నారద ఉవాచ - నారద మహర్షి ఇట్లు పలికెను-
తతః పరం కింరహస్యం బభూవాసుదేవయోః ।
శ్రోతుమిచ్ఛామి భగవన్ పరంకౌతూహలం మమ ॥
బ్రహ్మదేవుడు శుక్రాచార్యుని దగ్గరకు పోవుదునని బయలుదేరిన తరువాత దేవదానవులమధ్య ఏమి జరిగినదో తెలుపుడు. దీనిని తెలుసుకొనవలెనను కౌతూహలము నాకు చాలా కలదు అని నారదుడనెను,
నారాయణ ఉవాచ - నారాయణు డిట్లనెను-
బ్రహ్మా జగామ నిలయం శుక్రస్యచ మహాత్మనః ।
నానాదైత్యగణాకీర్ణం రత్నమండపభూషితం॥
పంచాశత్కోటిభిః శిష్యైః పరీతం బ్రహ్మవాదిభిః ।
సప్తభిః పరిభాభీశ్చ వేష్టితం దుర్గమేవచ ॥
రక్షితం రక్షకగణైర్దైత్యైశ్చ శతకోటిభిః ।
పద్మరాగైర్విరచితైః ప్రావారైః పరిశోభితం ॥
దదర్శ జగతాం ధాతా పభాయాం భృగునందనం ।
స్తుతం మునిగణైర్దైత్యై రత్నసింహాసనస్థితం ॥
జపంతం పరమం బ్రహ్మ కృష్ణమాత్మానమీశ్వరం ।
కోటి సూర్యప్రభం శశ్వత్ జ్వలంతం బ్రహ్మతేజసా ॥
దృష్ట్యా పౌత్రం ప్రభాయుక్తం విధాలా హృష్టమానసః।
ఆత్మానం కృతినం మేనే పుత్రం పౌత్రం చ నారద॥
దృష్ట్యా పితామహం శుక్రో ధాతారం జగతాం ప్రభుం ।
ఉత్థాయ సహసా భీతః ప్రణనామ కృతాంజలిః॥
బ్రహ్మదేవుడు శుక్రుని ఇంటికి వెళ్ళాను. అతని భవనము చుట్టు అనేక దైత్యులుండిరి. ఆ భవనమున ఆనేక రత్నమండపములు కలవు. ఆ మహర్షికి బ్రహ్మవాదులగు యాభైవేల శిష్యులుండిరి. అతడుండు భవనము ఏడు ఆగడలతో సప్తప్రాకార పరివేష్టితమైయుండును. ఆది మహారాజులుండు దుర్గమువలెనున్నది. ఆ మహర్షి యుండు భవనమును శతకోటి రైత్యులెల్లప్పుడు రక్షించుచుందురు.
బ్రహ్మదేవుడు శుక్రుని సభాభవనమునకు వెళ్ళినసమయమున ఆతడు దైత్యులు మునులు సేవించుచుండగా రత్నసింహాసనమున కూర్చుండి శ్రీకృష్ణపరమాత్మమంత్రమును జపించుచుండెను. అతడు బ్రహ్మతేజస్సుచే కోటిసూర్యులవలె వెలిగిపోవుచుండెను.
తన మనుమడు గొప్ప తేజస్సుచే గొప్పవైభవముచే వెలుగొందుచుండగా చూచి బ్రహ్మదేవుడు చాలా పొంగిపోయెను. తాను, తన పుత్రుడగు భృగుమహర్షి తన పౌత్రుడైన శుక్రుడు ధన్యులైరని, తలపోసెను.
అట్లే శుక్రుడు బ్రహ్మదేవుని చూడగానే భయములో లేచి నిలబడి అతనికి చేతులు జోడించుకొని నమస్కరించెను.
ఆదాయ పూజయామాస చోపచారాస్తు షోడశ ।
తుష్టావపరయాభక్త్యా సంభ్రమేణ యథాగమం॥
విద్యామంత్రప్రదాతారం దాతారం సర్వసంపదాం।
స్వకర్మణాం చ ఫలదం సర్వేషాం విశ్వతోవరం ॥
శుక్రస్య స్తవనేనైవ సంతుష్టా జగతాం పతిః।
ఆవరుహ్య రథాత్తూర్ణమవసత్తత్ర సంసది ॥
శుక్రేణ శిరపాదత్త రత్నసింహాసనే వరే ।
తేజసా జ్వలితే రమ్యే నిర్మితే విశ్వకర్మణా ॥
బ్రహ్మదేవుని వెంట పెట్టుకొని ఆతనిని షోడశోపచారములతో శాస్త్రవిహితముగా పూజించి స్తోత్రము చేసెను. బ్రహ్మదేవుడు విద్యను. మంత్రమును ఉపదేశించు గురువు, సర్వసంపదలనిచ్చువాడు, జీవునికి తాను చేసిన కర్మఫలితము నొసగువాడు, ప్రపంచమున అందరికన్నను శ్రేష్ఠుడైనవాడు. ఐన బ్రహ్మదేవుని శుక్రుడు స్తోత్రము చేయగా అతడు మిక్కిలి సంతోషము పొందెను. శుక్రుడు బ్రహ్మదేవునకు విశ్వకర్మ నిర్మించిన ఉజ్వలమైన రత్నసింహాసనమును స్వయముగా తెచ్చివేసెను.
