన్ని తొలగిపోయినవి. ఆతడు తన మానవదేహమును వదలి దివ్య శరీరము ధరింపగా రాధాదేవి ఆతనిని తన రథము పై నుంచుకొని గోలోకమును చేరెను. ఆ విధముగా రాధాదేవి అనుగ్రహము వలన ఆమె వెంట వెళ్ళిన సుయజ్ఞడు విరజానదినీ ఆవరించియున్న గోలోకమును చూచెను.

వేష్టితం పర్వతేనైవ శతశృంగేణ చారుణా

శ్రీబృందావన సంయుక్తం రాసమండల మండితం

గోగోపగోపీనికరైః శోభితం పరిసేవితైః

రత్నేంద్రసారఖచితైర్మందిరై: సుమనోహరైః

నానాచిత్ర విచిత్రైశ్చ రాజితం పరిశోభితం

సప్తత్రింశద్భీరాక్రీడైః కల్పవృక్ష సమన్వితైః

పారిజాతద్రుమాకీర్ణర్వేష్టితం కామధేనుభిః

ఆకాశవత్సువిస్తీర్ణం వర్తులం చంద్రబింబవత్

అత్యూర్ద్వమపివైకుంఠాత్ పంచాశత్కోటి యోజనం

శూన్యేస్థితం నిరాధారం ధ్రువమేవేశ్వరేచ్చయా

ఆత్మాకాశసమం నిత్యం అస్మాకం చ సుదుర్లభం

అహం నారాయణాఽనంతో బ్రహ్మవిష్ణుర్మహాన్విరాట్

ధర్మక్షుద్రవీరాట్ సంఘో గంగా లక్ష్మీ: సరస్వతీ

త్వం విష్ణుమాయా సావిత్రీ తులసీ చ గణేశ్వరః

సనత్కుమారః - స్కందశ్చ నరనారాయణావృషీ

కపిలో దక్షిణాయజ్జో బ్రహ్మపుత్రాశ్చ యోగినః

పవనోవరుణశ్చంద్ర సూర్యో రుద్రో హుతాశనః

కృష్ణమంత్రోపాసకాశ్చ భారతస్థాశ్చ వైష్ణవాః

ఏభిర్దృష్టష్ట గోలోకో నాఽభ్యైర్దృష్ట కదాచన

గోలోకముచుట్టు శతశృంగమను పర్వతమున్నది. అచ్చట బృందావనము, రాసమండలమున్నది. అట్లే గోవులు, గోపికలు, గొల్లలున్న అందమైన రత్నమయ మందిరములున్నవి. అందలి మందిరములలో అనేక చిత్రవిచిత్రములున్నవి. అనేక కల్పవృక్షములున్నవి. ఆ మందిరములచుట్టు అనేక పారిజాతవృక్షములున్నవి. అనేక కామధేనునుపులచ్చటనున్నది. ఆ లోకము చంద్రబింబమువలె గుండ్రముగను, చాలా. విశాలముగాను ఉన్నది. అది వైకుంఠము కంటే యాభైకోట్ల యోజనముల దూరమున సైభోగముననున్నది. ఆది శూన్యములో ఎట్టి ఆధారము లేక స్థిరముగ నున్నది. ఆది ఆకాశమువలె నిత్యమైనది. నేను (మహాదేవుడు} సారాయణుడు, ఆనంతుడు, బ్రహ్మవిష్ణవులు ధర్మదేవత కుద్రవిరాడ్రూపములు, గంగాదేవి, లక్ష్మీదేవి, సరస్వతి నీవు (పార్వతి) విష్ణుమాయ, సావిత్రి, తులసి గణపతి, సనత్కుమారుడు, స్కందుడు, వరనారాయణ మునులు, కపిలమహర్షి, దక్షిణాదేవి యజ్ఞాడు, బ్రహ్మపుత్రులు. వాయువు, వరుణుడు, చంద్రుడు, సూర్యుడు, రుద్రుడు, అగ్ని, ఇతర కృష్ణ భక్తులు, భూలోకముననున్న విష్ణుభక్తులు ఈ గోలోకమును చూచెదరు. కాని ఇతరులెవ్వరు దీనిని సందర్శింపలేరు.