శుక్రః ప్రణమ్య బ్రహ్మాణం కుమారం శకునం క్రతుం ।
వసిష్ఠం చ మరీచిం చ సనందం చ సనాతనం ॥
కపిలం వై పంచశిఖం వోడు మాంగిరసం మునే ।
ధర్మం మాం చ నరం భక్త్యా ప్రణనామ కృతాంజలిః ॥
ప్రత్యేకం పూజయామాస సాదరం చ యథోచితం ।
సింహాసనేషు రత్నేషు వాసయామాస ధార్మికః ॥
ప్రహృష్టవదనాః సర్వే ప్రణీముర్దితీనందనా।
ఋషిసంశ్చ ధాచారం తుష్టుపుశ్చ యథాగమం॥
సర్వాన్ సంస్తూయ స కవిరవోచత్సంపుటాంజలిః।
సాశ్రునేత్రః పపులకః ప్రణతో వినయాన్వితః॥
శుక్రుడు తనదగ్గరకు వచ్చిన బ్రహ్మదేవుని, శకుని, క్రతువు. వసిష్ఠుడు, మరీచి, సునందుడు, సనాతనుడు, కపిలుడు, పంచశిఖుడు, వోడువు, అంగిరసుడు, ధర్ముడు, నేను (నారాయణుడు), నరుడు అను మునులనందరను భక్తితో నమస్కరించి ఆందరిని యథోచితముగా పూజించెను. వారినందరిని రత్నసింహాసనములపై కూర్చుండబెట్టెను.
దైత్యులు, అచ్చటనున్న మునులందరు, సంతోషముతో బ్రహ్మదేవుని స్తుతించిరి. తుక్రుడు అందరిని స్తుతించి చేతులు జోడించుకొని వినయముతో నమస్కరించి బ్రహ్మదేవునితో, అతని వెంటవచ్చిన మునులతో నిట్లనెను.
శుక్ర ఉవాచ- శుక్రుడిట్లనెను-
ఆద్య మే సఫలం జన్మ జీవితం చ సుజీవితం ।
స్వయం విధాతా భగవాన్ సాక్షాత్ దృష్టః స్వమందిరే॥
సాక్షాత్ దృష్టాశ్చ తత్పుత్రాః భగవంతః సనాతనాః।
తుష్టకృష్ణోద్య మామేవం పరమాత్మా పరాత్పరః ॥
కృతార్థం కర్తుమీశా మాం యుష్మాకం స్వాగతం శిశుం।
స్వాత్మారామేషు కుశలప్రశమేవం విడంబనం॥
పవిత్రం కర్తుమీశా మాం హేతురాగమనేత్ర వః।
అపరం బ్రూథ కింవాపి శాస్త్ర నః కరవామీ కిం॥
నేడు నాజన్మ చరితార్థమైనది. నా జీవితము సఫలమైనదీ. ఎందువలన అనగా సాక్షాత్ భగవంతుడు ఆగు బ్రహ్మదేవుడు స్వయముగా నా ఇంటికి ఏతెంచెను. అట్లే సనాతనులు, భగవత్స్వరూపులగు ఆతని పుత్రులు స్వయముగా నా ఇంటికి ఏతెంచిరి. పరాత్పరుడైన కృష్ణుడు నాపైన సంతోషము కలిగియున్నట్లు కనిపించును. మీముందు శిశుతుల్యడనైన నన్ను చరితార్థుని చేయుటకు మీరు వచ్చితిరి. మీకందరకు స్వాగతము పలుకుచున్నాను. ఆత్మారాములైన మిమ్ములను కుశల ప్రశవేయుట తగినదీకాదు. మీరందరు ఇచ్చటకు వచ్చి నన్ను పవిత్రము చేసితిరి. నేను మీకు చేయదగినదైనా ఉన్నచో నన్ను శాసించి చెప్పుడని బృహస్పతి వారితోననెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికెను-
ఉద్విగ్నశ్చిరవిచ్చేదాత్ త్వాం పౌత్రం ద్రష్టుమాగతః।
విచ్చేద పుత్రపౌత్రాణాం మరణాగతిరిచ్యతే ॥
కుశలం తే మునిశ్రేష్ఠ పుత్రయోశ్చాపి యోషితః ।
కుశలం తే స్వధర్మాణాం కామ్యానాం తపసామపి॥
దినే దినేసరిచ్ఛన్నం శ్రీకృష్ణార్చన మీప్సితం।
స్వగురోః సేవనం నిత్యమవిచ్ఛిన్నం భవేత్తవ॥
గుర్విష్టయోః పూజనం చ సర్వమంగళ కారణం।
పాపాధిరోగ శోకఘ్నం పుణ్యహర్షప్రదం శుభం ॥
అభీష్టదేవః సంతుష్టో గురౌతుష్ట నృణామిహ।
ఇష్టదేవే చ సంతుష్ట సంతుష్టాః సర్వదేవతాః ॥
గురుర్విప్రః సురోరుష్టో యేషాం పాతకినామిహ ।
తేషాం చ కుశలం నాస్తి విఘ్నస్తస్య పదేపదే ॥
తుష్టశ్చ సతతం వత్స శ్రీకృష్ణ ప్రకృతేః పరః ।
సర్వాంతరాత్మా భగవాస్తవ భక్త్యా చ నిర్గుణః ॥
తవ తుష్టో గురురహం విధాతా జగతామసి।
మయితుష్టే హరిస్తుష్టో హరౌతుష్టే తు దేవతాః ॥
శుక్రుడా! నీయొక్క చిరకాలవియోగమునకు దుఃఖితుడనై నిన్ను చూడవలెననీ ఇచ్చటకు వచ్చితిని. పుత్రులు, పౌత్రులయొక్క వియోగము మరణముకంటె ఎక్కువ.
ఓ మునిశ్రేష్ఠ నీవు క్షేమముగా ఉన్నావా? నీ పుత్రులు భార్య అందరు క్షేమమేనా? నీ స్వధర్మములను కొమ్యములైన కర్మలను, తపస్సును చక్కగా చేయుచున్నావా? నీవు ప్రతిదినము చేయు శ్రీకృష్ణార్చనము ఆవిచ్చన్నముగా జరుగుచున్నదా? అట్లే నీవు నీయొక్క గురువును అవిచ్ఛిన్నముగా సేవించుచున్నావా? గురువును, ఇష్టదేవతను పూజించుట సమస్త మంగళములకు కారణమగుచున్నది. అది పాపములను, రోగములను, శోకములను పోగొట్టును, గురువు సంతోషపడినచో అభీష్టదేవత సంతోషించును. ఇష్టదేవత సంతోషపడినచో సమస్తదేవతలు సంతోషపడుదురు. ఏ పాపాత్ముని యొక్క గురువు, ఇష్టదేవత కోపింతురో వారికి క్షేమము కలుగదు. వారి పనులకు . విఘ్నము ఎల్లప్పుడు జరుగుచుండును. నీ ఇష్టదేవత, ప్రకృతికంటే విశిష్టుడగు శ్రీకృష్ణ పరమాత్మ ఎల్లప్పుడు సంతోషపడుచున్నాడు. అట్లే నీ గురువగు వేమ కూడ సంతోషపడుచున్నాము. వీ గురువువగు నేను సంతోషపడివచో నీ ఇష్టదేవతయగు శ్రీహరి సంతోషపడును. శ్రీహరి సంతోషించవచో సమస్త దేవతలు పంతోషపడుదురు. అని బ్రహ్మదేవుడనెను.
సాంప్రతం శ్రుణు మే ధీమన్ ఆత్రాగమన కారణం।
ప్రేషితస్య పురాణాం చ విశ్వసంహరురేవ చ ॥
శివస్య గురుపుత్రస్య సాధ్వీం తారాం బృహస్పతేః ।
అపహృత్య నిశానాథస్తవైవ శరణాగతః॥
శంభుర్థర్మశ్చ సూర్యశ్చ శక్రోదంతశ్చ పుత్రక ।
ఆదిత్యా పపవో రుద్రా దీక్పాలాశ దీగీశ్వరాః ॥
యుద్ధాయాయాంతి సన్నద్ధాప్తిసః కోట్యశ్చ దేవతా।
నాగాః కింపురాషాశ్చైవ యక్షరాక్షస గుహ్యకాః ॥
భూతప్రేత పిశాచాశ్చ కూష్మాండా బ్రహ్మరాక్షసాః।
కిరాతాశ్చైవగంధర్వాః సముద్రపులినేధువా ॥
తారకామయ సంగ్రామే మధ్యస్థోహం సుతైః సహ।
దేహి శారాం రణం కిం వా త్యజ చంద్రం చ కామినం॥
బుద్ధిమంతుడా! ప్రస్తుతము వారాకకు గల కారణమును విమము. వేమ దేవతలు, విశ్వసంహారకుడైన శంకరుడు పంపగా ఇచ్చటకు వచ్చింది నకు గురువుత్రుడగు బృహస్పతియొక్క భార్యయగు తారమ చంద్రుడుపొరించి విన్న శరణుపొందేమ..
ఇప్పుడు శంకరుడు, ధర్ముడు, సూర్యుడు, ఇంద్రుడు, అనంతుడు, ఆదిత్యులు, పపుగణము, ఏకాదశరుద్రులు, అష్టదిక్పాలకులు, మూడు కోట్ల దేవతలు, నాగులు, కింపురుషులు, యక్ష రాసి, గుహ్యకులు, భూతప్రేత పిశాచులు, కూష్మాండులు, బ్రహ్మరాక్షసులు, కిరాతులు, గంధర్వులు వీరందరు యుద్ధసన్నద్ధులై సముద్ర తీరముపమన్నారు. తారాదేవిని ఆమె భర్తయగు బృహస్పటికి తిరిగి ఇచ్చివేయుము. కొముకువచంద్రువకు శరణమివ్వక అతనిని వదలిపెట్టుము. ఈవిషయమున దేవదానవులు యుద్ధము చేయుట తగనిదని పల్కెను.
శుక్ర ఉవాచ- చక్రుడిట్లు పలికెను-
ఆగచ్ఛంతు సురాస్సర్వే సన్నద్ధా రణదుర్మదాః।
యోత్స్యే వీనా మహేశం చ పర్వేషాం చ గురుం పరం॥
యుద్ధము చేయవలెను దుర్మదములోమన్న దేవతలందరు యుద్ధ సన్నద్ధులై వచ్చినచో రావిమ్ము, అందరకు గురువగు మహేశ్వరుడు తప్ప మిగిలినవారితో నేనే యుద్దమున చేయుదును.
దైత్యా ఊచు- దైత్యులిట్లనిరి-
ఉభయేషాం గురుః శంభుర్మావ్యో వంద్యశ్చ సర్వదా ।
ధర్మశ్చ సాక్షీ సర్వేషాం త్వమేవ చ పితామహః॥
అన్యాంశ్చ తృణతుల్యాంశ్చ నహి మన్యామహే పయం।
ఆగచ్ఛంతు చే యోత్య్సామో ప్రజ బ్రూహి జగద్గురో॥
కృపయా గురుపుత్రస్య యద్యాయాతి మహేశ్వరః।
ఆగ్నేయాస్త్రం ప్రయోక్ష్యామః పశ్చాద్యోత్స్యామ హే ప్రభో॥
బ్రహ్మదేవుడా! శంకరుడు దేవదానవులిద్దరకు గురువు అతడు ఎల్లప్పుడు గౌరవింపదగినవాడు, నమస్కరింపదగినవాడు. ధర్మదేవత అన్నిటికి సాక్షీభూతుడు, నీవు పర్వలోక పితామహుడు. మీరు తప్ప మిగిలిన దేవతలనందరమ గడ్డిపోచతో సమానముగా మేము భావింతుము. అందువలన దేవతలందరితో కలసి గురుపుత్రుడనే భావనలో మహ్విరుడు యుద్ధమునకు వచ్చినమ అతనితో కూడ యుద్ధము చేయుటకు సిద్ధముగామన్నాము. తొలుత ఆగ్నేయాస్త్రమును ప్రయోగించి ఆతరువాత యుద్ధము చేయుదుమని దేవతలకు చెప్పుడని దైత్యులవీరి.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనెను-
కాలాగ్ని రుద్రః సంహర్తా విశ్వస్య బలినాం వరః ।
హే వత్పాస్తేన పార్థం చ కోవాయుద్ధం కరిష్యతి॥
భద్రకాళీ జగన్మాతా ఖడ్గఖర్పర ధారిణీ ।
తయా దుర్ధర్షయా సార్థం కోవాయుద్ధం కరిష్యతి॥
సా సహస్రభుజా దేవీ గుండమాలావిభూషణా ।
యోజనాయత వక్రా చ దశయోజన విస్త్రృతా ॥
సప్తతాళ ప్రమాణాశ్చ యస్యా దంతా భయానకా ।
క్రోశప్రమాణజిహ్వ చ మోహాలోలా భయంకరీ॥
ఆతీవ రౌద్రా సన్నద్ధా భీమ శంకరకింకరాః ।
అతిధీమా భైరవాశ్చ నందీ చరణ కర్కశః ॥
శివప్య పార్షదాః సర్వే మహాబలపరాక్రమా ।
వీరభద్రాదయ శూరా కోటి సూర్యసమప్రభాః॥
సహస్రమూర్ద్నః శేషస్య ఫణామండల భూషణం ।
విశ్వం సర్షపతుల్యం చ కోవాయోద్దా చ తత్సమః ॥
కాలాగ్నిరుద్రః సంహర్తా యస్య బోల కింకరః।
శూలిన స్త్రీ పురఘుష్య జ్వలతో బ్రహ్మతేజపా॥