నిరామయే చ తత్రైవ రత్నసింహాసనే స్థితం

రత్నమాల కిరీటైశ్చ భూషితం రత్నభూషణైః

సునిర్మలైః పీతవస్త్రేః వహ్నిశుద్దైర్విరాజితం

చందవోత్క్షిత పర్వాంగం కిశోరం గోపరూపిణం

నవీన నీరదశ్యామం స్వేత పంకజ లోచనం

శరత్పార్వణ చంద్రోస్య మీషద్ధాస్యం మనోహరం

 ద్విభుజం మురళీహస్తం భక్తామగ్రహ విగ్రహం

స్వేచ్చామయం పరంబ్రహ్మ నిర్గుణం ప్రకృతేః పరం

ధ్యానసాధ్యందురారాధ్యమస్మాకం చ సుదుర్లభం

ప్రియ్వైర్ద్వాదశ గోపాలై: సేవితం తచామరైః

వీక్షితం గోపికాబృందై: సస్మితైః సుమనోహరైః

పీడితైః కామబాణోశ్చ శశ్వత్ సుస్థిర యావనైః

 వహ్నిశుద్ధాంశుకాధానై రత్నభూషణ భూషితైః

 రాపమండలమధ్యస్థం శ్రీకృష్ణం చ పరాత్పరం

దదర్శ రాజా తత్రైవ రాధయదర్శితం తదా

ఆచ్చట రత్నసింహాసనమున రత్నమాల కిరీటములు, రత్నభూషణములు, పరిశుద్ధమైన పీతవస్త్రములు ధరించిన శ్రీకృష్ణపరమాత్మను సుయజ్ఞుడు చూచెను. ఆ పరమాత్మ శరీరమువందంతట చందనము ఉన్నది. అతడు గోపవేషముననుండెను, ఆతని శరీరకాంతి నూతన మేఘమువలెనండెను. ఆ పరమాత్మ రెండు భుజములు కలవాడు, అతని హస్తమున ఎల్లప్పుడు మురళియుండును. ఆ దేవదేవుడెల్లప్పుడు భక్తులననుగ్రహించుచుండును. అతడు స్వేచ్ఛామయుడు, పరబ్రహ్మ, నిర్గుణుడు, ప్రకృతికంటే మిన్నయైనవాడు, ధ్యానమువలన మాత్రమే ఆతడు లభించును. మావంటివారికి సైతము ఆతడు దుర్లభుడు. ఆ గోపికామనోహరువికి పన్నెండుగురు ప్రధాన గోపాలురు ఎల్లప్పుడు చామరములను వీచుచుందురు. అతనిని పరిశుద్ధమైన వస్త్రములు ధరించిన గోపికలు కామముతో చిరునవ్వులు నవ్వుచు చూచుచుందురు. ఆతడు రాసముండలమున ఉండగా సుయజ్ఞుడు ఆ దేవదేవుని రాధాదేవి అనుగ్రహము వలన చూచేను.

స్తుతం చతుర్భిర్వేదైశ్చ మూర్తిమద్బీర్మనోహరైః

రాగిణీనాం చ రాగాణామతీవ సుమనోహరం

 శ్రుతవంతం చ సంగీతం యంత్రపక్రోత్థితం మునే

నిత్యయా చ సనాతన్యా ప్రకృత్యా చ సహ త్వయా

 శశ్వత్పూజిత పాదాబ్జమఖండ తులసీ దళై:

కస్తూరీ కుంకుమాక్తైశ్చ గంధచందన చర్చితైః

దూర్వాభిరక్షతాభిశ్చ పారిజాత ప్రసూనకైః

నిర్మలైర్విరజా తోయైర్దత్తార్ఘ్యే రతిశోభితం

సుప్రసన్నం స్వతత్రం చ సర్వకారణ కారణం

సర్వేషాం చాంతరాత్మాసం సర్వేశం సర్వజీవినం

సర్వాధారం పరంపూజ్యం బ్రహ్మజ్యోతి: సనాతనం

సర్వసంపత్స్వరూపం చ దాతారం సర్వసంపదాం

 సర్వమంగళ రూపం చ సర్వమంగళకారణం

సర్వమంగళదం సర్వమంగళానాం చ మంగళం

తం దృష్ట్వా నృపతీ స్తస్త్రో హ్యవరుహ్య రథాత్త్యరన్

సాశ్రునేత్రపులకితో మూర్ద్నా స ప్రననామ చ

ఆ పరమాత్మమ నాల్గువేదములు ఆకారమును ధరించి ఎల్లప్పుడు స్తుతింపుచుండును. మనోహరమైన రాగములు, సంగీతము వాద్య యంత్రములనుండి వచ్చుచుండగా సంతోషమువవతడు ఏనుచుండుమ. నిత్య, సపోతనియగు ప్రకృతి మరియు నీవు ఆ పరమాత్మ పాదపంకజములను అఖండతులసీ దళములలో కస్తూరి, కుంకుమ కలిసిన గంధచందనములలో దూర్వాంకురములలో, అక్షతలతో, పారిజాత ప్రసూనములతో ఎల్లప్పుడు పూజించుచుందురు. ఇంకన ఆ పరమాత్మకు మీరు పవిత్రమైన విరజానదీ తీర్థముతో ఆర్ఘ్యము నిచ్చుచుందురు.

ఆ శ్రీకృష్ణుడు చక్కగా ప్రసవముగామండువాడు, స్వతంత్రుడు, పమస్తకారణములకు కారణమైనవాడు. అన్ని ప్రాణులకు అంతరాత్మయైనవాడు, పర్వేశుడు, సమస్తమునకు ఆధారభూతుడు, మిక్కిలి పూజించతగినవాడు, పవాతమడు, పమస్త సంపదల స్వరూపము, సమస్త సంపదల నొసగువాడు. సర్వమంగళరూపి, సర్వమంగళ కారణుడు, సర్వమంగళదాత, సమస్తమంగళములకు మంగళకరమైనవాడు.