యస్య పాశుపతాస్త్రీణి దురివార్యేణ పుత్రకాః ।
భస్మీభూతం భవేద్విశ్వం దైత్యానాం చైవ కా కదా॥
యస్య శూలేన భిన్నశ్చ శంఖచూడః ప్రజాపవాన్ ।
సుదామా పార్షదవరః కృషష్య పరమాత్మనః॥
త్రికోటి సూర్యపదుస్తేజస్వీ పరమాద్భుతః ।
రాధాకవచ కంతశ్చ సర్వదైత్య జనేశ్వరః ॥
మధుకైటభయోర్హంతా హిరణ్యకపోశ్చ యః।
స చ విష్ణు సమాయాతి శ్వేతద్వీపాత్ స్వయం ప్రభుః ॥
బిడ్డలారా! మిక్కిలి బలవంతుడు సమస్త విశ్వమును పంహరించు కాలాన్ని రుద్రునితో ఎవరు యుద్ధము చేయగలుగుదురు. ఖడ్గము తలపుట్టెను ధరించు భద్రకాళీ ఆమె జగత్తుల కన్నీటికి తల్లి, ఆమెకు వేయు భుజములున్నవి. తలలమ మాలగా చేసికొనీ ధరించునది. మిక్కిలి విశాలమైన ముఖముకలది. ఆమె దంతములు ఏడు తాటిచెట్ల పొడవున భయంకరమైయుండుము. ఆమె వాలుక క్రొప్రమాణమునమండుమ. భయంకరియగు ఆ దేవితో యుద్దమును ఎవరు చేయగలదు? కరువి సేవకులు మహాభయంకరులు అతిరౌద్రులు. భైరవులు చాలా భయంకరులు. నందీశ్వరుడు మిక్కిలి కర్కశమైనవాడు. ఆట్టే శివుని అనుచరులైన వీరభద్రుడు మొదలుగ దేవతలు మహాబల పరాక్రములు. కోటి సూర్యులతో సమానమైన కార్తీకలవారు. వారితో ఎసరు యుద్ధము చేయుదురు.
వేయి శిరస్సులుగల ఆదిశేషునకు ఈ విశ్వము ఆవగింజవంటిది. అట్టి బలవంతునిచే ఎవరు యుద్ధము చేయగలుగుదురు?
త్రిపురాసురులను సంహరించిన శంకరునకు కాలాగ్ని రుద్రుడు కింకరుడు. అతడు చేసిన పాశుపతాస్త్రమువలన ప్రపంచమంతయు భస్మమగును. అతనికి రైత్యులు ఏ లెక్కలోనికి వత్తురు? శ్రీకృష్ణ పరమాత్మయొక్క అనుచరులలో ఒకడుగు సుదాముని అవతారమైన ఆశoఖచూడుడు కాలాగ్ని రుద్రుని శూలము వలన పడిపోయిన, ఆతడు మూడుకోట్ల సూర్యులతో సమానమైన తేజస్సు కలవాడు. రాధాకవచమునెల్లప్పుడు కంతమున ధరించుచుండును.
మధుకౌటభులను, హిరణ్యకశిపుని సంహరించిన విష్ణుమూర్తి ప్రత్యేకముగా యుద్ధమునకై శ్వే తద్వీపమునుండి వచ్చునని బ్రహ్మదేవుడు పలికెను.
ఇత్యుక్త జగతాం ధాతా వీరరామ చ సంసది।
ప్రహస్యోవాచ దైతేయో దానవావామధ్వీరః॥
ఈవిధము బ్రహ్మదేవుడు పలికి యూరకుండగా. దాసవరాజుగు ప్రహ్లాదుడిట్లు పలికను.
ప్రహ్లాద ఉవాచ- ప్రహ్లాదుడిట్లు బ్రహ్మదేవునితో పలికిను-
నమస్తుభ్యం జగద్ధాతః సర్వేషాం ప్రాక్తనేశ్వరః ।
సర్వపూజ్యః సర్వనాథః కిం వక్ష్యామి తవాగ్రతః॥
హిరణ్యకశిపోర్హంతా మధుకైటభయాశ్చ యః ।
సా కళా యస్య కృష్ణస్య పరిపూర్ణతమప్య చ ॥
సర్వాంతరాత్మనస్తస్య చక్రం వామ సుదర్శవం ।
అస్మాకం లోకమర్మాంశ్చ తద్రాగ్దక్ష్యతి దుఃసహం ॥
తతో న బలవాన్ శంభుర్న చ పాశుపతం విధే ।
వ చ కాళీ న శేషశ్చ న చ రుద్రోదయః పురాః ॥
యస్యరోమసు విశ్వాని విఖీలావి జగత్పతే ।
సర్వాధారప్య చ విభోః స్థూలత్ స్థూలతరస్య చ ॥
షోడశాంశో భగవతః స చైవ హి మహాన్ విరాట్ ।
అనంతో సహా తత్ స్థూలో న కాళీ బృహతీ తతః ॥
ఆగచ్ఛంతు సురా సర్వి యుద్ధం కుర్వంతు సాంప్రతం ।
నబిభేమి శరేభ్యశ్చ వ చ పాశుపతాద్ధరాల్ ॥
నమస్తస్మై భగవతే శివాయ శివరూపిణే ।
నమోఽనంతాయ సాధుభ్యో వైష్ణవేభ్యః ప్రజాపతే ॥
శ్రీకృష్ణస్య ప్రపాదేన నిర్భయోహం నిరామయః ।
న మే స్వాత్మబలం బ్రహ్మన్ తద్బలం యత్ర్పభర్బలం ॥
స్వపాపేన మృతసాతో పురా వై విష్ణు నిందయా ।
నిర్బంధాత్ శంఖచూడశ్చ దర్పాచ్చ మధుకైటభౌ ॥
త్రిపురః కింకరోస్మాకం వీరత్వేన నగణ్యతే ।
తథాపి ప్రేరితస్తేన పరథస్థో మహేశ్వరః ।
ఇత్యుక్త్యా దానశ్రేస్ఠో వీరరామ చ సంసది ।
ఉవాచ జగతాం ధాతా పునరేవ చ నారద॥
అందరికంటెను పెద్దవాడవగు నీకు నమస్కారము. వీపు అందరిలో పూజ్యుడవు. అందరకు నాథుడవు. అట్టి వీముందు వేమి చెప్పగలను.
హిరణ్యకశిపుని, మధుకైటభులను సంహరించినవాడు పరిపూర్ణతముడైన శ్రీకృష్ణుని పదునారవ ఆంశము. సర్వాంతరాత్మయగు శ్రీకృష్ణునీ సుదర్శన చక్రము మాలోకములను మమ్ములను కూడ క్షణములో కాల్చివేయును.
ఆ శ్రీకృష్ణపరమాత్మకంటె నీవు చెప్పిన శంకరుడు, అతని పాశుపతాస్త్రము, కాళికాదేవి, శేషుడు, రుద్రులు ఇతర దేవతలెవ్వరు బలవంతురుకారు. ఆ పరమాత్మయొక్క రోమములందు సమస్త విశ్వములున్నవి. స్థూలమునకంటే మిక్కిలి స్థూలమైనవాడు, సమస్తమునకు ఆధారభూతుడగు భగవంతునకు మహావిరాడ్రూపుడు పదునారవ ఆంశము. ఆ మహావిరాట్ స్వరూపునికంటె అనంతుడు, కాళీ గొప్పవారలు కారు.
దేవతలందరు వచ్చీ యుద్ధము చేసివచో చేయనిమ్ము. నేను వారి శరములకుగాని, హరుని పాశుపతాస్త్రమునకు గాని భయపడను.
మంగళ స్వరూపుడగు శంకరునకు నమస్కారము. అట్లే అనంతునకు, సాధువులకు వైషసులకు అందరకు నమస్కారము. శ్రీకృష్ణుని అనుగ్రహమువలన నేను నిర్భయుడను. రోగ రహితుడను. వాకు ప్రత్యేకముగా నా బలమమన దేదియులేదు. నా బలమంతయు ఆ కృష్ణపరమాత్మునియొక్క బలమే.
నాతండ్రి విష్ణువును నిందించి, నిందించి చనిపోయెను. అట్లే శంఖచూడుడు నిర్బంధమువలన చనిపోయెను. మధుకైటభులు అతి గర్వము వలన నాశనమైరి. త్రిపురాసురుడు మాకు కింకరుడు. అందువలన-ఆతనిని బలవంతుడుగా మేము పరిగణించము. ఇవము అతడు రథముననున్న పరమేశ్వరుని యుద్ధమునకు ప్రేరేపించెను.
ఈవిధముగా దానవశ్రేష్ఠుడైన ప్రహ్లాదు డా సభలో పలికి యూరకుండగా బ్రహ్మదేవుడు తిరిగి ఇట్లు పలికెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనెను-
వినాశకారణం యుద్ధముభయోర్దైత్య దేవయోః।
సుప్రీత్యాచరణం వత్స! సర్వమంగళ కారణం॥
తారాం బిక్షాం దేహి మహ్యం భిక్షుకాయ చ వేదసే ।
విముఖే భిక్షుకే రాజన్ గృహాస్థః పర్వపాపభాక్॥
దైత్యులు, దేవతలు ఇద్దరు కలిసి యుద్ధముచేసివచో వినాశనము తప్పక జరుగును. ప్రేమ కలిగియుండుటే సమస్త మంగళములను కలిగించును.
ఓ రాజా! భిక్షకుడవైన సాకు తారను భిక్షగానిమ్ము. భిక్షుకుడు విరాశతో వెళ్ళిపోయినచో ఆ గృహప్టు సమస్త పాపములను పొందుము.
సనత్కుమార ఉవాచ- సనత్కుమారుడిట్లనెను-
స్వకీర్తిం రక్ష రాజేంద్ర! సింహస్యం సురదైత్యయోః ।
యస్య భిక్షుర్జగద్ధాతా తస్య కీర్తీ శ్చ కా కధా॥
ఓ రాజేంద్ర నీ కీర్తిని నీవు రక్షించుకొనుము. వీపు దేవదానవులలో పింహమువంటివాడపు. జగద్ధాతయగు బ్రహ్మ గొప్పతనమును ఆలోచించుకొనుము.
సనాతన ఉవాచ- సనాతనుడిట్లనెను-
న జితస్యం సురేంద్రైశ్చ బ్రహ్మేశాన పురోగమైః ।
రక్షితః కృపచక్రేణ వైష్ణవః పుణ్యవాస్ శుచిః॥
శుక్రుడా నిన్ను దేవేంద్రుడు బ్రహ్మ, మహేశ్వరుడు మొదలగు దేవతలెవ్వరు జయింపలేదు. కృష్ణ భక్తుడవగు నిన్ను అతని చక్రము ఎల్లప్పుడు రక్షించుచున్నందువలన వీపు గొప్ప పుణ్యము సంపాదించుకొంటివి, మరియు పవిత్రుడవైతివనీ సనాతనముని యనెను.