ఆటువంటి గోపికా వల్లభుని చూడగానే సుయజ్ఞుడు తొందరగా రథమునుండి దిగి పులకించిన శరీరము కలవాడై ఆనందబాష్పములు రాలగా పరమాత్మ పాదములకు నమస్కరించెను.

పరమాత్మా దదౌతస్మై స్వదాప్యం చ శుభాశీషం

స్వభక్తిం నిశ్చలాం సత్యామస్మాకం చ సుదుర్లభం

రాధాపరుహ్య స్వరథాత్ కృష్ణవక్షష్యువాస సా

గోపీభిస్సుప్రియాభిశ్చ సేవితా శ్వేత చామరైః

సంభాషితా శ్రీకృష్ణేన సస్మితేవ చ పూజితా

సముత్థితేన సహసా భ క్త్యా  వై సంభ్రమేణ చ

 ఆదౌ రాధాం స ముచ్చార్య పశ్చాత్కృష్ణం చ మాధవం

ప్రవదంతి చ వేదేషు వేదవిద్భిః పురాతనైః

విపర్యయం యే వదంతి యే నీందతి జగతః ప్రసూం

కృష్ణప్రాణాధికారి ప్రేమమయీం శక్తిం చ రాధికార

తే పచ్యంతే కాలసూత్రే యావచ్చంద్ర దివాకరం

భవంతి స్త్రీపుత్రహీనాః రోగిణః శతజన్మను

శ్రీ కృష్ణపరమాత్మ సుయజ్ఞ మహారాజునకు తనపై భక్తిని, ఆప్పులము ఒసగెను. ఇవి మావంటివారికి కూడ దుర్లభమైనది.

తరువాత రాధాదేవి రథమునుండి దిగి గోపికలు చెలికత్తెలు సేవించుచుండగా కొందరు నేతచామరములను వీయుచుండగా శ్రీకృష్ణ పరమాత్మ సమీపమునకు వచ్చి అతనిని ఆలింగనము చేసికొనెను. శ్రీకృష్ణపరమాత్మ ఆమెను పలుకరించి గౌరవించెను.

తొలుత రాధాదేవి పేరునుచ్చరించి శ్రీకృష్ణుని పేరు (రాధాకృష్ణుడు, రాధామాధవుడు) ను ఉచ్చరింపవలెనని వేదములు తెలిసిన పెద్దలు పలుకుచున్నారు. ఆ విధముగా కాక తొలుత కృష్ణుని తరువాత రాధాదేవి నామముమచ్చరించినచో, లేక అఖిల ప్రపంచములకు మాత, కృష్ణునకు ప్రాణములకంటె గొప్పవిది శక్తిరూపిణియగు రాధను నిందించినచో వారు సూర్యచంద్రులున్నంతవరకు నరకమున బాధలు పడుదురు. తరువాత భూలోకమున జన్మించినను భార్యపుత్ర విహీమలై రోగపీడితులగుదురు.

ఇత్యేవం కథితం దుర్గేరాధికాఖ్యానముత్తమం

సా త్వం సతీ భగవతీ వైష్ణవీ చ పవాతనీ

 నారాయణీ విష్ణుమాయా మూలప్రకృతిదీశ్వరీ

 మాయయా మాం పృచ్ఛసి త్వం సర్వఙ్ఞా సర్వ రూపిణీ

 స్త్రీ జాతీష్వధిదేవీ చ పరా జాతీస్మరావం

కథితం రాధికాఖ్యానం కిం భూయం శ్రోతుమిచ్ఛసీ

ఓ పార్వతీ! నీకింతవరకు రాధికోపాఖ్యానమును చెప్పితిని. నీవు భగవతి, వైష్ణవి, విష్ణుమాయ, సనాతని, వారాయణి మూలప్రకృతి ఈశ్వరి అను పేర్లతో ప్రకాశించుచున్నావు. నీవు పర్వజ్ఞారాలపైనను, సమస్త చరాచర రూపిణినైనను, స్త్రీలలో అత్యుత్తమురాలిపైవను తెలియనట్లు వప్నుడిగితివీ అని శంకరుడు పార్వతీదేవితో ననేమ.

ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతఖండే వారద నారాయణాంతర్గత హరగౌరీ సంవాదే రాధాభ్యావే సుయజ్ఞాఖ్యానే సుతపః సుయజ్ఞసంవాదే సుయజ్ఞస్య గోలోక ప్రాప్తిర్నామ చతుష్పంచాశత్తమోఽధ్యాయః

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమునందలి రెండవదైన ప్రకృతిఖండమున వారదనారాయణ సంవాదమున చెప్పబడిన సుయజ్ఞమహారాజునకు గోలోక ప్రాప్తియను ఏబదినాల్గవ అధ్యాయము సమాప్తము.