సనందన ఉవాచ- సనందునుడిట్లనెను-
య స్యేష్టదేవః సర్వాత్మా శ్రీకృష్ణ ప్రకృతేః పరః ।
గురుశ్చ వైష్ణవః శుక్ర స చ కేన జితోభవేత్ ॥
శుక్రుడా! ప్రకృతికంటే ఉన్నతుడైన శ్రీకృష్ణపరమాత్మ నీకు ఆభీష్టదేవత. నీవు వైష్ణవుడవు నీగురువు వైష్ణవుడు. అట్టి నిన్ను ఎవరు జయింతురని అనెను.
సనక ఉవాచ- సనకముని ఇట్లనెను-
పుణ్యవాన్నజీతః కేన జితః పాపీ స్వపాతకైః।
పుణ్యదీపో న నిర్వాతి పాషండేనైవ వాయునా॥
పుణ్యవంతుని ఎవ్వరును జయింపరు. పాపాత్ముడు తన పాపములచేతనే జయింపబడుచున్నాడు. అందువలననే పుణ్యదీపమును ఎట్టి దుష్టపాయువు ఆర్పలేదు అని అనెను.
ఋషయ ఊచు- ఋషులందరు ఇట్లనిరి-
దేహి తారాం మహాభాగ చంద్రప్రాణాధికాం గురోః ।
స్వకీర్తిం రక్ష సుచిరం ప్రార్థయామః పునః పునః ॥
శ్రేష్ఠుడా! గురువగు బృహస్పతికి చంద్రుడు తన ప్రాణములకంటే మిన్నగా చూచుకొనుచున్న తారాదేవిని ఇచ్చి వేయుము. దానివలన నీ కీర్తి స్థిరముగా ఉండగలదు. కావున నిన్ను మాటిమాటికి తారనిమ్మని ప్రార్థింతుమని అనిరి.
ప్రహ్లాద ఉవాచ- ప్రహ్లాదుడిట్లనెను-
స్థితే మదీశ్వరే సాక్షాన్న హిభృత్యో విరాజతే।
కర్తారం బ్రూహి మన్నాథం గురుం శుక్రం సతాం వరం॥
శిష్యాణామాధిపత్యే చ సాధూనాం గురురీశ్వరః ।
గురౌ సమర్పితం పూర్వం సర్వైశ్వర్యం మునీశ్వరే ॥
వయం భృత్యాశ్చ ప్రోష్యాశ్చ స్వగురో పరిచారకాః ।
తే చ శిష్యాః కుశలినో గుర్వాజ్ఞాం పాలయంతి యే॥
నాకు ఆధీశ్వరులైన మీరు సాక్షాత్తుగా ఎదురున ఉండగా భృత్యుడు అతనిముందు వినయవిధేయతలతో ఉండవలసినదే. మాకు నాథుడు గురువైన శుక్రుడు మీ పనిని చేయును. శిష్యులు ఎంత పెద్ద పదవిలో ఉన్నను వారు సాధుపురుషులైనచో వారికి గురువే ఈశ్వరుడగుచున్నాడు. మేము మా గురువగు శుక్రునకు మా సమసైశ్వర్యమును పూర్వమే సమర్పించుకొంటిమి. మా గురువునకు మేము భృత్యులము, పరిచారకులము. గురువుయొక్క ఆజ్ఞను పరిపాలించినవారే శిష్యులుకదా అని అనెను.
ప్రహ్లాదస్య వచ శ్రుత్వా చకార ప్రార్థనాం కవిం ।
దదౌ శుక్రశ్చ తారాం తాం చంద్రం చ మలినం మునే ॥
దత్వా తారాం విధుం శుక్రః ప్రణనామ వీధేః సదే ।
నమస్కృత్య మునిభ్యశ్చ ప్రణత స్వపురం యయా॥
ప్రహ్లాదః సగణో భక్త్యా నమస్కృత్య విధేః పదే ।
ప్రత్యేకం మునిగణాన్ ప్రణతః స్వగృహం యయౌ ॥
ప్రహ్లాదునియొక్క మాటలు విని బ్రహ్మదేవుడు తిరిగి శుక్రుని తారనిమ్మని ప్రార్థించెను. అందువలన శుక్రుడు తొరను బ్రహ్మదేవునకిచ్చి అతని పాదములకు నమస్కరించెను. అట్లే అచ్చటకు వచ్చిన మునులకందరకు ప్రత్యేక ప్రత్యేకముగా నమస్కరించి తన గృహమునకు తిరిగిపోయెను. అట్లే ప్రహ్లాదుడు తన అనుచరులందరతో కలిసి బ్రహ్మదేవుని పాదములకు, మరియు మునులకందరకు నమస్కరించి తమ గృహములకు తీరీగిపోయిరి.
బ్రహ్మా దదర్శ తారాం చ ప్రణతాం స్వపదే సతీం।
లజ్జయా నమవక్రీం చ రుదతీం గుర్విణీం మునే ॥
చంద్రం చ ప్రణతం ధాలా క్రోడే సంస్థాప్య మాయయా ।
ఉవాచ మలినాం తారాం కాతరాం చ కృపామయః॥
తారే త్యజ భయం మత్త భయం కిం తే మయి స్థితే ।
సౌభాగ్యయుక్తా స్వపతా భవిష్యసి వరేణ మే ॥
దుర్బలా బలినా గస్తా నిష్కామా న చ్యుతా భవేత్ ।
ప్రాయశ్చిత్తేన శుద్దా సా న స్త్రీ జారేణ దుష్యతి ॥
సకామా కామతో జారం భజతే స్వసుఖేన చ ।
ప్రాయశ్చిత్తాన్ని శుద్ధా సా స్వామినా పరివర్జితా ॥
కుంభీపాకే పచ్యతే సా యావచ్చంద్ర దీవాకరం ।
ఆన్నం విష్థా జలం మూత్రం స్పర్శనం సర్వపాపదం॥
పాపీ యస్యాశ్చ తస్యాశ్చ సాధుభిః పరివర్జితం ।
కస్య గర్భం వద శుభే గచ్ఛ వచ్పే గురోర్ధృహం॥
త్యజ లబ్దాం మహాభాగే సర్వం చ ప్రాక్తనాద్భవేత్ ।
బ్రహ్మణో వచనం శ్రుత్వా తమువాచ సతీ తదా ॥
బ్రహ్మదేవుని పాదములపై సిగ్గుతో తలవంచుకొని పొరపడెను. ఆమె ఆప్పుడు గర్భవతి. ఆట్లే చంద్రుడు కూడ బ్రహ్మదేవునకు నమస్కరింపగా అతనిని తన మాయచే దగ్గరకు తీసికొనెను, తరువాత కృపామయుడైన ఆ బ్రహ్మదేవుడు ఆపవిత్రమైనందువలన భయపడుచున్న తారతో ఇట్లనెను.
తారా! నేనుండగా నీవు భయపడవలసిన పనిలేదు. అందువలన భయమును వదలిపెట్టుము. సావరము వలన నీవు నీ భర్తయొక్క అనురాగ సౌభాగ్యములను తిరిగి పొందుదువు. దుర్భలయైన స్త్రీని బలవంతుడైన పురుషుడు బలాత్కరించినచో ఆమెకు కామము లేని పక్షమున పతీత కానేరదు. ఆమె ప్రాయశ్చిత్త సంస్కారమువలన తిరిగి పవిత్రురాలగును. ఆమెకు జార దోషమంటదు.
కానీ కామముతో తన సుఖమునభిలషించి వ్యభిచారము చేసినచో ఆమెను భర్త వదిలి పెట్టవలెను. ఆమె ప్రాయశ్చిత్త సంస్కారమువలన పవిత్రురాలు కాజాలదు. పైగా ఆమె కుంభీపాక నరకమున సూర్యచంద్రులున్నంతవరకు బాధలు పడుచుండును. ఆచ్చట ఆ పాపాత్మురాలు మలమునే ఆన్నముగా మూత్రమునే జలముగా తీసికొనీ బ్రతుకును.
తల్లీ! నీ గర్భమేనరివలన కలిగినదో చెప్పుము. నీవు సిగ్గును వదలి పెట్టి ఈ విషయము చెప్పుము. సమస్తము ప్రాక్తన కర్మవలన జరుగుచున్నది. దీనికి మనము కర్తలము కాజాలమను బ్రహ్మదేవుని మాటలు విని తార ఇట్లు పలికెను.
చంద్రస్య గర్భం హే తాత బిభర్మ్యద్య స్వకర్మణా ।
సర్వే మే సాక్షిణః సంతి దుర్బలాయాః ప్రజాపతే ॥
యదా జగ్రాహ చంద్రో మాం దయాహీనశ్చ దుర్మతిః ।
ఇత్యుక్త్యా తారకా దేవీ సుషావ కనక ప్రభం॥
ఓ తండ్రీ! ఈ గర్భము నాకు చంద్రునివలన కలిగినది. నేను పూర్వము చేసికొనిన పాపకర్మవలన దీనిని మోయుచున్నాను. చెడు భావనతో దయలేకుండ చంద్రుడు నన్ను బలాత్కరించిన విషయమునకు సాక్షులు కూడ కలరు అనెను.
తరువాత తార బంగారువంటకాంతిగల కుమారుని కనెను.
కుమారం సుందరం తత్ర జ్వలంతం బ్రహ్మతేజసా ।
గృహీత్వా తనయం చంద్రో నత్వా బ్రహ్మాణ మీశ్వరం॥
జగామ స స్వభవనం బ్రహ్మా సింధు తటం యయౌ ।
సాద్వీం తారం చ గురవే దేవేభ్యోస్యభయం దదౌ ॥
ఆశీషం శంభు ధర్మాభ్యాం దత్వా లోకం యయౌ విధిః ।
దేవా యయుః స్వభవనం స్వగృహం చ బృహస్పతిః ॥
బ్రహ్మ తేజో విరాజితుడు సుందరుడగు కుమారుని తీసికొని బ్రహ్మదేవునకు నమస్కరించి చంద్రుడు తన ఇంటికి పోయెను. బ్రహ్మదేవుడు సాధ్వీయగు ఊరను బృహస్పతికిచ్చి తాను సింధూనదీ తీరముననున్న స్వభవనమునకు పోయెను. ఆతడు అచ్చటనున్న శంకరునకు ధర్మదేవతకు ఆశీస్సుల నొసగెను, దేవతలకు అభయమునొసగెను.
ఆటుపిమ్మట దేవతలు, తమ తమ భవనములకు పోయిరి.
భావానురక్తవనితాం ప్రాప్య సంహృష్టమానసః ।
తారకాగర్భసంభూతః స ఏవ చ బుధః స్వయం ॥
తేజస్వీ సద్గ్రహో బ్రహ్మంశ్చంద్రస్య తనయో మహాన్ ।
స ఏవనందనవనే చిత్రాల సంప్రాప్య నిర్జనే ॥
ఘృతాచ్యా గర్భసంభూతార కుబేరస్య చ రేతసా ।
దృష్ట్యా చ నిర్జనే రమ్యాం కన్యాం కమలలోచసాం ॥
అతీవ యావనస్థాం చ బాలాం షోడశ వార్షికీం ।
గాంధర్వేణ వివాహేన తాం జగ్రాహ విధోః సుతః ॥
దేవగురువగు బృహస్పతి తన మనసెరిగి ప్రవర్తించు భార్యయగు తార లభించినందువలన సంతోషపడి తన భవనమునకు పోయెను.
తారయొక్క గర్భమున పుట్టిన వాడే బుధుడు. అతడు మహాతేజస్సంపన్నుడు. గ్రహములలో శ్రేష్ఠుడు. ఆ చంద్రపుత్రుడు నిర్జనమైన నందనవనములో తిరుగుచుండెను. అప్పుడచటికి కుబేరునకు ఘృతాచియను అప్పరకు పుట్టిన చిత్రయను నవయౌవనాంగి వచ్చెను. పదునారు సంవత్సరముల ప్రాయముగల ఆ చిత్రను బుధుడు గాంధర్వ వివాహమున స్వీకరించెను.
తస్యాసుథాయాం రహసి వీర్యాదానం చకారసః ।
బభూవ రాజా చిత్రాయాం చైత్రో వైమండలేశ్వరః ॥
సప్తద్వీపవతీం పృథ్వీం శాస్తి వై ధార్మికో బలీ ।
శతం సద్యో మృతానాం చ దధ్నాం నగ్య శతావిచ ॥
శతాని సద్యో దుగ్ధసార మధునద్యశ్చ షోడశః ।
దశ నవ్యశ్చ తైలానాం శర్కరాలక్షరాశయః ॥
మిష్టాన్నానాం స్వస్తికాసం లక్షరాశిశ్చ నిత్యశః ।
పంచకోటిగవాం మాంసం సాపూపం స్వప్నమేవ చ ॥
ఏతేషాం చ వదీరాళీర్భుజతే బ్రాహ్మణా మునే।
గవారలక్షం చ రత్నానాం మణీనాం లక్షమేవ చ ॥
శతలక్షం సువర్ణానాం లక్షం వై సూక్ష్మ వాససాం ।
రత్నానాం భూషణం పాత్రమతీవ సుమనోహరం ॥
దదౌ ద్విజాతయే రోజా నిత్యం వై జీవితావధి ।
బుధునకు చిత్రకు చైత్రుడను వాడు పుట్టెను. అతడు చక్రవర్తి ధార్మికుడై సప్త ద్వీపములు కల భూమినంతయు పరిపాలించెను.
అతడు ప్రతిదినము నదులుగాపారు నెయ్యితో, నదులుగా ప్రవహించు పెరుగుతో, పాలతో, తేనెతో, నూనెతో, చక్కెరరాశులతో, మిష్యానము, స్వస్తికముల రాశులతో, అపూపములతో మంచి అన్నముతో బ్రాహ్మణులకు సంతర్పణలు చేయుచుండెను. వారికి భోజనానంతరము గోవులు, రత్నములు, మణులు. బంగారు నాణెములు, సన్నని వస్త్రములు.
రత్న భూషణములు, రత్నపాత్రలు తాను జీవించియున్నంతవరకు దానము చేసెను.
తస్య చైత్ర్యస్య పుత్రశ్చ రాజాధిరథ ఏవ చ ॥
తస్య పుత్రశ్చ సురథశ్చక్రవర్తీ బృహచ్ఛ్రవాః ।
మహాజ్జానం చ సంప్రాప్య మేధసో మునిసత్తమాత్ ॥
భేజే పురా విష్ణుమాయాం పుణ్యక్షేత్రే చ భారతే ।
శరత్కాలే మహాపూజాం చకార స సరిత్తటే॥
వైశ్యేన సార్థం స మహాన్ జ్ఞానినాం మునిసత్తమ ।
రాజా కళింగదేశస్య విరాధశ్చ విశాంవరః ॥
తస్యపుత్రో మహాయోగీ ద్రుమీణ్ జ్ఞానినాం వరః ।
ద్రుమిణో వైష్ణవః ప్రాజ్ఞ పుష్కరే దుష్కరం తపః ॥
కృత్వా సమాధిం సంప్రాప జ్ఞానినాం వైష్ణవాగ్రణీః ।
పుత్రైర్దార్నిరస్తశ్చ ధనలోభాద్దురాత్మభిః ॥
స చ కోటిసువర్ణం చ నిత్యం దత్వా జలం పపౌ।
ముక్తిం సంప్రాప సంసేవ్య విష్ణుమాయాం సనాతనీం ॥
రాజా లేభే మనుత్వం చ రాజ్యం నిష్కంటకం మునే ।
ఉవాచ మధురం వాక్యం ధాతా త్రిజగతాం పతిః॥
ఆ చైత్రమహారాజునకు ఆధీరథుడనువాడు పుట్టెను. అతని పుత్రుడు సురడుడు. అతడు మేధోమునివలన అధికమైన జ్ఞానమును పొంది శరత్కాలమున దుర్గాదేవి పూజను చేసెను. కళింగదేశమున విరాధుడను వైశ్య, శ్రేష్ఠుడుండెను. అతని పుత్రుడు మహాజ్ఞాని, మహాయోగి, పరమ వైష్ణవుడైన ద్రుమిణుడు. అతడు పుష్కరక్షేత్రమున తపస్సు చేసి మహాజ్ఞాని, వైష్ణవాగ్రణియగు సమాధియను పుత్రునిబడసెను. అతడు ప్రతిదినము బ్రాహ్మణులకు కోటి సువర్ణములు దానము చేయుచుండెను. అందువలన దుష్టులైన ఆతని పుత్రులు ఇంటినుండి వెడలగొట్టిరి. సురధుడను రాజు, సమాధీయను వైశ్యుడు కలిసి విష్ణుమాయయగు దుర్గాదేవిని ఆరాధించగా సమాధి ముక్తిని పొందెను. సురథుడు సనాతనియగు దుర్గాదేవిని ఆరాధించి రాజ్యమును ముక్తిని పొందెను, చివరకతడు మనువయ్యెను.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే ద్వీతీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే దుర్గోపాఖ్యానే గురోస్తారా ప్రాప్తి బుధోత్పత్యాది వర్ణనం నామ ఏకషష్టితమోధ్యాయః॥
శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున నారదనారాయణుల సంవాదమున చెప్పబడిన దుర్లోపాఖ్యానమున గురువునకు తారాప్రాప్తి, బుధుని జననము మొదలగు విషయములున్న అరవై ఒకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 61 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
This philosophical chapter synthesizes the entire teachings of the Prakṛti Khaṇḍa, extolling Parā Prakṛti as the single, supreme, multi-faceted Divine Mother who powers every aspect of existence. She is the intelligence in the intellect, the sweetness in sugar, the radiant light in the sun, the forgiveness in the earth, and the devotion in the heart of a Vaishṇava devotee. The text emphasizes that no creature in the cosmos can take a single breath or perform any action without Her divine energy, reinforcing that honoring Parā Prakṛti is synonymous with worshipping the Supreme Lord Śrī Kṛshṇa.